LATEST NEWS
  తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్‌ మండలం నల్లంపల్లి వద్ద నిర్వహించిన నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయదుర్గం ప్రజలకు ప్రేమ, పౌరుషం, అభిమానం ఎక్కువే..! “విజయనగరం రాజుల మూడో రాజధాని రాయదుర్గం. రాయదుర్గం కోటలో ఎంత పౌరుషం ఉందో.. ఇక్కడి ప్రజల్లోనూ అంతే పౌరుషం ఉంది. ఇక్కడ పట్టు చీరలు, జీన్స్ ఎంత ఫేమసో.. మీ ప్రేమ, అభిమానం, స్టైల్ కూడా అంతే ఫేమస్. అవన్నీ ఈరోజు ప్రత్యక్షంగా చూశాను. గత 11 ఎన్నికల్లో టీడీపీ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచినా.. గెలిచినా, ఓడినా రాయదుర్గం నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓబుళాపురం గనుల పేరుతో అడ్డగోలుగా అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు కమిటీ వేసి ప్రజల తరఫున పోరాడింది టీడీపీ. నాడు మనం చేసిన పోరాటానికి ఫలితంగా తాజాగా తీర్పు వచ్చింది. ప్రజల కోసం పోరాడింది.  కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత. దేశంలో మరే రాజకీయ పార్టీ కల్పించని విధంగా కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్న పార్టీ టీడీపీ. కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు ఖర్చు చేశాం. కష్టపడి పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు. మైటీడీపీ యాప్‌లో మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. నేను పరిష్కరిస్తాను..! “యువగళం పాదయాత్రలో కార్యకర్తలను కలిసినప్పుడు.. “పార్టీ కోసం పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వండి.. మమ్మల్ని గుర్తించండి” అని చాలామంది కోరారు. అందుకే మైటీడీపీ యాప్‌ను తీసుకొచ్చాం. మీరు పాల్గొనే ప్రతి పార్టీ కార్యక్రమం, మీరు సొంతంగా చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియాలంటే మైటీడీపీ యాప్‌లో ఫీడ్ చేయండి. క్లస్టర్, యూనిట్, బూత్ సమావేశాల్లో మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను మేము చదువుతున్నాం. మీరు చెప్పే సమస్యలు, సూచనలు మాకు చేరడం లేదనే అపోహ వద్దు. కొత్త పెన్షన్లు, ఇళ్లు ఇవ్వాలని కార్యకర్తలే ఫీడ్‌బ్యాక్‌లో కోరారు. కొత్త పెన్షన్ లు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిది.  ఇలా మీరు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే నేను నిర్ణయాలు తీసుకుంటాను. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కచ్చితంగా గుర్తింపు దక్కుతుంది. మీరు మమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదు.. మేమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. కోటి మంది సభ్యులతో కూడిన కుటుంబం మనది. సముద్రం లాంటి ఈ కుటుంబంలో సమస్యలు సహజం. మనలో మనమే చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎక్కడైనా మీ సమస్య పరిష్కారం కాకపోతే మా దగ్గరకు రండి. మీకు అండగా నేను ఉంటాను. కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎప్పుడూ ముందుండి పనిచేస్తాం” అని హామీ ఇచ్చారు. టీడీపీలో కార్యకర్తే అధినేత..! ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ నియోజకవర్గానికి వెళ్లినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అనంతరం కార్యకర్తలను కలవడానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి కార్యకర్తతో మాట్లాడి, ఫొటో దిగి, వారి సమస్యలను తెలుసుకున్న తర్వాతే అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే విలువకు ఇదే నిదర్శనం. 2025 మహానాడులో ప్రవేశపెట్టుకున్న ఆరు శాసనాల్లో “కార్యకర్తే అధినేత” అనేది అత్యంత ముఖ్యమైనది. టీడీపీలో కార్యకర్తే అధినేత. అందుకే మహానాడు, అసెంబ్లీ, మండలి సహా పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కార్యకర్తలు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి వేదికను పంచుకుంటున్నారు.  కష్టపడి పనిచేసే కార్యకర్తకు గుర్తింపు, గౌరవం కల్పించడం టీడీపీ బాధ్యత. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ కోసం ప్రాణాలు వదిలిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు చట్టాన్ని సవరించి బిల్లు తీసుకొచ్చాం. వైసీపీ ఎమ్మెల్సీలు అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు బిల్లును చట్టంగా చేసి చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాం. నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవానికి ఇదే నిదర్శనం. పులివెందుల ప్రజల కోసమైనా జగన్ అసెంబ్లీకి రావాలి..! “జగన్ ప్రెస్‌మీట్ పెడితే మనందరికీ పండగే. చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో ఆయన చెప్పే విషయం ఏమీ తెలియని వారికి కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది. కానీ మాజీ సీఎం జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండూ ఒకటేనంటారు. జగన్ రెడ్డికి మరోసారి సవాల్ చేస్తున్నా. టైమ్, డేట్, లొకేషన్ నువ్వే ఫిక్స్ చేయి.. డీఎస్సీపై చర్చకు నేను సిద్ధం. అసెంబ్లీలోనూ ఎన్ని రోజులైనా చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. నా సవాల్‌ను స్వీకరించి ఎందుకు రావడం లేదు? ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించకుండా, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదనే వాస్తవం బయటపడుతుందనే భయమా?  ప్రెస్‌మీట్లు ఎందుకు.. అసెంబ్లీకి రా! పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే వారి సమస్యలను అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించడం లేదు? రెండేళ్లలో జగన్ అసెంబ్లీకి వచ్చింది ఒక్కసారి మాత్రమే. అది కూడా ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. జగన్‌లా నేను కంచుకోటలో గెలిచిన వ్యక్తిని కాదు. 1988 తర్వాత టీడీపీ ఎప్పుడూ గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడినా వెనక్కి తగ్గకుండా పోరాడి విజయం సాధించాను. కుప్పంలో పోటీ చేయమని చెప్పినా మంగళగిరిలోనే నిలబడి 91 వేల మెజార్టీతో గెలిచి ఆ విజయాన్ని చంద్రబాబు గారికి గిఫ్ట్ గా ఇచ్చాను. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను. నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే.. పులివెందుల ప్రజల కోసమైనా అసెంబ్లీకి రా..!” అని సవాల్ విసిరారు. కూటమి ఐక్యతను కాపాడండి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే మన లక్ష్యం“కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి కూటమిలో విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన, బీజేపీ పేరుతో టీడీపీని తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ల ప్రచారాన్ని నమ్మి ఆవేశపడకుండా కూటమి ఐక్యతను కాపాడాలి. మనమంతా ఐక్యంగా ఉండి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి కూటమి బలాన్ని మరింత పెంచాలి” అని పిలుపునిచ్చారు. కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది..! “మీ అభిమానానికి నేను ధన్యుడిని. యువగళం పాదయాత్రలో కణేకల్‌కు రాలేకపోయిన లోటు నేడు తీరిపోయింది. మీరు ఇచ్చిన ఘన స్వాగతం, చూపించిన ప్రేమ, అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. పట్టణ అధ్యక్షుడి ఆత్మీయ పలకరింపు నా గుండెను హత్తుకుంది. వీలైతే మీ ఇంటికి భోజనానికి వస్తాను. గతంలో కణేకల్‌కు సీఎం చంద్రబాబు గారు వచ్చినప్పుడు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయిలో జరగడం లేదు. కానీ కణేకల్‌కు డిగ్రీ కళాశాల మంజూరు చేసే బాధ్యత నాది. నిధులు సమకూర్చే బాధ్యత మంత్రి కేశవ్ గారిది. రెండు సంవత్సరాల్లో అడ్మిషన్లు పూర్తిస్థాయికి తీసుకెళ్లే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా జీ.లక్ష్మీనారాయణ, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, అనంతపురం పార్లమెంట్ ప్రెసిడెంట్ పూల నాగరాజు, అనంతపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు బి. గురప్ప, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu Desam Party, Rayadurgam, Anantapur, Local Body Elections, TDP Cadre, Party Workers, My TDP App, TDP Alliance, CM Chandrababu Naidu, Andhra Pradesh Development, TDP Welfare, Kalyan Yojana, Political Alliance, Jana Sena, BJP, AP Politics  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయం ప్రస్తుతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల (ముఖ్యంగా పట్టణ, నగర పాలక సంస్థల) చుట్టూ తిరుగుతోంది. మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వానికి ఎదురవుతున్న రాజకీయ సవాళ్లు, క్షేత్రస్థాయి పరిణామాలపై టోన్ న్యూస్ ప్రత్యేక చర్చ కార్యక్రమం నిర్వహించారు.  ఈ విశ్లేషణలో ప్రధాంశాలు..రాజకీయ పరిస్థితులు.. పట్టణ ఓటర్లు  క్షేత్రస్థాయి అసంతృప్తిగ్రామీణ ప్రాంతాల ఎన్నికలతో పోలిస్తే పట్టణ ప్రాంత ఎన్నికలు పూర్తి భిన్నమైనవి. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు స్థానిక నాయకత్వం  వ్యక్తుల ప్రాతిపదికన సాగుతాయి. కానీ, మున్సిపాలిటీలు  కార్పొరేషన్లలో పార్టీ గుర్తులపై నేరుగా పోరు జరుగుతుంది. పట్టణాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు సంక్షేమ పథకాలపై పూర్తిగా ఆధారపడరు. వారు ప్రభుత్వ పాలనాతీరు, మౌలిక వసతులు, పారదర్శకతను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.  పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలు, మున్సిపల్ ఆఫీసులలో అవినీతి విచ్చలవిడిగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతుల నుంచి ఇతర చిన్న పనుల వరకు స్థానిక ప్రజాప్రతినిధుల జోక్యం, వేధింపులు పెరిగాయనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో అవినీతి రహిత పాలన అని ప్రకటించినా, క్షేత్రస్థాయిలోని పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉండటం ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. చంద్రబాబు వ్యూహం మౌలిక లోపాలుకూటమి ప్రభుత్వం తన ప్రధాన ఘనతలుగా పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని నిర్మాణం, పరిశ్రమల రాకను ప్రచారం చేసుకుంటోంది.  అయితే ఈ వ్యూహంలో పలు రాజకీయ లోపాలు కనిపిస్తున్నాయి:అమరావతి కేంద్రీకరణ: అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేయడం ప్రాధాన్యమే అయినప్పటికీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల్లో ఇది అంతగా భావోద్వేగాన్ని కలిగించడం లేదు. సొంత నియోజకవర్గాల్లో రోడ్ల గుంతలు, మౌలిక వసతులు లేని స్థితిలో రాజధానిపైనే కోట్లు ఖర్చు చేయడం పట్ల కొంత వ్యతిరేకత వస్తోంది. పోలవరం పరిశ్రమలు: పోలవరం పనులు నెమ్మదించడం, పరిశ్రమల ఒప్పందాలు కేవలం ప్రకటనలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలుగా మారకపోవడం నిరుద్యోగులను నిరాశకు గురిచేస్తోంది. సంక్షేమం – ప్రచార లోపం: ప్రభుత్వం భారీ స్థాయిలో పెన్షన్లు (రూ. 4,000) ఇస్తున్నప్పటికీ, గత ప్రభుత్వంలో ఉన్నట్లుగా పథకాల సమర్థవంతమైన ప్రచారం, కచ్చితమైన అమల్లో లోపాలు కనిపిస్తున్నాయి. రైతాంగ సమస్యలు : కరువు పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల గురించి స్పష్టత ఇవ్వకపోవడం, పంట కొనుగోళ్లలో వ్యత్యాసాలు రైతుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావంరాబోయే మున్సిపల్ ఎన్నికలు కూటమి ప్రభుత్వ పాలనకు తొలి ప్రాక్సీ టెస్ట్‌గా మారనున్నాయి.  గతం కంటే మెరుగైన పాలన అందిస్తున్నామని నిరూపించుకోవడంలో వైఫల్యం చెందితే, పట్టణ ప్రాంతాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ పుంజుకునే అవకాశం ఉంది.శాసనసభ్యుల అవినీతిని అరికట్టడం, నిత్యావసరాలు మరియు మౌలిక వసతులపై దృష్టి సారించడం, పరిశ్రమలను త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడంపై చంద్రబాబు నాయుడు తక్షణమే దృష్టి సారించాల్సి ఉంది. లేనిపక్షంలో, పట్టణ ఓటర్లు ఇచ్చే తీర్పు రాబోయే సాధారణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది.   AP Municipal Elections, CM Chandrababu Naidu Strategy, AP Politics Telugu, Amaravati Development, TDP vs YSRCP, AP Local Body Elections, AP Corruption Issues, AP Urban Elections, Polavaram Project Update, AP Welfare Schemes  
  తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖను కేబినెట్‌ నుంచి, చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి మరికాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలవనున్నారు. ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన నివేదికలోని అంశాలు, చర్యలకు గల కారణాలను సీఎం దృష్టికి మల్లు రవి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి, వైస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ మోహన్‌ తమ నివేదికను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు సమర్పించారు. మంత్రి కొండా సురేఖ విషయంలో గతంలో హెచ్చరికలు చేసినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు రాలేదని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. పార్టీ లైన్‌ దాటి వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని, కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అత్యంత కీలకమని కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అదేవిధంగా చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పించాలని క్రమశిక్షణ కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ సిఫారసులపై సీఎం రేవంత్‌రెడ్డి తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతం కాంగ్రెస్‌ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. Telangana Congress, Konda Surekha, Chinna Reddy, CM Revanth Reddy, MP Mallu Ravi, Telangana Politics,TPCC, Mahesh Kumar Goud  
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడేళ్లవుతోంది... సిబిఐ విచారణ ముగిసిందనుకుంటున్న సమయంలో, హఠాత్తుగా ఈడీ ఎందుకు ఎంటర్ అయింది?  అవినాష్ రెడ్డి ఇల్లు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఇళ్లపై జరిగిన దాడుల్లో కేవలం 24 లక్షల క్యాష్, కొన్ని డాక్యుమెంట్లు మాత్రమే దొరికాయా? లేక ఈ దాడుల వెనుక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేసే పెద్ద విషయం ఏమైనా జరగబోతోందా? అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. దీనిపై సీనియర్ జర్నలిస్టు, ఎనలిస్ట్ వీవీరావు తెలుగువన్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో,  న్యాయ వర్గాల్లో గత కొన్నేళ్లుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో హఠాత్తుగా ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హఠాత్తుగా రంగానికి దిగి తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. 2019 మార్చి నెలలో జరిగిన వైఎస్ వివేకా  హత్య ఉదంతంలో ఇప్పటివరకు  సిబిఐ విచారణ జరుపుతుండగా, ఉన్నట్టుండి ఈడీ అధికారులు రంగప్రవేశం చేయడం వెనుక ఉన్న కారణాలపై విశ్లేషకులు మరియు సామాన్య ప్రజలు ఆసక్తికరమైన చర్చలకు తెరలేపారు. ఈడీ అధికారులు నిర్వహించిన సోదాల్లో భాగంగా పలు కీలకమైన ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నిందితులు, సాక్షులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తుల ఇళ్లలో జరిపిన శోధనలలో  24 లక్షల రూపాయల నగదుతో పాటు అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. అయితే హత్య జరిగిన  ఏడేళ్ల తరువాత నిందితుల ఇళ్లలో కీలక డాక్యుమెంట్లు ఉంటాయా? సంఘటన జరిగిన గంటల వ్యవధిలో సాక్ష్యాలను తారుమారు చేస్తున్న నేటి పరిస్థితుల్లో హత్య జరిగిన ఏడేళ్ల తరువాత కీలక పత్రాల స్వాధీనం అంటూ వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవని వీవీరావు విశ్లేషించారు.  ఈ తనిఖీల వెనుక కేవలం హత్య కేసు విచారణ మాత్రమే  లేదన్నారు. అయినా ఈడీ వంటి దర్యాప్తు సంస్థల తనిఖీలు రానున్న రోజులలో జరగనున్న రాజకీయ పరిణామాలకు తార్కాణమని గత అనుభవాలను బట్టి  అవగతం చేసుకోవచ్చునన్నారు. ఇప్పుడు ఈడీ దాడుల వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇటీవలే జగన్ హయాంలో ఏపీలో చక్రం తిప్పిన ఐఏఎస్ అధికారి ఒడిషాలో కాంగ్రెస్ గూటికి చేరడం... రానున్న రోజుల్లో జగన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఎందుకంటే.. ఏడేళ్ల తరువాత ఇప్పుడు ఈడీ ఈ కేసులో అవినాష్ రెడ్డి తదితరుల నివాసాలలో ఆధారాల కోసం తనిఖీలు నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. రానున్న రోజులలో జరగబోయే పరిణామాలేమిటన్నది వేచి చూడాలన్నారు.   Jagan to join Congress, YS Viveka Case ED Raids, YS Vivekananda Reddy Murder Case, ED Investigation, Avinash Reddy ED Raids, TeluguOne
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ప్రకటించేశారు. శ్రావణ శుక్రవారం రోజే తాను విజయవాడ వేదికగా కొత్తపార్టీ ప్రకటన చేస్తానని వెల్లడించారు.  తాను త్వరలోనే కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే వెల్లడించిన విజయసాయి. ఇప్పుడు ఆ పార్టీ ప్రకటన ఎప్పుడు, ఎక్కడ అన్న విషయంలో క్లారిటీ ఇచ్చారు.    శ్రావణమాసం మూడో శుక్రవారం నాడు  విజయవాడ వేదికగా  పార్టీ పేరు, జెండా, అజెండా, విధివిధానాలను వెల్లడిస్తానని చెప్పారు.  ప్రజాసమస్యలపై నిలదీసేందుకు,  ప్రజల గొంతుకగా మారేందుకు చట్టసభల్లో ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ బాయ్ కాట్ ను తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు.   గత కొంతకాలంగా విజయసాయిరెడ్డి రాజకీయ అడుగులపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ సన్యాసం ప్రకటించిన ఇంత కాలానికి సొంత రాజకీయ వేదక ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం విశేషం.    Vijayasai Reddy Political Party Announcement, Vijayawada, Sravana Sukrvaram, Vijayawada,   AP Politics, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మళ్లీ లైంగిక వేధింపుల అంశం తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కాస్టింగ్ కౌచ్‌పై చర్చలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా, వెలుగులోకి వస్తున్న ఘటనలు మాత్రం ఇండస్ట్రీ వర్గాలను షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా ఓ యువ తెలుగు దర్శకుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లడం టాలీవుడ్‌ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాధిత నటి అందించిన ఆధారాలు మరియు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు తక్షణమే స్పందించి సదరు ఫిల్మ్ మేకర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ సదరు దర్శకుడిపై సంచలన ఆరోపణలు వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అయితే ఈసారి బాధిత నటి తగిన ఆధారాలతో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అధికారులు కేసును సీరియస్‌గా తీసుకొని చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ దర్శకుడు ఒక మలయాళ నటుడితో సినిమా రూపొందించే పనిలో ఉన్నాడని, అయితే ఆయనపై ఉన్న పాత వివాదాలు మరియు వివాదాస్పద వ్యవహారశైలి మళ్లీ ఆయనను చిక్కుల్లో పడేసిందని విశ్లేషిస్తున్నారు. మహిళా భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు ఎంతో కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. చిత్రసీమలో అవకాశాల పేరుతో జరిగే అక్రమాలు, వేధింపులపై గతంలో కూడా అనేకమంది కథానాయికలు బహిరంగంగానే పెదవి విప్పిన సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా హేమ కమిటీ నివేదిక వంటి పరిణామాలు సినీ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపాయి. సోషల్ మీడియాలో కూడా ఈ అరెస్ట్ వార్త వైరల్‌గా మారడంతో సినీ అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో రానున్న రోజుల్లో మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది. పోలీసులు త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేసి కేసు వివరాలను వెల్లడించే చాన్స్ ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రెజెంట్ థియేటర్స్ లో యష్ జోరు టాక్సిక్ రూపంలో 12,000కు పైగా స్క్రీన్లలో   కొనసాగుతూ ఉంది. అయితే ఉదయం ఆరుగంటల ఆట నుంచే నుంచే సోషల్ మీడియాలో నెగిటివ్ టాక్, డివైడ్ రివ్యూల ప్రచారం మొదలైంది. ముఖ్యంగా మూవీలో  హింస, రక్తపాతం, అడల్ట్ కంటెంట్ మోతాదుకి మించిపోయాయని, కథ నేరేషన్ నెమ్మదించిందంటూ కొందరు క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు.  అయితే ఈ రకమైన నెగిటివ్ రివ్యూలపై యష్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఫ్యాన్స్ లేవనెత్తుతున్న మొదటి సూటి ప్రశ్న ఏమిటంటే— అసలు 'టాక్సిక్' చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)  'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికెట్ జారీ చేసింది. సెన్సార్ రికార్డుల్లోనే ఇది తీవ్రమైన హింస, చీకటి గ్యాంగ్‌స్టర్ ప్రపంచం, బ్రూటల్ యాక్షన్, నైతిక సంఘర్షణలతో కూడిన కథ అని స్పష్టంగా వర్గీకరించారు.  పైగా ఎలాంటి కట్స్ లేకుండా కేవలం హెచ్చరికలతో మాత్రమే బోర్డు అనుమతి ఇచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి. ఇది పిల్లల కోసం లేదా ఫ్యామిలీ కోసం తీసిన క్యూట్ లవ్ స్టోరీ కాదు అని ముందే తెలిసినప్పుడు, థియేటర్ కి వచ్చి చూసి "సినిమాలో హింస ఎక్కువైంది, అందుకే నచ్చలేదు" అని మాట్లాడటంలో అర్థం ఉందా! డార్క్ గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌లో రివేంజ్, విధేయత, హింస ప్రధానాంశాలుగా ఉంటాయి. గ్యాంగ్‌స్టర్ కథలో రక్తపాతం లేకుండా సెంటిమెంట్ చూపించమంటే అది దర్శకురాలి విజన్‌ను తప్పుపట్టడమే అవుతుంది.  మేకింగ్, రా పెర్ఫార్మెన్స్, విజువల్స్ పక్కనపెట్టి కేవలం 'వయెలెన్స్' ని టార్గెట్ చేస్తూ నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం సరికాదని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసురుతున్నారు.  Also Read: టాక్సిక్ మూవీ హైలెట్స్   ఇక టాక్సిక్  నెగిటివ్ ట్రోల్స్ నడుస్తున్నప్పటికీ ఒక్క బుక్‌మైషోలోనే గంటకు 52,000 పైగా టికెట్లు అమ్ముడవుతూ ట్రెండ్ అవుతోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా స్టార్ చిరంజీవి కాకా ఫేమ్ కే. వెంకట్ నారాయణ  నిర్మించాడు. TOxic, yash, Venkat K Narayana  
  అభిమానుల ఆశలకి వెల్ కమ్ చెప్తు  యష్ వన్ మాన్ షో' టాక్సిక్' ఈ రోజు వరల్డ్ వైడ్ గా టేక్ ఆఫ్ అయ్యింది. దీంతో  తెల్లవారుజామునుంచే అభిమానులు. మూవీ లవర్స్ తో  థియేటర్స్  దగ్గర కోలాహలం నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే సరికొత్త రికార్డు రికార్డులు క్రియేట్ చేసిన టాక్సిక్ కి టాక్ అయితే మిశ్రమంగా వస్తుంది. 1 . యష్ పెర్ ఫార్మెన్స్  2 . కాస్ట్యూమ్స్  3 .తన కొడుకు చనిపోయినా బతికే ఉన్నాడని యష్ అనుకోవడం  4 . రొమాన్స్ సీన్స్  5 . ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్  6 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 7 . ప్రొడక్షన్ వాల్యూస్  8 . మేకింగ్  Also Read: Toxic Movie Review Telugu: టాక్సిక్ మూవీ రివ్యూ  'టాక్సిక్' కథాంశం 1947 నాటి స్వాతంత్య్రానంతర గోవా నేపథ్యంతో నడుస్తుంది. మాఫియా సామ్రాజ్యాలు, అధికారం కోసం జరిగే పోరాటాలు, నమ్మకద్రోహం మరియు ప్రతీకారం చుట్టూ తిరుగుతాయి. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తార సుతారియా,డారీ డిసిల్వా  తదితరుల పెర్ ఫార్మెన్స్ కైతే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.  Toxic, Yash, Geethu Mohandas, Tara Sutaria
Vinod Kumar, who carved a special place in the hearts of Telugu audiences with films such as "Kartavyam, Mouna Poratam, Bharat Bandh, People’s Encounter, Maavagaaru, and Seetharatnam Gari Abbayi, is known not only for his performances as a hero but also for his warm and generous nature. He has always shared a special bond with the people who have worked with him, treating his staff and admirers with affection, respect and genuine concern. His recent gesture once again reflects the kind of person he is. Satish, a resident of Tadepalligudem, worked with Vinod Kumar for nearly 20 years as his personal assistant and personal touch-up boy. He later moved to Tadepalligudem, where he settled down and is currently involved in running a security-guard agency, besides managing a hospital owned by his friend. Despite the passage of time, Vinod Kumar has remained in regular touch with Satish. Recently, Vinod Kumar visited Tadepalligudem for the shooting of his upcoming film titled "Paradesi". During his stay, he specifically called Satish over and spent time talking to him. He then went to Satish’s home, spent more than two hours with his family and accepted their hospitality. Going a step further, Vinod Kumar gave ₹20,000 to Satish’s mother and asked her to buy clothes for herself. The gesture left Satish deeply emotional as he recalled his long association with the actor. He shared, “I worked with Vinod Kumar garu for 20 years. He never treated me like a worker. Not just me, he shows the same affection and respect towards everyone who works with him. Due to family circumstances, I moved to Tadepalligudem and settled here, but our bond has remained unchanged. He calls me two or three times every month to enquire about our well-being. Every year, he sends money for our entire family to buy clothes. Two years ago, when I underwent bypass surgery, he sent me ₹50,000." Further he revealed, “Now, the fact that he came to Tadepalligudem for a shoot, visited our home and spent more than two hours with us made me extremely happy. He even called me to the shooting spot and had me do his touch-up, just as I used to do earlier. I will always feel proud that I had the opportunity to work with a great human being like Vinod Kumar garu. He also told me that they are planning to introduce his son as a hero soon.Vinod Kumar garu’s son grew up in front of me. I sincerely wish that he becomes an even bigger hero than his father.” Vinod Kumar’s visit may have been a simple gesture in his eyes, but for Satish and his family, it became an unforgettable moment—one that beautifully reflects the value he continues to place on relationships, long after professional associations have ended. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
"కర్తవ్యం, మౌన పోరాటం, భారత్ బంద్, పీపుల్స్ ఎన్కౌంటర్, మామగారు, సీతారత్నం గారి అబ్బాయి" వంటి చిత్రాలతో తెలుగునాట ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు వినోద్ కుమార్. హీరోగా ఆయనకు ఎంత మంచి పేరు ఉందో.. వ్యక్తిగతంగాను అంతే మంచి పేరుంది. తన దగ్గర పనిచేసే సిబ్బంది పట్ల తన అభిమానుల పట్ల ఆయన అపారమైన ప్రేమాభిమానాలు, ఆదరణ కనబరుస్తుంటారు.  తాజాగా ఆయన చూపిన ఔదార్యం వినోద్ కుమార్ వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. తాడేపల్లిగూడెంకు చెందిన సతీష్ సుమారు 20 ఏళ్లు వినోద్ కుమార్ దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా, పర్సనల్ టచప్ బాయ్ గా పని చేశాడు. తదనంతర కాలంలో తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డాడు. సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నడంతోపాటు తన మిత్రుడికి చెందిన ఆసుపత్రి నిర్వహించే సతీష్ తో ఇప్పటికీ రెగ్యులర్ గా టచ్ లోనే ఉండే వినోద్ కుమార్ ఇటీవల "పరదేశి" అనే సినిమా షూటింగ్ నిమిత్తం తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన సతీష్ ను తన వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడడంతో పాటు.. సతీష్ ఇంటికి వెళ్లి, అతని కుటుంబ సభ్యులతో రెండు గంటలు పైగా గడిపి, వారి ఆతిధ్యం స్వీకరించి, తన గొప్ప మనసును చాటుకున్నారు. అంతేకాదు సతీష్ మాతృమూర్తి చేతిలో 20,000/- పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పారు.  ఈ సందర్భంగా వినోద్ కుమార్ తో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు సతీష్. "వినోద్ కుమార్ గారి దగ్గర నేను 20 ఏళ్లు పని చేశాను. నన్ను ఎప్పుడు ఆయన ఒక వర్కర్ లా చూడలేదు. నన్ననే కాదు, ఆయన దగ్గర పని చేసే ప్రతి ఒక్కరి పట్ల ఆయన అంతే ప్రేమను చూపుతారు. కుటుంబ కారణాల వల్ల నేను తాడేపల్లిగూడెం వచ్చి స్థిరపడ్డాను. అయినా ఆయనతో అనుబంధం అలాగే కొనసాగుతోంది. నెలకు రెండు మూడు పర్యాయాలైనా ఫోన్ చేసి యోగక్షేమాలు విచారిస్తారు. ప్రతి సంవత్సరం ఫ్యామిలీ మొత్తం బట్టలు కొనుక్కోమని డబ్బులు పంపిస్తారు. రెండేళ్ల క్రితం నాకు బైపాస్ సర్జరీ జరిగినప్పుడు 50 వేలు పంపించారు. ఇప్పుడు షూటింగ్ కోసం తాడేపల్లిగూడెం వచ్చి, మా ఇంటికి రావడం.. మాతో రెండు గంటల పైగా గడపడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. నన్ను షూటింగ్ స్పాట్ కి పిలిపించుకొని నాతో "టచప్" కూడా చేయించుకున్నారు. వినోద్ కుమార్ లాంటి గొప్ప మనిషి దగ్గర పనిచేసినందుకు నేను ఎప్పుడూ గర్వపడుతుంటాను.. త్వరలోనే అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నామని చెప్పారు. నా చేతుల్లో పెరిగిన మా వినోద్ కుమార్ గారబ్బాయి... వాళ్ళ నాన్న కంటే పెద్ద హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అన్నాడు.       Vinod Kumar, Personal Assistant, Heartwarming Gesture  
Cast: Yash, Nayanthara, Kiara Advani, Tara Sutaria, Huma Qureshi, Rukmini Vasanth Crew:  Writte by Yash, Geetu Mohandas Music by Vishal Mishra, Ravi Basrur, Tanishk Bagchi, Faheem Abdullah, Arslan Nizami Cinematography by Rajeev Ravi Editing by Ujwal Kulkarni Directed by Geetu Mohandas Produced by Venkat K. Narayana, Yash Yash has become highly revered Rocky Bhai of Indian Cinema with KGF franchise. Post a 4-year hiatus, he has hit screens with his Toxic. He played a dual role as an old man and a young boy, in this gangster epic. Movie is directed by Geethu Mohandas and produced by KVN productions and Yash. The movie released today and let's discuss about the movie in detail.  Plot:  Raya (Yash) and his elder sister Ganga (Nayanthara) have a troubling childhood with their mother (Sanjeeda Sheikh) killing their father and choosing prostitution as her job. They both desire to rule Protugese Goa in 1947 post Independence. They kill opium drug dealer don Fernandez and his brother Mob Boss Salvador (Darrell D'Silva) takes them under his wing. But his mistress Elizabeth (Huma Qureshi) and her brother Tony (Akshay Oberoi) don't appreciate the raise of Raya. Ganga forms Raya's alliance with Rebecca (Tara Sutaria) but Raya falls in love with circus performer Nadia (Kiara Advani).  Before the wedding, Nadia is sent away but she becomes pregnant with Raya's kid, as he is obsessed with her. Salvador decides to kill her but Raya instead kills everyone. Meanwhile, Tony tries to kill Raya and Salvador to take over the drug mafia but as his conspiracy spills out, Salvador and Ganga force Elizabeth to kill Tony. She promises revenge. What happens next? Why Nadia raises her son Ticket (Yash) away from Raya? Why Ticket hates Raya? Who are Melisa (Rukmini Vasanth) and Adam. Watch the movie to know more.  Analysis:  Yash is good in the climax portions and his screen presence stands out. But he doesn't get any support from writing as everything looks to be scaled up to fit his Rocky Bhai persona. A very grounded film and dark story is forced to become so huge and even star power of Yash suffers to carry it on his shoulders. Tara Sutaria fits as a Portugese Indian and Kiara Advani is good in several portions.  But Nayanthara's make-up is oddly designed along with Huma Qureshi and Rukmini Vasanth. Their roles seem to have been designed to showcase how desire for power and Toxic environment surrounding them force them to take bold decisions. But none of them really click. Odd make-up choices are evident in Rukmini and Nayanthara styling especially. Tara Sutaria and Kiara get better dresses and pull off their look but their performances seem to be pushed over the top just for sake of it.  Kiara has gone too bold in her portrayal and bold scenes seem unnecessary even to show passion. The overtly drinking scenes, drug usage and violence do not really fit the story that Geethu Mohandas intended to tell. It looks like a psychological thriller being told in the form of KGF while it totally doesn't deserve such scaling up even one bit.  Telugu dub dialogues needed to fit what local people speak but they seem to have been translated from Kannada language which works against the intent. Each line seems unintentionally funny and over dialogue baazi for the sake of it. The dialogues are a big minus. Editing pattern looks like a template KGF film which doesn't fit the screenplay one bit. If we need a moment to understand why the relationship is Tabaahi, we don't get it. If we need to understand how things are changing with power, we don't get it.  Everything seems to be in a rush to go for the final frame. Action sequences work but the gore elements seem unnecessary. VFX work and techncially sound design are good enough. Even production design, grand sets are visibly, painstakingly well built. Still, none of it elevate the written material. In fact, writing is so let down that even if technical elements work, writing doesn't. Cinematography is good with several frames really being outstandingly executed but overall feel for such a psychological thriller is completely missing.  KVN Productions and Yash spent a lot on this film but they should have thought twice before scaling it up. Ravi Basrur music also doesn't help the movie one bit. We can say that Toxic is a misfire with technical department working well enough but writing and execution not living up to it at all.  Positives: Yash screen presence and performance VFX Work Cinematography  Production Values Negatives: Over the top narrative Dialogues Screenplay that tries to cramp a lot  Very lethargic Writing  Make-up and styling for few female leads Editing Pattern heavily relying on KGF Template Bottomline: Toxic doesn't live up to the expectations as film could not effectively choose between being a grounded psychological thriller or a big mass actioner.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
-సినిమా పేరు: టాక్సిక్  -నటీన‌టులు: యష్, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హ్యూమా ఖురేషి, తార -సుతారియా,డారీ డిసిల్వా  తదితరులు  -సినిమాటోగ్ర‌ఫీ: రాజీవ్ రవి  -ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి  -మ్యూజిక్: విశాల్ మిశ్ర, రవి బసూర్, బాగ్చి, అబ్దుల్లా, నిజామి -నిర్మాతలు: వెంకట్ కే నారాయణ, యష్   -బ్యానర్:  కేవిఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టార్ ప్రొడక్షన్స్   -రచన,దర్శకత్వం: గీతు మోహన్ దాస్ -రిలీజ్ డేట్ : ఆగష్టు 26 ,2026  రాకింగ్ స్టార్ యష్ ఈ రోజు టాక్సిక్ తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టాడు. మరి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకున్న' టాక్సిక్' ఎలా ఉందో చూద్దాం. కథ రాయ( యష్).. భవిష్యత్ పై ఆశ, చావు భయంలేని మిసైల్ లాంటి వ్యక్తి. ప్రేమ, పాశం లాంటి వాటికి కూడా చాలా దూరంగా ఉంటూ మందు,మగువతో సావాసం చేయడం రాయ  హాబీ. చట్ట విరుద్ధంగా 'opium ' అనే అత్యంత ఖరీదైన డ్రగ్ ని డీల్ చేసే అసాంఘిక కంపెనీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉంటాడు. అక్క గంగ (( నయన తార) అంటే చాలా ఇష్టం. రాయని కింగ్ గా చూడాలనేది గంగ జీవిత లక్ష్యం. రాయని తన అల్లుడుగా చేసుకోవాలని నెంబర్ 1 సల్వా దార్( డారెల్ డిసిల్వా ) కోరిక. తన కూతురు పేరు రెబకా( తార సుతారియా). రాయ, రెబకా శారీరకంగా కూడా కలిస్తారు. నడియా ( కియారా అద్వానీ) ఒక ఫేమస్ సర్కస్ కంపెనీ లో స్టంట్స్ మెజీషియన్. ఆత్మభిమానం పొగరు కలగలిపిన యువతీ. నడియాని ఇష్టపడిన రాయ శారీరకంగా కాలుస్తాడు. ఒక కొడుకు కూడా పుడతాడు. కానీ రాయ వాళ్ళకి దూరంగా ఉంటూ కొడుకుని సైతం చంపేస్తాడు. రాయ నిజంగానే కొడుకుని చంపాడా?  అంతగా  ప్రేమ, పాశం లేని వ్యక్తినా?  నడియా ఏమైంది? రెబకా ఏమైంది? రాయ జీవితంలోకే వచ్చిన మెలిసా (రుక్మిణి వసంత్), టికెట్ (యష్) ల కథ ఏంటనేదే టాక్సిక్     ఎనాలసిస్  మేకర్స్ టాక్సిక్  కథని ఎలా ఓకే అనుకోని తెరకెక్కించారో అని  మూవీ చూస్తున్నంత సేపు అర్ధమవుతుంది.డ్రగ్ నేపథ్యంలో మొదలైన కథ అసాంఘిక శక్తుల మధ్య పోరాటం, రాయ   వ్యక్తిగత జీవితం నేపథ్యంతో టాక్సిక్ కథ ముగిసింది.   ఓపెనింగ్ సీన్ తో పాటు మొదటి పది నిముషాలు ఒక మాదిరిగానే ఉన్నా, మూవీ జరిగే కొద్దీ టాక్సిక్ నచ్చుతుందేమో అని అనుకుంటాం. కానీ మూవీలోకి వెళ్లే కొద్దీ సహనానికి పరీక్ష పెడుతుంది. తుపాకుల శబ్దాలు, ఆల్కహాల్ తాగడం, రొమాన్స్  తప్ప  ఏం లేదు. విచిత్రంగా నటీనటుల హావభావాలు కూడా డల్ గా సాగుతాయి. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే యష్ ఎంట్రీ సీన్ తేలిపోయింది. ఆ తర్వాత రెబాక( తార సుతారియా) తో వచ్చిన రొమాన్స్ సీన్స్ బాగానే ఉన్నాయి. యాక్షన్ సీన్స్ సైతం పర్లేదు. ఆ తర్వాత నడియా(కియారా అద్వానీ) ఎంట్రన్స్ తో అయినా కథనంలో ఊపు వస్తుందేమో అనుకుంటాం. కానీ అలాంటిదేం ఉండదు. గంగ, రాయ పై వచ్చిన సీన్స్ సైతం బాగోలేదు. ఇంటర్వెల్ ముందు వచ్చిన యాక్షన్ సీక్వెన్స్ పర్లేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే రాయలో మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ సీన్స్ నడిచినా వాటిని ఎలివేట్ చేయడంలో ఫైర్ మిస్ అయ్యింది. ఏ క్యారక్టర్ ఎప్పుడు సరదాగా ఉంటుందో, సీరియస్ గా ఉంటుందో తెలియదు. మెలిసా( రుక్మిణి వసంత్) ,రాయ మధ్య వచ్చిన సీన్స్ . అవసరం, శారీరక సుఖం కోసమే బంధాలు ఏర్పడతాయనే విధంగా ఉన్నాయి. టికెట్( యంగ్ యష్) ఇంట్రడక్షన్, శాడిజంతో కూడిన వైలెన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అలాంటి సీన్స్ అన్ని చాలా సినిమాల్లో వచ్చేసినవే. ప్రొడక్షన్ వాల్యూస్, ఫొటోగ్రఫీ, యష్ నటన మాత్రం పర్లేదు. డైలాగ్స్ పర్వాలేదనే స్థాయిలోనే ఉన్నాయి.  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు  రాయ, టికెట్ గా యష్ నటన అభిమానులకి నచ్చుతుంది. కానీ కథనంలో పదును లేకపోవడంతో కొన్ని చోట్ల తేలిపోతుంది. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తార సుతారియా పెర్ ఫార్మ్ పర్లేదు. నయనతార మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. మిగతా ఆర్టిసుల గురించి పెద్దగా చెప్పుకునే అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ, విజువల్స్ , డైరెక్షన్ ఎక్స్ టార్డినరీ. నిర్మాణ విలువలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎడిటింగ్ మైనస్  బలాలు  1 . యష్ పెర్ ఫార్మెన్స్  2 . ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్  3 . నిర్మాణ విలువలు  బలహీనతలు  1 . కథ, కథనం చివరిగా చెప్పుకోవాలంటే టాక్సిక్ ని కథ, కథనం దెబ్బకొట్టింది. యష్ పెర్ ఫార్మెన్స్   , ప్రొడక్షన్ వాల్యూస్ కొంచం రక్షణగా నిలిచాయి. Rating 2.5/ 5                                                                          అరుణాచలం 
2027 వేసవిలో రెండు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా మార్చి 5న రిలీజ్ కానుండగా, మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీ ఏప్రిల్ 7న వస్తోంది. నెల రోజుల గ్యాప్ లో రెండు భారీ సినిమాలు వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా దీనిపై సందీప్ రెడ్డి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు. 'రోమాంచకం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో 'వారణాసి - స్పిరిట్' సినిమాల పోటీకి సంబంధించిన ప్రశ్న సందీప్ రెడ్డికి ఎదురైంది. "మార్చి 5న స్పిరిట్ వస్తోంది. అలాగే ఏప్రిల్‌లో వారణాసి వస్తోంది. రెండు కూడా వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ పాకెట్ ఉన్న సినిమాలు. ఈ నెల రోజుల గ్యాప్ బాక్సాఫీస్‌కు సరిపోతుందా?" అని రిపోర్టర్ అడగ్గా, వంగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. "వారణాసి సినిమా మా స్పిరిట్ కంటే పెద్దదండి" అని చెప్పిన సందీప్ రెడ్డి.. "రెండు సినిమాల మధ్య ఉన్న 30-32 రోజుల గ్యాప్ థియేట్రికల్ రన్‌కి, బిజినెస్ పాకెట్‌కి సరిపోతుంది" అని అన్నారు. అక్కడితో ఆగకుండా.. "మేం జరుగుతాం అయితే. మీకు ఈ ఆన్సర్ వినాలని ఉందిగా" అంటూ నవ్వుతూ చెప్పారు. సందీప్ రెడ్డి ఎక్కువగా సీరియస్ గా ఉంటారనే పేరుంది. కానీ, ఈ ఈవెంట్ లో మాత్రం ఆయన ఎంతో సరదాగా కనిపించారు. ఒక వైపు రెండు సినిమాలకు మధ్య 30 రోజుల గ్యాప్ సరిపోతుంది అని చెబుతూనే, మరోవైపు మీకు కావాల్సిన ఆన్సర్ అంటూ 'మేము జరుగుతాం' అని చెప్పడం నవ్వులు పూయించింది. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.       Sandeep Reddy Vanga, Spirit, Varanasi, Romanchakam  
మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. ఆగష్టు 21న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనం సృష్టించింది. అయితే నేడు 'టాక్సిక్' అనే భారీ పాన్ ఇండియా మూవీ థియేటర్లలోకి రావడం, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ స్క్రీన్స్ దానికి కేటాయించడంతో.. 'ఇరుముడి' కలెక్షన్స్ కి భారీ గండి పడుతుందని భావించారంతా. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ తో సంచలనం సృష్టించి, భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన 'టాక్సిక్' మూవీ.. మొదటి షోకే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. భారీతనం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప, సినిమాలో విషయం లేదని నెటిజెన్లు విమర్శిస్తున్నారు. కథాకథనాలపై దృష్టి పెట్టకుండా.. అవసరంలేని యాక్షన్, బోల్డ్ సీన్స్ తో సినిమాను నింపేశారని ట్రోల్ చేస్తున్నారు. 'టాక్సిక్' సినిమాకి మొదటి షోకే ఇంతటి దారుణమైన టాక్ రావడం.. 'ఇరుముడి'కి ఖచ్చితంగా కలిసొస్తుంది అనడంలో డౌట్ లేదు. 'టాక్సిక్'కి ఎలాగూ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నెగటివ్ టాక్ కారణంగా.. యూత్ కూడా వెనకడుగు వేసే అవకాశముంది. దాంతో 'ఇరుముడి' ప్రభంజనం కొనసాగనుంది. ఇప్పటికే వీక్ డేస్ అయిన సోమవారం, మంగళవారం నాడు బుకింగ్స్ చూసి ట్రేడ్ కూడా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు 'టాక్సిక్' టాక్ తో.. 'ఇరుముడి' థియేటర్ల వైపు మరింతగా క్యూ పెరిగితే.. ఆటోమేటిక్ గా థియేటర్ల కౌంట్ కూడా పెరుగుతుంది. అదే జరిగితే త్వరలోనే 'ఇరుముడి' రూ.200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.       Toxic Review, Yash, Geetu Mohandas  
'కేజీఎఫ్' వంటి భారీ గ్లోబల్ సక్సెస్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నుండి నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ డ్రామా 'టాక్సిక్'. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రం బుధవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. మొదటిరోజే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు స్థాయి బోణీ కొట్టింది. అయితే, ప్రీమియర్ షో ముగిసిన తర్వాత థియేటర్ల నుంచి వచ్చిన టాక్, ట్విటర్ (X) రివ్యూలు మాత్రం షాక్ ఇస్తున్నాయి. 'A' సర్టిఫికేట్‌తో 3 గంటలకు పైగా నిడివితో వచ్చిన ఈ సినిమాను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ "మూడు గంటల టార్చర్" అని కామెంట్స్ చేస్తున్నారు. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కేవలం విజువల్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ పైనే శ్రద్ధ పెట్టారని.. అసలైన కథాకథనాలను పూర్తిగా గాలికొదిలేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటించినప్పటికీ, ఏ ఒక్క పాత్రకు కూడా సరైన ప్రాధాన్యత లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారింది. సాంకేతికంగా రిచ్‌గా కనిపిస్తున్నప్పటికీ, గందరగోళంగా ఉన్న స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ లోపాలు, వీక్ డైలాగ్స్ వల్ల సినిమా పేలవంగా మారిందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. దానికితోడు రవి బస్రూర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల లౌడ్‌గా ఉంటూ ఇబ్బందికరంగా అనిపించిందని నెటిజన్లు తమ రివ్యూలలో రాసుకొచ్చారు. కేజీఎఫ్ తరహా మాస్ ఎలివేషన్ల శైలిని ఫాలో అవ్వబోయి అసలుకే ఎసరు తెచ్చారని, ఏమాత్రం బలమైన కాన్ఫ్లిక్ట్ లేకుండా కేవలం రక్తపాతం, అనవసరమైన బోల్డ్ సీన్స్ పైనే ఆధారపడ్డారని విమర్శకులు మండిపడుతున్నారు. మహిళా పాత్రల ఓవర్‌లోడ్‌తో పాటు ఉద్దేశం లేని యాక్షన్ సీన్లు, బలవంతంగా ఇరికించిన బోల్డ్ సీన్లు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయని, తెలుగు డబ్బింగ్ కూడా చాలా చోట్ల అసహజంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ 3 గంటల వయలెంట్ డ్రామాలో యశ్ తన శక్తినంతా ధారపోసి నటనతో మెప్పించడం ఒక్కటే ప్లస్ పాయింట్ గా చెబుతున్నారు. యశ్ స్టైలిష్ లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మెప్పించాయట. యశ్ తన వంతుగా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ, సరైన స్క్రిప్ట్ లేకపోవడం వల్ల గీతూ మోహన్‌దాస్ తన వద్ద ఉన్న భారీ క్యాన్వాస్‌ను పూర్తిగా వృథా చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. నాలుగేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రాకింగ్ స్టార్ అభిమానులకు ఈ 'టాక్సిక్' తీవ్ర నిరాశను మిగిల్చిందని ట్విట్టర్ టాక్ ని బట్టి తెలుస్తోంది. మరి జనరల్ షోల తర్వాత టాక్ ఏమైనా మారుతుందో లేక ఇదే కంటిన్యూ అవుతుందో చూడాలి.       Toxic Review, Yash, Geetu Mohandas  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  కోడి మాంసం (చికెన్) ప్రియులు మనదేశంలో కోకొల్లలు. సాధారణంగా చాలామంది చికెన్ షాప్‌కు వెళ్లినప్పుడు బోన్‌లెస్ ముక్కలు లేదా లెగ్ పీస్‌లను ఇష్టపడి కొనుగోలు చేస్తుంటారు. కానీ చికెన్ లివర్ (కోడి కాలేయం) అనగానే కొంతమంది పక్కన పెట్టేస్తుంటారు లేదా తినడానికి అంతగా ఆసక్తి చూపరు. అయితే, మనం సాధారణంగా తినే చికెన్ బ్రెస్ట్ లేదా థైస్ ముక్కల కంటే కూడా చికెన్ లివర్‌లోనే అత్యధిక పోషక విలువలు దాగి ఉన్నాయని ప్రముఖ పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ ధరలోనే లభించే ఈ చికెన్ లివర్ ఒక రకమైన  న్యూట్రిషనల్ పవర్‌హౌస్  (Nutritional Powerhouse) అని, దీనిని క్రమం తప్పకుండా పరిమితంగా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చికెన్ లివర్ ముఖ్యంగా రక్తహీనత (అనీమియా)తో బాధపడేవారికి ఒక శక్తివంతమైన సహజసిద్ధ ఔషధంగా పనిచేస్తుంది. మన శరీరంలో ఎర్ర రక్త కణాల (RBC) ఉత్పత్తికి మరియు హిమోగ్లోబిన్ స్థాయిలు పెరగడానికి  హెమ్ ఐరన్  (Heme Iron) అత్యంత ఆవశ్యకం. 100 గ్రాముల చికెన్ లివర్‌లో దాదాపు 9 నుండి 13 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇది ఒక మనిషికి రోజువారీగా కావలసిన ఐరన్ అవసరంలో 50 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఒంటరిగానే పూరిస్తుంది. ఐరన్‌తో పాటు దీనిలో విటమిన్ బి12 (Vitamin B12) అమితంగా ఉంటుంది. 100 గ్రాముల చికెన్ లివర్ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన రోజువారీ విటమిన్ బి12 అవసరంలో ఏకంగా 200 శాతానికి పైగా లభించడం విశేషం. ఇది నరాల బలహీనతను నివారించి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలోనూ, శరీరంలో నిరంతర ఉత్సాహాన్ని నింపడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో మరియు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో విటమిన్ ఏ (Vitamin A) పాత్ర ఎంతో ప్రసిద్ధమైనది. చికెన్ లివర్ విటమిన్ ఏ కి బలమైన వనరుగా నిలుస్తుంది. కేవలం 100 గ్రాముల చికెన్ లివర్ తింటే శరీరానికి రోజుకు కావలసిన విటమిన్ ఏ పరిమాణంలో దాదాపు 300 శాతానికి పైగా అందుతుంది. ఇది రేచీకటి, కంటి పొడిబారడం వంటి సమస్యల నుండి రక్షణ కల్పించడమే కాకుండా, చర్మాన్ని కాంతివంతంగా ఉంచి అకాల ముడతలను నివారిస్తుంది. అలాగే, ఇందులో లభించే విటమిన్ బి9 (ఫోలేట్) గర్భధారణ సమయంలో పిండం యొక్క ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది, కాబట్టి మహిళలు దీనిని సరైన పరిమాణంలో తీసుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.       Health benefits of eating chicken liver,chicken liver for anemia and eye health.  
మానవ శరీరానికి కావలసిన అత్యంత విలువైన పోషకాలను అందించే ప్రకృతి సిద్ధమైన ఆహారాలలో చేపలు ప్రథమ స్థానంలో నిలుస్తాయి. నేటి వేగవంతమైన ఆధునిక జీవనశైలిలో అనేక రకాల గుండె జబ్బులు, కంటి చూపు లోపాలు మరియు మానసిక ఒత్తిడి తీవ్రమైన సవాళ్లుగా మారుతున్నాయి. ఇటువంటి తరుణంలో వారానికి కనీసం 2 నుండి 3 సార్లు ఆహారంలో చేపలను భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అపరిమితమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని ప్రముఖ పోషకాహార నిపుణులు మరియు వైద్య పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. చేపల్లో ఉండే అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు మరియు ముఖ్యంగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు (Omega 3 Fatty Acids) మన శరీరంలోని ప్రధాన అవయవాలైన గుండె, మెదడు మరియు కళ్ళ పనితీరును మెరుగుపరచడంలో అద్భుతమైన పాత్ర పోషిస్తాయి. చేపలలో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు హృదయ సంబంధిత సమస్యలను నివారించడంలో ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం, క్రమం తప్పకుండా చేపలను తినే వ్యక్తులలో గుండెపోటు (Heart Attack) మరియు పక్షవాతం (Stroke) వచ్చే ప్రమాదం దాదాపు 15 నుండి 20 శాతం వరకు తగ్గుతుందని తేలింది. చేపలు తినడం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు సుమారు 20 నుండి 30 శాతం వరకు తగ్గుతాయి. అంతేకాకుండా, ఇది ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్తపోటును (Blood Pressure) క్రమబద్ధీకరిస్తుంది. హృదయ స్పందనలను సరిగ్గా ఉంచడం ద్వారా రక్తనాళాలు పూడుకుపోయే ముప్పును నామరూపాలు లేకుండా చేస్తుంది. మెదడు చురుకుదనం మరియు జ్ఞాపకశక్తి పెంపొందించడంలోనూ చేపల పాత్ర గణనీయమైనది. మన మెదడులోని 60 శాతం భాగం కొవ్వుతో నిర్మితమై ఉంటుంది, అందులో అధిక భాగం ఓమేగా 3 రకానికి చెందిన డిహెచ్‌ఎ (DHA) రూపంలో ఉంటుంది. చేపలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల వయస్సు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి లోపం, ఆల్జీమర్స్ మరియు డిమెన్షియా వంటి మానసిక క్షీణత సమస్యల ప్రమాదం దాదాపు 40 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులోని ‘గ్రే మేటర్’ (Grey Matter) పరిమాణాన్ని పెంచి, ఆలోచనా శక్తిని మరియు సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేసే సామర్థ్యాన్ని ఇది రెట్టింపు చేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత మరియు అభ్యాస నైపుణ్యాలు పెరగడానికి రోజూ లేదా వారంలో కొన్ని రోజులు చేపలు తినిపించడం ఎంతో శ్రేయస్కరం.       Vitamin D and protein rich fish health guide,how fish helps improve eyesight and memory.
నేటి డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నారు. బరువు తగ్గాలన్నా, పొట్ట కొవ్వు కరిగించుకోవాలన్నా లేదా చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవాలన్నా ప్రతి ఒక్కరి దృష్టి ముందుగా పడేది ‘గ్రీన్‌టీ’ పైనే. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అమృతమైనా అతిగా తీసుకుంటే విషమే అవుతుందనే సామెత గ్రీన్‌టీకి కూడా సరిగ్గా వర్తిస్తుంది. గ్రీన్‌టీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా అని భావించి చాలామంది చేసే చిన్న చిన్న తప్పులు వారి ఆరోగ్యాన్నే దెబ్బతీస్తున్నాయని, కొన్నిసార్లు తీవ్రమైన దుష్ప్రభావాలకు దారితీస్తున్నాయని హెల్త్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది చేసే మొదటి పెద్ద పొరపాటు ఉదయాన్నే పరగడుపున వేడివేడిగా గ్రీన్‌టీ తాగడం. ఖాళీ కడుపుతో గ్రీన్‌టీ తాగడం వల్ల అందులోని ‘టానిన్లు’ (Tannins) కడుపులో యాసిడ్ స్థాయిలను తీవ్రంగా పెంచుతాయి. దీనివల్ల తీవ్రమైన అసిడిటీ, కడుపులో మంట, వికారంగా ఉండటం మరియు జీర్ణశయాంతర సమస్యలు తలెత్తుతాయి. అధ్యయనాల ప్రకారం, పరగడుపున గ్రీన్‌టీ తాగే వారిలో 35 శాతం కంటే ఎక్కువ మంది అసిడిటీ మరియు కడుపులో తిమ్మిరి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అంతేకాకుండా, గ్రీన్‌టీలోని టానిన్లు మనం తినే ఆహారం నుండి ఐరన్ (ఇనుము) శోషణను దాదాపు 60 శాతం వరకు నిరోధిస్తాయి. దీనివల్ల రక్తహీనత (అనీమియా) వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే భోజనం చేసిన వెంటనే గానీ, పరగడుపున గానీ గ్రీన్‌టీ తాగకపోవడమే శ్రేయస్కరం. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏమిటంటే పరిమాణం. రోజుకు ఎన్ని కప్పుల గ్రీన్‌టీ తాగుతున్నామనేది చాలా ముఖ్యం. గ్రీన్‌టీ బరువు తగ్గిస్తుందనే ఆశతో రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ తాగడం వల్ల శరీరంలో ‘కెఫీన్’ పరిమాణం ప్రమాదకర స్థాయిలో పెరుగుతుంది. నిపుణుల పరిశోధనల ప్రకారం, రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ లేదా 4 కప్పుల కంటే ఎక్కువ గ్రీన్‌టీ తీసుకోవడం వల్ల నిద్రలేమి (Insomnia), తీవ్రమైన తలనొప్పి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం మరియు రక్తపోటు పెరగడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తాయి. అలాగే గ్రీన్‌టీలోని అధిక కాటెచిన్లు (Catechins) పరిమితి దాటితే కాలేయ కణాలపై ఒత్తిడి పెంచి, లివర్ ఇన్ఫెక్షన్లు లేదా లివర్ డ్యామేజ్‌కు కారణమవుతాయని అనేక అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.       Green tea side effects on liver and stomach, how many cups of green tea per day guide.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. గ్రామీణ ప్రాంతాలలోనూ, ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నప్పుడు మెడికల్ స్టోర్ మందులకు బదులుగా పెద్దవాళ్లు తమ సాంప్రదాయ వైద్యాన్ని, పెద్దలు నేర్పించిన ఇంటి చిట్కాలను పాటిస్తుంటారు. నిజానికి ఈ చిట్కాలు చాలా వరకు మ్యాజిక్ లాగా పనిచేస్తాయి కూడా.  అలాంటి అద్బుతమైన చిట్కా గురించి తెలుసుకుంటే.. కడుపునొప్పికి వేడి ఉప్పు ప్యాక్.. కడుపు నొప్పికి ఒక సాంప్రదాయ  ఇంటి చికిత్స ఉంది. గోరువెచ్చని ఉప్పు కాపడాన్ని పెట్టడం చాలా ప్రబావవంతంగా పనిచేస్తుంది. దొంతర ఉప్పు లేదా దొడ్డు ఉప్పును ఒక గుడ్డలో చుట్టి, కొద్దిగా వేడి చేసి, ఆ తర్వాత కడుపుపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఉదర కండరాలలోని తిమ్మిర్లు లేదా బిగువు నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది. గ్యాస్ లేదా తేలికపాటి తిమ్మిర్ల వంటి సమస్యలు ఉన్నవారికి  గోరువెచ్చని కాపడాలు చాలా బాగా  సహాయపడతాయి. అయితే కడుపు నొప్పి వేరే ఏదైనా సమస్యల వల్ల వచ్చి ఉంటే.. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కడుపు నొప్పి రావచ్చు. ఇలాంటి సమస్యల వల్ల కడుపు నొప్పి వచ్చి ఉంటే..  ఆ కడుపు నొప్పి కూడా వాంతులు,  జ్వరం, విరేచనాలు, కడుపు ఉబ్బరం, లేదా కడుపులో రక్తం వంటి లక్షణాలతో కూడి ఉంటే అలాంటి సమస్యలకు ఈ ఉప్పు కాపడం అనేది సరైనది కాదు.. కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి. వేడి ఉప్పు కాపడం వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. ఉప్పు ప్యాకె ను మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. దీనిని నేరుగా చర్మం మీద పెట్టడానికి బదులుగా ఒక సన్నని క్లాత్ ను పొట్ట మీద ఉంచి ఆ తర్వాత కాపడం పెట్టాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది, కాబట్టి వారి విషయంలో ఉష్ణోగ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. నిద్రపోతున్నప్పుడు వెచ్చని ప్యాక్‌ను  అలాగే పెట్టుకుని పడుకోకూడదు. ఒకవేళ ఎరుపు, మంట లేదా నొప్పి వంటివి కలిగితే ఉప్పు కాపడం ఆపెయ్యాలి. కఫ సమస్యలకు ఉప్పు కాపడం.. దగ్గు, కఫం లేదా ఛాతిలో భారంగా అనిపించడం వంటి వాటికి చాలా ఇళ్లలో వేడి ఉప్పు కాపడం ఉపయోగించడం ఒక సాధారణ పద్ధతి. ఉప్పును వేడి చేసి, ఒక గుడ్డలో లేదా టవల్‌లో ఉంచి, కొద్దిసేపు ఛాతిపై ఉంచుతారు. ఆ వెచ్చదనం ఛాతి పట్టేసినట్టు ఉండటం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని అందిస్తుంది.  ఒక్కొక్కరికి ఒక్కో విధంగా దీని ఫలితం ఉండవచ్చు.  వేడి ఉప్పు టవల్ దగ్గుకు పూర్తీ చికిత్స కాదు. . వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, అలర్జీలు, ఆస్తమా లేదా ఇతర కారణాల వల్ల కూడా దగ్గు రావచ్చు. అందువల్ల, కేవలం ఈ ఇంటి చిట్కాపై మాత్రమే ఆధారపడటం మంచిది కాదు.                                                                                                                                                   *రూపశ్రీ.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ఆయుర్వేద వైద్య నిపుణురాలు డాక్టర్ శిరీష నోటి మరియు దంత ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు, పిప్పిపంటి వంటి సమస్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నోటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అలాగే నోటి క్యాన్సర్‌కు సంబంధించిన హెచ్చరిక సంకేతాలు, నోటి పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి కూడా ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. దంతాలు లేదా చిగుళ్లకు సంబంధించిన సమస్యలు కొనసాగితే అర్హత కలిగిన డెంటిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)