తిరుప్పావై ఇరవై నాలుగో రోజు పాశురం

 

 

 

 



    *    అన్ణి వ్వులగ మళన్దాయ్! ఆడిపొత్తి;
        చ్చేన్ణజ్ఞ తైన్నిలజ్ఞేశేత్తాయ్! తిఱల్ పొత్తి;
        పోన్ణ చ్చగడ ముద్దైత్తాయ్! పుగళ్ పొత్తి;
        కన్ఱుకుడై యావేడుత్తాయ్! గుణమ్ పొత్తి;
        వెన్ణుపగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పొత్తి;
        ఎన్ణెన్ణున్ శేవగమే యెత్తిప్పఱై కోళ్వాన్
        ఇన్ఱి యామ్  వన్దొన్  ఇరజ్గేలో రెమ్బావామ్

   
భావం : అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా! నీ రెండు పాదములకును మంగళము! సీతమ్మ నపహరించిన దుష్టడగు రావణుని లంకను గెల్చిన ఓ శ్రీరామా! నీ ధీరతకు మంగళము! బండి రూపంలో శకటాసురుడనేరాక్షసుడు నిన్ను చంపప్రయత్నింపగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము! దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని. వెలగచెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కపిత్డాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ వంచిన పాదమునకు మంగళము! దేవేంద్రుడు రాళ్ళ వర్షమును కురిపించగా గోవర్దనగిరిని గోడుగుగా నెత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక! శత్రువులను చీల్చి చెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళ మగుగాక! ఇట్లు నీ వీర గాధలన్నేన్నింటినో నోరార సుత్తించును నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు యిచ్చాటకు వచ్చి యున్నాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము. అని గోపికల్లెలరు స్వామిని వేడుకొన్నారు.

    అవతారిక : ---

 

 

Tiruppavai Devotional magzine part 24,  tiruppavai description , tiruppavai meaning with pictures, tiruppavai puja

 

 



ప్రవత్తి చేసిన వారికి పరమ సులభుడు పరమాత్మ! ఆశ్రితులకు కొంగు బంగారమే! గోపికలంతా తన్ను తన తిరుమాళిగనుంచి వీరసింహము వోలె నడిచివచ్చి సింహాసనాన్నదిష్టి౦పమని కోరినట్లే స్వామి చేశాడు. స్వామి యందు భక్తులకు ప్రేమ అధికమైనపుడు భక్తసులభుడైన స్వామి వారేది చెపితే అదే చేస్తాడుకద! అలా సింహగమనంతో వచ్చిన స్వామిని చూచిన గోపికలు 'అయ్యో! స్వామికెంత శ్రమ కలిగినదో!' అని అందోళనపడి అత్యంత భక్తీ ప్రవత్తులతోను, వాత్సల్యంతోను స్వామి పాదాలకు మంగళా శాసనం చేయడానికి సిద్ధపడి, తాము వచ్చిన పనిని మరచిపోయారు. స్వామి దివ్యమంగళ వోగ్రహాన్ని దర్శించిన ఆనందంతో మంగళాసనం పాడారు యీ (పాశురంలో)

        (షణ్ముఖప్రియరాగము __ అదితాళము)

  
  ప ..     మంగళమగుగాక! జయమంగళం

    అ...ప..    మంగళమగుగాక! శ్రీ పాదములకు
   
1.    చ..    లోకములలనాడు గొలిచిన పదములకు
        లంక గెల్చిన యట్టి రాముధీరతకు
        శకటాసురుని గూల్చు నీ యశః ప్రభలకు
        అకట వత్సాసురుని విసిరినా పడమూలకీల

2.    చ...    గోవర్దనాద్రినిన్ గొడుగుగా నెత్తిన
        అవతారుడ! నీ కృపా రసమునకు
        అవని శాత్రవుల నవలీలగా ద్రుంచు
        దివ్యాయుధమును నిత్య మంగళము   
   
3.    చ....    ఈ విధిన్ మంగళాశాసము జేసి
        నీ వీర గాథలే పాడి. కొనియాడి   
        నీ వోసగు వరములకు నిను జేరితమి నేడు.
        ఆ వాద్య మొసగుమా! దాసుల బ్రోవుమా...

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్


More Tiruppavai