వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!  సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది.  భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే  చెమట  జుట్టు  మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి.  చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి.. హీటింగ్ టూల్స్ వద్దు.. హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు.  కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి,  జుట్టు  ఫ్రీగా ఉండటానికి బదులుగా  తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది.   తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుడ్డు వాడాలి..  వారానికి ఒకసారి జుట్టుకు  గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు  జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. నూనె రాయాలి.. పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో  చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె  కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది.  అందుకే ఉదయానికి బదులు  రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును  శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.  కండీషనర్‌.. చాలా మంది మహిళలకు   కండీషనర్‌ని  ఉపయోగించడం సరిగ్గా తెలియదు.  దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం  తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది,  బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.   డ్రై షాంపూ.. ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.  జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై  షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే  బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.                                             *రూపశ్రీ.  

    మహిళలకు నెలలో 5 నుంచి 7 రోజులు పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి, కడుపులో కండరాల  తిమ్మిరి గురించి మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దీనితో పాటు, కొన్నిసార్లు అధిక రక్తస్రావం సమస్య కూడా మహిళలను వేధిస్తూ ఉంటుంది.  మరికొన్ని రక్తస్రావం సరిగా కాకపోవడం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలా రక్తస్రావం అధికంగా అయినా, అసలు రక్తస్రావం సరిగా కాకపోయినా కూడా మహిళలకు సమస్యే..   ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్ని సార్లు మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి. నెలసరి సక్రమంగా రాదు.  ఇలాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుండి బయట పడటానికి  వైద్యులు చెప్పిన సలహాలేంటో తెలుసుకుంటే.. పీరియడ్స్ సక్రమంగా లేకుంటే మహిళలు తమ  జీవనశైలి, తీసుకునే  ఆహారం విషయంలో  కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. అస్తవ్యస్తం అయిన  పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడానికి మొట్టమొదట చేయాల్సిన పని కెఫిన్‌కు దూరంగా ఉండటం. ఇందుకోసం టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు మానేయడంతో  పాటు మార్కెట్ లో లభ్యమయ్యే  ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.  మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్ ఫుడ్‌కి నిర్మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా కూడా ప్యాక్డ్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో సున్నితంగా ప్యాక్డ్ ఫుడ్ ను దాటవేయాలి. అలాగే వంటల్లో మైదా, ఇంకా రిఫైండ్ షుగర్  అయిన పంచదార వంటివి అధికంగా వాడుతుంటే వాటిని మానేయడం మంచిది.  ఆహారంలో అధిక కారం, అధిక నూనె, అధిక పులుపు,అధిక ఉప్పు వంటివి  తగ్గించాలి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే శరీరంలో హార్మోన్లు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. పీరియడ్స్ ఎప్పుడూ క్రమబద్ధంగా రావాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో తృణ ధాన్యాలు, మిల్లెట్లు భాగం చేసుకోవాలి. మిల్లెట్లు తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.  ఆహారంలో పచ్చి పండ్లు,  పచ్చి కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. కూరగాయల జ్యూస్ తో  పాటు ఆహారంలో మజ్జిగను చేర్చాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మజ్జిగలో లభించే ప్రోబయోటిక్స్ హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తాయి.  ఇవన్నీ హార్మోన్లను సకాలంలో వచ్చేలా చేస్తాయి.                                                               *రూపశ్రీ  


పిల్లలలో మలబద్దకం సమస్య తగ్గాలంటే ఈ టిప్స్ పాటించండి! పిల్లలలో మలబద్ధకం అనేది  సాధారణ సమస్య. పెద్దలు తమ సమస్యను బయటకు చెప్పినంతగా పిల్లలు వ్యక్తం చేయలేరు. ఈ కారణంగా పిల్లలలో మలబద్దకం సమస్య వారికి చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విషయాన్ని తల్లులే గమనించి పిల్లల సమస్య తగ్గే మార్గాలు అన్వేషించాల్సి ఉంటుంది. ప్రేగు కదలికలు తక్కువ ఉండటం,  పాస్ చేయడం కష్టంగా  అనిపించినప్పుడు మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్య ఎక్కువగా  ఉన్నప్పుడు పిల్లల ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.   అయితే కొన్ని సురక్షితమైన, సమర్థవంతమైన ఇంటి చిట్కాలు పిల్లలలో మలబద్దకం సమస్యకు  ఉపశమనాన్ని ఇస్తాయి. వీటిని జాగ్రత్తగా ఫాలో అయితే పిల్లలలో మలబద్దకం సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు. ఫైబర్.. పిల్లలు మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నప్పుడు  ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వాలి. ఫైబర్ ప్రేగుల కదలికను ప్రోత్సహిస్తుంది. పైబర్ రిచ్ ఫుడ్స్ బాగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా జరిగి సమస్య తగ్గుతుంది. యాపిల్స్, రేగు పండ్లు,బ్రోకలి, క్యారెట్, బచ్చలికూర. తోటకూర  వంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను, ఓట్స్, బ్రౌన్ రైస్,  పొట్టు తీయని గోధుమలు మొదలైనవి బాగా ఇవ్వాలి.  ఫ్రూనే జ్యూస్.. ఎండిన ఫ్లం పండ్లను ఫ్రూనే అంటారు. ఈ ఫ్రూనే లతో జ్యూస్ చేసి ఇవ్వడం వల్ల మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఎందుకంటే   ఫ్రూనే జ్యూస్ సహజంగానే భేదిమందు స్వభావాన్ని కలిగి ఉంటుంది. కొద్దిమొత్తంలో ఫ్రూనే జ్యూన్ ను నీటిలో కలిపి రోజుకు రెండు పూటలా చాలా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. ఇది మోషన్ కావడానికి సహకరిస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఇస్తే అతిసారం సమస్యకు దారితీస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కొద్దిమొత్తంలో ఇవ్వాలి. వెచ్చని నీరు.. వెచ్చనినీరు కడుపులో ప్రేగులను, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోజూ 10 నుండి 15 నిమిషాల పాటూ వెచ్చని నీటిలో పిల్లలను కూర్చోబెట్టడం వల్ల  కడుపులో కండరాల కదలిక బాగుంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే గోరువెచ్చని నీటిని పిల్లలకు తాగించాలి. శారీరక శ్రమ.. పిల్లలలో శారీరక శ్రమ లేకపోవడం కూడా మలబద్దకం సమస్యకు దారితీస్తుంది. అందుకే పిల్లలలో శారీరక వ్యాయామం ప్రోత్సహించాలి. ఆటలు ఆడుకోవడానికి పంపాలి. ఎప్పుడూ కూర్చొని చదువుకోవడం, గేమ్స్, టీవి వంటివే కాకుండా పిల్లలలో యోగా, ఆసనాలు వేయిస్తుండాలి. ఇవి మలబద్దకం సమస్యను చెక్ పెట్టడానికే కాదు.. పూర్తీ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడుతాయి.                                                   *నిశ్శబ్ద.  

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

  అమ్మాయిలు చర్మ సంరక్షణ విషయంలో అస్సలు రాజీ పడరు. అందుకే వాణిజ్య ఉత్పత్తుల నుండి ఇంటి చిట్కాల వరకు ప్రతి ఒక్కటి ఫాలో అవుతారు.   వాణిజ్య ఉత్పత్తులలో ఎక్కువ శాతం రసాయనాలుండటం వల్ల చాలామంది సహజంగా చర్మాన్ని మెరిపించుకోవడం కోసం ట్రై చేస్తారు.  అలాంటి వారికి ఓట్మీల్ చక్కని ఆప్షన్. సాధారణంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారు  ఓట్మీల్ ను ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటారు. దీంతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలుంటాయి. కానీ దీన్ని పేస్ కు మాస్క్ లాగా వేసుకుంటే మ్యాజిక్ ఫలితాలు ఉంటాయి. ఇంతకీ ఓట్మీల్ అంటే ఏంటి?దీన్నెలా తయారుచేసుకోవాలి?  ఎలా అప్లై చేసుకోవాలి? తెలుసుకుంటే.. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు,  మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి  ఆరోగ్యకరమైన ఆహారంలో భాగం. కానీ వీటితో పేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం నుండి మురికి,  నూనెను తొలగించడంలో, చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో, చర్మానికి  తేమను అందించడంలో, అకాల వృద్ధాప్యానికి గురికాకుండా చేయడంలో.. ఇలా చాలా రకాలుగా సహాయపడుతుంది. ఓట్ మీల్ తేనె ఫేస్ మాస్క్.. పొడి చర్మం,  సున్నితమైన చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ మంచిది. కావలసినవి: 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్ 1 టేబుల్ స్పూన్ తేనె 1 టీస్పూన్ వెచ్చని నీరు. విదానం.. ఒక చిన్న గిన్నెలో, గ్రైండ్ చేసిన ఓట్ మీల్, తేనెను కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.  ఈ మిశ్రమానికి గోరువెచ్చని నీరు వేసి బాగా కలపాలి.  ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి.  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుని,  ఇష్టమైన మాయిశ్చరైజర్‌ని ముఖానికి రాసుకోవాలి. ఓట్ మీల్ పెరుగు ఫేస్ మాస్క్.. ఈ ఫేస్ మాస్క్ అన్ని చర్మ రకాల వారికి, ముఖ్యంగా జిడ్డుగల లేదా మొటిమల బారిన పడే చర్మం ఉన్నవారికి సరిపోతుంది. కావలసినవి.. 2 టేబుల్ స్పూన్లు గ్రౌండ్ వోట్మీల్ 2 టేబుల్ స్పూన్లు సాదా పెరుగు 1 టీస్పూన్ తేనె విధానం.. ఒక చిన్న గిన్నెలో, గ్రౌండ్ వోట్మీల్,  పెరుగు కలపాలి. ఇందులోనే  తేనె జోడించాలి.  ముఖానికి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖం పొడిగా మారిన తరువాత తేలికపాటి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఓట్ మీల్,  అరటిపండు ఫేస్ మాస్క్: ముడుతల చర్మం ఉన్నవారికి ఈ ఫేస్ మాస్క్ సరైనది. కావలసినవి: 1/2 పండిన అరటి 1 టేబుల్ స్పూన్ గ్రౌండ్ వోట్మీల్ 1 టీస్పూన్ తేనె విధానం.. ఒక చిన్న గిన్నెలో, అరటిపండును మెత్తని పేస్ట్‌గా  చెయ్యాలి.  అరటిపండు గుజ్జులో గ్రైండ్ చేసిన   ఓట్ మీల్,  తేనె వేసి బాగా కలపాలి. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుని  15-20 నిమిషాలు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ముడుతలు ఉన్న చర్మానికి తగిన మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి.                                                      *రూపశ్రీ.