ఓట్స్ బిస్కెట్స్
 

 

ఈ రోజుల్లో ఓట్స్ తో చేసే వంటకాలంటే  అందరూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఓట్స్ తో బిస్కెట్స్ తయారి ఎలాగో చూద్దాం.

కావలసిన వస్తువులు:

ఓట్స్‌-  1 కప్పు  
రాగివిండి- 1/2 కప్పు,
చక్కెర - 2 స్పూన్స్
వెన్న - 1 స్పూన్
 ఉప్పు - 1/2 స్పూన్
వాము - కొద్దిగా.  
 
తయారుచేసే విధానం:

స్టవ్ వెలిగించాకా కడాయిలో ఓట్స్‌ని కొంచం వెన్న వేసి వేయించి పొడి చేసుకుని, అందులో రాగి పిండి వాము, ఉప్పు, చక్కెర వేసి కాస్త నీళ్ళు పోసి పిండి కలిపి చపాతి లా వత్తి కావాల్సిన షేప్‌లో కట్‌ చేసుకుని ఓవెన్లో 15నిమిషాల పాటు 45 డిగ్రీల వద్ద బేక్‌ చేసుకుంటే మంచి కరకరలాడే టేస్టీ ఓట్స్‌  బిస్కెట్స్‌ తయారవుతాయి. ఇవి చాల రుచిగా ఉంటాయి. ఓవెన్‌ లేని వాళ్లు  కుక్కర్‌లో ఇసుక వేసి అందులో ఒక ప్లేట్ మీద బిస్కెట్స్‌ పెట్టి గ్యాస్‌కెట్‌ లేకుండా  మూత పెట్టి సన్నని మంటమీద 15 నిమిషాలుఉంచాలి.

                                                                                                                                                                                                                                                                                                                                                         ..కళ్యాణి