శనివారం ఈ ఒక్క పని చేస్తే చాలు ఎంత చెడు దృష్టి అయినా వదిలిపోతుందట..!

 


చెడు దృష్టి మనిషిని ఎదగనివ్వదు.  సంతోషాన్ని హరిస్తుంది. మనఃశాంతి లేకుండా చేస్తుంది.  మొత్తం కుటుంబాన్ని, ఇంటిని ఎప్పుడూ సమస్యలతో కొట్టుమిట్టాడేలా చేస్తుంది.  నిజానికి చెడు దృష్టి ఒక కుటుంబం మీద లేదా వ్యక్తి మీద ఉంది అంటే అది శనిదేవుడి ప్రభావం అని అర్థం చేసుకోవచ్చు. చాలామందికి జీవితంలో ఏర్పడే చెడుకు శని దేవుడు బాధిస్తున్నాడు అని  అంటుంటారు. అయితే శనిదేవుడు చాలా మంచివాడు.  ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే ఎంతో బాదతో గడవాల్సిన కాలం అంతా చాలా తక్కువ సమస్యలతో గడిచిపోయేలా చేస్తాడు.  శనివారం శనిదేవుడిని పూజించాలని చెబుతుంటారు.  శనివారం కొన్ని పనులు చేయడం వల్ల శనిదేవుడి ప్రభావం తగ్గి జీవితంలో చెడు రోజులు తొలగుతాయి.  ఇందుకోసం ఏం చేయాలంటే..

ఆవనూనె..

ఆవనూనెను ఒకప్పుడు దీపాల కోసం విరివిగా ఉపయోగించే వారు.  కొన్ని రాష్ట్రాలలో ఆహారం వండటానికి కూడా ఉపయోగిస్తారు.  అయితే ఆవనూనెను శనిదేవుడి ఆరాధనలో ఉపయోగిస్తే శనిదేవుడు తృప్తి చెంది తన చెడు దృష్టిని తగ్గిస్తాడని చెబుతారు.

దీపం..

ఆవనూనెతో శనిదేవుడికి దీపం వెలిగించడం వల్ల చాలా ప్రతికూలతలు తొలగుతాయి.  దీపం వెలిగించేటప్పుడు "ఓం శం శనైశ్చరాయ నమః" అని 108 సార్లు శనిదేవ జపం చేయడం వల్ల మరింత మంచి ఫలితం ఉంటుంది.

అభిషేకం..

సాధారణంగా శని దేవుడికి నువ్వుల నూనె అభిషేకం చేస్తుంటారు. కానీ శని దేవుడికి ఆవ నూనెతో అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.  ముఖ్యంగా జాతకంలో శని మహాదశ,  శని దశ,  ఏలినాటి శని.. లాంటివి ఉన్నవారు జీవితంలో చాలా కష్ఠాలు అనుభవిస్తుంటారు. ఇలాంటి వారు ప్రతి శనివారం శనిదేవుడికి ఆవాల నూనెతో అభిషేకం చేస్తే జీవితంలో మార్పులు చేసుకుంటాయి.

చెడు దృష్టి పోవాలంటే..

ఎవరైనా చెడు దృష్టితో బాధపడుతుంటే ఆరోగ్యం బాగాలేకపోవడం,  ఏ పని కలిసిరాక పోవడం, ఇంట్లో అకారణంగా గొడవలు కావడం వంటివి  జరుగుతుంటాయి.  ఇలాంటి వారు ఒక పెద్ద ప్రమిదలో ఆవాల నూనె పోసి అందులో నువ్వులు,  లవంగం వేసి దీపం వెలిగించాలి.  ఈ దీపాన్ని ఇల్లంతా ఏడు సార్లు తిప్పాలట.  ఇలా చేస్తే చెడు దృష్టి మొత్తం వదిలిపోతుంది చెబుతారు.

నల్ల కుక్క..

శనివారం రోజు నల్ల కుక్కకు రొట్టెలు ఆహారంగా పెట్టడం వల్ల కూడా శని దోషం తగ్గుతుందని చెబుతారు.  ముఖ్యంగా ఉద్యోగం విషయంలో ఇబ్బందులు ఎదుర్కునేవారు ఇలా చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయట.

                                                       *రూపశ్రీ.
 


More Subhashitaalu