'కట్నాలు రాలేదు బాబూ కట్టాలు వోచ్చినాయ్' అని జరిగింది చెప్పాడు సీతయ్య. నిట్టూర్చాడు సర్పంచ్.
'సర్లే! ఏం చేస్తావ్, నా లెక్కకు పత్తరం రాసియ్యి.
'పత్రమా'
'ఆ మరి బాండు రాసియ్యకపొతే ఎట్టా? నీ కాడా లెక్క యాడికి పోతది గానీ! లెక్క లెక్కే గదా! దానికో గుర్తుంటే మంచిది గాదూ!
సీతయ్యకి ఏ మనడానికి పాలుపోలేదు. గత్యంతరం లేక ప్రామిసరీ నోటు రాయించి బాండు బిళ్ళలతికించిన తర్వాత ఆ రెవిన్యూ స్టాంపుల మీద ఎడమ చేతి బొటన వేలు గుర్తు కందెనతో అద్ది ఆపై గుర్తు వేశాడు.
యాక్సిడెంటల్ గానే కావచ్చు.
అదేరోజు అదే సమయంలో తన తొలి జీతం తిసుకోబోతు రెవిన్యూ స్టాంపు పై చంద్రం కూడా సంతకం చేశాడు.
మాతృవందనం.
తెల్లవారుఝామున అయిదింటికి ట్రెయిన్ రాత్రి పడుకునే ముందు ఎలక్ట్రానిక్ వాచ్ కి ఎలారం సెట్ చేసి పడుకున్నాడు. అయినా రెండింటికి హటాత్తుగా మెలకువ వచ్చింది.
గొంతంతా తడారిపోతున్నట్టుగా వుంది. లేచి ఫ్రిజ్ తెర్చి చల్లని నీళ్ళు గొంతులో పోసుకున్నాడు. మనస్సు నిండా ఏదో తెలియని ఒంటరితనం- ఆందోళన! అలా చూశాడు రామచంద్రం......
హాయి గానిద్రపోతున్నది శశికళ. ఆమెకి ఏ దిగులు ఏ ఆలోచనలూ లేవు. నిశ్చింత అయిన జీవితం ఒక భాద్యతాయుతమైన గృహిణి, కొడుకు, కూతురు విషయాలు చూసుకోవటం.....ఇంటి పని వంటపని అజమాయిషీ చెయ్యటం కాలక్షేపానికి విక్లిలు నవల్సు చదవటం నిద్ర........
నిద్ర......నిద్ర....... అంత హాయిగా ఎలా నిద్రపోగలుగుతుంది? మొదటి నుంచి అంతే! తొమ్మిది దాటితే కన్ను ముతపడుతుంది మళ్ళీ ఆరింటికి కానీ మెళుకువ రాదామెకి. ఇరవయ్యేళ్ళ సంసార జీవితంలో తానెన్ని సార్లు ఆమె అదృష్టానికి అసుయపడ్డాడు.
నిజానికి తనకి ఏ ప్రాబ్లమ్ లేవు. ఎమ్మే పాసవగానే తన మెరిట్ కి బ్యాంక్ లో జాబ్ వచ్చింది. చీకు చింతా ఏనాడూ లేదు. సంసార బాధ్యత లేవు ఉద్యోగ సంబంధమైన అలజడి లేదు. వివాహ సంబంధమైన చిక్కులూ లేవు. శశికళ తనకి అన్నివిధాలా అనుకూలవతి అయిన భార్య. తన మనస్సు తెలుసుకుని ప్రవర్తిస్తుంది.
మరి ఎక్కడుంది ఈ అలజడి?
తన మనస్సులోనే వుంది చిన్నప్పుడు అమ్మ కూడా అలాగే అనేది. చదువుకునే రోజుల్లో తను గుంటూరు నుంచి సెలవులకి ఊరికి వెళ్ళినా ఎప్పుడూ ఏదో పుస్తకం చదువుతూ వుండేవాడు. చదివిన ప్రతి పుస్తకం పైన "నోట్స్" వ్రాసుకోవడం తనకి అలవాటు నిద్రపట్టకపోతే ఏ అర్ధరాత్రి పుటో లేచి చదువుకుంటూ వ్రాసుకుంటూ గడిపేవాడు. అది చూసి ఆమె కేకలు వేసేది.
"సెలవుల్లోనయినా హాయిగా నిద్రపోరానాయనా. ఏం చదువులు అవి! ఒక్క పిల్లవాడివి నలుగురు ఆడపిల్లల మధ్యరత్నంలా పుట్టేవు! ఉల్లేలాలా ఉద్యోగం చేయాలా! ఈ లంకంత యిల్లు, యీ వ్యవసాయం అజమాయిషీ చేసుకుంటే చాలు! ఏం జరగదా? మీ తాతగారు సుఖపడ్డారు. మీ నాన్నగారు, నేను సుఖపడుతున్నాం. నీకు సుఖంగా వుండదా! వద్దన్నా పండుతోంది భూమి!" తను జవాబుగా నవేశాడు.
నాన్నగారు పట్టించుకునేవారు కాదు కానీ అమ్మతో అనేవాడట. "కాంతం" రోజులు మారుతున్నాయి. మా నాన్నగారి హయంలో జమిందారి దర్జా వెలిగించాడు. ఆస్తి హారతి కర్పూరంలా తరక్కపోయినా అయివేజు మిగిలేది కాదు.
మనుషులు తెలివి మీరుతున్నారు . పల్లెటుళ్ళు నాగరికత సంపాదించుకొంటున్నాయి. ఆప్యాయతలు, అనురాగాలు నశిస్తున్నాయి. అంతటా స్వార్ధం స్వార్ధం! అసూయ పెచ్చు పెరిగిపోతుంది. కల్మషం కమ్ముకొస్తోంది.
ఇలాగే పెల్లెలు పాడైతే .....ప్చ్.....ఏం చెప్పగలను? దేశమే పాడైపోతుంది. మనం వున్నట్లుగా అబ్బాయి యిక్కడ యిమిడిపోలేడు. వాడిని ఉద్యోగం చేయనీ" అన్నారట.
తన మనస్సులోనూ అదే ఆలోచన వుండేది.
కానీ అమ్మకి యిష్టం వుండేది కాదు. బియ్యే లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. తను గోల్డ్ మెడల్ అందుకొని ఇంటికి వెళ్ళాడు.
దాన్ని నాన్నగారు తీసుకుని అమ్మ మెడలో వేశారు! "నీవు వీరపత్నివే అనుకొన్నాను వీరమాతావు కూడా! కాంతం! యోగ్యుడైన కొడుడు పుట్టటం గర్భ విశేషం.....నువు నన్ను అదృష్టవంతుడిని చేశావు కాంతం"
ఆ మాటలు తనకు ఎంతో గర్వాన్ని కలిగించాయి.
ఎమ్మే ఫైనలియర్ లో వుండగా బ్యాంక్ ఎగ్జామ్స్ రాశాడు! నాన్నగారికి తనని కలెక్టర్ని చేయాలని వుండేది. ఐ.ఏ.యస్. సెలక్షన్స్ లో జరిగే ఫార్సు గురించి తనకి తెలుసు "నువు డిల్లి వెళ్ళు రాప్స్ ట్యుటోరియల్స్ లో కోచింగ్ తీసుకో తప్పక ఐ.ఏ.యస్. అవుతావు "అన్నారాయన.
"అమ్మో! డిల్లికా! అంతదూరం వద్దు, ట్రైనింగ్ కి ఎక్కడికో పంపుతారు. కలెక్టర్ గా దేశం కానీ దేశం పంపిస్తారు. వాడిని విడిచి వుండలేను . రామా! నీకు ఉద్యోగం వద్దు ఏమి వద్దు లక్షణంగా లక్షణవతి అయిన అమ్మాయిని చూసి పెళ్ళి చేస్తాం. ఇంటిపట్టున వుండిపో" అంది అమ్మ.
తను అటూ నాన్నగారి మాట వినలేదు. అమ్మ మాట వినలేదు. ఫైనలియర్ పరిక్షలు పూర్తి చేసుకుని ఊరికి వచ్చిన వారం రోజులకే తనకు స్టేట్ బ్యాంక్ లో సెలక్షన్ వచ్చింది. వెళ్ళి చేరతానన్నాడు. నాన్నగారేం అనలేదు. అమ్మ మాట కూడా పని చేయలేదు.
వెళ్ళి ఉద్యోగంలో చేరాడు వరుసగా అన్ని శుభాలే ఒనగుడుతున్నాయి. ఉద్యోగంలో చేరిన అరునేలలకే శశికళతో పెళ్ళయిపోయింది. ఆమెకి మేధామేటిక్స్ బాచిలర్ డిగ్రి ఉంది. ఉద్యోగం చేయమన్నాడతను, చదువు కాలక్షేపానికి కాదు అనేది తన నమ్మకం.
"ఉహూ! నేను కాలక్షేపానికి చదువుకున్నాను అందుకే అర్స్ తీసుకోకుండా సైన్స్ తీసుకున్నాను. అందునా మేధామేటిక్స్. ఒక్క క్షణం వ్యర్ధం చెయ్యకుండా విద్యార్ధి జీవితం గడపాలనుకుంటే లెక్కలు చదువుకోవాలి" అందామె.
"నీ ఇష్టం!" అన్నాడు తను అమ్మకి ఎలాగూ ఇష్టం వుండదు. అంచెలంచెలుగా ప్రమోషన్ పదేళ్ళకే తను బ్రాంచి మేనేజర్ అయ్యాడు. పెళ్ళయిన నాలుగేళ్ళలోనే కొడుకు కూతురు పుట్టారు. శశికళ ట్యుబేక్టమి చేయించుకుంది.
ఆ విషయంలో కూడా అత్తా కోడళ్ళకి అభిప్రాయాలు కుదరలేదు. కానీ నాన్నగారికి ఇతర్ల అభిప్రాయాలని గౌరవించే మంచి లక్షణం తొలి నుంచే వుంది. అందుకే తను ఉద్యోగానికి అంకితమై పోయాడు.
ఉద్యోగం తమని ఊరూరా తిప్పింది. రకరకాల మనుషులు. రకరకాల ప్రవృత్తులు ఈర్ష్య, అసుయలతో పాటు ఆత్మీయత, అనురాగం కూడా చవి చూశాడు తను. కానీ రాను రానూ వున్నురికే అంకితమైపోయాడు. కన్నతల్లికి పుట్టినఊరికి దూరమవుతూ వచ్చాడు.
ఆఖరికి నాన్నగారిని కడసారి చూపు చూసుకునే అదృష్టం కూడా లేకపోయింది. తను బ్యాంక్ పని మీద డిల్లి వెళ్ళాడు. పైనాన్స్ కమిటి మీటింగ్ లో ఏవో పేపర్స్ సబ్మిట్ చేయవలసిన పని వుంది. తన రీజనల్ మేనేజర్ వెళుతూ తన్ని వెంట తీసుకెళ్ళాడు.