"సారీ, మాధవ్! ఇప్పుడు నేనేం మాట్లాడలేను. వస్తాను" వెళ్లిపోయాడు స్వరూప్, పిచ్చెక్కి పారిపోతున్నవాడిలా.
లోపలికి వచ్చి చూసిన మాధవ్ కి స్వప్న పక్కమీద బోర్లాపడి ఏడుస్తూ కనిపించింది. నిశ్శబ్దంగా ఇవతలికి వచ్చేసాడు.
మరునాడు మాధవ్ ఆఫీసులో వుండగా స్వరూప్ పంపిన ఒక మనిషి ఒక కవరు తెచ్చిచ్చాడు. "స్వరూప్ సాబ్ ఇది మీకిమ్మన్నారు!"
కవరు చించి లోపలున్న కాగితంతీసి చదువుకొన్నాడు మాధవ్.
"డియర్ మాధవ్!
నిన్నిలా పిలుచుకొనే అర్హత కోల్పోయానేమో! నిజంగా ఒక శత్రువు చేయావలసిన పని చేశాను నీపట్ల . నిన్న అక్కడినుండి వచ్చేశాక నాకు ఆత్మహత్య చేసుకు చచ్చిపోవాలనిపించింది. నా ప్రేమ కథ నీ ముందు వాగిననాడు నీ గుండెలో అగ్ని రగిలిస్తున్నానని తెలియదు. స్వప్న బ్రతుకులో నిప్పులు పోస్తున్నానని తెలియదు.
స్వప్న నీ భార్య అయిందని తెలిస్తే నావల్ల మీఇద్దరికీ ఇంత ద్రోహం జరిగేది కాదు, మాధవ్! తెలిసి తాకినా, తెలియక తాకినా నిప్పు కాలుస్తుంది. నేను చేసిన తప్పూ అంతే. నా హృదయాన్ని దహించివేస్తూ వుంది! తన భార్య మరొకరికి ప్రేయసి అని విన్నప్పుడు ఏ మగవాడైనా ఎంత నరకం అనుభవిస్తాడో నేను ఊహించగలను. నేనుచేసిన తప్పూ అంతే.
నువ్వునాకు ముఖం తప్పించి ఎందుకు తిరుగుతున్నావో స్వప్నని నీ భార్యగా చూశాక అర్దమైంది! నేనెంత చవటగా ప్రవర్తించాను!
మాధవ్!
నిన్ను నేను ప్రార్దిస్తున్నాను. స్వప్ననేమీ బాధపెట్టకు. స్వప్న నన్ను ప్రేమిస్తుంది. నిజమే. కాని, తనలా హద్దులు తెలిసిన ఆడపిల్లని నే నెక్కడా చూడలేదు. తన కుటుంబం కోసం, గౌరవంకోసం తన ప్రేమను కూడా త్యాగం చేసిన ఉత్తమ స్త్రీ ఆమె. నేను చేసిన పొరపాటు సరిదిద్దు కోవడంకోసం ఇలా చెబుతున్నాననుకోకు. స్వప్నని తెలిసిన ఎవరైనా ఈ మాట చెబుతారనుకొంటాను!
ఇక స్వప్న నా ఊహల్లో కాపురం చేయదని నీకు హామీ ఇస్తున్నాను. స్వప్న ఒకనాడు నా ప్రేయసి అయినా ఈనాడు ఒకరి ఇల్లాలు కదా? ముఖ్యంగా నా స్నేహితుడి భార్య అయ్యాక ఆమె నింకా కలువరించే నీచస్థితికి దిగజారను! ఇప్పటికి నేను చేసిన ద్రోహం చాలు ఇంకా మిత్రద్రోహం చేయను. మాధవ్, నన్ను విశ్వసించు!
స్వప్నా, నువ్వు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ, మీ మధ్యనుండి నిష్క్రమిస్తున్న స్వరూప్"
* * * *
అన్యమనస్కంగా పనిచేసుకొంటున్నది స్వప్న.
ఆమె మీదికి స్వరూప్ వ్రాసిన కవరు విసిరి తన గదిలోకి వచ్చాడు మాధవ్. శారీరకంగా, మాసికంగా అలసిపోయినట్టుగా బట్టలు కూడా విడవకుండా పక్కమీద పడి అలాగే నిద్రపోయాడు. అతడికి మెలుకువ వచ్చేసరికి గదిలో చీకట్లు ముసిరివున్నాయి. మాధవ్ లేచి లైట్ వేసి అవతలికి వెళ్లాడు. ఇల్లంతా చీకటిలో మునిగి వుంది! అన్ని గదుల్లో లైట్లు వేస్తూ వెళ్లి స్వప్న గదిలోకూడా వేశాడు.
స్వప్న పడుకొని వుంది!
బుగ్గలమీద చారికలు కట్టిన కన్నీరు లైట్ వెలుగులో మెరుస్తూంది. విసురుగా ముఖం తిప్పుకొని కిచెన్ లోకి వెళ్లాడు. ఫ్లాస్కు కదిలించి చూశాడు తనకోసం టీ పోసి వుంది! వంట పాత్రలమీద మూతలు తీసి చూశాడు. అన్నం తన ఒక్కడికోసమే వండినట్టు గమనించాడు.
"స్వప్నా!" అన్నాడు గదిలోకి తిరిగి వచ్చి.
మాధవ్! ఇప్పుడు నేనేం మాట్లాడలేను. వస్తాను" వెళ్లిపోయాడు స్వరూప్, పిచ్చెక్కి పారిపోతున్నవాడిలా.