ఈ జ్యూసులు తాగితే సన్నబడటం ఖాయం!     బరువు తగ్గడం పెరిగినంత తేలిక కాదు. నోరు కట్టేసుకుని, కడుపు కాల్చుకుని ఎంత కష్టపడినా తగ్గని బరువును చూసి తెగ బెంగపడుతుంటారు చాలామంది. అలాంటివారికి డాక్టర్లు ఓ శుభవార్త చెబుతున్నారు. నోటికి రుచిగా కొన్ని జ్యూసులు తాగుతూ కూడా బరువు తగ్గొచ్చంటున్నారు. ఇదిగో... ఇవే ఆ జ్యూసులు. - గోరువెచ్చని నీళ్లలో ఆరెంజ్ జ్యూస్ కలుపుకుని, కొద్దిగా తేనె చేర్చి తాగుతూ ఉంటే క్రమక్రమంగా బరువు తగ్గుతారట.   - పైనాపిల్ జ్యూస్ ఆకలిని తగ్గిస్తుందట. కాబట్టి రోజుకోసారి పైనాపిల్ జ్యూస్ తాగితే ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు. - ద్రాక్షపండ్ల రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుందట. - నిమ్మరసంలో ఉప్పు, తేనె చేర్చి పరగడుపున తాగినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. - జామకాయలో ఉండే విటమిన్ సి బరువును తగ్గించడంలో ఎక్స్ పర్ట్. - అవకాడో జ్యూస్ క్యాలరీలను కరిగిస్తుంది. - టొమాటోలను ఉడికించి, గ్రౌండ్ చేసి, కొద్దిగా బెల్లం కలుపుకుని మూడు పూటలా తాగినా మంచి ఫలితముంటుంది.     చూశారు కదా? రుచికి రుచి... మంచికి మంచి. కాబట్టి తరచూ ఈ ఫ్రూట్ జ్యూసులు తాగండి. అయితే ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి. ఎప్పుడూ ఎందులోనూ పంచదార మాత్రం కలపవద్దు. కలిపారో... జ్యూస్ తాగడం వల్ల ఏ ఉపయోగం ఉండదు.  -Sameera  

శరీరానికి రక్ష..... ద్రాక్ష     నల్ల ద్రాక్ష... శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. చర్మానికి జీవకళను తెచ్చిపెడుతుంది. అలాగే జుట్టుకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకలకు మంచి పోషణనిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ద్రాక్షలో పండ్లలో ఉండే పాలిఫినాల్స్ శరీరంలోని కొల్లాజిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చర్మాన్ని వాడిపోకుండా రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మానికి నిగారింపు తెస్తుంది. ఇక బరువు తగ్గాలనుకునే వారికి ద్రాక్ష పండు చాల మంచివి. ఈ పండ్లు శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపిస్తాయి. కొవ్వు పట్టకుండా చూస్తాయి. కనుక లావుగా ఉన్న వారు వీటిని ఎన్ని తిన్నా లాభమే కానీ, ఎలాంటి నష్టం ఉండదు. ఇందులో ఫైటో కెమికల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. గుండెకు మేలు చేస్తోంది. ఇందులో ఉండే కొన్ని పోషకాలు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. నల్లద్రాక్ష ఆరోగ్యానికి అన్నివిధాలా సహకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతుంది.  అధికరక్తపోటును నియంత్రణలో ఉంచుతుందని వైద్యులు చెబుతున్నారు. చదువుకునే వయసులో ఉన్న పిల్లలకు వీటిని తరుచూ తినిపిస్తూ ఉంటే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తీ మెరుగవుతుంది. ఉన్నట్టుండి నీరసంగా  కళ్ళు తిరిగినట్టు అనిపించడం ఈ వేసవిలో చాల మందికి ఎదురయ్యే సమస్య శరీరం బలహీనంగా ఉండడం రక్తలేమి విటమిన్ల లోపం , ఎండలో ఎక్కువ తిరగడం వంటివన్నీ ఇందుకు కారణాలుగా చెప్పుకోవచ్చు. అలాంటపుడు ఈ నల్ల ద్రాక్ష రసం తాగి చుడండి ,తక్షణ శక్తి శరీరానికి అందుతుంది.

  బరువు తగ్గాలంటే ఇవి తాగాల్సిందే!     పెరిగినంత త్వరగా తరిగేది కాదు బరువు. కాస్త జంక్ ఫుడ్ తింటే వచ్చేసే ఒళ్లు... నానా తంటాలు పడినా తగ్గదు. ఎక్సర్ సైజులనీ, డైటింగనీ ఎంత కష్టపడాలో. అయితే మీ కష్టాన్ని తగ్గించే మార్గం ఒకటుంది. రోజుకొకటి చొప్పున కొన్ని వారాల పాటు రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ జ్యూసులు తాగేయండి. ఫలితం మీకే తెలుస్తుంది. 1. నాలుగు టొమాటోలు, ఓ కీర దోసకాయ, గుప్పెడు కొత్తిమీర ఆకులు కలిపి మెత్తగా బ్లెండ్ చేయాలి. దీనిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి కలిపి తాగాలి. 2. ఒక బీట్ రూట్, ఒక కట్ట పాలకూర, గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని నీటితో కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కాస్తంత ఉప్పు కలిపి సేవించాలి. 3. ఓ యాపిల్, ఒక అరటిపండు, నీళ్లు కలిపి జ్యూస్ లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం పిండి, చిటికెడు ఉప్పు వేసి తాగేయాలి.     4. క్యారట్, బీట్ రూట్, క్యాప్సికమ్ ఒక్కోటి చొప్పున తీసుకోవాలి. వీటిలో కొన్ని నల్లద్రాక్షలు, చిన్న అల్లం ముక్క కూడా వేసి మిక్సీ పట్టాలి. దీనిలో నీళ్లు కలిపి పల్చగా చేసుకుని తాగాలి. 5. పుచ్చకాయ, పుదీనాలను నీళ్లతో కలిపి మిక్సీలో వేసి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా నిమ్మరసం, కాసింత మిరియాల పొడి వేసి సేవించాలి. 6. యాపిల్, కీరా, పాలకూరల్ని నీళ్లతో కలిపి జ్యూస్ చేసుకోవాలి. దీనిలో కాస్త నిమ్మరసం, ఉప్పు కూడా కలిపి తాగాలి. 7. టొమాటోలు, పాలకూర, క్యారెట్, మిరియాలు, ఉప్పు కలిపి చేసిన జ్యూస్ కూడా ఎంతో మంచిది.     ఈ ఏడు జ్యూసుల్నీ రోజుకొకటి చొప్పున తాగి చూడండి. శరీరంలోని అదనపు కొవ్వు కరిగిపోయి మెల్లమెల్లగా బరువు తగ్గిపోతారు. శరీరంలో తేమ పెరిగి చర్మం తళుకులీనుతుంది. ఒంట్లో శక్తి పుంజుకుంటుంది. అయితే ఒకటి. తాగలేకపోతున్నాం అని వీటిలో చక్కెర మాత్రం కలపకండి. కలిపారో... ఇక ఇవి తాగడం వల్ల ఉపయోగం ఉండదు. - Sameera  

Cinnamon and Honey have Some Unbelievable Benefits!     There are a number of health benefits of honey and cinnamon which include a strong immune system, digestive system, healthy heart, bones, skin, teeth, and hair, weight loss, itching, and arthritis. Honey comes with a number of health benefits when consumed individually, and when consumed in combination with a number of food items, the most useful combinations are formed with cinnamon, ginger, and milk. Both honey and cinnamon are individually used for dental care. A mixture prepared from the two is also useful in dental care, particularly in removing bad breath and toothache.   Honey and cinnamon can help bring down high blood pressure numbers when used consistently. Since high blood pressure is a precursor to serious heart problems, it’s important to keep your blood pressure at healthy levels. Honey has been shown to help prevent blood pressure from getting to high levels. Cinnamon has been shown to actually lower blood pressure when it has reached higher than desired levels. The combination of the two means you’re getting both preventive and immediate help for high blood pressure.   This mixture has been found to manage the pain caused by arthritis. Research also shows that a lot of people said that it has provided them a relief from the pain they have had for years. You should consume this mixture of 1 Cup of hot water 2 Teaspoons of honey 1 Teaspoon of cinnamon daily both in the morning and evening as well. It could be the anti-inflammatory properties of each item that cuts down their pain.   Many people have found that taking the mixture of honey and cinnamon can build up your vitality in about a week. The honey will give you a nice little boost without raising your blood sugar levels and you won’t have to worry about a jittery feeling like you would get from coffee. Use 1/2 Tablespoon of honey, a glass of water, a little bit of cinnamon sprinkled on the top. Just keep a container of this aromatic spice and a jar of organic honey at work and you can sip on a nice cup of tea in the afternoon. You’ll definitely feel refreshed.   One of the most intriguing benefits of using honey and cinnamon is the potential to ward off cancer with them. Research on a mixture of both is largely nonexistent, but studies have been done on the individual ingredients and the results are promising. Cinnamon alone has been touted as an anti-cancer spice, and honey has also gotten its fair share of attention as being helpful in fighting off cancer. When the two are mixed together you are getting the benefit of both at the same time, doubling the potency. It’s important to remember that these sort of results don’t appear overnight or from a one-time use. You’ll need to use this every day in order to reap the long-term benefits. ..Divya

  కోల్డ్ అనేది సర్వ సాధారణమైన లక్షణం. ఇది పెద్ద జబ్బేం కాదు, అయితేనేం పట్టిందంటే పీడిస్తుంది. తెగ సతాయిస్తుంది. జలుబు చేసేది ముక్కుకే అయినా ముఖమంతా ఏదో పాకుతున్నట్టు యమా చేరాకేస్తుంది. కోల్డ్ వల్ల శరీరమంతా అలసిపోయినట్టు అవుతుంది. మనసు స్థిమితంగా ఉండదు. తిండి తినాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు. నిద్ర పట్టడం కష్టమౌతుంది. ఇంత ఇబ్బంది పెట్టే కోల్డ్ గురించి ఓ నానుడి ఉంది. దీనికి మందు వాడకపోతే ఏడు రోజుల్లో తగ్గుతుంది, వాడితే వారంలో తగ్గుతుంది- అని. అంటే కోల్డ్ కు ఔషధం వేసుకున్నా లాభం లేదనేది తాత్పర్యం. అనేకమంది అనుభవాలు ఆ మాట నిజమే అనిపించేలా చేశాయి. అలాగని మెడిసిన్లు వేసుకోకుండా కోల్డ్ ను ముదరబెట్టుకుంటే ఆనక బాధపడక తప్పదు. దీర్ఘకాలంపాటు జలుబు కనుక తగ్గకపోతే, అది న్యుమోనియాకు దారితీస్తుంది. పూర్వకాలం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు కోల్డ్ కు చాలానే మందులున్నాయి. మందుల సంగతి అలా ఉంచితే అనేక గృహ చిట్కాలు కూడా ఉన్నాయి.  పసుపు, పటిక బెల్లములను సమంగా తీసుకుని నిప్పుల మీద వేసి ఆ పొగను పీల్చినట్లైతే పడిశం సమస్య నివారణ అవుతుంది. మిరియాలను నూరి, బెల్లంతో కలిపి ముద్దగా చేసి తింటే కోల్డ్ తగ్గుతుంది. ఒకవేళ అది మరీ ఘాటుగా ఉంటుంది, తినలేము అనుకుంటే వేడి పాలలో మిరియాల పొడి వేసుకుని తాగినా ఫలితం ఉంటుంది.  గులాబీ రేకలను నువ్వుల నూనెలో మరిగించి , దించి వడపోసి నిలువ చేసుకోవడం ఇంకో పధ్ధతి. ఈ గులాబీ తైలాన్ని రెండు పూటలా రెండు చుక్కలు ముక్కులో వేస్తే, జలుబు తగ్గుతుంది. తుమ్ములు కూడా అరికడతాయి.కొందరికి డస్ట్ ఎలర్జీల్లాంటివి ఉంటాయి. పిండి, కారం లాంటివి జల్లించినా, కాస్త అటక దులిపినా వెంటనే ఎలర్జీ బయటపడిపోతుంది. ఆఖరికి సాంబ్రాణి పొగ కూడా పడనివారు ఉంటారు.  అలాగే కొందరికి ఎండలో తిరిగితే వెంటనే ఎలర్జీ వస్తుంది. మరి కొందరికి కొన్ని వాసనలు సరిపడవు. ఇంకొందరికి కొన్ని పదార్ధాలు తింటే ఎలర్జీ వస్తుంది. వీళ్ళందరికీ దాదాపుగా కోల్డ్ మొదటి లక్షణంగా ఉంటుంది. కనుక ఏది సరిపడటంలేదో, దానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ముక్కు అంటూ ఉన్నాక జలుబు చేయకుండా ఉండదు. కానీ చీటికిమాటికి కోల్డ్ వస్తుంటే ఆలోచించాల్సిందే. డాక్టర్ను సంప్రదించాలి. రెసిస్టేన్స్ పవర్ తగ్గితే కూడా త్వరగా కోల్డ్ చేస్తుందని గ్రహించాలి. మొత్తానికి ఎక్కువకాలం పాటు రొంప వదలకుండా బాధిస్తుంటే, లోపల ఏదో అనారోగ్యం పొంచి ఉందని గ్రహించి తగిన శ్రద్ధ తీసుకోవాలి.  

Diet mistakes which ruin your weight loss journey     The sole aim of a good diet is to get fit and healthier. When you're working hard to achieve results, its important to make sure that you're not falling victim to these common dieting mistakes. Avoiding lentils is something that a lot of people do to lose weight, but do you know that it could be detrimental to your weight loss journey? You could be tricked into believing that legumes such as lentils, beans, and chick peas were bad for you. The theory that legumes are loaded with phytate and lectins (which make them hard to digest) is hard to ignore. That is, until you realise that you can neutralise these compounds simply by soaking legumes overnight in water.   The most vital meal of the day is your breakfast. The cliché is true: it's so important to start the day with a healthy meal, because research shows a good breakfast both boosts your metabolism and keeps you more satisfied throughout the day. And that means less reaching into the snack stash. Skipping meals may seem like a good way to skimp on calories, but it actually can lead you to eat more later on. If you don't eat lunch, for instance, you might overcompensate at dinner thinking you deserve the extra calories. Eat when you're hungry to keep hunger and portions in check.     A crash diet is a complete No No. It's tempting to try a restrictive diet when you want to quickly drop a few pounds. And although you may lose a bit of weight in the short term, you're doing more damage to your body in the long run. Also just because a food is healthy doesn’t mean you can eat a mountain of it. Switching from white rice to quinoa, eating nuts instead of chips, using olive oil instead of processed mayo these are all healthy changes but they aren’t low-calorie substitutions. Remember, it is all about portions. Remember that 'health' goes far beyond the food you eat and the exercise you do. Yes, it’s about being active and vibrant. But it’s also about living a life without limits or restrictions. - Divya  

జాగో... జాగింగ్ కరో!   * జాగింగ్ అనేది చక్కని ఆరోగ్య ప్రక్రియ. జాగింగ్ వలన కొన్ని వారాలలోనే మీ శరీరం ఫిట్‌గా తయారవుతుంది. అయితే జాగింగ్ ప్రారంభించటానికి ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. * జాగింగ్ చేసేటప్పుడు మంచి దుస్తులు ఎంచుకోండి. మరీ బిగుతుగా ఉన్న వాటిని కాకుండా వదులుగా సౌకర్యవంతంగా ఉన్న వాటిని ధరించండి, పరిగెత్తటానికి మంచి షూలను వాడండి. షూ సరిగా లేనట్లయితే పరిగెత్తటానికి  సౌకర్యంగా ఉండదు. * జాగింగ్ ప్రారంభించటానికి ముందుగా, కొన్ని సులభమైన వ్యాయామాలను చేయండి. వీటిని వార్మప్ ఎక్సర్‌సైజులు అంటారు. వేగంగా నడవటం ప్రారంభించి, కొద్ది కొద్దిగా పరిగెత్తి, వేగంగా పరిగెత్తండి. వీటి వలన ప్రశాంతమైన జాగింగ్‌ని ఆస్వాదిస్తారు.  * సరైన పద్ధతిలో పరిగెత్తండి. సరైన విధంగా జాగింగ్ చేయకపోవటం వలన వెన్నునొప్పి లేదా వెన్ను సమస్యలు వచ్చే ఇబ్బంది వుంది. *  కాంక్రీటుతో చేసిన నేలపైన జాగింగ్ చేయకుండా గడ్డి ఉండే నేల పైన జాగింగ్ చేయటం వలన కాళ్ళ పైన ఒత్తిడి తగ్గుతుంది. జాగింగ్ చేయటానికి ముందుగా  నీటిని పుష్కలంగా తాగండి. వీలుంటే వాటర్ బాటిల్‌ని వెంట తీసుకెళ్ళండి. జాగింగ్ చేశాక వెంటనే ఆగకుండా నెమ్మదిగా వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా నడుస్తూ క్రమంగా ఆపేయండి.  *  రోజు జాగింగ్ చేయటం వలన జిమ్ చేసిన ఫలితాలను పొందుతారు. * జాగింగ్ ను ఉత్సాహవంతమైన నడకతో ప్రారంభించండి. * ప్రతిరోజూ 40 నిమిషాల జాగింగ్ వలన శరీర బరువు తగ్గుతుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రభావాలు కూడా తగ్గుతాయి. మానసిక ఒత్తిడి మాయమైపోతుంది. * జాగింగ్ వలన శరీర రక్త ప్రసరణ మెరుగు పడటమే కాకుండా గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి. * ప్రతిరోజూ జాగింగ్ చేయడం వలన వారం రోజులలో 1000 కేలరీలు వ్యయమవుతాయి.

మాతృత్వానికి మందు..ద్రాక్ష పండు     జీవితంలో ఎంత సాధించినా..ఏం చేసినా స్త్రీ జీవితానికి సార్థకతను ఇచ్చేది మాతృత్వమే. కానీ మారిన జీవన విధానాలు..యాంత్రిక జీవనం కారణంగా ఎంతో మంది మహిళలు మాతృత్వాన్ని అందుకోలేకపోతున్నారు.  ఆహారపు అలవాట్లతో పాటు ఎన్నో వ్యాధులు మహిళలకు తియ్యని ఆనందాన్ని దూరం చేస్తున్నాయి.   ముఖ్యంగా ఎండోమెట్రి యోసిస్‌తో ఆడవారి బాధ వర్ణనాతీతం. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ఎండోమెట్రియోసిస్ లక్షణాల్లో కొన్ని. గర్భం ధరించాలంటే పక్వదశలో ఉన్న అండాలను విడుదల చేయాల్సి ఉంటుంది..కానీ ఈ వ్యాధి కారణంగా అండాలు పక్వదశకు చేరకుండానే విడుదలవుతున్నట్లు పరిశోధనలో తేలింది. ఫాలికల్స్‌లో ఉండే ద్రవాల కారణంగా అండాలు దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.   మందులకు లొంగని ఈ వ్యాధిని ద్రాక్ష పండ్లు తినడం ద్వారా అరికట్టవచ్చు అంటున్నారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు..ఎలుకలకు అధిక మోతాదులో ద్రాక్ష పండ్లు ఇచ్చి వీరు చేసిన పరిశోధన సత్ఫాలితాల్ని ఇచ్చింది. మహిళలు వీలైనంత ఎక్కువగా ద్రాక్షపండ్లు తినడం ద్వారా శరీరానికి చేరే మెలటోనిన్ ద్వారా పరిస్థితిలో మార్పు వచ్చిందట.   అలాగే సంతానం లేని స్త్రీలు కిస్‌మిస్ పండ్లు తినడం వల్ల అండాశయం లోని లోపాలు తొలగుతాయి.. అంతేకాకుండా మూత్రాశయంలో అమ్మోనియా పెరగదు. రాళ్లు కూడా రావని వైద్యులు అంటున్నారు. ద్రాక్ష పండ్లతో పాటు బ్లూబెర్రీలు, వేరుశెనగ కూడా మంచివేనట. 

  అందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ (Health and Beauty with Dry Fruits)     మనలో చాలామంది ఆకలి తీర్చుకోడానికి ఏదో ఒకటి తింటాం. అంతేతప్ప మనం తీసుకున్న ఆహారంలో ఎన్ని కాలరీలు ఉన్నాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంది, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుందా, మానసికంగా ఏమైనా మేలు చేస్తుందా లాంటివి బొత్తిగా ఆలోచించం. కొందరు ఆహారం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. అందుకు తగ్గట్టు వాళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. కనుక ఆకలి తీరితే సరిపోతుంది అనుకోకుండా ఎం తింటున్నాం, ఎంత పరిమాణంలో తింటున్నాం అనేది కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ ఎలా, ఎంత పరిమాణంలో తినాలో, వాటివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. ఖర్జూరం , అత్తి పండు , సీమబాదం:- అత్తిపండు, సీమబాదం డ్రైఫ్రూట్స్ చాలా మేలైనవి. వీటిల్లో ఏదో ఒకదాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజూ తీసుకోవాలి. వీటిలో ఐరన్, ఫైబర్, విటమిన్ ‘ఎ’, విటమిన్ ‘సి’ ఉన్నాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. వీటిని కడిగి నీళ్ళలో నానబెట్టండి. మర్నాడు ఉదయాన ఆ నీళ్ళు తాగండి.. ఒకసారి ఒక రకం సరిపోతుంది. ప్రతిదీ టానిక్ లా పనిచేస్తుంది. బాదం:- బాదంలో పోషక విలువలు చాలా ఎక్కువ. కనుక రోజుకు ఐదు, ఆరు బాదం పప్పులు తినండి. విడిగానే కాదు, ఏ రూపంలో అయినా తినొచ్చు. బాదం పైపొరలో వగరు ఉన్నప్పటికీ దానిలో ఉండే ఫ్యాట్ అన్ శ్యాచురేటెడ్ కావడంతో అది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఎంతో సహాయకారిగా ఉంటుంది. బాదంలో ఉండే కాపర్ పరిమాణం ఎనీమియాను పోగొడుతుంది. బాదంవల్ల ముఖానికి గ్లో వచ్చి సౌందర్యం ఇనుమడిస్తుంది.  

 పెళ్లయ్యిందా... ఫిగర్ గురించి టెన్షన్ పడుతున్నారా...!   టీనేజీ అమ్మాయిలు తమ ఫిగర్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఎక్కడ లావైపోతారో, ఎక్కడ ఫిగర్ పాడైపోతుందోనని ఎప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఫిట్ నెస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. మరి పెళ్లయ్యి, ఇళ్లలో ఉండే మహిళల సంగతేంటి? వాళ్లకి ఫిట్ నెస్ అవసరం లేదా? ఈ విషయం చాలామంది గృహిణులు ఆలోచించరు.  కాస్త కేర్ తీసుకోవచ్చు కదా అంటే... ఎక్కడ కుదురుతుంది అనేస్తారు సింపుల్ గా. ఇంట్లో పనంతా చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, భర్తకి కావలసినవన్నీ సమకూర్చాలి, ఉదయం నుంచీ ఉరుకులు పరుగులతోనే సరిపోతుంటే ఇక అందంగా తయారయ్యే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటుంటారు. నిజానికి కేర్ తీసుకోమనేది అందం కోసం కాదు... ఆరోగ్యం కోసం. అవును. ఫిట్ నెస్ అనేది ఫిగర్ ని పర్ ఫెక్ట్ గా ఉంచుకోవడం కోసమే కాదు... ఫ్యూచర్ ని సంతోషంగా గడపడం కోసం. ఈ విషయం అర్థం కాని ఎంతోమంది గృహిణులు తమ ఒంటి మీద ఏమాత్రం శ్రద్ధ చూపకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆకర్షణ కోల్పోవడంతో పాటు అనారోగ్యాల బారిన కూడా పడుతుంటారు.   నిజానికి ఫిట్ గా ఉండటానికి పని గట్టుకుని జిమ్ లకి వెళ్లక్కర్లేదు. పనులన్నీ మానేసుకుని వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే పనుల్లోనే చక్కని వ్యాయామం ఉండేలా చూసుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతోనే అందాన్ని ఆనందాన్ని మన దగ్గర కట్టి పడేసుకోవచ్చు.   ముందుగా మీరు ఆహారపు అలవాట్ల మీద దృష్టి పెట్టండి. పనుల హడావుడిలో పడి ఏదో తినేశాంలే అనిపించకుండా ఓ క్రమ పద్ధతిలో తినడం అలవర్చుకోండి. మూడు నాలుగు గంటలకోసారి ఆహారం తీసుకోండి. వీలైనంత వరకూ ఆహారంలో గింజలు ఉండేలా చూసుకోండి. ప్రొటీన్లు ఎక్కువగా, చక్కెర తక్కవగా ఉండాలి. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతనివ్వాలి. మసాలాలు, కారం, నూనె తగ్గించేయండి.   ఇక వ్యాయామం సంగతి. మీరు చేసే పనుల్లోనే వ్యాయామం ఉండేలా చూసుకోండి. మిక్సీలు, గ్రైండర్లు వచ్చాక రోళ్లు పక్కన పెట్టేశాం. కానీ ఒక్కసారి మళ్లీ వాటిని వాడి చూడండి. చేతులకు ఎంత గొప్ప వ్యాయామమో తెలుస్తుంది. వీలైతే బట్టలు కూడా వాషింగ్ మెషీన్లో కాకుండా చేత్తోనే ఉతకండి. అపార్ట్ మెంట్లో ఉంటుంటే లిఫ్ట్ వాడకండి. మెట్లు ఎక్కి దిగండి. కూరగాయలకు, సరుకులకు మీవారినో పిల్లల్నో పంపకుండా మీరే వెళ్లి రండి. చిన్న చిన్న దూరాలకు కూడా ఆటోలు బస్సులు ఎక్కకుండా నడిచి వెళ్లండి. ఏ మధ్యాహ్నం పూటో టీవీ చూడాలని కూర్చుంటారు కదా! అప్పుడు రిమోట్ వాడకండి. చానెల్ మార్చుకోవాలనుకున్నప్పుడు టీవీ దగ్గరకు వెళ్లి వస్తూ ఉండండి. బైటికి వెళ్లినప్పుడు సెల్ వాడినా... ఇంట్లో వాడటానికి ఓ ల్యాండ్ లైన్ పెట్టించుకోండి. అది రింగయినప్పుడల్లా పరుగు పరుగున వెళ్లడం కంటే మంచి వ్యాయామం ఏముంటుంది!   ప్రపంచం ముందుకు వెళ్తుంటే మమ్మల్ని వెనక్కి వెళ్లమంటున్నారేంటి అనుకోకండి. మంచి జరుగుతుందనుకుంటే నాలుగడుగులు వెనక్కి వేయడంలో తప్పు లేదు. జిమ్ కి వెళ్లే సమయం, వ్యాయామం చేసే తీరిక లేనప్పుడు కనీసం లైఫ్ స్టయిల్ ని మార్చుకుంటే మేలు జరుగుతుంది. ఫిట్ నెస్ పెరుగుతుంది. అనారోగ్యం మీకు దూరంగా పరిగెడుతుంది. వర్తమానంతో పాటు భవిష్యత్తు కూడా ఆనందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. - Sameera  

ఆహారంలో ఆమ్లా     మనం తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి జబ్బులపాలు చేస్తాయి. పోషక విలువలు లేని ఆహారం తిన్నందువల్ల ప్రయోజనం ఉండదు. కొన్నికొన్ని పదార్థాలు మంచి పోషకాలతో శక్తిని చేకూరుస్తాయి. మరికొన్ని పదార్థాల్లో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అలాంటివాటిని తప్పక తినాలి. ఉసిరికాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కనుక ఉసిరికాయలు తినడం అవసరం. దానివల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.   * శరీరంలో ఉండే వేడిని తగ్గించి చల్లబరుస్తుంది. * కాన్స్టిపేషన్ సమస్య ఉంటే తగ్గుతుంది. * సి విటమిన్ అధికంగా ఉన్న ఉసిరికాయలు ఐరన్ , ఇంకా ఇతర ఖనిజాలను శరీరం గ్రహించేలా చేస్తాయి. * అజీర్ణం, కిడ్నీ సమస్యల్లాంటివి ఉసిరితో తగ్గుతాయి. * మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. * ఎర్ర రక్తకణాలు పెరిగేందుకు ఉసిరి తోడ్పడుతుంది. * ఆమ్లాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. * ఆకలి మందగించడం, నోరు సహించకపోవడం లాంటివి తిగ్గుతాయి. * ఉసిరితో కంటిచూపు మెరుగవుతుంది. * ఉసిరికాయలు తిన్నా, ఆమ్లా ఆయిల్ వాడినా జుట్టు రాలదు. బాగా పెరుగుతుంది కూడా. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ఉసిరికాయల సీజన్లో వాటిని సంపాదించి ఏదో ఒక రూపంలో సేవిద్దాం.

 Healthy Coconut Oil-2     Antibacterial properties: Coconut oil has natural antibacterial properties that help boost immune function and fight off illness-causing viruses and bacteria. It also helps protect the body from ringworm, yeast, candida and intestinal parasites, among other issues. Whats great about the oil is that its texture allows for easy external application, and it can be used for skin issues like diaper rash, eczema and acne. Of course, be sure you're storing the oil you use on your body in a separate container from the one containing the oil you use for cooking. Weight and Cholesterol maintenance: Research shows that, women who had abdominal obesity(excess belly fat), adding coconut oil to their diets reduced body mass index (BMI), waist circumference and "bad" LDL Cholesterol, while raising "good" HDL Cholesterol. Replacing cholesterol-raising fats like butter with a healthier fat like coconut oil is a great way to support weight loss and help maintain healthy cholesterol levels. And healthy weight and cholesterol levels are also good for the heart. Skin and Hair health: Coconut oil is naturally moisturizing, making it good to use externally on dry skin and hair. It also contains the antioxidant Vitamin E, which has a protective effect on the skin and supports healthy aging by reducing free radical damage. I recommend using organic coconut oil to limit exposure to toxins and chemicals. Diabetes support: Emerging studies show evidence that coconut oil supports the health of those with or at risk for Type 2 Diabetes. Research published in a American Heart Association's journal found that "dietary supplementation with MCFA ( medium chain fatty acids) found in sources like coconut oil may be beneficial for preventing obesity and peripheral insulin resistance" conditions that can lead to diabetes. We will learn about how to replace other cooking oils with coconut oil and its supplementation in our next article.

Foods to Boost Your Mood     Nuts: Dry fruits or nuts as we call them are all high in magnesium, which plays a major role in converting sugar into energy, and are also filled with fiber to keep your blood sugar levels even.   Keep a bag of nuts like almonds, cashews and hazelnuts at your desk and just a handful will give you longer lasting energy than a cup of coffee ever will.   Dark Chocolate: Eat a square or two of dark chocolate energizes the body by providing an excellent source of iron and magnesium. Dark chocolate can improve cognitive function, it can prevent Alzheimer and dementia and it can also boost your mood in a matter of minutes.   The darker the chocolate you consume, the better! Dark chocolate slows down the production of stress hormone, and the anxiety levels automatically decrease, moreover, chocolate also makes the brain release endorphins and also boosts the serotonin levels. This creates a feeling of well-being that lasts for several hours.   Green Tea/ Ginger Tea: A large review of studies conducted by researchers world over found that drinking three cups of tea daily was associated with a positive attitude. Also a report recently showed that study participants who sipped four or more cups of green tea daily reported having a more positive mood.   Green tea has been used for thousands of years due to its numerous benefits. Just like berries, green tea is also very rich in antioxidants, amino acids and L-theanine, known for reducing stress and anxiety while improving the mood. If consumed on a regular basis, green tea can give a feeling of overall well-being.   Fish: Salmon is a great source of the energy-boosting goodness that is essential omega-3 fatty acids, which are important for energy production, brain activity and circulation.     Just a gram of fish oil each day and noticed a 50 percent decrease in symptoms such as anxiety, sleep disorders, unexplained feelings of sadness, suicidal thoughts.   Milk: Milk contains proteins high in tryptophan, which is a building block in the bloodstream for serotonin in the brain.   It’s a source of carbohydrates and vitamin D (low levels have been associated with depression), which is required for the production of serotonin. Milk is also a source of calcium, which has been shown to reduce anxiety.   Banana: Bananas contain high amounts of vitamins and minerals, as well as tryptophan which is known for raising serotonin levels.   All the compounds found in bananas are mood-boosting, and vitamin B6 converts tryptophan into serotonin, the mood-lifting hormone. Bananas are one of the world’s best foods for supplying your body with energy. Rich in potassium and B vitamins, they can provide your body with a more sustained release of energy. The supply of vitamins and carbohydrates in bananas make you feel full, help slow down digestion and keep blood sugar levels stable. ..Divya

  మామిడిపండుతో బ్రెస్ట్ క్యాన్సర్ను ఎదుర్కోవచ్చు!     మిగతా పండ్లతో పోలిస్తే మామిడి పండులోని పోషక విలువల గురించి ప్రచారం తక్కువే! భారతీయుల ఇంటింటి ఆహారమైన ఈ మామిడిపండు గురించి పాశ్చాత్యులు కాస్త చులకనగానే చూస్తారు. మామిడి కేవలం జిహ్మచాపల్యాన్ని తీర్చే తీపి పండుగానే గుర్తిస్తారు. కానీ అదే పాశ్చాత్య దేశమైన అమెరికాలో మామిడిపండు గురించి ఓ ఆసక్తికరమైన పరిశోధన జరిగింది. స్త్రీ జీవితంలో విషాన్ని నింపే బ్రెస్ట్ క్యాన్సర్ను మామిడిపండు ఎదుర్కొంటుందని నిరూపించింది. మామిడిపండులోని polyphenol అనే రసాయనాలు కేన్సర్ కణాల మీద ఏ మేరకు ప్రభావం చూపుతాయో గమనించారు పరిశోధకులు. ఇందుకోసం పెద్దపేగు, వక్షోజాలు, ఊపిరితిత్తులు, ప్రొస్టేటు తదితర కేన్సర్ కణాల మీద ఈ polyphenolsను ప్రయోగించి చూశారు. వీటిలో ప్రొస్టేట్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కణాల మీద మామిడిపళ్లు ఎంతోకొంత ప్రభావం చూపినట్లు గ్రహించారు. ఆశ్చర్యకరంగా వక్షోజ (breast), పెద్దపేగు(colon) క్యన్సర్ కణాలని నిరోధించడం, నాశనం చేయడంలో beమిడిపండ్లు అద్భుతమైన ప్రభావం చూపాయట! చాలా క్యాన్సర్ చికిత్సలలో క్యాన్సర్ కణాలతో పాటుగా ఆరోగ్యవంతమైన కణాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. దీని వల్ల రోగి నీరసించిపోవడం, మళ్లీ క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. కానీ మామిడిపండు నుంచి తీసిన రసాయనాలు మాత్రం కేవలం క్యాన్సర్ కణాల మీదే దాడి చేయడం గమనార్హం. మామిడి నుంచి తీసిన polyphenols క్యాన్సర్ కణాల మీద పనిచేసే తీరు కూడా చిత్రంగా ఉంది. విచ్చలవిడిగా పెరిగిపోతున్న క్యాన్సర్ కణాలను నిరోధించడంతో పాటుగా.... దెబ్బతిన్న కణాలను బాగుచేయడం ద్వారా polyphenols అద్భుతమైన ప్రభావాన్ని చూపాయట. తమ పరిశోధనతో మామిడపండు సత్తా తెలిసింది కాబట్టి, polyphenolsను తీసిన మందులతో క్యాన్సర్ చికిత్సను ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టాలని పరిశోధకులు కోరుకుంటున్నారు. ఆ మందులు, చికిత్సలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత కాలం పడుతుంది కాబట్టి, ఈలోగా తియ్యటి మామిడిపంఢ్ల రుచిని కాస్త ఆస్వాదిస్తే సరి! - నిర్జర.    

    Is Peanut Butter a Healthy Food Option!     Peanut butter is one of the most regularly used bread spread while at the breakfast table. While most of us think it is filled with health benefits, do we really know how the bread spread does do to our health in real? Did you know that a lot of people who are calorie conscious do not opt for having peanut butter. Just for the fact that its high calorie content. A mere two tablespoons contains 200 calories, which, depending on your daily intake, could make up as much as 10 percent of your daily calorie allotment. A few heaping spoonfuls throughout the day, and you may quickly find yourself at half of your daily calorie intake. So how exactly does it promote a flat belly, and what else does peanut butter do to your body? Experts say Nuts have a healthy fat profile  including mono and polyunsaturated fats are rich in antioxidants, contain nutrients like potassium that help maintain a healthy blood pressure, are rich in fiber, and contain heart-healthy plant phytosterols. As far as weight loss goes, it may seem counterproductive to eat fats to lose fat, but peanut butter certainly proves that certain fats can help you ward off excess weight. Peanuts and peanut butter offer healthy levels of zinc. people who eat a diet rich in foods like avocado, olive oils, and peanut butter are more likely to not only lose weight, but also keep the weight off for longer than those who follow a low-fat diet.   Peanut butter's saturated-fat content is a concern for some people. Saturated fat was once deemed the demon of heart disease and was portrayed as evil by the fat-loss community. The truth is that saturated fat is not the root of all evil. In fact, it's actually beneficial to the production of crucial hormones and vitamins such as vitamin D. Eating peanut butter may help reduce risk of developing diabetes too. The protein, fiber and healthy fat in peanut butter can give you that kick you need to start the day on an active note and also to give you that much needed boost through the mid day. A study also found that those getting the most niacin from foods were 70 percent less likely to develop Alzheimer’s disease. Peanuts are one of the foods highest in niacin.   Peanut butter has higher antioxidant levels than apples, carrots, or beets, and is more on par with the levels found in blackberries and strawberries. Peanut butter contains high amounts of healthy fats, vitamins and minerals, and a decent amount of protein. Ideally, use an organic brand which contains just peanuts and salt. This kind is full of peanut flavor and doesn’t contain additives and is better for the environment too. Refrigerate it and turn it upside down in the fridge so the peanut oils and solids can re-mix. Peanut butter with no hydrogenated fats and no sugar is the best. ..Divya

కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందా..?   ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటే చాలు ఒక యుద్దానికి వెళుతున్నంత హంగామా- ఒక స్కార్ఫ్, గ్లోవ్స్, షేడ్స్... ఇలా చాలా సిద్ధం చేసుకుంటుంటాం. కాలుష్యం గురించిన భయం అలాంటిది మరి. ఈ కాలుష్యం పుట్టిన పిల్లలకే కాదు, కడుపులో ఉన్న బిడ్డకి కూడా ప్రమాదమేనట. అదేంటో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడండి........  https://www.youtube.com/watch?v=-YtONTv7XUI    

  ఆ సమయంలో ఇలా రిలాక్స్ అవ్వండి     వాకింగ్ అన్నిటకంటే మంచి వ్యాయామం అంటారు నిపుణులు. కానీ సిటీలో ఉండేవాళ్లకు వాకింగ్ చేయడం కష్టమే. దగ్గర్లో ఏదైనా పార్క్ ఉంటే ఓకే. లేదంటే ట్రాఫిక్ ఉండే రోడ్లలో, వాహనాల రొద, దుమ్ము ధూళిలో నడక అసాధ్యం. అందుకే ఎక్కువమంది జిమ్ ల మీద ఆధారపడేవాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. రోజూ ఉదయాన్నే అక్కడికి వెళ్లిపోయి ప్రశాంతంగా కాసేపు వ్యాయామం చేసుకోవడంలే ఉండే సుఖమే వేరు కదా! అయితే జిమ్ లో చేరాలనుకునేవాళ్లు, చేరినవాళ్లు ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవడం మంచిది.   ముందుగా ఆలోచించాల్సింది దుస్తుల గురించి. జిమ్ కి వేసుకునే దుస్తులు బిగుతుగా ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ కాదు. ముఖ్యంగా ఆడవాళ్లయితే చాలా అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంది. కదలికలకు, కొన్నిసార్లు శ్వాస తీసుకోడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అందుకే కాస్త వదులుగా ఉండేవే వేసుకోవాలి. అలాగే షూ కూడా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి.   వ్యాయామానికి ముందు వార్మప్ చాలా అవసరం. నేరుగా వెళ్లి మొదలుపెట్టేస్తే వెనువెంటనే గుండె వేగం పెరిగి శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. శరీరం త్వరగా శక్తిని కోల్పోయి ఆయాసం వచ్చేస్తుంది. అందుకే వార్మప్ చేశాకే వ్యాయామం మొదలు పెట్టాలి. అలాగే శరీరాన్నిహైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. జిమ్ కి వెళ్లడానికి ముందు కొద్దిగా నీళ్లో, జ్యూసో తాగండి. అలా అని కడుపు నిండేలా తాగకూడదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మొదట్లో మనకు మనమే ఎక్విప్ మెంట్ ని యూజ్ చేయాలని ప్రయత్నించకూడదు. కచ్చితంగా ఇన్ స్ట్రక్టర్ ని అడిగి, వాళ్లు చెప్పిన విధంగానే చేయాలి. ఎలా పడితే అలా చేసేస్తే కండరాలు పట్టేస్తాయి. ఎముకలు డ్యామేజయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అలాగే ఒకేసారి ఎక్కువ వ్యాయామం చేసేయాలని అనుకోకూడదు. మెల్లగా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి. లేదంటే విపరీతంగా ఒళ్లు నొప్పులు వచ్చి వ్యాయామం చేయడమే కష్టమైపోతుంది.   అదే విధంగా వ్యాయామం చేస్తున్నంతసేపూ మనసుని రిలాక్స్ చేయడం చాలా అవసరం. శరరం కష్టపడుతోంది కదా ఆ ఒత్తడిని మనసు మీద పడనివ్వకూడదు. అందుకే అయితే మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. లేదంటే వ్యాయామం చేస్తున్నంతసేపూ చక్కని సంగీతం వినండి. చాలా జిమ్స్ లో ఈ సౌకర్యం ఉంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే జిమ్ లో మీ అనుభవం ఆనందంగా ఉంటుంది. ఫలితం తృప్తికరంగా ఉంటుంది. - Sameera    

తగ్గడానికి..తిండి తగ్గించక్కర్లేదట     అందంగా కనిపించాలంటే శరీరాన్ని తగ్గించాల్సిందే అంటున్నారు నేటితరం అమ్మాయిలు. దీంతో పొద్దున్న టిఫిన్ తింటే..మధ్యాహ్నాం భోజనం కట్..ఒకవేళ మధ్యాహ్నాం హేవిగా తింటే సాయంత్రం ఖాళీ కడుపుతో పడుకోవడమే.. ఇక రాత్రంటరా..? రాత్రిపూట భోజనం తినడాన్ని ఈ తరం ఎప్పుడో మరచిపోయింది..రెండు చపాతీలు అది కూడా కుదిరితేనే.   ఏది ఏమైనప్పటికి నాజూకైనా శరీరాన్ని సాధించాలి. ఇది ఒక్కటే అమ్మాయిల మెయిన్ టార్గెట్. అయితే పాపం తప్పు వీరిది కాదులే..సన్నబడాలంటే నోరు కట్టేసుకోవాలనే చెబుతారు పేరు మోసిన డైటీషియన్లందరూ. కానీ బరువు తగ్గాలంటే కడుపు మాడ్చుకోకుండా సంప్రదాయ భారతీయ ఆహారం తీసుకుంటే సరిపోతుందంటున్నారు బాలీవుడ్ తారల ఫేవరేట్ డైటీషియన్ రుజుత. స్థానికంగా పండిన ఆహారాన్ని తినడంతో పాటు శారీరక వ్యాయామం, కంటి నిండా కునుకు ఉంటే బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారామె. ప్రతీ రోజు నెయ్యి: ఇదివరకటి రోజుల్లో నెయ్యి లేకుండా ఏం తినేవారు కాదు..కానీ ఇప్పుడు సన్నబడాలనే మోజులో నెయ్యిని పూర్తిగా దూరం పెడుతున్నారు. అయితే ప్రతిరోజూ నిరభ్యంతరంగా నెయ్యిని తినొచ్చు అంటున్నారు రుజుత. కొన్ని పదార్థాలను ఎక్కువ నెయ్యితో, కొన్నింటిని తక్కువ నెయ్యితో కలిపి తినొచ్చు. అయితే పరిమితంగా తినటం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది,  జాయింట్ల సమస్యలు దరిచేరవు. జ్యూస్‌లు తాగకండి..పళ్లు తినండి: వీలు కుదిరితే ఏదో ఒక పండును జ్యూస్ చేసుకోవడానికి చూస్తారు తప్ప వాటిని తృప్తిగా తిందామని ఎవ్వరూ అనుకోవడం లేదు..ఎందుకంటే ఎవరికి అంత టైం ఉండటం లేదు. కానీ నోటిలో పళ్లున్నంత కాలం జ్యూస్‌లు చేసుకుని తాగే బదులు కూరగాయలు, పళ్లను చక్కగా నమిలి తినొచ్చంటున్నారు. దీని వల్ల జ్యూస్ చేసుకునే ప్రక్రియలో మిగిలిపోయే పీచు పదార్థాలు ఇతర పోషకాలు కూడా మన శరీరంలోకి వెళతాయి.   వీటిని ఆహారం నుంచి నిషేధించండి: కేక్, బిస్కెట్స్, బ్రెడ్, పాస్థా, పిజ్జా లాంటి జంక్ ఫుడ్‌ని దూరం పెట్టండి.   పొద్దున్నే టీ మానండి: చాలా మందికి ఉదయాన్నే టీ తాగనిదే ఏ పని చేయబుద్ధి కాదు. అయితే ధీర్ఘకాలంలో ఇలాంటి అలవాటు చేటు చేస్తుందట. మరీ ముఖ్యంగా ఆకలేస్తే టీతో సరిపెట్టడం మానండి..అయితే మరి ఎక్కువసార్లు కాకుండా రోజులో 2-3 సార్లు తీసుకోవచ్చు.   ఏదో ఒకటి తినండి: ఇదివరకటి రోజుల్లో ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే మధ్యలో వంటింట్లో లభించే ఆహార పదార్థాలు తీసుకునేవారు. దీని వల్ల పనిలో అలసట ఉండదు సరికదా..? నాజుగ్గా ఉంటారు...భోజనం సమయంలో ఎక్కువ తినరు.