డబ్బు కొరతతో ఇబ్బంది పడేవారు.. గురువారం ఇలా చేయాలి..!

 


వారంలోని ఏడు రోజులూ ఏదో ఒక దేవత పూజకు ప్రసిద్ధి చెందాయి. ఆ రోజు పూజలు,  శ్లోకాల పఠనం ద్వారా దేవుడి నుండి ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది. ఇక వారంలో  గురువారం నాడు విష్ణువును పూజించడం, ఉపవాసం ఉండటం ద్వారా భక్తుల  జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయని అంటారు.  అంతేకాకుండా లక్ష్మీ ఆశీస్సులు కూడా లభిస్తాయి. సాధారణంగా గురవారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు.  ఇక జ్యోతిషశాస్త్రంలో గురువారం  బృహస్పతితో ముడిపడి ఉంటుంది. ఈ రోజున చేసే పూజ జాతకంలో గురువు స్థానాన్ని బలపరుస్తుందని, దీని కారణంగా  వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి, ఇంట్లో ఆనందం,  శ్రేయస్సు నెలకొంటాయి.

ఏం చేయాలి..

గురువారం నాడు వీలైనంత ఎక్కువగా పసుపు రంగు వస్తువులను వాడాలి. ఇలా చేయడం వల్ల వివాహంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.

జ్యోతిష్యుల ప్రకారం, గురువారం నాడు ఒక ముద్ద పిండిలో పప్పు, బెల్లం,  పసుపు కలిపి ఆవుకు తినిపించాలి. ఈ పరిష్కారంతో సాధకుడి సంపద పెరుగుతుందట.

గురువారం నాడు విష్ణువు,  లక్ష్మీ దేవిని కలిసి పూజించాలి. పూజ సమయంలో శక్తివంతమైన మంత్రాలను జపించండి. దీనివల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు.

ఈ రోజున పసుపు వస్తువులను దానం చేస్తే  విష్ణువు సంతోషిస్తాడు, దీని ప్రభావం వల్ల భక్తుడి అన్ని దుఃఖాలు తొలగిపోతాయి.

గురువారం నాడు విష్ణువును పూజించాలి.  పూజ తర్వాత,  మణికట్టుపై పసుపు తిలకం వేయాలి. దీనివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురువారం నాడు బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేయాలి. తరువాత 'ఓం బృహస్పతే నమః' అనే మంత్రాన్ని జపించాలి. దీనితో జీవితంలో జరుగుతున్న అన్ని సమస్యలు ముగింపు దిశగా వెళ్ళడం  ప్రారంభిస్తాయి.

గురువారం ఉదయం,  సాయంత్రం విష్ణువును పూజించాలి. పూజ చివరిలో  విష్ణువుకు హారతి ఇవ్వాలి.  హారతి శ్లోకాలను భక్తితో,  తమ సమస్యలు తొలగించమని ఆర్తితో ఆలపిస్తూ హారతి ఇవ్వాలి.  ఇలా చేస్తే విష్ణువు అనుగ్రహిస్తాడు.

                                         *రూపశ్రీ.


More Subhashitaalu