LATEST NEWS
The parents of some students from Bangalore were shocked when they looked into the text book of their children. The text book named ‘Current School Essays and Letters’ by Purabi Chakraborty has a controversial chapter named `Modern Girl’. Well if you are wondering why this chapter has become controversial, have a look at some of the statement mentioned in the chapter- “a modern girl is a self-centred creature than a loving daughter or sympathetic sister... She loves to wear jeans, pants and hot pants. The colourful saree has no place in the modern girl’s stock of garments.”  “She is eager to enjoy life fully and so she does not want to miss any party, cinema show, concert, fashion parades and such outdoor activities. She talks and makes friendship with boys freely and easily.” The Central Board of Secondary Education (CBSE) had to step into the scene and issue a warning to the schools to be careful while selecting text books for the students.
  The flash floods in Kerala have caused a devastation that could only occur once in a hundred years. Hundreds of people have lost their lives and property worth thousands of crores has been destroyed. However here is an interesting allegation from Kerala. The state has filed an affidavit with the Supreme Court claiming that Tamil Nadu is solely responsible for these flash floods. It accused that sudden release of flood waters from the Mullaperiyar dam was a cause for the floods in the State. Kerala has further alleged that their neighbouring state has ignored their continuous requests to release the water in a step by step process. However, Tamil Nadu has denied these allegations and said that they have given enough warnings to Kerala regarding the release of water.
  Well! All these days we have a feeling that Andhra Pradesh has suffered a huge loss of bifurcation of the state. Nothing has gone in the favour of the new state since four years. But now... here is a reason for the people in AP to have a broad smile. The Mines and Geology department has found a huge treasure in Chigargunta and Bisanatham areas of Chittoor district. The government officials have estimated that 1.83 metric tonnes of gold ore is present in the area and 9.4 tonnes of gold can be produced from the ore. The government might grab more than thousand crores by auctioning the ore. And that’s not the end of the news. The government is planning to revive defunct gold mines present in Anantapur district.
  India has achieved an exceptional record in the ongoing Asian Games. Rahi Sarnobat has become the first Indian woman to grab a gold medal in the 67 year old history of Asian Games. However the achievement of Rahi was not surprising looking at her past. She has already bagged two gold medals at the 2010 Delhi Commonwealth Games and a bronze in the 25m pistol pairs event at the 2014 Incheon Asian Games. She is also the sixth Indian to shoot  gold in the Asian games. India now stands at the 7th position with 4 gold, 3 silver and 8 bronze medals. And there are many more events yet to come which could shower medals to Indian athletes.  
Humanity would certainly show up from unexpected parts when a calamity occurs. Here is an example for that. A temple hall in Kochukadavu village of Thrissur district was offered for Eid prayers during the holy festival of Bakrid. Around 200 Muslim devotees entered the temple hall and participated in the prayers as the nearby mosque at Kochukadavu still remained in flood waters. The temple hall was also serving as the relief camp for the people of Kochukavdu and nearby Kuzhur village as well. However this is not only the isolated incident of communal harmony in Kerala. A mosque in Malappuram district has provided shelter and food to neighbouring Hindu families.
ALSO ON TELUGUONE N E W S
  మెగా కాంపౌండ్‌లోని కుర్ర హీరోల్లో తన రూటే సపరేట్ అంటున్నాడు వరుణ్ తేజ్. పైగా నటుడిగా తండ్రి నాగబాబును మించిన తనయుడిగా ఇప్పటికే పేరు తెచ్చేసుకున్నాడు. చేసింది తొమ్మిది సినిమాలే అయినా, ఒకదానికొకటి సంబంధం లేని స్క్రిప్ట్స్, కేరెక్టర్స్‌తో ఆశ్చర్యపరుస్తూ, ఆకట్టుకుంటూ వస్తున్నాడు. అందుకు లేటెస్ట్ మూవీ 'గద్దలకొండ గణేష్'.. నిఖార్సయిన నిదర్శనం. స్టార్‌గా ఎదుగుతున్న ఒక యువ హీరో.. కెరీర్ మొదట్లోనే ఒక మిడిల్ ఏజ్డ్ విలన్‌గా యాక్ట్ చేయడం.. ఏ రకంగా చూసుకున్నా సాహసమే. అంతేనా.. ఆ కేరెక్టర్‌ను ఎంతో మెచ్యూర్డ్‌గా పర్‌ఫాం చేసి ఇటు ఆడియెన్స్ చేతా, అటు క్రిటిక్స్ చేతా శెభాష్ అనిపించుకున్నాడు. ఆ కేరెక్టర్‌లోని క్రూరత్వాన్ని నిజమనిపించే రీతిలో ప్రదర్శించాడు. ఒక్కసారి వరుణ్ కెరీర్ ప్రస్థానాన్ని గమనిస్తే.. ఆరంభం నుంచి కూడా 'ఇమేజ్' అనే గిరి గీసుకొని అందులోనే ఉండిపోయే తత్వం కొంచెం కూడా కనిపించదు. ఆరడుగుల రెండంగుళాల పొడగరి అయిన వరుణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పుడు.. చాలామంది సీరియస్‌గా తీసుకోలేదు.. తండ్రి నాగబాబు తరహాలోనే అతడి కెరీర్ కూడా ఒడిదుడుకులుగా సాగుతుందని ఊహించిన వాళ్లే ఎక్కువ. "ఇతని మొహంలో ఏం ఎక్స్‌ప్రెషన్స్ పలుకుతాయి" అనే మాటలు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వినిపించాయి. హీరోగా తొలి సినిమా 'ముకుంద' వచ్చినప్పుడు, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా ఆడినప్పుడు.. "మేం ముందే చెప్పలేదా.. వరుణ్ సినిమాలకు పనికి రాడు. అతని యాక్టింగ్ చాలా అమెచ్యూరిష్‌గా ఉంది" అన్నారు. కానీ వరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందనీ, సాధన చేస్తే నటుడిగా ఎదుగుతాడనీ అతడి శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు.  వరుణ్ ఎక్కువ సమయం తీసుకోలేదు. వెరీ నెక్స్ట్ మూవీతోనే తనేమిటో, తనలోని నటుడు ఎలా ఉంటాడో రుచి చూపించేశాడు. ఆ మూవీ 'కంచె'. క్రిష్ డైరెక్ట్ చేసిన ఆ వార్ అండ్ లవ్ డ్రామా మూవీలో మొదట్లో ఒక ప్రేమికుడిగా, తర్వాత నాజీలపై పోరాటం చేసే భారత సైనికుడిగా రెండు భిన్న డైమెన్షన్స్ ఉన్న హరిబాబు అనే కేరెక్టర్‌ను సమర్థవంతంగా, సెటిల్డ్‌గా, మెచ్యూర్డ్‌గా చేసి.. తన విమర్శకులకు గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు. తన రెండో సినిమాలోనే మొదటి సినిమాతో ఏమాత్రం పోలికలేని కేరెక్టర్ చేసి, ఆ కేరెక్టర్‌లో అతడు రాణించిన తీరు చూసి, ఆశ్చర్యపడని వాళ్లు లేరు. ఆ సినిమాతో తనను తేలిగ్గా తీసుకోవద్దనే సంకేతాలు పంపాడు వరుణ్. మూడో సినిమా వచ్చింది. అది.. అతడు చేసిన తొలి రెండు సినిమాలకు పూర్తి భిన్నమైన మాస్ కేరెక్టర్. ఆ సినిమా.. 'లోఫర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఆ మూవీలో రాజా అనే ఒక కేర్‌లెస్ యూత్‌గా, టైటిల్ రోల్‌లో చాలా ఈజ్‌తో చేశాడు. అదే సమయంలో తల్లి ప్రేమ కోసం ఆరాటపడే కొడుకుగా.. అతడు కన్విన్సింగ్‌గా యాక్ట్ చేశాడు. ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపర్చినా, ఒక యాక్టర్‌గా వరుణ్ ఫెయిల్ కాలేదనే పేరు తెచ్చుకున్నాడు. కమర్షియల్‌గా చూసుకుంటే వరుణ్ కెరీర్‌లో ఇప్పటివరకూ వచ్చిన వాటిలో బ్యాడ్ ఫిల్మ్ 'మిస్టర్'. అది అతడి నాలుగో సినిమా. శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ డ్రామాలో స్పెయిన్‌లో స్థిరపడిన 'చై' అనే ఎన్నారై పాత్రలో నటించాడు వరుణ్. ఇద్దరు హీరోయిన్లతో డ్యూయెట్లు పాడటం అతడికి అదే తొలిసారి. సినిమాని తన భుజాలపై మోసుకొని వెళ్లినా, సబ్జెక్ట్‌లో సత్తా లేకపోవడం, బ్యాడ్ స్క్రీన్‌ప్లే కారణంగా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. స్క్రిప్టుల విషయంలో జాగ్రత్త వహించాలనే లెసన్‌ను.. ఈ మూవీ అతడికి నేర్పించింది. వరుణ్ కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ 'ఫిదా'. శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ లవ్ డ్రామా.. ఆడియెన్స్‌ను అమితంగా అలరించింది. అయితే ఇందులో వరుణ్ కంటే ఎక్కువగా సాయిపల్లవి మార్కులు కొట్టేయడం వేరే విషయం. స్టోరీ ప్రధానంగా ఆమె కేరెక్టర్ చుట్టూ నడుస్తుందనే విషయం తెలిసినా, ఆమె చేసిన భానుమతి పాత్రను పిచ్చిగా ప్రేమించే ఎన్నారై వరుణ్‌గా, ఆమె తన ప్రేమను మధ్యలో ఎందుకు తిరస్కరించిందనే విషయం తెలీక.. ఫ్రస్ట్రేషన్‌కు గురయ్యే ప్రేమికుడిగా.. సమర్థవంతంగా నటించి ఆకట్టుకున్నాడు వరుణ్. నటుడిగా అతడిని ఇంకో మెట్టు పైకెక్కించిన సినిమా 'ఫిదా'. వెంట వెంటనే రెండు హిట్లు కొట్టాడు వరుణ్. 'ఫిదా' తర్వాత అతడు నటించిన ఆరో సినిమా 'తొలిప్రేమ' సైతం ఆడియెన్స్‌ను అలరించింది. ఈ మూవీలో ట్రైన్‌లో పరిచయమైన వర్ష అనే అమ్మాయి ప్రేమలో పడిన ఆదిత్య అనే కాలేజ్ కుర్రాడి కేరెక్టర్‌లో, మోడ్రన్ లుక్‌లో కనిపించి మెప్పించాడు వరుణ్. వర్షతో గొడవ కారణంగా విడిపోయి, తిరిగి కాలేజీలో కలుసుకొని, తన ప్రేమను మళ్లీ బతికించుకొనే పాత్రలో పర్ఫెక్టుగా ఇమిడిపోయాడు. ఈ మూవీలో అతడి స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు వేశారు క్రిటిక్స్. ఆ తర్వాత మరోసారి తన ఛాయిస్‌తో ఆశ్చర్యపర్చాడు వరుణ్. ఏడో సినిమాగా 'అంతరిక్షం' అనే స్పేస్ థ్రిల్లర్‌ను ఎంచుకున్నాడు. 'ఘాజి' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న.. డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఈ మూవీలో 'మిత్ర' అనే శాటిలైట్‌ను రూపొందించిన దేవ్ అనే ఆస్ట్రోనాట్‌గా నటించాడు వరుణ్. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైనా.. ఒక డిఫరెంట్ కేరెక్టర్‌ను మెచ్యూర్డ్‌గా చేశాడనే పేరు సంపాదించుకున్నాడు. వరుణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ఎఫ్2'. ఇది అతడి తొలి మల్టీస్టారర్. సీనియర్ స్టార్ వెంకటేశ్‌కు తోడల్లుడిగా ఈ మూవీలో వరుణ్ సరికొత్తగా మనముందు ఆవిష్కృతమయ్యాడు. తొలిసారి పూర్తి స్థాయి కామెడీ రోల్‌లో అలరించాడు, నవ్వులు పూయించాడు. వెంకీ భార్య హారిక చెల్లెలు హనీని ప్రేమించి, ఆ అక్కచెల్లెళ్ల కారణంగా ఫ్రస్ట్రేషన్‌కు గురై వెంకీతో పాటు యూరప్‌కు ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన వరుణ్ కేరెక్టర్‌లో హైదరాబాదీ యాసను ఈజ్‌తో పలికి మెప్పించాడు. ఇవాళ తన తొమ్మిదో సినిమా 'గద్దలకొండ గణేష్'లో టైటిల్ రోల్‌లో వరుణ్ ఎలా చెలరేగిపోయాడో చూస్తున్నాం. ఇమేజ్‌లు, జోనర్లు లాంటివి ఏమీ పట్టించుకోకుండా, క్లాస్ - మాస్ అనే తేడా లేకుండా, పాజిటివ్ - నెగటివ్ అనే లెక్కలు వేసుకోకుండా.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్, డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ, నటుడిగా ఎలాంటి పాత్రైనా చేస్తాడనే పేరు తెచ్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు వరుణ్ తేజ్. ఇవాళ అతడు 'అమెచ్యూర్ ఆర్టిస్ట్' కాదు. విమర్శకుల్ని సైతం తన నటనతో అబ్బురపరుస్తూ ఫుల్‌ప్లెడ్జెడ్ ఆర్టిస్టుగా ఎదుగుతున్న టాలెంటెడ్ యాక్టర్. ఫ్యూచర్‌లో అతడి నుంచి మరిన్ని బెస్ట్ పెర్ఫార్మెన్సెస్‌ను మనం చూడబోతున్నామనేది వంద శాతం వాస్తవం.  
  వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేసిన 'గద్దలకొండ గణేష్' మూవీ తెలుగు రాష్ట్రాల్లో సేఫ్ దిశగా అడుగులు వేస్తోంది. ఫస్ట్ వీకెండ్‌లో పెట్టుబడిపై 67 శాతం రాబట్టడంతో, రానున్న రోజుల్లో సేఫ్ అవడమే కాకుండా ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెడతామన్న ఆశ బయ్యర్స్‌లో కనిపిస్తోంది. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఏరియాల్లో 'గద్దలకొండ గణేష్' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 19 కోట్ల 30 లక్షల రూపాయలు. మూడు రోజుల్లో ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ సుమారు 13 కోట్ల రూపాయలు. అంటే 67 శాతం రికవరీ వచ్చేసింది.  నైజాంలో బయ్యర్ పెట్టిన డబ్బు 7 కోట్ల 20 లక్షల రూపాయలు కాగా, 4 కోట్ల 50 లక్షల రూపాయల షేర్ వసూలయ్యింది. ఈ ఏరియాలో 62.5 శాతం రికవరీ అయ్యిందన్న మాట. రాయలసీమలో 3 కోట్ల 30 లక్షల మేరకు ప్రి బిజినెస్ జరిగితే, 2 కోట్లు రికవర్ అయ్యాయి. పెట్టుబడిలో 60 శాతం పైగా వచ్చేసినట్లే. ఇక ఆంధ్రా ఏరియాలో 'గద్దలకొండ గణేష్' ప్రి బిజినెస్ వాల్యూ 8 కోట్ల 80 లక్షల రూపాయలు. మూడు రోజుల్లోనే అందులో 6 కోట్ల 40 లక్షల రూపాయలు వచ్చేశాయి. అంటే 73 శాతం రికవరీ అయ్యింది. దీన్ని బట్టి నైజాం, రాయలసీమ ఏరియాలతో పోలిస్తే, ఆంధ్రాలో 'గద్దలకొండ గణేష్'పై ప్రేక్షకులు ఎక్కువ ప్రేమ చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా 'బి, సి' ఏరియాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ ఎక్కువగా కనిపిస్తోంది. 'ఎఫ్ 2' మూవీని పక్కనబెడితే, వరుణ్ తేజ్ సోలో హీరోగా నటించిన సినిమాల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ విషయంలో 'గద్దలకొండ గణేష్' టాప్ ప్లేస్‌లో నిలబడింది. రెండో రోజైన శనివారం కంటే, మూడో రోజైన ఆదివారం కాస్త ఎక్కువ షేర్ రావడం గమనార్హం. రెండో రోజు 3 కోట్ల 50 లక్షల షేర్ సాధించిన 'గద్దలకొండ గణేష్', మూడో రోజు 3 కోట్ల 90 లక్షల షేర్ కలెక్ట్ చేశాడు. సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గిపోతాయి కాబట్టి, సెకండ్ వీక్‌లో ఈ మూవీ బ్రేకీవెన్ సాధించవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 2న 'సైరా.. నరసింహారెడ్డి' వచ్చేంతవరకూ మార్కెట్‌లో 'గద్దలకొండ గణేష్'కు పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశం. కాకపోతే ఆంధ్రా ఏరియాని మినహాయిస్తే నైజాం, రాయలసీమ ఏరియాల్లో బయ్యర్లకు పెద్దగా లాభాలు రాకపోవచ్చని అంచనా. కాగా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ఆశించిన రీతిలో వసూళ్లను సాధించలేకపోతోంది. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ 2 కోట్ల 70 లక్షల రూపాయలకు అమ్ముడుపోగా, ప్రీమియర్స్‌తో కలుపుకొని ఫస్ట్ వీకెంట్‌లో వసూలయ్యింది కేవలం 1 కోటి 30 లక్షల రూపాయలు. అంటే రికవరీ శాతం 48 మాత్రమే. వీకెండ్‌లోనే ఇలా ఉంటే, వీక్ డేస్‌లో ఓవర్సీస్ ఏరియాలో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయనుకోవడం అత్యాశే! కాబట్టి ఆ ప్రాంతంలో 'గద్దలకొండ గణేష్' బ్రేకీవెన్ సాధించడం కష్టమని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ 'సైరా నరసింహారెడ్డి'. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ అభిమాన సందోహం మధ్య గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చిరు తమ్ముడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా కొణిదెల హీరోలు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి శ్రీమతి సురేఖ, కుమార్తెలు సుష్మిత, శ్రీజ... ఆఖరికి త్వరలో ఉప్పెన చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్న వైష్ణవ్ తేజ్ కూడా వచ్చారు. కానీ, అల్లు అర్జున్ మాత్రం ఈ వేడుకకు రాలేదు. అతని తమ్ముడు అల్లు శిరీష్ కూడా రాలేదు. అల్లు ఫ్యామిలీ నుండి అరవింద్ ఒక్కరే అటెండ్ అయ్యారు. వేదిక మీద ఆయన మైక్ పట్టుకోగానే... ముందున్న అభిమానులు వద్దంటూ చేతులు ఊపారు. ఈ హఠాత్ పరిణామంతో ఖంగు తినడం అల్లు అరవింద్ వంతయింది. ఒక్క విషయం ఒక్క విషయం చెబుతాను అంటూ అభిమానులను ఆయన రిక్వెస్ట్ చేశారు. అభిమానుల్లో అల్లు అరవింద్ పై వ్యతిరేకత వ్యక్తం కావడానికి అల్లు అర్జున్ కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 'చెప్పను బ్రదర్' ఇన్సిడెంట్ అభిమానులు ఇంకా మరిచిపోలేదని ‌ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే వైరా వేడుకకు అల్లు అర్జున్ ఎందుకు డుమ్మా కొట్టాడో అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్. హైదరాబాద్ సిటీ లోనే అల్లు అర్జున్ 'అల... వైకుంఠపురంములో' షూటింగ్ చేస్తున్నాడు. ఆ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకుడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ సంస్థ సినిమాను నిర్మిస్తుంది. సైరా వేడుకకు అల్లు అర్జున్ రావాలనుకుంటే... షూటింగ్ క్యాన్సల్ చేయడం పెద్ద సమస్య ఏమీ కాదు. ఒకవేళ ఆర్టిస్టుల డేట్స్ దొరకవు అనుకుంటే... త్వరగా షూటింగ్ పూర్తి చేయడం పెద్ద విషయం కాదు. అల్లు అర్జున్ కావాలనే రాలేదని మెగా అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా... అతడు గైర్హాజరు కావడం చర్చనీయాంశం అవుతోంది. అతడిపై మెగా అభిమానుల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది.
‘నానిస్‌ గ్యాంగ్‌లీడర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన బెంగళూరు భామ ప్రియాంకా అరుల్‌ మోహన్‌. సినిమా ఏ రేంజ్‌ హిట్‌ అనేది పక్కన పెడితే... అమ్మాయి హిట్‌ అయింది. ఫలితంతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో ప్రియాంకకు మంచి పేరు వచ్చింది. క్యూట్‌గా, పక్కింటి అమ్మాయిలా, పద్దతిగా ఉందన్నారు ప్రేక్షకులు. తెలుగులో తొలి సినిమా విడుదలకు ముందే మరో సినిమా ఛాన్స్‌ అందుకుందీ అమ్మాయి. శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న ‘శ్రీకారం’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఆల్రెడీ షూటింగ్‌ కూడా స్టార్ట్‌ చేసింది. తొలి సినిమాకు తెలుగు నేర్చుకోవడమే కాదు, డబ్బింగ్‌ కూడా చెప్పుకోవడంతో షూటింగులో వేరొకరు ప్రాంప్టింగ్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో ఈమెకు అవకాశాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. అసలే తెలుగులో హీరోయిన్ల కొరత ఉంది. కొత్త జోడీల కోసం దర్శకులు, నిర్మాతలు వేట సాగిస్తున్నారు. ఈమెకు ఇది ప్లస్‌ అయ్యేలా ఉంది.
  'సైరా.. నరసింహారెడ్డి' ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈవెంట్‌కు వేదికగా నిలిచిన ఎల్బీ స్టేడియం మెగా ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయింది. వేడుక మరో రెండు మూడు గంటల్లో మొదలవుతుందనంగా దాదాపు గంటన్నరసేపు ఏకధాటిగా వర్షం కురవడంతో చిరంజీవి బృందం, అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. స్టేడియం సీట్లు, గ్రౌండ్ ముద్దగా తడిసిపోయాయి. అయితే ఆ తర్వాత వర్షం ఆగడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అంచనాలకు తగ్గట్లుగానే ఈవెంట్ సజావుగా, కోలాహలంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు ప్రధానాకర్షణగా స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. అతిథులుగా హాజరైన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దేశంలోనే టాప్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి అదనపు ఆకర్షణ అయ్యారు. వి.వి. వినాయక్, కొరటాల శివ వంటి దర్శకులూ ఈ వేడుకకు వచ్చారు. ఇక చిరంజీవి మాతృమూర్తి మినహా ఆయన కుటుంబమంతా దాదాపు ఈ వేడుకకు హాజరయింది. 'సైరా' నిర్మాత హోదాలో రాంచరణ్, చిరంజీవి సతీమణి సురేఖ, కూతుల్లు సుస్మిత, శ్రీజ, కోడలు ఉపాసన్, బావమరిది అల్లు అరవింద్, మెగా హీరోలు వరుణ్ తేజ్, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు, మేనల్లుడు అల్లు అర్జున్ మాత్రం ఈ వేడుకకు రాలేకపోయారు. ఇక మూవీలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా నటించిన అమితాబ్ బచ్చన్ వస్తారేమోనని ఏ మూలో ఆశతో ఉన్న మెగా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురయ్యింది. ఇప్పటివరకూ 'సైరా'కు సంబంధించిన ఏ వేదికపైనా, ఏ ప్రచార కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనలేదు. చివరకు ఆ మధ్య ముంబైలో జరిగిన 'సైరా' టీజర్ రిలీజ్ ఈవెంట్‌లోనూ ఆయన కనిపించలేదు. అలాగే నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మ, ప్రియురాలు లక్ష్మి పాత్రల్ని పోషించిన నయనతార, తమన్నా.. ఈ వేడుకకు దూరంగా ఉండిపోయారు. అత్యంత అరుదుగా మాత్రమే సినిమా ప్రమోషన్‌లో పాల్గొనే నయనతార.. ఈ వేడుకకూ అదే నియమాన్ని పాటించింది. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్‌లో పాల్గొనే అలవాటున్న తమన్నా హాజరుకాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అనివార్య పరిస్థితుల వల్లే ఆమె రాలేకపోయిందని సమాచారం. సినిమాలో కొద్దిసేపు కనిపించే అవుకు రాజు కేరెక్టర్ చేసిన కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ మరో కీలక పాత్ర చేసిన భోజ్‌పురి స్టార్ రవికిషన్ కూడా అటెండ్ కాలేదు. వీరారెడ్డి పాత్రను చేసిన మన విలక్షణ నటుడు జగపతిబాబు, రాజాపాండి రోల్‌లో కనిపించనున్న తమిళ స్టార్ విజయ్ సేతుపతి కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా మాట్లాడారు కూడా. టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. ప్రధానమైన వాళ్లంతా హాజరయ్యారు. కథను సమకూర్చిన పరుచూరి బ్రదర్స్‌లో అగ్రజుడు వెంకటేశ్వరరావు ఈ ఈవెంట్‌కు రాగా, గోపాలకృష్ణ రాలేదు. డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఫైట్ మాస్టర్ రాం-లక్ష్మణ్ వంటి వాళ్లు హాజరయ్యారు. అమిత్ త్రివేది మ్యూజిక్ అందించగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారిన 'సైరా' టైటిల్ సాంగ్ ఈ వేడుకలో మరో ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి. ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగిన సాహిత్యం, దాని తగిన బాణీలతో కూడిన ఆ పాటను ప్రదర్శించగానే స్టేడియం అంతా కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ఇక వేదికపై ఉన్నంతసేపూ బాబాయ్ అబ్బాయ్.. పవన్ కల్యాణ్, రాంచరణ్ చాలా క్లోజ్‌గా గడిపారు. చరణ్ తరచూ బాబాయ్‌తో ఏదో ఒకటి చెబుతూ కనిపించాడు. అతిథులందరూ చిరంజీవితో పాటు, గొప్ప గట్స్‌తో భారీగా ఖర్చుపెట్టి 'సైరా'ను నిర్మించాడంటూ చరణ్‌ను పొగడ్తలతో ముంచేశారు. అన్నయ్య చిరంజీవిని చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాత్రలో చూడాలని ఎన్నో ఏళ్ల నుంచీ తాను అనుకుంటూ వచ్చాననీ, ఇప్పుడు ఆ పనిని తనకంటే చాలా చిన్నవాడైన చరణ్ చేశాడనీ పవన్ కల్యాణ్ ప్రశంసించాడు. తను ఇంటర్మీడియేట్‌లో ఫెయిలయినప్పుడు డిప్రెషన్‌కు గురై అన్నయ్య తుపాకీతో కాల్చుకొని చనిపోవాలని అనుకున్నాననీ, కానీ జీవితం ముందు ఇంటర్మీడియేట్ పరీక్ష ఫెయిలవడం పెద్ద విషయం కాదంటూ అన్నయ్య తనకు ధైర్యాన్నిచ్చాడనీ, ఆయనిచ్చిన ధైర్యం వల్లే ఈరోజు నేను మీముందున్నాను అంటూ ఎమోషనల్‌గా పవన్ మాట్లాడాడు. దాదాపు అరగంటసేపు మాట్లాడిన చిరంజీవి రాజమౌళి, రాంచరణ్, సురేందర్ రెడ్డిలను ప్రశంసించారు. రాజమౌళి 'బాహుబలి' సినిమాను తీయకపోతే, తాము 'సైరా'ను తలపెట్టేవాళ్లమే కాదని చెప్పి ఆశ్చర్యపరిచారు. 'బాహుబలి'తో రాజమౌళి తెలుగువాళ్లంతా గర్వపడేట్లు చేయడమే కాకుండా, ఎంతోమందికి ధైర్యాన్నిచ్చాడని కొనియాడారు. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏదడిగితే అది సమకూర్చి రాంచరణ్ ఎంతో ధైర్యంగా ఈ సినిమా నిర్మించాడని ఆయన అన్నారు. జాజియాలో ఒక్టిన్నర నెలపాటు షూట్ చేసిన వార్స్ సీన్స్ కోసమే 75 కోట్ల రూపాయల్ని ఖర్చుపెట్టాడని చిరంజీవి చెప్పారు. 'సైరా'ను యూత్ సినిమాగా ఆయన అభివర్ణించారు. సినిమా ఆరంభంలో, ముగింపులో రెండు నిమిషాల సేపు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ వస్తుందనీ, యూత్‌కు కనెక్టవడం కోసం ఆ వాయిస్ ఓవర్‌ను పవన్‌తో చెప్పించామనీ చిరంజీవి తెలిపారు. 'సైరాను' తెలుగువాళ్లు మాత్రమే కాకుండా భారతీయులందరూ గర్వించే సినిమాగా ఆయన అభివర్ణించారు. ఓవరాల్‌గా 'సైరా' ప్రి రిలీజ్ ఈవెంట్ సూపర్ సక్సెస్ అవడంతో మెగాస్టార్ బృందంతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఖుషీ అయ్యారు. ఇక మిగిలింది.. అక్టోబర్ 2న 'సైరా' మూవీ జనం ముందుకు రావడమే!
  రాజమౌళి 'బాహుబలి'ని తీసుండకపోతే, తాము 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాని తీసుండేవాళ్లం కాదనీ, 'సైరా' రావడానికి పరోక్షంగా రాజమౌళి దోహదం చేశారనీ అన్నారు చిరంజీవి. 'సైరా' ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ఆయన రాజమౌళిని ఘనంగా కీర్తించారు.  "నా 151వ సినిమాగా ఇది చేస్తే ఎలా ఉంటుంది అన్న మా ఆలోచనకు శ్రీకారం చుట్టిందీ, పరోక్షంగా సపోర్ట్ చేసిందీ దర్శకుడు రాజమౌళి. ఆయన గనుక 'బాహుబలి'ని తీసుండకపోతే, ఈ రోజు 'సైరా.. నరసింహారెడ్డి' వచ్చి ఉండేది కాదు. ఆయన మన తెలుగు సినిమాకి భారతదేశ వ్యాప్తంగా దారి వేశారు. శెభాష్. వందల కోట్లు పెట్టి తీసినా, అంతకు అంతా రాబట్టుకోవచ్చు, నిర్మాతకు నష్టం ఉండదు.. అని భరోసా ఇచ్చిన వ్యక్తి రాజమౌళి. హ్యాట్సాఫ్ టు రాజమౌళి. ఎంతోమందికి ధైర్యాన్నిచ్చాడు. తెలుగువాళ్లు గర్వపడేలా 'బాహుబలి' తీసి, 'సైరా' రావడానికి దోహదం చేసిన రాజమౌళికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా నిర్మించడానికి రాంచరణ్ ముందుకొచ్చాడు. కాంప్రమైజ్ కాకుండా మనమే  చేద్దామంటే, 'సై' అన్నాను. ఈ సినిమాకి డైరెక్టర్‌గా ఎవరు న్యాయం చేకూరుస్తారనుకుంటే, "మీరే డైరెక్ట్ చేయ్యండి" అని మొదట్నుంచీ నామీద నమ్మకమున్న పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నేను "వద్దండీ. డైరెక్షన్ అనేది ఫుల్‌ప్లెడ్జెడ్ జాబ్. ఒక వైపు యాక్టింగ్ చేస్తూ, దర్శకత్వానికి న్యాయం చెయ్యలేం. నేను చెయ్యలేక కాదు. దేన్నో ఒకటి వదిలెయ్యాలి. దేన్ని వదిలెయ్యమంటారు?" అన్నాను. 'అబ్బబ్బే.. డైరెక్షన్‌ను ఎవరికైనా అప్పగించండి కానీ ఆ కేరెక్టర్ మీరే చెయ్యాలి. ఆ కేరెక్టర్‌లో తెరపై మీరే కనిపించాలి' అన్నారు" అని చిరంజీవి చెప్పారు.
  "ఈ రోజు సెప్టెంబర్ 22. నా జీవితంలో ఒక అత్భుతమైన ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' రిలీజైన రోజు. ఆ రోజు 'నా సినిమా ప్రజల ముందు వెళ్తోంది, వాళ్లు చూస్తున్నారు.. ఎలా ఉంటుంది.. నా గురించి వాళ్లు ఏమనుకుంటారు.. నా భవిష్యత్తు ఎలా ఉంటుంద'నే మీమాంసతో నాలో ఒక మిశ్రమ భావన.. ఒక పక్క టెన్షన్.. ఒక పక్క ఎగ్జైట్‌మెంట్.. ఒక పక్క ఏదో తెలీని ఉద్విగ్నత.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో నేనీ నేలమీద లేనంటే.. ఒట్టు. అలాంటి టెన్షన్.. అలాంటి ఎగ్జైట్‌మెంట్.. అలాంటి ఉద్విగ్నత.. 41 ఒక్క సంవత్సరాల తర్వాత ఈ 2019 సెప్టెంబర్ 22న నేను ఫీలవుతున్నాననేది వాస్తవం. దానికి కారణం.. 'సైరా.. నరసింహారెడ్డి'.  ఒక పుష్కర కాలం నుంచీ ఈ కథ నాలో మెదులుతూ ఉంది. దానికంటే 20 సంవత్సరాల ముందు "మీరు చెయ్యాలనుకుంటున్న అద్భుత పాత్రలేవైనా ఉన్నాయా?" అనడిగితే, ఎప్పుడూ అంటుంటాను - "నాకు స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర చెయ్యాలని ఉంది. అది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పాత్ర అవ్వాలి. నా కెరీర్‌కి అది బెస్ట్ కేరెక్టర్ అవ్వాలి. ఆ పాత్ర.. భగత్ సింగ్" అని. కానీ ఎందుకో భగత్ సింగ్ కథను ఏ కథకుడూ తీసుకు రాలేదు. ఏ నిర్మాతా, ఏ దర్శకుడూ తీసుకు రాలేదు. అలా ఆ కోరిక, ఆ కల అలాగే ఉండిపోయింది. పుష్కర కాలం ముందు పరుచూరి బ్రదర్స్‌లో ఒకరైన పరుచూరి వెంకటేశ్వరరావు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెప్పారు. కర్నూలు జిల్లా ఉయాలవాడలోని నొస్సం దగ్గర ప్రాంతానికి చెందిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడనీ, ఆ పాత్ర నాకు బాగుంటుందనీ, అందులో ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయనీ చెప్పారు. 'సినిమాగా ఎంత సక్సెస్ అవుతుందనేది పక్కనపెడితే, ఒక యోగి లాంటి స్వాతంత్ర్య సమరయోధుడి కథని మన తెలుగువారికి, భారతీయులందరికీ తెలియజెప్పినట్లు ఉంటుంది.. అలాంటి హీరో ఆయన.. అది మీరు చెయ్యాలి' అంటూ అప్పట్నుంచీ అడుగుతూనే ఉన్నారు.  అక్కడి రెండు మూడు జిల్లాల్లోని చరిత్ర పరిశోధకులకో, ఏ కొంతమందికో తప్ప ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఆ టైంలో నాకూ తెలీదు. నా చుట్టుపక్కల వాళ్లని అడిగినా తమకూ తెలియదన్నారు. ఏవో నలభై, యాభై పేజీల పుస్తకాలు, స్థానికంగా బుర్రకథలు, కొన్ని ఒగ్గు కథలు.. వంటివి ఉన్నాయి తప్ప, ఆయన గురించిన ప్రాచుర్యం ఏ ప్రాంతానికీ పాకలేదు. కానీ ఆయన కథ విన్నప్పుడు ఒక అన్‌సంగ్ హీరో స్టోరీ, తెరమరుగైపోయిన ఒక యోధుడి కథ అనిపించింది.  మనకు 1857 సిపాయిల తిరుగుబాటు, అప్పటి మంగళ్ పాండే, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి తెలుసు. ఆ తర్వాత కాలానికి చెందిన చంద్రశేఖర అజాద్, భగత్ సింగ్, నేతాజీ, మహాత్మా గాంధీ వంటి ఎంతోమంది యోధుల గురించి మనకు తెలుసు. కానీ తెరమరుగైపోయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను జనం ముందుకు తీసుకురావాలి. ఆయన తెలుగువాడు.. అనేది మైండ్‌లో గట్టిగా ఉండిపోయింది. ఈ సినిమా చెయ్యాలని ఎప్పుడైతే పరుచూరి బ్రదర్స్ సంకల్పించారో, నన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేశారో, యెస్.. చెయ్యాలి.. అనే బలమైన కోరిక నాలో ఏర్పడిపోయింది. ఇలాంటి కథ కోసమే ఎదురుచూస్తున్నాను అనిపించింది. అయితే - ఇలాంటి కథకు న్యాయం చెయ్యాలంటే బడ్జెట్ ప్రాబ్లెం అనిపించింది. పది, పదిహేనేళ్ల క్రితం నాపై ముప్పై, నలభై కోట్లు పెట్టి సినిమా తీసే రోజుల్లో ఇది.. అరవై, డెబ్భై కోట్ల పైన అవుతుంది.. ఏ నిర్మాతా ముందుకు రాలేడు.. ఏ నిర్మాతనీ చెయ్యమని అడగలేం. నష్టపోయే పరిస్థితి. అలా బడ్జెట్ సపోర్ట్ లేక, ఏ నిర్మాతా ముందుకు రాక.. ఆగిపోయింది." అని ఆయన చెప్పారు.
  మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ మూవీ 'అల.. వైకుంఠపురములో..' 2020 సంక్రాంతికి విడుదలవుతున్నట్లు ఇప్పటికే వాటి నిర్మాతలు ప్రకటించారు. దాంతో మహేశ్, బన్నీ మధ్య సంక్రాంతి పోటీ అనివార్యమయింది. తాజాగా మరో హీరో కూడా వాళ్ళతో పోటీ పడేందుకు సై అంటున్నాడు. అతను నందమూరి క‌ల్యాణ్‌రామ్. అవును. అతను హీరోగా నటిస్తోన్న 'ఎంత మంచివాడవురా' సినిమాను 2020 జనవరి 15న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించారు.  క‌ల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మ్యూజిక్  ఫిల్మ్స్ సంస్థ భారీగా తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఎంత మంచివాడ‌వురా'. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాత‌లు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రానికి స‌మ‌ర్ప‌కులు. 'శ‌త‌మానం భ‌వ‌తి'తో జాతీయ పుర‌స్కారం అందుకున్న స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో మెహ‌రీన్‌  క‌థానాయిక‌.  చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన ఉమేష్ గుప్తా, చిత్ర స‌మ‌ర్ప‌కులు శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌ మాట్లాడుతూ "ఆగ‌స్టు 26 నుంచి  రాజ‌మండ్రి, పెండ్యాల‌, పురుషోత్త‌మ‌ప‌ట్నం, వంగ‌ల‌పూడి, తొర్రేడు, కొవ్వూరు, కోటిప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో సన్నివేశాలు చిత్రీక‌రిస్తున్నాం. ఈ నెల 25 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంది.  ఏక‌ధాటిగా  జ‌రుగుతున్న  ఈ షెడ్యూల్లో కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తున్నాం. హీరో, హీరోయిన్ల‌తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నారు.  తొర్రేడులో రూ. 35 ల‌క్ష‌ల వ్య‌యంతో భారీ జాత‌ర సెట్ వేశాం.  అక్క‌డ క‌ల్యాణ్‌రామ్‌, న‌టాషా దోషి ('జై సింహా' ఫేమ్‌)పై ఒక సాంగ్ షూట్ చేశాం. ఈ చిత్రీక‌ర‌ణ‌లో 50 మంది డ్యాన్స‌ర్లు, 500 మంది జూనియ‌ర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. అలాగే పెండ్యాల‌లోని ఇసుక ర్యాంపుల మ‌ధ్య భారీ ఎత్తున తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్ అవుతుంది. వంగ‌ల‌పూడి స‌మీపంలో గోదావ‌రిలో 16 బోట్ల‌తో తెర‌కెక్కించిన ఉత్కంఠ‌భ‌రిత‌మైన‌  క్లైమాక్స్ అల్టిమేట్‌గా ఉంటుంది. జ‌న‌వ‌రి 15న సంక్రాంతి కానుక‌గా  చిత్రాన్ని విడుద‌ల చేస్తాం" అని చెప్పారు.   ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న మాట్లాడుతూ "రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లోని అందాల‌ను మా 'ఎంత మంచివాడ‌వురా'లో మ‌రోసారి చూపించ‌బోతున్నాం. అక్టోబ‌ర్ 9 నుంచి 22 వ‌ర‌కూ హైద‌రాబాద్‌లో  మూడో షెడ్యూల్ ఉంటుంది. ఆ త‌ర్వాత  కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌ల్లో జరిగే నాలుగో షెద్యూల్లో కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది" అని తెలిపాడు.  వి.కె. న‌రేశ్‌, సుహాసిని, శ‌ర‌త్‌బాబు, త‌నికెళ్ల భ‌ర‌ణి, ప‌విత్రా లోకేశ్‌, రాజీవ్ క‌న‌కాల‌, వెన్నెల‌కిశోర్‌, ప్ర‌వీణ్‌, ప్ర‌భాస్ శ్రీను త‌దిత‌రులు తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్, సినిమాటోగ్రఫీ: రాజ్ తోట, ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: రామాంజనేయులు, రచన-దర్శకత్వం: సతీశ్ వేగేశ్న.
  వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేయగా హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్' (వాల్మీకి) మూవీ రెండో రోజు కూడా చెప్పుకోదగ్గ రీతిలో కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.5 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 3.50 కోట్లను వసూలు చేసింది. వెరసి 'గద్దలకొండ గణేష్' రెండు రోజుల షేర్ రూ. 9 కోట్లు దాటింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య 25 శాతం తగ్గింది. అయినప్పటికీ ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఆదివారం ఎంత తక్కువ అంచనా వేసుకున్నా రూ. 3 కోట్లు రావడం గ్యారంటీ అని, దాంతో తొలి వారాంతం ఈ సినిమా కలెక్షను రూ. 12 కోట్ల మార్కును దాటుతుందని ఊహిస్తున్నారు. నైజాం, ఆంధ్రా, రాయలసీమ ఏరియాల ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 20 కోట్లని విశ్లేషకుల అంచనా. అంటే మూడు రోజులకు 60 శాతం పైగా రికవరీ అయినట్లే.  నైజాంలో తొలి రోజు రూ. 1.6 కోట్లు వసూలవగా, రెండు రోజులకు అది రూ. 3 కోట్ల మార్కును దాటింది. ఇక్కడ బయ్యర్ సేఫ్ అవ్వాలంటే ఇంకో రూ. 4.4 కోట్ల షేర్ రావాలి. రాయలసీమలో రూ. 3.35 కోట్ల ప్రి బిజినెస్ జరగ్గా, రెండు రోజుల్లో అక్కడ రూ. 1.4 కోట్ల షేర్ వచ్చింది. ఇక ఆంధ్రా ఏరియా మొత్తం కలిపి రూ. 9.25 కోట్ల ప్రి బిజినెస్ జరిగింది. రెండు రోజుల్లో ఈ ప్రాంతంలో రూ. 4.6 కోట్ల షేర్ వసూలయ్యింది. 'గద్దలకొండ గణేష్'కు అసలు పరీక్ష సోమవారం నుంచి ఎదురవనున్నది. 
  ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ దగ్గర నుంచి సేకరించి, 'సైరా' షూటింగ్ విషయంలో సహకరించే నిమిత్తం తమకు రూ. 50 కోట్లు ఇస్తామని మాటిచ్చి రాంచరణ్ తమను మోసం చేశారని నరసింహారెడ్డి కుటుంబీకులు ఆరోపించారు. ఈ మేరకు 'సైరా' నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, మరో నలుగురిపై వారు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  నరసింహారెడ్డి కథ కోసం రాంచరణ్ ఏడాది క్రితం తమను కలిశారనీ, 'సైరా.. నరసింహారెడ్డి' పేరుతో సినిమా తీస్తున్నట్లు చెప్పి, 22 మంది కుటుంబ సభ్యుల దగ్గర్నుంచి నరసింహారెడ్డి కథను పూర్తిగా తెలుసుకున్నారనీ ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. సినిమాకు సహకరించడానికి తమకు రూ. 50 కోట్లు ఇస్తామని 2018 ఆగస్ట్ 20న రాంచరణ్ మాటిచ్చారనీ, కానీ ఇంతవరకూ ఆ డబ్బు ఇవ్వలేదనీ వారు ఆరోపించారు. అందుకు భిన్నంగా 2019 మార్చి 13న తమ కుటుంబ సభ్యుల్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఆఫీసుకు పిలిపించి కేవలం రూ. 25 వేలు ఇచ్చి, బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారనీ, త్వరలోనే ఫైనల్ సెటిల్‌మెంట్ చేస్తామని హామీ ఇచ్చారనీ వారు ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయమై ఆగస్ట్ 8న, సెప్టెంబర్ 16న రాంచరణ్‌ను కలవడానికి ప్రయత్నించామనీ, కానీ ఆయన మనుషులు తమను చంపుతామని బెదిరించారనీ వారు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ తమకు న్యాయం చెయ్యకపోతే సెప్టెంబర్ 22 సాయంత్రం ఎల్బీ స్టీడియంలో జరిగే 'సైరా' ప్రి రిలీజ్ వేడుకను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమ ఆరోపణలకు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని కూడా వారు చెప్పారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినవారిలో నంద్యాలకు చెందిన దొరవారి దస్తగిరిరెడ్డి, దొరవారి లక్ష్మీకుమారి, సాంబశివారెడ్డి, జయరామిరెడ్డి, జగదీశ్‌రెడ్డి ఉన్నారు.
  అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర నిన్నరాత్రి విషాదం చోటు చేసుకుంది. అమీర్ పేట మెట్రో స్టేషన్ దగ్గర జోరుగా వర్షం కురుస్తుండటంతో, అప్పుడే తన సోదరితో కలిసి మెట్రో రైలు దిగిన ఓ యువతి తడవకుండా ఉండేందుకు మెట్రో పిల్లర్ కిందకు వెళ్లింది. కొద్ది సేపటికే పైనుంచి పెచ్చులు ఊడి నేరుగా ఆమె తలపై పడ్డాయి, అంతెత్తు నుంచి పడ్డ పెచ్చుల ధాటికి ఆమె తల పగిలిపోయింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.  వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె ప్రాణాలు విడిచింది. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద చోటు చేసుకున్న ఈ ఘటన హైదరాబాదీలను భయపెడుతోంది. మృతురాలిని కూకట్ పల్లిలో నివాసముంటున్న మౌనికగా గుర్తించారు. మౌనికా స్వస్థలం మంచిర్యాల జిల్లా శ్రీరాం పూర్, భర్త కంతాల హరికాంత్ రెడ్డి, ఏడాది క్రితమే వీరికి వివాహమైంది. హరికాంత్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో ఉద్యోగం రావటంతో ఆరు నెలల క్రితమే ఈ దంపతులు నగరానికొచ్చి కూకట్ పల్లి ఫేస్ త్రి ఎస్సార్ హోమ్స్ లో నివాసముంటున్నారు. తన చిన్నాన్న కూతురు నికితను అమీర్ పేటలో ని ఓ ప్రైవేట్ హాస్టల్లో చేర్పించేందుకు మౌనిక ఆదివారం మధ్యాహ్నం కూకట్ పల్లిలో మెట్రో రైలు ఎక్కింది. ఇద్దరూ కలిసి అమీర్ పేటలో దిగారు, వర్షం కురుస్తుండటంతో సారధీ స్టూడియో వైపు ఉన్న మెట్ల ద్వారా కిందకు దిగారు. ఇద్దరు ఏ 1053 మెట్రో పిల్లర్ కింద నిలుచున్నారు, అనుకోకుండా మూడో అంతస్థులోని గోడకు చెందిన పెచ్చులు ఒక్క సారిగా ఊడి మౌనిక తలపై పడ్డాయి. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పెచ్చులు పడటంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆమె సోదరి, స్థానికుల్లో కొందరు కలిసి బాధితురాల్ని ఓ ఆటోలో హుటాహుటిన దగ్గర్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక మృతి చెందినట్టు నిర్ధారించారు. సోదరిని హాస్టల్లో చేర్పించి గంటలో తిరిగి వస్తారని తనతో చెప్పి వెళ్లిన భార్య కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు వెళ్లిందని తెలిసి మౌనిక భర్త హరికాంత్ రెడ్డి షాక్ కు గురయ్యాడు, మృతదేహం వద్ద బోరున విలపించాడు. పెళ్లైన సంవత్సరానికే తనను వీడి వెళ్లిపోయావా అంటూ అతడు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. సర్ఫేస్ వాల్ నుంచి చిన్న ప్లాస్టర్ ముక్క పడిందనీ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. తొమ్మిది మీటర్ల ఎత్తు నుంచి పడటంతో ఆమె తీవ్రంగా గాయపడి చనిపోయిందని చెప్పారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమన్నారు, మౌనిక కుటుంబానికి పరిహారమివ్వాలని ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకు ఎన్వీఎస్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ కే తలమానికంగా ఉన్న మెట్రో రైలుకు సంబంధించి జరిగిన ఈ దుర్ఘటన నగర వాసులను భయపెడుతోంది. హైదరాబాదీల జీవితంలో భాగమైన మెట్రో రైల్లో ప్రమాదం జరగటం ప్రజలల్ని ఆందోళనకు గురిచేస్తోంది. మెట్రో నిర్మాణంలో లోపాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. హడావుడిగా మెట్రో నిర్మాణాన్ని ముగించటం, ప్రీ కాస్ట్ విధానంలో నిర్మించిన పిల్లర్లు, వాటిపైన ఏర్పాటు చేపట్టిన వడయాక్ట్ సిగ్మెంట్ల మధ్య ఖాళీ ప్రదేశాన్ని పటిష్ఠంగా మూసివేయకపోవడం, ఇప్పటికీ రవాణా కొనసాగుతున్న స్టేషన్ల దగ్గర ఇంకా నిర్మాణ పనులు కొనసాగిస్తూనే ఉండడం, మెట్రో రైళ్లు పరిగెత్తే సమయంలో పిల్లర్ల వణకడం, ప్రీ కాస్ట్ కాంక్రీటు నిర్మాణానికి దానిపైన చేసిన సిమెంట్ బాండింగ్ కి మధ్య పటిష్టంగా లేకపోవడం ఈ పెచ్చులూడటానికి కారణంగా తెలుస్తోంది.
  వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అంటూ శంఖారావం మోగించింది. అందులో భాగంగా ఏకంగా 'ప్రజావేదిక' నే కూల్చి వేసింది. ప్రజాధనాన్ని వృథా చేసిందని విమర్శలు కూడా ఎదుర్కొంది అది వేరే విషయం. ఆ కూల్చివేత ప్రజావేదిక తో ఆగిపోలేదు. పలువురు ప్రతిపక్ష టీడీపీ నేతలకు నోటీసులు వచ్చాయి. కొన్ని భవనాలు నేలమట్టమయ్యాయి కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు గురించి మాట్లాడుకోవాలి. ఉండవల్లిలో నివాసం ఉంటున్న ఇంటికి ఇప్పటికే సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇంటిని ఖాళీ చేయాలనీ చెప్పారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆ ఇల్లు అక్రమ నిర్మాణం, దాన్ని కూల్చివేయాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నట్టుండి మళ్లీ తెరమీదకు వచ్చింది. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆయన ఇంటి గోడకు అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని రమేష్‌ పేరుతో సీఆర్డీఏ నోటీసులు అంటించింది. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన నోటీసులనూ ప్రస్తుత నోటీసులో సీఆర్డీఏ అధికారులు పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన సీఆర్డీఏ నోటీసులకు ఇంటి యజమాని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే రమేష్‌ వివరణ సంతృప్తికరంగా లేదని సీఆర్డీఏ నోటీసులో పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్ లను నిర్మించారని తెలిపారు. కాగా, ఈ నోటీసుల వ్యవహారంపై లింగమనేని రమేష్ స్పందించారు. ఇంటి నిర్మాణ సమయానికి సీఆర్డీఏ లేదని పేర్కొన్నారు. ఉండవల్లి పంచాయతీ అనుమతి తీసుకుని ఇంటిని నిర్మించామని తెలిపారు. స్విమ్మింగ్‌పూల్‌కి రివర్‌ కన్సర్వేటర్‌ అనుమతి ఉందని రమేష్‌ వెల్లడించారు. మరి ఈ నోటీసుపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. గతంలో రమేష్ వివరణతో సంతృప్తి చెందని అధికారులు.. ఈసారి మాత్రం సంతృప్తి చెబుతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చంద్రబాబు వారం రోజుల్లో ఇంటిని ఖాళీ చేయక తప్పేలా లేదు. అదే జరిగితే అధికార పార్టీ పంతం నెగ్గినట్టే. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైసీపీ.. చంద్రబాబుని ఆ ఇంటి నుండి ఖాళీ చేయించాలని పట్టుదలతో ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
    హుజూర్‌నగర్ ఉపఎన్నిక... ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ నేతలను ఏకంచేసింది. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక అభ్యర్ధిత్వంపై తలెత్తిన వివాదంతో నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా ఏకమయ్యారు. హుజూర్‌‌నగర్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్ధిగా తన భార్య పద్మావతిని ఉత్తమ్ ప్రకటించడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించడంతో సీనియర్లంతా ఏకమవుతున్నారు. అసలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ ఏకతాటిపైకి వస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడూ ఉప్పూనిప్పులా ఉండే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మధ్య స్నేహం చిగురించింది. పార్టీలో రేవంత్ ఆధిపత్యం, ప్రాబల్యం పెరుగుతోందని భావిస్తోన్న సీనియర్లు ఏకమవుతున్నారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ తోపాటు  నల్గొండ కాంగ్రెస్‌ నేతలంతా రేవంత్‌‌పై మండిపడుతున్నారు. తాను రాజీనామాచేసిన తన సొంత నియోజకవర్గంలో నా భార్యను అభ్యర్ధిగా ప్రకటిస్తే తప్పేటంటూ ఉత్తమ్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అసలు మా జిల్లాలో వేలు పెట్టడానికి రేవంత్ ఎవరంటూ నల్గొండ కాంగ్రెస్ లీడర్లు ఫైరవుతున్నారు. తమ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం తమకుందని, ఇతరులు... తమ జిల్లా రాజకీయాల్లో వేలుపెడితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. అయితే, ఎప్పుడూ ఉత్తమ్ పై విమర్శలుచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.... హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పద్మావతిని గెలిపించుకుని తీరతామని ప్రకటించడంతో... ఉత్తమ్-కోమటిరెడ్డి మధ్య స్నేహం చిగురించింది. ఇన్ని రోజులూ పక్కలో బల్లెంలా ఉన్న కోమటిరెడ్డి... మద్దతివ్వడంతో ఊపిరిపీల్చుకున్న ఉత్తమ్‌.... మిగతా నేతలతో కలిసి రేవంత్‌ను టార్గెట్‌ చేయడం మొదలుపెట్టారు. ఇక కోమటిరెడ్డి అయితే, రేవంత్ పై సెటైర్లు వేశారు. కొత్తగా వచ్చినోళ్ల సలహాలు తమకు అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో విభేదాలున్నా, తాను, ఉత్తమ్, జానారెడ్డి ఒక్కటిగా పనిచేస్తున్నామంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు పీసీసీ రేసులో తాను ఒక్కడిని మాత్రమే ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి రేవంత్‌రెడ్డి మూలంగా నల్గొండ కాంగ్రెస్‌లో ఐక్యతారాగం వినిపిస్తోంది. ఇప్పటివరకు తిట్టుకున్న లీడర్ల మధ్య సరికొత్త స్నేహం చిగురించేలా చేసింది. ఒకరు ఔనంటే... మరొకరు కాదనే నేతలు ఇప్పుడు... తమ అందరిదీ ఒకే మాట అంటున్నారు. మరి ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి.
  గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో 1947 మే 2న జన్మించిన కోడెల... గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్.. వారణాసిలో ఎంస్ పూర్తి చేశారు. అసలు ఆరోజుల్లో వైద్య విద్యను అభ్యసించడమే గొప్ప అయితే, ఎంఎస్ పూర్తి చేయడం మరో సంచలనం. అంతేకాదు నర్సరావుపేటలో సొంతంగా ఆస్పత్రిని నెలకొల్పి రూపాయికే వైద్యం అందించడంతో పల్నాడులో కోడెల పేరు మోరుమోగిపోయింది. రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకున్న కోడెలను ప్రజలు ఎంతో అభిమానించేవారు. అందుకే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కోడెలను రాజకీయాల్లోకి రావాలని స్వయంగా కోరారు. ఎన్టీఆర్ స్వయంగా కోరడంతోనే అతి చిన్న వయసులో వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు కోడెల. అయితే, రాజకీయాల్లో వచ్చినా, ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా పనిచేసినప్పటికీ, కొద్దిరోజులు ప్రజలకు వైద్యసేవలు అందించారు. అందుకే కోడెల అంటే పల్నాడు ప్రజలకు అంత అభిమానం. కోడెలపై పల్నాడు ప్రజలకున్న అభిమానమే ఆయన్ను వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా చేసింది. 1983లో మొదటిసారి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోడెల శివప్రసాద్... అప్పట్నుంచి 1999వరకు వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో తిరుగులేని, ఎదురులేని నేతగా ఎదిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. 1987-88 మధ్య హోంమంత్రిగా, అలాగే, భారీ మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, 2004, 2019 ఎన్నికల్లో కోడెల ఓటమి చెందారు. 2014లో మళ్లీ సత్తెనపల్లి నుంచి విజయం సాధించి నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి స్పీకర్ గా సేవలందించారు. అయితే, కోడెలది తలదించని వ్యక్తిత్వం.... తలవంచని మనస్తత్వం... అంతేకాదు అత్యంత సున్నిత మనస్కుడు... స్నేహశీలి... పరువు కోసం ప్రాణాలిచ్చే మనిషి... అదే ఇప్పుడు ఆయన ప్రాణాలను బలిగొంది. చిన్న ఆరోపణను కూడా తట్టుకోలేని మనస్తత్వం కోడెలది... అలాంటిది వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే  ఒక్క కోడెలపైనే 19 కేసులు పెట్టింది. ఇక ఆయన కుమారుడు, కూతురుపై పెట్టిన కేసులకు లెక్కే లేదు. పైగా కోడెలపై దొంగతనం కేసు మోపడం... ఆ కేసుల్లో జీవితఖైదు పడే సెక్షన్లను పెట్టడం ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించింది. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి వంద రోజుల్లో వంద రకాలుగా వేధించడంతో కోడెల తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. రాజకీయాల్లో రాటుతేలిన నేత అయినప్పటికీ, చివరి రోజుల్లో అలాంటి అపనిందలను తట్టుకోలేకపోయారు. ముఖ్యంగా తనపై మోపిన అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగం నుంచి బయటపడేందుకు కోడెల తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని నిరూపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ముందుగా అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాశారు... ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, ప్రభుత్వానికి లేఖ రాశారు... తనను మానసికంగా క్షోభపెట్టొద్దంటూ వేడుకున్నారు... అసెంబ్లీ ఫర్నిచల్ తరలింపులో తన తప్పులేదని, హైదరాబాద్ నుంచి ఫర్నిచర్ ను తీసుకొచ్చే క్రమంలో అధికారులే తన క్యాంప్ కార్యాలయానికి తెచ్చిపెట్టారని, తన పదవీ కాలం పూర్తయిన తర్వాత  వెంటనే ఫర్నిచర్ ను తీసుకెళ్లమని కోరానని, లేదా వెల కడితే డబ్బు చెల్లిస్తానని జూన్ ఏడునే లేఖ రాశానని, కానీ అధికారులు స్పందించలేదని, ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శికి, స్పీకర్ కి లేఖలు రాశానని, అయినా స్పందించకుండా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోడెల ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఇప్పటికే తన కార్యాలయం నుంచి ఫర్నిచర్ ను తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లొచ్చని, కానీ తనను ఇబ్బంది పెట్టొద్దంటూ ప్రభుత్వానికి కోడెల విజ్ఞప్తి చేశారు. 37ఏళ్లుగా నిబద్ధతతో రాజకీయాల్లో ఉన్నానని, అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలుచేస్తూ, దొంగతనం కేసు మోపి, తనను మానసిక క్షోభకు గురిచేయవద్దని కోరారు. కానీ జగన్ ప్రభుత్వం కనికరించలేదు... కోడెలపై వేధింపులకు పాల్పడింది. 90రోజుల్లో 19 కేసులు పెట్టి క్షోభకు గురిచేసింది. కోడెలకున్న మంచి పేరును చెడగొట్టేందుకు కుట్ర చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో వైసీపీ నాయకులు, వైసీపీ మీడియా చేసిన రచ్చను కోడెల తట్టుకోలేకపోయారు. చివరి ఆ మనోవేదనతోనే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.
  'బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి' అనడానికి కోడెల జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో. గుంటూరు జిల్లాలో ప్రజలకు సుపరిచితుడైన వైద్యుడిగా ముద్ర వేసుకున్న కోడెల.. రాజకీయాల్లోకి ప్రవేశించి చెరగని ముద్ర వేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి సీనియర్ నేతగా రాష్ట్రవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా విశేష సేవలందించారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. గత కొంత కాలంగా వరుస ఆరోపణలతో సతమతమవుతున్న కోడెల.. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచారు. 2014 లో టీడీపీ విజయం తరువాత స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన కోడెల.. 2019 ఎన్నికలకు ముందు వరకు తన బాధ్యతను నిర్వర్తించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమితో ఆయనను సమస్యలు చుట్టుముట్టాయి. వరుస ఆరోపణలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కోడెల ఫ్యామిలీ సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల్లో కోడెల టాక్స్ పేరుతో.. ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా కోడెల కుమారుడు, కూతురిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇద్దరు పలువురి వద్ద డబ్బులు వసూలు చేసారని, కొందరికి డబ్బులు ఎగ్గొట్టారని ఇలా రకరకాలు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు కోడెల కుటుంబం మీద ఇంకా ఆరోపణలు వచ్చాయి. కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ మాయం చేసారని అధికార పార్టీ ఆరోపించింది. అయితే కోడెల మాత్రం తాను చెప్పే ఫర్నీచర్ తీసుకెళ్లానని, తిరిగి అప్పగించడానికి లేఖలు కూడా రాసానని చెప్పుకొచ్చారు. ఈ అసెంబ్లీ ఫర్నీచర్ అంశంలో కోడెల తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వీటికితోడు ఆయన అద్దె పేరుతో ప్రభుత్వ సొమ్ముని దోచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆయన గుంటూరులోని తన భవనాన్ని, వైద్య శాఖకు అద్దెకిచ్చి.. సరైన వసతులు లేకపోయినా అధికమొత్తంలో అద్దె వసూలు చేసారని వార్తలొచ్చాయి. అంతేకాదు ఆసుపత్రులకు సరఫరా చేసే దూది విషయంలో కూడా కోడెల కుటుంబం అవినీతికి పాల్పడిందని ఆరోపణలు వినిపించాయి. ఆసుప్రతులకు దూది సరఫరా చేసే కాంట్రాక్టు తీసుకున్న కోడెల ఫ్యామిలీ.. నాసిరకం దూదిని తెప్పించి సరఫరా చేసారని ప్రచారం జరిగింది.   వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కోడెల మీద ఇలా వరుస ఆరోపణలు వచ్చాయి. అయితే ఇదంతా కక్ష సాధింపేనని కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఉన్న సమయంలో తన బాధ్యతను నిర్వర్తిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసానని.. కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తరువాత దాన్ని మనసులో పెట్టుకొని తనను రాజకీయ వేధింపులకు గురి చేస్తుందని కోడెల ఫీలయ్యారు. అంతేకాదు ఈ వరుస ఆరోపణలతో కోడెల గుండెపోటుతో ఆసుపత్రిలో కూడా చేరారు. అయినా ఆయన మీద ఆరోపణలు ఆగలేదు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన కోడెల ఆత్మహత్య చేసుకుని లోకాన్ని విడిచారు. తెలుగు రాజకీయాల్లో సీనియర్ రాజకీయ నేతగా పేరు తెచ్చుకున్న కోడెల.. ఆరోపణలు, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం నిజంగా దురదృష్టకరం.
  ఏపీ సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ, బీజేపీ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పించగా.. తాజాగా జనసేన నివేదికను విడుదల చేసింది. 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. వైసీపీ పాలనలో పారదర్శక, దార్శనికత లోపించిందని నివేదికలో పేర్కొంది. వైసీపీ 100రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని.. డెంగీ, మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో ప్రభుత్వంలో సన్నద్ధత లోపించిందని చెప్పుకొచ్చింది. వరదల సమయంలో ప్రభుత్వం.. పునరావాస చర్యలు కూడా వేగంగా చేపట్టలేదని జనసేన తన నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. వైసీపీ 100 రోజుల పాలన ప్రణాళికాబద్ధంగా లేదని విమర్శించారు. పాలనలో దార్శనికత, పారదర్శకత లోపించిందని అన్నారు. ఎన్నికల్లో 150కి పైగా సీట్లను గెలుచుకున్న వైసీపీ పాలనపై కనీసం ఒక సంవత్సరం వరకు తాము మాట్లాడాల్సిన అవసరం ఉండదని అనుకున్నామని.. కానీ, మూడు వారాల్లోపే వారు తీసుకున్న ఆందోళనకర నిర్ణయాలు ప్రజలు ఆక్షేపించేలా ఉన్నాయని విమర్శించారు. ‘సీజనల్‌ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవడం విఫలం చెందింది. ఇసుక విధానాన్ని ఇంతవరకు ప్రకటించకపోవడం చేతగానితనం. ఇసుక పాలసీని ప్రకటించకపోవడం పట్ల ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. ఇసుక విధానం ప్రకటించకపోవడం వల్ల లక్షమంది నష్టపోయారు. ఇది పూడ్చుకోలేని నష్టం’ అని పవన్ చెప్పుకొచ్చారు.   ‘ఏపీ ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. వైసీపీ జనరంజక పథకాలు అమలు చేయాలంటే రూ.50వేల కోట్లు అవసరం, ఎక్కడ నుంచి తెస్తారు?. టీడీపీ హయాంలో అవకతవకలు జరిగితే సరిచేయండి. వైసీపీ తీరు వల్ల పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు.. కొత్త పరిశ్రమలు రావడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాల కోసం నడపొద్దు. ప్రభుత్వ విధానాలు రాజధాని భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశాయి’ అని పవన్ వ్యాఖ్యానించారు. ఏషియా పల్స్ అండ్ పేపర్ మిల్స్ పరిశ్రమ రూ.24 వేల కోట్ల పెట్టుబడితో ప్రకాశం జిల్లాలో ప్లాంట్ పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు.. రాష్ట్రంలో పరిస్థితులను చూసి ఆ కంపెనీ మహారాష్ట్రకు తరలిపోయిందని పవన్ గుర్తు చేశారు. రాష్ట్రానికి రూ. 2.58 లక్షల కోట్ల అప్పులున్నాయని.. దీనికి తోడు జగన్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే రూ.50 వేల కోట్లు కావాలని పవన్ తెలిపారు. ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ మళ్లీ కొత్త పథకాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. ‘ఏపీ ప్రజలకు పోలవరం జీవనాడి. పోలవరంలో అవకతవకలు జరిగితే విచారణ జరిపించాలి. పోలవరం ఆపేస్తే రైతాంగానికి, విశాఖ తాగునీటికి ఇబ్బంది. కృష్ణా వరదల సమయంలో సీఎం జగన్‌ అమెరికాలో ఉన్నారు. ఇక్కడున్న వైసీపీ పెద్దలు బిజీగా ఉండి వరదల నిర్వహణను పట్టించుకోలేదు. వరదల సమయంలో వైసీపీ మంత్రులు సరిగా నడుచుకోలేదు. వైసీపీ తీరు వల్ల వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. రాయలసీమకు వరద నీటిని తీసుకెళ్లలేకపోయారు.కృష్ణా వరదలతో ఓ ప్రాంతంలోని ఇళ్లు మునిగిపోతుంటే.. మంత్రులంతా మాజీ సీఎం ఇంటి ముంపుపై దృష్టిపెట్టారు’ అని పవన్ విమర్శించారు.
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశాన్ని నిలువునా ముంచేసిన వాటిలో ఇసుకదే అతిపెద్ద పాత్ర. ఇసుక మాఫియాతో కలిసి సామాన్య ప్రజలకు టీడీపీ నేతలు చుక్కలు చూపించడంతో, ఆ ఎఫెక్ట్ పార్టీపై తీవ్రంగా పడింది. అందుకే, ఎవ్వరూ ఊహించనివిధంగా టీడీపీ నెంబర్ 23కి పడిపోయింది. ఇదే మాట చెబుతూ జనసేనాని పవన్ కల్యాణ్... వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత ఎన్నికల్లో టీడీపీని ముంచేసింది ఇసుకేనని.... ఇప్పుడు అదే ఇసుకతో జగన్ సర్కారు గేమ్స్ ఆడుతోందని, ఇలాగైతే, టీడీపీకి పట్టిన గతే... వైసీపీకి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పవన్ విశ్లేషణలో నిజంగా వాస్తవముంది. టీడీపీని ముంచేసిన వాటిలో ఇసుకది అతిపెద్ద పాత్రేనని అంగీకరించాల్సి ఉంటుంది. గల్లీ లీడర్ నుంచి చోటామోట నేత వరకు దొరికినకాడికి దొరికినట్లు ఇసుకను దోచేసి... అధిక ధరలతో సామాన్యులకు చుక్కలు చూపించారు. పేరుకు ఉచితం అంటూ బాబు ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అది అమలు కాకపోవడంతో చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే జగన్ కు ఎదురవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల వరకు ఇసుక తవ్వకాలను నిలిపివేసి వైసీపీ ప్రభుత్వం... ఇటీవలే కొత్త పాలసీని ప్రకటించి, ఇసుక సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో కూర్చొని ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తేచాలు చౌకధరకే ఇంటికి ఇసుక సరఫరా చేస్తామంటూ జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, శాండ్ పాలసీ ప్రకటించి, ఇసుక సప్లైకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, జగన్ ప్రభుత్వంపై మాత్రం ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక కొరతపై ఆరోపణలు వస్తున్నాయి. డిమాండ్ కి తగినట్టుగా ఇసుక సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని గమనించిన సీఎం జగన్.... ఇసుక పాలసీ అమలు జరుగుతున్న తీరు... ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎక్కడికక్కడ ఇసుక రీచ్ లు, అలాగే స్టాక్ యార్డులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇసుక కొరత ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అలాగే ఇసుక అక్రమ రవాణా, మాఫియాను, అవినీతిని అరికట్టడానికి చెక్ పోస్టుల దగ్గర సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 25 రీచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, భారీ వర్షాలు వరదల కారణంగా కొత్త రీచ్ లను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు అధికారులు వివరించారు. అయితే, ఇసుక విషయంలో రాళ్లేయడానికి చాలామంది చూస్తున్నారన్న జగన్మోహన్‌రెడ్డి.... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
  'ఛలో ఆత్మకూరు' కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదన్న చంద్రబాబు.. అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆయనను అడ్డుకునేందకు ఉండవల్లిలోని ఆయన ఇంటి బయట పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు కారుని బయటకు రాకుండా అడ్డుకున్న పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా గేట్లు వేసి.. గేటు తెరిచేందుకు వీలు లేకుండా బయట నుంచి లావైన తాళ్లతో కట్టారు. గేటు బయట భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. గేటు లోపల కారులో కూర్చొని బయటకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీంతో చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నేతలు.. పోలీసులకు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తనను ఇంట్లో పెట్టి ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని ఆపలేరని అన్నారు. మరికాసేపట్లో ఛలో ఆత్మకూరుకు బయల్దేరుతామని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ‘ఛలో ఆత్మకూరు’ ఆగదన్నారు. ఎన్నిరోజులు తనను హౌస్ అరెస్ట్ చేస్తారు? అంటూ ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ అణిచివేత వైఖరిని ప్రజా సంఘాలు, మేధావులు అందరూ ముక్తకంఠంతో ఖండించాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న టీడీపీని అణిచేయాలని చూస్తున్నారన్నారు. ఆత్మకూరు బాధితులను తానే గ్రామానికి తీసుకెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుతో సహా పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ సర్కార్ భయంతోనే అరెస్ట్ లు చేసి 'ఛలో ఆత్మకూరు' ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ దౌర్జన్యాలు బయటపడతాయని భయంతోనే ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
  గులాబీ పార్టీలో ఇంటర్నల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. కొద్దిరోజులుగా టీఆర్ఎస్ లో అసంతృప్తి రాజుకుంటోంది. ఎన్నడూ నోరెత్తని నేతలు తమ గొంతులు సమరించుకుంటున్నారు. ఎన్నడూ గీత దాటని నాయకులు, ధిక్కారగళంతో కళ్లెర్రజేస్తున్నారు. అధిష్టానానికి అతిదగ్గరగా ఉన్న నేతలే ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. కేసీఆర్ గీసిన గీతను దాటని నేతలు, ఒకరి తర్వాత మరొకరు నోరు తెరుస్తున్నారు. ఈటల బాటలోనే ఒక్కొక్కరుగా బయటికొస్తున్నారు. తమలో గూడకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పూర్తిస్థాయి కేబినెట్ కూర్పుతో, ఇక మంత్రి పదవి రాదని డిసైడైన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈటల, రసమయి మాటల మంటలు చల్లారకముందే, మరో రెండు గొంతులు ధిక్కార స్వరం వినిపించాయి. కేసీఆర్‌కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అయితే... తామంతా ఓనర్లమేనంటూ ఈటల మాదిరిగానే కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఈ కిరాయిదార్లు ఎంతకాలం ఉంటారో చూద్దామంటూ సెటైర్లు వేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి, కేసీఆర్ మాట తప్పారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే, కౌన్సిల్‌లో ఉండు... మంత్రి పదవి ఇస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే, ఇప్పుడు తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇస్తారంటూ ఊహాగానాలు వినిస్తున్నాయని, కానీ ఆ పదవి తనకు వద్దే వద్దన్నారు...... ఇక మాజీ డిప్యూటీ సీఎం, ఘన్ పూర్ ఎమ్మెల్యే, తాటికొండ రాజయ్య కూడా ఇదే తరహాలో కేసీఆర్ పై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తెలంగాణలో 12శాతమున్న మాదిగలకు కేబినెట్‌లో చోటు దక్కలేదని, మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అయితే, విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని ఆరోపిస్తారని, రాజయ్య కామెంట్లు చేయడం కలకలం రేపుతోంది. మరో సీనియర్‌ నేత పద్మారావు కూడా అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. మొదటి నుంచీ, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న పద్మారావుకు, డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టినా.. ఆ పదవిపై అయిష్టంగానే ఉన్నట్లు ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉన్న తమకు, ప్రాధాన్యత ఇవ్వటం లేదనే భావనలో పద్మారావు ఉన్నట్టు తెలుస్తోంది. ఇలాంటి సీనియర్ నేతలంతా, ఈటల తరహాలోనే ఏదో ఒక రోజు బ్లాస్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదనే చర్చ పార్టీలో జరుగుతోంది. మొత్తానికి ఈటల రేపిన మంటల స్ఫూర్తిగా ఒకరి తర్వాత మరొకరు అసంతృప్తిగళం వినిపిస్తుండటం... గులాబీ పార్టీలో అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఈటల పార్టీపరంగా మాట్లాడితే, రసమయి మరో అడుగు ముందుకేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీ బోర్డు పోయి టీఎస్ వచ్చింది తప్పా... ఏమీ మారలేదంటూ చేసిన కామెంట్స్... అటు పార్టీని... ఇటు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. మొత్తానికి ఇంతకాలం కేసీఆర్ మాటను జవదాటని నేతలు, ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఆర్ఎస్‌లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి ఒక్కటే కారణంగా తెలుస్తోంది. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లను అందలమెక్కిస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకీ పెరిగిపోతుందని, ఇది ఏదోఒక రోజు అగ్నిపర్వతంలా బద్దలయ్యే ఛాన్సుందని అంటున్నారు.
  ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తామని చెప్పింది. అయితే నాణ్యం మాట దేవుడెరుగు, గతంలో కంటే నాసిరకమైన బియ్యం పంపిణీ చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలని నిర్ణయించి, ఈ మేరకు పైలట్‌ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో జిల్లాలో పంపిణీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇలా పంపిణీ అయిన బియ్యం సంచుల్లో ముక్కిపోయిన బియ్యం వెలుగులోకి రావడంతో లబ్ధిదారుల్లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రగిలాయి. ముఖ్యంగా ఈ విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. "సంచి ఘనం, బియ్యం దారుణం".. "సంచి డిజైన్ మీద పెట్టిన శ్రద్ధతో సగం బియ్యం మీద పెట్టుంటే బాగుండేది" అంటూ ఇలా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ నేతలు వైసీపీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఇవేనా మీరు ఇస్తానన్న నాణ్యమైన బియ్యం అంటూ మండిపడుతున్నారు.     ఈ విషయంపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. వైసీపీ వైఫల్యాలకు వారు పంపిణీ చేసిన బియ్యమే రుజువు అని అన్నారు. ముందు ‘సన్నబియ్యం’ అని చెప్పి తరువాత నాణ్యమైన బియ్యం అని మాట మార్చి చివరకి ‘బియ్యం చెక్కలు’ ఇచ్చారని ఎద్దేవాచేశారు. శ్రీకాకుళం జిల్లా 8 మండలాల్లో ‘చెక్క బియ్యం’ సరఫరా చేశారని, బియ్యం చెక్కలు తీసుకున్న పేదల వ్యాఖ్యలే ప్రత్యక్ష రుజువని యనమల చెప్పారు. మీ ముడుపుల కోసం బియ్యం చెక్కలు పేదలకు పంపిణి చేస్తారా? అని వైసీపీ సర్కార్ పై యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తుందని అంటున్నారు. ఈ విషయంపై ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. రేషన్ బియ్యం పంపిణీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత నాలుగైదు రోజులగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయని.. అన్ని ఇబ్బందులను అధిగమించి నాణ్యమైన బియ్యాన్ని రవాణా చేస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కారణంగా 30 బియ్యం సంచులు తడిసిపోయాయని.. వాటి స్ధానంలో కొత్తవాటిని తిరిగి పంపిణీ చేశామన్నారు. పేదవాళ్లకు ఇంత మంచి జరుగుతుంటే.. తినగలిగే బియ్యాన్నే పంపిణీ చేస్తుంటే.. టీడీపీ ఓర్వలేకపోతోందని మంత్రి మండిపడ్డారు. నాణ్యమైన బియ్యం ఇవ్వడం లేదని టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు.
    మంత్రులు... తెలంగాణలో అసలు యూరియా కొరతే లేదన్నారు. విపక్షాలే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని ఎదురుదాడికి దిగారు. ఏదో యాక్సిడెంటల్ గా ఒక రైతు గుండెపోటుతో మరణిస్తే, యూరియా కోసం పడిగాపులుపడి ఆ మనోవేదనతో కుప్పకూలి చనిపోయాడని అంటారా? అంటూ సంబంధిత మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగితే, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సాగింది. తన ఆదేశాల ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉందని, రైతులు నానా కష్టాలు పడుతున్నారని తేలింది. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరాపై తీవ్ర విమర్శలు రావడం... రైతులు పెద్దఎత్తున ఆందోళనలకు దిగడం... ఏకంగా తన సొంత జిల్లాలోనే... క్యూలైన్లో ఓ రైతు మరణించడంతో... అప్రమత్తమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌... ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నష్ట నివారణ చర్యలు చేపట్టారు. పరిస్థితి చేయిదాటుతుందని గుర్తించిన కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి యూరియా సరఫరా కోసం అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్‌.... యూరియా సరఫరా వాస్తవ పరిస్థితిపై ఆరా తీశారు. ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో యూరియా కొరత ఎందుకొచ్చిందంటూ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. రైతులకు సరిపడినంత యూరియాను యుద్ధ ప్రాతిపదికన తెప్పించి మూడు నాలుగు రోజుల్లోనే పంపిణీ పూర్తిచేయాలని ఆదేశించారు. రైళ్లు, లారీలు... ఏది దొరికితే దాంట్లో యూరియాను తీసుకొచ్చి, నేరుగా గ్రామాలకే తరలించాలని ఆర్డర్స్ జారీ చేశారు. అయితే, దాదాపు లక్షా15వేల టన్నుల యూరియా... ఇప్పటికే విశాఖ, కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరడంతో ఏపీ ప్రభుత్వ సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. అప్పటికప్పుడు ఏపీ మంత్రి పేర్నినానితో స్వయంగా మాట్లాడిన కేసీఆర్‌... పోర్టులకు అవసరమైన లారీలను పంపాలని కోరారు. ఏపీ, తెలంగాణ నుంచి మొత్తం 3వేల లారీలను వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే, 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని కోరడంతో రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. దాంతో ఏపీ పోర్టుల నుంచి రైళ్లు, లారీల్లో యుద్ధ ప్రాతిపదికన యూరియాను తరలించేందుకు, వ్యవసాయాధికారులను ఆంధ్రప్రదేశ్ కు పంపాలని నిర్ణయించారు.   తెలంగాణలో యూరియా కొరత అనే మాట వినిపించొద్దన్న కేసీఆర్‌... సమస్య పరిష్కారమయ్యేవరకు విశ్రమించొద్దని అధికారులకు సూచించారు. అలాగే, ప్రతి రైతుకూ యూరియా అందేవరకు నిరంతర పర్యవేక్షణ చేయాలని మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డికి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏదిఏమైనాసరే మూడు నాలుగు రోజుల్లోనే రైతులందరికీ యూరియాను ఎట్టిపరిస్థితుల్లోనే అందించాలని కేసీఆర్ హుకుం జారీ చేశారు.
యూరియా కొరత తెలంగాణ రైతాంగం ఉసురు తీస్తోంది. పంటకు బలాన్ని ఇవ్వాల్సిన ఎరువులు... అన్నదాతల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఎరువులు కోసం పడిగాపులు పడీపడి ప్రాణాలు కోల్పోతున్నారు. యూరియా కోసం తెలంగాణవ్యాప్తంగా అన్నదాతలు అల్లాడిపోతున్నారు. పెళ్లాం-పిల్లలు, ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి, తిండీ తిప్పల్లేకుండా యూరియా సరఫరా కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, రోజుల తరబడి పడిగాపులు పడుతున్నా, గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డా... ఎరువులు దొరక్కపోవడంతో... ఆ నిరాశతో కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా, మరికొందరు క్యూలైన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాకలో యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడిన రైతు ఎల్లయ్య... క్యూలైన్లో నిలబడీనిలబడి అలసిపోయాడు. ఎలాగైనా యూరియా తీసుకెళ్లి పంటను కాపాడుకుందామనుకున్న ఎల్లయ్య గుండె క్యూలైన్లోనే ఆగిపోయింది. తన వంతు రాకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తోన్న ఎల్లయ్య... యూరియా కోసం మూడ్రోజులుగా పడిగాపులు పడుతున్నాడు. అయినా, యూరియా దొరక్కపోవడంతో.... ఈసారి ఎలాగైనాసరే దక్కించుకోవాలని.... భార్య లక్ష్మితో కలిసి క్యూలైన్లో నిలబడ్డాడు. కానీ, అప్పటికే పడిగాపులు-పడీపడి అలసిపోయిన ఎల్లయ్య క్యూలైన్లో కుప్పకూలాడు. హుటిహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తేల్చారు. దాంతో, ఎల్లయ్య మృతికి ప్రభుత్వమే కారణమంటూ రైతులు ఆందోళనకు దిగారు. మరోవైపు యూరియా సమస్య రాజకీయ వివాదంగా మారుతోంది. యూరియా కొరతపై విపక్షాలు.... ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే, అసలు కొరతే లేదంటోంది కేసీఆర్ సర్కారు. రైతుల అవస్థలకు ఎల్లయ్య మృతి అద్దం పడుతోందని టీఆర్ఎస్ గవర్నమెంట్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటికైనా కేంద్రంతో మాట్లాడి, అవసరమైన యూరియాను తీసుకొచ్చి రైతుల కష్టాలు తీర్చాలని సూచిస్తున్నారు. అలాగే దుబ్బాకలో మరణించిన రైతుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అంటోన్న విపక్షాలు... ఎల్లయ్య కుటుంబానికి 20లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు మూడ్రోజుల్లో యూరియా కొరత తీర్చకపోతే, తీవ్ర పరిణామాలు తప్పవని రైతులు హెచ్చరిస్తున్నారు.
  అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధంలో తలలు తెగిపడుతున్నాయి. తీవ్రంగా గాయపడినవారు జీవచ్ఛవాల్లా సైనిక ఆసుపత్రుల్లో పడి ఉన్నారు. అలాంటి ఓ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు పక్కపక్కనే ఉన్నారు. వారిలో ఒకరికి కాస్త లేచి కూర్చనేంత ఓపికైనా ఉండేది. మరొకరు మాత్రం ఆ అవకాశం కూడా లేదు. తూట్లు పడిన శరీరంతో నిస్సహాయంగా మంచం మీద పడి ఉన్నాడు.`ఈ మందులన్నీ దండుగ. నేను చచ్చిపోవడం ఖాయం. లేచి కూర్చోలేనివాడిని నా కాళ్ల మీద ఇంకెప్పటికీ నిలబడలేను కదా!`అంటూ ఏడ్చేవాడు రెండో సైనికుడు.  `అబ్బే అదేం కాదు! నువ్వు సుబ్బరంగా లేచి తిరుగుతావు. నాదీ హామీ. అసలు నా పక్కన ఉన్న కిటికీని చూశావూ… ఈ కిటికీలోంచి కనిపించే ప్రపంచాన్ని చూస్తే రోజురోజుకీ నాలో జీవించాలన్న ఆశ పెరిగిపోతోంది` అన్నాడు మొదటి సైనికుడు. `మరి నాకా భాగ్యం లేదు కదా! ఈ నాలుగు గోడలూ తప్ప ఉత్సాహం కలిగించేది ఏదీ నాకు కనిపించడం లేదు` అని వాపోయాడు రెండో సైనికుడు.  `అయితే ఓ పని చేద్దాం! నేను రోజూ కిటికీలోంచి కనిపించే అందమైన ప్రపంచాన్ని నీకు వర్ణిస్తూ ఉంటాను. నువ్వు హాయిగా కళ్లు మూసుకుని వాటిని ఊహించుకో` అని సూచించాడు మొదటి సైనికుడు.  రెండో సైనికుడికి ఈ పద్ధతి బాగుంది. మొదటి సైనికుడు రోజూ బయట ఉన్న వాతావరణాన్ని వర్ణించేవాడు. అందమైన సూర్యోదయాల గురించీ, చిగురించే చెట్ల గురించీ, చిరుజల్లుల గురించీ వర్ణించేవాడు. దూరంగా ఉన్న సరస్సునీ, దాని మీద వాలుతున్న కొంగలనీ, అందులో ఈత కొడుతున్న పిల్లలనీ వర్ణించేవాడు. ఆసుపత్రి పక్కగా వెళ్తున్న మనుషుల గురించీ, వారి హావభావాల గురించీ, కేరింతల వర్ణించేవాడు. మొదటి సైనికుడు కళ్లు మూసుకుని అవన్నీ ఊహించుకోసాగాడు. అతనిలో రోజురోజుకీ జీవించాలన్న ఆశ పెరిగిపోసాగింది. ఎలాగైనా ఆరోగ్యం బాగుపడాన్నల కోరిక బలపడింది. తను కూడా ఆ సూర్యోదయాలను చూడగలగాలి, తన పిల్లలతో తిరిగి సంతోషంగా గడపగలగాలి… అవే తన లక్ష్యాలు!  రెండో సైనికుడి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. `రేపటి నుంచీ నువ్వు లేచి ఓ నాలుగు అడుగులు వేయవచ్చు` అని వైద్యులు కూడా చెప్పారు. ఆ రేపటి కోసం ఎదురుచూస్తూ హాయిగా నిద్రపోయాడు రెండో సైనికుడు. మర్నాడు ఉదయం నిద్రలేచి చూసేసరికి తన పక్కనే ఉన్న మంచం ఖాళీగా కనిపించింది.  `ఈ మంచం మీద ఉన్న వ్యక్తి ఏమయ్యాడు` అంటూ ఆతృతగా అడిగాడు నర్సుని. `అతను ఇవాళ తెల్లవారుజామున చనిపోయాడు` అన్న సమాధానం వినిపించింది. తనలో ఇన్నాళ్లుగా ఆశని రేకెత్తించిన వ్యక్తి చనిపోవడం అతనికి చాలా బాధని కలిగించింది. ఆతృతగా లేచి వెళ్లి కిటికీలోంచి తొంగిచూశాడు. ఆశ్చర్యం! ఆ కిటికీకి దగ్గరలోనే మరో గోడ అడ్డంగా ఉంది. అందులోంచి అసలు సూర్యోదయం కూడా కనిపించే అవకాశం లేదు.  `రోజూ ఈ కిటికీలోంచి చూస్తూ నా మిత్రుడు ఎన్నో దృశ్యాలను వర్ణించేవాడే` అని ఆశ్చర్యపోయాడు సైనికుడు. `అసాధ్యం. ఎందుకంటే అతను ఈ ఆసుపత్రిలో చేరేనాటికి అతనికి చూపు లేదు!` అంది నర్సు నింపాదిగా! - అంతర్జాలంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఓ కథకు అనువాదం.  
  Shopping for personal goods and lifestyle products has been interesting to everyone at a certain point in time...online shopping is picking up its swing in India too. In the Western World, it is already a pretty familiar thing. Buy anything, anytime with just a card!! It is so comfortable, time saving, and an effortless job. Returning items bought online, is also getting easier these days. The 'Free Shipping' is such an attractive part. Email notifications and Cellphone Alerts from the shopping websites have made it even more easier and better to keep a track of the deals and sales. Just make sure you keep your card details secure and use only presonal devices to shop online. Just wait for the after Festival Season in India and the Thanksgiving, Christmas Sale in the USA and every online shopper gets so crazy...so do i !! Most of us just get so curious to know whats every website we signed up for sells during its clearance event...whether we buy things or not, browsing for hours, putting everyother item in the shopping bag and then when you realise the amount is going to high or if it still doesnot qualify for 'free shipping', just close the browser !!! For most of us, it is a Passtime activity.     Even the Birthday Gifts are arriving from online stores, a day after the guests attend the party ! I actually did almost something similar, not intentional, the gifts got delayed and arrived to the host a day after i attended the party ! This online shopping is not as timely as shopping at the store..due to climatic reasons, transport strikes, unavailability of items in stock, the shipments arrive so late and you get so frustrated with the long wait...and strangely sometimes the orders arrive so early. Whatever be the reason to still continue with in-store shopping, Online Buying is irresistibly, crazily attractive !!   -Prathyusha Talluri
  కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో...     ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.     ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.   ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
అద్భుతమైన పోషక విలువలు వుండటంతోపాటు అమోఘమైన ఔషధ లక్షణాలు కూడా వున్న మునగ ఆకు గొప్పతనాన్ని ఇప్పటి వరకు చాలామంది తెలుసుకోలేదు. ముఖ్యంగా నగరాల్లో నివసించే ప్రజలు తెలుసుకోలేదు. అలాగే కూరగాయల వ్యాపారులు తెలుసుకోలేదు. అది ఒక అదృష్టం... వ్యాపారుల కళ్ళు పడలేదు కాబట్టే ఇప్పటికీ మునగాకు ఉచితంగానే లభిస్తోంది. ఉచితంగా లభిస్తోంది కదా అని మునగాకును తేలిగ్గా తీసిపారేయకండి. మునగాకు ఎంత గొప్పదో తెలియని వాళ్ళకు తెలియజేసే ప్రయత్నం ఇది. మునక్కాయ గురించి అందరికీ తెలిసిందే. సాంబారులో మునక్కాయ ముక్కలు కనిపిస్తే వాటిని జుర్రుకోనివాళ్ళు ఎవరైనా వుంటారా? ఆ టేస్ట్ గుర్తుకు వస్తేనే నోట్లో నీళ్ళూరతాయి. అయితే మునక్కాయ కంటే మునగాకే చాలా మంచిదని తెలుసుకోవాలి. ములక్కాయలో రుచి మాత్రమే వుంది. మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. మునగాకుతో వండిన కూరలు లొట్టలు వేసుకుంటూ తినేంత రుచిగా వుండకపోవచ్చు. కానీ, అది అందించే ఆరోగ్యం మాత్రం అపారం. నగరాల్లో, పట్టణాల్లో మునగాకు గురించి పట్టించుకునేవారు చాలా తక్కువ. అయితే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మునగాకు మంచితనం బాగా తెలుసు. అందుకే వారు తరచుగా మునగాకును వినియోగిస్తూ వుంటారు. పోషక విలువలు అపారం మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం. నీరు - 75.9 శాతం పిండి పదార్థాలు - 13.4 గ్రాములు ఫ్యాట్స్ - 17 గ్రాములు మాంసకృత్తులు - 6.7 గ్రాములు కాల్షియం  - 440 మిల్లీ గ్రాములు పాస్పరస్ - 70 మిల్లీ గ్రాములు ఐరన్ - 7 మిల్లీ గ్రాములు ‘సి’ విటమిన్ - 200 మిల్లీ గ్రాములు ఖనిజ లవణాలు - 2.3 శాతం పీచు పదార్థం  - 0.9 మిల్లీ గ్రాములు ఎనర్జీ - 97 కేలరీలు కొద్దిగా వెగటు... అయినప్పటికీ... మునగాకు కొంచెం కారంగా, వెగటుగా అనిపిస్తుంది. ఈ రెండు లక్షణాలే మునగాకును కొంతమంది ఇష్టపడకపోవడానికి కారణం అవుతున్నాయి. అయితే అలవాటు చేసుకుంటే ఈ లక్షణాలు పెద్దగా ఇబ్బంది కలిగించవు. మనకు ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు జరుగుతుంది. మునగ ఆకుతో పప్పు వండుకోవడం, మునగ ఆకును ఇగురు చేసుకోవడం, ఇతర కూరల్లో మునగాకును కూడా వేసుకోవడం ద్వారా మునగాకును ఆహారంగా తీసుకోవచ్చు. మునగాకును నీడలో ఎండబెట్టి, పొడి చేసుకుని ప్రతిరోజూ ఒక స్పూనును పాలలో కలుపుకుని తాగవచ్చు. మునగాకు పొడిని కూరల్లో కలుపుకోవచ్చు... ఔషధ విలువలు అద్భుతం ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది. మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు... మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి.  మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. మరి ఇన్ని మంచి లక్షణాలున్న మునగాకును నిర్లక్ష్యం చేయడం తగునా? -అంతర్యామి 
  టమాటాతో చేసే వంటకాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎలాంటి వంటకమైన టమాట వేస్తే చాలు దానికి రుచి వచ్చేసినట్లే. కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందిట ఈ టమాట.టమాటా లలో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు ఎక్కువ మోతాదులో ఉంటాయట.ఎసిడిటీతో బాధపడేవారు టమాటాలతో తయారు చేసిన వంటకాన్ని రుచి చూస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాటాల్లో సిట్రిక్ యాసిడ్ ఉండటంతో ఎసిడిటీ దూరమౌతుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండటంవలన యాంటాసిడ్‌లా ఉపయోగపడుతుందంటున్నారు వైద్యులు. టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండటంతో కంటి జబ్బులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది.టమాటాని చక్రాలుగా తరికి కళ్ళ మీద పెట్టుకున్నా కళ్ళకి చల్లదనం లభిస్తుంది. వీటిల్లోని విటమిన్‌ ఏ, విటమిన్‌ సి  రోగ నిరోధకశక్తినీ పెంపొందించి వ్యాధుల నుంచి రక్షణ కల్పించటంలో తోడ్పడతాయి.వీటికి ఎర్రటి రంగును తెచ్చిపెట్టే లైకొపేన్‌ మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, రొమ్ము క్యాన్సర్ల వృద్ధిని అడ్డుకోవటంలో సాయం చేస్తుంది.     ఆడవారికి నచ్చే మరో విషయం ఏమిటో తెలుసా? ప్రతిరోజూ తినే ఆహారంలో టమాటా  తింటే బరువు తగ్గుతారని పరిశోధకులు చెప్తున్నారు. టమాటాలు తినే వారు ఇతర ఆహార పదార్ధాలను ఎక్కువగా తినలేరు. ఇవి తింటే కడుపు నిండినట్లు ఉండి ఎక్కువ అన్నం గాని , ఇతర పదార్దములు గాని తిననీయదు.  కాబట్టి ఆకలి మీద నియంత్రణ ఉండి, తక్కువగా తింటారు.   మెనోపాజ్‌ దశలో ఉన్న వారు రోజు రెండు గ్లాసుల టమాటా రసాన్ని తాగడం వల్ల ఎముకలు అరిగి,విరిగిపోయే సమస్యకి స్వస్తి చెప్పవచ్చు. టమాటాల్లోని లైకోపీన్‌ వల్ల ఎముకలు బలంగా మారతాయని అధ్యయనంలో తేలింది. టమాటాల్లో గుండెకు మేలు చేసే పొటాషియం, రక్తంలో గ్లూకోజు స్థాయులను నియంత్రించే మాంగనీసులాంటివి కూడా పుష్కలంగా ఉన్నాయట. టమాటాల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తోంది కదూ. అసలే టమాటాల సీజన్. ఇంకెందుకు ఆలస్యం ఆరోగ్యాన్ని పెంపొందించుకునే పని మొదలుపెట్టేద్దాం. ......కళ్యాణి
మనం ఆరోగ్యంగా వుండటానికి అత్యుత్తమమైన మార్గం యోగా. భారతదేశంలో అభివృద్ధి చెందిన యోగాను ఇప్పుడు ప్రపంచం మొత్తం అనుసరిస్తోంది. మనం ఎదుర్కొనే అన్ని అనారోగ్య సమస్యలకు యోగాలో పరిష్కారం లభిస్తుంది. శ్రద్ధగా యోగాను అనుసరించాలేగానీ, మనకు చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. పొత్తికడుపును తగ్గించుకునే యోగాసనాల గురించి ప్రముఖ యోగా థెరపిస్ట్ రాజేశ్వరి వడ్డిపర్తి వివరిస్తున్నారు చూడండి...