LATEST NEWS
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉంటూ తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ కేసులోని ప్రధాన నిందితురాలు పవిత్రా గౌడ కోర్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. రేణుకాస్వామి దారుణ హత్య కేసులో ఏ1 (A1) నిందితురాలిగా జైలు జీవితం గడుపుతున్న పవిత్రా గౌడ, విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట తన రోదనను వెళ్లగక్కింది. జైలు గదిలో తాను ఎదుర్కొంటున్న నరకయాతనను వివరిస్తూ ఆమె కన్నీటిపర్యూరాలయ్యారు. తనతో పాటు అదే బ్యారక్‌లో ఉంటున్న కొందరు నైజీరియన్ మహిళా ఖైదీల వల్ల తీవ్రమైన మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్నానని ఆమె వాపోయారు.  రాత్రి సమయాల్లో వారు చేసే అల్లరి, గొడవల కారణంగా తనకు కంటి మీద కునుకు కూడా లేకుండా పోతోందని, వారి ప్రవర్తన చూసి తీవ్ర భయాందోళనకు గురవుతున్నానని తెలిపారు. ఇక్కడ ఒక్క క్షణం కూడా బతకలేనని, తనను వెంటనే వేరే బ్యారక్‌కు మార్చాలని ఆమె కోర్టును వేడుకున్నారు. ఒకవేళ తనను ఆ వేధింపుల నుండి రక్షించలేకపోతే, కనీసం తనకు బెయిల్ అయినా మంజూరు చేయాలని, లేదా ఇక్కడ బతకలేకపోతున్నందున కొద్దిగా విషమైనా ఇప్పించండి తాను చనిపోతానంటూ పవిత్రా గౌడ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి.  రేణుకాస్వామి హత్య కేసులో మొదట్నుంచీ అనేక సంచలన పరిణామాలు చోటుచేసుకుంటుండగా, తాజాగా జైలు నుంచి బయటికి వస్తున్న ఈ వార్తలు టాలీవుడ్ వర్గాలతో పాటు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జైలు అధికారుల అజమాయషీ  అక్కడ నెలకొన్న భద్రతా పరిస్థితులపై కూడా ఈ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నటుడు దర్శన్ తో కలిసి ఈ కేసులో అరెస్టయిన పవిత్రా గౌడ ప్రస్తుతం చట్టపరమైన పోరాటం చేస్తూనే, మరోవైపు జైలు గోడల మధ్య పడుతున్న ఇబ్బందులను ఇలా బయటపెట్టడం అందరినీ ఆలోచింపజేస్తోంది. న్యాయస్థానం ఈ విజ్ఞప్తిపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.      [ Pavithra Gowda, Bengaluru Central Jail, Renukaswamy murder case, Actor Darshan, Nigerian prisoners, jail harassment, Parappana Agrahara Central Jail, Telugu One, Telugu News ]
ఏపీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.  రాష్ట్ర రాజకీయాలలో స్థానిక ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.  ఎన్నికలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదనీ..  ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని  తేల్చిచెప్పారు. మంత్రులు,  పార్టీ కీలక నేతల ఉన్నతస్థాయి భేటీలో నారా లోకేశ్  స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. , క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి   స్థానిక ఎన్నికలు  కీలకమన్న నారా లోకేష్.. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా,  పారదర్శకమైన పాలనను అందిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న కూటమి శ్రేణులు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. కేవలం విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.    [Nara Lokesh, AP local body elections, Panchayat elections,  Andhra Pradesh, TDP alliance clean sweep, AP politics,Telugu One]
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలుగుదేశం గూటికి చేరనున్నారా? జగన్ కు పెట్టని కోట లాంటి కడపలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే.. వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ సునీతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు  నిర్ణయించుకున్నారా? ఈ మేరకు లోకేష్ చేసిన ప్రతిపాదనకు వైఎస్ సునీత ఓకే చెప్పారా? ఈ ప్రశ్నలకు పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.    మంత్రి నారా లోకేష్  స్వయంగా ఈ  ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  వైఎస్ కుటుంబానికి, వైసీపీకి తిరుగులేని పట్టు,  బలం,  ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఆ పార్టీని గట్టి దెబ్బకొట్టాలన్న వ్యూహంతోనే లోకేష్ ఈ ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి పీక్స్ చేరుతున్న తరుణంలో లోకేష్ చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రతిపాదనకు  రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికారికంగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం ఏదీ బయటకు రాకపోయినా.. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం వైఎస్ సునీత సైకిలెక్కి జగన్ కు సవాల్ విసరడం దాదాపు ఖాయమైందనే అంటున్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం తర్వాత వైఎస్ సునీత న్యాయం కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై రాజకీయంగా, న్యాయపరంగా ఆమె చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టవచ్చని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ  భావిస్తున్నాయి.  మరోవైపు, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల ప్రాంతంలో ఇలాంటి పరిణామాలు జరిగితే స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యురాలే ప్రత్యర్థి పార్టీ మద్దతుతో బరిలోకి దిగితే అది రాజకీయంగా జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా సునీత తెలుగుదేశం గూటికి చేరతారా అన్న విషయం ఆమె నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఖరారైనట్లు కాదని పరిశీలకులు అంటున్నారు.  [YS Sunitha, Nara Lokesh, Lingala ZPTC, Kadapa politics, TDP offer, Telugu Desham Party, Kadapa, ZP Chair Person, AP Politics, Telugu One]
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. దేశ రాజధాని వెలుపల తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుక 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని చాటుతూ దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రతిభను ఒకే వేదికపైకి తీసుకువచ్చింది. ఈ కార్యక్రమంలో దేశరాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దిగ్గజ నటులు, దర్శకులు  సాంకేతిక నిపుణులు తమ పురస్కారాలను అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో విశేష సేవలందించినందుకు గాను ప్రముఖ దిగ్గజ నటుడు అనంత నాగ్‌ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుని అందరి ప్రశంసలు పొందారు. ఉత్తమ నటుడిగా సంయుక్తంగా ఇద్దరు దిగ్గజ నటులు ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. 'చందూ ఛాంపియన్' చిత్రంలోని అద్భుతమైన నటనకు గాను కార్తీక్ ఆర్యన్, అలాగే 'భ్రమయుగం' చిత్రంలో విలక్షణ నటనతో మెప్పించిన మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా సంయుక్తంగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా మమ్ముట్టి తన విజయంతో అందరి అభినందనలు అందుకుంటూ స్టేడియంలో స్టాండింగ్ ఒవేషన్ పొందారు. ఇక ఉత్తమ నటి విషయానికి వస్తే, 'ఆర్టికల్ 370' చిత్రంలో అసాధారణ అభినయాన్ని ప్రదర్శించిన యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అలాగే ఇదే చిత్రం ఉత్తమ చలన చిత్రంగా ఆర్టికల్ 370గా నిలవడం విశేషం. దర్శకత్వం  సాంకేతిక విభాగాల్లోనూ పలు చిత్రాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. 'అమరన్' చిత్రానికి గాను రాజ్‌కుమార్ పెరిసామి ఉత్తమ దర్శకుడిగా ఎంపిక కాగా, ఇదే చిత్రానికి గాను జీవీ ప్రకాష్ కుమార్ ఉత్తమ నేపథ్య సంగీతం, ఆర్. కలైవనన్ ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలు సాధించారు. ఇక తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణంగా, టాలీవుడ్ నుంచి 'కల్కి 2898 ఏడీ' చిత్రం ఉత్తమ వినోదాత్మక ప్రజాదరణ పొందిన చిత్రంగా (Best Popular Film Providing Wholesome Entertainment) నిలిచింది. అలాగే 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ చిత్రానికి సంబంధించి పీ రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. అలాగే పిల్లల చిత్రాల విభాగంలో 'చిన్న కథ కాదు' ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. మిగతా విభాగాలకు వస్తే, 'పుష్ప 2' చిత్రం నుంచి సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే, దీపాలి నూర్ మరియు శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో అవార్డులు గెలుచుకున్నారు. అలాగే 'లక్కీ భాస్కర్' చిత్రానికి గాను వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణల రచయితగా నిలిచారు. 'మహారాజా' చిత్రానికి అన్ అరాసు ఉత్తమ యాక్షన్ డైరెక్షన్‌గా, 'భ్రమయుగం' చిత్రానికి షెహనాద్ జలాల్ ఉత్తమ సినిమాటోగ్రఫీగా ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల నుంచి ఎంపికైన ఈ విజేతలందరితో గుజరాత్‌లోని ఏక్తా నగర్ వేదికగా భారతీయ సినీ కళా వైభవం అంబరాన్ని అంటింది.     [ 72nd National Film Awards, Mammootty, Kartik Aaryan, Kalki 2898 AD, Committee Kurrollu, National Film Awards winners,  Telugu One, Telugu News  ]  
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు  పండుగ రోజు. దివంగత ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహావిష్కరణకు తొలిసారి నియోజకవర్గానికి ఆనందంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే, మాజీమంత్రి పరిటాల సునీత అన్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో సునీతమ్మ మాట్లాడుతూ... రాప్తాడు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో చాలామందిని ఇబ్బంది పెట్టారు. కనీసం పెళ్లిళ్లకు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్యకర్తలు బెదరకుండా ధైర్యంతో నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుమేరకు పరిటాల రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు. నాడు అన్న ఎన్టీఆర్ వద్దన్నా మంత్రి పదవి ఇచ్చి ఆదరించారు. చంద్రబాబు పిలుపుమేరకు నేను రాజకీయాల్లోకి వచ్చాను.  ఆనాడు కార్యకర్తలే నా వెన్నంటి నడిపించారు. చంద్రబాబు మూడుసార్లు టిక్కెట్ ఇచ్చి, ఒకసారి మంత్రినిచేసి మా కుటుంబాన్ని ఆదరించారు.  గత ప్రభుత్వంలో నాపై 22, శ్రీరామ్‌పై 34, కార్యకర్తలపై 20కి పైగా కేసులు పెట్టారు. ఆ కేసుల గురించి ఆలోచించాలని లోకేష్‌ను  కోరుతున్నా. రాప్తాడు నియోజకవర్గంలో అన్ని సామాజికవర్గాలు మాకు అండగా నిలబడ్డాయి. ప్రత్యర్థులు చేతిలో ప్రాణాలు కోల్పోయిన తగరకుంట ప్రభాకర్  ఆరుగురి బిడ్డలను చంద్రబాబు చదివించి ప్రయోజకులను చేశారు. పరిటాల రవితోపాటు చనిపోయిన వారి పిల్లలను చదివించారు. వాడుకుని పక్కనపడేసే పార్టీ కాదు తెలుగుదేశం. రాప్తాడు నియోజకవర్గంలో 11మందికి కార్యకర్తల సంక్షేమనిధి అందించారు. యువనేత లోకేష్ కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ యువగళం పాదయాత్ర చేసి స్పూర్తినిచ్చారు.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వెనుక చంద్రబాబు, లోకేష్ రెక్కల కష్టం దాగిఉంది. అందువల్లే రాప్తాడులో దాదాపు 25వేలకు పైగా మెజారిటీ వచ్చింది. ఈ నియోజకవర్గంలో చిన్న సైకోను సాగనంపాలని ప్రజలు,కార్యకర్తలు నిర్ణయించుకొని, ఎన్నికల్లో నెరవేర్చుకున్నారు. రాప్తాడు నియోజకవర్గానికి సాగు, తాగునీరు అందించే రూ.800 కోట్ల అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు అందించినందుకు కృతజ్జతలు. రైతులకు త్వరగా పరిహారం అందించాలని కోరుతున్నా. రాప్తాడు మండలంలో జూనియర్ కాలేజి మంజూరు చేయండి. రామగిరిలో హాస్టల్ భవనం, ఆత్మకూరులో కాలేజి మంజూరు చేయండి. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ బాబు వచ్చాకే స్కూళ్లు బాగుపడ్డాయి. చదువుకునే ప్రతిబిడ్డకు తల్లికి వందనం అందిస్తున్నారు. మీ ఆదేశాల మేరకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని సునీత చెప్పారు.  స్థానిక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించాలి..! హిందూపురం ఎంపి బికె పార్థసారధి మాట్లాడుతూ... దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహావిష్కరణకు యువనేత లోకేష్ రాప్తాడు రావడం ఆనందంగా ఉంది. ఆనాడు పరిటాల రవీంద్ర  దివంగతులయ్యాక వచ్చిన ఎన్నికల్లో పార్టీ కేడర్ వెన్నుచూపకుండా 15వేల మెజారిటీతో పార్టీని గెలిపించారు. 2019లో అధికారం కోల్పోయాక బెదిరించారు. రామగిరి పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశాం. ఎక్కడా భయపడలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిన్నచిన్న విభేదాలను పక్కనబెట్టి ఏకపక్షంగా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలి. 2019-24లో అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు గారు హంద్రీనీవాను 3వేలకోట్లతో విస్తరించి కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. యువనేత లోకేష్ యువగళంలో ఇచ్చిన 20లక్షల ఉద్యోగాల హామీమేరకు పరిశ్రమలు పెద్దఎత్తున ఎపికి వస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటాం. మరో 20ఏళ్లు తెలుగుదేశం అధికారంలో ఉండాలని అన్నారు.  స్థానిక ఎన్నికల్లో ఇదే ఉత్సాహాన్ని కొనసాగించండి :శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ... మీ అందరి సహకారంతో లోకల్ బాడీలో అద్భుత విజయాన్ని సాధించబోతున్నాం.  పార్టీ కార్యకర్తలంతా గ్రామాల్లోకి వెళ్లి ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలి. యువగళం రథసారధి లోకేష్‌కు ఘనస్వాగతం పలికిన పార్టీ కేడర్‌కు  అభినందనలు తెలిపారు.  పార్లమెంటు పార్టీ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు మాట్లాడుతూ... కార్యకర్తల సంక్షేమం ధ్యేయం మొట్టమొదటిసారిగా కార్యకర్తల సంక్షేమనిధిని ఏర్పాటుచేసిన నాయకుడు లోకేష్. గత చీకటి పాలనను ఎదురొడ్డి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రప్రజలకు అండగా నిలబడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ దుర్మార్గాలకు చరమగీతం పాడారు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధి, మరోవైపు కార్యకర్తల సంక్షేమం కోసం శ్రమిస్తున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తున్న భవిష్యత్ నాయకుడు లోకేష్ అని కొనియాడారు.        [ Nara Lokesh, Paritala Sunitha, Rapthadu, TDP, Telugu Desam Party, Chandrababu Naidu, Paritala Ravindra, Paritala Sriram, BK Parthasarathi, TDP Cadre, Rapthadu TDP, Local Body Elections, Youth Gala, Upper Pennar Project, Telugu One, Telugu News  ]  
ALSO ON TELUGUONE N E W S
Vasundhara Devi, wife of actor and MLA Nandamuri Balakrishna, participated in the Srivari Salakatla Brahmotsavams at Tirumala on Wednesday. On this occasion, SVBC Chairman B. Sridhar Varma, along with his family members, met Smt. Vasundhara Devi and received her blessings. She congratulated Sridhar Varma on being elected as the SVBC Chairman. Sridhar Varma also enquired about the well-being of her family and wished that the blessings of Lord Venkateswara would always be with her family. Vasundhara Devi expressed her happiness over meeting Sri Sridhar Varma and his family members. Additional EO Sri Venkaiah Chowdary, Muddada Ravichandra, JEO Sri Sharath, Chief Vigilance and Security Officer (CVSO) Muralikrishna, Tirupati SP Subbarayudu, TTD Board Member Bhanu Prakash, other Board members and officials also participated in the programme. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో ఎన్నో కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చాయి. కానీ కౌబాయ్ సినిమాల విషయానికి వస్తే మాత్రం ముందుగా గుర్తొచ్చే పేరు సూపర్‌స్టార్ కృష్ణ. అప్పట్లో తెలుగు సినిమా అంటే పౌరాణికాలు, జానపదాలు, ఫ్యామిలీ డ్రామాలే ఎక్కువగా ఉండేవి. అలాంటి సమయంలో ఏకంగా వెస్ట్రన్ స్టైల్‌లో కౌబాయ్‌గా కనిపించి ఆడియన్స్‌ను మెప్పించారు కృష్ణ. ఆ సినిమా మరేదో కాదు.. ‘మోసగాళ్లకు మోసగాడు’. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1971 ఆగస్టు 27న విడుదలైంది. టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి కౌబాయ్ సినిమాగా ఈ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజస్థాన్ ఎడారులు, గుర్రాలు, తుపాకులు, ట్రెజర్ హంట్.. అప్పటివరకు తెలుగు తెరపై కనిపించని విజువల్స్‌తో ఈ సినిమా కొత్త అనుభూతిని ఇచ్చింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత కౌబాయ్ కథలపై టాలీవుడ్‌లో ఆసక్తి పెరిగింది. కృష్ణ కూడా ఆ తర్వాత ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని సినిమాలు చేశారు. దీంతో తెలుగు ప్రేక్షకుల మదిలో కౌబాయ్ అంటే కృష్ణ అనే ఇమేజ్ బలపడింది. కౌబాయ్ జానర్‌ను తర్వాతి తరాల నటులు కూడా టచ్ చేశారు. కౌబాయ్ జానర్‌ను భారీ స్థాయిలో చూపించిన సినిమాల్లో ‘కొదమ సింహం’ ఒకటి. కె. మురళీ మోహన్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రఫ్ అండ్ టఫ్ కౌబాయ్ పాత్రలో కనిపించారు. గన్స్, గుర్రాలు, విభిన్న ప్రపంచంతో సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 1990లో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఇందులో మోహన్ బాబు పోషించిన విలన్ రోల్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ.. అసలు ఈ కాకుల కథేంటి.? సూపర్‌స్టార్ కృష్ణ తర్వాత ఆయన వారసుడు మహేష్ బాబు కూడా కౌబాయ్ అవతార్‌లో కనిపించడం విశేషం. జయంత్ సి. పరంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్కరి దొంగ’ 2002 జనవరి 12న విడుదలైంది. అమెరికాలోని లొకేషన్స్‌లో షూట్ చేసిన ఈ సినిమా స్టైలిష్ వెస్ట్రన్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కింది.  ముఖ్యంగా మహేష్ బాబు కౌబాయ్ గెటప్, గుర్రపు స్వారీ, గన్‌ఫైట్స్ అప్పట్లో ప్రత్యేకంగా నిలిచాయి. సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. మహేష్ కెరీర్‌లో మాత్రం ఇది ఒక డిఫరెంట్ జానర్ మూవీగా మిగిలిపోయింది.  ఇలా చూస్తే.. కృష్ణతో మొదలైన తెలుగు కౌబాయ్ సినిమాల ప్రయాణం.. చిరంజీవి ‘కొదమ సింహం’ వరకు భారీ స్థాయికి వెళ్లింది. ఆ తర్వాత మహేష్ బాబు ‘టక్కరి దొంగ’తో మరోసారి ఈ జానర్‌ను టచ్ చేశారు. అయితే కౌబాయ్ పాత్ర అంటే ఇప్పటికీ ముందుగా గుర్తొచ్చే పేరు మాత్రం కృష్ణదే. 1971లో ‘మోసగాళ్లకు మోసగాడు’తో కృష్ణ సెట్ చేసిన ఆ ట్రెండ్.. ఐదు దశాబ్దాలు దాటినా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగానే నిలిచిపోయింది. మీకు నచ్చవచ్చు: సింహాద్రి 175 డేస్ రికార్డు.. ఎవరూ టచ్ చేయలేని రికార్డు సృష్టించిన ఎన్టీఆర్.! మోహన్ బాబు విలనిజం.. మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.!       [Tollywood Cowboy Movies, Mosagallaku Mosagadu, Kodama Simham, Takkari Donga, Super Star Krishna, Chiranjeevi, Mohan Babu, Mahesh Babu, Telugu Film News]  
సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌బాబు ‘రుద్ర’ అనే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమా కథ, షూటింగ్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా మహేష్‌బాబు లుక్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ‘వారణాసి’లోని కొన్ని కీలక సన్నివేశాల్లో మహేష్‌బాబు ఏకంగా 24 ఏళ్ల యువకుడిగా కనిపించనున్నట్లు సమాచారం. అయితే సాధారణంగా హీరోలను చిన్న వయసు పాత్రల్లో చూపించేందుకు ప్రస్తుతం ఏఐ, డీ-ఏజింగ్ టెక్నాలజీ, వీఎఫ్‌ఎక్స్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో టెక్నాలజీపై ఆధారపడకుండా సహజమైన మేకోవర్‌తోనే మహేష్‌బాబుకు యంగ్ లుక్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: చిరంజీవి చెయ్యాల్సిన ‘బాషా’.. కేవలం 15 లక్షల వల్ల రజినీకాంత్ దగ్గరకు వెళ్లింది.! దీని కోసం మహేష్‌బాబు ఫిట్‌నెస్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్, మేకప్, మొత్తం లుక్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. దీంతో ఈ సన్నివేశాల్లో మహేష్‌బాబు తన కెరీర్ ప్రారంభ దశను గుర్తు చేసేలా కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా ‘మురారి’, ‘ఒక్కడు’ వంటి సినిమాల నాటి మహేష్‌బాబు లుక్‌ను అభిమానులకు గుర్తుచేసే విధంగా ఈ మేకోవర్ ఉండనుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘వారణాసి’ సాధారణ కథతో తెరకెక్కుతున్న సినిమా కాదని ఇప్పటికే రాజమౌళి వెల్లడించిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కథనం వేర్వేరు ప్రాంతాలు, కాలాలను దాటుకుంటూ సాగుతుందని సమాచారం. సినిమాలో మహేష్‌బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు మహేష్‌బాబు ఈ సినిమా కోసం శారీరకంగా కూడా ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. పాత్రకు తగ్గట్టుగా మార్షల్ ఆర్ట్స్‌తో పాటు తన నడక, పరుగులోనూ మార్పులు చేసుకునేందుకు శిక్షణ తీసుకున్నట్లు గతంలో వెల్లడైంది. ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం. 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  మీకు నచ్చవచ్చు: కృష్ణ పని అయిపోయిందనుకున్నారు. కానీ, చిరంజీవి, నాగార్జునకు షాక్ ఇచ్చిన సూపర్‌స్టార్.! మోహన్ బాబు విలనిజం: మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.!       [Mahesh Babu Varanasi, Mahesh Babu 24 Years Look, Varanasi Movie, SS Rajamouli Varanasi, Mahesh Babu Makeover, Mahesh Babu Young Look, Priyanka Chopra Varanasi, Prithviraj Sukumaran, Varanasi Movie Update, Mahesh Babu Rajamouli Movie]
Nani has been creating huge records with his upcoming biggie, The Paradise. The movie is releasing in few hours with early premieres and it is set to release wide tomorrow. Srikanth Odela has created a huge sensation with braids look of Nani, calling him, Jadal. He revealed the cute inspiration for the look.  He wrote, "Jadal's birth and battle might be fictional...but his braids & look were inspired from my childhood... A lot of the scenes in the film are influenced by my childhood as i grew up... Amma used to grow and tie Jadal until i turned 5 or 6 years... and as i grew older i always imagined how a hero would look on 70MM with braids in a commercial cinema... and cut to present, presenting my Hero Nani Anna with Jadal. This picture is not just my childhood. This picture is my Paradise. Welcoming you all to #TheParadise in a few hours."  Srikanth revealed that his love for his mother has been inspiration for his mother sentiment based story in The Paradise. He further stated that while he imagined the look for a long time, he is happy that his dream has come true with Nani accepting and carrying it like a new symbol of mass action hero.  Anirudh Ravichander songs have created huge hype for the film with Aaya Sher and Yasha Nagula songs. Sudhakar Cherukuri is producing the film with Mohan Babu, Raghav Juyal in prominent roles. Kayadu Lohar is playing leading lady with Keerthy Suresh in a special number.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఒకప్పుడు విలనిజం అంటే మోహన్ బాబు పేరు కూడా గుర్తొచ్చేది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో తనదైన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీతో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత మరోసారి పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అదే.. ‘ది ప్యారడైజ్’. నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ బాబు ‘శికంజా మాలిక్’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను మేకర్స్ ఇప్పటికే రివీల్ చేశారు. చూస్తుంటే ఇది చాలా క్రూరమైన విలన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబుకు విలన్ పాత్రలు కొత్తేమీ కాదు. కెరీర్ ప్రారంభంలోనే ‘స్వర్గం నరకం’ సినిమాతో నెగెటివ్ పాత్రలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఆ తర్వాత శివరంజని, కొదమ సింహం, వారసుడొచ్చాడు, కూలీ నెం.1, సర్దార్ పాపారాయుడు, కొండవీటి దొంగ వంటి సినిమాల్లో విభిన్నమైన విలన్ పాత్రలు చేశారు. విలనిజంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యులేషన్, బాడీ లాంగ్వేజ్ అప్పట్లో నెగెటివ్ క్యారెక్టర్లకు మంచి ఇంపాక్ట్ ఇచ్చేవి. ఆ తర్వాత హీరోగా కూడా ఎన్నో విజయాలు అందుకున్నప్పటికీ.. విలన్‌గా మోహన్ బాబు చేసిన కొన్ని పాత్రలు మాత్రం ఇప్పటికీ గుర్తుండిపోయాయి. అలాంటి మోహన్ బాబును మళ్లీ పూర్తి స్థాయి బ్రూటల్ నెగెటివ్ రోల్‌లో చూడబోతుండటంతో ‘ది ప్యారడైజ్’పై ఆసక్తి పెరుగుతోంది. నిజానికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఈ పాత్ర కోసం మోహన్ బాబు అయితేనే కరెక్ట్ అని మొదటి నుంచే భావించారట. కథ చెప్పినప్పుడు మోహన్ బాబు కూడా ఈ పాత్రపై చాలా ఆసక్తి చూపించారని నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ.. అసలు ఈ కాకుల కథేంటి.? అంతేకాదు.. మోహన్ బాబు పాత్ర చాలా ఇంటెన్స్‌గా ఉంటుందని, ఆయన విశ్వరూపం సినిమాలో కనిపిస్తుందని శ్రీకాంత్ ఓదెల గతంలో చెప్పడం మరింత ఆసక్తిని పెంచింది. ఇక ‘ది ప్యారడైజ్’ మోహన్ బాబుకు మరో విధంగా కూడా ప్రత్యేకమే. కెరీర్‌లో ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న తర్వాత ఆయన చేస్తున్న ఈ తరహా భారీ నెగెటివ్ పాత్ర కావడంతో.. మరోసారి తన పాత విలనిజం ఎలా ఉంటుందో చూపించే అవకాశం దక్కింది. మరి ఒకప్పుడు విలన్‌గా తనదైన ముద్ర వేసిన మోహన్ బాబు.. ఇప్పుడు ‘శికంజా మాలిక్’గా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.  మీకు నచ్చవచ్చు: 'ప్యార‌డైజ్' సినిమా చూశాక నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారు.! ఉత్తరాల ఊర్వశి ప్రేమలేఖ ప్రేయసి సాంగ్.. 33 ఏళ్ళయినా అదే మ్యాజిక్.!       [The Paradise Movie, Mohan Babu Villain Role, Shikanja Maalik, Natural Star Nani, Srikanth Odela, Mohan Babu Movies, Telugu Film News, Telugu News]  
Ram Charan has delivered his career best performance with Rangasthalam and ever since, his fans have been eagerly waiting for his next collaboration with Sukumar. After making Pushpa 1 and Pushpa 2 kind of huge blockbusters, the director has been busy with scripting works for this film.  With Peddi taking up two years, Charan needed to concentrate on his health, recover from rigrous training and hand surgery. So, there had been no news about the movie going on floors. Now, the rumor mills state that the makers have locked 20th October to conduct official pooja and complete last leg of pre-production.  From December, they will start shooting and by next December, that is, 2027 Sukumar has planned to complete filming and most of post production works. If everything goes by plan, he wants to release the movie exactly, during tenth year anniversary of Rangasthalam, in March 2028, say sources.  Mythri Movie Makers are producing the film and they are in no hurry or rush to push Sukumar to complete the pre-production works. Already, they have Prabhas Fauzi and NTR Dragon works going on. This time, Sukumar doesn't want to repeat Pushpa 2 style last minute rush and complete in time like Rangasthalam. For now, it is reported that Shashwat Sachdev will compose music for the film and it is to be seen if Sukumar changes his mind and continues to work with Devi Sri Prasad.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి బాజాలు మోగేందుకు వేళయైంది. 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్', 'హైవే' వంటి మైలురాయిలాంటి ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ దిగ్గజ దర్శకుడు, ఇప్పుడు తన నిజ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలని  ఆస్వాదిస్తున్నాడు . ఆయన కుమార్తె 'ఇదా అలీ' త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన సుదీర్ఘకాల ప్రేమికుడు క్రిష్ అగర్వాల్‌తో ఇదా అలీకి ఇటీవల నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ శుభవార్తని  స్వయంగా ఇంతియాజ్ అలీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో ఈ జంట ఫొటోలు వైరల్‌గా మారాయి. "మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలు మా కొత్త జంటపై ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ కాబోయే వధూవరుల అందమైన నిశ్చితార్థ చిత్రాన్ని షేర్ చేస్తూ ఇంతియాజ్ అలీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ నిశ్చితార్థ వేడుకలో ఇదా అలీ బేబీ పింక్ కలర్ డిజైనర్ చీరలో దేవకన్యలా మెరిసిపోగా, క్రిష్ అగర్వాల్ నలుపు రంగు రాయల్ షేర్వాణీలో ఎంతో హుందాగా కనిపించారు. ఒకరికొకరు ఎంగేజ్‌మెంట్ రింగ్స్ తొడిగే సమయాన వారి ముఖాల్లో కనిపించిన ఆనందం అందరినీ ఆకట్టుకుంది. ఈ నిశ్చితార్థ ప్రయాణం ఎంతో ఫిల్మీగా, రోమాంటిక్‌గా సాగడం విశేషం. ఈ ఏడాది జూలై 1వ తేదీన నార్వేలోని మంచుతో కప్పబడిన వైట్రెస్సాండ్ (Ytresand) అందమైన బీచ్ పరిసరాల్లో క్రిష్ అగర్వాల్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు డ్రీమీ ప్రపోజల్ చేశారు. ఆ తర్వాత జూలై 12న ఇదా ఈ ప్రపోజల్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా దానికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అంతకంటే ముందే, ఇదాకు ప్రపోజ్ చేయడానికి ప్రణాళిక వేసుకున్న క్రిష్, స్వయంగా ఇంతియాజ్ అలీని కలసి తన మనసులోని మాట చెప్పి పెద్దల అనుమతి తీసుకోవడం దర్శకుడికి ఎంతో నచ్చింది. ఒక తండ్రిగా ఇది తన జీవితంలోనే అతిపెద్ద సంతోషకరమైన ఘట్టమని ఇంతియాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.       ఇది కూడా చదవండి: చరణ్, సుకుమార్ మూవీ పూజా కార్యక్రమం డేట్ వచ్చేసింది: ఆ డేట్ స్పెషల్ ఇదే   కార్పొరేట్ ఫైనాన్స్ మరియు సినీ సృజనాత్మక రంగాల అరుదైన కలయికగా ఈ జంట నిలిచింది. 24 ఏళ్ల క్రిష్ అగర్వాల్ ఫైనాన్స్ రంగానికి చెందిన ప్రొఫెషనల్ కాగా, క్వాంటిటేటివ్ రీసెర్చర్‌గా స్థిరపడ్డారు. మరోవైపు ఇదా అలీ తండ్రి బాటలోనే సినీ పరిశ్రమలో తన ముద్ర వేస్తోంది. కేవలం 17 ఏళ్ల పిన్న వయస్సులోనే 'లిఫ్ట్' అనే షార్ట్ ఫిలిం తీసి తన ప్రతిభను చాటుకున్న ఇదా, ఆ తర్వాత అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న చాప్‌మన్ యూనివర్సిటీ డాడ్జ్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఆర్ట్స్ నుంచి డైరెక్షన్‌లో పట్టా పుచ్చుకుంది. ఆ తర్వాత ఆమె 'మాయ', 'ఉల్జే హుయే' వంటి ప్రాజెక్ట్‌లకు రచయిత్రిగా, దర్శకురాలిగా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా, ఇటీవల రూ. 70 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా 99 కోట్ల వసూళ్లను రాబట్టిన ఇంతియాజ్ అలీ చిత్రం 'మై వాపస్ ఆవుంగా' సాధించిన విజయంతో కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. సినీ ప్రియులు, నెటిజన్లు, బాలీవుడ్ ప్రముఖులు ఈ నూతన జంటకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.     Imtiaz Ali Daughter Ida Ali Engaged, Imtiaz Ali, Bollywood engagement updates, Telugu Cinema, TeluguCinema News, Tollywood, Tollywood News
సూపర్‌స్టార్ రజినీకాంత్ కెరీర్‌లో ‘బాషా’కు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1995లో విడుదలైన ఈ సినిమా రజినీకాంత్‌ను మాస్ హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ సినిమా ముందుగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించే ఆలోచన జరిగిందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా ‘బాషా’ కథకు, చిరంజీవి నటించిన ‘బిగ్ బాస్’కు సంబంధించి అప్పట్లో ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు పలు కథనాలు పేర్కొంటున్నాయి. 1994లో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘బిగ్ బాస్’ సినిమా ప్రారంభమైంది. ‘గ్యాంగ్ లీడర్’ వంటి హిట్ తర్వాత చిరంజీవి–విజయ బాపినీడు కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో చెన్నైలో రజినీకాంత్ నటిస్తున్న ‘బాషా’ షూటింగ్ కూడా జరుగుతోంది. ఆ సమయంలో ‘బిగ్ బాస్’, ‘బాషా’ కథల్లో కొన్ని అంశాలు దగ్గరగా ఉన్నాయనే చర్చ మొదలైనట్లు కథనాలు చెబుతున్నాయి. దీంతో ‘బాషా’ దర్శకుడు సురేష్ కృష్ణ.. చిరంజీవిని కలిసి సినిమా కథను వివరించారట. కథ నచ్చడంతో చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన చేసినట్లు సమాచారం. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ‘బాషా’ తెలుగు రీమేక్ హక్కుల కోసం నిర్మాతలు రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు అప్పటి విషయాలను ప్రస్తావిస్తూ వచ్చిన కథనాలు చెబుతున్నాయి. అయితే అల్లు అరవింద్ రూ.25 లక్షలకు రైట్స్ తీసుకోవాలని బేరం చేసినట్లు తెలుస్తోంది. అంటే ఇరువర్గాల మధ్య రూ.15 లక్షల తేడా ఏర్పడింది. ఈ విషయంలో ఒప్పందం కుదరకపోవడంతో రీమేక్ ప్రయత్నం ముందుకు సాగలేదు.  మరోవైపు రజినీకాంత్ నటించిన ‘బాషా’ 1995 జనవరి 12న తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. రజినీకాంత్ కెరీర్‌లోనే అత్యంత గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అనంతరం ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి విడుదల చేయగా ఇక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. ‘బాషా’ను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచన కేవలం చిరంజీవి దగ్గరే ఆగిపోలేదు. రజినీకాంత్ సైతం చిరంజీవితో ఈ సినిమా చేయాలని కోరుకున్నట్లు దర్శకుడు సురేష్ కృష్ణ చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూను ఉటంకిస్తూ కథనాలు వెలువడ్డాయి. అయితే అప్పట్లో చిరంజీవి ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం కూడా ఈ రీమేక్ విషయంలో ఒక కారణంగా చెప్పబడింది. చివరికి ‘బాషా’ రజినీకాంత్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అయితే చిరంజీవి అదే కథను తెలుగులో చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదనే ప్రశ్న మాత్రం ఇప్పటికీ అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తూనే ఉంది. చిరంజీవి మాస్ ఇమేజ్, రజినీకాంత్ కోసం రూపొందిన ‘బాషా’ కథ.. ఈ రెండూ కలిస్తే తెరపై ఎలా కనిపించేవో ఊహించుకోవడం సినీ అభిమానులకు ఆసక్తికరమైన ‘వాట్ ఇఫ్’గానే మిగిలిపోయింది.       [Chiranjeevi, Rajinikanth, Baasha, Baasha Telugu Remake, Chiranjeevi Baasha, Rajinikanth Baasha, Chiranjeevi Big Boss, Big Boss Movie, Suresh Krissna, Allu Aravind, Baasha Remake Rights, Chiranjeevi Missed Baasha, Tollywood, Telugu Cinema, Rajinikanth Movies]
  'పెద్ది'తో తన కట్ అవుట్ రేంజ్ పెంచుకున్న రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీని సుకుమార్ తో చేస్తున్న విషయం తెలిసిందే. మామూలుగానే ఇద్దరి కాంబో అంటేనే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అలాంటిది రంగస్థలం కూడా ఆ ఇద్దరి కాంబోలో వచ్చి విజయం సాధించడంతో ఇక ఏ స్థాయి అంచనాలు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు.   'RC17'గా పిలువబడుతున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం ఖరారైంది.   అక్టోబర్ 20న విజయదశమి దసరా శుభ ముహూర్తాన  పూజా కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతోంది. ఈ మేరకు మేకర్స్ నే అధికారంగా ప్రకటించారు. ఇక రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్ నెల నుంచి పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఈ గ్రాండ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ని  పాన్ ఇండియా బ్యానర్  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తోంది.      ఇది కూడా చదవండి:  ది ప్యారడైజ్ థియేటర్స్ లో తెలంగాణ కమ్మటి సర్వపిండి: మైత్రి థియేటర్స్ లో వినూత్న ప్రయోగం  అయితే సుకుమార్ ఐకాన్ మూవీ పుష్ప సిరీస్ లా ఆర్ సి 17 కూడా రెండు పార్టులుగా ఉంటుందనే రూమర్లకు తెర దించుతూ కేవలం ఒకే భాగంలో రానుందని మేకర్స్ స్పష్టం చేశారు. చరణ్‌ని మునుపెన్నడూ చూడని ఒక అర్బన్, అల్ట్రా-స్టైలిష్ సిటీ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త అవతారంలో సుకుమార్  ప్రెజెంట్ చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. దాదాపు 300 కోట్ల రూపాయల నుంచి 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా.   [Rc17 Pooja Ceremony Date, Ram  Charan, Sukumar,  RC17 Pooja Ceremony,  Mythri Movie Makers, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]  
ఒకప్పుడు న్యాచురల్ స్టార్ నాని అంటే పక్కింటి అబ్బాయి తరహా పాత్రలు, క్లాస్ ఎంటర్టైనింగ్ మూవీస్ గుర్తుకొచ్చేవి. కానీ, 'దసరా' నుంచి రూట్ మార్చి తనలోని మాస్ అండ్ వయలెంట్ యాంగిల్ ను చూపిస్తున్నాడు. గత చిత్రం 'హిట్-3'లో నెక్స్ట్ లెవెల్ వయలెంట్ చూపించిన నాని, ఇప్పుడు 'ప్యారడైజ్'తో అంతకుమించిన విధ్వంసానికి రెడీ అయ్యాడు.  'దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబో రిపీట్ కావడంతో 'ప్యారడైజ్'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో ప్రీమియర్స్ పడబోతున్న ఈ టైమ్ లో, అసలు ఈ సినిమాలో ఏముంది? సెన్సార్ సభ్యులను సైతం భయపెట్టిన ఆ ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్ కథేంటి? మోహన్ బాబు చేసిన ఆ భయానకమైన విలన్ రోల్ ఏ రేంజ్‌లో ఉండబోతోంది? పూర్తి ఇంటర్నల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మొదటగా ఈ సినిమాకి వచ్చిన సెన్సార్ టాక్ చూస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతుంది. సినిమాలో ఉన్న కంటెంట్ యొక్క తీవ్రత దృష్ట్యా సెన్సార్ బోర్డు 'A' సర్టిఫికేట్ ఇచ్చేసింది. ఇటీవల తెలుగు సినిమాల్లో రక్తపాతం, నరికివేతలు చాలా సహజమైపోయినా, ఈ సినిమాలో చూపించిన రా అండ్ రియలిస్టిక్ యాక్షన్ ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయబోతోందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ 'ప్యారడైజ్' కథ వెనుక ఉన్న అసలైన నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. దీనిని ఒక సాధారణ కమర్షియల్ మాస్ సినిమాగా చూస్తే పొరపాటే. ఇందులో 'జడల్' అనే విభిన్న పాత్రలో నాని కనిపిస్తున్నారు. పుట్టిన క్షణం నుంచే సామాజిక వివక్షకు గురై, తల్లి కడుపు నుంచి బయటపడగానే అనగదొక్కబడిన ఒక సామాన్యుడి ఆక్రోశం ఇది. అణచివేతకు గురైన ఒక సమూహానికి, ఒక నియంతృత్వ శక్తకి మధ్య జరిగే సుదీర్ఘ పోరాటమే 'ది ప్యారడైజ్'. కోకిల మీద కాకులు జరిపే తిరుగుబాటుగా దర్శకుడు ఈ అంశాన్ని సింబాలిక్‌గా చెప్పాడు. తమిళ చిత్రాల్లో తరచూ చూసే ఆత్మగౌరవ పోరాటాలు, వర్గ-కుల విప్లవ అంశాలను తెలుగు తెరపై ఒక భారీ కమర్షియల్ కాన్వాస్ మీద శ్రీకాంత్ ఒడెల ప్రెజెంట్ చేయబోతున్నారనేది ప్రధాన టాక్. ఇది కూడా చదవండి: ప్యారడైజ్ ఉచకోత.. కలలో కూడా ఊహించని ఓపెనింగ్స్.! నాని తనకి తాను దిష్టి తీసుకునే క్రమంలో శరీరం అంతా రక్తసిక్తం కావడం లాంటి గ్లింప్స్ దృశ్యాలే చెప్తున్నాయి, ఇది ఎంత రా అండ్ రగ్గడ్‌గా ఉండబోతోందో. అణచివేతకు గురైన ఒక సమూహం కోసం, తన నేల కోసం, ఆత్మగౌరవం కోసం ఒక వ్యక్తి చేసే రివోల్ట్ ఈ కథ. ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఈ సినిమాలో ఎంత క్రూరమైన క్యారెక్టర్ చేశారంటే.. ఇటీవల ఒక ఈవెంట్లో మాట్లాడుతూ "ఈ సినిమా చూశాక నన్ను చూసి మీరంతా భయపడతారు" అని స్వయంగా ఆయనే చెప్పారు. పాతకాలపు రఫ్‌నెస్, ఇప్పటి పాన్ ఇండియా బ్రూటాలిటీ కలిపితే మోహన్ బాబు క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. యాక్షన్ సీన్స్, నాని, మోహన్ బాబు పాత్రలు, మదర్ సెంటిమెంట్, అద్భుతమైన ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్ అంతా కలిసి ఒక కల్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. మరి ఈ వయలెంట్ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. మీకు నచ్చవచ్చు: 'ప్యార‌డైజ్' సినిమా చూశాక నా దగ్గరకు రావడానికి కూడా భయపడతారు.! 'ప్రాణం ఖరీదు' సీక్రెట్స్.. చిరంజీవి ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.?       The Paradise Movie First Review, The Paradise Movie Review, Nani Paradise Review, Paradise First Review, The Paradise Movie, Nani Paradise Movie, Telugu Movie Review, Telugu Film News, Telugu News  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన ఆర్థిక ప్లానింగ్ .! ఒక స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది అత్యంత మధురమైన, భావోద్వేగపూరితమైన అనుభూతి. ఇంటికి చిన్నారి రాకతో కుటుంబంలో సంతోషాలు పదింతలు అవుతాయి. అయితే ఈ కొత్త ప్రయాణం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, అనేక బాధ్యతలను కూడా తీసుకొస్తుంది. బిడ్డ ఆరోగ్య సంరక్షణ, సరైన పెంపకం, నాణ్యమైన విద్య, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడం వంటివన్నీ తల్లిదండ్రుల ముందు నిలిచే ప్రధాన బాధ్యతలు. ఈ క్రమంలో ముఖ్యంగా కొత్తగా తల్లి అయినవారు లేదా తల్లి కాబోతున్నవారు సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. సమయానికి తీసుకునే సరైన  నిర్ణయాలు పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తాయి. ప్రతి కొత్త తల్లి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్.. ఆర్థిక ప్రణాళికలో వేసే మొదటి అడుగు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించడం కష్టం. వైద్య అత్యవసర పరిస్థితులు వచ్చినా లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు ఎదురైనా కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితి రాదు.  దీంతోపాటు తల్లి, బిడ్డ ఇద్దరికీ తగిన ఆరోగ్య బీమా రక్షణ ఉండటం చాలా కీలకం. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ ఉంటే, అందులో కొత్తగా పుట్టిన బిడ్డ పేరును వీలైనంత త్వరగా చేర్పించడం మర్చిపోకూడదు. పొదుపు అలవాటు , పెట్టుబడులు.. సాధారణంగా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేసే అలవాటు ఉంటే, తల్లి అయిన తర్వాత దానిని వెంటనే మార్చుకోవాలి. ఆదాయంలో కనీసం పాతిక శాతాన్ని పొదుపు చేయడం ఉత్తమమైన పద్ధతి. ఈ పొదుపు కేవలం బ్యాంకు ఖాతాలో ఉంచడమే కాకుండా, మంచి అవగాహనతో సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల చక్రవడ్డీ   లభిస్తుంది. కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి రాబడి రావడానికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఈ అలవాటు ఎంతగానో తోడ్పడుతుంది. ఖర్చుల నిర్వహణ , బడ్జెట్.. పాప లేదా బాబు పుట్టిన తర్వాత ఇంట్లో ఖర్చులు అనుకోకుండా పెరుగుతాయి. అందుకే ప్రతినెలా వచ్చే ఆదాయం, జరిగే ఖర్చులను ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు దుస్తులు, బొమ్మలు లేదా ఇతర అనవసర విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంటే వాటిని గుర్తించి తగ్గించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ కేటాయించుకుని అనవసరమైన ఖర్చులను అరికడితే, ఆ డబ్బు పొదుపుగా మారి భవిష్యత్తులో బిడ్డ అవసరాలకు ఉపయోగపడుతుంది. చిన్న చిన్న టార్గెట్స్.. భవిష్యత్తు అవసరాలను ఒకేసారి పెద్ద భారంగా భావించకుండా ఉండటానికి ఆర్థిక ప్రణాళికను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు పిల్లలను స్కూల్ లో చేర్పించడం, సంవత్సరానికి సరిపడా  వైద్య ఖర్చులు, ప్రతి సంవత్సరం చేయాల్సిన పొదుపు వంటి వాటికి వేర్వేరుగా చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రణాళిక స్పష్టంగా ఉంటుంది, మనం ఎంతవరకు చేరుకున్నామో సులభంగా అర్థమవుతుంది. పెద్ద ఖర్చులను చిన్న భాగాలుగా విభజించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ఆలోచించడం.. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, పొదుపు చేయడం, పిల్లల చదువుల ఖర్చులు వంటి ప్రతి విషయంపై జీవిత భాగస్వామితో కలిసి చర్చించాలి. దీనివల్ల ఇద్దరికీ కుటుంబ బాధ్యతలపై స్పష్టత వస్తుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది. ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే కుటుంబానికి బలమైన ఆర్థిక పునాది ఏర్పడి, బిడ్డ భవిష్యత్తుకు పూర్తి భద్రత లభిస్తుంది.                       *రూపశ్రీ.
నిద్ర పట్టడం లేదా బెడ్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! రోజంతా అలసిపోయినా రాత్రి పడుకున్న తర్వాత సరిగ్గా నిద్ర పట్టడం లేదా? తరచూ నిద్ర మధ్యలో మెలకువ రావడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. నిద్రలేమి వల్ల మరుసటి రోజు అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మంచి నిద్ర కోసం మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, నిద్రించే సమయం మాత్రమే కాకుండా పడకగదిలోని వాతావరణం కూడా ముఖ్యమని వాస్తు నిపుణుడు దంతూరి పండరినాథ్ గారు వివరిస్తున్నారు. ముఖ్యంగా బెడ్‌పై లేదా పడక దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదు?అవి నిద్రకు ఎలా ఆటంకం కలిగిస్తాయి? నిద్రలేమికి కారణమయ్యే అంశాలు ఏమిటి? మంచి నిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. నిద్ర సరిగా పట్టకపోవడం, తరచూ నిద్రకు ఆటంకం కలగడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ వీడియోలోని సూచనలను తెలుసుకోండి. అలాగే నిద్ర సమస్యలు నిరంతరం కొనసాగితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం కూడా ముఖ్యం. మంచి నిద్ర కోసం బెడ్‌పై ఉంచకూడని వస్తువులు, నిద్రలేమికి కారణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు  తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) మొదటి వరుసలో ఉంటుంది. వేపుడు, కుర్మా, ఫ్రైస్ లేదా సమోసాలు.. వంటకం ఏదైనా సరే ఆలూ ఉంటే ఆ రుచే వేరు. అయితే ఇల్లాళ్లకు, వంట ప్రియులకు నిత్యం ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టగానే అవి కొద్ది నిమిషాల్లోనే నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. అలా రంగు మారిన దుంపలను చూస్తే వంట చేయాలనే ఉత్సాహం తగ్గడమే కాకుండా, అవి పాడైపోయాయేమోననే అనుమానం కూడా వస్తుంది. సాధారణంగా ఉదయం పూట ఆఫీసులకు, పిల్లల స్కూల్ బాక్సులకు త్వరగా వంట పూర్తి చేయాలని ముందుగానే ఆలూ ముక్కలను కోసి పెట్టుకునే వారికి ఈ సమస్య మరింత చిరాకు కలిగిస్తుంది. అసలు బంగాళాదుంప ముక్కలు అంత వేగంగా ఎందుకు నల్లగా మారతాయి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మరియు అలా మారకుండా ఎల్లప్పుడూ తెల్లగా, ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడే కిచెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు నల్లగా మారడానికి ప్రధాన కారణం  ఎంజైమాటిక్ బ్రౌనింగ్  (Enzymatic Browning) అనే సహజమైన రసాయన చర్య. బంగాళాదుంపల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ (Polyphenol Oxidase) అనే ప్రత్యేకమైన ఎంజైమ్‌తో పాటు ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మనం దుంపను చాకుతో కోసినప్పుడు, దానిలోని కణాలు దెబ్బతిని లోపలి భాగం నేరుగా గాలిలోని ఆక్సిజన్‌తో స్పర్శలోకి వస్తుంది. ఈ ఆక్సిజన్, ఎంజైమ్‌లతో చర్య జరపడం వల్ల మెలనిన్ (Melanin) అనే నల్లటి వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. ఇదే ఆలూ ముక్కలు రంగు మారడానికి అసలు కారణం. ఈ మార్పు వల్ల రుచిలో పెద్దగా తేడా రాకపోయినా, చూడటానికి అస్సలు బాగుండవు. పైగా ఇలా గాలికి ఎక్కువసేపు ఉంచడం వల్ల అందులోని కొన్ని నీటిలో కరిగే పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మన వంటింట్లోనే దొరికే కొన్ని సులువైన పదార్థాలతో అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి  చల్లని నీటి చిట్కా . బంగాళాదుంపలను కోసిన వెంటనే గాలి తగలకుండా ఐస్ వాటర్ లేదా చల్లని నీళ్లు ఉన్న గిన్నెలో మునిగేలా వేయాలి. నీరు ఆక్సిజన్‌కు, ఆలూ ముక్కలకు మధ్య ఒక కవచంలా పనిచేసి ఆక్సీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది. నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల ముక్కలలో ఉండే అదనపు స్టార్చ్ బయటకు వచ్చి, ఫ్రైస్ చేసినప్పుడు అవి మరింత క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఎక్కువ సమయం అంటే 4 నుంచి 5 గంటల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, ఆ నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం లేదా కొద్దిగా తెల్ల వెనిగర్ (White Vinegar) కలపాలి. నిమ్మరసంలోని విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) మరియు వెనిగర్‌లోని అసిడిటీ ఎంజైమ్‌ల పనితీరును పూర్తిగా నిరోధించి ముక్కలు గంటల తరబడి తెల్లగా మెరిసేలా చేస్తాయి. మరొక అద్భుతమైన మార్గం  ఉప్పు నీటి శుద్ధి . ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి అందులో కోసిన బంగాళాదుంప ముక్కలను వేసి ఉంచడం వల్ల అవి రంగు మారవు. ఉప్పు నీరు ఎంజైమాటిక్ చర్యను మందగించేలా చేస్తుంది. అలాగే, వంటను మరుసటి రోజుకి ప్లాన్ చేసుకుంటుంటే, ముక్కలను నీటిలో వేసి గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 24 గంటల పాటు అవి ఏమాత్రం రంగు మారకుండా తాజాగా ఉంటాయి. ఒకవేళ మీరు ముక్కలను నీటిలో వేయకూడదు అనుకుంటే, వాటిపై కొద్దిగా వంటనూనె (Cooking Oil) రాసి గాలి తగలకుండా ఉంచవచ్చు. ఈ చిన్న చిన్న కిచెన్ హాక్స్ పాటించడం వల్ల వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, బంగాళాదుంపలతో చేసే ప్రతి వంటకం ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా మారుతుంది.     [ Potatoes, Potato Browning, Enzymatic Browning, Polyphenol Oxidase, Potato Storage, Kitchen Hacks, Prevent Potato Browning, Cold Water Soak, Lemon Juice, White Vinegar ]
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో  ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు  చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. వెలగపండులో   ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే  టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి  విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం.. కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ .. డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి. మహిళల ఆరోగ్యానికి.. మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు.  వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది.                   *రూపశ్రీ.  
రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో  పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు,  ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే.. మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు   రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి. ఈ  అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను  మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల  ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు  కాపాడుకోవచ్చు.                     *రూపశ్రీ.
క్రియాటినిన్ అంటే ఏమిటి? మన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో Creatinine Test, Creatinine Levels, Kidney Functionగురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ Dr. Sree Bhushan Raju, MD, Nephrology వివరంగా తెలియజేస్తున్నారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు, రిపోర్టులో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు.  క్రియాటినిన్ స్థాయి పెరగడానికి కిడ్నీ సమస్యలతో పాటు డీహైడ్రేషన్, కండరాలకు సంబంధించిన సమస్యలు, అధిక శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఒకసారి క్రియాటినిన్ ఎక్కువగా వచ్చిందని మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అని భావించకూడదు. అవసరమైన ఇతర పరీక్షలతో పాటు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యం, క్రియాటినిన్ స్థాయిలు, కిడ్నీ ఫిల్టరింగ్ సామర్థ్యం, గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)