"అమ్మా!"
"నిజం అమ్మా---"
"ఇక చాలించమ్మా! కూతురికీ కొడుక్కే బేధం చూస్తారనుకోలేదు నేను. కొడుకులు సంపాదించి తలిదండ్రుల్ని పోషిస్తే కూతురు పోషించరాదా? అది నేరమా అమ్మా? ఆడదై పుట్టినంత ఆ\మాత్రాన ఆ హక్కులేదా?
వాళ్ళిద్దరూ అలా అయ్యారే అని ఎప్పుడూ దుఃఖిస్తారే కానీ నేను వున్నానని అనుకుంటున్నారా మీరు?
న్యాయమైన మార్గంలో పైసా సంపాదించి పెట్టినా తృప్తిగా జీవించవచ్చమ్మా?
ఎప్పుడూ మీకు నా పెళ్ళి-- పెళ్ళి ఆలోచనే తప్ప మరొకటి లేదు. ఎప్పుడెప్పుడు యీ బరువు దించుకోవాలా అని చూస్తున్నట్టున్నారు.
అసలు యీ చిక్కులన్నీ నా పెళ్లితోనే వచ్చాయి కదా!
విశాలత్తయ్యగారి వూరికి వెళ్ళకపోతే నాన్నకి ఏక్సిడెంట్ అయ్యేదే కాదు.
మా పెళ్ళికి లింక్ పెట్టకపోతే అన్నయ్య అలా వెళ్ళిపోయి వుండేవాడే కాదు.
అసలు మీరిలా అనుకునే కంటే---
నాకింత విషం---"
నోట్లో గుడ్డ కుక్కుకుని ఏడ్వసాగింది జయప్రద.
"జయా! చావు బ్రతుకులపై మానవుడికి హక్కు లేదమ్మా ఉపిరి- అడినాన్ని రోజులు మనం బ్రతుకు వెళ్ళమార్చి తీర్చాలి. గాలిగాలిలో కలిసేవరకూ అంతే! గాలిని బంధించే హక్కుమనకి లేదు.
విధిని తప్పించలేం జయా-
కుంతీదేవి లాటి స్త్రీ కి భర్త పోయి, కొడుకులూ కోడలూ అడవులపాలై అష్టకష్టాలూ అనుభవిస్తూ వుండినా దాయాదుల పంచన బ్రతకవలసి వచ్చినా ఆమె చావుని కోరుకోలేదమ్మా!
సామ్రాజ్యాన్ని పోగొట్టుకుని కాటికాపరిగా బ్రతుకవలసి వచ్చినా హరిశ్చంద్ర చక్రవర్తి అశువులు తీసుకోవాలని కోరుకోలేదమ్మా-
ఈ బ్రతుకులు ఇలా సాగిపోవాల్సిందే- అంతే!"
"మామయ్యా!"
"ప్రతాప్! నాక్షోభ నీకు తెలీదుబాబూ! మనిషి ఏం పోగుట్టుకున్నా బ్రతకవచ్చు- అస్తిపోయినా ఐశ్వర్యం తొలిగినా అధికారం వీడినా అందరూ పగవారైనా బ్రతకవచ్చు- కాలు విరిగినా చేయి విరిగినా బ్రతకవచ్చు, కానీ కళ్ళుపోయి బ్రతకటం కష్టంబాబూ!"
"మీరిలా నిరాశతో క్రుంగిపోవటం నేను సహించలేను మామయ్యా! ఇన్నాళ్ళూ ఎలాగోజరిగిపోయాయి. ఇకముందు మీకు చింత అనవసరం. హయిగా వుండండి, మీ రక్షణ భారం అంతా నాది!"
"ఎక్కడికెక్కడ బాబూ!"
"మామయ్యా అంతమాట అనకండి. నాకీ వూరు వారంరోజుల క్రిందటే ట్రాన్స్ ఫర్ అయింది. మీ గురించి విచారిస్తే తెలిసింది. పరుగుపెట్టుకుంటూ వచ్చాను-- ఇక విడిచిపోను.
మీరు నా వద్దకు వచ్చేసినా సరే!
నన్ను మీ వద్దకి రమ్మన్నా మీ ఇష్టమే.
చెప్పండి."
కళ్ళు చెమ్మగిల్లాయ్ ఇద్దరికీ.
"బాబూ! మంచి అనేది పెరటి చెట్టు లాటిది. పెంచుకున్న తర్వాత ఫలాన్నివ్వకపోదు. యే జన్మలోనో మేం చేసుకున్న మంచి నీ రూపంగా వచ్చింది. అంతా పాపమే చేశామేమో అనుభవిస్తున్నా మ్నుకున్నాను, లేదు. ఏదో పుణ్యం కూడా చేశాము. అదే నీ రూపంలో వచ్చింది" అంది అన్నపూర్ణ.
"చాలా చీకటైనట్టుంది. ఇక్కడే భోజనంచేసి వెళ్ళు" అన్నారు సుందర్రావుగారు.
ఆ రాత్రి ఆ కుటుంబమూ- ప్రతాప్ తృప్తిగా కంటి నిండుగా నిదురపోయారు.
* * *
"ఉదయమేలేచి తలారా స్నానంచేసి వచ్చారే!"
బబ్రష్ తో ముఖం కడుక్కుంటూ అడిగాడు అతను.
"ఈ రోజు శనివారం కదా!"
"నాకు ఇలా ఉదయమే శుభ్రంగా తయారై అప్పుడే విచ్చిన గులాబీలా వుండే ఆడవాళ్లంటే చాలా ఇష్టం."
"పోనీ అలాటి అమ్మాయినే వెదికి చేసుకోండి"
"ప్చ్? అంత అదృష్టం అందరికీ దొరకొద్దూ?"
"ఏం?"
"ఏ పెళ్ళిచూపులకి వెళ్ళినా- పెద్దవాళ్ళ దృష్టి వేరు విధంగా వుంటుందికదా? ఎంతకట్నం పెంచుకోవచ్చని తండ్రి చూస్తారు. అమ్మాయి అందంగా వుందా అని వరుడు చూస్తాడు. అత్తగారికీ అమ్మాయి అందచందాలే కావాలి, అంతేకానీ ఆ అమ్మాయి పనీ పాడూ బాగా చేస్తుందా? దేవుడూ దైవమూ అనేదివుందా? అని అడగరు"
నవ్వింది జయప్రద బిందె నిండటంతో టేప్ కట్టేసి అంది "పోనీ మీరు అడగొచ్చు కదా?"