Previous Page Next Page 
పాదాభివందనం పేజి 30

"రావ్! హై అఫీషియల్స్ తో పరిచయాలు జీవితంలో ఎంతో ఉపకరిస్తాయి" అన్నారాయన. తను డిల్లి వెళ్ళిన మూడో రోజే నాన్నగారికి హార్ట్ ఎటాక్ వచ్చి పోయారు.

టెలిగ్రాం అందుకున్న శశికళ ట్రంకాల్ చేసింది. హడావుడిగా ప్రయాణమై ఫ్లైట్ లో వచ్చి అక్కడ నుంచి కారులో తమ ఊరికి నలుగురూ వెళ్ళేరు.

ఏం చూశాడు తను నిరికారంగా నిశ్చింతగా అరవై సంవత్సరాల జీవితం గడిపి హాయిగా కన్ను మూసిన ఓ సంతృప్తి జివి. శరీరం.......అంతే- ఒకమాటలేదు......ఒక చూపులేదు.

అప్పుడె తన గుండెల్లో ఏదో సన్నని రోద మొదలైంది. అది ఈ నాటికీ అప్పుడప్పుడు గాలి తాకిడికి శృతి చేసిన వీణ అసంకల్ప రాగాన్ని పలికినట్టుగా ఘోష పెడుతూనే వుంది.

ఇప్పుడు మళ్ళీ అవ్య క్తాందోళన........మొన్ననే తల్లి నుంచి జాబు వచ్చింది. బరువు నుంచి విశ్రాంతి కోరుతుంది మనస్సు. ఈ రెండు రోజులు అన్నీ తెమల్చుకొని వారం రోజులు సెలవు పెట్టి ఊరికి ప్రయాణమయ్యాడు.

యాంత్రిక జీవితానికి అలవాటు పడ్డాడు. తను ఉద్యోగం.....పుస్తక పఠనం .....మరో వ్యాపకం లేదు......తిరికలో శశితో కబుర్లు.

ప్రశాంతమైన సరోవరంలో చిన్న మట్టి బెడ్డపడి కొలనంతా కదలిపోయినట్లుగా మొన్న వచ్చిన ఉత్తరం తన మనస్సుని కలవరపరచింది. నైట్ గవున్ లో దాచుకున్న ఉత్తరాన్ని తీశాడు రామచంద్ర. ఈజీ చెయిర్ లో వాలిపోయాడు.

టేబుల్ లైట్ వెలిగించి చదువుకోసాగాడు. అది పదవసారి చదవటం.......అయినా కొత్తగా వింతగా ఎదలోయాల్లో ప్రశాంతంగా ప్రవహించే ప్రేమ ప్రవాహాన్ని కదిలించేట్టుగా ఉంది.

దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఒక విధమైన జీవితానికి అలవాటు పడ్డ రామచంద్రకి ఆ ఉత్తరం కొత్త దారాన్ని తెరచినట్టుగా వుంది. నలభైయేళ్ళు మాములుగా బ్రతికి అప్పుడు అకాల వసంతంలాగా ప్రేమానుభవాన్ని పొందిన వ్యక్తిలా ఉంది.

గుండె గుడిలో గూడు కట్టిన ప్రేమ మాతృరాగానికి కదలి ప్రవహించినట్టుగా అనుభూతి. ఏదో జన్మలో చిరతపస్సుకు ఫలితంగా పొందిన దివ్యానుభుతిని తిరిగి యిన్నేళ్ళకి తట్టి లేపినట్టుగా వుంది. అతని కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి.

కన్నా! ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి. తలుచుకుంటే ఇప్పటికి కళ్ళకు కట్టినట్లుగా వుంటావు. అయిదేళ్ళ నాడు రమ కూతురి పెళ్ళికి వచ్చావు. అంతే మళ్ళీ యిక రానేలేదు. కానక కన్న సంతానంలా నేను నలుగురమ్మాయిల మధ్య కనుపాపలాగా చూసుకొని పెంచుకున్నాను.   

నిన్ను యిల్లు దాటి వెళ్ళనివలేదు. ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకుని వెళ్ళింది. అంతా చదువుకొన్నవాళ్ళేనా! నా కన్న చదువుకోనక పోతేనేం సంస్కారం వచ్చింది చదవను రాయను నేర్చుకున్నాడు చాలు.

వద్దు అన్నాను వినలేదు. తరువాత ఉద్యోగలక్ష్మి ఉల్లేలిస్తోంది. ఎక్కడున్నా నువు నా కొడుకువే నువు, నీ సారసత సంఘాలు, నీ సాంఘిక సేవలు అన్నీ పేపర్ల ద్వారా కోడలి ఉత్తరాల ద్వారా తెలుస్తూనే వున్నాయి.

కానీ ఏం లాభం రా తండ్రి!

నీవు నీ పిల్లలు యింట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటె కోడలి చేత్తో వేయించి పెడుతూ వుంటే సాగిపోయే జీవితం ఎలా వుంటుంది? ఏమో? అది నాకు 'కల' అయిపొయిందిరా బాబూ ఇంత యిల్లు ఒంటరిగా బతుకుతున్నాను.

నాకెంత కావాలి? పిడికెడు ఉడకేసుకుంటే చాలు....వెళ్ళిపోతుంది కానీ, ఆసక్తి పోయింది. ఎలా తింటే కడుపు నిండదు! అలాగే నడుస్తోంది.

జీవితంలో పొద్దువాటారిపోతోంది. ఇంకెన్నాళ్ళు అనిపిస్తోంది! మీ నాన్నగారూ హటాత్తుగా పోయారు నీకు కడసారి చూపులు కూడా దక్కలేదు. అపుడాయన దగ్గర్లో నేనున్నాను. గొంతుకలో గొరగోర లాడుతున్నపుడు నేను యిన్ని నీళ్ళు పోశాను.

నా దిగులల్లా నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు. పండెండుగురు మనుమలు, మనవరాళ్ళు వున్నా నా గొంతు తడిపేవాళ్ళు వుండరేమో అని దిగులుపడుతున్నాను.

నువు నన్ను అక్కడకే రమ్మని అంటావు. నిజమే వచ్చేయ్యొచ్చు కానీ రాలేను. రాను! ఈ యిల్లు యీ పొలాలు, యీ గాలి, యీ వాతావరణం వీటిని వదిలిరాలేను. మీ నాన్నగారు యిక్కడే పోయారు. నేను యిక్కడే పిడికెడు బూడిదై పోవాలి అదే నా ఆశ!

ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయత అదేనేమో! ఎంత చదివినా ఎంత సాధించినా, ఏం చేసినా ఆఖరికి మనిషి ఈ మట్టిలో కలిసిపోవాలి. అలానే ఆ మట్టి తనను కన్నవురి మట్టి కావాలని అరాటపడతాడు మనిషి.

ఇది నా వూరు యిది నా యిల్లు. ఇది నాది.....యీ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో! అందుకే అనాదిగా యీ మమకారాలు యిలాగే నిలిచిపోయాయి. కానీ మానవత మాసిపోలేదు రా బాబు! అందుకే యీ ప్రపంచం యింకా సాగుతోంది.

నేను అంత దూరం రాలేను. ఈ వూరు విడువలేను. ఈ ప్రాణం తట్టేడా? పుట్టేడా? ఎప్పుడో హరీ అంటుంది. నాకు తెలుసు. నాది ఎలాగూ దిక్కులేని చావే అవుతుంది. ఎపుడయితే అయన పోయారో అప్పుడె నేను ఒంటరిదానినై పోయాను. కానీ పోయేలోగా నువు యిక్కడికి వచ్చి నాలుగు రోజులు గడిపి పో కన్నతల్లిగా నేను అంతకంటే యింకేమి కోరను. కోడలిని పిల్లలని కూడా తీసుకురా! ఇక వుంటాను. ఆశిస్సులతో.

                                                                                                                 నీ తల్లి,

                                                                                                              --కాంతమ్మ.

చెమర్చిన కళ్ళని తుడుచుకున్నాడు రామచంద్ర.

"అప్పుడె లేచారా?"

శశికళ ప్రశ్నకి ఉలికిపడ్డాడతను. 'ఊ'

టైం ఎంతయింది.

"మూడు కావొస్తుంది."

"ట్రెయిన్ అయిందిటికీ కదా?"

"అవును- "శశికళ లేచింది-- బాత్ రూంకి వెళ్ళొచింది. బ్రష్ పై పేస్టు వేసి తెచ్చింది బ్రష్ చేసుకోసాగాడు. రామచంద్ర ఏదో ఆలోచిస్తున్నాడు.

"అయిదురోజులే సెలవు పెట్టారు కదా"

"ఆ"

"ఓ నేలనాళ్ళు సెలవు పెట్టేసి ఆ యిల్లు అద్దెకిచ్చి పొలాలన్నీ కౌలు కిచ్చి అత్తగారిని తీసుకురండి అంటే వినరు. మీ ఉద్యోగాన్ని విడిచి ఉండలేరు. మీరు ఉద్యోగం మొదటి పెళ్ళాం, నేను రెండో దాన్ని."

నవేడతను- "తప్పు, నేవే చెప్పావు ఇంకొకరున్నారు- " క్షణంలో సగం- నవ్వింది శశికళ. "అవును...పుస్తకాలు. మూడోది నా స్థానం. ఇద్దరు సవతులతో వేగుతున్నాను."

"అయినా అత్తగారంటే అంత అభిమానమైతే నువు రారాదు."

 Previous Page Next Page