లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి..!
లక్ష్మీదేవి అంటేనే శుక్రవారం అని చెప్పేస్తారు చాలామంది. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం ప్రతి ఇంట్లో చూస్తుంటాం. లక్ష్మీదేవి కేవలం ధనాన్ని, ధనానికి సంబంధించిన సమస్యలకు మాత్రమే కాదు.. లక్ష్మీదేవిలో అష్ట లక్ష్ములు ఉంటారు. ఈ రూపాలన్నీ అమ్మవారిలో ఉండే శక్తులే.. అమ్మవారి కరుణ ఉంటే జీవితంలో అన్నీ లభిస్తాయి అంటారు. అయితే లక్ష్మీదేవిని ఆర్థిక సమస్యల కోసం ఎక్కువగా పూజించడం చూడవచ్చు. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించే విధానం మీద ఆర్థిక సమస్యల పరిష్కారాలు ఆధారపడి ఉంటాయి. శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయో తెలుసుకుంటే..
శుక్రవారం రోజున లక్ష్మీ దేవిని తగిన ఆచారాలతో పూజిస్తే, ఆ వ్యక్తి కోరికలన్నీ నెరవేరడమే కాకుండా, జాతకంలో శుక్రుడి స్థానం కూడా బలపడుతుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, శుక్రుని స్థానం బలంగా ఉన్నప్పుడు, వ్యక్తి భౌతిక సుఖాలు పెరుగుతాయి. వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా ప్రజలు అందరూ ఇష్టపడేలా కూడా మారుతుంది. అందరూ ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ ఉంటారు.
శుక్రవారం రోజు లక్ష్మీదేవి పూజలో లక్ష్మీ చాలీసా పఠించాలని చెబుతున్నారు. అలాగే లక్ష్మీదేవి సహస్రనామాలు కూడా ఉంటాయి. వీటిని పఠించినా ఎన్నో ఆర్థిక సమస్యలు మంత్రించినట్టు మాయం అవుతాయి. లక్ష్మీదేవికి శుభ్రత అంటే ఇష్టం. అందుకే ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. గడపలో లక్ష్మీదేవి నివాసం ఉంటుందని అంటారు. అలాగే తులసి లో కూడా లక్ష్మీదేవి ఉంటుందని చెబుతారు. అందుకే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేయాలి. అలాగే తులసి కోట చుట్టూ శుభ్రం చేసి ముగ్గు వేయాలి. పూజలో లక్ష్మీ చాలీసా లేదా లక్ష్మీ సహస్రనామాలు పఠించాలి. ఇవి మాత్రమే కాకుండా.. లక్ష్మీదేవి ముందు పచ్చ కర్పూరం ఉంచి లక్ష్మీ చాలీసా లేదా లక్ష్మీ సహస్ర నామాలు పఠించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి.
*రూపశ్రీ.
