Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రేమకు, అనుబందానికి మధ్య తేడా ఏమిటి.!
posted on: Aug 13, 2026 5:21PM

నేటికాలంలో ప్రేమ, ఆకర్షణ మధ్య తేడాను తెలుసుకోలేని వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఆకర్షణను ప్రేమగా పొరబడేవారు.. హద్దులు దాటి ముందుకు వెళ్లేవారు కోకొల్లలు ఉన్నారు. అయితే.. నిజమైన ప్రేమకు, ఆకర్షణకు మధ్య గల తేడా గురించి మాత్రమే కాకుండా.. ప్రేమకు అనుబంధానికి మధ్య తేడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వివరంగా తెలుసుకుంటే..
నిజమైన ప్రేమ, ఆకర్షణ..అనుబంధం..
ఒకరితో కలిసి ఉంటే సంతోషంగా ఉండటం ప్రేమ కావచ్చు, కానీ వారు లేకుండా అశాంతిగా ఉండటం ఎల్లప్పుడూ ప్రేమ కాదని అంటున్నారు. చాలాసార్లు బంధాలలో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకుంటున్నారనే ఫీలింగ్ ఎంత డీప్ గా ఉంటుందంటే.. ప్రేమలో ఉన్నామో లేక ఎదుటి వ్యక్తి పట్ల ఆకర్షితులవుతున్నారో, లేదా లోతుగా అనుబంధంలో ఉన్నారో కూడా తెలియనంతగా ఉంటుంది. ప్రేమ మనసును విశాలం చేస్తుంది, అయితే అనుబంధం నెమ్మదిగా మనసును బంధిస్తుంది.
ప్రేమలో స్వేచ్ఛ, అనుబంధంలో సొంతమనే బావన ఉంటుంది..
నిజమైన ప్రేమ వ్యక్తిని తన కోరికలకు అనుగుణంగా మార్చడానికి ప్రయత్నించదు. అది ఎదుటి వ్యక్తి యొక్క ఇష్టాయిష్టాలను, భావాలను , స్వేచ్ఛను గౌరవిస్తుంది. దీనికి విరుద్ధంగా అనుబంధం ఎక్కువగా ఉంటే మాత్రమే ఉంటే ఎదుటి వ్యక్తి ఎల్లప్పుడూ తన కోరికల ప్రకారమే ప్రవర్తించాలనే వాంఛను బలపరుస్తుంది. ఇది స్వార్థం కూడా కావచ్చు.
నమ్మకం ఉన్నచోట.. భయం ఉండదు..
సంబంధంలో నిజమైన ప్రేమ ఉంటే, దూరం ఉన్నా లేదా ఎంత బిజీగా ఉన్నా నమ్మకం నిలిచి ఉంటుంది. అయితే, అనుబంధం ఎక్కువగా ఉంటే.. కాలంతో పాటు అవతలి వ్యక్తి తమను విడిచిపెడతారేమోనని పదేపదే ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆలస్యంగా చేసే ఫోన్ కాల్స్, అరుదుగా , లేదా ఒంటరిగా సమయం గడపడం వంటివి కూడా ఆందోళనకు కారణం కావచ్చు. అందుకే మనసు స్థిరంగా ఉండాలి.
ప్రేమలో సాన్నిహిత్యం ఉంటే.. అనుబంధం కోల్పోతామేమో అనే భావన ఉంటుంది..
ఒకరిని మన సొంతవారిగా భావించడం సహజం. ఆ సొంతమనే భావనే భయంగా మారినప్పుడు సమస్య మొదలవుతుంది. ఆ వ్యక్తి లేకుండా మన జీవితం అసంపూర్ణంగా ఉందని, మన సంతోషం పోతుందని, లేదా మనల్ని మనం చూసుకోలేమని అనిపించడం మొదలైనప్పుడు, ఈ భావన ప్రేమను దాటి అనుబంధంగా డెవలప్ చెందుతుంది.
అంచనాలు ఉంటే బంధం బలహీనమవుతుంది..
బంధంలో అంచనాలు ఉన్నప్పుడు ఆ బంధం బలహీనంగా మారుతుందట. అంచనాలు ఉన్నప్పుడు ఆ అంచనాలను చేరుకోలేక పోవడం వల్ల డిజప్పాయింట్ కావడం జరుగుతుంది. ఇది బంధంలో ఉన్న మనిషి మీద కూడా అభిప్రాయం మారేలా చేస్తుంది. గొడవలు, వాగ్వాదాలకు కూడా కారణం అయ్యే అవకాశం ఉంటుంది.
ప్రేమ కోసం తమను తాము కోల్పోతే..
చాలామంది ప్రేమ కోసం తమను తాము కోల్పోతారు. ఇలా చేయడం వల్ల ప్రేమించిన వ్యక్తి మీద ఆధారపడినట్టు అవుతుంది. ఆ వ్యక్తి ఏదైనా అన్నా లేదా దూరమైనా.. ఆ సమయంలో జీవితం మొత్తం శూన్యమైనట్టు అనిపిస్తుంది. అంతే కాదు.. చూసుకోవడానికి తమకంటూ ఏమీ మిగలకుండా అయినట్టు అనిపిస్తుంది.
*రూపశ్రీ.






