English | Telugu

చిరంజీవి, బాలకృష్ణ పై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో అభిమానుల హంగామ 

చిరంజీవి, బాలకృష్ణ పై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో అభిమానుల హంగామ 

'లండన్'(London)లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ లో 'ఆర్ఆర్ఆర్'(RRR)మూవీకి సంబంధించిన 'లైవ్ కాన్సర్ట్' నిన్న ఘనంగా జరిగింది. మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శక ధీరుడు రామ్ చరణ్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక 'రాయల్ ఫీల్ హార్మోనిక్ కాన్సర్ట్ కి చెందిన ఆర్కెస్ట్రాతో కలిసి ఆర్ఆర్ఆర్ సంగీత దర్శకుడు కీరవాణి  చేసిన ప్రదర్శన ఆహుతులని ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ ఈవెంట్ లో ఆర్ఆర్ఆర్ లో హిట్ సాంగ్ గా నిలిచి, ఆస్కార్ ని అందుకున్న నాటునాటు సాంగ్ గురించి ప్రస్తావనకి వచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్(Ntr)మాట్లాడుతు 'నాటు నాటు' పాటకి నా బెస్ట్ ఫ్రెండ్ చరణ్(Ram Charan)తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడాన్ని నా జీవితంలో మర్చిపోలేను. చరణ్ ఫాదర్ చిరంజీవి గారు, బాలకృష్ణ బాబాయ్ మంచి డాన్సర్స్ . నాటు నాటు పాటకి ఆ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉంది. వాళ్ళు కనుక చేస్తే చరిత్రలో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా సభా ప్రాంగణం మొత్తం ఈలలు చప్పట్లతో హోరెత్తింది.

ఎన్టీఆర్ మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరంజీవి(Chiranjeevi)బాలకృష్ణ(Balakrishna)అభిమానులు అయితే ఎన్టీఆర్ కోరుకుంటున్నట్టుగా 'నాటునాటు' పాటకి ఆ ఇద్దరు డాన్స్ చేస్తే చూడాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి గతంలో తెలుగు చలనచిత్ర సీమలోకి ప్రవేశించి బాలకృష్ణ  యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈవెంట్ లో మాట్లాడుతు  బాలకృష, నేను ఒక సినిమాలో నటించాలని ఉందని చెప్పాడు. బాలకృష్ణ కూడా అందుకు చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక చరణ్, ఎన్టీఆర్ లండన్ నుంచి రాగానే తమ కొత్త  చిత్రాల షూటింగ్ లో పాల్గొంటారు.