తిరుప్పావై రెండవరోజు పాశురం

 

 

 

2.పాశురము :

    వైయత్తు వాళ్ వీర్ గళ్! నాముమ్ నమ్బావైక్కు
    శేయ్యుం కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్
    పైయ త్తుయిన్ఱ పరమనడిపాడి
    నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి
    మైయిట్టెళుదోమ్ మలరిట్టు నామ్ ముడియోమ్
    శెయ్యాదన శెయ్యోమ్ తీక్కుఱళైచ్చెన్ఱోదోమ్
    ఐయముమ్ పిచ్చైయుంఆన్దనై యుంకైకాట్టి
    ఉయ్యుమాఱెణ్ణి యుగన్దేలో రెమ్బావాయ్.


భావము : భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవతులారా! మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యముల వినుడు. శ్రీ మన్నారాయణుని పాదారవిందాలకు కీర్తిస్తాము. అతనితో కల్గిన విశ్లేష సమయాన ఇతరములైన ఎట్టి భోగ్య విషయాలను తలచము. పాలను త్రాగము. కన్నుల కాటుక నుంచము. నేతిని భుజింపము. సిగలో పూలను దాల్చము. అనగా శాస్త్ర విరుద్దములైన ఎట్టి పనులను చేయము. ఒకరిపై చాడీలను చెప్పము. సత్పాత్రదానము చేతము. సన్యాసులకును, బ్రహ్మచారులకును సత్పత్రదానము చేతుము. ఇంకను ఉజ్జీవించు మార్గములేవైన యున్న వాని నెరిగి సంతోషముతో నాచరింతుము. ఇట్లు యీ ధనుర్మాస కాలమంతయు కొనసాగింతుము. ఇదియే మన వ్రతము.

    అవతారిక :

 

 

IMPORTANT ARTICLE ABOUT THE SECOND PASURAM ANDAAL EMPHASISES ON THE MONTH OF MARGASIRA   DHANURMASAM AS AUSPICIOUS FOR WORKSHIP NARAYANA

 


ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తోంది. శ్రీ కృష్ణునికి అంకితంకావటమే ముఖ్యమైన నియమం. భక్తిలేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణునికి అంకితం కావటం ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులూ, నియమాలూ అంటూ ఏమీలేవు. శ్రీ కృష్ణుని యందు ప్రీతితో యేది చేస్తే అవేనియమాలు అంటుంది గోద.

    2వ మాలిక

    (మధ్యమావతి రాగము - ఆదితాళము)


ప..    వినుడోయమ్మ! వినుడు
    భూమిని సుఖముల బడయ దలచిన
    భాగ్యవతులార! వినుడు
    వినుడోయమ్మ!వినుడు
అ..ప..    మన నోముకుచేయదగిన కృత్యముల మేము చెప్పెదము వినుడు
    వినుడోయమ్మ వినుడు
1. చ..    పాలకడలిపై పవళించిన స్వామి - పరమాత్ముని పాదముల కామించి   
    పాడిపాడి ఉజ్జీవించు విధమెరిగి - పరమ పవిత్రులె కావలె వినుడు
2. చ...    పూజ్యులకు భిక్ష, పేదకు దానము - పొసగ జేయవలె నిరతమును
    సృతమానము, పాలను ద్రావము - పగటుగా కనుక కాటుక దీర్పము
3 చ..    ప్రాతఃకాలము నీరాడుదుము - పగటుగా కనుక కాటుక దీర్పము
    పూవులతోడ కురులనే ముడువము
    పెద్దలు చేయని పనులను చేయము
    మిత్రం చేయగరాని పనలనే చేయము
    చేటు మాటలను చెప్పగబోము
    చేరదలచు నా గమ్యము వీడము
    చేరగ శ్రీ పతి వేడుకొందుము
    వినుడోయమ్మ! వినుడు

- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్

శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రంగనాథ్


More Tiruppavai