LATEST NEWS
నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం,  వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది. ఈ కారణంగా వేసవితో సంబంధం లేకుండానే నీటి ఎద్దడి ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని కొందరు నీటి ట్యాంకర్ల దందా చేస్తూ కోట్లు వెనకేసుకుంటున్నారు. అలాగే మినరల్ వాటర్ మినరల్ వాటర్ ప్లాంటు లను నెలకొల్పి నీటిని తోడేస్తున్నారు. నగరాల్లో నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే వర్షాకాలంలో  కురిసిన నీరు వృధాగా పోకుండా భూమిలోకి ఇంకేలా ఏర్పాట్లు ఉండాలి. ఇంకుడు గుంతల విధానం తో కొంతవరకూ భూగర్భజలాలను కాపాడవచ్చు. అయితే వర్షంపు నీరు ప్రతి చుక్కా భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. అందుకు ప్రతి ఇల్లు, ప్రతి కాలనీ, ప్రతి అపార్ట్ మెంట్ లలో ఖాళీ ప్రదేశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయ్యాలి. అయితే అందుకు భిన్నంగా ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ల నిర్మాణం జరుగుతోంది. మొత్తం గచ్చు చేయించి నీరు భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా చేస్తున్నారు. దీంతో నీటి ఎద్దడి డేంజర్ బెల్స్ మోగించే పరిస్థితి ఏర్పడుతోంది.  ఇది అరికట్టాలంటే   ఇంకుడు గుంతలు తో పాటు బోర్ పిట్ల ద్వారా నీరు భూమిలోకి ఇంకేలా  మరింత మెరుగైన విధానానికి శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బోరు బావులను తవ్వి దాని చుట్టూ ఇంకుడు గుంతల తరహాలో పెద్దపెద్ద గోతులు తవ్వి వాన,వృధా నీటిని ఒడిసి పట్టి  బోరు ద్వారా భూమిలోకి పంపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా, రాయలసీమలో పలు ప్రాంతాల్లో ఈ తరహా బోర్ పిట్ లను నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నది  .మోడల్ ప్రాజెక్టు గా విజయనగరం, సీమ జిల్లాల్లో  బోర్ పిట్ల నిర్మాణం చేపట్టారు. ఇందు కోసం కేంద్రం నిధులు సమకూరుస్తుంది.   భవిష్యత్ తరాలకు నీటికొరత రాకుండా వాననీటిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఇందుకుగాను  భూగర్భ జల శాస్త్ర వేత్త లతో ఏపీ సర్కార్  విస్తృతంగా సమాలోచనలు చేసింది. ఈ విధానం వల్ల 80 శాతం అదనంగా భూగర్భజలాలు అందుబాటులో ఉంటాయని నిపుణులు అంటున్నారు.  
ప్రతిష్ఠాత్మక సింహాద్రి అప్పన్న ఆలయంలో బుధ, గురు (జులై 9, 10) జరిగే గిరి ప్రదక్షిణకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడు పదిలక్షల మంది వరకూ హాజరౌతారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 32 కిలోమీటర్లు జరిగే ఈ గిప్రదక్షిణకు  దాదాపు 3 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి 6 కిలోమీటర్లకు ఒక అధికార బృందం పర్యవేక్షణ కోసం నియమించారు.  భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.  32 వైద్య శిబిరాలు, 18 అంబులెన్సులు, వైద్య బృందాలు గిరి  ప్రదక్షిణ మార్గం వద్ద ఏర్పాటు చేశారు.  సింహాద్రి అప్పన్న ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోకగజపతి రాజు స్వామి వారి ప్రచార రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి   జెండా ఊపి గిరి ప్రదక్షిణను ప్రారంభిస్తారు.  
గ్రేటర్‌లో హైడ్రా కూల్చివేతల పర్వం మొదలైనప్పటి నుంచి పాతబస్తీలోని ఒవైసీ విద్యాసంస్థలపై పెద్ద దుమారమే రేగుతోంది. పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం, ఒవైసీకి ఒక న్యాయమా అంటూ నిలదీస్తున్నాయి. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్ స్పందించారు. ఈ కాలేజీని ఎందుకు కూల్చి వేయడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు. ఒవైసీ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరూ తమని అడుగుతున్నారన్న ఏవీ రంగానాథ్ అన్నారు. ఈ కాలేజీ ఎఫ్‌టీఎల్‌లో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేశామని చెప్పామని గుర్తుచేశారు. కానీ పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ కాలేజీ నడుస్తోందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని గుర్తుచేశారు.  పేద ముస్లిం మహిళలను వెనుక బాటుతనం నుంచి ఒవైసీ కాలేజీ విముక్తి కల్పిస్తోందని అన్నారు. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కావడంతోనే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు ఏవీ రంగానాథ్. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశామని ఏవీ రంగానాథ్ తేల్చిచెప్పారు. పాతిక ఎకరాల సరస్సును ఫ్లాట్‌గా మార్చిన ఒవైసీ కుటుంబానికి చెందిన సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చివేశామని గుర్తుచేశారు. మజ్లిస్ నాయకుల నుంచి దాదాపు రూ. 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నామని వెల్లడించారు. చాంద్రాయణ గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సామాజిక కారణాలతోనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశామని అన్నారు . సామాజిక స్పృహతో ఈ కాలేజీ నడుస్తోందని.. అందుకే కూల్చివేయడానికి కాస్త ఆలోచిస్తున్నామని ఏపీ రంగనాథ్ అంటుండటం మానవతావాదుల ప్రశంసలు అందుకుంటున్నా.. రాజకీయ విమర్శలు మాత్రం తప్పడం లేదు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఆ షరతుల మేరకు మార్కెట్ యార్డులో 500 మందికి, హెలిప్యాడ్ వద్ద 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. బంగారుపాళ్యంలో ఎలాంటి అల్లర్లకు చోటులేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తుగా వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. కావాలనే ఆంక్షలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని   హెచ్చరించారు. అయితే పోలీసు ఆంక్షలను బేఖాతరు చేస్తూ బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్‌లో వైసీపీ శ్రేణులు వీరంగం సృష్టించాయి. పోలీసుల ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు పట్టించుకోకుండా నానా హంగామా సృష్టించారు. పోలీసులను పక్కకు తోసేసి మార్కెట్‌ యార్డ్‌లోకి మరీ వైసీపీ కార్యకర్తలు చొచ్చుకువెళ్లారు  వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బంగారు పాళ్యంలోని హెలిప్యాడ్‌కి జగన్ రెడ్డి చేరుకునే సరికి హెలి‌ప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా ఎగబడ్డాయి. వారిని కంట్రోల్ చేయలేక పోలీస్‌లు చేతులు ఎత్తేస్తున్నారు. వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో తోపులాట జరిగింది. హెలి‌ప్యాడ్ వద్ద తొక్కిసలాటతో పరిస్థితి గందరగోళంగా మారింది. వైసీపీ నేతల వైఖరితో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అయినా కూడా వైసీపీ  మూకలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత చంద్రబాబు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు.  అయితే ఈ పథకంపై సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులలో  ఉచిత ప్రయాణం పథకం అమలు అవుతుందనీ, అయితే ఈ పథకంలో ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళలు తమ జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చనీ, అయితే జిల్లా దాటితే మాత్రం టికెట్ తీసుకోవలసి ఉంటుందని తెలిపారు.   . అయితే, ఈ ఉచిత బస్సు ప్రయాణం జిల్లాలకు మాత్రమే పరిమితమని క్లారీటీగా చెప్పేశారు. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని సీఎం తెలిపారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్రం అంతటికీ వర్తింప చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అములులో సాధ్యాసాధ్యలన్నిటినీ అధ్యయనం చేసిన అనంతరం జిల్లాలకు పరిమితం చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక పోతే  తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ,  పింఛన్లు అందుకునేవారికి కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అటువంటి వారి కోసం ఉచిత బస్సు పాసులను ఇవ్వాలని యోచిస్గున్నది.  గుండెజబ్బులు, కిడ్నీల సమస్య, పెరాలసిస్, తలసేమియా, లెప్రసీ,   వంటి సమస్యలున్నవారికి ఈ ఫ్రీ బస్సు సౌకర్యం అందించాలని ప్రభుత్వం భావిస్తున్నది.  
ALSO ON TELUGUONE N E W S
The much loved combo from Krishna and His Leela is reuniting and this time they are stepping into a whole new zone. Starboy Siddhu Jonnalagadda and filmmaker Ravikanth Perepu are back with Badass. Produced by the powerhouse banners Sithara Entertainments & Fortune Four Cinemas and Presented by Srikara Studios. This film is going to take Siddhu into a space we’ve never seen him in before. This project is written by Ravikanth Perepu and Siddhu Jonnalagadda, and directed by Ravikanth himself. Siddhu is stepping far away from the vibrant entertaining zone of Tillu. In this film his madness will be on steroids bringing out a deep and mature performance that will mark a complete makeover for the actor. The makers have unveiled the title along with a striking first look and the poster already grabs attention with its raw and bold statement “If middle finger was a man”.  In today’s times it’s rare for content to instantly connect with audiences at first sight but this squad has done exactly that in their very first attempt. With a bigger budget, a deeper story and a team that believes in pushing limits, this film is gearing up to be one of the most anticipated emotional dramas of 2026. The film is being produced by S. Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments, Fortune Four Cinemas and Srikara Studios. More updates will be out soon.
Samantha Ruth Prabhu has been sharing her life updates and several pictures on social media, majorly, on Instagram. From past two years, ever since, she had worked in Family Man series Season 2, her close proximity with director Raj Nidimoru, popularly a part of the writer-director duo Raj & DK, has been headlining Tabloids.  Later, she starred in Citadel: Honey Bunny series, which is also directed by Raj & DK. Her close proximity with Raj and growing friendship between them has become a talking point. Also, she went through a serious health issue, which also became a big talking point. Now, she dropped few pictures from her Detroit, US trip.  Interestingly, she met Raj's sister Sheetal Nidimoru and her family in the trip. Major amount of pics have been dominated by them and also, Raj and Sam, both walked embracing each other closely. Looks like after Naga Chaitanya Akkineni, her ex-husband, Samantha has also moved on completely.    On the other hand, from earlier posts of Sheetal and Raj's wife Shhyamali De, we can say that it is almost confirmed that Raj and Shhyamali De are going through issues. So, this Samantha's posts can be taken as a silent and almost official confirmation. Well, like Chay, if Sam also found love again, we extend our wishes for her to stay blessed and happy.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి ఘన విజయాలతో యువతకు చేరువైన సిద్ధు జొన్నలగడ్డ.. ఇటీవల 'జాక్'తో నిరాశపరిచాడు. ప్రస్తుతం 'తెలుసు కదా' అనే ఓ సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తనకు 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్'తో హిట్స్ ఇచ్చిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సిద్ధు మరో సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి 'బ్యాడాస్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. (BADASS)   'బ్యాడాస్' చిత్రానికి రవికాంత్‌ పేరెపు దర్శకుడు. గతంలో సిద్ధు-రవికాంత్‌ కలయికలో వచ్చిన 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి వీరి కాంబోలో 'కోహినూర్' అనే ఓ భారీ సినిమాని మొదట ప్లాన్ చేసింది సితార. కానీ, ఏవో కారణాలతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి.. 'బ్యాడాస్' సినిమాకి శ్రీకారం చుట్టింది.     సినీ రంగం నేపథ్యంలో 'బ్యాడాస్' కథ ఉంటుందని తెలుస్తోంది. చిత్ర టైటిల్ ని రివీల్ చేస్తూ.. తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ మీద “If middle finger was a man” అనే బోల్డ్ స్టేట్మెంట్ రాసుంది. అభిమానులు, మైక్ లు, కెమెరాలతో డిజైన్ చేసిన ఆ పోస్టర్ లో సిద్ధు ఫుల్ ఆటిట్యూడ్ ఉన్న బిగ్ స్టార్ లా కనిపిస్తున్నాడు. ఓ స్టార్ చుట్టూ అల్లుకున్న కథగా 'బ్యాడాస్' ఉంటుందని సమాచారం. టిల్లుగా ఎంతగానో నవ్వించిన సిద్ధు.. ఇందులో తనలోని సీరియస్ యాంగిల్ ని చూపించబోతున్నాడని పోస్టర్ తో అర్థమవుతోంది.    శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. 2026లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' తర్వాత సిద్ధు, సితార కాంబినేషన్ లో వస్తున్న 'బ్యాడాస్' హ్యాట్రిక్ హిట్ సాధిస్తుందేమో చూడాలి.  
బాలీవుడ్ చిత్ర రంగంలో ప్రముఖ హీరోయిన్ 'అలియాభట్'(Alia Bhatt)కి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకమైనది. లెజండ్రీ డైరెక్టర్ 'మహేష్ భట్'(Mahesh Bhatt)వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన అలియా, పలు సినిమాల్లో వివిధ రకాల పాత్రల్ని పోషిస్తు తన ప్రత్యేకతని చాటుకుంటూ వస్తుంది. నేషనల్ అవార్డుని సైతం అందుకుని సత్తా చాటిన అలియా దగ్గర 2021 నుంచి 2024 వరకు 'వేదిక ప్రకాష్ శెట్టి' అనే మహిళ వ్యకిగత సహాయకురాలిగా పనిచేస్తు వస్తుంది. దీంతో అలియాకి సంబంధించిన సినిమా డేట్స్ ,ఆర్థిక వ్యవహారాలతో పాటు, అలియా సొంత నిర్మాణ సంస్థ ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటిని  వేదిక చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలో ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే వేదిక నకిలీ బిల్లులు సృష్టించి, వాటిపై  అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి పలు దఫాలుగా సుమారు 77 లక్షల రూపాయిల వరకు మోసం చేసింది. ఈ విషయాన్ని ఆలస్యంగా  గుర్తించిన అలియా తల్లి ప్రముఖ బ్రిటిష్ నటి, దర్శకురాలైన 'సోని రజ్దాన్'(Sony Razdan)పోలీసులకి ఫిర్యాదు చేయడంతో వేదికపై కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో వేదిక ముంబై నుంచి పరారయ్యి అనేక ప్రాంతాల్లో తలదాచుకుంది. చివరకి పోలీసులు బెంగుళూరులో వేదిక ని పట్టుకొని ముంబైకి తీసుకొచ్చారు.  అలియా నుంచి దోచుకున్న మొత్తాన్ని వేదిక తన స్నేహితుల అకౌంట్స్ కి పంపి ఆ తర్వాత  వినియోగించేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్ ఎస్ రాజమౌళి(Ss Rajamouli),ఎన్టీఆర్(Ntr) రామ్ చరణ్(Ram Charan)ల  ఆర్ఆర్ఆర్(rrr)తో అలియా తెలుగు ప్రేక్షకుల అభిమాన కథానాయికగా మారిన విషయం తెలిసిందే.  
'వైవీఎస్ చౌదరి'(Yvs Chowdary)స్వీయ దర్శకత్వంలో 'చిరంజీవి'(Chiranjeevi)మేనల్లుడు 'సాయిధరమ్ తేజ్'(Sai Dharam Tej)హీరోగా ప్రేక్షకులకి ముందుకు వచ్చిన చిత్రం 'రేయ్'. 2015 లో విడుదలైన ఈ మూవీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నటి 'సయామీ ఖేర్'(Saiyami Kher). ఆ తర్వాత 'మీర్జా' అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ప్రవేశించి పలు చిత్రాల్లో  ప్రాధాన్యత గల పాత్రలని పోషించింది. ఈ ఏడాది సన్నీడియోల్, గోపి చంద్ మలినేని(Gopichand Malineni)కాంబినేషన్ లో వచ్చిన 'జాట్'(Jaat)మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి అభిమానులని అలరించింది. ఫిట్ నెస్ కి అధిక ప్రాధాన్యమిచ్చే సయామీ వివిధ రకాల విదేశీ క్రీడల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగిన' ఐరన్ మాన్  70.3 ట్రయాథ్లాన్'‌(Ironman 70.3 triathlon) ' రేస్ లో పాల్గొంది. ఈ రేస్‌లో 1.9 కిలోమీటర్ల దూరం స్విమ్మింగ్, 90 కిలోమీటర్ల సైక్లింగ్, 21.1 కిలోమీటర్లు రన్నింగ్ ని ఒకే రోజులో పూర్తి చేయాలి. చలిలో ఎత్తైన కొండల మధ్య ఈ రేస్ జరుగుతుంది. ఈ రేస్ లో సయామీ విజయాన్ని అందుకుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన రేస్ లో కూడా సయామీ విజేతగా నిలవడంతో, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఐరన్ మాన్  70.3 ట్రయాథ్లాన్‌ ని ఏడాది వ్యవధిలో రెండుసార్లు పూర్తి చేసిన అరుదైన రికార్డుని సాధించినట్టయ్యింది. వరల్డ్ ట్రయాథ్లాన్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ఛాలెంజ్ ని యూరోపియన్ ఛాంపియన్‌షిప్ అని కూడా పిలుస్తారు. ఈ ఘనత పై నయామి ఇనిస్టా వేదికగా స్పందిస్తు  ప్రపంచానికి నేనేంటే ఏంటో నిరూపించుకోవడానికి ఇదంతా చెయ్యలేదు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండాలని చేశాను. అనుకున్నట్టుగానే గత ఏడాది కంటే ఈ ఏడాది ముప్పై నిమిషాల ముందే టార్గెట్ ని  పూర్తి చేశాను. క్రమ శిక్షణతో ఏదైనా సాధ్యమే అనడానికి నేనే ఒక ఉదాహరణ అని చెప్పుకొచ్చింది. సయామీ త్వరలో 'స్పెషల్ ఓపిఎస్ 2 ' అనే వెబ్ సిరీస్ తో  ప్రేక్షకుల ముందుకు రానుండగా, వైల్డ్ డాగ్, హైవే వంటి మరో రెండు తెలుగు చిత్రాల్లో కూడా సయామీ నటించింది.    
దసరా, దేవర పార్ట్ 1 ,డాకు మహారాజ్ వంటి హిట్ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు 'షైన్ టామ్ చాకో'(Shine Tom Chacko). మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన షైన్ 2002 లో సినీ రంగ ప్రవేశం చేసి, ఇప్పటి వరకు సుమారు ఎనభైకి పైగా చిత్రాల్లో వివిధ క్యారెక్టర్స్ ని పోషించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. కొన్ని నెలల క్రితం షైన్ గురించి ప్రముఖ మలయాళ నటి 'విన్సీ అలోషియస్'(Vincy Aloshious)మీడియా సమక్షంలో మాట్లాడుతు ఒక సినిమా షూటింగ్ సమయంలో షైన్ డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా దాడి చేసి గాయపరిచాడని చెప్పింది. మలయాళ ఫిలింఛాంబర్ తో పాటు పోలీసులకి కూడా విన్సీ ఫిర్యాదు చెయ్యడంతో షైన్ పై కేసు నమోదయ్యింది. అప్పట్లో ఈ విషయం మలయాళ చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు షైన్ , విన్సీ కలిసి 'సూత్రవాక్యం'(Soothravakyam)అనే సినిమాలో నటించారు. డ్రామా, మిస్టరీ, థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో షైన్ పోలీస్ ఆఫీసర్ గా టైటిల్ రోల్ పోషించాడు. ఈ నెల 11 న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో షైన్ అండ్ విన్సీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షైన్ మాట్లాడుతు 'విన్సీ విషయంలో నా ప్రవర్తన తీరు పట్ల తనకి క్షమాపణలు చెపుతున్నాను. విన్సీ కి ఎటువంటి హానీ కలిగించే ఉదేశ్యం నాకు లేదు. నేను సరదాగా చేశాను. కానీ విన్సీ అంత తీవ్రంగా స్పందించడానికి కారణం ఉంది. ఆమె వెనుక ఎవరో ఉండి ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత విన్సీ మాట్లాడుతు నేను ఎంతగానో ఆరాధించే వ్యక్తి నుంచి అలాంటి ప్రవర్తనని అసలు ఊహించలేదు. ఆ సమయంలో నేను ఎంతగానో బాధపడ్డాను. నేను స్పందించిన తీరు చాకో కుటుంబాన్ని ఎంతో బాధకి గురి చేసింది. ఇప్పుడు ఆ బాధ ముగిసిందని చెప్పుకొచ్చింది. షైన్ ఇటీవల డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకి వచ్చిన విషయం తెలిసిందే.    
Contrary to the reports that Pawan Kalyan’s upcoming film Hari Hara Veera Mallu is based on a celebrated folk hero, here’s an inside scoop! We have reliably learnt that the period drama is a fictional story that focuses on a revered personality who protects Sanatana Dharma. After Jyothi Krisna took over the directorial reins, the story of Hari Hara Veera Mallu reportedly underwent a makeover and was completely transformed. The director gave a new spin to the story while retaining its spirit and essence. According to sources, just like how Ayyappa Swamy is described as the son of Shiva and Mohini — representing a bridge between Shaivism and Vaishnavism — Hari Hara Veera Mallu too is an incarnation of Lord Shiva and Vishnu. “The title Hari (Vishnu) Hara (Shiva) itself conveys the essence of the film. To further strengthen their narrative, the filmmakers used elements like Eagle, a representation of Garuda, the mythical bird and vahana of Lord Vishnu. Additionally, the protagonist holds a Damarukam in his hands signifying Lord Shiva. The protagonist in the film appears as a manifestation of Lord Shiva and Vishnu to protect and fight for Dharma,” informs a source. AM Rathnam bankrolled Hari Hara Veera Mallu with a lot of grandeur.  The budget of the film has shot up significantly. But the producer who is known for his making larger-than-life- films lavishly have turned them into blockbusters in the past. For Hari Hara Veera Mallu too, Rathnam did not commit himself to sell the rights (except overseas and Hindi) but made the film lavishly. After the trailer became an instant blockbuster, the producer is now selling the rights for a solid price. Many distributors have already approached the producer and are ready to shell out a whopping sum to bag the rights. The makers were always confident that if the film comes out grandly, they can attract the best price. Hence, they made Hari Hara Veera Mallu lavishly, and elevated the range and film’s span. Starring Power Star Pawan Kalyan in a never before seen avatar as the fierce and fearless Veera Mallu. The film narrates the journey of a rebellious outlaw who dares to defy the might of the Mughal. The film is by Director A.M. Jyothi Krishna who is spearheading this magnum opus with lots of hard work while Krish Jagarlamudi continues to contribute as one of the visionary forces behind the project. The post production work is progressing at a rapid pace with every frame undergoing meticulous attention to deliver best cinematic experience. Music by M.M. Keeravani has already set the tone with four impactful songs all of which have received resounding love from fans. The film also features ensemble cast Bobby Deol, Nidhhi Agerwal and many more adding madness to the narrative. With stunning visuals by Gnana Shekar V.S. and Manoj Paramahamsa and editing by K.L. Praveen, film is being shaped into a visual epic. Presented by A.M. Rathnam and produced by A. Dayakar Rao under Mega Surya Production. The film is gearing up to hit the screens on July 24th.
Dhanush and Nayanthara had open battle about copyrights for using Naanum Rowdy Thaan clips in her Netflix wedding documentary film, Nayanthara Beyond the Fairytale. Dhanush asked Rs.10 crores as compensation for using 3 seconds of Naanum Rowdy Thaan footage in the video.  While, they fought openly, AP International Films, who owns rights for Chandramukhi distribution have gone to court against usage of clips from the film in the documentary. Madras High Court has directed Nayanthara and Netflix to pay Rs.5 crores as compensation for copyright infringement.  They gave two weeks to both the teams to file their reply to this directive. They have asked Netflix to attach production budget details and also earnings from the documentary. We have to wait and see, how Netflix will react to this, as they do not share earnings but streamed minutes in public domain.  Now, Nayanthara and Vignesh Shivn will have to reply to this in court and on social media with PR letters. Let's see how she handles this as she is currently busy with Mega157 in the direction of Anil Ravipudi opposite Megastar Chiranjeevi.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Pedro Pascal is all set to make his Marvel debut with The Fantastic Four: First Steps as Mister Fantastic/Reed Richards, the leader of the team. The movie, which is set to kick off the sixth phase of the MCU, will hit the Indian theatres on July 25 in English, Hindi, Tamil, and Telugu.  During the global promotions for the film, Pedro Pascal shared an interesting anecdote. Speaking with Vanity Fair, Pedro said that he gave his 100% while committing to the 1960s accent but the crew kept on pulling him back. , "The theatre of that is something to step into. I don't know if I did it well, they had to keep on pulling me back from a very mid-Atlantic, early 60s talk. They had a dialect coach who was going to help us with that kind of dialect." Pedro further added, "I took to it so well, they had to pull me aside...they were like, 'Uh, talk more like yourself.' I had a hard time doing that because I was so into the era, which for me, was something to step into, as it's different from what we've seen before. What they've created is something we haven't seen." Directed by Matt Shakman, the film also features Vanessa Kirby as Sue Storm, Joseph Quinn as Johnny Storm, Ebon Moss-Bachrach as Ben Grimm, Ralph Ineson as Galactus, and Julia Garner as Silver Surfer.
సినిమా బిజినెస్‌ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వస్తోంది. ఒకప్పుడు థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రమే ఉండేది. స్టార్‌ హీరోలైనా, చిన్న హీరోలైనా థియేటర్ల ద్వారా జరిగే వ్యాపారమే ప్రధానంగా ఉండేది. కానీ, పెరుగుతున్న మాధ్యమాల దృష్ట్యా సినిమాలకు రకరకాలుగా బిజినెస్‌ జరుగుతోంది. కొంతకాలం శాటిలైట్‌ ద్వారా జరిగే బిజినెస్‌ ప్రధానంగా నడిచింది. ఆ తర్వాత డిజిటల్‌ మీడియా కూడా వచ్చి చేరడంతో ఆ రూపంలో కూడా నిర్మాతకు లాభం చేకూరేది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కూడా తోడైంది. దీంతో థియేట్రికల్‌ షేర్‌ కంటే ఓటీటీ ద్వారా అమౌంట్‌పైనే నిర్మాతల దృష్టి పడింది. ఓటీటీని దృష్టిలో ఉంచుకొని ప్రతి సినిమాను భారీ రేంజ్‌లో చేసేందుకు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటీటీలు ఇప్పుడు అంత ఈజీగా సినిమాలను తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. స్టార్‌ హీరో అయినా, ఎంత బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా ఓటీటీ సంస్థలు సినిమాను కొనేందుకు ముందుకు రావడం లేదు. సినిమాను చూసిన తర్వాతే డీల్‌ ఓకే చేసుకునే స్థితికి ఓటీటీ సంస్థలు వచ్చేశాయి.  ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్‌ దశలో ఉండగానే మెగాస్టార్‌ చిరంజీవి, అనిల్‌ రావిపూడి ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అవ్వడం అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. 2023లో చిరంజీవి చేసిన వాల్తేరు వీరయ్య పెద్ద విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన భోళాశంకర్‌ డిజాస్టర్‌ అయింది. దాంతో చిరంజీవి సినిమాకి బిజినెస్‌పరంగా, ఓటీటీ పరంగా సమస్యలు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. చిరంజీవి లేటెస్ట్‌ మూవీ విశ్వంభర ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రిలీజ్‌ ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. చిరంజీవి 157వ సినిమాగా అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన ఓటీటీ డీల్‌ మాత్రం చాలా ఫాస్ట్‌గా క్లోజ్‌ అవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అమెజాన్‌ ప్రైమ్‌ ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను 55 నుంచి 60 కోట్ల మధ్యలో క్లోజ్‌ చేయబోతోందనేది అందుతున్న సమాచారం.  ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న అనిల్‌ రావిపూడి.. చిరంజీవితో చేస్తున్న సినిమాని కూడా సంక్రాంతికే రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా.. షూటింగ్‌ దశలో ఉంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్‌ 22న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తారు. టీజర్‌ కూడా రిలీజ్‌ అవ్వకముందే.. కాంబినేషన్‌ని బట్టి ఓటీటీ డీల్‌ క్లోజ్‌ అవ్వడం అనేది నిజంగా గొప్ప విషయమే. ఈ సినిమాలో వెంకటేష్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. సంగీత దర్శకుడు భీమ్స్‌ తొలిసారి చిరంజీవి సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో రమణ గోగుల పాడిన ‘గోదారి గట్టుమీద..’ సాంగ్‌ సూపర్‌హిట్‌ అవ్వడంతో చిరంజీవి సినిమాలో కూడా అతనితో ఒక పాటను రికార్డ్‌ చేశారు. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఒక రిలేషన్ ఏర్పడటం సులువే  కానీ దానిని కొనసాగించడం మాత్రం   కష్టం. విజయవంతమైన సంబంధంలో ప్రేమ, గౌరవం, నమ్మకం, నిజాయితీ ఉండాలి. మరోవైపు, సందేహం, అవమానం, మోసం, అబద్ధాలు, హింస ఇవన్నీ సంబంధాన్ని చెడగొట్టడానికి కారణం అవుతాయి. కానీ కొంతమందికి అనుమానించే అలవాటు ఉంటుంది. వారు తమ భాగస్వామిని ప్రతి విషయంలోనూ అనుమానిస్తారు. ఇది సంబంధంలో బాధను మిగులుస్తుంది.   అందువల్ల, సంబంధంలో నమ్మకం,  ఒకరి పట్ల ఒకరు గౌరవం  కలిగి ఉండటం చాలా ముఖ్యం. భార్యాభర్తల సంబంధంలో నమ్మకాన్ని,  గౌరవాన్ని  పెంపొందించడంలో మీకు సహాయపడే చిట్కాలు తెలుసుకుంటే.. స్పష్టమైన సంభాషణ.. సంబంధం ప్రారంభంలో, జంటలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కానీ క్రమంగా సంభాషణ తగ్గడం ప్రారంభమవుతుంది. వారు తమ భావాలను వివరించలేరు,  ఇతరుల భావాలను అర్థం చేసుకోలేరు. అటువంటి పరిస్థితిలో ఇద్దరి మధ్య అపార్థాలు తలెత్తడం ప్రారంభమవుతుంది. ఇది అనుమానానికి దారితీస్తుంది. ఇలాంటి  పరిస్థితిలో, ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం. ఒకరి మాటలు,  భావాలను అర్థం చేసుకోవడం,  ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడటం చాలా ముఖ్యం. నమ్మకం.. నమ్మకం అనేది సంబంధానికి పునాది. భార్యాభర్తల  ఇద్దరి మధ్య నమ్మకం లేకపోతే, ఆ సంబంధం బలహీనపడవచ్చు. అటువంటి పరిస్థితిలో ఒకరినొకరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. మనసులో ఏవైనా సందేహాలు ఉంటే మాట్లాడి వాటిని నివృత్తి చేసుకోవాలి.  తద్వారా నమ్మకం పెరుగుతుంది. నాణ్యమైన సమయం.. కొన్నిసార్లు బిజీ జీవనశైలి కారణంగా ఇప్పటి భార్యాభర్తలు  ఒకరికొకరు సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇది సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. ఇది సంబంధంలో అనుమానాన్ని,  అపనమ్మకాన్ని కూడా పెంచుతుంది. అటువంటి పరిస్థితిలో సంబంధానికి సమయం ఇవ్వడం ముఖ్యం.  భాగస్వామితో సమయం గడపాలి.  ఇద్దరూ కలిసి భోజనం  చేయడం, వంట చేయడం,  వారాంతాల్లో బయటకు వెళ్లడం, లేదా ఒకరితో ఒకరు బహిరంగంగా మాట్లాడుకోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సంబంధం బలపడుతుంది.  *రూపశ్రీ.
  వర్షాకాలంలో గాలిలోని చల్లదనం హాయిని,  విశ్రాంతిని కలిగిస్తుంది. అందుకే చాలామందికి వర్షాకాలం అంటే బాగా ఇష్టం ఉంటుంది.  కానీ దీని కారణంగా చాలా సమస్యలు కూడా ఉన్నాయి.  వాటిలో ఒకటి ఇంట్లో పెరుగు సరిగా తోడు కాకపోవడం. చలికాలంలో జరిగేది ఏంటంటే.. పెరుగు తొందరగా తోడు కాకపోవడం ఒకటైతే.. పెరుగు బాగా క్రీమ్ లాగా కాకపోవడం మరొకటి.    కాలాన్ని బట్టి అన్ని మారుతున్నట్టే ఈ ప్రక్రియలో కూడా మార్పు చోటు చేసుకుంటుంది.  అయితే ఈ చలికాలంలో పెరుగు బాగా తోడు కావాలన్నా, క్రీమ్ గా గడ్డ పెరుగు రావాలన్నా ఈ కింది చిట్కాలు గమనించి వాటిని ఫాలో అవ్వాలి. ఉష్ణోగ్రత.. పెరుగు చిక్కగా రావాలంటే పాల ఉష్ణోగ్రత చాలా ముఖ్యం.  కొంతమంది పాలను వేడి చేసి అలా వదిలేసి ఉష్టోగ్రత చెక్ చేయకుండా తోడు పెడుతుంటారు. వాతావరణం కారణంగా పాలు తొందరగా చల్లగా అవుతాయి. అందుకే పాలు గోరువెచ్చగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. పాత్ర.. పెరుగు తోడు పెట్టాలి అనుకునే పాత్ర శుభ్రంగా ఉండాలి.  కొందరు ఏం చేస్తారంటే.. పాలు కాచిన గిన్నెలో అట్లాగే కాసింత పెరుగు వేసేస్తుంటారు. ఇది పెరుగు అదొక రకమైన వాసన,  పెరుగు రుచి మారడానికి కారణం అవుతుంది.  శుభ్రంగా, పొడిగా ఉన్న గిన్నెలో పాలు వేసి అందులో తోడు పెడితే పెరుగు బాగా అవుతుంది. పెరుగు కంటెంటే.. పాలు తోడు పెట్టడానికి పెరుగును జోడించడం మామూలే. అయితే  చలికాలంలో వాతావరణం కారణంగా కేవలం కొద్దిగా పెరుగు వేస్తే అది తోడు కావడం చాలా ఆలస్యం అవుతుంది.  పుల్లగా లేకుండా ఫ్రెష్ గా ఉన్న పెరుగును వినియోగించాలి.  ఒక లీటరు పాలకు ఒకటి నుండి రెండు స్పూన్ల తాజా పెరుగుతో తోడు పెడితే పెరుగు చాలా బాగా తోడవుతుంది. ఒక చిట్కా.. పెరుగును పాలలో ఒక చెంచా మొత్తంలో వేసి అలా మూత పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేస్తే పెరుగు తోడు కావడం లేటవుతుంది. అలా కాకుండా పెరుగును పాలలో వేయగానే పాలు మొత్తం బాగా కలపాలి.  ఇలా చేస్తే పెరుగు చక్కగా సమంగా తయారవుతుంది. ప్రదేశం.. పెరుగు బాగా తోడు కావాలి అంటే ఇంట్లో స్థిరమైన, కాస్త వెచ్చగా ఉన్న ప్రదేశంలో పాల గిన్నెను ఉంచాలి. దీని వల్ల పెరుగు బాగా తోడవుతుంది. చల్లని ప్రదేశంలో ఉంచితే పెరుగు తొందరగా తోడు కాదు.                                     *రూపశ్రీ.  
  పిల్లలు పెరిగేకొద్దీ వారి అవసరాలు, ఆలోచనలు,  అవగాహన కూడా మారుతూ ఉంటాయి. దీనికి తగినట్టు  తల్లిదండ్రులు కూడా తమ పెంపకం విధానాన్ని తదనుగుణంగా మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి వయస్సులోనూ తమ పిల్లలకు సరైన విషయాలను నేర్పించడం తల్లిదండ్రుల బాధ్యత. ఇది ఈరోజు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలు  టీనేజ్‌లోకి ప్రవేశించినప్పుడు వారికి కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పించడం చాలా ముఖ్యం. ఇవి వారి జీవితాంతం వారికి ఉపయోగపడే విషయాలు. కాబట్టి పెరుగుతున్న ఆడపిల్లలు ఉంటే  తప్పనిసరిగా తల్లిదండ్రులు 5 విషయాలను నేర్పించాలని అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే.. నో చెప్పడం.. తల్లిదండ్రులు 12 నుండి 15 సంవత్సరాల వయస్సు ఆడపిల్లలకు  ఏదైనా తమకు నచ్చని,  తమకు నష్టం కలిగించే  విషయానికి మొహమాటం లేకుండా 'కాదు' అని చెప్పడం నేర్పించాలని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.  ఎందుకంటే ప్రతి పరిస్థితిలోనూ 'అవును' అని చెప్పాల్సిన అవసరం లేదు. అది పిల్లలకు ఒక్కోసారి చాలా నష్టం కలిగించే అవకాశం ఉండవచ్చు.  కాబట్టి తల్లిదండ్రులు దీన్ని గుర్తుంచుకోవాలి. సెల్ఫ్ సపోర్ట్.. ఆడపిల్లలు తమను తాము ఎలా సమర్థించుకోవాలో కూడా వారికి నేర్పించాలి.  ఏ విషయంలో అయినా వారు తమ అభిప్రాయాలను ముందుకు తీసుకురావాలి.  ఏదైనా తప్పు జరిగితే  తప్పుకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచాలి. అలాగే ఎప్పుడైనా తాము చెయ్యని తప్పుకు వారిని దోషులను చేయాలని అనుకున్నప్పుడు తమ తప్పు లేదని చెప్పడంలో వారు తమ స్వరాన్ని వినిపించడాన్ని,  తప్పొప్పులను వివరించే సామర్థ్యాన్ని కూడా వారికి నేర్పించాలి.  అది అమ్మాయిలను ధైర్యంగా ఉంచుతుంది. నమ్మకం.. ఎదుటివారు నమ్మకం ఉంచితేనే తాము సరైన వారు అనుకునే వారు చాలామంది ఉంటారు.  ఇందులో ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటారు.  ఏ పని చేసినా ఆడపిల్లలను సులువుగా నిందించే వారు ఉంటారు.   ఎవరూ తమను నమ్మకపోయినా, వారు ఎప్పుడూ తమపై తాము నమ్మకాన్ని కోల్పోకూడదని కూతుళ్లకు చెప్పాలి . ఆత్మవిశ్వాసమే ఆడపిల్లలకు  నిజమైన బలం, అదే వారి సూపర్ పవర్. ఆడపిల్లలకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించడంలో వారి ఆత్మవిశ్వాసం ఎంతగానో సహాయపడుతుంది. సెల్ఫ్ ప్రొటెక్షన్..  ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు ఇవ్వాల్సిన   మొదటి ప్రాధాన్యత భద్రత.  ప్రతి ఆడపిల్ల ఇతరులతో సంబంధం లేకుండా మొదటగా తనను తాను రక్షించుకోవడం ఎలాగో నేర్చుకోవాలి.  ప్రతికూల పరిస్థితుల్లో తనను తాను ఎలా సురక్షితంగా ఉంచుకోవచ్చో నేర్పించాలి.  నేటి సమాజానికి ఇది ఎంతో అవసరం. సెల్ఫ్ లవ్.. ఆడపిల్లలకు సెల్ఫ్ లవ్ గురించి నేర్పించాలి.  ఒక దశ తర్వాత ఆడపిల్లలు తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా కుటుంబ ఒత్తిడులలో,  కుటుంబ బాధ్యతలలో మునిగిపోతారు.  అలాంటి వారికి జీవితంలో తొందరగా విరక్తి వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే తన గురించి తాను కూడా ఆలోచించుకోవాలి.  తనను తాను ప్రేమించుకోవాలి.  తన డ్రెస్సింగ్ స్టైల్,  తన ఆరోగ్యం, తను తీసుకునే ఆహారం, తన ఇష్టాలు, అభిరుచులు.. ఇట్లా అన్ని విషయాలలో ఆడపిల్లలు అవగాహన కలిగి ఉండాలి.  ఇవన్నీ ఆడపిల్లను ఒక శక్తిగా మారుస్తాయి.                               *రూపశ్రీ.
  మధుమేహాన్ని నిర్వహించడానికి  చాలా పద్ధతులను ప్రయత్నిస్తారు. తీపి ఆహారం తగ్గించడం,  చక్కెరకు దూరంగా ఉండటం,  అధిక మద్యపానాన్ని నివారించడం,   ఒత్తిడిని నిర్వహించడం.. ఇలా చాలా విషయాలు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది.  కానీ గుడికి వెళ్లడం ద్వారా షుగర్ నయమవుతుందని మీరు విన్నారా?  గుడికి వెళ్లడం  వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని,  కొన్ని సందర్భాల్లో మధుమేహం పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఇది  నిజమే అని పోషకాహార నిపుణులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇదెలా అనే విషయం తెలుసుకుంటే.. గుడికి వెళ్లడం అంటే ఇంటి నుండి గుడి ఎంతో కొంత దూరంలో ఉంటుంది.  ఇది ఒక చక్కని వాకింగ్ సెషన్ లాంటిది. అంతేకాదు.. గుడికి వెళ్తే అక్కడ మళ్లీ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇంకొక ముఖ్య విషయం ప్రశాంతత.  గుడిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ కొట్టే గంట చుట్టు ప్రక్కల వాతావరణాన్ని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది.  గుడి చుట్టూ ఉండే మొక్కలు, ఇతర  విషయాలు కూడా చాలా పాజిటివ్ గా ఉంచుతాయి. ఇది సహజంగానే మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగానే రోజుకు ఒక 10వేల అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రించవచ్చు. అంతేకాదు.. ప్రీడయాబెటిస్ ను కూడా నయం చేయవచ్చు. ఇలా గుడికి వెళ్తూ కార్బోహేడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మధుమేహం నియంత్రణ.. కొన్నేళ్లు ఇలా చేస్తే మధుమేహాన్ని నయం చేయడం సాధ్యమే.. అంటున్నారు.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  బిపి ని సాధారణంగా  రక్తపోటు అని కూడా పిలుస్తారు.  హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు  గుండెపోటు,  స్ట్రోక్‌లకు కారణమవుతుంది.   వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు,  దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు.  అందుకే దీనిని  సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి.  వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం  గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్,  మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు,  క్రమం తప్పకుండా వ్యాయామం,  వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో  అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం.  ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే  ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు,  మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల  కలయిక ఉండాలి. ఇది  రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో  అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది.   క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది.  బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది.  ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  సీజన్ ను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటు కొన్ని రకాల కూరగాయలను కొత్తగా జత చేసుకోవడం లేదా కొన్ని తినకుండా వదిలిపెట్టడం వంటివి చేస్తారు.  అదే విధంగా వర్షాకాలంలో  5 రకాల కూరగాయలు తినడం మంచిది కాదని, సాధ్యమైతే వీటిని ఈ వర్షాకాలంలో పూర్తీగా వదిలిపెట్టడం మంచిదని అంటున్నారు వైద్యులు,  ఆహార నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో వదిలిపెట్టాల్సిన కూరగాయలు ఏమిటి? వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకుంటే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది క్యాబేజీ తినడం తగ్గిస్తారు. దాని నుండి వచ్చే పురుగులు చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ క్యాబేజీ మాత్రమే కాకుండా పురుగులు ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి.  అవి శుభ్రం చేసిన తర్వాత కూడా అందులో పురుగులు  పూర్తిగా బయటకు రావు.  అందుకే వర్షాకాలంలో  కొన్ని కూరగాయలు అస్సలు తినకూడదని అంటారు. ఆకుకూరలు.. పాలకూర, మెంతికూ,  ఆవాల చెట్టు ఆకులు  .. ఇలా చాలా రకాల ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది.   వాటిని ఎంత బాగా కడిగినా కొన్ని కంటికి కనిపించనంత సన్నని పురుగులు, సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. క్యాబేజీ,  క్యాలిఫ్లవర్.. క్యాబేజీ,  కాలీఫ్లవర్ లలో పొరలు, పువ్వులు ఉంటాయి.  ఈ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా,  ఫంగస్ సులభంగా పెరుగుతాయి. వీటిని తినకపోవడమే మంచిది.  ఒకవేళ వీటిని తినాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో వీటిని బాగా కడగాలి. పుట్టగొడుగు.. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా చాలామంది విటమిన్-డి కోసం అయినా పుట్టగొడుగులను తినాలని అనుకుంటారు. పైగా వర్షాల కారణంగా పుట్టగొడుగులు కూడా బాగా పండుతాయి.  కానీ పుట్టగొడుగులు ఎంత ఆరోగ్యమూ.. వీటిని  సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా కొద్దిగా కలుషితమైనా చాలా చెడ్డ చేస్తుంది. పుట్టగొడుగులు  ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. బంగాళదుంపలు.. ఆహార నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బంగాళాదుంపలు తినకపోవడం మంచిది.  ఎందుకంటే బంగాళదుంపలు  త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి బంగాళాదుంపలను ఇలా తినకూడదు. అయితే, సరిగ్గా నిల్వ చేస్తే బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తవు . వీటిని అయితే తినవచ్చు. జాగ్రత్త.. వర్షాకాలంలో కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా చాలా తాజాగా ఉండాలి.  తాజాగా ఉన్నా సరే.. వీటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి. లేకపోతే వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పురుగులు, రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి.                                        *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..