కార్తీక మాసం... శ్రీ మహాలక్ష్మీదేవీ పూజ

 

ఎలా..?!!

 

 

Karthika Maasam Pooja Procedure Lakshmi Devi Pooja in Telugu

 

దీపం అంటే లక్ష్మీదేవి. ఆ దేవికి సంప్రదాయబద్దంగా పూజలు చేయడం ఆనవాయితి. సర్వసంపదలు అందించే లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. ఆమె ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు సర్వశుభ లక్షణాలతో, సర్వసంపదలతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది.లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. అష్టలక్ష్మీ రూపాల్లో కొలుస్తారు. దీపావళినాడు శ్రీమహాలక్ష్మీ పూజ అత్యంత విశేష ఫలితాలు ఇస్తుంది. పండుగనాటి రాత్రి శ్రీమహాలక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. లక్ష్మీదేవికి గురు, శుక్రవారాలు ప్రీతికరమైనవి. అమ్మను ప్రతిరోజూ ధ్యానిస్తే మనోవాంఛితాలు నెరవేరుతాయి. రోజూ కుదరనివారు కనీసం వారంలో ఆరెండు రోజులైనా అష్టోత్తర, సహస్ర నామాలతో ధ్యానించాలి. దీపావళినాటి పూజ మరింత విశిష్టమైనది.

నిప్పు, నూనె, వత్తి....

 

 

Karthika Maasam Pooja Procedure Lakshmi Devi Pooja in Telugu

 

 

నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి.

సృష్టి ...

 

 

Karthika Maasam Pooja Procedure Lakshmi Devi Pooja in Telugu

 

 

దీనిలోని జీవకోటి రాజస, సాత్విక, తాపన గుణాలతో కూడికున్నవి. ప్రమిదలో వత్తిలాంటిది సత్వగుణం. నూనె లాంటిది తమోగుణం. మంట లాంటిది సత్వగుణం, నూనెలాంటిది తమోగుణం. మంటలాంటిది రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు. కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. మంచిమనిషిగా ఉండాలనుకున్న వారు రజస్, తమో గుణాలని అణచివేసి సత్త్వగుణం ఎక్కువుగా అలవరుచుకోవాలి. అప్పుడా వ్యక్తి జీవితం కాంతిమయమవుతుంది. రాగద్వేషాల్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది.


More Lakshmi Devi