Read more!

English | Telugu

ఆలియా భ‌ర్త‌కి హెల్ప్ చేస్తున్న షారుఖ్‌!


ర‌ణ్‌బీర్ క‌పూర్ అంటే మ‌న సౌత్ జ‌నాల‌కు పెద్ద‌గా తెలుసో లేదో గానీ, ఆలియా భ‌ర్త అని చెబితే చ‌టుక్కున అర్థ‌మ‌వుతుంది. మోడ్ర‌న్ టైమ్స్ లో ప్రేమ‌, రిలేష‌న్‌షిప్పుల గురించి అద్భుతంగా సినిమాలు తీస్తార‌నే పేరుంది ల‌వ్ రంజ‌న్‌కి. 'ప్యార్ కా పంచ‌నామా', 'సోనూ కే టీటు కి స్వీటీ' లాంటి రామ్ కామ్స్ ఆయ‌న తీసిన‌వే. సేమ్‌ జోన‌ర్‌లో ర‌ణ్‌బీర్ క‌పూర్ - శ్ర‌ద్ధాక‌పూర్‌తో ఓ సినిమా తీస్తున్నారు. ప‌క్కా రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు 'తూ ఝూటీ మై మక్కర్' అని టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా మీద నార్త్ లో మామూలు అంచ‌నాలు లేవు.

ఆల్రెడీ 'బ్ర‌హ్మాస్త్ర' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ అందుకున్న ర‌ణ్‌బీర్ క‌పూర్ ద‌క్షిణాదిన కూడా అంతే పేరు తెచ్చుకున్నారు. డార్లింగ్ ప్ర‌భాస్ న‌టించిన 'సాహో'  సినిమాలో న‌టించారు శ్ర‌ద్ధాక‌పూర్‌. ఇప్పుడు శ్ర‌ద్ధా క‌పూర్‌కి సౌత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. వీరిద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న 'తూ ఝూటీ మై మక్కర్' సినిమా ట్రైల‌ర్‌ని త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

ఈ ట్రైల‌ర్‌ని షారుఖ్ సినిమాతో క‌లిపి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జరుగుతున్నాయి. య‌ష్‌రాజ్ ఫిల్మ్స్ షారుఖ్ హీరోగా తెర‌కెక్కిస్తున్న సినిమా ప‌ఠాన్‌. దీపిక పదుకోన్ న‌టించిన ఈ సినిమా ఈ నెల 25న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ సినిమా తో పాటు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, శ్ర‌ద్ధా క‌పూర్ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ని రిలీజ్ చేస్తార‌ట‌.

నార్త్ తో పాటు సౌత్ ఆడియ‌న్స్ కి కూడా రీచ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఈ ర‌కంగా ప్లాన్ చేశార‌ట ల‌వ్ రంజ‌న్‌. సౌత్ సినిమా ఇండ‌స్ట్రీతో మొన్న మొన్న‌టి వ‌ర‌కు స‌ల్మాన్ ఖాన్ కార్డియ‌ల్ రిలేష‌న్‌షిప్ మెయింటెయిన్ చేశారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ ఆ ప‌నిని కంటిన్యూ చేస్తున్నారు. సౌత్ ఆర్టిస్టుల‌తో ప‌నిచేయ‌డ‌మే కాదు, సౌత్ టెక్నీషియ‌న్ల‌ను కూడా ప్రోత్స‌హిస్తున్నారు.