LATEST NEWS
  రాయలసీమ ముఖద్వారం, అన్నమయ్య జిల్లా రాజకీయ కేంద్రం రాజంపేటలో ఇప్పుడు అసలైన 'రాజకీయం' మొదలైంది. ప్రత్యర్థులతో పోరాటం కంటే.. సొంత గూటిలోనే సాగుతున్న 'ఆధిపత్య పోరు' ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్ మోహన్ రాజు, జనసేన పార్లమెంట్ ఇన్చార్జి శ్రీనివాసరాజుల  మధ్య సాగుతున్న అంతర్యుద్ధం కూటమి శ్రేణులను అయోమయంలో నెట్టడమే కాకుండా, రాబోయే స్థానిక సమరానికి సవాలుగా మారింది. *ఆధిపత్య పోరు టిడిపి ఇన్చార్జి ​చమర్తి జగన్ మోహన్ రాజు గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని, కష్టకాలంలో కేడర్‌కు అండగా నిలిచిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ ఇన్‌చార్జ్‌గా క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని నిర్మించుకున్న ఆయన, రాజంపేటపై తనదే పైచేయి అని భావిస్తున్నారు. మరోవైపు, మాజీ అధికారిగా పరిపాలనా అనుభవం, జనసేన వైపు నుంచి వచ్చిన మద్దతుతో యల్లటూరు  శ్రీనివాసరాజు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యావంతుడు, మృదుస్వభావి అనే ఇమేజ్‌తో ఆయన కొత్త తరం ఓటర్లను ఆకర్షిస్తూ ముందుకు సాగుతున్నారు. *​అసలు చిచ్చు ఎక్కడ? ​రాజంపేటలో సామాజికంగా బలంగా ఉన్న 'రాజుల' వర్గంలో అగ్రస్థానం కోసం జరుగుతున్న పోరాటమే దీనికి మూలకారణమని పరిశీలకులు భావిస్తున్నారు. *​ప్రోటోకాల్ రచ్చ:  ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా, పార్టీ వేదికలు ఏర్పాటు చేసినా 'ముందువరుస' ఎవరిది? అనే అంశంపై ఇరు వర్గాల మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం నడుస్తోంది. రాజంపేట జిల్లా సాధన ఉద్యమం నుంచి స్థానిక అభివృద్ధి పనుల వరకు ఏ చిన్న పని జరిగినా "అది మా నాయకుడి చలవే" అంటూ పోటాపోటీగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ పరిస్థితులు కూటమి క్యాడర్ పై ప్రభావం చూపుతోంది.ఒకే కూటమి  కింద ఉన్నప్పటికీ, కార్యకర్తలు "జగన్ మోహన్ రాజు వర్గం", "శ్రీనివాసరాజు వర్గం"గా విడిపోవడం భవిష్యత్తులో కూటమికి గొడ్డలిపెట్టులా మారే ప్రమాదం ఉంది. *​వైఎస్సార్‌సీపీకి 'అయాచిత' బలం! ​ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ అంతర్గత కలహాలు వరంగా మారాయి. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి వంటి ఉద్ధండులను ఢీకొట్టాలంటే కూటమి ఐక్యంగా ఉండాలి. కానీ, ఇక్కడ "ఇంటి గుట్టు లంకకు చేటు" అన్న చందంగా ఒకరిని ఒకరు నష్టం పరుచుకునే  క్రమంలో ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. *​అధిష్టానం మౌనం..   ​ఈ ఆధిపత్య పోరుపై అటు అమరావతిలోని టీడీపీ పెద్దలకు, ఇటు జనసేన అధినాయకత్వానికి పూర్తి సమాచారం ఉంది. అయితే, ఇద్దరినీ వదులుకోలేక, అలాగని ఒకరిని వారించలేక అధిష్టానం మౌనం వహిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ మౌనం రాజంపేటలో కూటమి పునాదులను బలహీనపరుస్తోందని సీనియర్ రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాజంపేట రాజకీయ యవనికపై ఈ ఇద్దరు 'రాజుల' పోరు ఎటు దారితీస్తుందో చూడాలి. ఒకరు అనుభవాన్ని నమ్ముకుంటే, మరొకరు మారుతున్న సమీకరణాలను నమ్ముకున్నారు. ఈ ఇద్దరూ కలిసి నడిస్తే రాజంపేటలో కూటమికి తిరుగుండదు.. కానీ, నేనే రోజు..నేనే రాజు అన్న చందంగా ఎవరికి వారు సాగితే మాత్రం ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది
  ప్రజాస్వామ్యంలో అధికారులు వ్యవస్థకు వెన్నెముక వంటివారు. కానీ, స్వలాభం కోసమో, రాజకీయ విధేయత కోసమో ఆ వ్యవస్థకే తూట్లు పొడిస్తే? ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల  రహస్య బేటీలు  సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అడుగులు వేస్తుంటే, మరోవైపు తెరచాటున ఏం జరుగుతోంది? వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై  ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.   లక్షలాది మంది పోటీ పడే యూపీఎస్సీ పరీక్షల్లో నెగ్గి, అత్యున్నత శిక్షణ పొందిన ఐఏఎస్ అధికారులను మనం క్రీమ్ ఆఫ్ ది సొసైటీ  అని పిలుచుకుంటాం. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం, రూపొందించే ప్రతి రూల్ వీరి కనుసన్నల్లోనే జరుగుతుంది. అయితే.. ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్న కొందరు అధికారులు, హైదరాబాద్‌ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని, కాంట్రాక్టర్ల వివరాలను, పెట్టుబడుల సమాచారాన్ని ప్రత్యర్థి పార్టీలకు చేరవేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కేవలం క్రమశిక్షణారాహిత్యం మాత్రమే కాదు, ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటూ ఆ ప్రజలకే చేసే విశ్వాసద్రోహం. ఈ విషయంలో ప్రభుత్వాధినేతలు ఉదాసీనంగా వ్యవహరిస్తే అది పెను ప్రమాదానికి దారి తీస్తుందని అప్పసాని రాజేష్ హెచ్చరించారు. తెలుగువన్ యూట్యూబ్ చానల్ అప్పసాని ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ కింది లింక్ క్లిక్ చేసి వీక్షించండి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం  కేవలం రెండు దేశాల మధ్య సరిహద్దు పోరు కాదు ప్రపంచ దేశాల సమస్య. అన్ని దేశాల్లోని ప్రజల ఇంటి సమస్య. యుద్ధం అనగానే మనకు చాలా దూరంగా, ఎక్కడో సరిహద్దుల్లో జరిగే తుపాకుల మోత మాత్రమే అని అనిపిస్తుంది. కానీ ఇప్పటి గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణ గా పరిమితం కాలేదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, మరీ ముఖ్యంగా  భారతదేశ భవిష్యత్తును మార్చబోయే ఒక పెద్ద మలుపు. పెద్ద కుదుపు. ఇండియాకు  అవసరమైన ఇంధన అవసరాలలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దిగుమతులకు ఆటంకం ఏర్పడింది.   ఈ  కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి, ఆ ప్రభావంతో  నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అంతేనా యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలునెలకొన్న గల్ఫ్ దేశాలలో దాదాపు కొటి మంది ఇండియన్స్ పని చేస్తున్నారు. ఈ యుద్ధం   వారి ఉద్యోగాలు, భవిష్యత్, అలాగే ఆయా దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ప్రభావితం చేస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉంది.   ఈ సంక్షోభ సమయాన్ని ఎదుర్కోవడానికి లేదా  పరిష్కరించడానికి  భారతదేశం వంటి పెద్ద దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ తన పలుకుబడిని ఉపయోగించి ఆపడానికి కృషి చేయాలి.   బ్రిక్స్ ద్వారా చైనా, రష్యా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకం చేసి శాంతి కోసం ఒత్తిడి తేవాలి.   తెలుగువన్ యూట్యూబ్ చానెల్ వాస్తవ వేదికలో తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ మధ్య  ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం, అది ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై చూపే ప్రభావం తదితర అంశాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఆ చర్చ పూర్తి పాఠం ఈ దిగువ ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి వీక్షించండి.  
ALSO ON TELUGUONE N E W S
ఆట షో ఈ వారం అందరినీ ఎంటర్టైన్ చేసింది. ఇక ఈ షోకి డైరెక్టర్ హరీష్ శంకర్ వచ్చారు. "డిప్యూటీ సీఎం గారితో డాన్స్ వేయించాలని ఎలా అనిపించింది. దేఖ్లేంగే సాంగ్ చూసేసరికి మా మైండ్ బ్లాంక్ ఐపోయింది " అన్నాడు సుధీర్. "డిప్యూటీ సీఎం అనే రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టే ఐటెం సాంగ్ లా కాకుండా నీట్ గా బ్లేజర్ వేసి డిగ్నిఫైడ్ గా డాన్స్ చేయించాం." అని తెలిపారు హరీష్. (Ustaad Bhagat Singh) "గబ్బర్ సింగ్ టైములో పవర్ స్టార్ తో పని చేశారు, ఉస్తాద్ మూవీకి వర్క్ చేశారు. సెట్ లోకి వచ్చాక ఏమన్నా డిఫరెన్స్ ఉందా ? " అని అడిగాడు. "ఆయన రాగానే కాస్ట్యూమ్ తీసుకెళ్తాం. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి మెటల్ డిటెక్టర్ తో కాస్ట్యూమ్ ని చెక్ చేయడం. పొద్దున్నే డాగ్ స్క్వాడ్ వచ్చి లొకేషన్ అంతా చెక్ చేయడం అన్ని కొత్తగా అనిపించాయి. కానీ ఆయనలో ఎలాంటి చేంజ్ లేదు. మార్చ్ 19 న మూవీ రిలీజ్ అవుతోంది. అన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రండి." అన్నాడు హరీష్ శంకర్.  ఇక ఉస్తాద్ మూవీలో డైలాగ్ ని సుధీర్ ఒక రేంజ్ లో చెప్పాడు."గుర్తు పెట్టుకో గాజంటే సైజు కాదు సైన్యం " అని చెప్పాడు. ఎలా రాస్తారు సర్ ఇలా అని నిహారిక అడిగింది. "పవర్ స్టార్ గారు ఇలానే అడిగారు నన్ను. మీరు అలా కూర్చుంటే ఇలాగే రాస్తాం అని చెప్పా" అన్నాడు హరీష్ శంకర్.  "మాకెవ్వరికీ తెలీని బెస్ట్ మెమరీ చెప్పండి" అని అడిగాడు. "ఒక సీన్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి దణ్ణం పెట్టగానే ఈయన కూడా వంగి దణ్ణం పెట్టేసారు. సర్ మీరు ఇంకా డిప్యూటీ సీఎం అనుకుంటున్నారు ఇక్కడ మీరు హీరో సర్ అన్నా. ఆయన నవ్వుకుని అలవాటైపోయిందయ్యా నాకు ఎవరైనా దణ్ణం పెట్టగానే నేను కూడా దణ్ణం పెట్టేస్తున్నాను అన్నారు. అలా కాదు సర్ మీరు హీరో ఇక్కడ డైలాగ్ ఉంది అన్నా. మొన్న అదే గుర్తు చేస్తే ఆయన నవ్వుకుంటున్నారు. ఈ విషయం ఎక్కడా చెప్పలేదు కేవలం ఆట షోకి మాత్రమే ఎక్సక్లూసివ్ " అన్నాడు హరీష్ శంకర్.   https://www.instagram.com/reel/DVmV32nDksy/
బడ్జెట్ 4 కోట్లు.. కలెక్షన్స్ 40 కోట్లు పెద్ద హిట్ గా నిలిచిన చిన్న సినిమా 'విత్ లవ్' తొలిప్రేమను గుర్తుచేస్తూ ఓటీటీలోనూ సంచలనం రొమాంటిక్ కామెడీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై, పెద్ద విజయాన్ని సాధించిన తమిళ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'విత్ లవ్'(With Love). కేవలం రూ.4 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ, వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.40 కోట్ల గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న అభిషన్ జీవింత్, ‘విత్ లవ్’తో హీరోగా మారాడు. అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. మధన్ దర్శకత్వం వహించగా, సౌందర్య రాజినీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. ప్రేమ, స్కూల్ మెమోరీస్, ఫస్ట్ క్రష్‌ల నేపథ్యంతో సాగే ఈ రొమాంటిక్ డ్రామా.. ఫిబ్రవరి 6న థియేటర్లలో అడుగుపెట్టింది.   కథ ఏంటంటే.. పెళ్ళిపై ఆసక్తి లేని సత్య( అభిషన్ జీవింత్), తన సోదరి కారణంగా అనుకోకుండా పెళ్ళి చూపుల కోసం మోనిషా (అనస్వర రాజన్)ను కలుస్తాడు. అలా కలిసిన తర్వాత వాళ్లిద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారని.. సీనియర్, జూనియర్ అని తెలుసుకుంటారు. మాటల్లో స్కూల్ లవ్ స్టోరీలు షేర్ చేసుకుంటారు. స్కూల్ టైంలో తమ ప్రేమని వ్యక్తపరచలేకపోవడంతో.. తమ ఫస్ట్ క్రష్ లను ఇప్పుడు కలవాలి అనుకుంటారు. పాత జ్ఞాపకాలను వెలికితీస్తూ మొదలైన వీరి ప్రయాణం ఎలా సాగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. Also Read: విత్ లవ్ మూవీ రివ్యూ తొలిప్రేమ ఎప్పటికీ ప్రత్యేకమే. ముఖ్యంగా స్కూల్ రోజుల్లో క్రష్ పై ఇష్టాన్ని మనసులోనే దాచుకొని, మాటల రూపంలో బయటపెట్టనివారు ఎందరో ఉంటారు. మనసులోని మాటను చెప్పలేకపోయామని జీవితాంతం గుర్తు చేసుకొని బాధపడే కంటే, ఏదొక సమయంలో మనసులోని మాటను చెప్పేయడం మంచిది. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ 'విత్ లవ్'. పెళ్లి చూపులతో మొదలై, స్కూల్ లైఫ్ ను గుర్తుచేస్తూ.. క్యూట్ లవ్ స్టోరీలతో, అందమైన జ్ఞాపకాలతో సరదాగా నడిచింది. 'గుర్తుకొస్తున్నాయి' అనేలా సాగిన ఈ ప్రయాణం.. ప్రతి ఒక్కరికీ వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అనడంలో సందేహం లేదు. అందుకే థియేటర్లలో అంతటి విజయాన్ని సాధించింది. ఓటీటీలోనూ 'విత్ లవ్' సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మార్చి 6 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో మిస్ అయిన వారు.. ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమాని చూసి ప్రశంసలు కురిపిస్తున్నాయి. తెలిసిన కథే అయినప్పటికీ.. దానిని బ్యూటిఫుల్ గా, ఎంటర్టైనింగ్ చెప్పిన తీరు కట్టిపడేసిందని అంటున్నారు. ప్రస్తుత రెస్పాన్స్ చూస్తుంటే.. ఓటీటీలోనూ 'విత్ లవ్' రికార్డులు సృష్టించేలా ఉంది.
The film Mrithyunjay, starring content king Sree Vishnu and directed by Hussain Sha Kiran, is an investigative thriller produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Light Box Media and Picture Perfect Entertainment. Sree Vishnu, who previously delivered a blockbuster hit with Samajavaragamana, once again impressed audiences along with Reba Monica John. Released on March 6, the film is now a runaway blockbuster. In this context, the film unit organized a thrilling blockbuster success meet on Saturday, where the following statements were made: Sree Vishnu said, “Sandeep garu, Pavan garu, and I wanted to collaborate on a film. At that time, Sandeep introduced me to Hussain Sha. Sandeep garu wanted to make a film purely based on content. On set, Ramya garu spent a lot of time looking after all of us. Chinna garu, Sudarshan, Raccha Ravi, Ayyappa Sharma garu, Reba garu, and Baby Ooha all delivered amazing performances. The audience is finding the film very fresh. Sagar garu presented all of us in a new light. Hussain’s writing and twists were excellent. I was even shocked by Kal Bhairav’s score. Because of him, the level of the film went up. He is the real hero of this film. Everyone who has watched it is praising it highly. For those who haven’t seen it yet, watch it immediately. It’s a rare thriller in Telugu, and this is a very good film in that genre. I hope everyone enjoys it, and I wish the film great success.” Hussain Sha Kiran said, “‘Mrithyunjay’ was promoted without songs or comedy scenes. We connected with the audience purely through the content of the film. Seeing the positive reviews on social media after the release made us very happy. I thank the audience for supporting our film. Ramya garu, Vinay garu, and Sandeep garu gave me tremendous support throughout this journey. Baby Ooha performed wonderfully in the film. Raccha Ravi, Sudarshan, and others gave excellent performances. Kaala Bhairava elevated the film with his background score. My sister Manisha received recognition for her set designs. It was a pleasure to have Chinna garu in the film. None of this would have been possible without Sree Vishnu garu. His acceptance of the story brought all of us together. I feel I did not disappoint the trust he placed in me. I also thank my family for standing by me. I hope the audience continues to encourage our film in the same way.” Sandeep Gunnam said, “We received tremendous support from the media for ‘Mrithyunjay’. From day one, the film got a great response. Media reviews and audience word-of-mouth matched perfectly. All the distributors who took the film are happy, and that is a huge success for me. Vinay and I started this journey to make great films together. Without Vinay, this project would not have happened. Hussain used to send every story idea to Sree Vishnu, and that’s how we made ‘Mrityunjay’. We had decided from the beginning to focus purely on the story rather than comedy. Everyone is impressed with Sagar’s visuals and the world created by Manisha. Kaala Bhairava’s score is receiving great responses. Reba delivered a remarkable performance. Sri Vishnu is very passionate; he lives and breathes stories and films. After our two-year journey, the story of ‘Mrityunjay’ was finalized. We felt our product was good, but the audience is calling it exceptional. I thank Sree Vishnu garu for trusting me with this film. We will win the Sunday final match, and from Monday, watch our film in theaters.” Music director Kaala Bhairava said, “‘Mrithyunjay’ is receiving a lot of praise for its score. My team members Harsha Vardhan, Siddharth, Ebenezer Paul, and Vishal Bharadwaj contributed significantly, with Harsha Vardhan doing the most work. I thank the entire team. It was truly a team effort, which is why the output turned out so well. Sree Vishnu’s acting made my job easier. Hussain is like a family member to me, and I want to work with him again and again. Working with Sandeep garu has been a joy. I request the audience to continue supporting the film in the same way.”  
  -పిటిషన్ లో ఏముంది  -తీర్పు ఎలా వస్తుందంటారు -విజయ్ రియాక్షన్ ఏంటి! ఇళయ దళపతి విజయ్(Vijay),భార్య సంగీత(sangeetha)వ్యవహారంపై స్టిల్ తమిళనాడుతో పాటు తెలుగునాట కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సంగీత నమోదు చేసిన విడాకుల పిటిషన్ లో విజయ్ కి ఒక సినీ నటితో ఉందని  చెప్పడం, సదరు నటి త్రిష అనే పుకార్లు వ్యాపిస్తూ ఉండటం, రీసెంట్ గా త్రిషతో కలిసి విజయ్ ఒక పెళ్ళికి హాజరు కావడంతో అందరి దృష్టి విజయ్ వ్యవహారంపై ఉంది. ఈ క్రమంలో కోర్టులో సంగీత వేసిన మరో పిటిషన్ చర్చల స్థాయిని తీవ్రతరం చేసింది. పిటిషన్ లో ఏముందో చూద్దాం.  సంగీత నమోదు చేసిన పిటిషన్ లో 'విడాకుల కేసు తుది విచారణ ముగిసి, తీర్పు వచ్చే వరకు నేను విజయ్‌ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి కావాలి. లండన్‌ కి చెందిన నేను విజయ్ ఇంట్లోనే ఉండటం కరెక్ట్.  మా లాయర్ ద్వారా ఇంట్లో ఉండటానికి అనుమతి  కోరితే బెదిరింపులకి పాల్పడుతున్నారు. అందుకే పిటిషన్ వేసాను. సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయల డబ్బుల్లో తనకి, తన పిల్లలకి రావాల్సిన వాటా కూడా ఇవ్వాలని సదరు పిటిషన్ లో పేర్కొంది.  also read: Ustaad bhagat singh vs dhurandhar 2: అర్ధరాత్రి నుంచే వార్ స్టార్ట్    సంగీత ప్రస్తుతం లండన్ దేశంలోనే ఉంది. విజయ్ ఇల్లు సౌత్ చెన్నై నీలంకరై లోని కపిలేశ్వర్ నగర్ లో  ఉంది. సుమారు 20 ఇయర్స్ బ్యాక్ నుంచే అక్కడ ఉంటున్నాడు. ఇక విడకుల పిటిషన్ కేసులో విజయ్  ఏప్రిల్ 20 న కోర్టులో హాజరు అవ్వాల్సిన విషయం తెలిసిందే.     
సమాజంలో గురువుకు ఉన్న స్థానం అత్యున్నతమైనది. అక్షరాలు నేర్పడమే కాదు, ఒక తరాన్ని, ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువుది. కానీ, అదే గురువు తన పదవీ విరమణ తర్వాత, తన సొంత హక్కు అయిన పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తే? తన కళ్ల ముందే పెరిగిన విద్యార్థులు అవినీతి అంచున నిలబడి లంచం అడిగితే? ఆ గురువు మనసు ఎంతలా గాయపడుతుందో తెలిపే హృదయ విదారక కథనం ఇది ఆర్.పి.పట్నాయక్ స్వీయ దర్శకత్వంలో నటించి రూపొందించిన ‘బ్రోకర్‌’ చిత్రంలోని ఈ సన్నివేశం దేశంలోని పరిస్థితుల్ని చూపిస్తుంది. గొల్లపూడి మారుతీరావు, అర్చన, కీర్తి చావ్లా, శ్రీహరి, ఫ్లోరా శైని ఇతర పాత్రలు పోషించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.  35 ఏళ్ళపాటు నిష్కళంకంగా సేవలందించి, ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న ఒక మాస్టారు, తన ఐదేళ్ల పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఆయన అడుగుతున్నది కేవలం తన హక్కును మాత్రమే. కానీ వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి ఆయన్ని ప్రతి అడుగునా అడ్డుకుంటుంది. ‘గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తినడం వ్యభిచారం కన్నా మహాపాపం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఐదేళ్లుగా ఇద్దరు ప్రధానులు, ముగ్గురు ముఖ్యమంత్రులు మారినా, ఆయన ఫైలు మాత్రం కదలడం లేదు. కారణం? ఆయన అధికారుల చేతులు తడపకపోవడమే. ఆ మాస్టారు ఆగస్టు 15, 1947న, అంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే పుట్టారు. కానీ తన పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు, ఈ దేశానికి ఇంకా నిజమైన స్వాతంత్య్రం రాలేదని ఆయనకు అర్థమవుతుంది. ‘రూపాయి విలువ పడిపోవడం లేదు బాబు, ఆ రూపాయి కోసం దిగజారుతున్న మీలాంటి వాళ్ల విలువ పడిపోతోంది” అని ఆయన చెప్పే మాటలు నేటి సమాజానికి చెంపపెట్టు. చచ్చినా ఒక్క రూపాయి లంచం ఇవ్వనని, తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టనని ఆయన తెగేసి చెప్తారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, తన సొంత విద్యార్థే ‘సహాయం’ చేస్తానంటూ లంచంతో పని ముగించాలని చూడటం. ఇది ఆ మాస్టారి ఆత్మగౌరవానికి తగిలిన పెద్ద గాయం. విలువలను పాటించాలని జీవితాంతం నేర్పిన గురువే ఆ విలువలను తప్పితే, ఇక విలువలకే విలువ ఏముంటుందని ఆయన ప్రశ్నిస్తారు. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ఉన్నా, ఆ వయసులో శక్తి లేక, యువత పట్టించుకోకపోవడం చూసి ఆయన కుమిలిపోతారు. ‘అవినీతి ముందు నిజాయితీ ఓడిపోయింది’ అని ఆయన భావించడం మన వ్యవస్థలోని వైఫల్యానికి నిదర్శనం. ఈ కథ కేవలం ఒక ఉపాధ్యాయుడి పెన్షన్ సమస్య మాత్రమే కాదు. ఇది మన సమాజంలో వేళ్లూనుకున్న అవినీతిపై ఒక హెచ్చరిక. నిజాయితీ పరులు కూడా ఉన్నారని నిరూపించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంది. వ్యవస్థ మారాలంటే మన ఆలోచనలు మారాలి. విలువల కోసం ప్రాణాలైనా ఇచ్చే అటువంటి గురువుల ఆశయాలను గౌరవించడం మనందరి బాధ్యత. ఇంత మంచి సందేశంతో కూడిన ఈ వీడియోను చూడండి. ఆలోచించండి. చైతన్యపూరితమైన ఇలాంటి వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
  -ధురంధర్ పార్ట్ 2 ట్రైలర్ వచ్చేసింది  -ఉస్తాద్ పరిస్థితి ఏంటి! -18 అర్ధరాత్రి నుంచే వార్ ఖాయమా!   భారతీయ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ధురంధర్ పార్ట్ 2(Dhurandhar 2).ఈ నెల 19 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పార్ట్ 1 లో 'రెహ్మాన్ డెకాయత్' ని మన దేశపు 'రా' ఏజెంట్ హోదాలో హంజా అలీ మజారి అలియాస్ 'జస్కి రత్ సింగ్ రంగి' చంపడంతో పార్ట్ 2 పై ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వాళ్ళు కథని అల్లుకుంటు కోటి ఆశలతో ఎదురుచూస్తూ వస్తున్నారు. వాళ్ళ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతు   అంచనాలని పెంచుకునేలా ఈ రోజు ధురంధర్ 2 ట్రైలర్ వచ్చేసింది. రావడమే కాదు తెలుగు ప్రేక్షకుల్లో సరికొత్త అనుమానాలకి, చర్చలకి తావు ఇచ్చింది. విషయమేంటో చూద్దాం. సుమారు మూడు నిమిషాల పద్దెనిమిది సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ ఒక రేంజ్ లో ఉంది. ఐదు గంటల్లోనే వచ్చిన  9 . 5 మిలియన్స్ వ్యూస్ రేంజ్ స్థాయికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలుగులో కూడా ధురంధర్ 2 విడుదలవుతున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ధురంధర్ 2 vs ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat Singh)అనే డైలాగ్ ఫుల్ స్వింగ్ మోడ్ లో వెళ్తుంది. నిజానికి   ఉస్తాద్ భగత్ సింగ్ డేట్ 26 నుంచి 19 కి మారినప్పుడు పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఇప్పుడు  ధురంధర్ ట్రైలర్ రిలీజైన దగ్గర్నుంచి ఉస్తాద్ vs ధురంధర్ వర్డ్  బాగానే రన్ అవుతుంది. కొంత మంది ధురంధర్ 2  ప్రభావం తెలుగులో పెద్దగా ఏముంటుందిలే అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ అలా అనుకోవడం పొరపాటే అవుతుంది.  also read: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి.. వధువు కావ్య రెడ్డి ఎవరో తెలుసా! ధురంధర్ మొదటి భాగం తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అవ్వకపోయినా హిందీ వెర్షన్ ని మెజారిటీ తెలుగు ప్రేక్షకులందరు చూసారు. భారీ స్థాయి కలెక్షన్స్ కూడా రావడంతో పాటు ధురంధర్ సబ్జెట్  గురించి చర్చలు కూడా జరిగాయి. మరి ఈ లెక్కన ధురంధర్ 2  తెలుగులో కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. 18 నుంచే ప్రీమియర్ షోస్ ఉన్నాయని కూడా అనౌన్స్ చెయ్యడంతో ఉస్తాద్ vs  ధురంధర్ 2 మధ్య పోటీ ఖాయమని సినీ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు. పైగా పోటీ అనేది అభిమానులు, మూవీ లవర్స్, ప్రేక్షకులు సినిమాకి కల్పించిన హక్కు . ఉస్తాద్ హంగామ కూడా ప్రీమియర్స్ తో షురు కానున్న విషయం తెలిసిందే. ఇక ధురంధర్ తెలుగు ట్రైలర్ ఈ సాయంత్రానికి ప్రత్యక్షమవ్వడం ఖాయం.    
- డాక్యుమెంటరీ తీర్చిదిద్దిన విధానంపై ప్రశంసలు కురిపించిన జ్యూరీ సభ్యులు - యూనిటీ డాక్యుమెంటరీని నిర్మించిన దర్శక నిర్మాతలకు అభినందనల వెల్లువ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ జాతిపితగా పిలుచుకునే కొండా లక్ష్మణ్ బాపూజీపై యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ రూపొందించిన యూనిటీ. ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఉప శీర్షిక.  చిరందాస్ శ్రీకాంత్ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో సముచితమైన స్థానం దక్కింది. 2025 సంవత్సరానికి గాను వెల్లడించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లోని డాక్యుమెంటరీ విభాగంలో తొలి ఉత్తమ డాక్యుమెంటరీగా గద్దర్ అవార్డును సొంతం చేసుకుంది. డాక్యుమెంటరీ, షార్ట్ ఫిల్మ్స్ కు జ్యూరీ ఛైర్మన్ గా ఉన్న ప్రముఖ దర్శకులు విజయ్ కనకమేడల ఎఫ్ డీసీ కార్యాలయంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ.... తెలంగాణ సమాజానికి మరో గాంధీ ఎలా అయ్యాడనే విషయాన్ని చాలా ఆసక్తికరంగా పెద్దల నుంచి పాఠశాల విద్యార్థులకు సైతం సులభంగా అర్థమయ్యేలా యూనిటీ డాక్యుమెంటరీని విజయ్ కుమార్ చిత్రీకరించారు. మైమ్ మధు, బాలనటుడు భాను ప్రధాన పాత్రలు పోషిస్తూ బాపూజీ కథను వివరించారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ లో ఇలా వినూత్నమైన పద్దతిలో కొండా లక్ష్మణ్ బాపూజీ బాల్యం నుంచి మరణం వరకు, ఆ తర్వాత తెలంగాణ సాధన వరకు ప్రతి విషయాన్ని ఎంతో స్పష్టంగా చిత్రీకరించడం పట్ల జ్యూరీ సభ్యులు ప్రశంసలు కురిపించారు. నాణ్యమైన విజువల్స్, స్పష్టమైన వాయిస్ ఓవర్, చక్కని ఎడిటింగ్ తో ప్రేక్షకులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సుమారు అరగంటపాటు యూనిటీ డాక్యుమెంటరీని తీర్చిదిద్దిన దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే యూనిటీ డాక్యుమెంటరీ పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కూడా శభాష్ అనిపించుకొని అవార్డులు అందుకుంది. 2025లో దిల్లీలో జరిగిన 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోగా.... ముంబయిలో జరిగిన భారత్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్-2023లో యూనిటీ డాక్యుమెంటరీకి రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్ హిస్టారికల్ డాక్యుమెంట్ ఫిల్మ్, ఐకానిక్ ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డును యూనిటీ (UNITY) సొంతం చేసుకుంది. ఇలా... ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న UNITY డాక్యుమెంటరీ ఫిల్మ్ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి గద్దర్ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల దర్శకుడు విజయ్ కుమార్, నిర్మాత శ్రీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం పరితపించిన మహోన్నత శిఖరం లాంటి వ్యక్తి చరిత్రను గుర్తించి ప్రోత్సహించడం కొండా లక్ష్మణ్ బాపూజీ పట్ల ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను చాటుకుందని తెలిపారు. అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ ఛైర్మన్ విజయ్ కనకమేడల, జ్యూరీ సభ్యులకు దర్శకుడు విజయ్, నిర్మాత శ్రీకాంత్ తోపాటు అందులో నటించిన మైమ్ మధు, బాలనటుడు  మాస్టర్ భాను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 19న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా స్పీడ్‌గా జరుగుతోంది. అందులో భాగంగా పవన్‌కళ్యాణ్ తన వెర్షన్ డబ్బింగ్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి అధికారికంగా పెట్టిన పోస్ట్ ఇప్ప్పుడు వైరల్‌గా మారుతోంది. డబ్బింగ్ చెప్తున్న పవన్‌కళ్యాణ్ పక్కన దర్శకుడు హరీష్ శంకర్, సంగీత దర్శకుడు థమన్ ఉన్నారు.  శరవేగంగా జరుగుతున్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని హరీష్ శంకర్ పర్యవేక్షిస్తున్నారు. మరో పక్క థమన్ మరోసారి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ పవర్‌ఫుల్ స్కోర్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన ఒక సర్‌ప్రైజ్‌ను ఈరోజు రివీల్ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఏది ఏమైనా ఎంతోకాలంగా పవర్‌స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉగాదికి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సష్టించేందుకు సిద్ధమవుతోంది.  ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తోంది. పవన్‌కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎలాంటి సంచలనాలు సష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్ప్పుడు ఆ చిత్రాన్ని మించే స్థాయిలో ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌’ ఉందనే ప్రచారం జరుగుతోంది. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
1979- శశిబాల ఒక అందమైన 20 ఏళ్ల యువతి. దిల్లీలోని ప్రఖ్యత లక్ష్మీబాయ్‌ కాలేజి నుంచి డిగ్రీని కూడా సాధించింది. శశిబాలకు పది నెలల క్రితమే పెళ్లయింది. ఇప్పుడు తను ఆర్నెళ్ల గర్భవతి కూడా! బయట నుంచి చూసేవారికి ఇదంతా ఓ అందమైన జీవితం తాలూకు వర్ణనగా తోచవచ్చు. కానీ శశిబాల వ్యక్తిగత జీవితం ఆ చిత్రానికి తలకిందులుగా కనిపిస్తుంది. పెళ్లయిన దగ్గర్నుంచి శశిబాల అత్తమామలు కట్నం కింద ఏదోఒక వస్తువుని తీసుకురమ్మంటూ గొడవచేస్తూనే ఉన్నారు. శశిబాల తన తల్లి సత్యరాణి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిసారీ, తల్లీకూతుళ్లు వారి కోరికను ఎలా తీర్చాలా అని మదన పడుతూనే ఉన్నారు. సత్యరాణి వితంతువు, పైగా శశిబాలతో పాటు ఆమె మీద మరికొందరి బిడ్డల భారం కూడా ఉంది. ఇలాంటి సమయంలో ఓ రోజు సత్యరాణికి, శశిబాల అత్తగారింటి నుంచి వెంటనే రమ్మంటూ కబురు వచ్చింది.     పరుగుపరుగున వెళ్లిన ఆమెకు తన బంగారు కూతురు నల్లటి ముద్దగా ఓ మూల కనిపించింది. ‘నీ కూతురు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆ చెత్తని ఇక్కడి నుంచి పట్టుకుపో!’ అన్నారు శశిబాల అత్తగారు. కూతురి శవాన్ని కప్పేందుకు వాళ్లు ఒక దుప్పటిని అందించేందుకు కూడా సిద్ధపడలేదు. 1980వ దశకంలో ఇలాంటి సంఘటనలు చాలానే వినిపించేవి. కిరసనాయిలు పోసుకునో, చీరకు నిప్పంటుకునో నిస్సహాయంగా ఎందరో ఆడవాళ్లు చనిపోయేవారు. అవన్నీ ప్రమాదాలో ఆత్మహత్యలో కాదనీ, వరకట్నపు హత్యలనీ తెలిసినా ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి. కానీ సత్యరాణి అలా నిశ్శబ్దంగా ఊరుకోదల్చుకోలేదు.   స్కూటరు కొనిపెట్టలేదన్న కారణంగా తన అల్లుడు ఆమెను చంపేశాడంటూ కేసుని నమోదు చేసింది. అయితే అప్పట్లో చట్టాలు ఇంత కఠినంగా ఉండేవి కాదు. పెళ్లి సమయంలో అందుకున్నవే కట్నకానుకల కిందకి వస్తాయన్న నిర్వచనం ఉండేది. పైగా చావుకి సంబంధించిన ఆరోపణలను నిరూపించే బాధ్యత మృతుల తరఫు న్యాయవాదులకే ఉండేది. సత్యరాణి ఒక పక్క తన కూతురి చావుకి సంబంధించిన కేసులను పోరాడుతూనే, మరో పక్క వరకట్నపు చావులను ఎదుర్కొంటున్న ఎందరో అభాగ్యుల కోసం గొంతు విప్పడం మొదలుపెట్టింది. తమ కూతురు వరకట్నం కారణంగా చావుని ఎదుర్కొందిని భావించిన ప్రతి ఒక్కరి పోరాటానికీ ఆసరాగా నిలిచేది.       సత్యరాణి తనలాంటి దుస్థితిలో ఉన్న మరికొందరితో కలిసి శక్తిశాలిని పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. వరకట్నపు వేధింపులను ఎదుర్కొనేవారికి ఈ సంస్థ నిలువనీడను కల్పించేది. సత్యరాణికి చదువు లేదు. వయసు పైబడుతోంది. పైగా చెట్టంత కూతురిని పోగొట్టుకుంది. అయినా వరకట్నానికి వ్యతిరేకంగా తన పోరులో రవ్వంత కూడా వెనక్కి తగ్గలేదు. రానురానూ సత్యరాణి ఉద్యమం ఫలితాలనివ్వసాగింది. వరకట్న వ్యతిరేక చట్టానికి ప్రభుత్వం మరింత పెట్టాల్సి వచ్చింది. వరకట్నం అంటే కేవలం డబ్బే కాదు, వస్తువుని కోరడం కూడా వరకట్న పరిధిలోనే వస్తాయంటూ చట్టాన్ని మార్చింది కేంద్రం. పెళ్లైన ఏడేళ్ల లోపు స్త్రీ ఆత్మహత్య చేసుకున్నా కూడా, అందుకు కారణం అత్తవారింటి ఆరళ్లు కూడా కావచ్చునంటూ మరో సవరణ కూడా చేసింది.   ఒక పక్క సమాజంలో మార్పు రావడం, మరో పక్క చట్టాలకు పదునెక్కించడంతో... వరకట్న హత్యలు కొంతమేరకన్నా తగ్గాయి. ముఖ్యంగా ‘వంటగదిలో ప్రమాదాలు, ఆత్మహత్యలు’ చాలామేరకు తగ్గాయి. నేరాల తగ్గుదలను చాలామంది గమనించారు కానీ, అందుకు కారణమైన సత్యరాణి వంటి తల్లుల పోరాటాన్ని పెద్దగా గమనించింది లేదు. వరకట్న చావులను తగ్గించడంలోనే సత్యరాణి విజయం సాధించడమే కాదు, మారిన చట్టాలకు అనుగుణంగా తన అల్లుడికి శిక్షపడేలా కూడా విజయం సాధించింది. 2014లో సత్యరాణి తన 85వ ఏట ప్రశాంతంగా కన్నుమూసింది. కానీ ఆమె జీవితం ఏనాడూ వృధాగా పోలేదు. ఒక తల్లిగా తాను పొందిన గర్భశోకాం, మరో తల్లికి కలుగకుండా ఉండేందుకే అనుక్షణం పోరాడింది. ఎందరో కూతుళ్లకి న్యాయాన్ని సాధించింది. మరెందరో వధువులు వరకట్నపు కోరల్లో చిక్కుకోకుండా తన జీవితాన్ని అడ్డు వేసింది.   - నిర్జర.
చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌! లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.   కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.   మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!   మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.   - నిర్జర.
కట్నం తీసుకోవడం శిక్షార్హం అని ప్రభుత్వం తెగ ప్రకటనలు చేస్తుంటుంది. కట్నం అడిగేవాడు గాడిదతో సమానం అంటూ టీవీలు చెడ తిడుతుంటాయి. కానీ కట్నం తీసుకునే ఆచారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మునుపటిలా కట్నం తేలేదని కిరసనాయిలు పోసి తగటబెట్టేసిన వార్తలు వినిపించకపోవచ్చు. కానీ వేధింపులు మాత్రం యథాతథంగానే సాగుతున్నాయి. ఇలాంటి ఆచారానికి ముగింపు పలుకుతున్నాడు ఓ యోధుడు.... జార్ఖండ్లోని పొఖారీ గ్రామానికి చెందిన హాజీ ముంతాజ్ అలీకి కట్నం అంటే మా చెడ్డ చిరాకు. ఆ కట్నం కారణంగానే తన తోటి ముస్లిం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయన్నది అతని అభిప్రాయం. కానీ మిగతావారిలాగా ముంతాజ్ అలీ ఈ దురాచారం గురించి బాధపడుతూ కూర్చోలేదు. కట్నం తీసుకోవడం ఎంత అనాగరికమో, దాని వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, యువత ఎలా అత్యాశలో కూరుకుపోతోందో ఊరిలో ఇంటింటికీ వెళ్లి చెప్పసాగాడు. 2016 ఏప్రిల్లో ముంతాజ్ అలీ మొదలుపెట్టిన ప్రచారం నెలలు గడిచేసరికి సత్ఫలితాలను ఇవ్వసాగింది. తాము కట్నం తీసుకోమంటూ తోటి ముస్లిం కుటుంబాలన్నీ ముంతాజ్ అలీకి మాట ఇచ్చాయి. అంతేకాదు! ఇప్పటికే కట్నం తీసుకున్నవారైతే తాము తీసుకున్న కట్నాన్ని ఆడపిల్లల కుటుంబానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 800 కుటుబాల వారు ఆరుకోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇచ్చేశారు. కట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముంతాజ్ అలీ పోరాటం రానురానూ ఓ ఉద్యమం స్థాయికి చేరుకుతంది. జార్ఖండ్లోని లాతేహర్, పాలము జిల్లాలలోని ముస్లిం కుటుంబాలు ఇప్పుడు కట్నం అంటేనే మండిపడుతున్నారు. ఆఖరికి పెళ్లిళ్లు చేయించే మతగురువులు (మౌల్వీలు) కూడా కట్నం తీసుకునేవారి పెళ్లిళ్లు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేశారు. తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు దల్తోన్గంజ్ అనే ఊరిలో ఈ నెల 7వ తేదీన ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు ముంతాజ్ అలీ. మతం ఏదైనా కానీ... కట్నం ఇచ్చే ఆచారం వెనుక ఒకప్పటి ఉద్దేశం వేరు. ప్రస్తుతం మాత్రం అది ఆడపిల్లల జీవితాలని తలకిందులుగా మార్చేస్తోంది. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టుకున్నారు ముంతాజ్ అలీ. అతను ఆశయం అసాధ్యం కాదని 800 కుటుంబాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్క ముంతాజ్ అలీ ఒంటరిగా ఇంత సాధిస్తే... గంటల కొద్దీ కబుర్లు చెప్పే మన సమాజ సేవకులు ఇంకెంత సాధించాలి! - నిర్జర.        
బట్టతల మరియు జుట్టు రాలడం :  కారణాలు నివారణలు  ఆధునిక చికిత్సలు జుట్టు అనేది కేవలం మన శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు, అది మన అందానికి మరియు ఆత్మవిశ్వాసానికి చిహ్నం. అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు పలచబడటం గమనిస్తే కలిగే ఆందోళన అంతా ఇంతా కాదు. ఒకప్పుడు 40 ఏళ్లు దాటిన వారిలో కనిపించే బట్టతల సమస్య, నేడు మారుతున్న జీవనశైలి వల్ల 13-14 ఏళ్ల చిన్న వయసులోనే మొదలవుతోంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీనిని అరికట్టడం సాధ్యమేనా?  Dr. Sunaina Shaik చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం జుట్టుపై ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) • ముందస్తు గుర్తింపు (Early Diagnosis): జుట్టు పూర్తిగా ఊడిపోయిన తర్వాత తిరిగి రావడం అసాధ్యం. ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందుల ద్వారా జుట్టును కాపాడుకోవచ్చు. • ఆత్మవిశ్వాసం: జుట్టు రాలడం వల్ల కలిగే మానసిక ఒత్తిడి మన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల మనల్ని మనం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. • మెరుగైన ఫలితాలు: జుట్టు పల్చబడే దశలో (Hair Thinning) చికిత్స ప్రారంభిస్తే, ఉన్న జుట్టును ఒత్తుగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) • సొంత వైద్యం వద్దు: డాక్టర్ పర్యవేక్షణ లేకుండా మినాక్సిడిల్ (Minoxidil) వంటి మందులను వాడకూడదు. • గర్భధారణ సమయంలో జాగ్రత్త: గర్భం దాల్చిన వారు లేదా ప్లాన్ చేస్తున్న వారు మినాక్సిడిల్ వాడటం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు వచ్చే అవకాశం ఉంది. • అతిగా ఆశించవద్దు: హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా గతంలో ఉన్నంత సహజమైన సాంద్రత (Density) రాకపోవచ్చు; ఇది కేవలం పలచబడిన ప్రాంతాన్ని కవర్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. • ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి: ఆధునిక పరిశోధనల ప్రకారం, ఒత్తిడి (Stress) అనేది బట్టతలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారుతోంది. జుట్టును ఎలా కాపాడుకోవాలి? (How to - Treatment Steps) 1. కారణాన్ని గుర్తించండి: పురుషులలో వచ్చే బట్టతలను 'ఆండ్రోజెనెటిక్ అలోపేసియా' అంటారు, ఇది ఎక్కువగా జన్యుపరంగా వస్తుంది. మహిళల్లో జుట్టు మధ్యలో పలచబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. వైద్య చికిత్సలు:     ◦ మినాక్సిడిల్: ఇది సీరం, లోషన్, ఫోమ్ లేదా టాబ్లెట్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది. ◦ PRP మరియు GFC: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా (PRP) మరియు గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ (GFC) చికిత్సల ద్వారా మీ స్వంత రక్తం నుండి తీసిన పోషకాలను తలకు ఇంజెక్ట్ చేసి జుట్టు సాంద్రతను పెంచుతారు. ◦ హెయిర్ ట్రాన్స్ ప్లాంట్: జుట్టు పూర్తిగా ఊడిపోయిన చోట వేరే ప్రాంతం నుండి జుట్టును తీసి నాటుతారు. 3. సప్లిమెంట్స్: డాక్టర్ సూచన మేరకు అవసరమైన విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. సాధారణ సందేహాలు - సమాధానాలు (Q&A) ప్ర: బట్టతల అనేది కేవలం జన్యుపరంగానే వస్తుందా?  జ: పురుషులలో ఇది ప్రధానంగా జన్యుపరంగా వస్తుంది. కానీ మహిళల్లో జన్యువులతో పాటు హార్మోన్ల మార్పులు మరియు ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ప్ర: PRP చికిత్సతో కొత్త జుట్టు వస్తుందా?  జ: లేదు. PRP లేదా GFC చికిత్సలు ఉన్న జుట్టును ఒత్తుగా (Thickening) చేయడానికి మరియు రాలకుండా ఆపడానికి మాత్రమే ఉపయోగపడతాయి. జుట్టు లేని చోట కొత్తగా జుట్టు రావాలంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ ఒక్కటే మార్గం. ప్ర: శరీరంలోని ఇతర భాగాల నుండి జుట్టును తీసి తలకు వాడవచ్చా?  జ: అవును, చాతి లేదా గడ్డం వంటి భాగాల నుండి జుట్టును తీసి ట్రాన్స్ ప్లాంట్ చేయవచ్చు. కానీ తలపై ఉన్న జుట్టు ఇచ్చినంత సహజమైన ఫలితాలు వీటితో రాకపోవచ్చు. జుట్టు రాలడం అనేది ఒక సమస్యే కావచ్చు, కానీ సరైన సమయంలో స్పందిస్తే దానికి పరిష్కారం తప్పక ఉంటుంది. భయపడకుండా నిపుణులైన డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. మరింత సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానెల్ సందర్శించండి: జుట్టు సంరక్షణ మరియు మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
బిజీగా గడిపిన తర్వాత పురుషుల కంటే మహిళలు ఎక్కువగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఆడవాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చాలామంది మగాళ్లు అనుకుంటూ ఉంటారు. కానీ సైన్స్ మాత్రం ఆడవారి పరిస్థితి నిజమేనని చెబుతోంది.   సైన్స్ కూడా మహిళలు  పురుషుల కంటే ఎక్కువ  అలసిపోతారని,  వారికి ఎక్కువ నిద్ర అవసరమని చెబుతోంది.  ఇది కేవలం సోమరితనం లేదా విశ్రాంతి తీసుకోవడానికి చెబుతున్న విషయం కాదని, దాని వెనుక చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. పురుషుల కంటే మహిళలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో అర్థం తెలుసుకుంటే..   మల్టీ టాస్కింగ్..  మెదడు సంక్లిష్టత.. నిద్ర యొక్క అతి ముఖ్యమైన విధి మెదడును బాగుచేయడానికి,  తిరిగి శక్తిని  నింపడానికి సమయం కేటాయించడం. పరిశోధన ప్రకారం స్త్రీలు పురుషుల కంటే ఎక్కువ పనులు చేస్తారు.  ఇల్లు, పిల్లలు, ఉద్యోగం,  భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒకేసారి ఆలోచిస్తారు. మెదడును  తీవ్రంగా,  ఎక్కువ కాలం ఇలా ఆలోచించినప్పుడు, అది కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. మహిళల మెదళ్ళు రోజంతా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తాయి. కాబట్టి వారికి మరింత గాఢ నిద్ర అవసరం అవుతుంది. హార్మోన్ల మార్పులు.. జీవితంలోని వివిధ దశలలో మహిళల శరీరాలు గణనీయమైన హార్మోన్ల మార్పులకు లోనవుతాయి. ఋతుస్రావం, గర్భధారణ, మెనోపాజ్  వంటి సమయాలలో ఈస్ట్రోజెన్,  ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. గర్భం.. గర్బం దాల్చిన కాలంలో శరీర బరువు పెరగడం,  శారీరక మార్పులు అలసటను పెంచుతాయి. మెనోపాజ్.  మెనోపాజ్  దశలో వేడి ఆవిర్లు,  చెమటలు పట్టడం వంటి సమస్యలు తరచుగా నిద్రకు అంతరాయం కలిగిస్తాయి.  దీని కారణంగా శరీరానికి పూర్తి విశ్రాంతి లభించదు. అందుకే ఎక్కువగా నిద్రపోవాలని అనిపిస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత.. పురుషుల కంటే స్త్రీల నిద్ర తక్కువగా ఉంటుంది. ఇంట్లో శబ్దాలు, పిల్లలు ఏడుపు లేదా ఏదైనా చిన్న కదలికలకు కూడా వారు తొందరగా మేల్కొంటారు. ఇంకా మహిళలు నిద్రలేమి,  రెస్ట్‌లెస్ కాళ్ల సిండ్రోమ్ వంటి సమస్యలకు ఎక్కువగా గురవుతారు. తరచుగా నిద్ర అంతరాయాల కారణంగా, శరీర మరమ్మత్తుకు అవసరమైన గాఢ నిద్ర వారికి లభించదు. అందువల్ల  ఉదయం మేల్కొనేటప్పుడు అలసటగా,  ఇంకాసేపు నిద్రపోవాలని అనిపిస్తుంది. మానసిక ఆరోగ్యం,  ఒత్తిడి.. సామాజిక,  కుటుంబ బాధ్యతల కారణంగా మహిళలు తరచుగా ఎక్కువ మానసిక ఒత్తిడి,  ఆందోళనను అనుభవిస్తారు. ఒత్తిడి నేరుగా నిద్రను ప్రభావితం చేస్తుంది. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు, శరీరం విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. తగినంత నిద్ర లేకపోవడం ఈ ఒత్తిడిని మరింత పెంచుతుంది, ఇది ఒక చక్రంలా కొనసాగుతుంది. బాగా నిద్రపోవడానికి ఏమి చేయాలి? మహిళలకు నిద్ర లేకపోవడం అలసటను మాత్రమే కాదు..  గుండె జబ్బులు, ఆందోళన,  నిరాశ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. పడుకోవడానికి, మేల్కొనడానికి ఒక సమయాన్ని నిర్థేశించుకోవాలి. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు మొబైల్,  ల్యాప్‌టాప్ వాడటం మానేయాలి. మధ్యాహ్నం తర్వాత టీ, కాఫీ తాగకూడదు.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...