English | Telugu
మహాన్యూస్ పై బిఆర్ఎస్ పార్టీ దాడి చేయడంపై పవన్ కళ్యాణ్ స్పందన ఇదే
Updated : Jun 28, 2025
తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ టాపింగ్ జరిగిందనే వార్తలని, మహా న్యూస్ ఛానల్ కొన్ని రోజుల నుంచి ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు కూడా ఫోన్ టాపింగ్ కథనాల గురించి సదరు న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తు ఉంది. దీంతో కొంత మంది బిఆర్ఎస్ కార్యకర్తలు జూబ్లీహిల్స్ లోని మహా న్యూస్ ఛానల్ పై దాడి చేసి, కొన్ని రకాల కారుల అద్దాలని పగలకొట్టడంతో పాటు ఆఫీస్ లోపలకి చొరబడ్డారు.
ఈ దాడిని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఖండిస్తూ' మీడియాలో వచ్చే వార్తలు, కథనాలపై అభ్యంతరాలు ఉంటే, తెలియచేసే విధానం ఒకటి ఉంటుంది. ఆ దారిలో వెళ్లకుండా అందుకు భిన్నంగా దాడులు చేయడం కరెక్ట్ కాదు. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు ఖండించాలి. దాడికి కారణమైన వాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేసాడు.
