సినిమాలకు గుడ్ బై.. త్రిష పొటిలికల్ ఎంట్రీ కన్ ఫర్మ్?
posted on: Mar 14, 2026 10:12AM
.webp)
దక్షిణాది భాషల్లో టాప్ హీరోయిన్ త్రిష ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? తమిళరాజకీయాలలో కీలక పాత్ర పోషించనున్నారా? ఇటీవలే రాజకీయరంగ ప్రవేశం చేసిన హీరో విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీ ద్వారా ఆమె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా అన్న ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం ఇస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ వేడుకకు త్రిష విజయ్ తో కలిసి రావడంతో త్రిష పొలిటికల్ ఎంట్రీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై వస్తున్న వార్తలు వాస్తవమేనా అన్న అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అది పక్కన పెడితే.. ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను వేగంగా పూర్తి చేస్తున్న త్రిష కొత్త సినిమాలకు అంగీకరించడం లేదని ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తున్నది. వేగంగా తను నటిస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తి చేసి ఆ తరువాత ఆమె పూర్తి స్థాయిలో రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.


.webp)


