Previous Page Next Page 
మధుకీల పేజి 27

    "డబ్బు పెట్టె చూశావా?"
    గుండె గొంతుకలోనికి వచ్చిందతనికి.
    "ఎక్కడమ్మా?"
    "ఇక్కడేరా ఇక్కడే పెట్టాను. కనిపించటంలేదు. నీవు చూశావా?"
    ఆ మాటలతనికి తీశావా అన్నట్టుగా వినిపించాయి.
    "వచ్చింది, ఆపద వచ్చేసింది. అంతిమ క్షణం కలిసొచ్చింది. అటో యిటో ఇదే మధ్యరేఖ. ఇప్పుడే ధైర్యం అవసరం - లేదా మరణం" అనుకున్నాడు. "లేదమ్మా! నాకేమీ తెలీదు. డబ్బు ఎక్కడ పెట్టావు? న
    "ఎవరైనా కానీ భగవంతుడు ఇప్పుడెలా..."
    "పూర్ణా!" కేకేశాడు సుందర్రావు బయటినుంచి.
    "అన్నపుర్ణమ్మా! మీ పెద్దబ్బాయి వచ్చాడు" శాస్త్రిగారు కేకేశారు.
    ఏదో అర్దమైనట్టు సుధాకర్ ముఖం వెలిగిపోయింది. గబగబా మళ్ళీ అవకాశం రాదేమో అన్నంత త్వరత్వరగా అన్నాడు.
    "ఒకవేళ అన్నయ్యే తీసికెళ్ళాడేమో! ఇప్పుడు మనం ఇబ్బందులు పడితే చూడటానికి వచ్చాడేమో?"
    కలుక్కుమంది ఆమె మనస్సు.
    "ఛ! ఛ!! అలా అనొద్దు... వాడు---"
    "ఏమిటమ్మా? అంతా యిలా వుండిపోయారు" గదిలోకి వచ్చిన మధు ప్రశ్నించాడు వాళ్ళ ముఖాలు చూస్తూ
    "డబ్బు పోయింది" బాంబు పేల్చినట్టుగా అన్నాడు సుధాకర్.
    "ఈజిట్? ఎలా పోతుంది? నిజంగానా? ఎప్పుడు కనుక్కున్నారు?" ఆదుర్దాగా అడిగింది.
    "ఇప్పుడే చూస్తున్నాను. సొమ్ము పోయింది- సొమ్ము తీసికెళ్ళిన దొరలాంటి దొంగనీ."
    "సుధా! ఎవరు దొంగ?"
    "ఆశర్యంగా వుందా? వెళుతూ వెళుతూ డబ్బు పట్టుకెళ్ళావ్. ఇప్పుడు తమాషా చూడాలని వచ్చావు. పెళ్ళి ఆగిపోతే చూచి ఆనందించాలని వచ్చావు. కానీ ఇది ఆగదు మధూ."
    "సుధా!"
    "టక్ టక్ మని శబ్దం చేసుకుంటూ సుందర్రావు వచ్చేడు. ఏమిటా అనుకుంటూ శాస్త్రిగారు వచ్చాడు.
    "నాన్నగారూ! ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడట. డబ్బు పోయింది, కాజేసి పోయిన ఘనుడు వచ్చాడు నవ్వి పోవటానికి శాస్త్రిగారూ! అతనితో విషయం చెప్పండి" అన్నాడు సుధాకర్.
    "సుధా! ఏమన్తున్నవురా నువ్వు?" గాబరాగా అడిగేడు సుందర్రావు.
    "శత్రువుగా మీ కడుపున పుట్టిన మీ జ్యేష్ఠుడు మీ గౌరవాన్ని పదిమందిలో వేలం వేయాలని ప్లాన్ వేశాడు నాన్నా."
    "ఒరేయ్ నోర్ముయ్! లేనిపోని నిందలు నాపై వేస్తే బావుండదు, పరిస్ధితులు విషమించేలా మాటాడకు."
    "నీ కోపానికి జంకే వాళ్ళు ఎవరూలేరు! ఫస్టు గెటవుట్ ఇంతకంటే నీవూ ఏమీ చేయలేవని మాత్రం తెలుసుకో- ఒక అన్నయ్య మృతప్రాయుడైనా మరో అన్నయ్య వున్నాడు జయకి..."

    "నాన్నా! వీడి మాటలు వింటున్నారా? మీరూ నమ్ముతున్నారా?" గద్గదికంగా అన్నాడు జయని..."
    "నో రిక్వెస్ట్-- మళ్ళీ వాళ్ళేం చెపుతారు. గుండెపగిలి దిగాలు పడిపోయారు. ఇంకా నీ వాదనలతో వాళ్ళని గాయపరచకు. గెటవుట్."

 Previous Page Next Page