కేరళా ఆపం

 

 

 

కేరళ టిఫిన్స్ ఎంతో రుచిగానే కాదు ఆరోగ్యపరంగా కూడా తినటానికి బాగుంటాయి. ఆపాలు ఎలా చేస్తారా అంత స్మూత్ గా చూడటానికి తెల్లగా బాగుంటాయి అనుకునేదాన్ని. ట్రై చేసి చూస్తే నిజంగానే యమ్మిగా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. 

 

ఇంగ్రిడియంట్స్:

 

బియ్యం - 2 కప్పులు

 తురిమిన కొబ్బరి - 1/2 కప్పు 

వండిన అన్నం - 1/2 కప్పు 

ఈస్ట్ లేదా సోడా - చిటికెడు 

చక్కర - 2 స్పూన్స్ 

ఉప్పు - రుచికి తగినంత 

 

తయారి విధానం:

 

బియ్యాన్ని రెండు మూడు గంటలు నాననివ్వాలి. కొబ్బరి తురుమును,అన్నాన్ని మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి. తరవాత నానిన బియ్యాన్ని కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అలా  రుబ్బిన పిండిలో కొద్దిగా వంట సోడా గాని లేదా ఈస్ట్ ని గాని కలిపి ఒక రాత్రంతా నాననీయాలి. అల నానిన పిండిన పెనం మీద మామూలు దోసలంత పెద్దగా కాకుండా కాస్త చిన్న సైజులో వేసి ఎర్రగా కాలాకా తీసేయ్యాలి. రెండో వైపు కాల్చాల్సిన పని లేదు.                                                                                                        

  ...కళ్యాణి