వేసవి చెమట కారణంగా జుట్టు జిగటగా అనిపిస్తోందా? ఈ చిట్కాలు ఫాలో అయి చూడండి!  సమ్మర్ సీజన్‌లో ఎన్ని అందమైన టాప్స్, కుర్తాలు, డ్రెస్సులు వేసుకున్నా జుట్టు తలకు అతుక్కుపోయి విపరీతంగా జిడ్డుగా ఉంటే లుక్ మొత్తం చెడిపోతుంది.  భరించలేని ఎండ, దాన్నుండి పుట్టే  చెమట  జుట్టు  మెరుపును చాలా వేగంగా తగ్గించేస్తాయి. ఈ సమస్య తగ్గించుకోవాలి అంటే జుట్టు సంరక్షణ చిట్కాలు తప్పకుండా పాటించాలి.  చెమట కారణంగా జుట్టు జిగటగా మారుతూ ఉంటే దాన్నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ కింది చిట్కాలు పాటించాలి.. హీటింగ్ టూల్స్ వద్దు.. హెయిర్ స్టైల్ చేయడానికి హీటింగ్ టూల్స్ ఉపయోగిస్తుంటారు.  కానీ సమ్మర్ సీజన్‌లో హీటింగ్ టూల్స్ వాడటం వల్ల హెయిర్ డ్యామేజ్ పెరిగి,  జుట్టు  ఫ్రీగా ఉండటానికి బదులుగా  తలపై అతుక్కున్నట్టు అనిపిస్తుంది.   తలలో పుట్టే చెమట దీనికి ప్రధాన కారణం అవుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. జుట్టులో ఉండే తేమను హీటింగ్ టూల్స్ లాగేస్తాయి. ఈ కారణంగా జుట్టు నిర్జీవంగా మారి చాలా తొందరగా డ్యామేజ్ అవుతుంది. గుడ్డు వాడాలి..  వారానికి ఒకసారి జుట్టుకు  గుడ్డు హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల జుట్టు  జిగట నుండి ఉపశమనం లభిస్తుంది. గుడ్డు జుట్టుకు హైడ్రేషన్ ఇస్తుంది. గుడ్డులో పెరుగు కలిపి తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయవచ్చు. అంతే కాకుండా పెరుగు, తేనె కలిపి జుట్టుకు రాసుకోవచ్చు. నూనె రాయాలి.. పగటిపూట జుట్టుకు నూనె రాసినట్లయితే తల జిగటగా కనిపిస్తుంది. వేసవిలో  చెమట అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెమటతో పాటు నూనె  కూడా తల మీద నుండి ప్రవహిస్తుంది.  అందుకే ఉదయానికి బదులు  రాత్రి సమయంలో తలకు నూనె రాసుకోవాలి. నూనెను రాత్రిపూట తలకు పట్టించి మసాజ్ చేసి మరుసటి రోజు జుట్టును  శుభ్రం చేసుకోవాలి.  ఇలా చేస్తే జుట్టు మృదువుగా, ఫ్రీగా ఉంటుంది.  కండీషనర్‌.. చాలా మంది మహిళలకు   కండీషనర్‌ని  ఉపయోగించడం సరిగ్గా తెలియదు.  దీని కారణంగా కండీషనర్ రాసినా సరే.. జుట్టు జిగటగా కనిపిస్తుంది. షాంపూతో జుట్టును శుభ్రం చేసిన తర్వాత కండీషనర్ ఉపయోగించాలి. కండీషనర్ జుట్టు పొడవునా అప్లై చేయాలి. కానీ చాలామంది కేవలం  తలపై మాత్రమే రాస్తుంటారు. కండీషనర్‌ను తలపై లేదా స్కాల్ప్‌పై రాసుకుంటే జుట్టు జిడ్డుగా మారుతుంది,  బరువుగా కనిపిస్తుంది. అదనంగా ఇది తలపై జిడ్డు ఏర్పడటానికి కారణమవుతుంది.   డ్రై షాంపూ.. ఎంత వేడిగా ఉన్నా ప్రతి రోజూ తలస్నానం చెయ్యాలంటే ఇబ్బందే. హెయిర్ ఫాల్ పెరుగుతుందని చాలా భయం. అందుకే ప్రతిరోజు జుట్టును నీటితో కడగకుండా డ్రై షాంపూను జుట్టు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.  జుట్టు జిగటగా కనిపించినప్పుడు డ్రై  షాంపూని అప్లై చేసిన తర్వాత జుట్టులో వెంటనే  బౌన్స్ కనిపిస్తుంది. జుట్టు పొడిగా, ఫ్రీగా ఉంటుంది.                                             *రూపశ్రీ.  

    మహిళలకు నెలలో 5 నుంచి 7 రోజులు పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి, కడుపులో కండరాల  తిమ్మిరి గురించి మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దీనితో పాటు, కొన్నిసార్లు అధిక రక్తస్రావం సమస్య కూడా మహిళలను వేధిస్తూ ఉంటుంది.  మరికొన్ని రక్తస్రావం సరిగా కాకపోవడం కూడా ఎదురవుతూ ఉంటుంది. ఇలా రక్తస్రావం అధికంగా అయినా, అసలు రక్తస్రావం సరిగా కాకపోయినా కూడా మహిళలకు సమస్యే..   ఇవన్నీ ఒక ఎత్తైతే కొన్ని సార్లు మహిళలకు పీరియడ్స్ స్కిప్ అవుతూ ఉంటాయి. నెలసరి సక్రమంగా రాదు.  ఇలాంటి సమస్యలతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుండి బయట పడటానికి  వైద్యులు చెప్పిన సలహాలేంటో తెలుసుకుంటే.. పీరియడ్స్ సక్రమంగా లేకుంటే మహిళలు తమ  జీవనశైలి, తీసుకునే  ఆహారం విషయంలో  కొన్ని ప్రత్యేక మార్పులు చేసుకోవాలి. అస్తవ్యస్తం అయిన  పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడానికి మొట్టమొదట చేయాల్సిన పని కెఫిన్‌కు దూరంగా ఉండటం. ఇందుకోసం టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీలు మానేయడంతో  పాటు మార్కెట్ లో లభ్యమయ్యే  ఫుడ్, జంక్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి.  మార్కెట్‌లో లభించే ప్యాక్‌డ్ ఫుడ్‌కి నిర్మొహమాటం లేకుండా నో చెప్పడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు స్నేహితులు, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా కూడా ప్యాక్డ్ ఫుడ్ తినాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిలో సున్నితంగా ప్యాక్డ్ ఫుడ్ ను దాటవేయాలి. అలాగే వంటల్లో మైదా, ఇంకా రిఫైండ్ షుగర్  అయిన పంచదార వంటివి అధికంగా వాడుతుంటే వాటిని మానేయడం మంచిది.  ఆహారంలో అధిక కారం, అధిక నూనె, అధిక పులుపు,అధిక ఉప్పు వంటివి  తగ్గించాలి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే శరీరంలో హార్మోన్లు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. పీరియడ్స్ ఎప్పుడూ క్రమబద్ధంగా రావాలి అంటే మంచి ఆహారపు అలవాట్లు ఫాలో అవ్వడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఆహారంలో తృణ ధాన్యాలు, మిల్లెట్లు భాగం చేసుకోవాలి. మిల్లెట్లు తినడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.  ఆహారంలో పచ్చి పండ్లు,  పచ్చి కూరగాయలను చేర్చడానికి ప్రయత్నించాలి. కూరగాయల జ్యూస్ తో  పాటు ఆహారంలో మజ్జిగను చేర్చాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. మజ్జిగలో లభించే ప్రోబయోటిక్స్ హార్మోన్ల అసమతుల్యతను తొలగిస్తాయి.  ఇవన్నీ హార్మోన్లను సకాలంలో వచ్చేలా చేస్తాయి.                                                               *రూపశ్రీ  


ఏడాదిలోపు పిల్లలకు ఈ ఆహారాలు ఇవ్వకూడదు..!! 12 నెలల లోపు శిశువు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. ఇది పిల్లల ఎదుగుదల లేదా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బాల్యంలో పిల్లలు ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాటిలో ఎక్కువ కేలరీలు ఉండవచ్చు. అయితే ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. చక్కెర: 24 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చక్కెర జోడించిన ఆహారాన్ని నివారించాలని శిశువైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పిల్లలు చక్కెర రుచిని ఇష్టపడతారు. అదనంగా, ఇది అదనపు కేలరీలను జోడిస్తుంది. ఇది కాలక్రమేణా దంత క్షయానికి దారితీస్తుంది. చాలా మంది తల్లులు తమ బిడ్డ పాలలో శుద్ధి చేసిన చక్కెరను కలుపుతారు. అలాగే పిల్లలు పంచదారతో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. తేనె: ఆయుర్వేదంలో తనదైన స్థానాన్ని పొందిన తేనె అద్భుతమైన తీపి పదార్థం మాత్రమే కాదు అద్భుత ఔషధం కూడా. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చక్కెరకు తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అయితే, శిశువులు అంటే 12 నెలల లోపు పిల్లలు తేనె తినకూడదు. తేనె యొక్క అధిక వినియోగం శుద్ధి చేసిన చక్కెరతో సమానమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందువల్ల, 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు తేనె ఇవ్వకూడదు. ఉప్పు: 7 నుంచి 12 నెలల మధ్య పిల్లలకు రోజుకు 0.37 గ్రాముల సోడియం అవసరం. మీరు మీ బిడ్డకు ఎక్కువ ఉప్పు ఇవ్వకూడదు.అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు ఇచ్చినప్పుడు పిల్లవాడు సోడియంకు గురవుతాడు. ఇది వారి అపరిపక్వ మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఉప్పు, చక్కెరను మితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఆవు పాలు: తల్లులు తమ బిడ్డలకు తమ తల్లి పాలకు బదులుగా ఆవు పాలను ఇస్తారు . దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.ఆవు పాలు అనేక పోషకాలను అందిస్తుంది. కానీ 12 నెలల లోపు పిల్లలకు ఇది పనికిరాదని చెబుతున్నారు. శిశువు యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, అభివృద్ధికి అవసరమైన విటమిన్ E, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను ఆవు పాలలో ఉండవు. పిల్లలకి అలెర్జీలు ఉండవచ్చు. ఆవు పాలలో భారీ ప్రోటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శిశువు యొక్క ఇంకా అభివృద్ధి చెందుతున్న మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. పండ్ల రసాలు: 12 నెలల లోపు పిల్లలకు పండ్ల రసాలు ఇవ్వకూడదని మీకు తెలుసా ? అవును, పండ్ల రసాలు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎటువంటి పోషక విలువలను అందించవు. ఎటువంటి పోషకాహార ప్రయోజనం లేకుండా పిల్లల ఆహారంలో చక్కెర ఉంటుంది.  ఇది పిల్లల దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. బదులుగా, తాజా పండ్లను కట్ చేసి తినిపించండి.

Aracheta Gorinta / Mehendi / Gorinta Designs / Mehndi / Learn Simple & Easy Mehendi Designs / Learn Gorintaku Designs / Learn Tattoo Designs / Henna Designs

గర్భిణీ స్త్రీలు ఏం తినాలి? ఏం చెయ్యాలి, ఏం  చేయకూడదు..!   ప్రతి ఆడపిల్ల జీవితంలో  గర్భధారణ చాలా కీలకమైన, ముఖ్యమైన దశ. ఈ దశలో మహిళల జీవనశైలి, ఆహారపు అలవాట్లు అన్నీ పూర్తీగా మార్పుకు లోనవుతాయి. ఇక శరీరంలో మార్పులు సరే సరి.. ఈ దశల గర్భవతులు, కడుపులో పెరుగుతున్న వారి బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం అనుసరించాల్సిన విషయాలు.. అనుసరించకూడని విషయాలను ICMR పేర్కొంది. వీటి గురించి తెలుసుకుంటే.. గర్భిణీ తల్లులు సరైన నిష్పత్తిలో అన్ని ఆహార సమూహాలను కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అంటే మీ భోజనంలో తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, సన్న మాంసాలు, గుడ్లు, చిక్కుళ్ళు మరియు పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. శిశువు  పెరుగుదల,  అభివృద్ధికి కీలకమైన ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం,  ప్రోటీన్ వంటి అవసరమైన పోషకాలు తినాలి. ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12, అయోడిన్ మరియు n-3 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వంటి కొన్ని పోషకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఐరన్,  ఫోలిక్ సప్లిమెంట్స్ తీసుకోవాలి.  అయోడిన్ కూడా తప్పనిసరి.  B12 పెరుగు లేదా మాంసం  నుండి లభిస్తుంది. మాంసాహారులైతే ఒమేగా-3 కోసం  కొవ్వు చేపలు.. శాఖాహారులైతే   విత్తనాలు, ఆకు కూరలు,  గింజల తీసుకోవచ్చు. 1000రోజుల పోషకాహారం.. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డ పుట్టే వరకు (270 రోజులు). బిడ్డ  పుట్టినప్పటి నుండి ఆమె బిడ్డ 2వ పుట్టినరోజు (365+365 రోజులు) వరకు 1000రోజులు ఉంటాయి. ఈ  మొదటి 1000 రోజులు పిల్లల భవిష్యత్తును రూపొందించే కీలకమైన కాలం. ఈ కాలంలో, తల్లి కడుపులోని పిండం చాలా వేగంగా పెరుగుతుంది.  తల్లి నుండి పోషకాహారాన్ని తీసుకుంటుంది. దీని కోసం, గర్భం ప్రారంభంలో తల్లికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు,  శక్తిని అందించాలి. కనీసం 10-12 కిలోల బరువు పెరగాలి. తక్కువ బరువు ఉన్న మహిళలు తమ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.   బరువు పెరుగుటను నిశితంగా పరిశీలించాలి. అధిక బరువు ఉన్నవారు 5g-9kg కంటే ఎక్కువ బరువు పెరగకూడదు. చేయాల్సివి.. విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరి, జామ,  నారింజ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. మొక్కల ఆహారాలు ఐరన్  శోషణను మెరుగుపరుస్తాయి.  ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి. వికారం,  వాంతులు ఉన్నట్లయితే రోజుకు 4 నుండి 6 సార్లు చిన్న మొత్తంలో ఎక్కువ సార్లు   భోజనం చేయాలి. తగినంత విటమిన్ డి పొందడానికి కనీసం 15 నిమిషాల పాటు ప్రత్యక్ష సూర్యకాంతిలో గడపాలి. చేయకూడనివి.. కార్బోనేటేడ్ డ్రింక్స్ మానుకోవాలి. ధూమపానం చేయకూడదు.  పొగాకు తీసుకోకూడదు. మద్యం సేవించకూడదు. కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోకూడదు.   హైడ్రోజనేటెడ్ కొవ్వుతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. భారీ వస్తువులను ఎత్తకూడదు. లేదా కఠినమైన శారీరక శ్రమ చేయకూడదు.                                              *రూపశ్రీ.