"అయితే... నేను ముందుగా..."
"సుధాకర్! గిటవే ఫ్రంది క్లాస్. నిన్నీ రోజుకి సస్పెండ్ చేశాను. రేపు క్షమాపణ రాసిస్తేనే మళ్ళీ రానివ్వటం---"
"నన్ను సస్పెండ్ చేశారా?" అని కూర్చుని "నేను వెళ్ళనండి" అన్నాడు నిబ్బరంగా.
ప్రిన్సిపాల్ గారి ముఖం మాడిపోయింది. "గెటవుట్ ఫ్రంది కాలేజి. వెళ్ళకపోతే ప్యూన్ తో బయటికి నెట్టిస్తాను. యు ఆర్ కెస్ట్ అండర్ సస్పెన్షన్ ఫారెవీక్" అన్నాడు తీవ్రంగా.
క్లాసు వేపు చూసేడు సుధాకర్.
విద్యార్ధులకి అది చాలా అవమానకరమనిపించింది.
ఓ కుర్రాడు ముందుకొచ్చి "అతని కదో సరదా మేష్టారూ! ఆ సినిమా చూశాక అలా గమ్మత్తులు చేస్తున్నాడు. ఈ సారికి క్షమించండి." అన్నాడు.
"నథింగ్ డూయింగ్. అతను శిక్ష అనుభవించాల్సిందే."
"వీల్లేదండి. అతన్ని శిక్షిస్తే మేమంతా కూడా క్లాసులకి రామండి"
"బెదిరింపా?"
"కాదు స్ట్రెక్."
"స్ట్రెకా?"
"అవునండి, అక్షరాలా స్ట్రయికే"
"నో. ఆల్ ఆఫ్ యు గో అవుట్."
పోలోమని వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి నివ్వెరపోయి నిలుచుండి పోయాడు ప్రిన్సిపాల్. పిల్లలంతా కేకలు వేస్తూ బయటికి వెళ్ళిపోయేరు.
"ఒరే అబ్బాయ్! త్వరపడవేమోరా?" అన్నాడు శర్మగారు. ప్రిన్సిపాల్ ఆయన హైస్కూల్లో తెలుగు పండితుడిగా వున్నప్పుడు శిష్యుడు. ఆ చనువుతో ఆయనలాగే అంటారు. శిష్యుడెంతవాడయినా గురువుకితగ్గే! కొడుకెంత ఎదిగినా తండ్రికి తనయుడే కదా! అంటారాయన.
ప్రిన్సిపాల్ గారు ఆఫీసు రూంకి వెళ్ళిపోయేరు.
కాలేజి అంతా వ్యాపించింది దావాగ్ని క్షణంలో అన్ని క్లాసులోని అబ్బాయిలు గంటకొట్టగానే బయట గుంపులో చేరారు.
ప్రిన్సిపాల్ గారికి కాలేజిలో డిసిప్లిన్ తగలబడిపోతున్నట్టనిపించింది- బయట విద్యార్ధుల్లో అలజడి మొదలైంది.
"ప్రిన్సిపాల్" "డౌన్ డౌన్"
"విద్యార్ధులు"
"వర్ధిల్లాలి"
"దవుర్జన్యం"
"నశించాలి"
"సినిమాలని"
"చూడనివ్వాలి"
"టీలెంటుని"
"ప్రోత్సహించాలి"
"అధికార మత్రత"
"అణిగిపోవాలి"
వినలేక చెవులు మూసుకున్నారు ప్రిన్సిపాల్ గారు. అంతలో తెలుగు మాష్టారు గారు అటు వెళ్ళటంతో విద్యార్ధులు ఆగిపోయారు? ఆయనేం చెప్పారోకానీ విద్యార్ధులు మళ్ళీ అల్లరి చెయ్యకుండా ఇళ్ళకు వెళ్ళిపోయారు. లీడర్ సంప్రదింపులకి మళ్ళీ వస్తాడంటున్నా తాత్కాలికంగా శాంతి లభించినందుకు స్టాఫంతా సంతోషించింది, ప్రిన్సిపాల్ గారి ముఖం మాత్రం మాడిపోయిన బల్బులా వుంది.
* * *
వెళ్ళిన పెళ్ళి ప్రయత్నం చెడిపోతుందో, కుదురుతుందో అని మనస్సులో గుబులుగా వుంది సుందర్రావుకి. బస్సు దిగి ఇంటికి పరధ్యానంగా నడుస్తూ వస్తున్నాడు? అతని మనస్సులో ఆలోచనలు సుళ్లు తిరుగుతున్నాయ్!
"సులభంగా కుదురుతుందనుకున్న సంబంధం కాస్తా చిక్కుల్లోపడింది? మధు లతని ఒప్పుకుంటాడో లేదో! రేచీకటి ఏమంత పెద్ద జబ్బుకాదు- కానీ అదేం చిత్రమో లతకి రాత్రిళ్ళు బొత్తిగా కనిపించదట, వైద్యశాస్త్రంలోనో విపరీతంగా వుందది, అదేం పెద్ద చిక్కులే అనుకున్నా చెల్లాయికి పెళ్ళి కుదురుతుందని సంతోషపడ్డా ఫరవాలేదు? కానీ మనస్సులో యేమాత్రం సంకోచపడినా అంతా తల్లకిందులవుతుంది.
మళ్ళీ రెడ్డొచ్చి మొదలుపట్టు అన్నట్టుగా అంతా తిరగతోడాలి, ఎక్కిన బస్సెక్కకుండా తిరిగితేనే కాని సంబంధం కుదిరేట్టులేదు? ఈ రోజుల్లో అబ్బాయిలు కంటే తల్లిదండ్రులకు ధనాశ చాలా ఎక్కువైంది ఏమవుతుందో ఏమో"
కీచుమని బ్రేక్ పడింది లారీకి. ఆలోచనలతో అన్యమస్కంగా వున్న సుందర్రావు గాబరాపడ్డాడు? అటూ ఇటూ తిరగటంతో డ్రైవరు యెంత జాగ్రత్తపడినా జరగాల్సిన యాక్సిడెంటు జరిగేపోయింది. గాబరాపడిన డ్రైవరు లారీ ఆపకుండా వెళ్ళిపోయాడు.
స్పృహతప్పి పడిపోయిన సుందర్రావుని ఇల్లు చేర్చారెవరో!
పెళ్ళి ప్రయత్నాలకని వెళ్ళి ప్రమాదంలో పడిన భర్తని చూసి కన్నీరు మున్నీరయింది అన్నపూర్ణ. క్షణాలమీద వార్త తెలిసి ఇంటికి వచ్చాడు మధు. తండ్రిదగ్గరే కూర్చుంది జయప్రద. ఆ వేళకి తీవ్రమైన స్ట్రయిక్ లో వున్నాడు సుధాకర్.
* * *