11. పాశురము :

 

 

provides Tiruppavai Devotional magzine part 11, importance of tiruppavai, telugu version tiruppavai with bapu drawings, divine tiruppavai with bapu illustrations, tiruppavai dhanurmasa vratam process, tiruppavai telugu pdf text

 

 



కత్తుక్కఱవై క్కణంగళ్ పల కఱన్ధు
శెత్తార్ తిఱ లళియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుమ్
కుత్త మొన్ఱిల్లాద కోపలర్ దమ్ పొఱ్కొడియే
పుత్తర వల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వనుమ్ నిన్
ముత్తమ్ పుగున్థు ముగిల్ వణ్ణన్ పేర్పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి, నీ
ఎత్తుక్కు ఱజ్ఞమ్ పొరుళే లోరెమ్బావాయ్.


భావం: ఓ గోపాలకుల తిలకమా! ఓ చిన్నదానా! లేత వయస్సు కలిగిన పశువుల యొక్క అనేకమైన సమూహ సంపద కలిగిన మీ వంశం చాలా గొప్పది. ఆ సమూహాల పాలు పిదుకతగినవారును, శత్రువులు నశించునట్లు యుద్ధం చేయగలవారును, ఒక్క దోషమైనను లేనట్టి గొల్ల కులమున పుట్టిన బంగారు తీగవంటి అందమైనదానా! పుట్టలోని పాము పడగతో సమానమైన నితంబము కలదానా! ఓ వనమయూరమా! రమ్ము. నీ సఖులు, బంధువులును అందరు వచ్చి నీ వాకిట నిలిచియున్నారు. వీరందరూ నీలి మేఘమును బోలు శరీరకాంతిగల శ్రీకృష్ణుని అనేకమైన తిరునామములను పాడుచున్నారు. ఐనను నీవు మాత్రము చలించక, మాటాడక, ఏల నిదురించుచున్నావు? అని అనుచున్నారు. అనగా యింత ధ్వనియగుచున్ననూ ఉలకక, పలకక (ధ్యానములో) ఎందుకున్నావు? ఇది శ్రీకృష్ణ సంశ్లేష అనుభవానందమే కదా! మరి యీ సంశ్లేషాను భవానందమును నీ వొకతెవెకాక అందరును అనుభవించునట్లు చేయవలెకాన, మా గోష్ఠిలో కలిసి యీ వ్రతము పూర్తిగావించుము అనుచున్నారు.

    అవతారిక :-

 

 

provides Tiruppavai Devotional magzine part 11, importance of tiruppavai, telugu version tiruppavai with bapu drawings, divine tiruppavai with bapu illustrations, tiruppavai dhanurmasa vratam process, tiruppavai telugu pdf text

 

 



అన్ని విషయములందును, అగ్ని విధములందును శ్రీకృష్ణునితో సరిసమానమైన ఒక గోపికామణిని, యీ పదకొండవ మాలికలో గోదాదేవి తన తోటి గోపికలతో కలిసి లేపుచున్నారు. శ్రీ కృష్ణుడు ఆ ఊరిలోని వారికందరకు అన్నివిధాలా ఆరాధ్యుడు. ఆదరణీయుడు. అట్లే యీ గోపిక కూడ అతనితో సమానముగా ఆరాధ్యురాలు. ఆదరణీయురాలు. ఈమె తాను పలికే పలుకు, చేసే పనులు అన్నీ భగవదారాధనగాను, భాగావత్కైంకర్యంగాను వుండాలని భావిస్తూ ఆచరించే గోపిక. అంతా కృష్ణమయంగానే తలిచేది. భగవత్వరం కానిది ఏదీ వుండరాదని యీమె భావన. అందువల్ల యీమె భావానికి తగినట్లు భగవచ్చింతనలోనే వుండటం వలన ఆ శ్రీకృష్ణ సంశ్లేషానుభవంలోనే మునిగి వుంటుంది. అందులోనే తాదాత్త్యం చెందుతూ వుంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడూ ఆ యోగ నిద్రలోనే వుండటాన బాహ్యమైనవేవీ వినపడవు. కనపడవు. పట్టించుకోదు. ఈమె అతిలోక సుందరి. అందరినీ ఆకట్టుకొనే సౌందర్యం. అలనాడు శ్రీరాముడు పురుషులనే మోహింప చేసినట్లు యీమె స్త్రీలనే మోహింపచేయగల సౌందర్యరాశి. సౌందర్యంతో పాటు శ్రీకృష్ణానుభవ సౌందర్యం కూడా తోడై సాటి గోపికలనే మోహింపచేసిన యీమెను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు.     

        (శుద్ధ సావేరిరాగము - ఝంపెతాళము)


    ప..    మాటాడవేలనే? ఓ చిన్నదాన?
    ఇటు నిదుర వీడవు! తామస మదేలనే?

    అ..ప..     ఇటు వినవదేలనే? మా కృష్ణ గీతముల!
    పటువైన శ్రీకృష్ణ సంశ్లేష మోహమా?

1. చ..    ఈ గో సమూహముల గాచు వీరెల్లరు
    తగిన వీరులు శత్రు సైన్యాల నణతురు
    బంగారు లతవె! గోపాల కుల తిలకమా!
    అంగనా లేవనే! ఓ చిన్నదాన!

2. చ..    చెలియలందరు వచ్చి నీ వాకిట న్నిలిచి
    నీలమేఘశ్యాము తిరు నామములు పాడ
    ఏల కదలక యుంటివో వనమయూరీ!
    ఏల మాటాడవో అహినితంబా! సఖీ!
    మాటాడవేలనే? ఓ చిన్నదాన?

 

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్


More Tiruppavai