LATEST NEWS
సృష్టి కేసులో త‌వ్వే కొద్దీ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. డాక్ట‌ర్ న‌మ్ర‌త జ‌గత్ జంత్రీగా క‌నిపిస్తోంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ లో 30 స‌రోగ‌సీ కేసులు హ్యాండిల్ చేయ‌గా.. ఆమె బేబీ సెంట‌ర్ కి స‌రోగ‌సీ విష‌యంలో క‌నీసం ప‌ర్మిష‌న్లు లేవ‌ని తెలుస్తోంది. అంతే కాదు ఆమె అస్సాం, మేఘాలయ నుంచి కొంద‌రు ఆదివాసీల‌ను ట్రాప్ లో ప‌డేసి వారి ద్వారా పిల్ల‌ల్ని సంగ్ర‌హించి వారిని ఇదిగో ఇలాంటి రాజ‌స్థాన్ జంట‌ల‌కు అమ్ముతున్న‌ట్టు గుర్తించారు. మొద‌ట పిల్ల‌లు లేని జంట‌లు ఇలాంటి చోట్ల‌కు ఐవీఎఫ్ అనే వ‌స్తారు. ద‌రిద్ర‌మేంటంటే ఈ ఐవీఎఫ్ లు ఇప్ప‌టి వ‌ర‌కూ 90 శాతం ఫెయిల్యూర్ అవుతూనే వ‌చ్చాయి. దీంతో వీరు ప్లాన్ బీ కింద స‌రోగ‌సీని స‌జెస్ట్ చేస్తారు. క‌మ‌ర్షియ‌ల్ స‌రోగ‌సీ ఇక్క‌డెలాగూ నేరం కాబ‌ట్టి.. అందుకంటూ భారీగా ఖ‌ర్చు అవుతుంద‌ని అంటారు. క‌ట్ చేస్తే ఎంత అని వారు అడ‌గ‌టం మొద‌లు పెట్టి అంచ‌లంచ‌లుగా ముప్పై నుంచి యాభై ల‌క్ష‌ల మేర లాగించేస్తారు. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్ జంట కేసులో న‌మ్ర‌త వ‌సూలు చేసిన మొత్తం 34 ల‌క్ష‌ల రూపాయ‌లు. వారు కూడా స‌రిగ్గా ఇలాగే ఐవీఎఫ్ కోసం వ‌చ్చారు. రెండు మూడు సిట్టింగుల‌య్యాక స‌రోగ‌సీ ద్వారా ట్రై చేస్తామ‌ని చెప్పారు. ఈలోగా ఒక అబార్ష‌న్ కేసు త‌గిలింది. అస్సోంకి చెందిన ఈ జంట ను ఒప్పించి.. వారికి కేవ‌లం 90 వేల డ‌బ్బు  ఇప్పించి ఆ బిడ్డ‌ను విశాఖ‌లో డెలివ‌రీ చేశామ‌ని చెప్పి న‌మ్మించారు. అప్ప‌టికే వారు 30 ల‌క్ష‌ల‌కు పైగా ఖ‌ర్చు చేశారు.. ఈలోగా సిజేరియ‌న్ అయ్యింద‌ని చెప్పి అందుకంటూ ఒక రెండు మూడు  ల‌క్షల రూపాయ‌ల మ‌ధ్య‌ వ‌సూలు చేసి ఆపై బిడ్డ ఇచ్చిన జంట‌కు 90 వేలు.. మిగిలిన ముప్పై మూడు ల‌క్ష‌ల మేర‌ స్వాహా చేసిందట‌ సృష్టి న‌మ్ర‌త. ఈ దిశ‌గా పోలీసులు క‌నుగొన్నారు.  ఇప్పుడేమంటారంటే ఈవిడ‌.. నేరం జ‌రిగింది ఇక్క‌డ కాదు. ఏపీలో క‌దా.. తెలంగాణ పోలీసులెందుకు అరెస్టు చేస్తున్నారంటూ బుకాయిస్తున్నారు. తీరా ఏపీలో అధికారుల నిర్వాకం ఎలా ఉందంటే ఇక్క‌డ మా రికార్డుల్లో అస‌లు సృష్టి అన్న బేబీ కేర్ సెంట‌ర్ లేనే లేదని అంటారు విజ‌య‌వాడ డీహెచ్ఓ. ఇక వైజాగ్ లో అయితే దాగుడు మూత‌ల దండాకోర్. అది ఉందా లేదా మాకు తెలీనే తెలీదంటారు అధికారులు. ఇక విజ‌య‌వాడ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ అన్ని అనుమ‌తుల‌తోనే తాము ఈ సెంట‌ర్ న‌డుపుతున్నామ‌ని చెబుతారు సిబ్బంది. 2020లో కూడా స‌రిగ్గా ఇలాగే విశాఖ‌లో న‌మ్ర‌త అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆ బేబీకి క్యాన్స‌ర్ రాకుంటే ఈమె బండారం బ‌య‌ట ప‌డి ఉండేదే కాదు. బై బ్యాడ్ లక్ ఇలా జ‌ర‌గ‌టంతో న‌మ్ర‌త సృష్టి లీల మ‌రోమారు వెలుగులోకి వ‌చ్చింది. దీంతో ఈమె లైసెన్సును ఐదేళ్ల పాటు ర‌ద్దు  చేసింది కౌన్సిల్. ఒక ప‌క్క ప‌సిపిల్ల‌ల ట్రాఫికింగ్. మ‌రో పక్క అక్ర‌మ స‌రోగ‌సీ. ఇదీ సృష్టి ప్ర‌తిసృష్టి చేయ‌డంలో సాగించే ఒకానొక రీతి. మాములుగా పిల్ల‌ల్ని ఎత్తుకుపోయే వాళ్లే న‌యం.. 2, 3 ల‌క్ష‌ల‌కే పిల్లల్ని ఇచ్చేస్తారు. అదే సృష్టి 30 న‌ల‌భై ల‌క్ష‌ల మేర లాగేస్తారు. ఈ సొమ్ముతో ఆమె ఊరూ వాడా ఉచిత హెల్త్ క్యాంపులు న‌డుపుతున్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తారు. ఫైన‌ల్ గా కొంద‌ర్ని ఐడెంటిఫై చేసి.. వారి ద్వారా స‌రోగ‌సీ మ‌ద‌ర్ల‌ను గుర్తిస్తారు. మ‌రీ ముఖ్యంగా న‌మ్ర‌త క‌ళ్ల‌న్నీ.. హైద‌రాబాద్ లో సెటిలైన అస్సోం, మేఘాల‌యా వంటి ప్రాంతాల‌కు చెందిన వారిపై ఉంటుంద‌ట‌.. వీరి ద్వారా ముందే మాట్లాడుకుని పిల్ల‌ల్ని కొంటుంద‌ట‌. వారు కూడా ఇటు డ‌బ్బుకు డ‌బ్బు- ఇటు పిల్ల‌లు ఉన్నింట్లో ప‌డ‌తారు లెమ్మ‌ని ఇలా అమ్మేస్తుంటారట‌. ఇలా 30 మంది వ‌ర‌కూ పిల్ల‌ల్ని అమ్మింద‌ట సృష్టి న‌మ్ర‌త‌. వీరంద‌రినీ గ్యాద‌ర్ చేసే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు. అస‌లు ఈ పిల్ల‌లు ఎవ‌రు? ఎవరికి పుట్టారు? ఇదెంత నేరం? అన్న కోణంలో ఆ జంట‌ల‌కు కౌన్సెలింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నార‌ట పోలీసులు.
జ‌గ‌న్ ప్రెస్ మీట్లకు.. ఈ మ‌ధ్య రాముడు మంచి బాలుడికి మ‌ల్లే వ‌చ్చేస్తున్నారు. భ‌ల్లే భ‌ల్లే క‌బుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయ‌న క‌బుర్ల‌న్నీ పేప‌ర్లూ, టీవీల్లో వ‌చ్చేస్తాయి. కాద‌న‌డం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మ‌రీ బుద్ధిమంతుడ్లా క‌నిపించ‌డ‌మేంటా? అన్న‌ది ఒక అనుమానం. ప్ర‌శ్న‌. చ‌ర్చ‌. వ‌గైరా వ‌గైరా. జ‌గ‌న్ కి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ద‌గ్గ‌ర త‌గిలింది హిందూత్వ‌ దెబ్బ. ఆ త‌ర్వాత అది కంటిన్యూ అవుతూనే వచ్చింది. ఆయ‌న హిందూ ఆల‌యాల్లో అన్య‌మ‌త‌స్తుల‌ను తీసి వేస్తూ జీవో తేబోతే క్రిష్టియ‌న్ సంఘాలు వ‌ద్ద‌ని వారించ‌డం.. ఎల్వీ విన‌క పోవ‌డం.. దీంతో ఆయ‌న్ను జీఏడీకి అటాచ్ చేయడంతో  స్టార్ట‌య్యింది జ‌గ‌న్ క్రిష్టియ‌న్ సీఎం అనే ముద్ర ప‌డడం. దీంతో ఎల్వీ సైతం త‌ప్పుకోవ‌డంతో క్రిష్టియ‌న్ సంఘాలు కేక్ క‌ట్ చేసుకుని సంబురాలు చేసుకున్నాయి. గానీ అది జ‌గ‌న్ పార్టీకి ఆశ‌నిపాశంగా మారినట్టు అంచ‌నా వేస్తారు. దీంతో ఈ ముద్ర చెరుపుకోడానికి త‌న ఆస్థాన స్వామి స్వ‌రూపానందేంద్ర చేత య‌జ్ఞ యాగాదులు చేయించారు. ఆపై ఎన్నెన్నో ఇత‌ర‌త్రా హిందూ క్ర‌తువులు చేయించారు. కానీ ఆ మర‌క ఆయ‌న్ను మాత్రం వీడిపోలేదు. ఇక లాభం లేద‌ని లాస్ట్ స్టేజ్ లో ఇంట్లో సెట్ వేసి.. త‌న భార్య చేత ప్ర‌సాదం పేప‌ర్లో చుట్టించారు. అయినా జ‌నం న‌మ్మ‌లేదు.  ఫైన‌ల్ గా జ‌గ‌న్ ఒక క్రిష్టియ‌న్ సీఎం అని బ్రాహ్మ‌ణ‌- వైశ్య‌- క్ష‌త్రియ, క‌మ్మ‌.. వారితో పాటు సాటి రెడ్డి కుల‌స్తులు సైతం న‌మ్మారు. క‌ట్ చేస్తే హిందూ వ‌ర్గాల్లో చాలా వ‌ర‌కూ ఇదే నిజ‌మ‌ని భావించి.. ఆయ‌న పుట్టి నిండా ముంచారు. దీంతో దిమ్మ తిరిగి  బొమ్మ క‌నిపించింది. ఇప్పుడు చూస్తే ఎలాగైనా స‌రే ప్రో హిందూగా ఒక క‌ల‌రింగ్ ఇవ్వ‌డానికా అన్న‌ట్టు.. ఈ ఉండ‌మ్మ బొట్టు పెడ‌తా నాటకానికి తెర‌లేపిన‌ట్టున్నారు చూస్తుంటే. అందుకే ఇదంతా అన్న చ‌ర్చ న‌డుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను మిస్ట‌ర్ హిందూ ప్రో మ్యాన్ అనిపించుకోడానికి ఇంకెన్ని వేషాలు వేస్తారో అన్నియ్య అన్న టాక్ కూడా బాగానే స్ప్రెడ్ అవుతోంది.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30)  8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం  సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో  సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశారు. రష్యాలోని పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి 126 కిలోమీటర్ల దూరంలో, 18 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే  తెలిపింది.  ప్రారంభంలో 8.7 తీవ్రతగా  ఈ భూకంపం సంభవించినట్లు ప్రకటించినా తర్వాత 8.8గా సవరించారు. ఈ తీవ్రత కారణంగా కమ్చట్కా ద్వీపకల్పంలో 3 నుంచి 4 మీటర్ల ఎత్తైన సునామీ అలలు రికార్డ య్యాయి. రష్యా అధికారుల ప్రకారం, ఈ భూకంపం గత కొన్ని దశాబ్దాలలో అత్యంత శక్తివంతమైనదిగా నమోదైంది. ఈ భూకంపం తర్వాత, జపాన్‌లోని హొక్కైడో ఉత్తర తీరంలో సునామీ అలలు మొదట 30 సెంటీమీటర్ల ఎత్తులో వచ్చినట్లు జపాన్ మీడియా తెలిపింది. జపాన్ ప్రభుత్వం పసిఫిక్ తీరంలోని ప్రజలకు వెంటనే ఖాళీ ఆదేశాలు జారీ చేసింది. సునామీ అలల వల్ల నష్టం సంభవించే అవకాశం ఉంది. తీర ప్రాంతాలు, నదీ తీరాల నుంచి ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా సురక్షిత భవనాలకు వెళ్లాలని తెలిపింది. మళ్లీ ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రదేశాన్ని వదిలి వెళ్లవద్దని జపాన్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని హవాయి, అలాస్కా రాష్ట్రాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. హవాయిలో 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. హవాయి రాజధాని హోనోలులు సహా ఓహు దీవిలోని పలు ప్రాంతాలను  తక్షణ ఖాళీ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. గ్వామ్ దీవిలో 1 నుంచి 3 మీటర్ల ఎత్తైన అలలు వచ్చే అవకాశం ఉందని అమెరికా పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో సునామీ అలలు 3 నుంచి 4 మీటర్ల ఎత్తుతో తాకాయని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎవరికి గాయాలు లేనప్పటికీ, ఒక కిండర్‌గార్టెన్ భవనం దెబ్బతిన్నట్లు కమ్చట్కా ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ మంత్రి సెర్గీ లెబెడెవ్ తెలిపారు.
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో  కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  కలెక్షన్ గ్యాంగ్‌లో వరుణ్ కీలక వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ను కొందరు కీలక వ్యక్తులు దేశం దాటించారు. ఇప్పటికే వరుణ్‌పై విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఈ కేసుకు సంబంధించి వరుణ్ నుంచి సిట్ అధికారులు కీలక సమాచారం రాబట్టారు. ఇవాళ, రేపు మరికొన్ని ప్రాంతాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డితో సహా మరో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కాంలో A 40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారం మేరకు  బుధవారం (జులై 30) తెల్లవారుజామున హైదరాబాద్‌‌లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో A1గా ఉన్న కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వరుణ్, A12 చాణక్య రూ. 11 కోట్లని 12 అట్టపెట్టల్లో దాచినట్లు అంగీకరించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్లుగా అధికారులు గుర్తించారు. శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో ఉన్న సులోచన ఫార్మ్ హౌస్‌లో సిట్ అధికారులు తనిఖీలు చేసి భారీగా అక్రమ మద్యం డంపును స్వాధీనం చేసుకున్నారు.
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో  ఈడీ దూకుడు పెంచింది.  హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారడంతో పాటు, ఇతర రాష్ట్రాలకూ లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో ఈడీ రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్‌ కేసుగా ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు. గొర్రెల పంపిణీ విధివిధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి సుమారు రూ.4,000 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే..  ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్లు అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తులో గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలినాళ్ల నుంచే కొంతమంది అధికారులు, మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లు సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్టు ఆధారాలు లభించాయి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లు రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్ని అంతా కలిసి వాటాలు పంచుకున్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహరంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ హస్తమూ ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ALSO ON TELUGUONE N E W S
Hollywood Superstar Tom Cruise has been linked with many hot and happening actresses before. He had been open about his relationships and divorces, too. Now, the actor showed up in public, sensational star Ana de Armas. They both got clicked by paparazzi, with Cruise holding hand of Ana.  Well, both of them are going to star in supernatural ocean thriller, Deeper. Recently, Tom Cruise appeared in his much revered spy saga, Mission Impossible: The Final Reckoning and Ana de Armas, did Ballerian, a spin-off from John Wick series. They both have been seen in Vermont, with Cruise holding her hand.  Is this about professional bond building before taking off their project to sets or if there are more sparks of romance, the actors did not officially confirm. Still, majority of reports from Hollywood are confirming that they have been dating and this is almost an officially confirmation.  Previously, Ana de Armas had been in a relationship with Ben Affleck and from February, she had been appearing with Cruise in several places. While their publicists kept calling it as "Special Work Relationship" and "Just Friendly" meet-ups, this Vermont sighting in casual wear has almost confirmed it for many that they are dating.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో షాక్ తగలబోతుందా అంటే అవుననే అనిపిస్తోంది. అసలే ప్రస్తుతం పరిశ్రమ పరిస్థితి బాలేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదో కొన్ని సినిమాలకు తప్ప.. మెజారిటీ సినిమాలకు థియేటర్లలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి సమయంలో సినీ కార్మికులు సమ్మె సైరెన్ మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.   మంగళవారం నాటు ఫిల్మ్ ఛాంబర్ లో వేతనాలు పెంపు విషయంలో ఫిల్మ్ ఛాంబర్ - తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ప్రతీ మూడేళ్లకోసారి 30 శాతం వేతనాలు పెంచాలనే నిబంధన గత నెల జూన్ 30తో ముగిసింది. కానీ, నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన చర్చల్లో ఫెడరేషన్ ప్రతినిధులతో 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పారు. అయితే దీనికి ఫెడరేషన్ అంగీకరించలేదు. ఇది తమకు సమ్మతం కాదని, తమకు అనుకూలంగా పెంచిన వారికే ఆగస్టు 1 నుంచి షూటింగ్ కి హాజరవుతామని ఫెడరేషన్ చెప్పింది.    గురువారం ఉదయం 11:30 కి కార్మిక భవన్ లో కార్మిక సంఘాలు, ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల్లో కూడా సమస్య కొలిక్కి రాకపోతే.. ఆగస్టు 1 నుంచి సమ్మెకు దిగటానికి కార్మిక సంఘాలు మొగ్గు చూపుతున్నాయి. అదే జరిగితే నిర్మాతలకు భారీ షాక్ తప్పదు. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించి, షూటింగ్ చివరిదశలో ఉన్న పలు సినిమాలు వాయిదా పడే ప్రమాదముంది. మరి నిర్మాతలు.. కార్మిక సంఘాలతో చర్చించి, ఈ సమస్యను పరిష్కరించుకుంటారేమో చూడాలి.  
Sithara Entertainments, renowned for delivering recent blockbusters, is gearing up for an ambitious new venture: Production No. 36, starring the acclaimed "Divine Star" Rishab Shetty. Known for the cinematic phenomenon Kantara, Shetty is set to headline a fictional historical action drama, marking a significant collaboration.   RIshab Shetty grew as a star hero in Kannada Industry after delivering blockbuster with Rakshit Shetty, Kirik Party. Rishab, started off his directorial career with Ricky, starring Rakshit and Kirik Party gave him opportunity to explore his skills as actor-director with Sarkaari Hiriya Praathamika Shaale, Kaasaragodu, Kodugé: Raamanna Ra and Kantara gave him Pan-India recognition.   He even won National Award for the film and now, he is bringing Kantara Chapter 1, Prequel to orginal film. So, he is getting offers from different film Industries but he is looking more towards Telugu producers. He accepted Jai Hanuman, directed by Prashanth Varma and produced by Mythri Movie Makers and with Sithara Entertainments, he joined hands for this historical fiction.  This magnum opus will transport audiences to the turbulent Bengal province of 18th-century Bharat, a period ripe with the emergence of rebels. The film will be directed by the talented Ashwin Gangaraju, celebrated for his gripping storytelling, who is poised to deliver an even grander saga this time.   Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the project boasts a stellar team. The film will be shot simultaneously in Telugu and Kannada, with a pan-India release planned in Telugu, Kannada, Tamil, Hindi, and Malayalam. Anticipation is already soaring for what promises to be a landmark project in Indian cinema.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
భారతీయ చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన కథల్నిప్రేక్షకులకి అందించే దర్శకుల్లో 'ఏఆర్ మురుగదాస్'(Ar Murugadoss)కూడా ఒకరు. గజనీ, 7th సెన్స్, స్టాలిన్, తుపాకీ, సర్కార్, కత్తి వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ ఏడాది 'సల్మాన్ ఖాన్'(Salman Khan)తో 'సికందర్'(Sikandar)అనే మూవీని తెరకెక్కించాడు. 'ఈద్'(Eid)కానుకగా' విడుదలైన సికందర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో 'శివకార్తికేయన్'(Sivakarthikeyan)తో 'మదరాసి'(Madarasi)అనే మరో వినూత్నమైన సబ్జెట్ ని తెరకెక్కిస్తున్నాడు.  ఈ మూవీకి సంబంధించి రీసెంట్ గా ఒక కార్యక్రమం జరిగింది. అందులో మురుగదాస్ మాట్లాడుతు' హిందీ చిత్రాలకి వర్క్ చేసే సమయంలో నేను దివ్యాంగుడిని. ఎందుకంటే సికందర్ కి సంబంధించి లాంగ్వేజ్ విషయంలో గందరగోళానికి గురయ్యాను. తెలుగులో కొంత వరకు పర్లేదు. హిందీలో మాత్రం నాకు ఏమి అర్ధం కాదు. నేను రాసుకున్న సీన్ పై నాకు అవగాహన ఉంటుంది.  స్కిప్ట్ ఇవ్వగానే ఇంగ్లీష్ నుంచి హిందీకి అనువదించుకుంటారు. దీంతో షూట్ లో  డైలాగుల విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. నా మాతృభాష తమిళంలో సినిమాలు చెయ్యడం నాకు సులువు. ఇక్కడ వారికి ఏ కథ నచ్చుతుందో నాకు తెలుసు. సోషల్ మీడియాలో డైలాగులు, వైరల్ అయ్యే క్యాప్షన్స్ పై నాకు అవగాహన ఉండటంతో,యూత్ కి  ఏం నచ్చుతుందో తెలుస్తుంది. ఇతర భాషల  విషయంలో ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. నా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే పై మాత్రమే ఆధారపడాలని చెప్పుకొచ్చాడు ఇక 'మదరాసి'లో శివకార్తికేయన్ సరసన 'రుక్మిణి వసంత్'(Rukmini Vasanth)జత కడుతుండగా, విద్యుత్, బీజూ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్(Anirudh Ravichander)సంగీత దర్శకుడు కాగా సెప్టెంబర్ 5 న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది.       
  గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)2000 వ సంవత్సరంలో తన తల్లి 'బసవతారకం'(Basavatarakam)పేరిట ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ ని నెలకొల్పిన విషయం తెలిసిందే. ఎంతో మంది పేదలకి ఖరీదైన వైద్యాన్ని తక్కువ ధరకే అందిస్తు పేద ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగుని తీసుకొస్తున్నాడు. రీసెంట్ గా బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా బసవతారకం హాస్పిటల్ కి సంబంధించి ఒక ప్రకటనని జారీ చేసారు. సదరు ప్రకటనలో 'అట్లూరి అశ్విన్ అనే వ్యక్తి నా పేరుతో పాటు బసవతారకం-ఇండో అమెరికన్  కాన్సర్ హాస్పిటల్(Basavatarakam Indo American Cancer Hospitalపేరుని ఉపయోగించి 'బంగారు బాలయ్య, బసవతారకం ఈవెంట్' ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నామని ప్రచారం చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ సందర్భంగా ప్రజలందరికి నేను ఒకటే చెప్తున్నాను. ఆ ఈవెంట్ కి నాతో పాటు ,హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు నుంచి ఎలాంటి అధికార ఆమోదం  లేదు. దయచేసి తప్పుదారి పట్టించే అనధికార వార్తల పట్ల  ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరుపున జరిగే అన్ని అధికారక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్ధనలు మేము ధ్రువీకరించిన వాటి నుంచే ఉంటాయని బాలయ్య తన ప్రకటనలో తెలియచేసాడు. సినిమాల విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం అఖండ 2(Akhanda 2)తో బిజీగా ఉన్నాడు. విజయదశమి(Vijayadasami)కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కానున్న ఈ మూవీ పై నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను(Boyapati Srinu)దర్శకుడు.   
ప్రముఖ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్(Payal rajput)ఇంట విషాదం నెల‌కొంది. ఆమె తండ్రి 'విమల్ కుమార్ రాజ్ పుత్ (68) కన్నుమూశారు. ఈ నెల 28న సాయంత్రం హైద‌రాబాద్‌లో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ఈరోజు (జూలై 30న) ఢిల్లీలో నిర్వహించనున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ...  ''నా పక్కన లేకపోయినా, మీ ప్రేమ నన్ను ప్రతిరోజూ నడిపిస్తుంది. మీ చిరునవ్వు, మీ గొంతు, మీ ఉనికి నాకు చాలా గుర్తుంది. మీరు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోవచ్చు, కానీ నా హృదయం నుండి ఎప్పటికీ వెళ్ళిపోరు. లవ్ యు నాన్న..'' అంటూ పోస్టు చేసింది. పాయల్ రాజ్‌పుత్ ‘RX 100’, ‘వెంకీ మామ’, ‘మంగళవారం’ వంటి చిత్రాలలో నటించి పాపుల‌ర్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వెంకటలచ్చిమి" అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. విషాదం నుంచి పాయల్ రాజ్‌పుత్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు . ప్రముఖులు, సినీ పరిశ్రమలోని పలువురు ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  
  పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)..ఈ ఇద్దరు తెలుగు సినిమా పరిశ్రమకి లభించిన వరం. సిల్వర్ స్క్రీన్ పై కనపడితే చాలు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల వర్షంలో తడిసి ముద్దవ్వాల్సిందే. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులని థియేటర్ కి రప్పించగలిగే మేరునగధీరులు. తమ ప్రీవియస్ చిత్రాలు 'దేవర'(Devara), 'హరిహర వీరమల్లు'(HariHara Veeramallu)తో మరోసారి తమ సత్తా చాటారు.  ఈ రెండు చిత్రాలకి సీక్వెల్స్ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో మాత్రం ఈ రెండు చిత్రాల సీక్వెల్స్ ఉంటాయా లేదా అనే డౌట్ ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.  ఎన్టీఆర్ ప్రస్తుతం 'ప్రశాంత్ నీల్' మూవీ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇయర్ జనవరి 9 న 'సంక్రాంతి' కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ తర్వాత 'త్రివిక్రమ్'(Trivikram)తో మైథలాజికల్ మూవీ చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్(Prashanth Neel)మూవీ కంప్లీట్ అయిన తర్వాతే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ జాయిన్ అవుతాడనే టాక్ ఉంది. పురాణాల నేపథ్యంలో తెరకెక్కే సబ్జెట్ కావడంతో చాలా టైం పడుతుందనేది కూడా వాస్తవం. ఎన్టీఆర్ కూడా ఈ ప్రాజెక్ట్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇందుకు నిదర్శనంగా ఇటీవల ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ లో కనపడినప్పుడు, చేతిలో పురాణాలకి సంబంధించిన బుక్ తో కనపడ్డాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్ ఇప్పట్నుంచే త్రివిక్రమ్ మూవీ కోసం ఎంతలా ప్రిపేర్ అవుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి 'సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిల్లో 'ఓజి' 'దసరా' కానుకగా సెప్టెంబర్ 25 న విడుదల కానుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్ డేట్' ఇంకా ఇవ్వకపోయినా 'సంక్రాంతికి' అనే టాక్ వినపడుతుంది. ఇటీవలే ఉస్తాద్ క్లైమాక్స్ సీన్ కంప్లీట్ అయ్యింది. పవన్ ప్రస్తుతం రాజకీయపరంగా అధికారంలో ఉన్నాడు. ఓజి, ఉస్తాద్ లని పూర్తి చెయ్యాలని  బిజీ పనులు సైతం పక్కన పెట్టి వర్క్ చేస్తున్నారు. ఇవి పూర్తిగా కంప్లీట్ అయ్యాక, మళ్ళీ ప్రజా సేవలో బిజీ  అవ్వడం ఖాయం. మరి వీరమల్లు చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన కథ. పార్ట్ 2 లో  యుద్ధ సన్నివేశాలు కూడా భారీగా ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. ఎన్టీఆర్ దేవర సైతం ఆషామాషీ సబ్జెట్ కాదు. భారీ తనంతో పాటు విజువల్ గా ఎన్నో ప్రమాణాలతో తెరకెక్కింది. దర్శకుడు కొరటాల శివ(Koratala Siva)చాలా సందర్భాల్లో మాట్లాడుతు 'దేవర పార్ట్ 1 'లో మీరు చూసింది గోరంత. పార్ట్ 2 లో కొండంత 'దేవర' ని చూస్తారనే రీతిలో చెప్పుకుంటు వస్తున్నాడు.  దీంతో దేవర, వీరమల్లు ని ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు పూర్తి చేస్తారు. బిజీ షెడ్యూల్స్ లో ఆ  రెండు భారీ చిత్రాలని అసలు చెయ్యగలరా అనే సందేహాల్ని సోషల్ మీడియా వేదికగా  కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కానీ తమ అభిమాన హీరో ఒకసారి మాటిచ్చాడంటే వెనక్కి తగ్గడని, దేవర 2 , వీరమల్లు 2 ఉంటాయని పవన్, ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎపుడు లేని విధంగా వీరమల్లు కి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొని వీరమల్లు 2 ఖచ్చితంగా ఉంటుందని చెప్పాడు. ఎన్టీఆర్ కూడా  'దేవర 2 'ఖచ్చితంగా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే.   
ఈమధ్యకాలంలో థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాల కంటే ఓటీటీలో విడుదలయ్యే సినిమాలపైనే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వివిధ భాషలకు చెందిన సినిమాలన్నీ ఓటీటీ ప్లాప్‌ఫామ్స్‌పై చూసే అవకాశం ఉంటుంది. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వివిధ భాషల్లో 27 సినిమాలు వచ్చాయి. వాటి వివరాలు ఏమిటో తెలుసుకుందాం.  అమెజాన్‌ ప్రైమ్‌ : లోన్లీ ఎనఫ్‌ టు లవ్‌ సీజన్‌ 1.. జూలై 28 చెక్‌ (తెలుగు సస్పెన్స్‌ థ్రిల్లర్‌).. జూలై 28 హౌజ్‌ఫుల్‌ 5.. ఆగస్టు 1 నెట్‌ఫ్లిక్స్‌ : ఐరన్‌ చెఫ్‌ థాయిలాండ్‌ వర్సెస్‌ ఆసియా.. జూలై 28 ట్రైన్‌ రెక్‌: స్ట్రోమ్‌ ఏరియా 51.. జూలై 29 డబ్ల్యూడబ్ల్యూఈ: అన్‌ రియల్‌.. జూలై 29 కన్వర్జేషన్స్‌ విత్‌ ఏ కిల్లర్‌: ది సన్‌ ఆఫ్‌ సామ్‌ టేప్స్‌.. జూలై 30 అన్‌ స్పీకబుల్‌ సిన్స్‌.. జూలై 30 యాన్‌ హానెస్ట్‌ లైఫ్‌.. జూలై 31 గ్లాస్‌ హార్ట్‌.. జూలై 31 లియాన్నే.. జూలై 31 మార్క్‌డ్‌.. జూలై 31 తమ్ముడు (తెలుగు మూవీ).. ఆగస్టు 1 మై ఆక్స్‌ఫర్డ్‌ ఇయర్‌.. ఆగస్టు 1 బియాండ్‌ ది బార్‌.. ఆగస్టు 2 పర్‌ఫెక్ట్‌ మ్యాచ్‌ సీజన్‌ 3.. ఆగస్టు 2 ఆపిల్‌ ప్లస్‌ టీవీ : చీఫ్‌ ఆఫ్‌ వార్‌.. ఆగస్టు 1 స్టిల్‌ వాటర్‌ సీజన్‌ 4.. ఆగస్టు 1 జియో హాట్‌స్టార్‌ : అడ్డా ఎక్స్‌ట్రీమ్‌ బాటిల్‌.. జూలై 28 బ్లాక్‌ బ్యాగ్‌.. జూలై 28 క్యుంకీ సార్‌ బీ కబీ బహు థీ సీజన్‌ 2.. జూలై 29 బ్యాటిల్‌ ఆఫ్‌ కులికన్‌: హయర్స్‌ ఆఫ్‌ ది కార్టెల్‌.. జూలై 29 సూపర్‌ సారా (మినీ వెబ్‌ సిరీస్‌).. ఆగస్టు 1 పతీ పత్నీ ఔర్‌ పంగా.. ఆగస్టు 2 సోనీ లివ్‌ : ట్విస్ట్‌డ్‌ మెటల్‌ సీజన్‌ 2.. ఆగస్టు 1 సన్‌ నెక్ట్స్‌ : సురభిల సుందర స్వప్నం.. ఆగస్టు 1 జీ5 : బకైటి.. ఆగస్టు 1
తమని ఎదగనీయడం లేదని, తొక్కేస్తున్నారని ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ కళాకారులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మరోసారి ఆ అంశం చర్చకు వచ్చింది. హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్‌ పైడి జయరాజ్‌ ఫోటోను చిన్నగా ఎందుకు పెట్టారంటూ ఫిలిం ఛాంబర్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌తో వాగ్వాదానికి దిగారు పాశం యాదగిరి. ‘గో బ్యాక్‌ ఆంధ్రా..’ అంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫిలిం ఛాంబర్‌కి వెళ్లి వారికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.  జూలై 29 ప్రముఖ రచయిత సి.నారాయణరెడ్డి జయంతి. తెలంగాణకు చెందిన సినారె ఫోటో ఫిలిం ఛాంబర్‌లో లేకపోవడంతో ఆ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ సెక్రటరీని వివరణ కోరారు. ఫిలిం ఛాంబర్‌లో జరిగిన గొడవ గురించి నిర్మాతల మండలి ఇంకా స్పందించలేదు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా ఈ ఘటనపై మాట్లాడలేదు. చిత్ర పరిశ్రమలో ఉన్న తెలంగాణ వారిపై వివక్ష చూపిస్తున్నారని గత కొన్ని రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఘటనపై నిర్మాతల మండలి, చిత్ర ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి. 
Vetrimaaran, after Viduthalai 2, has been waiting to start his next project. He announced Vaadivaasal with Suriya, long back and then, kept that project in cold storage to make his Vada Chennai Universe based film with Simbu aka STR. But the movie is going through many twists and turns as per reports.  Kalaipuli S. Thanu, who is producing the film, is having differences with Simbu about the actor's remuneration. While the actor is asking for Rs.50 crores, Thanu is not ready to offer so much for him. Hence, Simbu is in talks with Sithara Entertainments and other production houses to move project elsewhere.  Now, as the actor is looking for other producers, Thanu is keen on producing Vaadivaasal with Suriya and director Vetrimaaran. But this time, the story will be changed and it won't have Jallikattu as central theme. As the title for this project has already become popular and helps in business, Thanu is keen on using it.  For now though, Simbu and Vetrimaaran are in talks about who will produce their movie and Dhanush had already issued NOC for using Vada Chennai characters, Universe. If the reports are to be believed, we have to wait and see, how all these twists and turns will lead to production of Vetrimaaran's next.  For a director who won National Award and been delivering critical and box office successes continuously, these kind of twists explain how volatile Film industry can be. Simbu has also been going through different issues from past decade before any of his films go to floors.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్టుగా ఈ కాలంలో మంచి ఉద్యోగాలు, బోలెడు వసతులు, కావలసినంత సంపాదన ఉన్నా ఆరోగ్యమే సరిగ్గా ఉండటం లేదు. పుట్టడంతోనే జబ్బులతో పుట్టేస్తున్నారు పిల్లలు. పెరిగే వయసులో తగినంత శారీరక ఎదుగుదలకు సహకరించే ఆటలకు దూరం ఉండి ఎప్పుడూ పుస్తకాలతో ఉండటం వల్ల శారీరకపరంగా దృఢంగా ఉండలేకవుతున్నారు. ఇక ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు సంసారం ఇదంతా గడుస్తూ ఉంటే వాటితో సతమతం అవ్వడం తప్ప ఆరోగ్యం అనే ఆప్షన్ గురించి సీరియస్ గా తీసుకోలేరు. పైపెచ్చు ఏదైనా జబ్బులొస్తే టెంపరరీగా నయమయ్యేందుకు మెడిసిన్స్ వాడి హమ్మయ్య అనుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో మనిషిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనారోగ్యమే. డబ్బు పెట్టినా కూడా పూర్తిగా కోలుకోలేని విధంగా తయారైపోతున్నారు. అలాంటి అనారోగ్యాలు ఉండకుండా చక్కగా ఆరోగ్యవంతంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదట సంతోషంగా వుండాలి....  సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. సంతోషంగా ఉన్నప్పుడు సమస్యలు పెద్దగా ప్రభావం చూపించవు. అలాగని లేని సంతోషాన్ని ఎలా మనం తెచ్చిపెట్టుకోవడం అనిపిస్తుందేమో కానీ సంతోషం అంటే ఉన్నదనితో తృప్తిగా ఉండటం అలాగే పరిష్కరించలేని సమస్యల విషయంలో అనవసరంగా ఆలోచించి బాధపడి లాభంలేదు. పరిష్కరించ గలిగిన సమస్యల గురించి ఆలోచించనవసరం లేదు. ఎందుకంటే పరిష్కరించలేము అని తెలిసాక కేవలం రోజువారీ పనులు చేసుకుంటూ పోవడమే, ఇక పరిష్కారం అవుతాయి అని తెలిసిన పనుల గురించి అసలు ఆలోచనే అవసరం లేదు కదా. ఆహార మార్గం! శారీరకంగా మనిషి బాగుండాలి. శరీరంలో ఏర్పడే అసమతుల్యత చాలా సమస్యలకు దారితీస్తుంది. అందుకే మంచి ఆహారం ఎంతో ముఖ్యం. కేవలం ఆహారం తీసుకుంటూ ఉంటే సరిపోదు.తినే ఆహారానికి తగినంత వ్యాయామం కూడా ఎంతో ముఖ్యం. వ్యాయామం మనిషిలో ఉల్లాసాన్ని పెంచుతుంది. మంచి ఆహారం తీసుకుంటూ కనీసం గంట సేపు వ్యాయామం చేస్తూ వుంటే ఆరోగ్యం బావుంటుంది. బాడ్ హబిట్స్ బంద్! చెడు అలవాట్లు శరీరాన్ని కుళ్ళబొడుస్తాయి. ఏ రకమైన చెడు అలవాట్లను దగ్గరకు రానీయకండి. చాలామంది స్మోకింగ్, డ్రింకింగ్, కొన్ని ఇతర అలవాట్లను ( తినకుడాని ఆహార పదార్థాలు అతిగా తినడం, టైమ్ మేనేజ్మెంట్ లేకపోవడం, సోమరితనంగా ఉండటం. కష్టపడే అవసరం లేదని ఎలాంటి ఉద్యోగాలు చేయకపోవడం. ఇవన్నీ కూడా నిజానికి బాడ్ హాబిట్స్ ఏ)  నిజానికి పొగ త్రాగడం కాని, ఆల్కహాలు కాని, జూదం కాని మనకు హాయిని ప్రశాంతతను ఇవ్వలేవు. ప్రతి మనిషికి ఒక వ్యాపకం అంటూ ఉండాలి.  రీడింగ్ ఈజ్ ఏ వండర్! మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తకాలలో కావలసినంత విజ్ఞానం లభిస్తుంది. ఎంతోమంది జీవితాలు, ఆ జీవితాలలో జరిగిన ఎన్నో విషయాలు, వాటిని ఎలా డీల్ చేయాలి, గొప్ప ఆలోచనలు ఎలా ఉంటయి?? జీవితం ఉన్నతంగా ఉండటం అంటే ఏమిటి?? ఆర్థిక, మానసిక సమస్యలు, మనుషుల మధ్య అటాచ్మెంట్స్ వంటివి అన్నీ పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు.  అదొక అద్భుత ప్రపంచం అవుతుంది.  మెడిసిన్ లెస్ లైఫ్! ఎన్ని సార్లు చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన మాట సాధ్యమైనంత వరకు ఔషధాల వాడకం తగ్గించాలి.  శరీరానికి ఆహారపదార్థాల ద్వారానే జబ్బును నయం చేసుకునే మార్గాన్ని తెలుసుకోవాలి. వీలైనంత వరకు ఇమ్యూనిటీ పెంచుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా సీజనల్ వారిగా దొరికే ఆహారం అమృతంతో సమానంగా పనిచేస్తుంది. రుచి కోసమో, సీజన్ దాటి దొరుకుతున్నాయనే ఆశతోనో వేటినీ తీసుకోవద్దు. కుదిరితే ఇంటి ముందు నాలుగు రకాల ఆకుకురా మొక్కలు, కూరగాయల మొక్కలు పెంచుకోవచ్చు అప్పుడు రసాయనాలు లేని ఆహారం మీ ముందున్నట్టే. బాగా అవసరమైనప్పుడు మాత్రమే మందులను అల్లో చేయాలి.  ప్రశాంతత! ప్రస్తుతం అందరి సమస్య ఒకటే ప్రశాంతత లేకపోవడం. దానివల్లనే ఎన్నోరకాల మానసిక సమస్యలు చుట్టుముడతాయి.  మనసు ప్రశాంతంగా వుంటే చక్కటి నిద్ర పడుతుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనసును బయట ప్రపంచం నుండి వెనక్కి లాక్కొచ్చి ఒక్కచోట ఉంచుకోవాలి. అదే ధ్యానం చేసే పని. అలా చేస్తుంటే చక్కటి నిద్ర సొంతమవుతుంది.  చక్కటి నిద్ర మాత్రమే మంచి ఆరోగ్యానికి చిహ్నం. ఎక్కువగా పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి అనే ఆలోచనతో మానసికంగా, శారీరకంగా కష్టపెట్టుకోవద్దు. ఇవన్నీ పాటిస్తే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది.                                 ◆వెంకటేష్ పువ్వాడ
అంతా నువ్వే చేసావు. అప్పుడలా చేయకపోతే ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. అన్నిటికి కారణం మీరే. ఇప్పుడు జీవితంలో సొల్యూషన్ ఏంటి?? జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పుడు ఎవరు భరించేవాళ్ళు?? మీకేం హాయిగానే ఉంటారు, భరిస్తున్న వాళ్లకు తెలుస్తుంది అందులో ఉన్న బాధ. ఇలాంటి మాటలు చాలా మంది తమ జీవితాల్లో మాట్లాడుతూ ఉంటారు. వీటికి కారణం ఏమిటంటే ముఖ్యమైన నిర్ణయాలు స్వంతంగా తీసుకోలేక ఇతరుల ఒత్తిడితోనో, లేక నిస్సహాయతలోనో ఉన్నప్పుడు జరిగిపోవడం. సింఫుల్ గా చెప్పాలి అంటే జీవితాన్ని, అందులో ముఖ్యమైన విషయాలను ఇతరులు నిర్ణయించడం.  ఎందుకిలా? జీవితాల్లో ఇలా ఎందుకు జరుగుతాయి. సాధారణంగా చాలామంది చెప్పుకునే సమర్థింపు కారణం ఒకటి ఉంటుంది. అదేంటంటే అలా రాసిపెట్టి ఉంది. దానికి ఎవరేం చేయగలరు అని. అదే సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా అటు ఇటు అయితే అందరూ అలాగే అనుకోగలరా?? లేదే ముందే చెప్పాము కానీ వినలేదు. అందుకే ఇలా అవుతోంది. కావాల్సిందేలే. శాస్తి జరగాల్సిందే లాంటి మాటలు వినబడుతుంటాయి.  అయితే వాటి గురించి పక్కనబెడితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలి అని.  అంతిమ నిర్ణయం! ఎవరు ఎన్ని సలహాలు అయినా ఇవ్వచ్చు, ఎన్నో సలహాలు అయినా తీసుకోవచ్చు. కానీ చివరికి సాధ్యా సాధ్యాలు ఆలోచించి నష్టాలు జరిగితే భరించాల్సింది నేనే కదా అనే అవగాహనతో ఉండాలి. అపుడే ఏదైనా నిర్ణయం తీసుకోగలరు.  ఇచ్చేయ్యాలి! ఎవరి జీవితంలో వాళ్ళు తమ సామర్త్యాలకు తగినట్టు ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉంటారు. ఒక మెడికో దగ్గరకు వెళ్లి పోలీస్ అకాడమీ కి సంబంధించిన విషయాలు చెప్పమంటే ఎలా అయితే అవగాహన లేకుండా ఉంటారో ఇదీ అంతే.  ఇంకొక విషయం ఏమిటంటే పెద్దరికం అనే ఆయుధం చేతిలో ఉంది కదా అని ఊరికే చిన్న వాళ్ళ జీవితాలను డిసైడ్ చేయకూడదు.  కాబట్టి ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను వాళ్లకు ఇవ్వాలి. అలాగని వాళ్ళ జీవితాలను ఏదో వీధుల్లో వదిలేయడం లేదు కదా. పెద్దరికం అంటే తప్పు మార్గం లో వెళ్తున్నప్పుడు రంగంలోకి దిగి సరిచెయ్యడం, చెప్పాల్సిన రీతిలో చెప్పడమే కానీ జీవితాలను లాక్కోవడం కాదు. బి కాన్ఫిడెంట్! కాన్ఫిడెంట్ అనేది నాకు కాన్ఫిడెంట్ ఉంది, ఉంది అని నోటితో చెబితే వచ్చేది కాదు. నలుగురితో చెబితే బుర్రలో చేరేది అంతకన్నా కాదు. అనుభవాలు, పరిస్థితులను మేనేజ్ చేయడంతో ఆ కాన్ఫిడెంట్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా ప్రణాళిక, లక్ష్యాలు చేరడం అనేవి చాలా ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ధైర్యం ఉండాలి ఎందుకంటే జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న తరువాత వాటి నష్టాలు ఏమైనా ఎదురైనా తిరిగి భర్తీ చేసుకోవడం చాలా కష్టం. అతి విశ్వాసం వద్దు! కొందరు చెప్పేవాటిలో  మంచి విషయాలే ఉండచ్చు.  అయితే వాళ్ళ వరకు మాత్రమే అది మంచిగా ఉండచ్చు. కానీ ఇతరులకు అలా ఉంటుందో లేదో ఎవరికి తెలుసు. అలాంటప్పుడు నాకేదో బాగుంది మీకూ బాగుంటుందిలే carry on అని అదేపనిగా ముందుకు ఒత్తిడి చేయడం కరెక్ట్ కాదు.  ఇదే నిజం! పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు,ఉద్యోగాలు కావచ్చు జీవితంలో చాలా ముఖ్యమైన విషయాలు ఉండచ్చు. ప్రతి నిర్ణయంలో అంతిమంగా తృప్తి అనేది ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఈ పని చేసాక ఏదైనా నష్టం జరిగినా నేను దాన్ని భరించగలను అనే ఆలోచన కూడా ఉండాలి. ఫెయిల్యూర్ ను ఆక్సిప్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయగలిగే మనస్తత్వం ఉండాలి. అలా ఉంటే జీవితాలు బాగుంటాయి. లేకపోతే గడ్డి తినమన్నారు కాబట్టి తిన్నాము ఇప్పుడు అరగలేదు అంటే దానికి ఎవరు బాద్యులు?? ఎంత అనుభావాలు కలిగిన  వాళ్ళు అయినా అవి వాళ్ళ వరకు మాత్రమే 100% వర్తిస్తాయి.  అందుకే నిర్ణయాలు నవ్వుతాయి. జాగ్రత్తగా ఒకరి ప్రమేయం లేకుండా వాటిని తీసుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ.
  రాగి,  ఇత్తడి పాత్రలు ఇంటికి సాంప్రదాయ టచ్ ను  ఇస్తాయి. వీటి కారణంగా ఇల్లు అందంగా కనిపిస్తుంది. ఈ పాత్రలను ప్రతిరోజూ ఉపయోగించవచ్చు లేదా ఉపయోగించకపోవచ్చు, కానీ చాలా తొందరగా   అవి  మెరుపును కోల్పోతాయి. అయితే వీటిని మళ్లీ కొత్త వాటిలా మెరిపించడం కాస్త కష్టంతో కూడుకున్న పని.  వీటిని తోమలేక చాలా మంది ఇలాంటి పాత్రలను దూరంగా పెట్టేస్తుంటారు. అయితే  పండుగలు, ప్రత్యేక రోజుల్లో రాగి, ఇత్తడి పాత్రలు అవసరం అవుతాయి.  ఈ  రాగి పాత్రలు లేదా ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా కేవలం సెకెన్ల వ్యవధిలో మెరిపించగల మ్యాజిక్ లిక్విడ్ ఉంది. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ లిక్విడ్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.  ఇంతకీ ఈ మ్యాజిక్ లిక్విడ్ ను తయారు చేయడానికి కావల్సిన పదార్థాలు ఏమిటి? దీన్నెలా తయారు చేయాలి? ఎలా ఉపయోగించాలి?  తెలుసుకుంటే.. కావలసిన పదార్థాలు.. 2 టీస్పూన్లు ఉప్పు 2 టీస్పూన్లు నిమ్మరసం 1 టీస్పూన్ డిష్ వాషింగ్ లిక్విడ్ 1 టీస్పూన్ బేకింగ్ సోడా 2 టీస్పూన్లు వైట్ వెనిగర్ తయారీ విధానం.. ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి. అది పెద్దదిగా ఉండాలి.   ముందుగా గిన్నెలో ఉప్పు వేసి, ఆపై నిమ్మరసం కలపాలి. డిష్ వాషింగ్ లిక్విడ్ కలిపిన తర్వాత, బేకింగ్ సోడాను కూడా జోడించాలి. చివరగా వైట్  వెనిగర్ జోడించాలి.  ఇలా చేస్తే  రాగి-ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణం సిద్ధమైనట్టే.. ఈ తప్పు చేయొద్దు.. ద్రావణాన్ని తయారు చేస్తున్నప్పుడు వెనిగర్  ఎక్కువగా ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.  ద్రావణంలో ఎక్కువ వెనిగర్ కలిపితే పాత్రలు శుభ్రం అవుతాయి, కానీ ఎండిన తర్వాత, వాటిపై నల్ల మచ్చలు లేదా గుర్తులు కనిపించవచ్చు. కాబట్టి పాత్రలు మచ్చలు లేకుండా,  మెరుస్తూ ఉండాలంటే  పరిమిత మొత్తంలో వైట్ వెనిగర్  వాడాలి. ఉపయోగించే విధానం.. రాగి,  ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి ద్రావణాన్ని పాత్రపై పూసి పాత్ర మొత్తం అప్లై అయ్యేలా చూడాలి. ఈ ద్రావణం తొలగించిన వెంటనే పాత్ర శుభ్రంగా కనిపిస్తుంది. ఇలా కాకపోతే.. తయారు చేసుకున్న ద్రావణాన్ని ఒక పెద్ద పాత్రలో వేయాలి. ఇందులో పాత్రలను ముంచి తీసినా పాత్రలు మెరిసిపోతాయి. ఆ తర్వాత నీటితో కడిగి పొడిగుడ్డతో తుడుచుకుంటే సరిపోతుంది.                                     *రూపశ్రీ.
  రోగనిరోధక వ్యవస్థను శరీరానికి కవచం అని పిలుస్తారు. ఇది అనేక రకాల అంటు వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. అందుకే కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే చర్యలను అందరూ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ దిశలో నిరంతరం ప్రయత్నించడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికోసం ఆహారం,  జీవనశైలిని సరిగ్గా ఉంచుకోవడం  చాలా ముఖ్యమైనది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో  విటమిన్-సి,  డి చాలా ముఖ్యమైనవి. ఈ విటమిన్లు ఆహారాలను బాగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుందని అంటారు. అయితే..  రోగనిరోధక వ్యవస్థకు ఈ రెండు మాత్రమే సరిపోవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వ్యాధుల నుండి శరీరాన్ని కాపాడే రోగనిరోధక వ్యవస్థను  ఎలా బలోపేతం చేయవచ్చో తెలుసుకుంటే.. విటమిన్ సి-డి  ప్రయోజనాలు.. విటమిన్ సి అనేది బయోసింథటిక్, జన్యు నియంత్రణ ఎంజైమ్‌లకు అవసరమైన శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది తెల్ల రక్త కణాలు వ్యాధికారక క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. అదేవిధంగా, విటమిన్ (డి3) రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని పరిశోధకులు అంటున్నారు. ఉదయం 10-15 నిమిషాలు ఎండలో ఉండటం ద్వారా లేదా విటమిన్-డి  అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తగినంత మొత్తంలో విటమిన్ డి పొందవచ్చని,  రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. విటమిన్ ఇ కూడా అవసరం.. విటమిన్లు సి,  డి లాగానే, విటమిన్ ఇ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.  ఇది శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ ముఖ్యమైన విటమిన్  శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పనితీరులో ముఖ్యమైన 200 జీవరసాయన ప్రతిచర్యలలో భాగం. జుట్టు,  కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ ఇ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆహారం ద్వారా దీనిని తీసుకునేలా చూసుకోవాలి. ప్రోటీన్ కూడా ముఖ్యం.. ప్రోటీన్.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పాత్ర పోషిస్తున్న అమైనో ఆమ్లాలతో రూపొందించబడింది. ఈ సమ్మేళనాలు  రోగనిరోధక వ్యవస్థ కీలకమైన T కణాలు, B కణాలు,  సూక్ష్మక్రిములతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ప్రోటీన్ లేని వ్యక్తులు బలహీనమైన కండరాలను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల కంటే అంటు వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో జింక్ ఉందా? బలమైన రోగనిరోధక వ్యవస్థకు జింక్ కూడా చాలా అవసరం. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడే తెల్ల రక్త కణాలలో ఒక ముఖ్యమైన భాగం. జింక్ లోపం తరచుగా  ఫ్లూ, జలుబు,  ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లకు గురి చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులు జింక్ సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తారు. జింక్‌ను ఆహారం ద్వారా సులభంగా పొందవచ్చు.                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.  అది శరీర నిర్మాణం అయినా లేదా బరువు తగ్గడం అయినా ప్రతి ఒక్కరూ అధిక ప్రోటీన్ ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. కానీ ఎక్కువ ప్రోటీన్ అందరికీ ప్రయోజనకరంగా ఉండకపోవచ్చని మీకు తెలుసా? వాస్తవానికి అధిక ప్రోటీన్ ఆహారం  ధోరణి పెరిగినంతగా, దానితో వల్ల ఏర్పడే   దుష్ప్రభావాలు  ప్రమాదాల గురించి పెద్దగా చర్చ కనిపించదు.  అధిక ప్రోటీన్ ఆహారం అంటే  ఒక రోజులో తీసుకునే కేలరీలలో 25% నుండి 35% ప్రోటీన్ నుండి వస్తుంది. ఇందులో గుడ్లు, చికెన్, చేపలు, జున్ను, పప్పులు, ప్రోటీన్ పౌడర్ మొదలైనవి ఉంటాయి. దీని వల్ల  కార్బోహైడ్రేట్ల పరిమాణం తగ్గుతుంది. కానీ అది అందరికీ ప్రయోజనకరంగా ఉండదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. శరీరానికి ప్రోటీన్ చాలా అవసరమని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ అధిక ప్రోటీన్ తీసుకోవడం అనేక ఆరోగ్య సమస్యలకు హానికరం. కండరాలను నిర్మించడానికి,  ఎముకలు, దంతాలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ చాలా అవసరం, కానీ కొన్ని వ్యాధులలో అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోకూడదు. యూరిక్ యాసిడ్ సమస్య ఉంటే.. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారికి అధిక ప్రోటీన్ ఆహారం యూరిక్ యాసిడ్ స్థాయిని మరింత పెంచుతుంది. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అందువల్ల ఊక పిండి, మొక్కజొన్న, బేకరీ ఆహార పదార్థాలను తినడం మానుకోవాలి. దీనితో పాటు, మినపప్పు, మాంసం, చేపలు, బీన్స్, మునగకాయ, పాలకూర, బఠానీలు, పుట్టగొడుగులు, బీట్‌రూట్, గుమ్మడికాయ గింజలు తినకూడదు. వైద్యుడి సలహా మేరకు  తక్కువ ప్రోటీన్ ఆహారం తీసుకోవచ్చు. కిడ్నీ సమస్యలు.. అధిక ప్రోటీన్ ఆహారం మూత్రపిండాలను కష్టతరం చేస్తుంది. ఇది కిడ్నీ సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారిలో ఇది ప్రమాదం.  దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వారి ఆహారంలో ఏవైనా మార్పులు చేసుకోవాలి.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత  చిక్కుళ్ళు, గింజలు,  విత్తనాలు, తృణధాన్యాలు,  సోయా వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను తీసుకోవచ్చు. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల బరువు పెరగడ,  జీర్ణ సమస్యలు, మూత్రపిండాల ఒత్తిడి,  శరీరం డీహైడ్రేషన్ కు లోనుకావడం జరుగుతుంది. అందువల్ల,  ఆహారాన్ని మార్చుకునే ముందు, వైద్యుడిని సంప్రదించాలి. అధిక ప్రోటీన్ ఆహారం చాలా మంచిది అని అనుకుంటారు.. కానీ  ప్రతి శరీరానికి,  ప్రతి పరిస్థితికి ఇది సరైనది కాదు. బరువు తగ్గడానికి లేదా కండరాలను నిర్మించడానికి,  అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవాలనుకుంటే, ఖచ్చితంగా డైటీషియన్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. అన్నింటికంటే బెస్ట్ ఏదంటే..  సమతుల్య ఆహారం.  దీనిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్,  సూక్ష్మపోషకాలు అన్నీ సరైన మొత్తంలో ఉంటాయి.                            *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
  నేటి బిజీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన,   రోజువారీ అలవాట్లు సక్రమంగా లేకపోవడం వంటివి  శరీరం,  మనస్సుపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. అటువంటి పరిస్థితిలో  యోగా,  ప్రాణాయామంతో  రోజును ప్రారంభిస్తే, మనం ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలం. ప్రాణాయామంలో 'ఉజ్జయి ప్రాణాయామం' చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది మనసును చురుగ్గా ఉంచుతూ శరీరాన్ని దృఢంగా మారుస్తుంది. అయితే అసలు ఈ ప్రాణాయామానికి ఉజ్జయిని ప్రాణాయామం అని పేరు ఎలా వచ్చింది? దీని వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? తెలుసుకుంటే.. దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? ఉజ్జయి ప్రాణాయామంలో 'ఉజ్జయి' అంటే 'విజయవంతుడు' లేదా 'విజయం సాధించేవాడు' అని అర్థం. ఈ పదం 'ఉద్' మరియు 'జి' అనే సంస్కృత పదాలతో రూపొందించబడింది. ఇక్కడ 'ఉద్' అంటే లేవడం లేదా బంధనం నుండి విముక్తి పొందడం, అలాగే 'జి' అంటే విజయం సాధించడం. ఇక 'ప్రాణాయామం' అంటే 'నియంత్రిత శ్వాస సాధన'. ఈ ప్రాణాయామం మనలో విశ్వాసాన్ని,  బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి దీనిని 'విజయవంతమైన శ్వాస' అని కూడా పిలుస్తారు. మెదడుకు మంచిది.. ఉజ్జయి ప్రాణాయామం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు గొంతు నుండి మృదువైన శబ్దంతో నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు  దృష్టి స్వయంచాలకంగా శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తుంది. ఇది మనస్సు అటు ఇటు కదిలిపోకుండా, చలించకుండా  ఉంచుతుంది.   ఆలోచించే,  అర్థం చేసుకునే శక్తిని పెంచుతుంది. అంతేకాదు.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు ఉంటే ఉజ్జయి ప్రాణాయామం చాలా బాగా  సహాయపడుతుంది.  లోతుగా శ్వాస తీసుకున్నప్పుడు, ఉదర అవయవాలపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల  కడుపు తేలికగా అనిపిస్తుంది. గుండె ఆరోగ్యం.. ఉజ్జయి ప్రాణాయామం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు శ్వాస వేగం తగ్గుతుంది. దీని కారణంగా గుండెపై ఎక్కువ ఒత్తిడి ఉండదు. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచుతుంది,  రక్తపోటును స్థిరీకరిస్తుంది. అధిక రక్తపోటు లేదా ఒత్తిడి ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ   గుండె జబ్బు ఉంటే ఈ వ్యాయామం చేసే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఊపిరితిత్తులు.. సాధారణంగా ప్రాణాయామం అంటే ఊపిరితిత్తులను బలంగా మారుస్తుంది.  ఇది గొంతు,  ఊపిరితిత్తులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్రాణాయామం గొంతులో చిక్కుకున్న శ్లేష్మాన్ని తొలగిస్తుంది. నెమ్మదిగా పీల్చడం,  నిశ్వాసించడం ఊపిరితిత్తులను బలపరుస్తుంది,  శ్వాసను సులభతరం చేస్తుంది. ఇది అలెర్జీలు, జలుబు,  శ్వాస సమస్యలకు సహాయపడుతుంది. దీనితో పాటు, ఉజ్జయి ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది,  మంచి నిద్రను ఇస్తుంది.  ఎందుకంటే దీనిని సాధన చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.  అలసట కూడా తొలగిపోతుంది, దీని కారణంగా రాత్రి త్వరగా నిద్ర వస్తుంది.  ఉదయం ఉత్సాహంగా నిద్రలేవచ్చు. శక్తినిచ్చే ఆసనం.. ఈ ప్రాణాయామం శరీరం లోపల వేడిని ఉత్పత్తి చేస్తుంది,  శక్తిని పెంచుతుంది.  రోజంతా అలసిపోయినట్లు లేదా సోమరితనంగా అనిపిస్తే ఈ ప్రాణాయామం శరీరాన్ని చురుగ్గా మారుస్తుంది. అందుకే దీనిని 'విజయవంతమైన శ్వాస' అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మవిశ్వాసం,  అంతర్గత బలాన్ని పెంచుతుంది. ఈ ప్రాణాయామం ఎలా చేయాలి? ఉజ్జయి ప్రాణాయామం చేయడానికి, ముందుగా ప్రశాంతమైన,  సౌకర్యవంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. కళ్ళు మూసుకుని శరీరమంతా రిలాక్స్ గా వదులుగా  ఉంచాలి. ఇప్పుడు ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి పీల్చుకోవాలి.  గొంతు నుండి తేలికపాటి 'ఘర్' శబ్దాన్ని కూడా చేయాలి. అది చాలా నెమ్మదిగా ఉండాలి. తరువాత ముక్కు నుండి నెమ్మదిగా గాలిని అదే విధంగా వదలండి. ఈ మొత్తం సాధన సమయంలో పూర్తి దృష్టి  శ్వాసపై ఉండాలి. తద్వారా మనస్సు చలించకుండా ప్రాణాయామం మీదే దృష్టి నిలుపవచ్చు. ప్రారంభంలో దీన్ని ఐదు నిమిషాలు చేయాలి. సాధన బలంగా మారినప్పుడు క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..