Previous Page Next Page 
డేంజర్ మినిట్స్ పేజి 37


    "చూడండి సర్! ఈ కేసులో మీ సాక్ష్యం  ఎంతో విలువ్తేనదని నా నమ్మకం.....

    ఎందుకంటే ఈ కేసులో  ఇన్ వాల్వ్ మెంట్ వుంది  అని భావించిన ప్రతి ఒక్కరి దగ్గారా ఒకటికి నాలుగుసార్లు కలిసి ఎప్పటికప్పుడు స్టేట్ మెంట్స్ తిసుకుంటునే  వున్నాను. కాబట్టి మీకు దృష్టిలో అది చిన్నదే  కావచ్చు కానీ నా పరిశోధనకు అదే ముఖ్యం అవుతుందేమో ఎవరు చెప్పగల...."

    ఉపోద్ఘతంగా  అంటున్న  ధీరజవ్తెపు అనుమానంగా చూశాడాయన.

    "ఓకే ఇన్స్ పెక్టర్ మీకేం కావాలో అడగండి....నాకు గుర్తున్నంత వరకు చెప్పడానికే  ప్రయత్నస్తాను" మనసులోనీ గుబులుని ఏమాత్రం బయటపడకుండా చిరునవ్వుతో అన్నాడు.

    ధీరజ చిరునవ్వు నవ్వింది.

    రొటిన్ గా సంభాషణ ప్రారంభించి నీలిమా అదృశ్యమయిన ఆ మూడు రోజుల నాటి విశేషాలను అతని  నోటివెంట విన్నది.

     ఏ ప్రత్యేకతా కనిపించలేదు అతని మాటలలో....

    ఎలాంటి అనుమానించే సంఘటనా కనిపించలేదామెకు.

    "ఓకే సర్! చివరగా ఓకే ఒక ప్రశ్న...."

    వ్తెస్  చాన్స్ లర్  కు ఏమతో తృప్తి గా వుంది. ఎందుకంటే ధీరజ అంత త్వరగా తనని వదిలి వెళ్ళిపోతుందని వూహించలేకపోవడమే!

    "అడగండి....!" ఒక విధమయిన గర్వం తొంగిచూసిందతని గొంతులో.

    " ఆ రోజు  మీరు గెస్ట్ హౌస్ కు వెళ్ళారా?"

    ఆమె ప్రశ్నకు  తడబడిపోయడతడు.

    "గెస్ట్ హౌస్ కా.... ఏ గెస్ట్ హౌస్ ....అయినా నేనెందుకు  వెళతాను.."

    అతని  గొంతులో తడబాటు స్పష్టంగా తెలుస్తోంది.

    "అదే .... ముకుందరావుగారి గెస్ట్ హౌస్ కు...." అని అతని ముఖంలో మారే భావాలను పరిశీలనగా  చూస్తుండిపోయింది.

    "నో....నో....నాకేం తెలియదు. నేనెప్పుడు ఆ గెస్ట్ హవుస్ కు వెళ్ళలేదు."

    "అంతా ఆ గెస్ట్ హవుస్ కేకాక  మరో గెస్ట్ హవుస్ కు వెళ్ళారన్నమాట...."

    "అబ్బే! నా అభిప్రాయం అదికాదు-నేనెప్పుడు ఏ గెస్ట్ హవున్ కూ వెళ్ళలేదు" ఖంగారుగా అనేశాడు.

    "బాగా  ఆలోచించి చెప్పండి....ఆ రోజు వెళ్ళి వుండక పోవచ్చు.... తరువాత ఎప్పుడయినా వెళ్ళి వుండవచ్చు కదా?"

    "నో ఇన్స్ పెక్టర్! నాట్ నేస్ససరి....నాకా అవసరం కలగలేదు."

    "అబ్బులు చనిపోయిన రాత్రి మీరు  ఆ గెస్ట్ హవుస్ కు వెళ్ళినట్టు నా దగ్గర  ఆధారాలున్నాయి. మరి మీర్ మో అసలు వెళ్ళలేదంటున్నారు. అంటే మీరు అబద్దం చెబుతున్నారని భావించవలసినస్తోంది."

    ధీరజ  మాటలు  ఇంకా పూర్తికానేలేదు.

    అప్పటికే అతను  గజగజా వణికిపోతున్నాడు.

    "వె....వెళ్ళాను ఇన్స్ పెక్టర్ ! కానీ నాకేమి  తెలియదు."

     "అది నిర్ణయించవలసింది న్యాయస్ధానం....నేను  కాదు. ఎందుకు వెళ్ళారో చెప్పండి- బట్ ....మీరు  చెప్పబోయేముందు  మీరు ఒక విషయం  తెలుసుకోవడం మంచిది. మీతోపాటు  ముకుందరావుగారి జాతకం కూడా పూర్తిగా తెలుసు. మీరు చెప్పేది  నిజమో కాదో  తెలుసు. కాబట్టి అబద్దాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నంచవద్దు....అండర్ స్టాండ్" ధీరజ గొంతులో  కరుకుదనం.

    ఆమె అంత స్టాంగ్ గా వార్నింగ్ ఇవ్వనవసరం లేకపోయింది.

    అప్పటికే అతను ఒక నిశ్చయానికి వచ్చేశాడు.

    తనకు తెలిసిందంతా  చెప్పెయలనుకున్నాడు కూడా.

    "ఇన్స్ పెక్టర్ ! నాకు  తెలిసిన ప్రతిది  మీకు చెప్పేస్తాను. నిజానికి ఈ కేసుతో నాకెలాంటి సంబంధమూ లేదు కాబట్టి  దయచేసి  నన్ను కోర్టు కెక్కించి నా పరువు మర్యాదలను  తుడిచివెయ్యవద్దు....ప్లీజ్" దీనంగా అభ్యర్ధించాడు.

    "ఊ....చెప్పండి...."

    వ్తెస్ చాన్స్ లర్  గొంతు సవరించుకుని చెప్పడం ప్రారంభించాడు.

    ఆ రోజు.....

    "ఏమిటి ముకుందరావుగారూ! మీరు  చెప్పేది  నిజమేనా?" వ్తెస్  చాన్సలర్  ఆశ్చర్యంపోతూ ప్రశ్నించాడు.

    "అవును! లెక్చరర్ నిలిమను  మా వాడూ కానీ.... వాడి ప్రెండ్స్ కానీ ఏదో చేసివుంటారని నా అనుమానం. ఆమెను చాలా సార్లు అల్లరి పెట్టిన విషయం మీకు తెలిసే వుంటుంది."

 Previous Page Next Page