బూడిద గుమ్మడి వడియాలు

 



కావలసినవి:

బూడిద గుమ్మడికాయ1
మినపప్పు-అరకిలో
పచ్చిమిర్చి-50గ్రా.
ఉప్పు-తగినంత
ఇంగువపొడి - కొద్దిగా

తయారీ:

ముందుగా బూడిద గుమ్మడికాయను ముందు రోజు రాత్రి బాగా కడిగి రాత్రిపూటే చిన్నచిన్న ముక్కలుగా కోసి  కొంచెం ఉప్పువేసిఆ ముక్కలన్నిటిని ఓ పల్చని బట్టలో మూటకట్టి ముక్కల్లో నీరంతా పోయేలా వాటి మీద బరువుని ఉంచాలి. మినపప్పు కూడా రాత్రి నానపెట్టుకోవాలి. తరువాతి రోజు  ఉదయాన్నే మినపప్పు  నీళ్లు తక్కువగా పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.  మిర్చి, ఉప్పు, ఇంగువ మెత్తగా పేస్ట్ లా చేసి పిండిలో  కలపాలి. తరువాత బూడిద గుమ్మడి ముక్కలు కూడా వేసి బాగా కలిపి ఒక ప్లాస్టిక్‌ కవర్‌ మీద మీడియం సైజులో వడియాలు పెట్టుకోవాలి. వడియాలు రెండువైపులా బాగా ఎండేలా చూసుకోవాలి. బాగా ఎండిన వడియాలను వేడి నూనెలో వేసి వేయించుకుని అన్నంతో పాటు కలిపి తినొచ్చు.