Previous Page Next Page 
పాదాభివందనం పేజి 28

'ఒద్దు రానాయనా! సేంద్రుడు! ను వేల్లోద్దు రా బాబూ! అదేదో ఆ సదువు ఈడుండే సదూకో" అంది కన్నీళ్ళతో. అదో అలా అతని ఓ బి.ఎడ్ పూర్తయింది. కానీ ఐ.ఎ.ఎస్ రాయడానికి చాన్స్ రాలేదు.

సరిస్ కమిషన్ ఎగ్జామ్స్ రాయడానికి అసలు పరిక్షలే పెట్టలేదు.

ఇప్పుడు ఊరికి వచ్చాడతను. నోటికి హితవుగా లేదు గొడ్డు కారం. ఒక్క ముద్ద తినగానే కన్నిలోచ్చాయి. గొంతు పోలమారింది.

'కారందిన్నికి అలవాటు తప్పోయింది. చెప్పా పెట్టకుండా దిగాబడ్తే యి యాలప్పుడు ఏం వండేది. ఇంగ పడుకుందాం అనుకుంటంటే నువోస్తివి బాపనయ్యకు పొయ్యనికి తీసి పెట్న నెయ్యేసినా కారం పోయినట్టు లేదు.'

సీతయ్య నవాడు.

"ఏందానవు?'

'అదేదో సామెత చెప్పినట్టుంది. ఆరుగాలం సింత సిగురు కోసి సింతకాయలు యిదిది తిరిగి అమ్మి రాజుగారు సేసుకోగానే 'యీ ఏంటి వంకరటింకర కాయలందట నాపసాని. అట్టుంది నీ యావారం.'

ఆ మాటకు , ఈ మాటకు కూడా చంద్ర శేఖరం ఏమి అనలేదు. గొడ్డు కారంతోనే రెండు ముద్దలు మింగి, ఆపై దాన్లోనే పులుసు తనే వడ్డించుకున్నాడు. 'బిడ్డ కారం తిన్లేకపోతున్నాడు' అనుకున్న రామక్క మరింత నెయ్యి గుమ్మరించింది.

చంద్రశేఖరం కారం, పులుసు, అన్నం తిన్నాడు అట్లాగే.

"మజ్జిగ వేయ్"

'మజ్జిగ లేవు. అయిపోయినాయ్' అంటూ లేచింది 'పెరుగు పోస్తానుండు.' అని ఉట్టి మీది నుంచి పెరుగు ముంత దించి పెరుగుతో పాటు మిగాడా గుమ్మరించింది.

కమ్మటి పెరుగుతో కంచం అన్నం లాగించాడు చంద్రశేఖరం.

భోజనాల పరం పూర్తయింది.

ఇంటిముందు బయట ముగ్గురూ మంచాల మీద వొరిగారు.

అదేవారం జిల్లా ప్రజాపరిషత్ లో సెకండరీ గ్రేడ్ పోస్టుకు ఇంటర్యూ వచ్చింది.

చంద్రశేఖరానికి అప్పుడెప్పుడో వేసిన ప్రకటన చూసి అప్లై చేశాడు.

కొడుకును కూచో పెట్టుకుని చెప్పాడు సీతయ్య.

ఒరే సేంద్రన్నా! మీ యమ్మదంతా యేర్రేవారం. సిన్నమెత్తు బంగారంతో మెడసుట్టా తీగ గావాలంటాది. అదేట్టఔతాది. నేనేంతా కనుక్కున్నా! కలకటిరు గావాలంటే ఎమ్మేల్లెనో, ఎంపి నో మామ గావాలంట.

మనిండ్లలో అంతంతోల్లు ఎవలుండారు. మనకెవరు బలుకుతారు. గాబట్టి నా మాటిని టిశరు పనికి కుదురుకో. మానుల్లో మనింట్లో బతుకుతా మనింట్లో తింటావు. యాడాదికి పాతికయేలు వొస్తాయ్యంట మనపాడి మీద, పంట మీద వొచ్చేది మన బతుకులకు సాలు గదా! నాలుగేండ్లు తిరిగేసరికి లచ్చాధికారి వయితావు.

ఇల్లు తిరగ్గట్టిస్తా పెండ్లి జేస్తా. ఆలూ మొగుడూ మా కండ్లెదర తిరుగుతంటే నేను, మీ యమ్మ సూసి సంతోషపడ్తాం.

మారుతున్నకాలాన్ని, మారిపోతున్న సాంఘిక జీవిత విధానాన్ని అడుగడుగునా ఉద్యోగానేషణలో ఎదురవుతున్న రకరకాల అవరోధాల్ని గుర్తించిన చంద్రశేఖరం కాదనేందుకు మరో మార్గం లేక సరే అన్నాడు అది లౌక్యంగా.

 'నాకింతగా చెప్పాలా నాన్నా! అట్లాగే కానీ" అన్నాడు.

ఇరవయి రెండేండ్లు వచ్చినా- అంత చదివినా 'నువు గిసిన గిరిలోనే ఉంటాన'న్న కొడుకుని చూసి సీతయ్య ఎంతో సంతోషించాడు. ఉహూజి గర్వించాడు.

ఇంటర్యూ తేది నాటికీ గ్రామ సర్పంచ్ ని, మండల అధ్యక్షుని, తమ నియోజక వర్గం ఎమ్మెల్యేని శతపోరి జిల్లా ప్రజాపరిషత్తు అద్యక్షుడికి 'చెప్తాను' ని వాగ్దానం తీసుకున్నాడు.

ఇక ఉద్యోగం వచ్చి ఇంట్లో పడ్డట్టే కొడుకు అక్కడే ఉండినట్టే!

ఆ రాత్రి సీతయ్య రామక్క తెగ సంబరపడిపోయారు.

జిల్లాప్రజాపరిషత్ కార్యాలయంలో ఇంటర్యూ జరిగిపోయింది. ఆ జిల్లా చైర్మన్ గారికి అందవలసిన సమాచారం అంతా అందింది.

అదిగో అక్కడ వచ్చింది చిక్కు!

ఎర్రగా బుర్రగా వుండి ఎమ్మే ఫస్ట్ క్లాసులో పాసైన 'తన' కులం కుర్రాడిలా ఓ పల్లెటుల్లో సెకండరీ గ్రేడ్ టిచర్ 'సెకండ్ ' గ్రేడ్ జీవితం గడపడం ఇష్టం లేకపోయింది. దానికి తోడు ఇంట్లో పెళ్ళి కావలసిన కూతురుండడం మరీ అయిష్టం కలిగించింది.

దాంతో మండలాధ్యక్షుడిని ముగ్గులోకి దింపాడు. మరిన్ని విషయాలు రాబట్టాడు. అప్పుడెప్పుడో బ్యాంకింగ్ సర్విస్ కి చంద్ర శేఖరం పరిక్ష రాసినా విషయమూ తెలిసింది.

దాంతో తన 'పంజా' విస్తరించాడు.

"జాబు కోసమై వలలో పడెనే పాపం పసివాడు" అనుకున్నాడు గ్రామ సర్పంచ్.

సెరువులో రాయేస్తే నిల్లంతా సెల్లా సేదరయిపోతాయి. నీకిది తెలుసునాసిన్నోడా!

నేనంత ఆశపడ్డాన్రా! బిడ్డ నాకు కాకుండా పోతాడని ఎవరు సేప్పలేదురా కన్నా!

తండ్రి అలా వేదన పడినా చంద్రశేఖరం ఏమి అనలేదు. అతనికి సిటి జీవితం గ్రామ జీవితం కళ్ళెదుట నిలిచాయి. ఆ మొహం ముందు తండ్రి ప్రేమ నిలవలేకపోయింది. రామక్కకు కొడుకు బ్రతుకు, భవిష్యత్తు అంతా పంచరంగుల చిత్రంలా కనిపించడంతో ఆమె కిమ్మనలేదు.

కొన్ని కొన్ని సంఘటనలు ఎవరి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాగే చంద్రం బ్యాంక్ ఉద్యోగం, పెళ్ళి జరిగిపోయాయి. 'పెద్దేత్తున సంబంధం వచ్చింది వాడికి. వొప్పుకో అని రామక్క మొగుడిని వేధించింది.

పెళ్ళయిన నెల రోజులలోగానే ఉద్యోగంలో జాయినయిపోయాడు చంద్రశేఖరం. మామగారి చలువతో సిటిలో కాపురం పెట్టాడు.

కొడుకు వెళ్ళిపోగానే ఇల్లంతా శూన్యం అయిపోయిందనిపించింది దంపతులకు. అదేకాదు మరో షాక్ కూడా వారిని కృంగదిసింది.

చంద్రం పెళ్ళి ఖర్చు అనుకోనంత అయిపొయింది. ఆ డబ్బులు ఎలాగో తీర్చేయోచ్చనుకున్నా బాకీ విషయం సీతయ్యను భయపెట్టేది. పెళ్ళి ఖర్చులకు సర్దుబాటు చేసిన సర్పంచ్ పెళ్ళి సంబరాలు ముగిసి పోగానే డబ్బు కోసం కబురు పెట్టాడు.

'సదివింపుల కట్నాలు వచ్చింటాయి గదా నా లెక్క ఇచ్చేయ్.'

 Previous Page Next Page