Previous Page Next Page 
పాదాభివందనం పేజి 75

బంగరురంగులో ముద్దుమోము.....గులాబీ వర్ణంలో చెక్కిళ్ళు, ప్రేమపరాగ రంజితమైన పెదాలు. వాటిపై తుమ్మెదరెక్కలాంటి మీసం ఆపై ప్రేమకాసారాల్లాటి. వలపు వాకిళ్ళవంటికనులు .....   
మకరసంక్రమణ వేళలోసూటిగా జారిన రవికిరణం లాంటి నాసిక. అందమైన నన్నెదురు...ఆపై సెలయేటినురగల్లాగ సాగరతరంగాల్లాగా తన మనసు దోచుకున్న ఉంగరాల ముంగురులు.   
ఎంత సోయగం! ఏమందం?   
ఈ అందం- దీన్ని మించిన మానసిక సౌందర్యం.   
ఇవే కదా తనని జన్మజన్మల బందీనిచేసింది.   
ఇలా కనులలో కనులుచేర్చి అలాగే తనవితీరా జీవితాంతం చూస్తూ ఉండిపోవచ్చు ఎక్కడి ఆకలి.....ఎక్కడి దాహం.....తీరిన సౌందర్య దాహంముందు అవన్నీ గప్ చిప్.....నరాల్లో అలజడి వుండదు. నరాల రహదారుల్లో ప్రేమ జలపాతాలనెమ్మదైన ప్రవహింపు......గుండె ఝల్లుమంటుందేకానీ గుబులుండదు. రక్తం శాంతంగా వెన్నెలతేరినట్లుంటుంది.
అంతేకానీ హోరున పరిగెత్తదు.....   
ఎంతవింత అనుభూతి?   
ఈ అనుభూతికి అద్దంపట్టే అందమైన అనుభవం!   
తను జీవితంలో ఈ ప్రేమ-ఈ ప్రశాంతత- ఈ అనురాగమయలోలత కోరుకుంది.   
కానీ లభించిందేమిటి?   
బరవెక్కబోయిన గుండె ఒక్కసారిగా - రాబోయే ఆ ఆలోచనా ప్రవాహాన్ని విదిల్చింది. విరిగిన కెరటం విసిరేసినట్లు ఆ చేదు అనుభావాల ఆలోచనలకి అక్కడేఆనకట్ట.   
'మినీ......'   
'ప్రభూ!'   
'ఈ ఏకాంతం లభిస్తుందని ఎన్నడూ అనుకోలేదు.'   
'నేకలగన్నానా? యావజ్జీవకారాగారా శిక్ష పొందినా ఎప్పుడో విడుదలవుంది కానీ మనకు....'   
'మనకూ ఓ సువర్ణావకాశం .......'   
'ఎప్పుడూ?' ఆతృత ఆరాటం గుండెని గొంతుకలోకి తెచ్చాయి.   
'బాధ్యతల నుంచి విడుదలయి-'   
'అదెప్పుడో'   
'ఇంకెన్నేళ్ళకయినా అవనీ - మినీ - నేనూ, నా భార్యా నా పిల్లలు అనేది నాకు లేదు. అదేదో కార్యకారణ సంబంధం తాళి కట్టినందుకు, కలసిన శరీరాలకు కలిమి లభించినందుకు వాళ్ళకి సాంఘిక న్యాయం చేకూర్చాలి. చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళయి కొంత బరువును సడలిస్తే ఆర్ధికంగా బలంయిచ్చి కొడుకుల చెంత ఆమెని చేరిస్తే ఆపై నాకోసం కలవరించే ప్రాణి కోసం నా జీవనయానం మొదలవుతుంది. కొన్నేళ్ళో - కొన్నాళ్ళో - వెన్నెల బయళ్ళలో ప్రకృతి ఒడిలో - నీఒడిలో తృప్తిగా శయనిస్తాను......'   
ఆమె అతని ఆరాధనకి, ఆశయాల అవధికి అభినంధనచందనంగా అతని ఎద రొమ్ముపై వాలిపోయింది.  
అతనామెని పూలహారంలా స్పృశించాడు.   
'మరి..... నేను.....'   
'నీవు అంతే ..... కూతుర్ని అత్తింటికి సాగనంపి, కోడలికి పెత్తనం అప్పగించి..... ఆపై.... ఆపయిన అతనుపూర్తిచేయలేదు.   
లోకం ఒప్పుకుంటుందా?'   
'అప్పుడు- ఆ నాల్గుపదుల నడి వయసులో యింకా లోకాన్నిలెక్కించాలా?'   
'కానీ- కాకుల్లా కూస్తారు.....'   
'వినిపించనివిహాయస వీధిహద్దుగా ఎచటికో ఏ దూర తీరాలకో ఏ నదీగర్భంలో వున్న యిసుక తిన్నెలబయళ్ళకో- వెళ్ళిపోదాం......'   
ఆమెమదిలో ఏదో దృఢనిర్ణయం.   
'రఘూ!'   
'మినీ!'   
అతని అరటి మొగ్గలాటి అరచేతిలో అరవిందం కంటే మృదువైనతన చేయి వేసింది.   
'ప్రామిస్!'   
'ప్రామిస్!'   
'మళ్ళీ యిలా కలుసుకునే యోగం వుంటుందో వుండదో-ఎప్పుడో ఎన్నడో అవకాశం లభిస్తుందని ఆశే ఆధారంగా జీవిక సాగిస్తున్నాను నీకు ట్రాన్స్ ఫర్ అయి అక్కడికే మళ్ళీ వస్తే.....రోజుకో....వారానికో.....నెలకో.... సంవత్సరానికో- ఎప్పుడో- ఏదో బజార్లోనో- హోటల్ లోనో, సినిమా హాల్ లోనో, ఏదైనా ఫంక్షన్ లోనో, దసరాకో, ఉగాదికో నిన్ను దేవునిలా చూస్తానని ఆశ వుంటుంది. కానీ నీకు బదిలీ రాదు. నాకు కోరిక తీరదు-'   
క్షణక్షణాలకి బరువెక్కుతోంది కంఠం.   
దుఃఖోదిగ్నమానసం......   
సాంతనలభించేట్టుగా ఆమె వెన్నుపై అతనిచేయి ......   
ఆమెశాంతించింది.   
'అందుకే యిప్పుడే నా గుండె విప్పుతున్నా.....ఈ బరువూ బాధ్యతలు తీరగానే.....ఒక్క క్షణం విలంబనమయినా యీ ఎద ఓర్చుకోదు. నీకు ఎక్స్ ప్రెస్ టెలిగ్రాం యిచ్చేసి రైలెక్కేస్తా.....నువ్వు ఆ పై నా తోడుగా.....జోడుగా....నీడగా.....అండగా.....'   
'బ్రతుకుపున్నమిలో రాకాశశి ఉదయించే ఆ వేళకై కలువలా......'   
'మళ్ళీ కలుసుకుంటామనేఆశ..... ఇప్పుడు వీడిపోతున్నానునే దుర్భర వియోగవ్యధ.....ఎంత సంఘర్షణ ....'   
నీకైనిరీక్షిస్తూ.....ఆ క్షణాలకై వీక్షిస్తూ.....అంతదాకా ఆశగా జీవిస్తూ.....నయనాభిరామమైనా జీవన రాగాన్నివైరసపల్లవమగా హాసవెళ్ళువగా వస్తానని......'   
ఆమెపాదాలు మృదువుగా.....ప్రేమగా.....ఆరాధనా పూర్వకంగా రెండు చేతులతో.....
                                      గుండె నిండిన వేళ
తనచుట్టూ నించున్న వారి వైపు చూసింది రుక్మిణిదేవి.   
అందరిముఖాల్లో ఆందోళన, దుఃఖం వీచికలు, గుండెని రెండుగా కోసేస్తున్నట్టుపడుతోన్న ఆందోళన.

 Previous Page Next Page