LATEST NEWS
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది.   కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.   ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.   ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.    public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ   రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. నేడో రేపో  రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  సాగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి  నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరశన చేపట్టారు. ఇలా ఉండగా ఆయన నిరవధిక నిరశన శుక్రవారం (జులై 17) నాటికి 20వ రోజుకు చేరింది. ఇలా ఉండగా  పార్లమెంట్ భవనం  ముట్టడించేందుకు కూడా  సోనమ్ వాంగ్‌చుక్   బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కీలక తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్‌చుక్  మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో  ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే ఆప్ అధినేత,  దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి  మద్దతు  ప్రకటించారు. కేజ్రీవాల్ పర్యటనతో ఈ ఉద్యమానికి   రాజకీయ బలం చేకూరింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణాదిలో అత్యంత బలమైన నేత  రేవంత్ రెడ్డి స్వయంగా హస్తిన వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్  కు, ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించనుండటంతో..  కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఈ ఉద్యమ వేదికపైకి పంపించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ది బలమైన వాయిస్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన, సోనమ్ వాంగ్‌చుక్‌తో భేటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన ఖరారైందని అంటున్నాయి.     Telangana CM, Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, TeluguOne 
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. అధికార పక్షాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొని బలపడాల్సిన తరుణంలో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు మరియు బలహీనమైన వ్యూహాలు పార్టీని మరింత రక్షణాత్మక ధోరణిలోకి నెడుతున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. రాజకీయ పరిస్థితి మరియు లోపించిన సునిశితత్వంప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ అనేక క్షేత్రస్థాయి సమస్యలను తన రాజకీయ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతోంది. విజయవాడ లాకప్ డెత్ (సాయికృష్ణ కేస్) వంటి తీవ్రమైన సమస్యలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం పార్టీ వ్యూహాత్మక లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలలో మొదట హడావుడి చేయడం, ఆ తర్వాత బాధితులను లేదా ఆందోళనకారులను సమన్వయం చేసుకోలేక మధ్యలోనే వదిలేయడం జగన్ నాయకత్వానికి బలహీనతగా మారింది. స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించకుండా, క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటాలు నిర్మించకుండా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవ్వడం వైస్సార్సీపీకి శాపంగా మారింది.  సమగ్ర అధ్యయనం లేకుండా మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విమర్శలకు, మీమ్స్ మరియు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి.వైఎస్సార్సీపీ బలహీన వ్యూహాలు మరియు పరిణామాలుపూర్వపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ శైలిని గమనిస్తే, ఆయన ఏ ప్రజాసమస్యపైనైనా పోరాడేముందు క్షేత్రస్థాయిలో పనిచేసే మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ నేతలతో మాట్లాడి పూర్తి అవగాహనతో ముందడుగు వేసేవారు. అయితే, ప్రస్తుత వైఎస్సార్సీపీలో అటువంటి నిర్మాణాత్మక చర్చలు లేకపోవడం ప్రధాన లోపం. రావణ ఎపిసోడ్ వంటి సందర్భాల్లో మొదట మైనారిటీల తరఫున నిలబడతామని ప్రకటించి, ఆపై కేంద్ర నాయకత్వానికి (NDA) దూరం కాకూడదనే భయంతోనో లేదా హిందూ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందనే ఆందోళనతోనో వెనక్కి తగ్గడం ఆ పార్టీలో నెలకొన్న సిద్ధాంతపరమైన గందరగోళాన్ని సూచిస్తోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు బెంగళూరు నుండి వచ్చి కేవలం పరామర్శలు చేసి వెళ్ళిపోవడం వల్ల శ్రేణుల్లో నమ్మకం సడలుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఒక పద్ధతి ప్రకారం నిరసనలు, ఉద్యమాలు చేపట్టలేకపోవడం వైఎస్సార్సీపీ వైఫల్యానికి అద్దంపడుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంనిర్మాణాత్మక వ్యూహాలు, క్షేత్రస్థాయి శ్రేణులతో బలమైన సమన్వయం లేకపోతే వైఎస్సార్సీపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కేవలం గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే 'యాక్టివ్ అపోజిషన్' వైఖరి పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తుంది. తప్పులను ఆత్మవిమర్శ చేసుకుని, చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతల అనుభవ శైలిని గమనించి రాజకీయ పరిణతి సాధించాల్సిన అవసరం జగన్ కి ఎంతైనా ఉంది. పార్టీని గందరగోళం మరియు అయోమయ పరిస్థితుల నుంచి బయటపడేసి, క్యాడర్‌లో భరోసా నింపకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ మరింత ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'జూనియర్ ఎన్టీఆర్' (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కేవలం ఒక సాధారణ ఊహాగానం కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేయగల ఒక బలమైన శక్తీకరణ..  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తే తెలుగునాట ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. ఈ అంశంపై టోన్ న్యూస్ "వాస్తవ వేదిక" చర్చా కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. ఒకవైపు సినిమా రంగంలో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్, మరోవైపు తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే అంశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చర్చనీయాంశాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన రాజకీయ శక్తులు బలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు తెలుగుదేశం పార్టీ (TDP) ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరులో, ఒక కొత్త మరియు అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడి అవసరం ఉందనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.  చారిత్రకంగా చూస్తే, ఎన్టీఆర్ కుటుంబానికి ప్రజాక్షేత్రంలో ఉండటం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ పరిస్థితుల్లోనైతే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో, నేటి రాజకీయ పరిస్థితులు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి అనుకూలంగా మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన నేటివరకు ఎలాంటి ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలు లేదా పూర్తిస్థాయి రాజకీయ కార్యాచరణను ప్రకటించకపోవడం గమనార్హం. అయినప్పటికీ, ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం పట్ల ఉన్న విశ్వసనీయత ఏమాత్రం తగ్గలేదు. వ్యూహాలు మరియు అంతర్గత సమీకరణాలుజూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం వెనుక అనేక వ్యూహాత్మక కోణాలు దాగి ఉన్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి సమకాలీన రాజకీయ నేతల పాత్ర కూడా ఈ సరికొత్త సమీకరణాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు తరహా రాజకీయ ఫార్ములా—అనగా కేవలం చలనచిత్ర చరిష్మాతో నేరుగా అధికారం సాధించడం—ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఆర్థిక బలంతో సంబంధం లేకుండా కేవలం ప్రజాదరణ, బలమైన భావజాలం మరియు సరైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తే విజయం సాధ్యమని ఇటీవలి రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.  తారక్ రాజకీయాల్లోకి వస్తే అది తెలుగుదేశం పార్టీ (TDP) లోని అంతర్గత సమతుల్యతను దెబ్బతీస్తుందనే భయంతో, కొందరు దీనిని వ్యతిరేకిస్తూ మరియు ఇది తారక్ స్వయంకృతం కాదనే ప్రచారాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంభవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, అది కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైఎస్సార్సీపీ మరియు టీడీపీల ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా తారక్ సరికొత్త మూడవ శక్తిగా లేదా టీడీపీకి అసలైన వారసుడిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.  ఆయనకు ఉన్న అశేష యువత, అభిమాన గణం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల సమీకరణను మలుపు తిప్పగలవు. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, తెలుగునాట సాంప్రదాయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా పక్కకుపోయి, సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ రాజకీయ భూకంపం ఏ తీరానికి చేరుతుందనేది తారక్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే కాకుండా, ఉభయ తెలుగు  రాష్ట్రాల వ్యాపార వర్గాల్లో ఇప్పుడో  భావోద్వేగ చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లా నేల నుంచి పుట్టి, దేశవ్యాప్తంగా తన బ్రాండ్ ఇమేజ్‌ను చాటిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అమరరాజా గ్రూప్, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తన అడుగులు బలంగా వేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద దాదాపు 9 వేల 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక గిగా కారిడార్‌లో భాగంగా, తొలి కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను అమరరాజా యాజమాన్యం  ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరరాజా అధినేత గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన ఒక పోస్ట్  అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. జయదేవ్ గల్లా సోషల్ మీడియాలో చేసిన  ఈ ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ సందర్భంగా లోకేష్ చేసిన ఎమోషనల్ కామెంట్స్  రెండు రాష్ట్రాల రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్నాయి.  గల్లా జయదేవ్ ట్వీట్‌కు స్పందిస్తూ నారా లోకేష్..  ఏపీ మీకు క్షమాపణ చెప్పాలి గల్లా జయదేవ్ గారు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.   గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయగాథలలో అమరరాజా కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాకుండా.. ఈ రాష్ట్ర ఆత్మగౌరవానికి  నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్న లోకేష్..  స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, చిత్తూరు జిల్లా పేరును ప్రపంచ చిత్రపటంలో సగర్వంగా నిలబెట్టిన ఘనత అమరరాజా సంస్థదేనన్నారు. అయితే  జగన్ ప్రభుత్వ  హయాంలో ఈ సంస్థ ఎదుర్కొన్న రాజకీయ వేధింపులు, ఆటంకాలు   ఉండాల్సింది కాదనీ,  సొంత గడ్డపై పెట్టుబడులు పెట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని భావించిన ఒక  పారిశ్రామికవేత్తకు లభించాల్సింది ప్రోత్సాహం,  గౌరవం మాత్రమేనన్న.. లోకేష్, జగన్ హయాంలో అమరరాజా సంస్థకు, యాజమాన్యానికి  దక్కినవి బెద రింపులు, వేధింపులేనని పేర్కొన్నారు. లోకేష్ కామెంట్స్ తో జగన్ హయాంలో.. అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో..  పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. జగన్ హయాంలో అమరరాజా ఎదుర్కొన్న వేధింపులు ఒక ఆంధ్రుడిగా తనను  కలచివేశాయన్న లోకేష్ వ్యాఖ్యలతో పారిశ్రామిక వర్గం ఏకీభవిస్తున్నది.   ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   పారిశ్రామిక రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నదని లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  అమరరాజా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో, అదే ఆంధ్రప్రదేశ్ గడ్డపై రాబోయే రోజుల్లో  ఆ సంస్థ కొత్త అధ్యాయాలు సృష్టిస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్న లోకేష్.. మా హృదయాలు, ఏపీ తలుపులు అమరరాజా కోసం ఎల్లప్పుడూ  తెరిచే ఉంటాయని పేర్కొంటూ.. నారా లోకేష్ గల్లా జయదేవ్‌ను ఏపీకి  హ్వానించారు. లోకేష్ ఈ ట్వీట్ ద్వారా.. రాజకీయాల వల్ల పారిశ్రామిక రంగం నష్టపోకూడదనే సందేశాన్నిచ్చారని పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  Amara Raja Batteries, Nara Lokesh Tweet, Galla Jayadev, Telangana Gigafactory, AP Investment Shift, Nara Lokesh Apology to Galla Jayadev 
ALSO ON TELUGUONE N E W S
  రంగస్థలంతో తెలుగు సినిమాకి సరికొత్త సొగసుని అద్దారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్. దీంతో ఆ ఇద్దరు కలిసి చేస్తున్న RC17 (వర్కింగ్ టైటిల్) పై అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి.  తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కబోయే కథగా ప్రచారం జరుగుతుండగా అక్టోబర్ లో లాంచింగ్ ఉంటుందనే టాక్ వినపడుతుంది. ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ చక్కర్లు కొడుతుంది. సుకుమార్ సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చాలా బలంగా, రా అండ్ రస్టిక్ గా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే  తెలంగాణ బ్యాక్‌డ్రాప్ రూటెడ్ స్టోరీకి భాగ్యశ్రీ అయితే పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని సుకుమార్ భావిస్తున్నారట. మరి సుకుమార్ భావిస్తున్నట్టుగా ఏ క్యారక్టర్ లో అయినా ఒక రేంజ్ పెర్ఫార్మ్ ఇవ్వగలదని భాగ్యశ్రీ నిరూపిస్తూ ఉంది. ఉదాహరణకి గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కి విజయదుందుభి మోగిస్తున్న లెనిన్. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ ప్రదర్శించిన పెర్ఫార్మ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. అలాంటి భాగ్యశ్రీ బోర్సే కనుక  చరణ్ మూవీలో  ఫైనలైజ్ అయితే, ఆమె కెరీర్ మరో లెవెల్ కి వెళ్లడం ఖాయం.  Also read: జన నాయగన్ దెబ్బకి రిలీజ్ డేట్ మార్చుకున్న చిత్రాలు ఇవే!  ఈ వార్త విన్న మెగా అభిమానులు సోషల్ మీడియాలో #RC17 కాస్టింగ్ పై జోరుగా డిస్కషన్స్ మొదలుపెట్టారు. భాగ్యశ్రీ గ్లామర్, చరణ్ మాస్ ఇమేజ్ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వెర్షన్స్ ని లాక్ చేసి, ప్రీ ప్రొడక్షన్ పనులని  90% పూర్తి చేసినట్లు టాక్ వస్తోంది. మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ram charan, Bhagyashri Borse, sukumar, mythri movie makers
ప్రపంచవ్యాప్తంగా సినిమా పిచ్చి ఉన్న అభిమానులను మనం ఎంతో మందిని చూసి ఉంటాం. తమకు ఇష్టమైన హీరోల సినిమాలు వస్తే థియేటర్ల ముందు కటౌట్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం లాంటివి చూశాం. కానీ ఒక హాలీవుడ్ దర్శకుడి సినిమా కోసం ఏకంగా తన ప్రెగ్నెన్సీనే వాయిదా వేసుకున్న ఒక మహిళ ఉదంతం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సినిమా చరిత్రలోనే ఇది ఒక నమ్మశక్యం కాని సరికొత్త క్రేజ్‌గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో, ఎందుకు అలా చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసే ప్రతి సినిమా ఒక విజువల్ వండర్‌గా ఉంటుంది. తాజాగా నోలన్ దర్శకత్వంలో వచ్చిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ'. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూశారు. ఆ సినీ పిచ్చి ప్రపంచంలో భాగమైన కాలిఫోర్నియాకు చెందిన 29 ఏళ్ల టెక్ ఎడిటర్ ఆంబర్ కనాగన్ అనే మహిళ నోలన్‌కు వీరాభిమాని. ఆమెకు ఇప్పటికే ఒక బిడ్డ ఉన్నాడు. తన భర్తతో కలిసి రెండో సంతానం కోసం ప్లాన్ చేసుకుంటున్న సమయంలో, క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' విడుదల తేదీ ఖరారైంది. దాంతో ఆమె ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాను ఎలాగైనా సరే విడుదలైన మొదటి రోజే, అదీ 70 ఎంఎం భారీ ఐమాక్స్ (IMAX 70mm) స్క్రీన్‌పైనే చూడాలని ఆంబర్ బలంగా నిశ్చయించుకుంది. అయితే ఆమె నివసిస్తున్న ప్రాంతానికి దగ్గరలో ఐమాక్స్ థియేటర్ లేదు. ఆ స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆమె ఏకంగా 3 గంటల పాటు సుదీర్ఘంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ తాను ప్రెగ్నెంట్ అయితే, ఆ సమయంలో అంత దూరం ఒంటరిగా కారు నడుపుకుంటూ వెళ్లడం ఏమాత్రం సాధ్యం కాదు. ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే అలసట, ప్రయాణ ఇబ్బందుల వల్ల తన డ్రీమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో మిస్ అవుతుందని ఆమె భయపడింది. అందుకే, నోలన్ సినిమాను థియేటర్లో చూసేంత వరకు తన ప్రెగ్నెన్సీని కొన్ని నెలల పాటు వాయిదా వేసుకోవాలని భర్తను ఒప్పించింది. ఒక వైపు భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'ది ఒడిస్సీ' సినిమాకు థియేటర్ల దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్, రివ్యూలు వస్తున్నాయి. ఇండియాలో కూడా మన టాప్ స్టార్ల సినిమాల రేంజ్‌లో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఆంబర్ కనాగన్ చేసిన ఈ సాహసోపేతమైన ప్రకటన మీడియాలో మరియు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "సినిమాపై అభిమానంలో ఇది నెక్స్ట్ లెవెల్ పిచ్చి" అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు. ఒక అద్భుతమైన సినిమా అనుభూతి కోసం జీవితంలో ఎంతో ముఖ్యమైన మాతృత్వాన్ని కూడా కొన్ని రోజులు పక్కన పెట్టిన ఆంబర్ క్రేజ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
  ఇళయ దళపతి విజయ్(Vijay)మరో సారి సెల్యులాయిడ్ పై తన వన్ మాన్ షో తో అభిమానులని, ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడానికి ఈ నెల 23 న 'జన నాయగన్'(తెలుగులో 'జననాయకుడు') తో థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్న విషయం తెలిసిందే. పైగా విజయ్ కెరీర్‌లో  చివరి చిత్రం కావడంతో ఒక రేంజ్ లో హంగామా ఉంటుంది.   'జన నాయగన్' ధాటికి భయపడి పలు తమిళ చిత్రాలు తమ రిలీజ్ ప్లాన్స్‌ని వాయిదా వేసుకున్నాయి. ఇందులో మొదటిగా నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ నటించిన హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' నిలిచింది. జూలై 23న విడుదల కావాల్సి ఉండగా సెప్టెంబర్ 4 కి వాయిదా వేశాడు. "థలపతి వస్తున్నప్పుడు మనం పక్కకి  తప్పుకోవాల్సిందే కదా" అంటూ  సోషల్ మీడియా వేదికగా విజయ్‌పై తనకున్న అభిమానాన్ని చాటుతు పోస్ట్ కూడా చేసాడు. Also read: భాగ్యశ్రీ బోర్సే నెక్స్ట్ సినిమాలు ఏంటో తెలుసా? కేవలం జీవీ ప్రకాష్ మాత్రమే కాదు, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ నటుడిగా పరిచయమవుతున్న 'డిసి' (DC) చిత్రం కూడా వాయిదా పడింది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా జూలై 31న విడుదల కావాల్సి ఉండగా, 'జన నాయగన్' హవా తగ్గడానికి సమయం పడుతుందని భావించి ఆగస్టు 7 కి వాయిదా వేశారు. అలాగే, ప్రఖ్యాత శాస్త్రవేత్త జి.డి.నాయుడు బయోపిక్‌గా తెరకెక్కిన 'జి.డి.ఎన్' (G.D.N) సినిమా కూడా జూలై 17 విడుదల నుండి వాయిదా పడింది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన 'సత్యవాన్ సావిత్రి' కూడా  24న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు ఆ తేదీపై సందిగ్ధత నెలకొంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వం వహిస్తున్న 'సిగ్మా' జూలై 31న విడుదల కావాల్సి ఉంది, అయితే ఈ చిత్రం కూడా వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.  vijay, jana nayagan, pooja hegde, gv prakash kumar
అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత నటి శోభిత ధూళిపాళ్ల తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన కెరీర్‌ను ఎంతో సమర్థవంతంగా సమతుల్యం చేసుకుంటోంది. అక్కినేని కుటుంబానికి పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతలను నిర్వర్తిస్తూనే, మరోవైపు నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె నటించిన 'చీకటిలో' వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ, అది ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ శోభిత తన నటన ప్రయాణాన్ని ఆపలేదు. పెళ్లికి ముందుతో పోలిస్తే ప్రస్తుతం ఆమె కొత్త ప్రాజెక్టులను కాస్త తగ్గించినట్లు కనిపిస్తున్నప్పటికీ, చిత్ర పరిశ్రమకు మాత్రం పూర్తిగా దూరం కాలేదు. ప్రస్తుతం ఆమె కొన్ని ప్రముఖ ఓటీటీ ప్రాజెక్టులతో పాటు తమిళ సినిమాలకు సైన్ చేస్తోంది. అయితే తెలుగు సినిమాలకు మాత్రం ప్రస్తుతానికి కాస్త దూరంగానే ఉంటోంది. ఇలాంటి తరుణంలో తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన కెరీర్, వైవాహిక జీవితంపై ఆమె చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శోభితను ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. "మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌కు సంతకం చేసే ముందు లేదా కథలు వినేటప్పుడు మీ భర్త నాగచైతన్య అనుమతి తీసుకుంటారా? ఆయనతో స్క్రిప్ట్ గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటారా?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శోభిత ఏమాత్రం తడుముకోకుండా, చాలా స్పష్టంగా, కరాఖండిగా సమాధానమిచ్చింది. "అస్సలు లేదు!" అంటూ శోభిత తన మనసులోని మాటను బయటపెట్టింది. తామిద్దరం ఒకరి వృత్తిపరమైన స్వేచ్ఛను మరొకరు ఎల్లప్పుడూ గౌరవించుకుంటామని ఆమె తెలిపింది. కెరీర్ పరంగా ఎవరి నిర్ణయాలు వారే స్వతంత్రంగా తీసుకుంటామని తేల్చిచెప్పింది. తామిద్దరం ఇంట్లో సాధారణ విషయాలు లేదా తమ పనుల గురించి మాట్లాడుకున్నప్పటికీ, ఒకరి వృత్తిపరమైన నిర్ణయాల్లో మరొకరు అస్సలు జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. కొత్త ప్రాజెక్టులు ఒప్పుకునేటప్పుడు ఒకరి పర్మిషన్ మరొకరు ఆశించాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొంది. నాగచైతన్య తన సినిమాలకు సంబంధించిన నిర్ణయాలను ఎలాగైతే స్వతంత్రంగా తీసుకుంటాడో, అలాగే తాను కూడా కథలను సొంతంగా విశ్లేషించుకుని, తన అభిరుచికి తగ్గట్టుగానే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తానని శోభిత ఎంతో ధీమాగా చెప్పింది. అక్కినేని వారి కోడలైనంత మాత్రాన ప్రతి చిన్న విషయానికి, ముఖ్యంగా తన సొంత కెరీర్ నిర్ణయాల కోసం భర్త అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఇలాంటి పరస్పర గౌరవం, స్వేచ్ఛ ఉండటం ఎంతో ఆదర్శవంతమని అభిప్రాయపడుతున్నారు. పెళ్లి తర్వాత నాగచైతన్య హీరోగా మంచి విజయాలతో దూసుకుపోతుండగా, మరి శోభిత కూడా త్వరలోనే ఒక పెద్ద హిట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
  సినీ క్రిటిక్స్ 'మిస్టర్ బచ్చన్' మూవీ చూసిన దగ్గర్నుంచి 'భాగ్యశ్రీ బోర్సే' తెలుగులో టాప్ హీరోయిన్ అవుతుందని చెప్తూనే వస్తున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ తో పాటు భాగ్యశ్రీ నుంచి వచ్చిన కింగ్ డమ్, ఆంధ్రాకింగ్ తాలూకా, కాంత చిత్రాలు ఫెయిల్. దీంతో సినీ క్రిటిక్స్ అంచనాలు తప్పుతాయని భావించారు. కానీ ప్రెజెంట్ థియేటర్స్ లో సంచలనం సృష్టిస్తున్న లెనిన్ తో సినీ క్రిటిక్స్ అంచనాలు కరెక్ట్ అని అర్థమయ్యాయి. భారతి క్యారక్టర్ లో భాగ్యశ్రీ  ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ప్రతిఒక్కరు ఫిదా అవుతుండటంతో పాటు సినిమా విజయంలో భాగ్యశ్రీ బోర్సే కూడా భాగమయ్యింది.  దీంతో ఇప్పుడు అందరు భాగ్యశ్రీ బోర్సే నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. అభిమానులైతే భాగ్యశ్రీ కి పెద్ద హీరో సినిమాలో అవకాశం వస్తే తెలుగు సినిమా అగ్ర హీరోయిన్ కావడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతానికైతే తన నుంచి ఎలాంటి కొత్త చిత్ర ప్రకటన రాలేదు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన శివకుమార్ మురుగేసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక యాక్షన్ చిత్రం 'సేయోన్' (Seyon) లో కథానాయికగా చేస్తుంది. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. also read:  ఓ సుకుమారి మూవీ రివ్యూ  Bhagyashri borse, lenin, akhil
నటీనటులు: మ్యాట్ డామన్, ఆన్ హాత్వే, టామ్ హాలండ్, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లిజ్ థెరాన్, జెండయా, హిమేష్ పటేల్, లుపిటా న్యోంగో, సమంతా మోర్టన్ సాంకేతిక నిపుణులు: మూలం: హోమర్ 'ఒడిస్సీ' సినిమాటోగ్రఫీ: హోయ్టే వాన్ హోయ్టెమా ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ రచన, దర్శకత్వం: క్రిస్టోఫర్ నోలన్ నిర్మాతలు: ఎమ్మా థామస్, క్రిస్టోఫర్ నోలన్ పంపిణీ: యూనివర్సల్ పిక్చర్స్ అంతర్జాతీయ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఓపెన్ హైమర్' చిత్రంతో ఆస్కార్ గెలుచుకున్న ఆయన, ఇప్పుడు గ్రీక్ పురాణ ఇతిహాసం (Greek Mythology) హోమర్ (Homer) రచించిన 'ఒడిస్సీ (The Odyssey)'ని తనదైన శైలిలో వెండితెరపైకి తీసుకొచ్చారు. పదేళ్ల పాటు జరిగిన భయంకరమైన ట్రోజన్ యుద్ధం (Trojan War) తర్వాత, ట్రాయ్ (Troy War) నగరాన్ని నాశనం చేసి, ఒడిస్సియస్ తన స్వగ్రామానికి చేసే సుదీర్ఘ ప్రయాణమే ఈ చిత్రం. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం. కథ: ఇథాకా రాజు అయిన ఒడిస్సియస్ (Matt Damon), ట్రోజన్ యుద్ధంలో గ్రీకు రాజు అగమెమ్నాన్ (Benny Safdie) కు సాయం చేసి ట్రాయ్ నగరాన్ని నాశనం చేస్తాడు. కానీ, యుద్ధం మొదలై 20 ఏళ్లు, ముగిసి 10 ఏళ్లు గడుస్తున్నా అతను ఇంకా తన ఇంటికి చేరుకోడు. మరోవైపు, అతని భార్య పెనెలోప్ (Anne Hathaway), కొడుకు టెలిమాకస్ (Tom Holland) తమ రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంటారు. రాణిని పెళ్లి చేసుకుని కొత్త రాజు అవ్వాలని ఆంటినస్ (Robert Pattinson) నాయకత్వంలో కొందరు ప్రయత్నిస్తుంటారు. సముద్రంపై ప్రయాణిస్తున్న ఒడిస్సియస్ ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అసలు అతను ఇంటికి తిరిగి వచ్చాడా? ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. విశ్లేషణ: సముద్రంపై ఒక ఒంటరి వీరుడు చేసిన సాహస యాత్రను తీసుకుని, సినిమాటిక్ అద్భుతాన్ని ఎలా సృష్టించాలో క్రిస్టోఫర్ నోలన్ మరోసారి నిరూపించారు. కేవలం యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయకుండా, అదే స్థాయి అద్భుతాన్ని తనదైన శైలిలో చూపించారు. ఇంత పెద్ద యుద్ధాన్ని, ఆ తర్వాత సాగిన పోరాటాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించారు. సినిమాలో జరిగే ఏ అద్భుత సంఘటన కూడా జరుగుతున్నట్టు కాకుండా, పాత్రల జ్ఞాపకాలుగా చెప్పడం విశేషం. ఎన్నో ఏళ్లుగా అందరూ చదువుకున్న, విన్న ఒక కథకు కొత్త కోణాన్ని ఇవ్వడం సామాన్యమైన విషయం కాదు. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ (IMAX) 70 ఎంఎంలో చిత్రీకరించినప్పటికీ, భారీ సంఘటనల వెనుక దాగి ఉన్న లోతైన మానవ భావోద్వేగాలను నోలన్ చాలా సున్నితంగా చూపించారు. ఒక సుదీర్ఘమైన పోరాటానికి అసలు ప్రేరణ ఏంటి? యుద్ధం చేయాలని ఎందుకు అనుకుంటారు? దానికి చెల్లించే మూల్యం ఏంటి? లాంటి ప్రశ్నలను అద్భుతంగా ఆవిష్కరించారు. హోమర్ మూలకథకు ఏమాత్రం భంగం కలగకుండా దేవుళ్ల ఉనికిని ప్రశ్నించకుండా.. దేవుడి సంకల్పానికి ఒక నిదర్శనంగా ఒడిస్సియస్ కథను చెప్పారు. గెలుపులో ఉన్న బాధను, విజయంలో ఉన్న ఒంటరితనాన్ని ప్రధాన పాత్ర అనుభవించే అపరాధ భావంగా చాలా అద్భుతంగా చూపించారు. నోలన్ తన పాత చిత్రాలైన ఇన్సెప్షన్, డార్క్ నైట్, డంకిర్క్, టెనెట్ లాగా కాకుండా, ఇందులో నేరుగా యాక్షన్ సన్నివేశాల్లోకి వెళ్లిపోకుండా చాలా సంయమనం పాటించారు. కథలోని అసలు కోణాన్ని అర్థం చేసుకోవడానికి, మూలాలను స్థాపించడానికి ఆయన చాలా సమయం తీసుకున్నారు. దేనికైనా ఒక లోతైన అర్థం ఉంటుందని, దాన్ని అనుభూతి చెందాలని ఆయన భావించారు. అందుకే ఈ సినిమా స్క్రీన్ ప్లే రెగ్యులర్ భారీ హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ లాగా వేగంగా ఉండదు. నటీనటుల విషయానికి వస్తే మ్యాట్ డామన్, టామ్ హాలండ్, ఆన్ హాత్వే, రాబర్ట్ ప్యాటిన్సన్ అందరూ తమ అత్యుత్తమ నటనను కనబరిచారు. మ్యాట్ డామన్ లుక్ గుర్తుపట్టలేనంతగా ఉన్నా, నోలన్ రాసుకున్న వీరుడి పాత్రకు ఆయన సరిగ్గా సరిపోయాడు. సాంకేతికంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోశాయి. భారీ జీవులను కూడా చాలా వాస్తవికంగా, భయంకరంగా చూపించారు. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. కథా పరంగా ఇది పాతదే అయినప్పటికీ, నోలన్ అడాప్టేషన్ దీన్ని కొత్తగా మార్చింది. అయితే కేవలం విజువల్స్, భారీ యాక్షన్ ఆశించి వెళ్లే వారికి ఈ సినిమా నెమ్మదిగా, కాస్త భారంగా అనిపించవచ్చు. ప్లస్ పాయింట్స్: నటీనటుల నటన సాంకేతిక అద్భుతం నిర్మాణ విలువలు భారీతనం మైనస్ పాయింట్స్: కొన్ని చోట్ల యాక్షన్ కొరియోగ్రఫీ మరీ సాధారణంగా ఉండటం నెమ్మదిగా సాగే కథనం పూర్తిగా నోలన్ శైలిలో సాగే సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే   బాటమ్ లైన్: ఇతిహాసాన్ని కొత్త కోణంలో చూపించిన మరో నోలన్ మార్క్ అద్భుతం. రేటింగ్: 3/5   గమనిక: ఈ సమీక్షలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. దీనికి సంస్థకు ఎలాంటి బాధ్యత లేదు. స్పందించే ముందు పాఠకులు తమ విచక్షణను ఉపయోగించగలరు.
Cast: Matt Damon, Anne Hathaway, Tom Holland, Robert Pattinson, Charlize Theron, Zendaya, Himesh Patel, Lupita Nyong'o, Samantha Morton Crew:  Based on Homer's Odyssey Cinematography by Hoyte van Hoytema Edited by Jennifer Lame Music by Ludwig Göransson Written & Directed by Christopher Nolan Produced by Emma Thomas, Christopher Nolan Distributed by Universal Pictures Christopher Nolan is one of the most celebrated filmmakers in International Cinema. He won Oscar with Oppenheimer and now, he decided to reimagine greek mythological adventure Homer's Odyssey poem about Odysseus journey back to his home after a ten year gruelling Trojan War which resulted in destruction of indestrutible Troy. Let's discuss about the movie in detail.  Plot: Odysseus (Matt Damon), the King of Ithaca, has helped Greek King, Agamemnon (Benny Safdie) to win Trojan War and destroy Troy. But he did not return to his home for 20 years, since the war started and 10 years since war ended. His son Telemachus (Tom Holland) and wife Penelope (Anne Hathaway) are looking fend off her suitors, led by Antinous (Robert Pattinson), who want to marry the Queen and become new King. He is travelling on the ocean and no one knows where he is lost. Can he comeback home? What does he encounter on his journey? Watch the film to know more.  Analysis:  Christopher Nolan has yet again decided to re-invent how a cinematic spectacle is designed by taking the most extraordinary adventure tale of a single man at ocean. He doesn't want audiences to be blown away by war visuals but he provides the same spectacle in a different manner. He wants to give a humanitarian eye to this big war and following resilient journey. None of the spectacular incidents are stated as they happen but are recounted as character's memory.  Giving another dimension and interpretation to everything that has been read and experienced by many over the years takes courage. Nolan doesn't shy away from shooting the film on IMAX 70 MM, yet, he tries to look into the depth of human emotions that such big events tend to overlook. What really motivates a resiliant journey? Why would anyone think about waging a war and how far they would go to attain victory and at what cost?  These questions are answered in a beautiful and elaborate manner without disrespecting Homer's original poem. Nolan doesn't try to question the magical beings existence and God's existence but tries to tell Odysseus story as an ode to God's testament. He tries to engulf the sorrowness in victory and loneliness in triumph as guilt of main character in a spectacular manner that rewards a keen eye.  While movie pacing is not exactly like big Hollywood blockbusters, Nolan doesn't shy away from spending time to establish all the nodes before diving into the real crux. As a director who started his films like Inception, The Dark Knight, The Dark Knight Rises, Dunkrik, Tenet with big action set pieces he showcases grand restraint in not diving straight into Trojan war. Because there is a different meaning to it all and it has to be experienced.  Matt Damon, Tom Holland, Anne Hathaway, Robert Pattinson all deliver their best. Damon is almost unrecognisable but he suits the moral compass and warrior role perfectly in this Nolan's interpretation. Technically, movie aces at using BGM and camera work in letting the magic and trauma feel real. Even the gigantic creatures are handled in a very realistic manner and horror that they represent. Production values are phenomenal and this is an unprecedented achivement technically.  Narrative wise the movie does demand a lot of attention and being a very old tale, the beats are known. It is the adaptation of Nolan that makes it fresh and different. Once again, Nolan delivered a fulfilling experience but for people who are only expecting spectacular visuals and scale, this might just end up being slow and dense narration.  Positives:  Performances Techncial Brilliance Production Values Gigantic Scale Negatives:  Action choreography looks too basic at places Slow Narration Very Nolan Style Screenplay Bottomline: A High Caliber Nolan special with an unconventional look into Epic.  Rating: 3/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ దక్షిణాదిలోనే అత్యంత ప్రతిభావంతుడైన నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు ఫహద్ ఫాజిల్. వైవిధ్యభరితమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఫహద్ ఫాజిల్, ప్రస్తుతం వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాలో భాన్వర్ సింగ్ షెకావత్ అనే నెగెటివ్ పాత్రలో ఆయన చూపించిన నటన పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ పుష్ప విలన్, తాజాగా ఒక భారీ హాలీవుడ్ ఆఫర్‌ను వదులుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్ చల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులకు ఎంతగానో పరిచయమున్న ఒక గొప్ప అంతర్జాతీయ దర్శకుడి సినిమాలో నటించే సువర్ణావకాశాన్ని ఫహద్ ఫాజిల్ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందనే దానిపై ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో విసృతంగా చర్చ నడుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత మరియు ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడైన అలెజాండ్రో జి. ఇనారిటు తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం 'డిగ్గర్' లో ఒక కీలకమైన పాత్ర కోసం ఫహద్ ఫాజిల్‌ను సంప్రదించినట్లు సమాచారం. హాలీవుడ్ లో సినిమా అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు, కానీ ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఫహద్ ఫాజిల్ మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే కాకుండా వివిధ భాషల్లో వరుస ప్రాజెక్టులతో ఫహద్ ఫాజిల్ షెడ్యూల్స్ అన్నీ పూర్తిగా నిండిపోయాయి. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాకు అవసరమైన లాజిస్టికల్ అవసరాలు మరియు డేట్స్ అడ్జస్ట్‌మెంట్స్ చేయడంలో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యాయి. డేట్స్ అస్సలు సరిపోకపోవడం వల్లే, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు ఆయన సైన్ చేయలేకపోయారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఎంతో ఇష్టమున్నా కూడా, డేట్స్ కుదరని ఏకైక కారణంతో ఈ అరుదైన గ్లోబల్ అవకాశాన్ని ఆయన అయిష్టంగానే వదులుకోవాల్సి వచ్చింది. ఫహద్ ఫాజిల్ ఈ హాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి అనూహ్యంగా తప్పుకోవడంతో, మేకర్స్ మరో నటుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. చివరకు ఆ కీలకమైన పాత్ర బ్రిటీష్-పాకిస్తానీ నటుడు మరియు ఆస్కార్ అవార్డు విజేత అయిన రిజ్ అహ్మద్ కు దక్కినట్లు తెలుస్తోంది. మన సౌత్ ఇండస్ట్రీలో తన అద్భుతమైన నటనతో మాయ చేస్తున్న ఫహద్ ఫాజిల్, ఒకవేళ ఈ హాలీవుడ్ ప్రాజెక్టును గనుక ఓకే చేసి ఉంటే గ్లోబల్ లెవెల్‌లో ఆయన క్రేజ్ మరియు మార్కెట్ రేంజ్ మరో స్థాయికి వెళ్లేదని సినిమా విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం ఫహద్ ఫాజిల్ లోని అసాధారణమైన యాక్టింగ్ టాలెంట్‌ను గుర్తించి, పిలిచి మరీ ఆఫర్లు ఇస్తుండటం ఆయన ప్రతిభకు దక్కిన గౌరవంగా అభిమానులు గర్వంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అద్భుతమైన హాలీవుడ్ ఆఫర్ మిస్ అయినా, భవిష్యత్తులో ఫహద్ ఫాజిల్ ని అంతర్జాతీయ వేదికలపై మరియు హాలీవుడ్ సినిమాల్లో చూసే అవకాశం ఖచ్చితంగా ఉందని నెటిజన్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Cast: Thiruveer, Aishwarya Rajesh, Jhansi, Srinivas Gavireddy, Muralidhar Goud Crew: Music Director: Bharat Manchiraju Cinematography: Khushendar Reddy Editing: Sri Vara Writer-Director: Bharat Darshan Producer: Mahesh Reddy Mooli Oh Sukumari Movie starring Thiruveer and Aishwarya Rajesh released today in theatres. Jhansi, Srinivas Gavireddy, and Muralidhar Goud are playing prominent roles. Let's discuss about the film in detail. Plot: Damini (Aishwarya Rajesh) is a lively young woman with a bizarre condition since birth—anyone who touches her gets a lethal electric shock. Fearing her, the villagers want to either banish her or marry her off. Meanwhile, Yadagiri (Thiruveer), an aspiring politician looking to get married urgently, falls in love with her at first sight. Will Yadagiri marry her despite the danger? How did Damini get this condition, and is there a cure? Watch the movie to know more. Analysis: Though the core concept of a girl giving electric shocks is interesting, the screenplay feels very outdated. The movie starts with a curious opening scene but quickly turns into a routine drama. The conflict of the villagers wanting to banish Damini lacks logic, and the interval twist is highly predictable. Thiruveer perfectly suits his role as Yadagiri and gives a solid performance throughout. Aishwarya Rajesh shines naturally, pulling off emotional and entertaining scenes with great ease. The comedy track between Thiruveer and his uncle offers some relief. However, the weak writing often overshadows their earnest acting efforts. The second half is derailed with illogical and unnecessary scenes, making the first half look much better in comparison. The story fails to move forward smoothly, and the pre-climax portions test the viewer's patience. Furthermore, the climax and the reasoning behind Damini's condition completely fail to convince the audience. On the technical front, the movie is largely underwhelming. The songs composed by Bharat Manchiraju are not catchy, and the background score fails to elevate the mood of the scenes. Khushendar Reddy's cinematography is basic, though the overall production values from Ganga Entertainments remain decent. Positives: Unique core concept Aishwarya Rajesh's performance Thiruveer's performance Negatives: Outdated screenplay Poor direction Weak second half Bottomline: An unimpressive screenplay ruins a unique concept Rating: 2/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల విడుదల చేసిన 'తబాహి' వీడియో సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ముఖ్యంగా హీరో యష్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ రొమాంటిక్ నంబర్‌లో పీక్స్‌కు చేరింది.  అయితే, ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే ఒక వర్గం నెటిజన్లు కియారా అద్వానీని లక్ష్యంగా చేసుకుని విపరీతమైన ట్రోలింగ్ మొదలుపెట్టారు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా కియారా ఇలాంటి హాట్ అండ్ బోల్డ్ సీన్స్‌లో నటించడం ఏంటంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితాన్ని లాగుతూ హద్దులు దాటి ట్రోల్స్ చేస్తున్నారు. ఈ వివక్షతతో కూడిన ట్రోలింగ్‌పై 'టాక్సిక్' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ సోషల్ మీడియా వేదికగా చాలా గట్టిగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ.. సమాజంలో ఇంకా బలంగా పాతుకుపోయిన డబుల్ స్టాండర్డ్స్ ను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. "సోషల్ మీడియాలో ఒకే పాటకు రెండు రకాల స్పందనలు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. సాంగ్ చూసిన వారంతా యష్ బాడీ లాంగ్వేజ్‌ను, ఆయన లుక్స్‌ను పొగుడుతూ ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు. అదే సమయంలో కియారా విషయానికి వస్తే మాత్రం ఆమెను ఒక జోక్‌లా మార్చేశారు. ఆమెకు పెళ్లయింది కదా, ఆమె ఒక తల్లి కదా, ఇలాంటి సీన్లు చేయడమేంటి? అంటూ విమర్శిస్తున్నారు. సీరియస్లీ.. నాకు ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తోంది" అంటూ బెనెడిక్ట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా, హీరో యష్ కూడా వివాహితుడేనని, ఆయనకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారనే విషయాన్ని బెనెడిక్ట్ గుర్తు చేశారు. "మరి యష్ కూడా వివాహితుడే కదా, ఆయనకు పిల్లలు ఉన్నారు కదా.. మరి కేవలం స్త్రీ అయినందుకే కియారాపై ఎందుకు ఇంత నెగెటివిటీ చూపిస్తున్నారు? అదే పురుషుడైతే చప్పట్లు కొడుతూ ప్రశంసిస్తారా? ఇది ఎంతవరకు న్యాయం?" అని ప్రశ్నించారు.  నటీనటులు కేవలం తమకు ఇచ్చిన పాత్రల పరిధి మేరకు మాత్రమే నటిస్తారని, తెరపై వారు నిజంగా ప్రేమించుకుంటున్నట్లు భ్రమ కల్పించడమే వారి వృత్తి అని ఆయన స్పష్టం చేశారు. కియారా ప్రొఫెషనలిజంలో ఎలాంటి తప్పు లేదని, కేవలం ఆమె ఒకరి భార్య, తల్లి అయినంత మాత్రాన నటనను ఆపేయాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందని బెనెడిక్ట్ తేల్చి చెప్పారు. ఈ వివాదం నటీనటుల కంటే సమాజంలో ఉన్న కుంచిత మనస్తత్వాన్ని ఎత్తిచూపుతోందని ఆయన రాసుకొచ్చారు. ఈ బ్రిటిష్ నటుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.      Toxic Movie, Tabaahi song controversy, Yash, Kiara Advani, Benedict Garrett  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం.   గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది.   కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల  గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.  ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి,  గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు.  ఈ మొక్కలు  గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా  పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి.  చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక  మొక్క పీస్ లిల్లీ..  ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి.  కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే  డిటర్జెంట్లు, పెయింట్లు,  గమ్ లలో  ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి  గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని,  ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో  పెంచుకుంటే ఇంటి వాతావరణం,  ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది.                                   *రూపశ్రీ.  
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ వంటింట్లో నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయా?  ఇవి ఎంతవరకు సేఫ్ మీకు తెలుసా? ఉల్లిపాయ ఆహారంలో ఎక్కువగా వినియోగించే కూరగాయ.  ఏ కూరలు చేసినా అందులో ఉల్లిపాయ వేస్తే వచ్చే రుచి, సువాసన వేరు.  చాలామంది పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడతారు.  అయితే గత కొంత కాలంగా ఉల్లిపాయల మీద నల్లటి మచ్చలు,  దుమ్ము లాంటి బూజు కనిపించడం చాలా మంది గమనించే ఉంటారు.  మార్కెట్ నుండి ఉల్లిపాయలు తెచ్చాక వాటిని నీటిలో కడిగి వండేస్తుంటారు. అయితే ఇలాంటి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?  దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?  వివరంగా తెలుసుకుంటే.. ఉల్లిపాయపై నలుపు రంగు..  ఉల్లిపాయ తొక్కలపై ఉండే నల్లటి మచ్చలు మట్టిలో కనిపించే ఒక సాధారణ శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలపై కనిపించే ఈ శిలీంధ్రం సాధారణంగా అంటువ్యాధి కాదు, అయినప్పటికీ, ఉపయోగించే ముందు వాటిని బాగా కడగడం ముఖ్యం. చాలా మంది బాగా ఆరోగ్యంగా ఉండేవారికి ఉల్లిపాయ మీద ఉండే ఈ  బూజు వల్ల ప్రమాదం ఉండదు. అయితే, బూజు ఉల్లిపాయ లోపలి పొరలకు వ్యాపించినా, ఉల్లిపాయ మెత్తబడినా, లేదా కుళ్ళు స్పష్టంగా కనిపించినా, దానిని తినడం మంచిది కాదు. ఈ బూజు  కేవలం ఉల్లిపాయ పైననే కాకుండా   కొన్నిసార్లు దాని సన్నని వేర్లు కంటికి కనిపించని విధంగా లోపలికి కూడా వ్యాపిస్తాయి. ఆరోగ్యానికి మంచిదేనా? బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ బూజు పెద్దగా ఆరోగ్యానికి హాని చేయదు. దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదు.   అయితే  కొంతమందిలో బూజు స్పోర్‌లు తుమ్ములు, ఆయాసం లేదా కంటి మంట వంటి అలెర్జీ రియాక్షన్ లకు కారణం కావచ్చు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఎండిన పొరపై కొద్దిగా నల్లటి పొడి మాత్రమే ఉండి, లోపల ఉల్లిపాయ పూర్తిగా గట్టిగా, శుభ్రంగా ఉంటే, బయటి పొరను తీసివేసి, బాగా కడిగిన తర్వాత దానిని ఉపయోగించవచ్చు. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? ఉల్లిపాయలపై నల్ల మచ్చలను కలిగించే శిలీంధ్రం సాధారణంగా హానికరమైనది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదట. దీనిని ఎక్కువ కాలం పాటు, అధిక పరిమాణంలో తీసుకుంటే, అది మూత్రపిండాలు , కాలేయానికి నష్టం కలిగించగలదట. ఈ విషపదార్థం  వేడికి కూడా నశించదుని కాబట్టి వండటం వల్ల ఇది తప్పనిసరిగా తొలగిపోదని అంటున్నారు. అందుకే దీనిని ఆహారంలో ఉపయోగించే ముందు సరిగ్గా చూసుకోవడం  చాలా ముఖ్యం.                                     *రూపశ్రీ.