Previous Page Next Page 
మధుకీల పేజి 24

    "మీ ఇష్ట ప్రకారమే!"
    "గుడ్! అలా రా దారికి ఆ ఫోటోలు నీ ఇష్టం చించుకో తగలేసుకో. లేదా ఆల్బంలో దాచుకుని రహస్యంగా గదిలో చూసుకుని ఆనందించు."
    జవాబివ్వలేదు సుధాకర్.
    "మీ ఇంట్లో- స్టోర్ రూంలో---"
    తలెత్తాడు సుధాకర్, అతని కళ్లు తీక్షణంగా వున్నాయ్.
    "నో- ఆ చూపు దించెయ్. బానిస భావం కావాలి మాకు. ప్లేటు మార్చు- ఆఁ రూంలో- మీ అమ్మగారి పెట్టిలో ఓ చిన్న చెక్కపెట్టె వుంది. దాంట్లో నాన్నగారి పి.ఎఫ్. బాబతు డబ్బుంది. అది మొత్తంగా తీసుకుని మాకు తెచ్చియ్యాలి---"
    "ఆ!---"
    "న్యాయమే మాది! కానీ నీ జీవితం చూడు. నీ చెల్లెలి జీవితం చూడు. ఆ అమ్మాయి బ్రతుకు విలువ చూడు. పూవుని అందుకునే రాదు. అందుకున్నావా శిరోధారంగా స్వీకరించాలి. అనుభవించి పెంటలో వెయ్యటానికి కాదు... డబ్బు దేవుంది సుధాకర్. ఈ రోజుల్లో కుక్కలు సంపాదిస్తున్నాయ్. మనిషికి కావలసింది పరువు-ప్రతిష్ట---"
    "ఇంత ఘో
    "ధనమా! పరువా? తేల్చుకో?"
    నిశ్చయానికి వచ్చాడు సుధాకర్, చక చకా పార్కు దాటి ఇంటి ముఖం పట్టాడు. ఆ వ్యక్తి ముఖాన ఓ క్రూరమైన నవ్వు తాండవించింది.
    "మా నాన్న ఏమన్నాడో తెలుసా?" మధ్యాన్నం భోజనం చేసి కిళ్ళీ నములుతున్న భర్తతో అంది మణి.
    "ఏమన్నారు?" ఎర్రగా పండిన నాలికని చూసుకుంటూ అడిగాడు.
    "మీరు బాగా అబద్ధాలాడతారా?"
    "ఎందుకు?"
    "నోరు ఎర్రగా పండితే అడుగుతున్నాను"
    నవ్వి అన్నాడు మధు. "భార్యపై ప్రేమని, అబద్ధాలు ఆడతారనీ అనటం అంతా ట్రాష్. కాల్షియం పాళ్ళు లాలాజలంలో ఎక్కువగా వుంటే నోరు పండుతుందట."
    "అవున్లెండి. మీకు నాపై ఎందుకుంటుంది ప్రేమ?"
    "ఆడవాళ్ళు బుంగమూతి పెట్టినా అందంగా వుంటారు. ఆగ్రహించినా అందంగా వుంటారు అని రాసిన కవులు అబద్ధాలు రాశారేమో నని పిస్తుంది. నాకు చూడగా శృంగారంలో తప్ప ఆడవాళ్ళు అందంగా వుండరేమో!" అని "ఆఁ ఇంతకి మీనాన్న ఏమన్నారు" అని అడిగారు.
    "నేను ఎలాగూ అందంగా వుండనులెండి" అని "మీరు వట్టి అమాయకులన్నారు" అంది.
    "ఎందుకు కానీ కట్నం ఖర్చుకాకుండా నిన్ను చేసుకున్నందుకా?"
    "ఆ మాటకొస్తే మీరే నాకు శుల్కమివ్వాలి సార్! నెల నెలా నేను రెండొందలు జీతం సంపాదించి తెచ్చి యిస్తున్నానుగా... అది కాదు మీరు మీ నాన్న వాళ్ళింటి నుంచి బయటికి ఖాళీ చేతుల్తో వచ్చేశారుగా అందుకని"
    "ఖాళీ చేతులా? బావుంది. రెండుచేతులా రెండు సూట్ కేసుల్నిండా..."
    "మీ చమత్కారం మరీ బావుంది. ఆస్తి పంచుకోకుండా వచ్చారని ఆయనన్నారు."
    "ఆస్తి ఏముంది?"
    "ఇల్లుంది--- పి.యఫ్. గా వచ్చిన డబ్బుంది. ఇంకా పాత్రసామానుంది."
    "మా అమ్మా నాన్న వుండగా అవన్ని ఏమీ మనకి రావు" నిష్కర్షగా అన్నాడతను.
    "లోకంలో వేరుపోతున్న కొడుకులంతా మీలాగా వస్తున్నారా?"
    "పోనిద్దూ-ఆ రెండు మూడువేల డబ్బు- ఆ యింత సామాను ఏం చేస్తాయి? నెల నెలా అంతో యింత ఫాక్టరీ వాళ్ళిస్తున్నారు. పైగా మీ నాన్నకి బోలెడంత వుంది---"
    "వుంటే అదంత మీ కిస్తారా?"

 Previous Page Next Page