ఆలోచన చేసే మాయ ఎలా ఉంటుంది?

"మనిషి తను మనసులో ఏది ఆలోచిస్తాడో అదే విధంగా మారుతాడు" అన్న నానుడి, తన మొత్తం శరీరానికే కాదు, సంపూర్ణంగా తన జీవితంలోని ప్రతి పరిస్థితికీ వర్తిస్తుంది. ఒక మనిషి తను ఏది ఆలోచిస్తాడో ఖచ్చితంగా అది అతని వ్యక్తిత్వం అతని ఆలోచనల సమాహారమే.

విత్తనం లేకుండా మొక్క ఎలా అయితే మొలకెత్తదో అదే విధంగా మనిషి చేసే ప్రతి చర్యా అతని ఆలోచనల పర్యవసానమే. ఆలోచన లేకుండా ఏ పనీ జరగదు. ఇది ఒక ప్రణాళికా బద్ధంగా చేసే పనులకే కాకుండా, అనాలోచితంగా చేసే అన్ని పనులకూ వర్తిస్తుంది.

ఆలోచనా పుష్పమే చర్య. బాధ సంతోషాలు దాని ఫలాలు. ఈ విధంగా మనిషి తన స్వయంకృతంతో తీపి మరియూ చేదు ఫలసాయం చేసుకుంటున్నాడు.

మనసులో ఆలోచనే మనను తయారు చేసేది. నిర్మాణమైనా, లేదా ధ్వంసమైనా అది మన ఆలోచనా ఫలితమే! ఎద్దు వెనక ఎలా ఐతే చక్రం నడుస్తుందో అలాగే మనిషి దురాలోచన వెనకనే అతని బాధ కూడా వెంబడిస్తుంది. అదే తన ఆలోచన మంచిదైతే సంతోషం తన నీడలా ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది.

మనిషి మంత్రాలతో పుట్టుకురాలేదు, ఒక పద్ధతి ప్రకారం ఎదుగుతాడు. చర్య మరియు దాని ఫలితం బాహ్య ప్రపంచంలో ఎంత ఖచ్చితంగా కనిపిస్తుందో ఏ మార్పు లేకుండా అంతే ఖచ్చితంగా మనస్సు అంతరాళంలోనూ ఉంటుంది. 

ఉన్నతమైన, దివ్యమైన వ్యక్తిత్వం దయతోనో లేదా అదృష్టంతోనో వచ్చేది . కాదు. అది వీలయ్యేది ఒక ఆశయం కోసం, దివ్యమైన అలోచనలను కలిగి ఉండి అలుపెరుగని కృషి చేయడం వల్లనే. అదే విధంగా చెడు అలోచనలతోనే సమయాన్ని గడిపితే వచ్చే ఫలితమే నీచమైన పశువులాంటి వ్యక్తిత్వం.

తన ఉన్నతికీ, నాశనానికి మనిషే కారకుడు. తన ఆలోచన అనే కర్మంలో తనను తాను నాశనం చేసుకునే ఆయుధాలు తయారు చేసుకుంటున్నాడు. కానీ అదే చోట తనకు శాంతినీ, శక్తినీ మరియూ సంతోషాన్నీ కలిగించే దివ్య సౌధాలు నిర్మించేందుకు కావలసిన పనిముట్లనూ తయారు చేసుకుంటున్నాడు. సరైన ఆలోచనలను సవ్యంగా క్రమ పద్ధతిలో వాడుకుని మానవుడు దివ్యమైన, పరిపూర్ణమైన వ్యక్తిత్వం వైపు ఎదుగుతాడు. అదే దురాలోచనలను ఇష్టారాజ్యంగా మనసులోనికి రానిస్తే మృగం కంటే దిగజారిపోతాడు. ఈ రెండు హద్దుల మధ్యనే మిగిలిన అన్ని వ్యక్తిత్వాలు ఉంటాయి. వాటిని తయారు చేసేదీ మరియూ శాశించేదీ మానవుడే.

ఆత్మకు సంబంధించి కనుగొనబడిన అన్ని నిజాలలో అతి అందమైనదీ, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి జాగ్రత్తగా కాపాడబడినదీ ఇదే తన ఉనికికీ, అభివృద్ధికీ, పరిసరాలకీ, తన వ్యక్తిత్వ వికాసానికీ, గమ్యానికీ మనిషే ప్రధాన కారణం. దీనికి మించిన ఖచ్చితమైన, సంతోషకరమైన దివ్యత వాగ్దానం మరొకటి లేదు.

శక్తి, తెలివితేటలు, ప్రేమ కలిగి ఉండడం వలన, తన ఆలోచనలపై ఆధిపత్యం ఉండడం వలన మనిషి చేతిలో అతని ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంది. దీనితో పాటూ మనిషి తనకు తాను ఉన్నత స్థితికి చేరుకునేందుకు, కావలసిన విధంగా రూపొందించుకునేందుకు అవసరమైన శక్తినీ కలిగి ఉన్నాడు.

మానవుడు ఎప్పుడూ తన పరిస్థితికి తనే మాస్టర్, కాని తన బలహీన క్షణాలలో, దిగులుగా ఉన్నప్పుడు అతనొక మూర్ఖపు మాస్టర్. ఒక మూర్ఖుడు. ఎలా అయితే తన ఇంటిని పాడు చేసుకుంటాడో తన స్థితిని కూడా అలాగే పాడు చేసుకుంటాడు. కానీ తను ఎప్పుడైతే తన స్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టి తన స్థితికి కారణాలు వెతికి తన అస్తిత్వం దేని మీద ఆధారపడి ఉందో తెలుసుకున్న మరు క్షణం వివేకవంతమైన మాస్టర్గా మారి ఫలప్రదమైన విషయాలవైపు తన శక్తి యుక్తులను మళ్ళించి విజయాన్ని సాధిస్తాడు. మానవుడు తన అంతర్గత శక్తులను వాటి సూత్రాలను ఎప్పుడైతే కనుగొంటాడో అప్పుడే ఒక చైతన్యవంతమైన మాస్టర్ గా మారుతాడు. అలా మారడానికి కావలసినవి స్వవిశ్లేషణ, దాని ద్వారా నేర్చుకున్నదాన్ని ఉపయోగించడం అనుభూతి అవుతుంది. ఇదీ ఆలోచన పర్యావసానం.

                                ◆నిశ్శబ్ద.


More Subhashitaalu