TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వీఆర్ కు గుడివాడ ఎస్ఐ సత్యనారాయణ .. కారణమేంటంటే.!

Published on: Thu Aug 13, 2026 3:03PM

గుడివాడ వన్ టౌన్  ఎస్ఐ వై.వి.వి. సత్యనారాయణను  వేకెన్సీ రిజర్వ్ కు పంపుతూ జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు తెరలేపాయి. వైవీవీ సత్యనారాయణ అకస్మిక బదలీ, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ లో ఉంచడానికి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానితో ఆయన సంబంధాలే కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అసలింతకీ జరిగిందేంటంటే.. మెగా డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ  వైసీపీ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో  నిరసన ర్యాలీ యత్నాన్ని పోలీసులు అనుమతులు లేవంటూ అడ్డుకున్నారు.

ఈ విషయంపై ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ, కొడాలి నాని మధ్య వాగ్వాదం జరిగింది. 

ఈ ఘటన తర్వాత ఎస్ఐ వైవీవీ సత్యనారాయణను గుడివాడ నుంచి బదలీ చేసి వీఆర్ లో ఉంచారు. ఇక్కడే వైవీవీ సత్యనారాయణ బదలీకి ఆయనపై బదలీ వేటుకు కారణమేంటన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.  కొడాలి నానితో  సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలతో బదలీ అయ్యారా? లేక కొడాలి నాని ర్యాలీ యత్నాన్ని అడ్డుకునే సమయంలో ఆయనతో దురుసుగా వ్యవహరించారన్న కారణంతో వీఆర్ కు పంపించారా అన్న రెండు భిన్నమైన ప్రశ్రలు ఈ చర్చల్లో ప్రముఖంగా ఉన్నాయి. 

ప్రతిపక్ష నేతతో సదరు అధికారి అత్యంత చనువుగా మెలిగారనే కారణంతోనే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఆ కథనాలకు బలం చేకూరుస్తూ.. ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ కొడాలి నానితో ఎస్ఐ నవ్వుతూ సంభాషిస్తున్నట్లు ఉన్న ఒక ఫొటో  సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యింది. ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ   విధి నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించలేదనే ఆరోపణలు రావడంతోనే శాఖాపరమైన చర్యలు పడ్డాయని పోలీసు వర్గాలూ చెబుతున్నాయి. 

అదే సమయంలో మరో కోణంలో కూడా ఈ బదలీపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.  మాజీ మంత్రి కొడాలి నాని పట్ల   ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ దురుసుగా వ్యవమరించిన కారణంానే బదలీ వేటు పడిందంటున్నారు.  ఈ కోణంలో వ్యాఖ్యలు చేస్తున్న వారు కూడా..  ఎస్ఐ వైవీవీ సత్యనారాయణ.  కొడాలి నానితో ఆగ్రహంగా మాట్లాడుతున్నట్లుగా కనిపించే ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  

ఇలా ఎస్పై వైవీవీ సత్యనారాయణ బదలీ రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా ప్రతిపక్ష నాయకులపై దురుసుగా ప్రవర్తించారనే కారణంతో ఏకపక్షంగా ఒక పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవడం చాలాచాలా అరుదు.  అందుకే కొడాలి నానితో సదరు అధికారి సాన్నిహిత్యంగా ఉండటమే బదిలీకి ప్రధాన కారణమై ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Gudivada SI sent to VR,  Kodali Nani, YVV Satyanarayana transferred,  GudivadaYCP rally, Krishna district police transfers