LATEST NEWS
  ఇంగ్లాండ్‌తో బర్మింగ్‌హామ్‌లో  జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (269 ; 387 బంతుల్లో 30 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో టీమిండియా పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఓవర్‌ నైట్ స్కోరు 41తో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (89; 137 బంతుల్లో 10 ఫోర్లు) సెంచరీ చేసే అవకాశం చేజార్చుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (42; 103 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్ 2, జోష్ టంగ్ 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
  అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.   అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించారు న్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయకుడు తో కలసి డి.ఐ.జి కోయ ప్రవీణ్ విలేకరుల సమావేశంలో  మాట్లాడారు. గత నెల 30న తమిళనాడు పోలీసులు పలు బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను అమలు చేశారన్నారు.  ఈ నిందితులు 1999 నుండి పరారీలో ఉండగా, వారు గత 20 సం. గా రాయచోటి పట్టణంలో తప్పుడు పేర్లతో (అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో) నివసిస్తున్నారన్నారు.  విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్  ఆదేశాల మేరకు, అన్నమయ్య జిల్లా పోలీసులు తక్షణమే స్పందించి, రాయచోటిలోని కొత్తపల్లి మరియు మహబూబ్ బాషా వీధిలో ఉన్న నిందితుల ఇళ్లను చట్టపరమైన విధానాల ప్రకారం శోధించారని ఆయన తెలిపారు.  ఈ గృహ శోధనలో భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు లభించాయన్నారు., వీటిని ఉపయోగించి పేలుడు పరికరాలు (ఐఇడియస్ ) తయారు చేయవచ్చు అన్నారు. ఈ పదార్థాలు భారతదేశ పౌరుల ప్రాణాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే స్థాయిలో ఉన్నాయన్నారు. ఈ శోధనతో దేశ స్థాయిలో ప్రమాదం నివారించబడిందన్నారు. అబూ బకర్ సిద్ధిక్ @ అమానుల్లా మరియు మహమ్మద్ అలీ  మంసూర్ అనే ఉగ్రవాదుల కార్యకలాపాలకు సంబంధించి ఈ సామగ్రిని పోలీస్ బృందం స్వాధీనం చేసుకుందన్నారు.వీరు "అల్ ఉమ్మా" అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగిన వారిగా గుర్తించబడ్డారన్నారు. నిందితుల భార్యలు మహిళ పోలీసుల పై దాడికి యత్నం.    ఈ ఇంటి శోధన సందర్భంగా, నిందితుల భార్యలు అయిన సైరా భాను (అబూ బకర్ సిద్ధిక్ భార్య) మరియు షేక్ షమీం (మహమ్మద్ అలీ భార్యలు) పోలీసులపై ప్రతిఘటన చేయడమే  కాకుండా మహిళా పోలీసులపై దాడికి యత్నించారన్నారు.   సైరా భాను మరియు షమీం లను శోధనకు అడ్డుపడినందుకు మరియు మహిళా పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కి పంపామన్నారు. వీరికి నిందితుల ఉగ్రచర్యలపై ఎంత సంబంధముందో అనే దానిపై దర్యాప్తు కొనసాగుతుందని డి.ఐ.జి పేర్కొన్నారు. పోలీసుల నిరంతర శ్రమతో ఇంటిని శోధించి పై విస్ఫోటక సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని డి.ఐ.జి వివరించారు.  ఈ ఘటనపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు  చేసినట్లు డి.ఐ.జి తెలిపారు. ఈ కేసులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగించే ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ఎగ్మోర్ ఘటన రోజు అనేక ఇతర బాంబులు కూడా వివిధ ప్రాంతాలలో (చెన్నై, త్రిచ్చి, కోయంబత్తూరు) పగులగొట్టబడ్డాయి. 1999లో కోచిన్-కుర్లా ఎక్స్‌ప్రెస్‌లో ఈ నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలించబోతుండగా, ఆ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. అవి కాసర్‌గోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారన్నారు.. ఈ ఇద్దరు నిందితులు గత 20 సంవత్సరాలుగా రాయచోటి పట్టణంలో తప్పుడు గుర్తింపులతో నివసిస్తూ, స్థానికంగా వివాహాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారన్నారు. ఇంకా ఇతర సహచర నిందితుల వివరాలు గుర్తించే పనిలో ఉన్నామన్నారు.  మరిన్ని వివరాలు తర్వాత అడ్వైజరీలో తెలియజేయబడతాయని డి.ఐ.జి తెలిపారు.
  అన్నమయ్య జిల్లా  రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీనీ ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద దొరికిన సుట్ కేసు బాంబు బకెట్ బాంబులను  రాయచోటి కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు పేల్చేశారు.  తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో  అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.  వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు.  అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించామన్నారు.  
  ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. తొలి టెస్టులో సెంచురీ చేసిన గిల్. రెండో టెస్టులో డబుల్ సెంచురీ ,అది కూడా ఆట ముగిసే సమయానికి నాట్ అవుట్ గా ఉన్నాడు. ఇప్పటికే  ఎన్నో రికార్డులను మోత మోగించాడు. ఇంగ్లండ్ లో ఒక కెప్టెన్ గా 179 పరుగుల హయ్యస్ట్ స్కోర్ రికార్డు అజర్ పేరిట ఉండేది. 1990 ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఈ రికార్డు నమోదు చేశాడు అజర్. ఇపుడా రికార్డు క్రాస్ చేశాడు గిల్. అంతేనా విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై డబుల్ బాదిన రెండో కెప్టెన్ కూడా గిల్లే. SENA దేశాల్లో శతకం చేసిన ఆరో ఏషియన్ కెప్టెన్ గానూ నిలిచాడు. టెస్టుల్లో డబుల్ చేసిన ఆరో కెప్టెన్ గా మరో రికార్డు సృష్టించాడు. 2003 తర్వాత ఇంగ్లండ్ పై ద్విశతం చేసిన తొలి విదేశీ ఆటగాడు కూడా గిల్లే. మొత్తం మీద ఇంగ్లండ్ బౌలర్లను తన దైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ తో ఒక ఊపు ఊపేస్తున్నాడు కెప్టెన్ గిల్. త్రిశతం(300) కూడా బాదేసి సెహ్వాగ్ పేరిట ఉన్న టెస్ట్ హయ్యస్ట్ ఇండియన్ ప్లేయర్ రికార్డు కూడా తిరగరాసే అవకాశం ఉంది.
  ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో ఖర్గే పాల్గొననున్నారు. రేపు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనం, బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు తరలిరావాలని సక్సెస్​చేయాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నేరుగా మండల అధ్యక్షులతో మాట్లాడున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  సినీ పరిశ్రమలో అవకాశాలు ఇచ్చే వారి కంటే.. అవకాశాల పేరుతో మోసాలు చేసే వారే ఎక్కువ. ముఖ్యంగా హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ పేరుతో హీరోయిన్లను సంప్రదిస్తున్న ఓ వ్యక్తి బాగోతం వెలుగులోకి వచ్చింది.   టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యు.వి. క్రియేషన్స్ ఒకటి. ప్రస్తుతం చిరంజీవితో 'విశ్వంభర' అనే భారీ సినిమా చేస్తోంది. అలాంటి యు.వి. క్రియేషన్స్.. తాజాగా హీరోయిన్లను జాగ్రత్తగా ఉండమని చెబుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.   "ఒక వ్యక్తి యు.వి. క్రియేషన్స్ కి చెందిన వాడినని చెబుతూ హీరోయిన్లను సంప్రదిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అతనితో మాకు ఎటువంటి సంబంధం లేదు. మా సినిమాల నటీనటుల ఎంపికకు సంబంధించి ఏదైనా ఉంటే మేము అధికారికంగా ప్రకటిస్తాం. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మా సంస్థ పేరుని ఉపయోగించుకోవడాన్ని మేముగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై తగు చర్యలు తీసుకుంటాం." అంటూ యు.వి. క్రియేషన్స్ తమ ప్రకటనలో పేర్కొంది.   'విశ్వంభర'లో ఒక ప్రత్యేక గీతం చిత్రీకరించాల్సి ఉంది. మరి ఆ సాంగ్ పేరుతో ఎవరైనా హీరోయిన్లను సంప్రదిస్తున్నారా? లేక ఏదైనా కొత్త సినిమా చేస్తున్నామని చెప్పి యూవీ పేరుని వాడుకుంటున్నారా? అనేది తెలియాల్సి ఉంది.    
Deepika Padukone has become the first Indian Woman actress to get a star in Hollywood Walk of Fame. The Walk of Fame road runs 1.3 miles or 2.1 kms from east to west Hollywood Boulevard, from Gower Street to the Hollywood and La Brea Gateway at La Brea Avenue. Popular actors of Hollywood, who made a mark, get a star here.  Once selected to have a star, actors or their sponsors will have to pay US$85,000, which will be used to install and maintain the star. Hollywood Chamber of Commerce makes this announcement annually and Deepika Padukone's star will be installed along with Demi Moore, Rachel McAdams, Emily Blunt, Timothe Chalamet, Rami Malek, and Stanley Tucci. Sabu, was the first Indian Actor from classic Hollywood times, that is, in 1930's and 40's , to have gotten this honor of Walk of Fame. Well, Deepika Padukone's star will be an inspiration for Indian actors to achieve such huge honor and it will always be a mark of excellence and extent of global reach Indian Cinema, has.  At the same time, more than 10 Million tourists go to visit Walk of Fame, annually, who will get to know about Indian Cinema and the actors with such a recognition. Having said that several Indian film lovers are wondering if Shah Rukh Khan, Rajinikanth, Kamal Haasan kind of stars should have been given this honor before her.  While this can be seen as a start, Deepika did appear in Hollywood film, opposite Vin Diesel, XXX and that works in her favor to have been selected for this honor before others. It would be a timeless honor for Indian Cinema, nevertheless, to see one of the big stars being honored, globally.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  సినీ పరిశ్రమకు పైరసీ అనేది శాపం లాంటిది. ఓ వైపు ఓటీటీల పుణ్యమా అని థియేటర్లలో సినిమాలు చూసే వారి సంఖ్య తగ్గిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. పైరసీ అనేది అంతకు మించి ఎన్నో రెట్ల ప్రభావాన్ని చూపుతుంది. సినిమా విడుదలైన రోజే హెచ్డీ క్వాలిటీ ప్రింట్ లు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. దాంతో కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం పడి.. నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారు. ముఖ్యంగా కేవలం ఓ వ్యక్తి కారణంగానే ఏకంగా రూ.3000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.   పైరసీ కేసులో ఇటీవల కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిరణ్ 2019 నుంచి ఇప్పటివరకు 65 కి పైగా సినిమాలను పైరసీ చేసినట్లు తెలుస్తోంది. అలా పైరసీ చేసిన సినిమాలను పలు సైట్లకు అమ్మాడట. ఒక్కో సినిమాకి రూ.80 వేల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీ లెక్కల ప్రకారం ఈ మొత్తం సినిమాల విలువ మూడు వేల కోట్లకు పైగా ఉంటుంది అంటున్నారు. ఇటీవల సింగిల్ మూవీని కూడా పైరసీ చేయగా.. యాంటీ పైరసీ సెల్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్ట్ చేశారు.  
The fans gearing up to witness Reed Richards and company in a retro-futuristic 1960s MCU timeline, it’s exciting to see how their powers have evolved for this new cinematic journey. Here’s a breakdown of what to expect. Pedro Pascal as Reed Richards (Mr Fantastic) The leader of the Fantastic Four, Reed Richards retains his signature ability to stretch and reshape his body. But this version introduces a twist: Reed doesn’t just bend like rubber, he manipulates space itself, allowing for near-limitless elasticity. Combined with his superhuman intellect, he remains one of the MCU's most formidable scientific minds. His stretching is portrayed with a quantum shimmer, emphasizing spatial manipulation over cartoonish stretching.   Vanessa Kirby as Sue Storm (Invisible Woman) Often underestimated, Sue Storm emerges as the tactical and emotional anchor of the team. She can render herself and others invisible, but her true strength lies in generating psionic force fields that are powerful enough to block attacks from missiles to interdimensional energy. In this iteration, Sue is portrayed not as a secondary character, but as the strongest among them.   Joseph Quinn as Johnny Storm (Human Torch) Johnny Storm, the team's resident hothead, returns with enhanced pyrokinesis. He not only lights up in flames and flies at sonic speeds but now can absorb and redirect massive explosions, using them for propulsion or as weapons. His control over fire is now portrayed as almost elemental. His ability to survive and manipulate cosmic-level heat makes him a threat in battles beyond Earth.   Ebon Moss-Bachrach as Ben Grimm (The Thing) Ben Grimm is the emotional core of the team. Even though he is encased in rock, he is deeply human inside. This version sticks to tradition, portraying him with immense physical strength and near-invulnerability. He’s the first to charge into battle, but the last to give up on his humanity. The film gives greater attention to Ben’s internal struggle, emphasizing pathos alongside power.   Franklin Richards Teased but not confirmed, trailers have hinted at the birth of Sue and Reed’s son, Franklin Richards — a character known in the comics for reality-warping abilities that rival the likes of Kang and Scarlet Witch. While he may not play a major role in First Steps, his presence sets up future cosmic-level arcs.   The Fantastic Four: First Steps hits the Indian theatres on July 25, 2025 in English, Hindi, Tamil and Telugu. 
మూడున్నర దశాబ్దాలపై నుంచే పాన్ ఇండియా స్టార్ గా తన సత్తా చాటుతూ వస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth). ఆగస్టు 14 న 'కూలీ'(Coolie)అనే  హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరో స్టార్ హీరో 'అక్కినేని నాగార్జున'(Akkineni Nagarjuna)విలన్ గా చేస్తుండటం, ఖైదీ, విక్రమ్, మాస్టర్,లియో చిత్రాల ఫేమ్' లోకేష్ కనగరాజ్'(Lokesh Kanagaraj)దర్శకత్వం వహించడంతో 'కూలీ' పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.  బిజినెస్ విషయంలో  కూలీ సరికొత్త రికార్డులని నెలకొల్పుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ, తెలుగు భాషలకి సంబంధించి రజని కెరీర్ లోనే కనివిని ఎరుగని రేటుకి అమ్మినట్టుగా తెలుస్తుంది. రీసెంట్ గా కూలీ ఓవర్సీస్ లో  80 కోట్లకి పైగానే  బిజినెస్ జరుపుకుందనే టాక్ వినిపిస్తుంది. ఓవర్ సీస్ లో  అంత భారీ రేటుకి బిజినెస్ జరిగిన ఫస్ట్ తమిళ  మూవీ 'కూలీ' నే అనే మాటలు వినపడుతున్నాయి.   బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్(Amirkhan)గెస్ట్ రోల్ లో కనిపించనున్న ఈ మూవీలో శృతి హాసన్(Shruthi Haasan)ఉపేంద్ర, సౌభిన్ షాహిర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ హీరోయిన్ 'పూజాహెగ్డే 'ప్రత్యేక గీతంలో అలరించబోతుంది. సన్ పిక్చర్స్ 'కూలీ' ని భారీ వ్యయంతో నిర్మిస్తుండగా అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్ గా 'చికుటు' అనే లిరిక్ తో కూడిన సాంగ్ రిలీజ్ అయ్యి రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది.    
  తెలుగునాట తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. తన కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించారు పవర్ స్టార్. అలాంటి పవన్.. ఒక విషయంలో మాత్రం వెనకబడిపోయారు. తన తోటి స్టార్స్ అంతా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరారు. ఈ ఫీట్ ని అందరికంటే ముందు సాధించగల సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా సాధించలేదు. దానికి కారణం ఆయన గత దశాబ్ద కాలంగా రాజకీయాలతో బిజీగా ఉండటమనే చెప్పవచ్చు.    గత పదేళ్లలో పవన్ నుంచి తక్కువ సినిమాలు వచ్చాయి. అవి కూడా రీమేక్ సినిమాలో లేదంటే తక్కువ టైంలో పూర్తయ్యే సినిమాలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ స్టార్డంకి తగ్గ సినిమాలు పెద్దగా రాలేదు. ఇవి చాలదు అన్నట్లు.. టికెట్ ధరలు తక్కువ కారణంగా 'భీమ్లా నాయక్' వంటి సినిమాలు వంద కోట్ల షేర్ కి అడుగు దూరంలో ఆగిపోయాయి. ఇప్పుడు 'హరి హర వీరమల్లు'కి అలాంటి అడ్డంకులేమీ లేవు. 100 కోట్లు కాదు.. ఏకంగా 200 కోట్ల షేర్ కూడా సాధించే అవకాశముంది.   చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ భారీ సినిమా 'హరి హర వీరమల్లు' రూపంలో వస్తుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా.. పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ ఎట్టకేలకు జూలై 24న విడుదలవుతోంది. సినిమా బాగా ఆలస్యమవ్వడంతో అవుట్ పుట్ ఎలా ఉంటుందోనన్న అనుమానం అందరిలో ఉండేది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్.. ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. వీరమల్లు ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. ట్రైలర్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే.. ఈ సినిమా రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ టాక్ వస్తే పవన్ ఇమేజ్ కి ఆ స్థాయి వసూళ్లు రావడం పెద్ద కష్టం కాదు. పవన్ కి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. పైగా చారిత్రక నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో సనాతన ధర్మం గురించి ప్రస్తావన ఉంది. హిట్ టాక్ వస్తే.. వీరమల్లు మూవీ నేషనల్ వైడ్ గా వసూళ్ల వర్షం కురిపిస్తుంది అనడంలో సందేహం లేదు.  
మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)కి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. 'స్టూడెంట్ నెంబర్ 1 'నుంచి మొన్న వచ్చిన 'దేవర' వరకు ఆ క్రేజ్ సినిమా సినిమాకి పెరుగుతునే ఉంది. బాక్స్ ఆఫీస్ వద్ద  ఆయా చిత్రాలు సాధిస్తున్న కలెక్షన్స్ నే అందుకు ఉదాహరణ. గత ఏడాది దేవర(Devara)తో 500 కోట్ల రూపాయిల మార్క్ ని అందుకున్నాడు.  ఇక ఎన్టీఆర్ దేవర తర్వాత బాలీవుడ్ లో తెరకెక్కిన  'వార్ 2'(War 2)తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరో 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మూవీ అయినప్పటికీ, అభిమానులు మాత్రం ఎన్టీఆర్ నుంచి తెలుగులో వస్తున్న సోలో  మూవీగానే భావిస్తున్నారు. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఎన్టీఆర్ హీరోగా, హృతిక్ రోషన్ విలన్ గా చేస్తునట్టుగా అర్ధమవుతుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సినిమాగానే వార్ 2 రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పట్నుంచే ఏపి, తెలంగాణాలో స్పెషల్ షో ప్రదర్శించడం కోసం థియేటర్ యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.   దీన్ని బట్టి ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. వార్ 2 లో కియారా అద్వానీ(Kaira Adwani)హీరోయిన్ గా చేస్తుండగా హిందీ చిత్ర రంగంలో పేరు మోసిన నటులు పలు కీలక పాత్రల్లో చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శత్వంలో యష్ రాజ్ ఫిలింస్  పతాకంపై ఆదిత్య చోప్రా భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. ఆగస్ట్ 14న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కి రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ డేట్ పై  త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  
Ramayana is one of the legendary tales of India that many actors from the beginning of cinematic era have tried to bring it to life on big screens. Recently, Prabhas tried retelling with Adipurush and now, Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita, Sunny Deol as Hanuman and Yash as Ravana, are bringing Ramayana.  Namit Malhotra, owner of Prime Focus Studios with Yash is producing the film on a never-seen-before scale. The movie glimpse has been released today and many people have started comparison with Adipurush as Ramayana team have also cut same chocolate cake in a Blue Screen Studio post shoot wrap.  So, even we cannot escape from such a comparison. The look of Ranbir Kapoor as Lord Rama is pitch perfect to Valmiki description in comparison with Prabhas look in Adipurush. Yash as Ravana looked more intense than Saif Ali Khan. Also, the VFX background looked more realistic than Adipurush in the glimpse.  Musically, Ajay-Atul have composed best tracks for the album while Hans Zimmer and AR Rahman for the glimpse scored pulsating score. The visual grandness and differences in vision are visible between Om Raut's version and Dangal director Nitesh Tiwari's version. The first bout goes to Ramayana team.  The movie will be releasing in two parts - first Part on Diwali 2026 and second part for Diwali 2027. We have to see how the rest of the characters looks and performances will be designed by the makers. Namit Malhotra's Ramayana has 8-time Oscar winning VFX Studio DNEG at work as well.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Power Star Pawan Kalyan is one of the biggest stars of Indian Cinema, mainly hailing from Telugu Language. From a long time, his huge fictional historical drama, Hari Hara Veera Mallu, has been in production and finally, the movie is releasing on 24th July. The movie team released theatrical trailer, today.  The trailer has been released after a huge screening in various screens across the state. While huge number of fans attended the screenings, the response is lukewarm upon watching it. The movie has huge visual canvas and it looked magnificient as far as production design, but VFX looks a tad bit underdone.  Visually, the datedness is visible in few frames and makers might need to work on it. Fans of the actor are happy looking at his atheletic stunts and presentation. His blood filled hands and face, shots that promote his screen presence have been praised yet it did not create the similar euphoria like a PSPK film, normally does.  OG teaser just shook the internet with just his presentation while HHVM lacks in the same. Jyothi Krisna and Krish have directed the film with MM Keeravaani composing music. Niddhi Agerwal is playing the leading lady role with Bobby Deol as antagonist in Aurangazeb role.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu). జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వంలో ఏఎం రత్నం,దయాకర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు నుంచి ట్రైలర్  రిలీజ్ అయ్యింది. సుమారు రెండు నిమిషాల నలభై నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ట్రైలర్ ఇప్పుడు పవన్ ఫాన్స్ తో పాటు ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. వీరమల్లు పై అంచనాల్ని కూడా పెంచిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఏఎం రత్నం(Am rathnam)మాట్లాడుతు కళ్యాణ్ గారిపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫుల్ యాక్షన్ ఉండేలా ఆయనమీదే చిత్రీకరించిన మొదటి సినిమా వీరమల్లు. ఖుషి సినిమా తర్వాత కళ్యాణ్ తో  పాన్ ఇండియా సినిమా చెయ్యాలని అనుకున్నాను. ఇప్పుడు వీరమల్లుతో పాన్ ఇండియా చిత్రం కుదిరింది. కళ్యాణ్ గారు ఈ ట్రైలర్ ని ఏడూ సార్లు చూసారు. రేపు సినిమా రిలీజ్ అయ్యాక చరిత్రని కూడా వీరమల్లు గుర్తు చేస్తుంది. మీరు ఇంతవరకు ఓజి, ఓజి అని అరిచారు. అలాంటిది ట్రైలర్ రిలీజ్ అయ్యాక వీరమల్లు అని అంటారు. అందరు సెలబ్రేట్ చేసుకునే సినిమా వీరమల్లు. ఈ సినిమాతో పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ రియల్ స్టార్ గా మారతాడు. అంతలా వీరమల్లు లో అత్యద్భుతంగా నటించాడని ఏఎంరత్నం చెప్పుకొచ్చాడు జులై 24 న రిలీజ్ కాబోతున్న వీరమల్లులో పవన్ తో నిధి అగర్వాల్(Nidhhi Agerwal)జత కట్టగా బాబీడియోల్, నర్గిస్ ఫక్రి, నోరా ఫతేహి, సునీల్, నాజర్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతాన్ని అందించాడు. .ఏఎం రత్నం, పవన్ కాంబోలో ఇప్పటికే వచ్చిన ఖుషి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరకి తెలిసిందే.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే అదృష్టం అంటారు.  మనీ ప్లాంట్ ఎంత బాగా పెరిగితే ఇంట్లో ధనం అంతగా పెరుగుతుందని నమ్మకం.  అయితే కొన్ని ఇళ్లలో మనీ ప్లాంట్ అస్సలు సరిగ్గా పెరగదు.  వర్షాకాలంలో అయినా, సాధారణ రోజులలో అయినా మనీ ప్లాంట్ పెరుగుదల విషయంలో గందరగోళ పడే వారు ఉంటారు. అలాంటి వారి కోసం అద్భుతమైన చిట్కా ఉంది.  మనీ ప్లాంట్ బాగా,  గుబురుగా పెరగాలన్నా,  వేగంగా పెరగాలన్నా ఇంట్లోనే ఉన్న 5 పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది.  ఇంతకీ ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే.. మనీ ప్లాంట్ కోసం ఎరువు.. మనీ ప్లాంట్ బాగా పెరగాలంటే ఇంట్లోనే దీనికి మంచి పోషకం కలిగిన ఎరువును తయారు చేసుకోవాలి. దీనికోసం ఇంట్లోనే లభించే 5 పదార్థాలు చక్కగా పనిచేస్తాయి. కావలసిన పదార్థాలు.. టీ ఆకులు లేదా టీ పౌడర్ పసుపు బెల్లం బంగాళదుంప తొక్కలు ఆవాలు తయారు చేసే విధానం.. ముందుగా టీ తయారు చేసిన తరువాత మిగిలిపోయే టీ పౌడర్ ను పడేయకూడదు.  ఈ టీ పౌడర్ ను మళ్లీ ఎండబెట్టాలి. వంటింట్లో బంగాళదుంపలను వినియోగించినప్పుడు తొక్కలు తీస్తుంటారు.  ఈ తొక్కలను కూడా ఎండబెట్టాలి.   టీ పౌడర్, బంగాళదుంప తొక్కలు బాగా ఎండిన తరువాత వీటిని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.  ఈ టీ పౌడర్ లో కాసింత చిన్న బెల్లం ముక్క వేయాలి.  దీంతో పాటు ఆవాలు,  పసుపు కూడా వేసి బాగా గ్రైండ్ చేయాలి.  ఇలా తయారైన పొడిని మనీ ప్లాంట్ మొదట్లో కాసింత ఎరువులాగా వేసి నీరు పోయాలి. ఇలా 10 లేదా 15 రోజులకు ఒకసారి వేస్తూ ఉంటే మనీ ప్లాంట్ చాలా వేగంగా, బాగా పెరుగుతుంది.  కేవలం మనీ ప్లాంట్ కు మాత్రమే కాదు.. ఇతర తీగ జాతి మొక్కలకు,  పూల మొక్కలకు కూడా ఇలా చేయవచ్చు. ఏ పదార్థాలు ఎలా పనిచేసాయి.. బెల్లం.. బెల్లం నేలలో చిన్న చిన్న మంచి సూక్ష్మక్రిములను ఉత్పత్తి చేస్తుంది, నేలను మరింత సారవంతం చేస్తుంది.  మొక్క అవసరమైన పోషకాలను సులభంగా గ్రహించడంలో సహాయపడుతుంది. టీ ఆకులు.. ఉపయోగించిన టీ ఆకులు మనీ ప్లాంట్ ఆకులను ముదురు ఆకుపచ్చగా,  పెద్దవిగా చేస్తాయి. ఇందులో నత్రజని ఉంటుంది.  ఇది ఆకుల పెరుగుదలకు చాలా ముఖ్యమైనది. ఆవాలు.. ఇందులో నత్రజని, భాస్వరం,  పొటాషియం ఉంటాయి. ఇవి మొక్క బాగా పెరగడానికి, వేర్లు బలంగా,  ఆకులు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇది నేలను కూడా మెరుగుపరుస్తుంది. పసుపు.. పసుపు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇది మొక్కను వ్యాధులు,  కీటకాల నుండి రక్షిస్తుంది.  ముఖ్యంగా వేరు కుళ్ళును నివారిస్తుంది. ఇది నేలను శుభ్రంగా ఉంచుతుంది. బంగాళాదుంప తొక్కలు.. బంగాళాదుంప తొక్కలలో పొటాషియం ఉంటుంది. ఇది మనీ ప్లాంట్ ఆకులను మెరిసేలా ఆరోగ్యంగా చేస్తుంది. ఇది మొక్క యొక్క బలాన్ని పెంచుతుంది  వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.                        *రూపశ్రీ.  
  ఇంటిని స్టైలిష్‌గా,  ప్రత్యేకంగా కనిపించేలా చేయడానికి,  తరచుగా మెష్ చేసిన కిటికీలు ,  తలుపులను ఏర్పాటు చేసుకుంటారు. కానీ వాటిలో చిక్కుకున్న మురికిని తొలగించడం చాలా కష్టం.  మెష్ కారణంగా వెంటిలేషన్ సమస్య ఉండదు. కాబట్టి ఇంట్లో మెష్  కిటికీలు,  తలుపులు ఉండటం చాలా బాగుంటుంది. కాన మెష్ ను క్లీన్  చేయడం గురించే అందరి భయం.  అలా కాకుండా కొన్ని సులభమైన చిట్కాలు పాటించడం ద్వారా మెష్ ను సులువుగా క్లీన్ చేయవచ్చు. అది కూడా ఇంట్లోనే ఉండే పదార్థాలతో మెష్ క్లీన్ చేసే ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసిన పదార్థాలు,  తయారీ విధానం తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 1 స్ప్రే బాటిల్, కొబ్బరి నూనె 1 కాటన్ వస్త్రం, 1 టూత్ బ్రష్ 1 నుండి 2 టీస్పూన్లు టార్టార్ పౌడర్ 2 నుండి 3 టీస్పూన్ల లిక్విడ్ సోప్ 1/2 కప్పు టీ నీరు తయారీ విధానం.. ఒక గిన్నెలో టార్టార్ పౌడర్, లిక్విడ్ సోప్,  టీ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇలా చేస్తే మెష్ క్లీన్ చేసే ద్రావణం సిద్దమైనట్టే.. ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమంటే.. పైన పేర్కొన్న పరిమాణం ప్రకారం  అన్ని వస్తువులను జోడించాలి, అప్పుడు మాత్రమే శుభ్రపరచడం సులభం అవుతుంది. ఇలా ఇంట్లోనే  క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవాలి.  దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసుకోవాలి. మెష్ న ఇలా శుభ్రం చేయాలి.. ఇంట్లో తయారుచేసిన క్లీనింగ్ లిక్విడ్‌ను తలుపు లేదా కిటికీ గ్రిల్‌పై పూర్తిగా స్ప్రే చేయాలి . ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. నిర్ణీత సమయం తర్వాత, టూత్ బ్రష్ తీసుకొని గ్రిల్‌ను పూర్తిగా స్క్రబ్ చేయాలి. ఇప్పుడు కాటన్ వస్త్రంతో కొద్దిగా తడిపి గ్రిల్‌ను పూర్తిగా తుడవాలి. చివరగా పొడి వస్త్రంతో తుడవాలి. ఇలా చేస్తే మెష్ ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఇలా కూడా క్లీనర్ తయారు చేసుకోవచ్చు.. ఒక స్ప్రే బాటిల్‌లో సమాన మొత్తంలో నీరు, వైట్  వెనిగర్ కలపాలి. ఉదాహరణకు..  ఒక కప్పు నీరు తీసుకుంటుంటే, ఒక కప్పు వైట్ వెనిగర్ కూడా కలపాలి. వెనిగర్ మురికి, గ్రీజును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది . ఇప్పుడు ఈ ద్రావణాన్ని మెష్‌పై పూర్తిగా స్ప్రే చేయాలి. మెష్‌లోని ప్రతి భాగం తడిగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని కూడా కొంత సమయం పాటు అలాగే ఉంచాలి. తరువాత ఇప్పుడు మెష్‌ను పై నుండి క్రిందికి మైక్రోఫైబర్ క్లాత్ లేదా పాత టవల్‌తో తుడవాలి. ఇది మురికిని తొలగిస్తుంది. మెష్‌లో చాలా మురికి చిక్కుకుంటే పాత టూత్ బ్రష్‌ను ఉపయోగించవచ్చు. సున్నితంగా రుద్దడం ద్వారా మురికి తొలగిపోతుంది. ఇప్పుడు శుభ్రమైన గుడ్డను సాధారణ నీటిలో తడిపి శుభ్రం చేయాలి.  చివరకు పొడి గుడ్డతో శుభ్రం చేయాలి.  ఇలా చేస్తే మెష్ లో మురికి పూర్తీగా పోయి మెరుస్తుంది.                                       *రూపశ్రీ.  
  పెళ్లైన ప్రతి అమ్మాయి ఒక కొత్త ఇంటికి వెళుతుంది. అక్కడ భర్తతో పాటు ఆమె అత్తమామలు కూడా ఉంటారు. సాధారణంగా చాలా ఇళ్లలో  భార్యాభర్తల కంటే అత్తాకోడళ్ల మధ్య జరిగే గొడవలే ఎక్కువ ఉంటాయి.  అత్తాకోడళ్లు కలిసి ఒకే చోట ఉన్నా, లేకపోయినా.. అత్తాకోడళ్లు కొన్ని విషయాలు ఒకరితో మరొకరు చెప్పుకోకుండటం మంచిదని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. ఇంతకూ ఒకరితో ఒకరు అనకూడని విషయాలేంటి? తెలుసకుంటే.. బంధువుల విషయాలు.. అత్తవైపు బంధువులు అయినా, కోడలి వైపు బంధువులు అయినా చెడుగా మాట్లాడకూడదు.  ఎవరివైపు బంధువుల గురించి వారికి ప్రేమ, అభిమానం ఉంటాయి.  అత్త కోడలివైపు వారి గురించి, కోడలు అత్తవైపు వారి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు.  ఒకవేళ మాట్లాడితే ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు వస్తాయి. డబ్బు,నగలు.. అత్తాకోడళ్ల మధ్య ఏవైనా చర్చలు జరిగినా,  ఒకరితో ఒకరు ఏదైనా చెప్పుకున్నా అది ఇంటి పనుల గురించి,  ఏదైనా సమస్య ఉంటే వాటి గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప డబ్బు, నగల గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం,  ఒకరితో ఒకరు గొడవ పడటం చేయకూడదు. ఫిర్యాదులు.. ఎంతైనా భర్త అనేవారు అత్త కొడుకు.  అతను ఏదైనా తప్పు చేసినప్పుడు అతని గురించి అత్తకు ఫిర్యాదు చేయడం మంచిది కాదు. తప్పు చేసినా సరే.. కోడలి ముందు కొడుకును తక్కువ చేయాలసి అతడిని దండించాలని ఏ అత్త అనుకోదు. పైగా తిరిగి కోడలినే మందలించే అవకాశం ఉంటుంది.  దీని వల్ల అత్తాకోడళ్ల మధ్య గొడవలు వస్తాయి. కోడలి తల్లిదండ్రులు.. పెళ్లైన మాత్రాన ఆడపిల్లకు తల్లిదండ్రులంటే పరాయితనం రాదు.  కని, పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ఆమె ప్రేమ జీవితాంతం ఉంటుంది.  అయితే కోడలు తన ఇంట్లో ఉంటోంది కదా అని అత్తగారు కోడలి తల్లిదండ్రుల గురించి చులకనగా మాట్లాడటం, వారిని నిందించడం చేయరాదు.  ఇది చాలా  గొడవలకు దారి తీస్తుంది. పోలిక.. కోడలిని ఇతర కోడళ్లతో లేదా కూతురితో పోల్చడం, అత్తను ఇతర ఇంటిలోని అత్తతో పోల్చడం లాంటివి అత్తాకోడళ్లు చేయరాదు. దీని వల్ల ఇద్దరి మధ్య బంధం తెగిపోతుంది. అలవాట్లు.. కోడలు అయినా, అత్త అయినా వారు పెరిగిన వాతావరణంకు తగ్గట్టు వారి  అలవాట్లు ఉంటాయి.  ఆ అలవాట్ల గురించి పదే పదే విమర్శలు చేయడం, హేళన చేయడం చేయరాదు. ఇది చాలా అవమానకరంగా ఉంటుంది. పిల్లల పెంపకం.. జనరేషన్ మార్పును బట్టి పిల్లల పెంపకంలో కూడా తేడాలు ఉంటాయి.  ఒకప్పుడు పెద్ద వాళ్లు పెంచిన విధానం వేరు..  నేటితరం వారు పిల్లలను పెంచే విధానం వేరు ఉంటుంది.  వీటి కారణంగా ఒకరిమీద మరొకరు వాదించుకోకూడదు.                                      *రూపశ్రీ.
  వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం, జుట్టు నెరవడం, శరీరంలో శక్తి లేకపోవడం వంటి అనేక సమస్యలు మొదలవుతాయి. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా చాలా కాలం పాటు యవ్వనంగా,  ఆరోగ్యంగా ఉండవచ్చు. కొన్ని ఆహారాలు (Foods for Anti-Aging) కూడా  యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. అవి యాంటీ ఏజింగ్ లక్షణాలతో నిండి ఉంటాయి.  శరీరాన్ని లోపలి నుండి బలంగా చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుని వాటిని  రెగ్యులర్ గా తీసుకుని, అవెలా పనిచేస్తాయో తెలుసుకుంటే.. టమోటా. టమోటా ఆహార రుచిని పెంచడమే కాకుండా, చర్మానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీన్ చర్మాన్ని సూర్యుని హానికరమైన కిరణాల నుండి రక్షిస్తుంది,  ముడతలను తగ్గిస్తుంది. అలాగే ఇది గుండె జబ్బులు,  క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే  ఆహారంలో టమోటాను ఖచ్చితంగా చేర్చుకోవాలి. టమోటాలను ఆహారంలో అనేక విధాలుగా భాగం చేసుకోవచ్చు. పసుపు.. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన కర్కుమిన్ ఉంటుంది. అందువల్ల దీనిని "గోల్డెన్ స్పైస్" అని పిలుస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  మెదడు ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్ల ఉదయం పసుపు కలిపిన పాలు తాగడం లేదా పసుపు నీరు త్రాగడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు.. పెరుగు ప్రోబయోటిక్స్ యొక్క అద్భుతమైన మూలం. ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మంచి జీర్ణక్రియ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  చర్మాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పెరుగులో ఉండే కాల్షియం ఎముకలను బలపరుస్తుంది,  వృద్ధాప్య సంకేతాలను నెమ్మదిస్తుంది. కాబట్టి  ఆహారంలో పెరుగును ఖచ్చితంగా చేర్చుకోవాలి. రోజూ ఒక గిన్నె పెరుగు తినడం వల్ల  మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి,  జీవక్రియను పెంచుతాయి. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడతాయి.  బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. అందువల్ల, ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా కాలేయం కూడా చాలా ప్రయోజనాలను పొందుతుంది.                              *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
మానవ శరీరంలో 206 ఎముకలు ఉంటాయి. ఇవి  శరీరానికి మద్దతు ఇస్తాయి. శరీరంలో అవయవాలను రక్షిస్తాయి,  అంతేకాదు.. శరీరం వివిధ రకాలుగా  కదలడానికి సహాయపడతాయి. అందువల్ల ఎముకలు  జీవితాంతం బలంగా ఉండటం చాలా ముఖ్యం. బలమైన ఎముకలు ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుండి కూడా  రక్షిస్తాయి. అస్టియోపోరోసిస్ సమస్య వస్తే  ఎముకలు బలహీనంగా,  పెళుసుగా మారుతాయి, అవి విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత కూడా ప్రభావితమవుతుంది.  అవి మునుపటి కంటే బలహీనంగా మారుతాయి. కానీ చాలా మందిలో  వయసు పెరిగే ముందే ఎముకలు బలహీనంగా మరడం ఈ మధ్య కాలంలో  ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి  అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఎముకలు బలహీనంగా మారడానికి ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం కూడా ఒకటని వైద్యులు అంటున్నారు.  చాలా షాకింగ్ కు గురిచేసే ఈ విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ప్లాస్టిక్ బాటిల్ లో నీరు తాగడం.. రోజూ ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వ చేసిన నీటిని తాగితే, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలా చేయడం ద్వారా  ఎముకలకు చేతులారా సమస్య తెచ్చిపెట్టినట్టేనట. వాస్తవానికి ప్రతిరోజూ ఈ బాటిళ్లలో నీటిని నిల్వ చేసి వాటి నుండి నీటిని తీసుకుంటే  ఎముకలు బలహీనపడతాయట. ఎందుకు హానికరం.. ప్లాస్టిక్ బాటిళ్లలో బిపిఎ అనే రసాయనం ఉంటుంది. ఇది శరీరంలోని విటమిన్ డి గ్రాహకాలను ప్రభావితం చేస్తుంది. విటమిన్-డి గ్రాహకాలు అంటే..  విటమిన్ డి గ్రాహకాలు అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇవి శరీరం కాల్షియంను గ్రహించడానికి సహాయపడతాయి. కానీ BPA వాటితో జోక్యం చేసుకున్నప్పుడు, శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించలేకపోతుంది. దీని అర్థం పోషకాహారం ఎముకలకు చేరదు. అంటే శరీరానికి తగినంత కాల్షియం ఆహారం ద్వారా తీసుకున్నా అది శరీరం గ్రహించకుండా ఉంటుంది.  ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం దీనికి ప్రధాన కారణం అవుతుంది. జరిగే ప్రమాదం? పోషకాహారం ఎముకలకు చేరకపోతే, అది అనేక ఇతర సమస్యలను కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు,  పగుళ్లు (ఎముక విరిగిపోవడం) ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా మహిళలలో మెనోపాజ్ తర్వాత   ఇప్పటికే కాల్షియం లోపం ఉంటోంది.ఇక ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల ఎముకల సమస్యలు మరింత పెరుగుతాయి.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. నేటికాలంలో  దీని ప్రమాదం అన్ని వయసుల వారిలో కనిపిస్తోంది. జీవనశైలి,  ఆహారపు సరిగా తీసుకోకపోవడం, మొదలైన తప్పుల వ్లల   20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో కూడా డయాబెటిస్ రావడం జరుగుతోంది. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే లేదా సరిగ్గా చికిత్స చేయకపోతే, కాలక్రమేణా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.   కుటుంబంలో ఎవరికైనా ఇప్పటికే డయాబెటిస్ ఉంటే, ప్రతి ఒక్కరూ దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  మెరుగైన ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఇంటి నివారణలు,  మందుల సహాయంతో, డయాబెటిస్‌ను నివారించడమే కాకుండా, దాని వల్ల కలిగే నష్టాలను కూడా తగ్గించవచ్చు. అలాగే డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. దీని కోసం డయాబెటిస్ కిల్లర్ ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇంతకీ ఈ డయాబెటిస్ కిల్లర్ ఆకులు ఏంటి? ఇవెలా పని చేస్తాయి?  తెలుసుకుంటే.. పొడపత్రి.. డయాబెటిస్ ఉన్నవారికి వేప, తులసి,  కరివేపాకు, మునగ వంటివి బాగా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర సమస్య తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.  కానీ పొడపత్రి ఆకులు మాత్రం చాలా ప్రత్యేకం.  ఇవి టైప్-2 డయాబెటిస్ ను మాత్రమే కాకుండా టైప్ -1 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందట.  పొడపత్రికి ఆయుర్వేదంలో చాలా ఆదరణ ఉంది.   ఆయుర్వేదంలో పొడపత్రిని 2000 సంవత్సరాలకు పైగా ఉపయోగిస్తున్నట్టు ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఈ ఆకు పొడి, సారం రెండూ  డయాబెటిస్ చికిత్సలో ప్రయోజనకరంగా ఉంటుంది. జిమ్నెమిక్ ఆమ్లం.. పొడపత్రి  మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలి అంటే.. ఆ ఆకులో ఉన్న ప్రత్యేకత తెలుసుకోవాలి. ఈ మొక్కలో ఉండే ప్రధాన క్రియాశీల సమ్మేళనాలలో  జిమ్నెమిక్ ఆమ్లం ఒకటి. ఇది  మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలో తేలింది. తీపి పదార్థాలను తినే ముందు దీనిని తీసుకుంటే.. జిమ్నెమిక్ ఆమ్లం  రుచి మొగ్గలపై చక్కెర గ్రాహకాలను అడ్డుకుంటుంది. ఇది తీపిని రుచి చూసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.  తీపి ఆహారాన్ని రుచిపరంగా తక్కువ ఆకర్షణీయంగా చేస్తుందట. జిమ్నెమిక్ ఆమ్లం ప్రేగులలో ఈ గ్రాహకాలను కూడా నిరోధించగలదని, ఇది శరీరంలో చక్కెర శోషణను తగ్గిస్తుందని కనుగొంది. దీని కారణంగా, భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అయితే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు లేదా పిల్లలు దీనిని ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది డయాబెటిస్ మందులకు ప్రత్యామ్నాయం కాదు.  వైద్యుడిని సంప్రదించకుండా దీనిని ఉపయోగించడం సరైనది కాదని అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ మందులు తీసుకుంటున్న వ్యక్తులు ఇలాంటి  నివారణలు ఉపయోగించే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. దీన్ని మీరే ఉపయోగించడం వల్ల కొన్నిసార్లు మందులతో రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...