Read more!

English | Telugu

మసాలా సినిమాలో ముసలమ్మ రవీనా!

 

ఓ పదీ పదిహేనేళ్ళ క్రితం ‘మొహ్ర’ సినిమాలో టిప్ టిప్ బర్ సా పానీ పాట టైమ్‌లో రవీనా టాండన్ వేరు ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా మారి ఫిఫ్టీకి దగ్గరవుతున్న రవీనా వేరు. ఈ వయసులో రవీనా టాండన్ ఒక మసాలాత్మక సినిమాలో నటించడానికి ఒప్పుకోవడం చిత్రం. గతంలో తన సినిమాలలో అందాలన్నీ పిండి ఆరబోసినట్టుగా ఆరబోయి బాలీవుడ్‌ టాప్ హీరోయిన్‌గా రవీనా కొంతకాలం కొనసాగింది. అయితే కాలానుగుణంగా వయసు పైబడటంతో పెళ్ళి చేసుకుని బుద్ధిగా సంసారం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో నటిగా మరోసారి వెండితెర దుమ్ము దులపాలన్న ఉద్దేశంలో రవీనా వున్నట్టుంది. అందుకే మాంఛి మసాలా సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. ‘షాబ్’ పేరుతో ఒనీర్ అనే దర్శక నిర్మాత రూపొందించే ఓ శృంగారభరిత చిత్రంలో నటించడానికి రవీనా టాండన్ అంగీకరించింది. ఈ సినిమాలో ముద్దుల దగ్గర్నుంచి అన్ని రకాల జిల్ జిల్‌లు వుంటాయట. ఇది ఫార్టీ ప్లస్‌‌లో వున్న ప్రౌఢ కథతో రూపొందే సినిమా అట. మొదట ఈ సినిమాలో నిర్మా సుందరి సంగీతా బిజిలానీని తీసుకోవాలని అనుకున్నారట. ఆమెకీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి వున్నప్పటికీ, ఈ సినిమాలో ఉన్న మసాలా డోస్ చూసి భయపడిపోయి చేతుతెల్తేసిందట. ఆ తర్వాత వాళ్ళు అందాల ఆరబోయడంలో స్పెషలిస్టు అయిన రవీనాని కాంటాక్ట్ చేయడం, ఆమె నటించడానికి ఓకే చెప్పడం జరిగిపోయిందట.