Read more!

English | Telugu

రానా హీరోయిన్ ప్రేమ వ్యవహారం


 
లీడర్ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన ప్రియా ఆనంద్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. హిందీ సినీ అవకాశాలు వచ్చినా గుర్తింపు అంతగా దక్కలేదు. ఇక ఈ హీరోయిన్ తన అదృష్టాన్ని అప్పుడప్పుడు కోలీవుడ్ లోనూ పరీక్షించుకుంటూ వుంటుంది. ఇదలా వుంచితే, ప్రియా ఆనంద్ ఈ మధ్య మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని గుసగుసలు మొదలైయ్యాయి.
 
 
 
వీరిద్దరూ కలిసి ఓ నైట్ పార్టీలో తీయించుకున్న ఫోటోలు బయటకు రావడంతో ఈ గుసగుసలు  వార్తలుగా ప్రచారం అయ్యాయి. దీంతో నైట్ పార్టీకి వెళితే ఇంత హడావిడి చేస్తారా అంటూ  ప్రియా చిందులుతొక్కిందట. ఇకపై నైట్ పార్టీలకు వెళ్లనని ఒట్టేసుకుందట. పార్టీల విషయంలో క్లారిటీ ఇచ్చింది గానీ, అనిరుధ్ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రానట్టుంది పాపం ప్రియ. ఈ జంట రానురాను ఏ గీతాలు పాడుతారో చూడాలి.