టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సరికొత్త లుక్‌తో సిల్వర్ స్క్రీన్‌పై విధ్వంసం సృష్టించడానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘డేవిడ్‌రెడ్డి’ (David Reddy). హనుమ రెడ్డి యాకంటి దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా అఫీషియల్ టీజర్ తాజాగా విడుదలైంది.
ట్రేడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో ఈ టీజర్ ప్రస్తుతం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ ఎలిమెంట్స్ మరియు హై-వోల్టేజ్ ఎమోషన్స్‌తో నిండి ఉంది. కథా నేపథ్యం 1921 నాటి బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తోంది.
భారతదేశాన్ని వణికిస్తున్న ఒక సామ్రాజ్యాన్ని గడగడలాడించే శక్తిగా ఎదిగిన ఒక యోధుడి కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. గాంధీజీ సిద్ధాంతాలకు భిన్నంగా, సొంత మార్గంలో బ్రిటీష్ పాలకులపై తిరగబడే ఒక పవర్‌ఫుల్ ఇండియన్ క్యారెక్టర్‌ను ఇందులో ఆవిష్కరించారు.
“50 బెటాలియన్లు, 2000 మంది ఆఫీసర్లు, 50 లక్షల ఫండ్ ఉన్నా అతడిని ఆపలేకపోతున్నారు.. అతడు మనిషి కాదమ్మా.. రాక్షస్.. రాక్షస్ రెడ్డి” అంటూ వచ్చే డైలాగ్స్ మంచు మనోజ్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో క్లియర్ హింట్ ఇచ్చేసింది. వింటేజ్ లుక్‌లో సిగార్ కాలుస్తూ, చేతిలో బేస్‌బాల్ బ్యాట్ పట్టుకుని మనోజ్ ఇచ్చిన ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఈ టీజర్‌లో ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్‌గా ఉన్నాయి. భరత్ మోతుకూరి మరియు వెంకట్ రెడ్డి నల్లగంగుల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అతి పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. కేజీఎఫ్, సలార్ చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్, ఈ టీజర్‌ను తన మార్క్ మ్యూజిక్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు.
ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మరియు ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ వర్క్ విజువల్స్‌ను చాలా గ్రాండ్‌గా, ఇంటెన్స్‌గా చూపించాయి. ప్రతి ఫ్రేమ్‌లోనూ బ్రిటీష్ కాలం నాటి వాతావరణం, యాక్షన్ సీక్వెన్సులు ఎంతో సహజంగా, అద్భుతంగా పండాయి.
చాలా కాలం తర్వాత మంచు మనోజ్ తన మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు మనోజ్ కెరీర్‌లోనే ఇదొక బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు.
భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ అద్భుతమైన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను అకాశానికి తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు.





