ఇన్ స్టంట్ రాగి దోశ

 

 

కావలసిన పదార్థాలు:

రాగిపిండి                                                          - ఒక కప్పు
శనగపిండి                                                        - పావు కప్పు
పెరుగు                                                             - అరకప్పు
ఉప్పు                                                              - తగినంత

తయారీ విధానం:

ఓ బౌల్ లో పెరుగు తప్ప మిగతా పదార్థాలన్నింటినీ వేసి బాగా కలపాలి. ఆపైన కొద్దికొద్దిగా పెరుగు వేస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. మరీ చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు కలుపుకుని జారుడుగా చేసుకోవాలి. ఆపైన నూనెతో కానీ నేతితో కానీ దోశల్లాగా కాల్చుకోవాలి. ఈ దోశలు కొబ్బరి చట్నీతో చాలా బాగుంటాయి. రాగిపిండి కాబట్టి ఆరోగ్యానికి మంచిది కూడా.

- Sameera