English | Telugu
రాజమౌళి "ఈగ"తమిళ రీమేక్ 5కోట్లు...?
Updated : Mar 8, 2011
"ఈగ" చిత్రంలో హీరో, హీరోయిన్లతో సంబంధం లేకుండా కేవలం రాజమౌళి పేరు చూసి మాత్రమే "ఈగ" చిత్రానికి తమిళ రీమేక్ కోసం అయిదు కోట్ల భారీ మొత్తాన్ని ఆ నిర్మాత రాజమౌళికి ఆఫర్ చేసినట్లు సమాచారం. రాజమౌళి "ఈగ" చిత్రంలో నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, సుదీప్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ "ఈగ" చిత్రంలో రాజమౌళి గ్రాఫిక్స్ తో అద్భుతాలు చేయనున్నట్లు సమాచారం. రాజమౌళి "ఈగ" చిత్రం బహుశా అక్టోబర్ దసరా పండక్కి విడుదల చేయవచ్చు.