Read more!
 Previous Page Next Page 
మనసు పొరల్లో పేజి 3

 

    ప్రతివారు పానకాలును ఒక అట పట్టించటం, దాంతో పానకాలు రెచ్చిపోయి వాళ్ళని తిట్టడమో లేకపోతే ముఖం వెళ్ళాడించుకుని వెళ్ళిపోయి వేపచెట్టు కింద ఒంటరిగా కూర్చోవడమో , ప్రతి నిత్యం కార్యక్రమంలో ఒక భాగమై పోయింది. సహజంగా దయా దాక్షిణ్యాలు గల కౌసల్యకి రోజు రోజుకి పానకాలు మీద జాలి పెరిగిపోయింది. సమయం దొరికినప్పుడల్లా దగ్గరికి వెళ్ళి "ఏయ్ పానకాలూ! అలా అందరితో ఎందుకు దెబ్బలాడతావ్? పైగా , అలా అనరాని మాటలంటే ఎవరు పడతారు చెప్పు? వాల్లుఇ మళ్ళీ నిన్ను అనరూ?" అని చెప్పేది.
    "చాల్లే! నేనా తగాదా పడుతున్నది? వాళ్ళా? నువ్వు బాగానే చెబుతున్నావ్!" అని ఆమె మీద కూడా కసురుకునేవాడు. అయినా కౌసల్య కోపాన్ని తెచ్చుకోకుండా , "అదుగో! ఆ కసురుకోవడమే మంచిది కాదు. నేను నీ మంచికోసమే చెబుతున్నాను " అనేది.
    "నువ్వేం చెప్పక్కర్లేదు. నాకు తెలుసు నా సంగతి మైండ్ ......యువర్ ...ఒన్ ....బిజినెస్....." అనేవాడు.
    కౌసల్య మాట్లాడకుండా వెళ్ళిపోయేది.
    కాలేజీలో పానకాలుకు మరో నిక్ నేమ్ పెట్టారు. "మిరపకాయ బజ్జీ' అని ! కాస్త ఖాళీ దొరికితే చాలు, బండి దగ్గర కెళ్ళి మిరపకాయ బజ్జీలు కొనుక్కోచ్చేవాడు. తినడం అయ్యాక కారం పుడితే ఏం పంపు దగ్గరకో వెళ్ళి , పంపు కింద చెయ్యి పెట్గ్తి దోసిలితో నీళ్ళు తాగేవాడు. ఆ నీళ్ళన్నీ ప్యాంటు మీద షర్టు మీద పడి బట్టలు తడిసిపోయేవి. అందరూ వెక్కిరించేవారు "పాపం పసివాడు' అంటూ కొందరు ప్యాంటులో 'సుస్సు' పోసుకున్నాడని కొందరూ!
    "దొంగ ముం....కొడుకుల్లారా, మీ కెందుకురా? నా ప్యాంటులో నేను సుస్సు పోసుకున్నాను మీ మీద పోయ్యలేదుగా?" అంటూ ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టేవాడు.
    ఆ తిట్లకి వాళ్ళు కొట్టడానికి వచ్చేవారు.
    క్రమేపీ ఇది అందరికీ అలవాటైపోయింది. 'పిచ్చాడులే ఫో' అని అతణ్ణి గురించి పట్టించుకోవడం మానేశారు. దాంతో క్లాసులో తగాదాలు క్లాస్ మేట్స్ తో తగాదాలు చాలా మట్టుకు తగ్గిపోయాయి.
    అయితే కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. చెట్లకి నీళ్ళు పోసే తోటమాలితోనో, గేటు దగ్గర కాపలా కాసే వాచ్ మెన్ తోనో దెబ్బలాడి 'వాళ్ళని అమ్మా అలీ' అని బూతులు తిడితే వాళ్ళు తన్నడానికికొచ్చేవారు. ఆ సమయంలో ఎవరో అడ్డుపడి వారిని విడిపించేవారు.
    "అయ్యో రామా! అందాన్ని చూసి పులకితులై ప్రేమలో పడ్డవాళ్ళున్నారు లేదా వారిలో ఏదైనా ప్రత్యేక కళలుంటే , వాటికి దాసోహమయ్యే వాళ్ళున్నారు. అంతే కానీ, ఇదేంటట ?" పగలబడి నవ్వింది సుభద్ర.
    "అలా తిట్టటం కూడా ఒక కళ! అది చూసి ప్రేమలో పడిందేమో!" మరింత నవ్వుతూ అంది భార్గవి.
    "లవ్.........ఈజ్ బ్లైండ్!" అని ఋజువు చేస్తోందనుకుంటా" అంది రాగిణి.
    అవన్నీ నిన్న కౌసల్య మనస్సు చివుక్కుమంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎన్నిసార్లు చెప్పింది తను? ప్రేమా లేదు దోమా లేదు. కేవలం తను అతని మైండ్ స్టడీ చేయటానికే అతడితో చనువుగా తిరుగుతోందని! అయినా వాళ్ళకి నమ్మకం లేదా? తన స్నేహితులే తనను నమ్మకపోతే ఇక వేరే వాళ్ళ సంగతేమిటి?" కౌసల్య బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రాత్రి.రోజూ ఎవరితోనో ఒకరితో దెబ్బలాడటం ఇష్టం వొచ్చినట్టు తిట్టించుకోవడం చూసి 'పాపం అమాయకుడని కొందరు అమాయకత్యం కాదు అహంకారం అని కొందరూ నన రకాలుగా అనుకున్నా క్రమేణా అదీ మానేశారు. పానకాలు దేబ్బలాడడం గురించి, అతని తిట్ల గురించి మాట్లాడుకోవడం మానేసి, అతడు పొరపాటున ఎవ్వరినీ తిట్టకుండా కనిపించినా, దెబ్బలాడకుండా కనిపించినా మాట్లాడుకునే స్థితి కొచ్చారు.
    అయితే కౌసల్యలో మాత్రం అతని సైకాలజీ తెలుసుకోవాలని అతని ప్రవర్తనకు కారణాలు తెలుసుకోవాలనే పట్టుదల కలిగింది. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి కల్పించుకుని అతడితో మాట్లాడేది. అతని మీద ఆమె చూపిస్తున్న శ్రద్ధ కేవలం అతడి మనస్తత్వాన్ని స్టడీ చేయడానికే తప్ప మరేమీ కాదని ఆమె స్నేహితులు కూడా నమ్మలేదు. ఒక మగవాడితో స్నేహం కేవలం సెక్సుకు సంబంధించినదే తప్ప వేరేది కాదని నమ్మే ఈ దేశంలో కౌసల్య స్నేహం పానకాలుతో కేవలం అతడి మనస్తత్వాన్ని తెలుసుకోవడం కోసమేనని ఎవరూ నమ్మలేదు.
    "ఈ కౌసల్యకి ఏం తక్కువయిందని వాడి వెంటపడింది?' అంది రాగిణి. "వాట్ ఏ టెస్ట్! చింపాంజీ వీడీ కన్నా బాగుండేదేమో! ఒక చింపాంజీ నే పెళ్ళి చేసుకుంటే బాగుండేది!" అంది నవ్వుతూ వినోదిని.
    'అయ్యో రామా! అందాన్ని చూసి పులకితులై ప్రేమలో పడ్డవాళ్ళున్నారు లేదా వారిలో ఏదైనా ప్రత్యేక కళలుంటే , వాటికీ దాసోహమయ్యే వాళ్ళున్నారు. అంతేకానీ ఇదేంటట?" పగలబడి నవ్వింది సుభద్ర.
    "అలా తిట్టడం కూడా ఒక కళ! అది చూసి ప్రేమలో పడిందేమో?" మరింత నవ్వుతూ అంది భార్గవి.
    "లవ్.....ఈజ్ బ్లైండ్!" అని ఋజువు చేస్తొందనుకుంటా" అంది రాగిణి.
    అవన్నీ విన్న కౌసల్య మనస్సు చివుక్కుమంది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎన్నిసార్లు చెప్పింది తను? ప్రేమా లేదు దోమ లేదు, కేవలం తను అతని మైండ్ స్టడీ చేయటానికే అతడితో చనువుగా తిరుగుతోందని అయినా వాళ్ళకి నమ్మకం లేదా? తన స్నేహితులే తనను నమ్మకపోతే ఇక వేరే వాళ్ళ సంగతేమిటి?" కౌసల్య బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది ఆ రాత్రి.

 Previous Page Next Page