English | Telugu

నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. అందరి అంచనాలని తలకిందులు చేసిన అల్లు అర్జున్ 

నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. అందరి అంచనాలని తలకిందులు చేసిన అల్లు అర్జున్ 

సినీ నటులతో కలిసి ఇండియా(India)ని ప్రపంచ కేంద్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్ టైన్మెంట్ సమ్మిట్(వేవ్) నిర్వహిస్తున్నామని కొన్ని రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నిన్న ముంబై(Mumbai)వేదికగా వేవ్(Wave)కి సంబంధించిన పలు సెషన్స్ జరిగాయి. చిరంజీవి(Chiranjeevi)రజనీకాంత్(Rajinkanth)మోహన్ లాల్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, హేమమాలిని, మిథున్ చక్రవర్తి, రాజమౌళి, అలియాభట్, దీపికా పదుకునే, రణబీర్ కపూర్ తదితరులు పాల్గొని వివిధ సెషన్స్ లో తమ సినీ జర్నీ గురించి చెప్పుకొచ్చారు.

ఈ సమ్మిట్ కి ఐకాన్ స్టార్ 'అల్లుఅర్జున్' కూడా హాజరవ్వడం జరిగింది. 'టాలెంట్ బియాండ్ బోర్డర్స్' సెషన్ లో ఆయన మాట్లాడుతు పుష్ప చిత్రాలు నా కెరీర్ కి మైలురాళ్లు. తెలుగు సినిమా బాషా సరిహద్దుల్ని ధాటి అంతర్జాతీయ ప్రేక్షకులని ఆకర్షించి పాన్ ఇండియా స్టార్ గా నన్ను నిలబెట్టాయి. సుకుమార్ దూరదృష్టితో పాటు కథలోని భావోద్వేగం, సాంస్కృతిక లోతు దీనికి కారణం. అందుకే పుష్ప ద్వారా నేషనల్ అవార్డు అందుకొని ఆ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలిచాను. నటనలో నాకు చిరంజీవి గారు స్ఫూర్తి. ఆయన ప్రభావం నాపై ఎంతో ఉంది.

దక్షిణాది నటులు సిక్స్ ప్యాక్ సాధించలేరని ఒక నటి మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఆ మాటని సవాలుగా తీసుకొని 'సిక్స్ ప్యాక్' సాధించాను. ఒక వ్యక్తి ఆ అడ్డంకిని బద్దలు కొట్టగలడని నిరూపించగలిగానని చెప్పుకొచ్చాడు. ఇక అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే తమిళ దర్శకుడు అట్లీ(Atlee KUmar)తో తన నెక్స్ట్ మూవీ చెయ్యబోతున్నాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజు అధికారంగా ఈ మూవీ అనౌన్స్ మెంట్ జరిగింది. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్(Kalanithi Maran)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. జులై చివరి వారంలో సెట్స్ పైకి వెళ్తుందనే వార్తలు వస్తున్నాయి.

 

 

నటనలో ఆయనే నాకు స్ఫూర్తి.. అందరి అంచనాలని తలకిందులు చేసిన అల్లు అర్జున్