LATEST NEWS
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ అభ్యర్థుల తొలి జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి  ప్రకటించారు. ఈ జాబితాలో అనుభవజ్ఞులైన నేతలకు, ముఖ్యంగా మాజీ మంత్రులకు పార్టీ పెద్దపీట వేయడం గమనార్హం. ఈ తొలి జాబితాలో పార్టీ అగ్రనేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత గడ్డ అయిన 'ఎడప్పాడి' నియోజకవర్గం నుంచే మళ్ళీ పోటీ చేయనున్నారు. ప్రకటించిన 23 మంది అభ్యర్థులలో ఏకంగా 21 మంది మాజీ మంత్రులు ఉండటం విశేషం. తమకున్న అనుభవం, నియోజకవర్గాలపై పట్టును దృష్టిలో ఉంచుకుని పాత వారికే ఈపీఎస్ మొగ్గు చూపారు. డీ జయకుమార్ రాయపురం నుండి, సీవీ షణ్ముగం మైలం నుండి, ఎస్పీ వేలుమణి తొండముత్తూరు నుండి బరిలోకి దిగుతున్నారు. ముఖ్య నేతల విషయానికి వస్తే.. కేపీ మునుసామి వేపనహళ్లి నుంచి, దిండిగల్ శ్రీనివాసన్ దిండిగల్ నుంచి, నథమ్ విశ్వనాథన్ నథమ్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే మాజీ మంత్రులు సెల్లూరు రాజు (మదురై వెస్ట్), సి. విజయభాస్కర్ (విరాలిమలై), ఓఎస్ మణియన్ (వేదారణ్యం) తమ పాత నియోజకవర్గాల నుంచే అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మెజారిటీ నేతలు తమ పాత స్థానాల్లోనే కొనసాగుతుండగా, ముగ్గురు మాజీ మంత్రుల నియోజకవర్గాలను మాత్రం పార్టీ మార్చింది. కూటమి లెక్కల ప్రకారం అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయేలో సీట్ల సర్దుబాటు ఇప్పటికే పూర్తయింది. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే సింహభాగం స్థానాల్లో అంటే సుమారు 178 సీట్లలో పోటీ చేస్తుండగా, మిత్రపక్షాలైన బీజేపీకి 27, పీఎంకేకు 18, ఏఎమ్ఎంకేకు 11 స్థానాలను కేటాయించారు. డీఎంకే కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు పళనిస్వామి ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు వ్యాప్తంగా ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ మార్చి 30 నుంచి ప్రారంభం కానుండటంతో, మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థుల ఎంపికను పార్టీ వేగవంతం చేసింది. మరో రెండు రోజుల్లో రెండో జాబితా వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ మంత్రులపై భారం వేసిన అన్నాడీఎంకే, ఈసారి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉంది.మే 4వ తేదీన వెలువడే ఫలితాలు తమిళనాడులో ఎవరికి పట్టం కడతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులందరూ తమ తమ నియోజకవర్గాల్లో ప్రచార పర్వాన్ని అప్పుడే మొదలుపెట్టేశారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. శనివారం (మార్చి 28) రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ముద్ర వేయించుకోవడానికి అవసరమైన కీలక తీర్మానాన్ని ఈ సమావేశం  ఆమోదించనుంది. గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి, రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించడమే లక్ష్యం ఈ ప్రత్యేక సమావేశం జరుగుతోంది. రాజధాని విషయంలో గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే..  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతికి తిరుగులేని చట్టపరమైన రక్షణ ఉండాలని భావిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో జరిపిన సంప్రదింపుల అనంతరం..  గతంలో ఉన్న సీఆర్డీయే  2014 చట్టానికి సంబంధించిన తీర్మానంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తోంది. ఈ సాంకేతిక ప్రక్రియ పూర్తి చేస్తేనే పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత లభిస్తుంది. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ద్వారా భవిష్యత్తులో మరే ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చడానికి వీలులేకుండా గట్టి పునాది వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.  ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం   ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి  వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తోంది. అయితే రాజధాని వంటి కీలక అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు సభకు రాకపోతే.. రాజకీయంగా ఆ పార్టీకి తీరని నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా  కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే అవకాశాలున్నాయంటున్నారు.  మూడు రాజధానుల వైఖరిని ప్రజలు గత ఎన్నికల్లో నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.    గత ఏడాది కాలంగా వైసీపీ నేతలు అమరావతి రాజధాని విషయంలో ఊగిసలాట ధోరణిని ప్రదర్శిస్తున్నారు. శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఒక సందర్భంలో రాజధాని విధానంపై పునరాలోచన చేస్తామని ప్రకటించినా, అధినేత జగన్ నుండి మాత్రం ఆ దిశగా స్పష్టమైన ప్రకటన రాలేదు. ఈ పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కోసం జరుగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని వైసీపీ బహిష్కరిస్తే..   అమరావతిపై వైసీపీ వైఖరిలో మార్పు లేదనీ, రాజధానిగా అమరావతిని ఆ పార్టీ అంగీకరించడం లేదనీ సందేహాలకు అతీతంగా తేలిపోతుంది. అదే జరిగితే.. రాష్ట్రంలో ఆ పార్టీకి రాజకీయంగా తేరుకోలేని నష్టం జరగడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.    అమరావతికి సంబంధించి కీలక తీర్మానం చేయడం కోసం జరుగుతున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి  వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వస్తారా? రారా అన్నది స్పష్టత లేదు. గతంలో అంటే జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో  అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా విస్పష్టంగా చెప్పి అమరావతికి మద్దతు పలికిన జగన్ ఆ తరువాత అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో  అమరావతిని నిర్వీర్యం చేశారు.  ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా ?   ఒకవేళ మద్దతు ఇస్తే ఐదేళ్ల తమ పాలనలో తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుంది. ఇక మద్దతు ఇవ్వకుంటే.. జగన్ అమరావతికి వ్యతిరేకి అన్న ముద్ర పడుతుంది. అందుకే జగన్ డుమ్మా కొట్టడానికే ఎక్కువ అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
  2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదేళ్ల పాలన తర్వాత డీఎంకే కూటమి ప్రభుత్వంపై ఉండే సహజ వ్యతిరేకతకు తోడు, కొత్త పార్టీ రూపంలో విజయ్ విసురుతున్న సవాళ్లు సీఎం స్టాలిన్‌కు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే దీన్ని సొమ్ము చేసుకోవడంలో విపక్ష అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఏ మేరకు ముందుందన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ వైబ్ సంస్థ ఓట్ ట్రాకర్ పేరుతో నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో  సంచలన విషయాలను వెల్లడించింది. మీడియా ఛానల్ సీఎన్ఎన్-న్యూస్ 18కు విడుదల చేసిన ఓట్ వైబ్ ఒపీనియన్ పోల్‌లో ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో హోరాహోరీ ద్విముఖ పోరు తప్పదని తేల్చేసింది. డీఎంకే నేతృత్వంలోని అధికార కూటమి, విపక్ష అన్నాడీఎంకే కూటమి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ, మరియు సీపీఎంలతో కూడిన డీఎంకే కూటమి 113 నుండి 123 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న ప్రత్యర్థి అన్నాడీఎంకే కూటమి కూడా 106 నుంచి 116 సీట్ల వరకు గెలుచుకుంటుందని అంచనా వేశారు. విజయ్ కొత్త పార్టీ టీవీకే 2 నుంచి 8 సీట్ల మధ్య గెలుచుకుంటుందని అంచనా వేశారు.. అటు గత ఐదేళ్లలో డీఎంకే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయాలు మిశ్రమంగా ఉన్నాయి. దాదాపు 40% మంది ప్రభుత్వ పనితీరును మంచిది లేదా  చాలా మంచిది అని చెప్పారు. దాదాపు 39% మంది దానిని "పేలవమైనది" లేదా చాలా పేలవమైనది గా చెప్పారు. పురుషులతో పోలిస్తే మహిళలు డీఎంకే ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్నారు. 55 ఏళ్లు పైబడిన ఓటర్లు అత్యధిక స్థాయిలో ప్రభుత్వపై సంతృప్తి వ్యక్తం చేయగా, 18-24 ఏళ్ల వయస్సు గల యువ ఓటర్లు కాస్త కోపంగా ఉన్నారు. సామాజిక వర్గాలలో, ఎస్సీ/దళితులు ప్రభుత్వాన్ని అత్యంత అనుకూలంగా చూస్తున్నారు. అయితే అగ్రవర్ణ హిందువులు అత్యంత అసంతృప్తితో ఉన్నారు. మైనారిటీ వర్గాలు సగటు కంటే ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. సీఎంగా స్టాలిన్ కు 39.9 శాతం మద్దతివ్వగా, అన్నాడీఎంకే నేత పళనిస్వామి 37.5%తో ఆయన వెనుక ఉన్నారు. పురుషులు పళనిస్వామికి మొగ్గు చూపుతుండగా, మహిళలు స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నారు. ప్రతిపక్ష మహిళా ఓటర్లు ఏఐఏడీఎంకే, టీవీకేల మధ్య చీలిపోయారు. యువ ఓటర్లలో, ముఖ్యంగా 18-24 ఏళ్ల మధ్య వయస్సు వారిలో విజయ్‌కు గణనీయమైన మద్దతు లభిస్తోంది. వయోవృద్ధ ఓటర్లు ఎక్కువగా స్టాలిన్‌కు మద్దతుగా నిలవగా, మధ్య వయస్కులు పళనిస్వామి వైపు మొగ్గు చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. శనివారం(మార్చి 28) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా తీర్మానం అమోదించనుంది. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్  చింతకాయల అయ్యన్నపాత్రుడు  ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదనీ, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. ​కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని, అయితే పార్లమెంటులో బిల్లు పాస్ కావాల్సి ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా  నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందన్నారు. గవర్నర్ ఎ అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్‌లో  శనివారం (మార్చి 28) ఈ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. 
  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వి.కె. శశికళ మరియు పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. రాందాస్ అనూహ్యంగా చేతులు కలిపారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో ఈ ఇద్దరు నేతలు వ్యూహాత్మక పొత్తును ప్రకటించారు. శశికళ ఇటీవల స్థాపించిన 'ఆల్ ఇండియా పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కజగం' పార్టీతో కలిసి పీఎంకే (రాందాస్ వర్గం) ఎన్నికల బరిలోకి దిగనుంది. విల్లుపురం జిల్లాలోని రాందాస్ నివాసం తైలాపురం గార్డెన్స్‌లో ఈ కీలక భేటీ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు సాగిన చర్చల అనంతరం, 2026 ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులోని మొత్తం 234 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాల్లో ఒక 'ప్రకంపన' సృష్టిస్తుందని డాక్టర్ రాందాస్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం అన్నాడీఎంకేలో నెలకొన్న అంతర్గత విభేదాలే అని తెలుస్తోంది. ప్రస్తుతం అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన ఎడప్పాడి పళనిస్వామిపై పైచేయి సాధించేందుకు శశికళ సుదీర్ఘ కాలంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పీఎంకేలో చీలక ఏర్పడి, రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ అన్నాడీఎంకే-బీజేపీ కూటమిలో చేరడంతో.. రాందాస్ ఒంటరి అయ్యారు. ఈ నేపథ్యంలో, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆయన శశికళతో జతకట్టారు. ఈ కొత్త కూటమిని కేవలం రెండు పార్టీలకే పరిమితం చేయకుండా, మరిన్ని చిన్న పార్టీలను తమ వైపు తిప్పుకోవాలని చిన్నమ్మ భావిస్తున్నారు. ప్రజల సంక్షేమం మరియు తమిళనాడు స్వయంప్రతిపత్తిని కాపాడటమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు. అయితే, పీఎంకే గుర్తు మరియు జెండా విషయంలో కోర్టులో వివాదం నడుస్తున్నందున, రాందాస్ వర్గం ఏ గుర్తుపై పోటీ చేస్తుందనేది ఇంకా స్పష్టత రాలేదు. రాబోయే రోజుల్లో ఈ కూటమి సీట్ల సర్దుబాటు మరియు ఉమ్మడి ప్రచార ప్రణాళికను ప్రకటించనుంది. శశికళకు ఉన్న సామాజిక వర్గ మద్దతు, ఉత్తర తమిళనాడులో పీఎంకేకున్న బలం కలిస్తే ప్రధాన పార్టీల ఓట్ల బ్యాంకుకు గండి పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే ఓట్లను ఈ కూటమి ఎంతవరకు చీలుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  
ALSO ON TELUGUONE N E W S
వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ యంగ్ హీరో తిరువీర్(Thiruveer). 'మసూద', 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' వంటి చిత్రాలతో మెప్పించిన ఆయన, ఇప్పుడు 'పాపం ప్రతాప్'(Papam Prathap) అంటూ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎస్‌.పి.దుర్గా నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ విలేజ్ డ్రామా టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తిరువీర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డ్రైవర్ అనుకున్నాడు తాను ఎక్కువగా రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంపై తిరువీర్ తనదైన శైలిలో స్పందించాడు. తన దగ్గరకు వచ్చిన బెస్ట్ కథలు ఎంచుకొని చేస్తున్నానని, ప్లాన్ చేసి చేయట్లేదని తెలిపాడు. అలాగే తనని రియల్ గా హీరోలా చూడరు అంటూ తనకు ఎదురైన కొన్ని సంఘటనలను షేర్ చేసుకున్నాడు.  "మసూద సినిమా షూటింగ్ సమయంలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నన్ను చూసి కారు డ్రైవర్ అనుకున్నాడు. నేను హీరోని అని చెబితే.. హీరో అయితే పక్కన మనుషులు ఉండాలి, గొడుగు ఉండాలి కదా అని అమాయకంగా అడిగాడు" అంటూ నవ్వుతూనే ఆ ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు. ఇలా ఒక్కసారి కాదు.. ఈ సినిమాలో హీరో ఎవరని నన్నే అడిగిన సందర్భాలు పలు ఉన్నాయని తిరువీర్ తెలిపాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌ అని చెప్పా "అలాగే ఇటీవల ఫ్లయిట్ లో విజయవాడ వెళ్తూ.. ఫోన్ లో నేను మూవీ డేట్స్ గురించి మాట్లాడటంతో.. పక్కన కూర్చున్న వ్యక్తి సినిమా ఇండస్ట్రీయా అని అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదని అర్థమై.. యాక్టర్ అని చెప్పకుండా.. ఓజీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌ని అని అబద్ధం చెప్పాను" అంటూ మరో ఇన్సిడెంట్ ని షేర్ చేసుకున్నాడు తిరువీర్.  టీజర్ అదిరింది.. కథేంటంటే? తాజాగా విడుదలైన ‘పాపం ప్రతాప్’ టీజర్ చూస్తుంటే ఇది ఒక పక్కా విలేజ్ రొమాంటిక్ కామెడీ అని అర్థమవుతోంది. చిన్ననాటి నుంచి ప్రేమించిన అమ్మాయి బుజ్జమ్మను పెళ్లి చేసుకున్న ప్రతాప్ అనే అమాయకపు యువకుడి కథ ఇది. పెళ్లైన మూడు రోజులకే బుజ్జమ్మ పంచాయతీ పెట్టడం, ఊరంతా ప్రతాప్‌ను ఒక వింత చూపుతో చూడటం టీజర్‌లో భలే సరదాగా చూపించారు. అసలు ప్రతాప్ చేసిన తప్పేంటి? ఆ ఊరి జనం అతడిని ఎందుకు 'పాపం ప్రతాప్' అంటున్నారు? అన్నది తెలియాలంటే ఏప్రిల్ 17 వరకు ఆగాల్సిందే.  
వచ్చే సంక్రాంతికి బావ బావమరుదుల రచ్చ వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ స్టోరీ ఇదేనా? అనిల్ రావిపూడి ఏం ప్లాన్ చేశాడు? విక్టరీ వెంకటేష్(Venkatesh), డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారెంటీ ఎంటర్‌టైన్‌మెంట్. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన 'F2', 'F3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ వద్ద నవ్వుల పువ్వులు పూయించాయి. ముఖ్యంగా 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా భారీ వసూళ్లతో సంచలన విజయం సాధించింది.  ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) కూడా నటిస్తుండటం విశేషం. దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్, అలాగే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన వెంకటేష్.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించడం ద్వారా ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వాలని అనిల్ రావిపూడి చూస్తున్నాడు.  వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావ బావమరుదులుగా కనిపిస్తారని, వారి మధ్య వచ్చే ఫన్ సీన్స్ సినిమాకే హైలైట్ అని టాక్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి కేవలం నవ్వించడమే కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా జోడిస్తున్నారట. బావ బావమరుదుల మధ్య ఉండే బంధం, అనుబంధాల చుట్టూ కథ తిరుగుతుందని అంటున్నారు. పాత తరం సినిమాల్లో ఉండే స్వచ్ఛమైన వినోదాన్ని మళ్ళీ గుర్తు చేసేలా ఈ సినిమా ఉంటుందట. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాస్టింగ్ విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్‌ను, అలాగే కళ్యాణ్ రామ్ జోడీగా 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కళ్యాణ్ రామ్ సరసన కయదు లోహర్ పేరు కూడా వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ మల్టీస్టారర్ 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆంధ్రప్రదేశ్‌లో భూ రిజిస్ట్రేషన్ విధానంలో వచ్చిన మార్పులపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రముఖ హీరో గోపీచంద్(Gopichand) కనిపించడం విశేషం. చంద్రబాబు సర్కార్ ఏపీలో భూ రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. తాజా టెక్నాలజీ వినియోగంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతంగా మారిందని తెలుస్తోంది. స్లాట్ బుకింగ్ విధానంలో కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతోందని అంటున్నారు.  భూ రిజిస్ట్రేషన్ కి సంబంధించి హీరో గోపీచంద్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా, అతికొద్ది సమయంలోనే పని పూర్తి కావడంతో ఆయన ఆశ్చర్యపోయారట. భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విప్లవాత్మక మార్పులపై గోపీచంద్ ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగుందని గోపీచంద్ కొనియాడారట. గోపీచంద్ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. https://x.com/bobbysairam/status/2036759835740610561
    -ఓటిటిలో టాప్ ట్రెండింగ్ లో ఉన్న మూవీ -మహిళా సాదరికతపై ప్రశ్నలు  -భార్య అయినా శృంగారం అనేది ఇష్టం ఉండాల్సిందే  -ఇంతకీ ఆ సిరీస్ ఏంటి    సినీయుగంలో ఓటిటి యుగం కూడా వాటా దక్కించుకున్న ఈ రోజుల్లో డిఫరెంట్ జోనర్స్ తో కూడిన పలు ఓటిటి చిత్రాలు ప్రేక్షకులకి సరికొత్త మజాని ఇవ్వడంలో ఏ మాత్రం వెనుకంజ వెయ్యడం లేదు. థియేటర్ చిత్రాలతో పోటీపడి సై అంటే సై అంటున్నాయి. ఆ కోవలోనే వచ్చిన తాజా చిత్రం 'చిరాయ'. ఈ నెల 20 నుంచి జియో హాట్ స్టార్(Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతుంది. స్ట్రీమింగ్ అవుతుండటమే కాదు రికార్డు వ్యూస్ తో దూసుకుపోతూ ఎన్నో చర్చలని లేవనెత్తుతూ ట్రెండింగ్ లో ఉంది. మరి పూర్తి మ్యాటర్ చూద్దాం. వివాహం తర్వాత మహిళపై జరుగుతున్న వైవాహిక అత్యాచారం అనే కాన్సెప్ట్ అధారంగా చిరాయ తెరకెక్కింది. శృంగారం విషయంలో భార్య సమ్మతి కూడా ముఖ్యమనే విషయాన్నీ కూడా ఎలాంటి బెరుకు లేకుండా చెప్పడంతో పాటు విషపూరితమైన  పురుషాహంకారాన్ని తెలియచేసింది. కథగా చూసుకుంటే 'కమ్లేష్' అనే మహిళ ఒక  ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు. తన మరిది చాలా మంచివాడని నమ్మి పూజా అనే అమ్మాయితో వివాహం జరిపిస్తుంది. కానీ పెళ్లి తర్వాత అరుణ్ అసలు రూపం బయటపడుతుంది. పూజాని మానసికంగా హింసిస్తుండటమే కాకుండా పూజకి ఇష్టం లేకపోయినా శారీరకంగా అనుభవించాలనుకునే పెద్ద సైకో. మరి భర్త వేధింపుల నుంచి ఎలా బయటపడిందనేదే చిరాయ.  also read: Dhurandhar 2: హంజాతో అలజడులు సృష్టించాలనుకుంటున్నారా! వార్నింగ్ ఇస్తున్న ఆదిత్య ధర్    మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉండగా ప్రతి ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగుతుంది. తెలుగు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో సహా మొత్తం పదకొండు  భాషల్లో అందుబాటులో ఉంది. మరి గృహ హింస, వైవాహిక అత్యాచారాల తీవ్రతని కళ్లకు కట్టినట్లు చూపించిన చిరాయని ఇప్పుడే చూడండి. ప్రసన్న బిష్త్, సిద్ధార్థ్ షా ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా శశాంత్ షా(Shashant Shah) దర్శకుడు.    
The Telugu film industry is beaming with pride as one of its most iconic figures, Nandamuri Balakrishna, adds another glittering jewel to his crown. The legendary actor has been conferred with the prestigious “Lifetime Achievement Award” at the International Film Festival Delhi (IFFD) 2026, recognizing his unparalleled contribution to Indian cinema. The news of the award has sparked a wave of joy across the Telugu film fraternity. Industry associations and fans alike have taken to social media to celebrate the achievement. The Honorary Secretaries of the Telugu Film Producers Council, T. Prasanna Kumar and Y. V. S. Chowdary, extended their heartfelt congratulations to the actor.  In a joint statement, they expressed their immense pride, noting, "We are delighted to announce that Nandamuri Balakrishna has been honored with the prestigious “Lifetime Achievement Award” at the International Film Festival Delhi 2026. The award was presented by the Hon’ble Chief Minister of Delhi, Rekha Gupta. This recognition marks yet another significant milestone in the illustrious journey of Shri Nandamuri Balakrishna Garu. His contribution to the Telugu film industry has been remarkable, and this honor stands as a moment of pride not only for him but for the entire Telugu cinema fraternity. On this special occasion, we extend our heartfelt congratulations to Shri Nandamuri Balakrishna Garu and wish him continued success, hoping he receives many more accolades in the years to come." https://x.com/tfpcin/status/2037115819789082770
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో ప్రేక్షకులను పలకరించారు. ఆయన తదుపరి సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా కమిటై ఉన్నారు. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముంది. మరోవైపు పవన్ 'ఓజీ-2' చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో ఊహించని విధంగా 'బ్రో-2' తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ నటించిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ 'బ్రో'. 2023లో సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ నే సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ ని బాగా అలరించింది. పవన్ ని చూపించిన తీరుకి, ఆయన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు 'బ్రో' సినిమాకి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా సముద్రఖని చెప్పడం విశేషం. సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'కార్మేని సెల్వం'(Carmeni Selvam). ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో 'బ్రో సీక్వెల్' గురించి సముద్రఖని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.  "బ్రో-2 స్టార్ట్ చేయబోతున్నారని న్యూస్ వినిపిస్తుంది" అని అడగగా.. "నేను కూడా వెయిట్ చేస్తున్నాను. స్క్రిప్ట్ రెడీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే టేకాఫ్" అని సముద్రఖని చెప్పుకొచ్చారు. సముద్రఖని కామెంట్స్ ని బట్టి చూస్తే.. బ్రో సీక్వెల్ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపుతున్నారని, ఆయన ఎప్పుడు ఓకే అంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని అర్థమవుతోంది. 'ఓజీ' సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి.. బ్రో సీక్వెల్ న్యూస్ బిగ్ సర్‌ప్రైజ్ అని చెప్పవచ్చు. https://x.com/Theteluguone/status/2037112071830356224
-ఎందుకు ధురంధర్ 2 పై ద్వేషం  -ఎవరు అలా చేస్తుంది -ఆదిత్య ధర్ వార్నింగ్ ఇచ్చే దాకా పరిస్థితి వచ్చిందా! ఇప్పుడు ఏ ఇద్దరు,ముగ్గురు కలిసినా ధురంధర్ 2(Dhurandhar 2)చూసావా లేదా అని ఒకరినొకరు అడిగే పరిస్థితి. చూడలేదంటే ఎక్కడ నామూషీగా ఉంటుందేమో అని వీలు చూసుకొని మరుసటి రోజు ఖచ్చితంగా చూస్తున్నారు. అందుకే రికార్డు కలెక్షన్స్ ధురంధర్  పాదాక్రాంతమవుతున్నాయి. ఇందుకు సాక్ష్యం ఫస్ట్ వీక్ కే సాధించిన 1000 కోట్ల రూపాయల గ్రాస్. ఈ విధంగా కనివిని ఎరుగని రికార్డులని సృష్టించే దిశగా ధురంధర్  బిజీగా ఉంటే కొంత మంది ధురంధర్ 2 ని బాడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వాళ్లందరికీ ఆదిత్య ధర్(Aditya Dhar)తనదైన స్టయిల్లో వార్నింగ్ ఇస్తున్నాడు. పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఉరఫ్ ఏఐ ని ఉపయోగించి కొంత మంది రణవీర్ సింగ్ క్యారక్టర్ హంజా తలకి సిక్కుల మాదిరిగా తలపాగా ధరించింపచేసి సిగరెట్ తాగుతునట్టుగా ఉంచి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో కొంత మంది సిక్కు సోదరులు హర్ట్  అవుతు కామెంట్స్ చేస్తున్నారు. విషయాన్నీ గమనించిన ఆదిత్య దర్ ఎక్స్ వేదికగా స్పందిస్తు హంజా తలపాగా ధరించిన పిక్ అబద్ధం. ఏఐ తో ఎవరో కావాలని క్రియేట్ చేసారు.అలజడులు సృష్టించాలనేది వాళ్ళ ప్లాన్. సిక్కుల పట్ల నాకెంతో గౌరవం ఉంది. వారిపై గౌరవంతోనే మూవీలో క్యారెక్టర్స్ ని డిజైన్ చేశాను. మళ్ళీ ఇలాంటి చర్యలకి పాల్పడితే కఠినమైన చర్యలని తీసుకుంటానని తన పోస్ట్ లో తెలిపాడు. Also read: Anil Ravipudi: జరుగుతుందా! అదే జరిగితే సినీ అదృష్టం పట్టినట్లే  ఆదిత్య ధర్ చెప్పినట్టుగానే సిక్కులపై గౌరవంతోనే సినిమా ప్రారంభంలో హంజా ఒరిజినల్ క్యారక్టర్ జస్కి రాత్ సింగ్ తుపాకీ చేతబూని కొంతమందిని అత్యంత జుగుప్సాకరంగా చంపుతాడు ఆ సమయంలో  జస్కి రాత్ చేత సిక్కు అనే సింబాలిక్ గా తలపాగా ధరింపచేయలేదు.  
రీసెంట్ గా ఫంకీతో సందడి చేసిన కయదు లోహర్  అనిల్ రావిపూడి మూవీ ఒకే అవుతుందా! సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్ ఏంటి రీసెంట్ గా మాస్ కా దాస్ 'విశ్వక్ సేన్'తో 'ఫంకీ'(Funky)లో కలిసి సందడి చేసింది 'కయదు లోహర్'(Kayadu LOhar). ఆకట్టుకొనే అందమే కాదు అంతే అందమైన పెర్ఫార్మ్ ని ప్రెజెంట్ చేయగల సత్తా తన సొంతం. ప్రదీప్ రంగనాధన్ తో చేసిన డ్రాగన్ ఒక ఉదాహరణ. కానీ కెరీర్ కి  సరైన బ్రేక్ మాత్రం రాలేదని చెప్పాలి. మరి ఇప్పుడు ఆ బ్రేక్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్ నే  ఉదాహరణ. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. అనిల్ రావిపూడి(Anil Ravipudi)మన శంకర వరప్రసాద్ గారుతో లోకల్ సినిమా పరంగా ఇండస్ట్రీ హిట్ అందుకున్నాక నెక్స్ట్ మూవీని వెంకటేష్,కళ్యాణ్ రామ్ తో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన కయదు చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే అధికార ప్రకటన రానుందని అంటున్నారు. మరి అదే నిజమైతే కయదు లోహర్ దశ తిరిగినట్లే. ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే కేవలం పేరు కాదు. ప్రేక్షకులు థియేటర్స్ కి తరలివచ్చేలా టాలీవుడ్ ని  లీజుకి తీసుకున్న నయా హిట్ బ్రాండ్. వయసుతో తారతమ్యం లేకుండా అనిల్ రావిపూడి సినిమాలకి తరలి వస్తున్న ప్రేక్షకులు, ఎక్స్ట్రా కుర్చీలే సాక్ష్యం.  Also read: Prabhas: ప్రభాస్ పై పవన్ హీరోయిన్ రాశి కీలక వ్యాఖ్యలు.. నేనైతే ఆ విధంగా చేయను పైగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సారి కూడా నెక్స్ట్ సంక్రాంతికి వస్తాడేమో అనే చర్చ కూడా ప్రతి ఇంట్లో జరుగుతుంది. అంతటి క్రేజ్ అనిల్ సొంతం. దీంతో  కయదు కనుక జాయిన్ అయితే తన అందమైన పెర్ఫార్మ్ తో ప్రేక్షకుల సినీ హార్ట్స్ లోకి చొరబడినట్లే. ఆ పరిస్థితే వస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో కయదు కంటే ప్రేక్షకులకే బాగా తెలుసు. కాబట్టి కయదు సినీ దశ తిరిగినట్లే. అనిల్ రావిపూడి కూడా ప్రెజెంట్ తన కొత్త చిత్రానికి సంబంధిచిన పనుల్లోనే బిజీగా ఉన్నాడు.  
SVSC మూవీపై రాజశేఖర్ కామెంట్స్  రేలంగి మావయ్య రోల్ చేయకపోవడానికి కారణం అదే! టాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అన్నదమ్ములుగా నటించిన వెంకటేష్, మహేష్ బాబు. అయితే ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర 'తండ్రి' క్యారెక్టర్. ప్రకాష్ రాజ్ పోషించిన ఆ రేలంగి మావయ్య పాత్ర సినిమాకే ఆత్మ వంటిది. నిజానికి ఆ అద్భుతమైన పాత్రను టాలీవుడ్ 'యాంగ్రీ మ్యాన్' రాజశేఖర్(Rajasekhar) చేయాల్సి ఉంది. ఆ ఛాన్స్ మిస్ అవ్వడంపై తాజాగా రాజశేఖర్ తనదైన శైలిలో స్పందించారు. రాజశేఖర్ కీలక పాత్ర పోషించిన 'బైకర్'(Biker) మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్.. రేలంగి మావయ్య పాత్ర చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నప్పుడు, తండ్రి పాత్ర కోసం మొదట రాజశేఖర్‌ను సంప్రదించారట. "మీ స్మైల్ బాగుంటుంది. ఇందులో ఎప్పుడూ నవ్వుతూ ఉండే పాత్ర ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది అని అడిగారు. కానీ, ఎందుకనో కుదరలేదు." అని రాజశేఖర్ చెప్పుకొచ్చారు. "ఆ సినిమా చూసినప్పుడు, మంచి పాత్రను వదులుకున్నానని ఏమైనా ఫీలయ్యారా" అని అడగగా.. అలాంటిదేం లేదని రాజశేఖర్ బదులిచ్చారు. నిజానికి రాజశేఖర్ తన కెరీర్ ఆరంభం నుండి పవర్‌ఫుల్ పాత్రలతో, యాక్షన్ సినిమాలతో మెప్పించారు. అలాంటి హీరో రేలంగి మావయ్య లాంటి పాత్రలో కనిపిస్తే కచ్చితంగా కొత్తగా ఉండేది. ప్రకాష్ రాజ్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారనడంలో సందేహం లేదు, కానీ రాజశేఖర్ ఆ పాత్ర చేసి ఉంటే సినిమాకు కొత్తదనం వచ్చేదని అభిమానులు భావిస్తున్నారు. తెలుగులో మల్టీస్టారర్ ట్రెండ్‌ను మళ్ళీ పునరుద్ధరించిన చిత్రంగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నిలిచిపోయింది. పెద్దోడు, చిన్నోడు మధ్య ఉండే అనుబంధం, ఆ ఇంట్లోని మధ్యతరగతి భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాలో రాజశేఖర్ భాగం అయ్యుంటే, నటుడిగా ఆయన కెరీర్ మరో మలుపు తిరిగేదేమో. ప్రస్తుతం రాజశేఖర్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. హీరోగా కాకుండా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే 'బైకర్' సినిమాలో శర్వానంద్ కి తండ్రిగా నటించారు.  
వదినలో అమ్మనో, అక్కనో చూసుకునే వారు ఎందరో ఉంటారు. అలాగే బావ గారిలో అన్నయ్యను చూసుకునే వారు కొందరు ఉంటారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సతీమణి అన్నా లెజ్నెవా కూడా తన బావ గారైన చిరంజీవి(Chiranjeevi)లో అన్నయ్యను చూసుకుంటున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఆమె చేసిన పోస్ట్ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. అన్నా లెజ్నెవా రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు స్వాగతం పలికారు. చిరంజీవి కూడా వెల్కమ్ చెప్పారు. అయితే దానికి ఆమె "థాంక్యూ అన్నయ్య" అని రిప్లై ఇవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. బావ గారిని అన్నయ్య అని పిలవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై అన్నా క్లారిటీ ఇచ్చారు.  "అన్నయ్యా? బావగారా?" అంటూ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ కట్టిపడేస్తోంది. "దాదాపు 15 ఏళ్ల క్రితం, అందరూ ఒకరికొకరు ఎంతో దగ్గరగా ఉన్న కుటుంబంలోకి నేను వచ్చాను. ఎలా కలవాలో, ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు. అందుకే నా భర్త వాడే మాటలనే నేనూ వాడాను. అవే అన్నయ్య, చిన్నన్నయ్య. మొదట్లో అవి నేను జాగ్రత్తగా, సందేహంతో పలికిన మాటలే. కానీ కాలక్రమంలో అవి నేను అనుభూతి చెందిన భావాలుగా మారాయి. నాకు అన్నయ్య లేరు. కానీ జీవితం నాకు ఇద్దరిని ఇచ్చింది.. చిరంజీవి & నాగబాబు" అంటూ అన్నా లెజ్నెవా పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ అన్నయ్యలను తన అన్నయ్యల్లా భావిస్తూ అన్నా లెజ్నెవా చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది కదా బాండింగ్ అంటే అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. https://www.instagram.com/p/DWVdJ75CWSg/
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
  ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు.. ఇలా సంతోషంగా ఉండటానికి చేయాల్సినవన్నీ చేస్తారు. కానీ ఇన్నిచేసినా సరే.. కొందరు సంతోషంగా ఉండరు.  ఇలా ఎందుకు జరుగుతుందనే విషయం చాలా మంది ఆలోచించరు.  కేవలం అసంతృప్తి దగ్గరే ఆగిపోతారు.  కానీ క్షుణ్ణంగా గమనిస్తే.. ఒక వ్యక్తి చుట్టూ ఎన్ని సౌకర్యాలు, ఎన్ని సంతోషపెట్టే విషయాలు ఉన్నా ఆ వ్యక్తి సంతోషంగా ఉండటం లేదంటే.. ఆ వ్యక్తి చుట్టూ ఉండే కొందరు వ్యక్తులే కారణం అయ్యే అవకాశం ఉంటుంది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే ఓర్వలేని వ్యక్తులు కొందరు ఉంటారు.  ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సంతోషాన్ని చెదపురుగుల్లా తినేస్తుంటారు.  పైశాచిక ఆనందాన్ని లోలోపలే అనుభవిస్తారు.  పక్కవాళ్ల సంతోషాన్ని నాశనం చేసే ఆ వ్యక్తులు ఎవరు?  వారి లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. ఎప్పుడూ ఏడుస్తూ కంప్లైంట్లు చేసే వ్యక్తులు.. జీవితంలో ఏ మంచినీ చూడని వాళ్ళు వీళ్ళు. వాతావరణం బాగుంటే, ఎండ వేడిమి గురించి ఫిర్యాదు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే, తమ బాస్‌ను విమర్శిస్తారు. వారి దృక్పథం ఎంత ప్రతికూలంగా ఉంటుందంటే, వారి పక్కన కూర్చోవడం కూడా  మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కవాళ్ల సానుకూల శక్తిని హరించివేస్తారు. వీరికి దూరంగా ఉండటమే ఉత్తమం. స్వప్రయోజనాలు చూసుకునేవారు.. స్నేహితులలో, బంధువులలో చాలామంది స్వార్థంగా ఉంటారు.  మాట్లాడి చాలా  రోజులు అయింది అంటూ మాటలు కలిపి తమ స్వప్రయోజనాల కోసం సహాయం అడుగుతుంటారు.  ఇలాంటి వారు ప్రతి ఒక్కరి సర్కిల్లో ఉంటారు.వీళ్ళు కేవలం తమకు సహాయం కావాలన్నా లేదా ఏదైనా పని చేయించుకోవాలన్నా మాత్రమే ఎదుటి వ్యక్తిని గుర్తు చేసుకుంటారు. పని పూర్తయిన వెంటనే మాయమైపోతారు. ఇలాంటి స్వార్థపరులు  ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. చాడీలు చెప్పేవారు.. ఒకరి గురించి ఇంకొకరు దగ్గర చాడీలు చెప్పేవారు.. ఏదో ఒకరోజు ఎదుటి వారికి మీ గురించి చాడీలు చెప్పే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.  అలాంటి వారికి నిజాయితీ ఉండదు. వారు సంబంధాలను పాడుచేయడానికి కల్పిత కథలను మాత్రమే చెబుతారు.  జీవితంలో మనశ్శాంతి కావాలంటే అలాంటి వ్యక్తులకు  దూరంగా ఉండటం మంచిది. అసూయ పరులు.. మీరు సంతోషంగా ఉన్నప్పుడు చప్పట్లు కొట్టేవాడే నిజమైన స్నేహితుడు. అయితే, కొంతమంది మీతో చాలా మంచిగా ఉన్నట్లు నటిస్తారు, కానీ రహస్యంగా మీ పురోగతిని చూసి అసూయపడతారు. మీరు కొత్త కారు కొన్నా, పదోన్నతి పొందినా, వారు మిమ్మల్ని అభినందిస్తారు, కానీ వారి కళ్ళలో, మాటల్లో ఒక వింతైన అసూయ  స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి అసూయపడే వ్యక్తులు మీ మంచిని ఎప్పటికీ కోరుకోలేరు. నిరాశ పరిచేవారు.. నువ్వు చేయలేవు.. నీకు చేతకాద.. నీకు సాధ్యం కాదు.. నువ్వు ఫెయిల్ అవుతావు.. వంటి మాటలు చెప్పే వ్యక్తులే మీ కలలకు, ధైర్యానికి అతిపెద్ద శత్రువులు. మీరు ఏదైనా కొత్తగా, సానుకూలంగా చేయాలని అనుకున్నప్పుడల్లా, వాళ్ళు తమ మాటలతో మిమ్మల్ని భయపెట్టి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. మిమ్మల్ని మీరు నమ్మండి, వాళ్ళ మాటలను ఒక చెవితో విని, మరో చెవితో వదిలేయాలి. పైన చెప్పుకున్న లక్షణాలు గల వ్యక్తులు ప్రతి ఒక్కరి చుట్టూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే ఇలాంటి వ్యక్తుల మాటలను ఎంత తక్కువ పరిగణలోకి తీసుకుంటే అంత మంచిది. లేకపోతే సంతోషాన్ని చెదపురుగుల్లా తినేసి,  మనిషిని అశాంతికి గురిచేస్తారు.                                        *రూపశ్రీ.
  హైందవులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎలాగూ ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, ప్రబలే అనారోగ్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను రూపొందించినట్లు కనిస్తుంది. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం జతగా సాగుతోంది. శ్రీరామనవమినాటి పానంకం కూడా అంతే! శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, గాడ్పులు కూడా మొదలవుతాయి. వేసవిలో బెల్లపు పానకాన్ని తీసుకోవడం వల్ల చాలా మేలే జరుగుతుంది. వేసవిలో ఎక్కువగా చెమట పట్టడం వల్ల... మన ఒంట్లో ఉండే ఖనిజాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కేల్షియంలు ఆ చెమట ద్వారా బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. శరీరం నుంచి వెళ్లిపోయిన ఖనిజాలను అలా పానకం భర్తీ చేస్తుందన్నమాట! ఇక బెల్లంలో ఉండే ఇనుము వేసవి తాపాన్ని ఎదుర్కొనే శక్తినిస్తుంది. అంతేకాదు, వేసవిలో అటూఇటూ ఊగిసలాడే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో తాపానికి పిత్తదోషాలు ప్రబలుతాయని ఆయుర్వేదం చెబుతోంది. దీనివల్ల అజీర్ణం, గుండెల్లో మంట, జుట్టు రాలడం, దద్దుర్లు, నిద్రలేమి లాంటి లక్షణాలు కనిపిస్తాయట. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉందంటారు ఆయుర్వేద వైద్యులు. ఇక బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం. పైగా వేసవిలో వీలైనంత ఎక్కువగా నీరు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అలాంటి నీటిలో బెల్లాన్ని కలుపుకుని పానకంగా తాగడం ఎవరికి మాత్రం ఇష్టముండదు! తెలుగునాట పెళ్లిళ్లలో విడిదికి చేరుకున్న వరుని కుటుంబానికి పానకపు బిందెలను అందించే సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లు ఎక్కువగా వేసవిలో జరుగుతాయి కాబట్టి... ఒక పక్క పెళ్లి పనులు, ప్రయాణాలు సాగించి మరో పక్క వేసవి తాపానికి అలసిన మగపెళ్లివారికి తిరిగి ఉత్సాహాన్ని కలిగించేందుకు, ఈ సంప్రదాయాన్ని నెలకొల్పి ఉంటారు.   బెల్లపు పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తుంటారు. ఆయుర్వేదం ప్రకారం మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని వృద్ధి చేస్తాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు పోయేలా తోడ్పడతాయి. వేసవిలో వచ్చే పొడిదగ్గుకి మిరియాలు గొప్ప ఔషధంలా పనిచేస్తే, యాలుకలు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. పానకం గురించి ఇంత చెప్పుకున్నాక వడపప్పు గురించి కూడా ప్రస్తావించి తీరాల్సిందే! పెసరప్పుకి చలవ చేసే గుణం ఉందంటారు. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గించుకునేందుకు ఇప్పడు చాలామంది పాశ్చాత్యులు కూడా పెసరపప్పుతో చేసిన కట్టుని (సూప్‌) తాగడం మొదలుపెట్టారు. మనం ఆడుతూపాడుతూ తాగే వడపప్పు, పానకాల వెనుకాల ఇంత శాస్త్రం ఉందన్నమాట!   ..నిర్జర.
మానవ శరీరంలో మూత్రపిండాలు అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరంలో కనిపించే చాలా లక్షణాలను చాలా సార్లు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇలా శరీరంలో కనిపించే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం అనేది  కొన్నిసార్లు మూత్రపిండాల వైఫల్యానికి సంకేతాలు కావచ్చని వైద్యులు అంటున్నారు. మరీ ముఖ్యంగా అందరికీ కాకుండా కొందరికి మాత్రమే మూత్రపిండాల సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నేటికాలంలో చర్మ సంరక్షణలో భాగంగా చాలా రకాల క్రీములు వాడుతూ ఉంటారు.  ఇవి కూడా మూత్రపిండాల సమస్యకు కారణం అవుతాయి అనే మాట చాలా చర్చలకు దారి తీస్తోంది.   మూత్రపిండాల సమస్యకు అసలు కారణాలు ఏంటి? మూత్రపిండాల సమస్య ఎవరిలో ఎక్కువ వస్తుంది? వివరంగా తెలుసుకుంటే.. రెండు రూపాలు.. మూత్రపిండాల వ్యాధులు రెండు రూపాలలో వస్తాయి.  మధుమేహం వల్ల వచ్చే మూత్రపిండాల వ్యాధి మొదటిది. 50 శాతం మందికి మధుమేహం కారణంగా మూత్రపిండాల వ్యాధి వస్తుంది. అధిక రక్తపోటు మరొక కారణం. మూత్రపిండాల్లో రాళ్లు,  ఇన్ఫెక్షన్లు కూడా ఈ వ్యాధికి ఇతర కారణాలు. జన్యుపరంగా,  ఇతర మందులు తీసుకోవడం వల్ల కూడా మూత్రపిండాల వ్యాధి రావచ్చు. తాత్కాలిక,  శాశ్వత మూత్రపిండాల వ్యాధులు కూడా ఉన్నాయి. తాత్కాలిక మూత్రపిండాల వ్యాధి.. మలేరియా, డెంగ్యూ జ్వరం లేదా లెప్టోస్పిరోసిస్ వంటి వ్యాధి వచ్చినప్పుడు,  మూత్రపిండాలు తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతాయి. ఈ పరిస్థితిలో డయాలసిస్ అవసరం కావచ్చు. లేదా మందులతో దీనిని నయం చేయవచ్చు. ధీర్షకాల మూత్రపిండాల వ్యాధి.. కొంతమందికి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉండవచ్చు. ఇది మధుమేహం,  అధిక రక్తపోటు కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. సరైన సమయంలో చికిత్స చేయకపోతే, చివరికి  డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడి అవసరం  ఏర్పడుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల వ్యాధికి తరచుగా ఎలాంటి లక్షణాలు ఉండవు. అందుకే చాలామంది  దానిని పట్టించుకోరు. ఏదైనా అనుమానం వచ్చి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే రక్తంలో క్రియాటినిన్ స్థాయి ఎక్కువగా ఉందని తెలుస్తుంది. మూత్రపిండాల వైఫల్యానికి అత్యంత సాధారణ లక్షణం కాళ్ళలో నీరు చేరడం. ఇతర లక్షణాలలో లైట్ గా చలి, నొప్పి, జ్వరం, లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే చలి,  వెన్నెముకకు ఇరువైపులా నొప్పి వంటివి  ఉంటాయి. పాదాల వాపు మూత్రపిండాల వ్యాధి లక్షణం అని ఖచ్చితంగా చెప్పలేము. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కూడా పాదాల వాపు రావచ్చు. జీవనశైలిలో మార్పులు కూడా మూత్రపిండాల వ్యాధికి కారణం కావచ్చు. మద్యపానం, ధూమపానం, జంక్ ఫుడ్ తినడం,  ఊబకాయం వంటివన్నీ మూత్రపిండాల వ్యాధికి దారితీసే పరిస్థితులు. మూత్రం రంగు మారడం, మూత్రంలో రక్తం కనిపించడం,  మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వ్యాధి లక్షణాలే. చర్మాన్ని తెల్లబరిచే క్రీములతో మూత్రపిండ వ్యాధులు.. చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగించే క్రీములు మూత్రపిండాలకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. వైద్యపరంగా ఉపయోగించే క్రీములు సాధారణంగా పెద్ద సమస్యలను కలిగించవు.  కానీ చాలామంది అందం మీద పిచ్చితో సోషల్ మీడియాలో కనిపించే ప్రమోషన్ యాడ్స్,  ఇంటర్నెట్ లో కనిపించే పేక్ రివ్యూస్ చూసి సొంతంగా క్రీములు ఎంచుకుని వాడుతుంటారు. అలాంటి క్రీములలో అధిక పరిమాణంలో పాదరసం ఉండవచ్చని అంటున్నారు. పాదరసానికి చర్మాన్ని తెల్లగా చేసే గుణం ఉంది. పాదరసం మూత్రపిండాలకు ప్రమాదకరమైన పదార్థం. మూత్రపిండాలకు హాని కలిగించే మరొక పదార్థం ఆర్సెనిక్. చాలా క్రీములలో వీటన్నింటి పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు  వాడటం వల్ల, ఇది చర్మం ద్వారా రక్తంలో కలిసి మూత్రపిండాలకు చేరి ప్రమాదం కలిగిస్తుందని పరిశీలనలలో తేలింది. వైద్య సలహా లేకుండా ఎలాంటి క్రీములు వాడకుండా ఉండటం చాలా ఉత్తమం అని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.
నేటికాలంలో చాలామంది ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు.  ఎంత బిజీగా ఉన్నా సరే.. తీసుకునే పండ్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు.  చాలామంది రోడ్ సైడ్ లేదా మాల్స్,  ఆఫీసుల దగ్గర దుకాణాలలో పిచ్చి  ఆహారాలకు బదులు ఫ్రూట్ చాట్ తినడం మంచిదని అనుకుంటారు. దుకాణాలలో కూడా వివిధ రకాల పండ్లను కలిపి ప్రూట్ చాట్ గా తయారు చేసి అమ్ముతుంటారు.  ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఫ్రూట్ చాట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివని అనుకుంటారు.  కానీ ఫ్రూట్ చాచ్ గురించి వైద్యులు,  ఆహార నిపుణులు దిమ్మతిరిగే నిజాలు చెబుతున్నారు.  ముఖ్యంగా వేసవిలో అందరూ ఫ్రూట్ చాట్ ఎక్కువగా తినాలని అనుకుంటారు కాబట్టి ఫ్రూట్ చాట్ అంటే ఇష్టపడే ప్రతి ఒక్కరూ వైద్యులు ఏం చెప్పారో తెలుసుకోవాలి.. తొక్క వల్ల కలిగే నష్టం.. చాలా వరకు ఫ్రూట్ చాట్ లో పండ్ల మీద తొక్కను తొలగించి పండ్లను ముందుగానే ముక్కలు చేసి సిద్దంగా పెట్టి ఉంటారు. కస్టమర్లు రాగానే వాటిని అందిస్తుంటారు.  పండ్ల పై తొక్క పండ్లను చెక్కు చెదరకుండా రక్షిస్తాయి.  కానీ పండ్లను తొక్క తొలగించి  కోసిన తర్వాత ఈ రక్షణ పొర తొలగిపోతుంది. పండు లోపలి భాగం నేరుగా గాలి, దుమ్ము, కాలుష్యం,  మురికి మొదలైనవాటికి గురవుతుంది. ఈ పండ్లను ఎక్కువ కాలం పాటు, ముఖ్యంగా వేడి వాతావరణంలో  వదిలేస్తే, బ్యాక్టీరియా,  ఫంగస్ వేగంగా వృద్ధి చెందుతాయి. పరిశుభ్రత లోపించడం వల్ల రోడ్డు పక్కన పండ్లు అమ్మే చోట ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. నిల్వ.. కోసిన పండ్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే, అవి  తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ కలుషితమైన పండ్లను తినడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫుడ్ పాయిజన్,  కడుపునొప్పి,  వాంతులు విరేచనాలు, జ్వరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  ఇంట్లో  చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు వంటి  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారికి ఇలాంటి ఫ్రూట్ చాట్ లేదా ముందే ముక్కలుగా కోసిన పండ్లు ఆరోగ్యానికి మరింత హాని చేసే అవకాశం ఎక్కువ. పోషణ ఉండవు..  శరీరానికి తగినంత పోషణ అందించడానికి  పండ్లు తింటాము, కానీ పండ్లను కోసి ఎక్కువ సేపు నిల్వ ఉంచడం వల్ల వాటిలోని ముఖ్యమైన పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. గాలికి నేరుగా గురికావడం వల్ల విటమిన్ సి వంటి సున్నితమైన, ప్రయోజనకరమైన పోషకాలు క్రమంగా నశించిపోతాయి. ముందుగా కోసిన పండ్లను తినడం వల్ల  అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉండటమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందవు. ప్యాక్ చేసిన కటింగ్ ఫ్రూట్స్.. సూపర్‌మార్కెట్లలో లభించే డబ్బాలలో ప్యాక్ చేసిన కోసిన పండ్లు, విడిగా అమ్మే పండ్ల కంటే కొంచెం సురక్షితమైనవిగా పరిగణించబడవచ్చు. అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేసేటప్పుడు  జాగ్రత్తగా ఉండాలి. వాటి గడువు తేదీని,  వాటిని నిల్వ ఉంచిన ఉష్ణోగ్రతను  తనిఖీ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. మార్కెట్ నుండి  తాజాగా, కోయని పండ్లనే ఇంటికి తెచ్చుకోవాలి. పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి, ఆ తరువాతే కోయాలి. పండ్లను కోసిన తర్వాత వాటిని ఎక్కువ సేపు ఆరుబయట ఉంచకూడదు. కోసిన పండ్లు ఏవైనా మిగిలి ఉంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. రోడ్డు పక్కన ఎలాంటి శుభ్రత లేని చోట,  ముందుగానే పండ్లను కోసి నిల్వ చేసి అమ్మే చోట పండ్ల ముక్కలు కొనుగోలు చేసి తినడం మంచిది కాదు.                                    *రూపశ్రీ.