"అవునవును!"
"నిప్పలాంటి ఆడది కాబట్టి ఆమె సున్నితంగా మావాడిని మందలించినట్టు తెల్సింది. దాంతో కక్షకట్టి వాడి ప్రెండ్స్ తో కలిసి ట్రాఫ్ చేసి నిలిమను రెఫ్ చేసి వుండవచ్చు....తరువాత ఆ రహస్యం బయట పొక్క కుండా మర్డర్ చేశారేమినని నా భయం."
"మ్తేగాడ్ ! ఎంత ఘోరం?"
ఎస్! గెస్ట్ హౌస్ దగ్గిర ఏదో రభస జరిగినట్టు....ఎవరో యువతిని బలవంతంగా రెఫ్ చేసినట్టు వాచ్ మెన్ అబ్బులు నాతో చెప్పాడు.దానికి తగ్గట్టు నీలిమా మూడు రోజులు కనిపించకుండా పోయింది. దాంతో నా అనుమానం బలపడింది."
"అంటే మీ పుత్రరత్న మె ఆమె ప్తె అఘాయిత్యం చేశాడని మీకు ఖచ్చితంగా తెలుసన్నమాట...."వ్తెస్ చాన్స్ లర్ సూటిప్రశ్న.
"అదికాదు....మా వాడి న్తేజం నాకు బాగా తెలుసు కాబట్టి అతన్ని వాడి స్నేహితులనూ అనుమానిస్తున్నాను. ఆ గెస్ట్ హౌస్ లో రెఫ్ చేయబడింది ఎవరో అయితే వచ్చే యిబ్బందిఏమీ వుండదు. అదే లెక్చరర్ అయితేనే వస్తుంది చిక్కు... అందుకే మీ సహాయం కోరి వచ్చాను...." చెప్పడం ఆపాడు ముకుందరావు.
అతని ఉద్దేశం ఏమిటో వ్తెస్ చాన్స్ లర్ కు అంతుబట్టడంలేదు.
అదే మాట ఆయనతో చెప్పాడు కూడా.
"లెక్చరర్ నీలిమా కనిపించకుండా పోయి ఇవాల్టికి మూడు రోజుల్తెంది కాబట్టి ఆమెకు ఏదో అపాయం జరిగి వుంటుందనే భావిస్తున్నాను.
అందుకే నేరం మనప్తె రాకుండా వుండడానికి ముందుగా వెళ్ళి పోలిస్ స్టేషన్ లో 'నీలిమ' కనిపించడంలేదని కంప్లయింట్ యివ్వండి....ఇన్స్ పెక్టర్ ధీరజ సర్విసుకి కొత్తగా వచ్చింది కాబట్టి ఆమెకు యిలాంటి కేసులు పరిశోధించడం కొంచెం కష్టం కావచ్చు."
అదేంటండి బాబూ అలాంటి సలహా యిస్తారు....మీ చేజేతులా మీరే మీ అబ్బాయిని పోలీసులకు పట్టిస్తారా?" వ్తెస్ చాన్స్ లర్ విస్తుపోతూ ప్రశ్నించాడు.
"అదేమీ కాదు....నీలిమా అదృశ్యానికి నిజంగానే మావాడు కారణమో కాదో ఖచ్చితంగా తెలియదు. వాడిని నిలదీసి చెప్పడు. అందుకే ముందుగా మనమే ఈ కేసులో కన్ ప్యూజన్ క్రియేట్ చేయాలి."
"అంటే...."
"ఈ కేసులో ప్రతిఒక్కరిని అనుమానించేలా ఎందరినో ఇరికించి, వాళ్ళతో సంభాషణలు సృష్టంచాలి....అనుమానం బలపడేలా ఆయ వ్యక్తులను మన ముగ్గులోకి దింపాలి...."
"అలా చేసినందువల్ల ప్రయోజనం...."
"ఉంది....మా వాడే నేరస్దుడయితే ఇంతమంది అనుమానితుల వివరాలను పరిశీలించి అసల్తేన నేరస్దుడిని పట్టుకోవడం ఆ ఇన్స్ పెక్టర్ కు అసాధ్యమవుతుంది. అలాకాక నేరస్ధుడు ఇంకెవరో అయిన పక్షంలో అతన్నె పరిశోధించి పట్టుకునే అవకాశం ఆమెకు లభిస్తుంది. ఏది జరిగినా మనకే లాభం."
"అంతేనంటారా...." ఏమీ చెప్పలేక నిట్టూర్పు విదూస్తూ అన్నాడు వ్తెస్ చాన్స్ లర్.
"అవును! ఈలోపు నీలిమా దయ్యం కనిపించిందంటూ డ్రామా క్రియేట్ చేసి, ఆమెను మా ఇంటికి తీసుకువెళ్ళి, ఆమె దర్యాప్తును ప్రక్కత్రోవ పట్టిస్తాను" పోట్టుదలగా చెప్పాడు ముకుందరావు.
ఒకప్పుడు జరిగిన ఈ సంభాషణకు గుర్తుతెచ్చుకుని చెప్పాడు వ్తెస్ చాన్స్ లర్.
"సో....నీలిమా అదృశ్యానికి ముకుందరావు కొడుక్కి సంబంధముందన్నమాట" ఇన్స్ పెక్టర్ ధీరజ కోపంగా ప్రశ్నించిందతడ్ని.
"నో మేడమ్! ఆమె అదృశ్యం మెనుకనున్నది ఎవరో ఖచ్చితంగా చెప్పడం కష్టం. అందుకనే ఒకప్పుడు నీలిమా వెంటపడిన వాళ్ళను....ఆమె చేత భంగపడిన వాళ్ళను పసిగట్టి వాళ్ళందరిని ముద్దాయిలుగా చేసి మీ చెవిన పడేలా చేశాం....అంతే తప్పు మా లెక్చరర్ అసలు ఏమ్తెందో, ఎవరు కారకులో నిజంగా నాకు తెలియదు...." ఎమోషనల్ గా అన్నాడతను.
"ముకుందరావుకు తెలుసా?"
"ఉహు...."
"ఓ కే...మీ మాటలను విశ్వసిస్తాను. కానీ మనమధ్య జరిగిన సంభాషణ వివరాలు ముకుందరావుకి తెలియనివ్వకండి. అలా చేస్తే మీకే నష్టం...."అంటూ యూనివర్శిటినుంచి బయలుదేరింది ఇన్స్ పెక్టర్ ధీరజ.
ఆమె వెహికల్ ఇప్పుడు ముకుందరావు బంగళావ్తెపు సాగిపోతోంది.
* * * *