English | Telugu

'హిట్' హిందీ రీమేక్ లో సన్యా మల్హోత్రా

'హిట్' హిందీ రీమేక్ లో సన్యా మల్హోత్రా

విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వచ్చిన తెలుగు సినిమా 'హిట్'. టైటిల్ కి తగ్గట్లే ఈ సినిమా హిట్ అయ్యింది. ఈ మూవీతో శైలేష్ కొలను డైరెక్టర్‌ గా పరిచయమయ్యాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా.. హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

'హిట్' హిందీ రీమేక్ లో బాలీవుడ్‌ యంగ్ హీరో రాజ్ కుమార్ రావ్ నటిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. మరో నిర్మాత కుల్దీప్ రాథోడ్ తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో దర్శకత్వం వహించిన శైలేష్.. హిందీ రీమేక్‌కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీలో రాజ్ కుమార్ రావ్ కి జోడిగా సన్యా మల్హోత్రా నటించనుంది.

తాను 'హిట్' మూవీని చూశానని.. మూవీ కాన్సెప్ట్ తనకి నచ్చిందని సన్యా మల్హోత్రా చెప్పింది. ఈ మూవీ ఆఫర్ తనకి రాగానే వెంటనే ఓకే చెప్పానని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొంది.