LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అటు సొంత సామాజికవర్గం, ఇటు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అటు తెలంగాణలో భూముల వ్యవహారాలు, ఇటు ఆంధ్రాలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు జనసేనానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై  సీనియర్ రాజకీయ విశ్లేషకుడు  భరద్వాజ తో  తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.  ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ దాసరి రాము వంటి నేతలు టోన్ పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోవడానికి ఆ సామాజికవర్గమే బాధ్యత వహించాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. జనసేన కేవలం ఒక కులానికి పరిమితమైన పార్టీ కాదని పవన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆయనను టార్గెట్ చేయడం ఆపడం లేదు. మరోవైపు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి  కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కూడా పవన్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తుత కూటమితో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం విస్తృతంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించడమే ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే రంగా హత్యను తెరపైకి తీసుకువచ్చి.. ఆ హత్యకు కారకులతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పవన్ కళ్యాణ్ చేత ఏదైనా భావోద్వేగ ప్రకటన చేయించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆ ప్రకటన గనుక కూటమి ప్రభుత్వ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంటే..  దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది శత్రు పక్షాల ప్లాన్. ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్యాడర్ మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, విజయవాడ, మంగళగిరి పార్టీ కార్యాలయాల్లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ప్రెజర్‌ను పవన్ కళ్యాణ్ ఎంత నిగ్రహంతో, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకంగా మారింది. ఆయన భావోద్వేగానికి లోనై కూటమికి ఇబ్బంది కలిగిస్తారా? లేక చాకచక్యంగా ఈ వ్యూహాల నుంచి బయటపడి తన రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనేది వేచి చూడాలి.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో, సమాజంలో ప్రశ్నించే హక్కును వాడుకుంటున్న నిరుద్యోగ యువతను, ఆర్టీఐ  యాక్టివిస్టులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో  తీవ్ర  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠంనేని, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ అంశంపై  తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో  రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను  పారసైట్లు,  కాక్రోచ్‌లు  అనడం  అత్యంత దురదృష్టకరమని   అభిప్రాయపడ్డారు.   గత కొన్నేళ్లుగా దేశంలో సాగుతున్న కమ్యూనల్, కుల పోలరైజేషన్ ప్రభావం దురదృష్టవశాత్తూ అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదడుపై కూడా పడుతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విమర్శకులను  అర్బన్ నక్సలైట్లు  అని ముద్రవేసిన పాలకులు..  ఇప్పుడు సరికొత్తగా బ్రాండింగ్ చేయడం ప్రారంభించారని, దానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణని విశ్లేషించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పిస్తోంది. ఈ హక్కులను కాపాడాల్సిన న్యాయమూర్తి, ప్రశ్నించే వారిని అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని  అన్నారు. దేశంలో  నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం కాదు..  చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. పీహెచ్‌డీ  చేసిన అభ్యర్థులు, ఎంబీఏ   చదివిన యువకులు   డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా స్థిరపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల విద్యా విధానాల, ఉపాధి కల్పన వైఫల్యమే అని డోలేంద్రప్రసాద్ అన్నారు.  న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాల వైఫల్యాలను, ఆదేశించాల్సింది నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించమని.అయితే ఆయన అందుకు భిన్నంగా యువత సోషల్ మీడియాలో, ఆర్టీఐ అప్లికేషన్లతో సమయం వృథా చేస్తోందంటూ  కించపరచడం సమంజసం కాదన్నారు. మీడియా తన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించిందంటూ న్యాయమూర్తి వివరణ ఇవ్వడంపై  ఆయన..  ఒక కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా, దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తి తప్పుడు సంజాయిషీలు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు.  ఆయన వెంటనే దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాట సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు యువతలో తీవ్ర తిరుగుబాటు ధోరణికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా పౌర సమాజం, న్యాయవ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ కంఠంనేని అన్నారు. 
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ  స్థాపన, ఆనాటి రాజకీయ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వాస్తవాలు వెల్లడించారు. తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఎన్టీఆర్ ప్రభంజనం, నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు, పార్టీలోకి చంద్రబాబు నాయుడు ఎంట్రీ తదితర అంశాలపై మాట్లాడారు. టిడిపి తొలి నాళ్లలో  ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఆర్థికంగా పుంజుకున్న విధానాన్ని ఆయన  వివరించారు.  1983 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ చైతన్య రథంపై దిల్ సుఖ్ నగర్ వచ్చినప్పుడు తన తండ్రితో కలిసి తాను ఆయనను కలిశానని గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో మలక్‌పేట నియోజకవర్గంలో టిడిపి ఓడిపోతుందని తాను ముందే చెప్పానని..  కానీ రాష్ట్రవ్యాప్తంగా 200 సీట్లు వస్తాయని అంచనా వేశానని పేర్కొన్నారు. తాను చెప్పినట్టుగానే సరిగ్గా 202 సీట్లతో ఎన్టీఆర్ ఘనవిజయం సాధించారని, ఆ నమ్మకంతోనే ఎన్టీఆర్ తనను ఎప్పటికీ గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.  అప్పుడు ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబుకు తన గురించి చెప్పి మలక్‌పేట ఇంచార్జ్‌గా బాధ్యతలు అప్పగించారని తీగల వివరించారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే నాదెండ్ల భాస్కరరావు సంక్షోభం సృష్టించినప్పుడు పార్టీలో తీవ్ర అల్లకల్లోలం నెలకొందని తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆ క్లిష్ట సమయంలో తాను, మాజీ ఎమ్మెల్యే గోపాల్ సహా నలుగురు నేతలు ఎన్టీఆర్ వెన్నంటే ఉండి ఉద్యమించామని చెప్పారు. ఆ సంక్షోభం ముగిసిన తర్వాత ఎన్టీఆర్ నమ్మకమైన కార్యకర్తలను ఆదరించారని, అందులో భాగంగానే తనను హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హుడా) చైర్మన్‌గా, కడియం శ్రీహరిని వరంగల్ ఉడా చైర్మన్‌గా నియమించారని వెల్లడించారు. టిడిపిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో తానే కీలక సూచన చేశానని తీగల కృష్ణారెడ్డి  తెలిపారు.  మనం కేవలం ఎన్టీఆర్ ఇమేజ్‌పైనే గెలిచాం..  పార్టీ కలకాలం నిలబడాలంటే సభ్యత్వ నమోదు  ప్రారంభించాలని చంద్రబాబుకు తాను చెప్పానని తీగల అన్నారు.  కేవలం ఐదు రూపాయలు, వంద రూపాయల రుసుముతో కేవలం ఆరు రోజుల్లోనే 13 లక్షల రూపాయల నిధులు వచ్చాయని, ఆ తర్వాత అది కోట్ల రూపాయలకు చేరి పార్టీకి ప్రధాన వనరుగా మారిందని చెప్పారు. అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నిర్మాణానికి ఆనాడు హుడా చైర్మన్‌గా తానే ఎకరం భూమిని కేటాయించి, దానికి సంబంధించిన ప్రభుత్వ చెక్కులను ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద పంపించానని తీగల కృష్ణారెడ్డి  వెల్లడించారు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. వెండితెరపై తిరుగులేని చక్రవర్తిగా వెలిగిన దళపతి విజయ్, ఇప్పుడు రాజకీయ పీఠంపై కూడా తన మార్క్ చూపిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంచలన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగుతున్నారు. సాధారణంగా   రాజకీయాల్లో ఒక సంప్రదాయం బలంగా కొనసాగుతోంది. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసి గెలిచినప్పుడు లేదా పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తినప్పుడు..  సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పదవిని, దళపతి విజయ్ మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చారు. తమిళనాడులో మిత్రపక్షాల మద్దతుతోనే విజయ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ, ఆయన ఒక్కరికి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి డిప్యూటీ సీఎం పదవి కోసం గట్టి ఒత్తిడి వచ్చినప్పటికీ, విజయ్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. మరి మిత్రపక్షాలను ఆయన ఎలా ప్రసన్నం చేసుకున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కూటమి నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన విజయ్, వారికి డిప్యూటీ సీఎం పదవులకు బదులుగా కేబినెట్‌లో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటాయించి పరిస్థితిని చాలా చాకచక్యంగా సర్దుబాటు చేశారు. ఈ వ్యూహాత్మక అడుగు వెనుక దళపతి విజయ్ ఒక బలమైన రాజకీయ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు స్పష్టమవుతోంది. అధికార వికేంద్రీకరణ పేరుతో పాలనలో గందరగోళం ఏర్పడకూడదని, ప్రభుత్వంలో ఎలాంటి రాజకీయ జోక్యాలు లేకుండా నేరుగా తన నియంత్రణలోనే నిర్ణయాలు సాగాలని ఆయన భావిస్తున్నారు. ఒకే ప్రభుత్వంలో ఎక్కువ మంది పవర్‌ సెంటర్లు ఉంటే, భవిష్యత్తులో పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని, ముఖ్యంగా కూటమి ప్రభుత్వాల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయని విజయ్ భావిస్తున్నారు. అందుకే, ఎటువంటి డైవర్షన్స్ లేకుండా ఒక స్థిరమైన, బలమైన, స్పష్టమైన పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాలు ఒంటిచేత్తో రాష్ట్రాన్ని ఏలిన తరహాలోనే, తాను కూడా పూర్తి అధికారంతో, ఎలాంటి రాజీ పడకుండా ముందుకెళ్లాలని విజయ్ డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ లాంటి క్రేజ్ ఉన్న నేత ఏపీలో డిప్యూటీ సీఎంగా సక్సెస్ అవుతున్న తరుణంలో, విజయ్ తీసుకున్న ఈ 'నో డిప్యూటీ సీఎం' పాలసీ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ వినూత్న పొలిటికల్ స్ట్రాటజీ విజయ్ ప్రభుత్వానికి ఎంతవరకు స్థిరత్వాన్ని ఇస్తుందో చూడాలి.
దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో అనూహ్యమైన రాజకీయ పరిణామం  సంచలనం రేపుతోంది. తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి  ఫేస్‌గా నిలిచిన ఫైర్‌బ్రాండ్ లీడర్  అణ్ణామలై త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్త ఇప్పుడు తమిళరాజకీయాలలో సంచలనంగా మారింది.  గత దశాబ్ద కాలంగా తమిళనాట కమలం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అహర్నిశలు శ్రమించిన అణ్ణామలై.. ఇప్పుడు అనూహ్యంగా సొంత పంథాను ఎంచుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ..  చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి  ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది. కానీ.. ఇటీవలి కాలంలో బీజేపీ అధిష్ఠానంతో ఏర్పడిన తీవ్రమైన సాంస్కృతిక, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా అణ్ణామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సీనియర్ లీడర్ అయిన అణ్ణామలై  త్వరలోనే బీజేపీకి త  రాజీనామా సమర్పించనున్నారు. పార్టీని వీడిన అనంతరం ఆయన నేరుగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించకుండా, ముందుగా గ్రౌండ్ లెవెల్‌లో ఒక బలమైన స్వచ్ఛంద ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ లేదా సామాజిక ఉద్యమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి..  తనకంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్‌ను నిర్మించుకున్న తర్వాత పూర్తిస్థాయి పొలిటికల్ పార్టీని లాంచ్ చేయాలని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. తమిళనాడు ప్రజలు ద్రవిడ సిద్ధాంతాలకు అలవాటు పడి ఉన్నారని, అక్కడ కేవలం బీజేపీ ముద్రతో ఒంటరిగా గెలవడం అసాధ్యమని అణ్ణామలై  క్షేత్రస్థాయి పరిశీలనలో తేలిందంటున్నారు. తమిళ జనం కమలం వైపు చూడటం లేదని స్పష్టమయ్యాక, అక్కడే ఉండి తన పొలిటికల్ కెరీర్‌ను రిస్క్‌లో పడేసుకోవడం కంటే, ద్రవిడ ముద్ర లేని ఒక సరికొత్త ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారు.  ఇప్పటివరకు దక్షిణాది రాజకీయాల్లో అణ్ణామలైని చూపిస్తూ ఓట్లు రాబట్టాలని చూసిన బీజేపీకి ఇది కోలుకోలేని  దెబ్బేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అణ్ణామలై లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత దూరం కావడం వల్ల తమిళనాట బీజేపీ ఉనికి  సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. 
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో 'పెద్ది'(Peddi). జూన్ 4న  వరల్డ్ వైడ్ గా విడుదల  కానున్న విషయం తెలిసిందే.  దీంతో చిత్ర బృందం  ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు  విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ  మున్సిపల్ స్టేడియంలో కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకకి ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ హాజరయ్యాడు. అనంత్ శ్రీరామ్ కొన్ని రోజుల క్రితం భీమవరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మాట్లాడుతు ఒక స్థలం విషయంలో మాజీ ఏంపి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ బెదిరింపులకి  పాల్పడుతున్నాడని, వృద్ధులైన తన తల్లిదండ్రులకి  ప్రాణహాని ఉందని  రక్షణ కల్పించాలని  కోరాడు. ఈ నేపథ్యంలో పెద్ది ఈవెంట్ లో కూడా మళ్ళీ ఆ విషయం గురించి ఏమైనా మాట్లాడతాడా ఏ చర్చ మొదలైంది. అనంత్ శ్రీరామ్ పెద్దిలో  'రయ్ రయ్ రా రా', 'హల్లల్లల్లో' సాంగ్స్ రెండు కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. Also read: Peddi: ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ గ్రౌండ్ లో క్లౌడ్ ఇంతే.. హైదరాబాద్ లో జరిపి ఉంటే!  
  మెగా పవర్ స్టార్  రామ్ చరణ్(Ram Charan)నుంచి వస్తున్న  మోస్ట్ అవేటెడ్ పాన్ ఇం డియా స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'(Peddi). 1980ల నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో, క్రీడల ద్వారా ఒక సామాన్యుడు తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు  విజయవాడ నగర నడిబొడ్డులో ఉన్న ఇందిరాగాంధీ  మున్సిపల్ స్టేడియంలో కొద్దీ సేపటి క్రితమే ప్రారంభమయ్యాయి.  ఈ మెగా వేడుకకి అభిమానులతో పాటు అశేష జనవాహిని తరలివచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుండే విజయవాడ నగర వీధులన్నీ మెగా అభిమానుల నినాదాలతో మారుమోగిపోయాయి. స్టేడియం సామర్థ్యానికి మించి వేలాది మంది అభిమానులు తరలిరావడంతో బెజవాడలో ఎటు చూసినా జనసంద్రమే కనిపించింది. ఇతర జిల్లాల నుండి దాదాపు 50,000 మందికి పైగా అభిమానులు ఈ చారిత్రాత్మక క్షణాన్ని కళ్లారా చూసేందుకు విజయవాడకి  చేరుకోవడం ఈ ఈవెంట్ రేంజ్‌ను చూపిస్తోంది. ఈవెంట్ ప్రారంభమైన కాసేపటికే స్టేడియం లోపల ఉన్న గ్యాలరీలు మొత్తం నిండిపోయాయి. దీంతో చరణ్ తన  స్టామినా ఏ పాటిదో మరో సారి చాటి చెప్పినట్లయింది. Also read: Dhurandhar: ధురంధర్ పై దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఆగ్రహం..ముంబైలో భారీ ఉగ్రకుట్రకి ప్లాన్  ఆ పబ్లిక్ ని చూసిన తర్వాత హైదరాబాద్ లో రెగ్యులర్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో అయితే సరిపోయేది కాదని సినీ పరిశీలకులు అంటున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ తో పాటు మిగతా నటీనటులు, దర్శకుడు ఏం మాట్లాడతారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది.   
  ముంబై మహానగరాన్ని మరోసారి నెత్తుటి మడుగుగా మార్చేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ‘డి' కంపెనీ’ పన్నిన ఒక భయంకరమైన ఉగ్ర కుట్రని భారత భద్రతా దళాలు అత్యంత చాకచక్యంగా భగ్నం చేశాయి. ఇటీవల బాలీవుడ్‌లో విడుదలై సంచలన విజయం సాధించిన ‘ధురంధర్’(Dhurandhar)సినిమా కథాంశం, అండర్ వరల్డ్ శక్తుల వాస్తవాలని కళ్లకి కట్టినట్టు చూపించడంతో పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం, అతని ముఠాకి  తీవ్ర ఆగ్రహం తెప్పించింది.  ఈ సినిమా తెచ్చిన సెగతో ముంబైలో తమ ఉనికి చాటుకోవడానికి, కోల్పోయిన పాత పట్టుని  మళ్లీ సాధించుకోవడానికి డి-కంపెనీ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI) తో చేతులు కలిపి ఈ భారీ విధ్వంసక ప్లాన్ రచించింది. ఈ  మిషన్‌ని సఫలం చేసేందుకు ముంబైలోని స్థానిక ముఠాలు, నిరుద్యోగ యువతని ఆకర్షించే బాధ్యతని దావూద్ అత్యంత నమ్మకస్తుడైన ఛోటా షకీల్ గ్యాంగ్‌ కి అప్పగించారు. వీరికి అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, హ్యాండ్ గ్రెనేడ్లు మరియు భారీ నిధులను సమకూర్చే బాధ్యతను ఐఎస్‌ఐ తీసుకుంది. అలాగే ఈ ఆపరేషన్ మొత్తాన్ని గ్రౌండ్ లెవల్‌లో నడిపించే బాధ్యతను మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మున్నా జింగాడా భుజాలకెత్తుకున్నాడు. ఈ కుట్రలో భాగంగా స్థానిక యువత మైండ్ వాష్ చేయడానికి ముంబైలోని బాంద్రా గరీబ్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక ఘటనని  వారు అస్త్రంగా వాడుకున్నారు. రైల్వే స్థలంలో ఉన్న అక్రమ కట్టడాలను, అందులోని ఒక మసీదును అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసినప్పుడు స్థానికులకి, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. ఈ అల్లర్లలో 10 మందికి పైగా పోలీసులు, స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవాలనే సాకుతో ముంబైకి చెందిన కొంతమంది యువకులను తప్పుదోవ పట్టించి ఈ ముఠాలో చేర్చుకున్నారు. అయితే అసలు ప్లాన్ బాంద్రా ఘటనకు ప్రతీకారం కాదని, ముంబైలో భారీ ఎత్తున రక్తపాతం సృష్టించడమేనన్న నిజాన్ని ఆ యువకుల వద్ద దాచిపెట్టారు. పట్టుబడిన నిందితుల మొబైల్ ఫోన్లలో లభించిన డేటా ప్రకారం, వారు ముంబైలోని దాదర్ రైల్వే బ్రిడ్జితో పాటు పలు అత్యంత కీలకమైన, రద్దీగా ఉండే ప్రాంతాలను రేకీ నిర్వహించి వీడియోలు తీసినట్లు తేలింది. Also read: Peddi: చరణ్ బాడీగార్డ్ కే బాడీ గార్డ్స్ ఉండాల్సిన పరిస్థితి.. వైరల్ అవుతున్న వీడియో ఈ కుట్రను పసిగట్టిన ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా మెరుపు దాడులు నిర్వహించింది. ముంబై, ఢిల్లీ, పంజాబ్ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసి, ఐఎస్‌ఐ-దావూద్ నెట్‌వర్క్‌కు చెందిన మొత్తం 9 మంది కీలక నిందితులను అరెస్ట్ చేసింది. వీరిలో ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన సాజిద్ మెహబూబ్ షేక్ అలియాస్ అర్బాజ్ ఖాన్, ముంబ్రా ప్రాంతానికి చెందిన తౌకీర్ రిజ్వాన్ షేక్ అనే ఇద్దరు ప్రధాన ఏజెంట్లను మే 27న పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి భారీ ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, సజీవంగా ఉన్న హ్యాండ్ గ్రెనేడ్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలోని పోలీస్ స్టేషన్లు, భద్రతా దళాల క్యాంపులు, రద్దీగా ఉండే మతపరమైన ప్రదేశాలే లక్ష్యంగా అంధాధుందంగా కాల్పులు జరపాలని, హ్యాండ్ గ్రెనేడ్లతో దాడులు చేయాలని పాకిస్తాన్, దుబాయ్ దేశాల్లోని హ్యాండ్లర్స్ నుండి వీరికి వాయిస్ నోట్స్, వాట్సాప్ చాట్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు అందినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయింది. సకాలంలో 9 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసి విచారించడంతో దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై లలో జరగాల్సిన ఒక ఘోరమైన ఉగ్ర విపత్తు తప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించి, ఈ నెట్‌వర్క్‌కి  సంబంధించిన మిగిలిన నిందితుల కోసం గాలింపును తీవ్రం చేశాయి.  
Nikhil Siddhartha’s Swayambhu team has released a special behind-the-scenes glimpse, offering a look at the actor’s preparation for the film’s warrior role. Released on the occasion of his birthday, the video showcases Nikhil training with international stunt teams and preparing for physically demanding action sequences.  The glimpse focuses on the effort and physical transformation that went into shaping the character. Directed by Bharat Krishnamachari and produced by Bhuvan and Sreekar, Swayambhu is being mounted as a Pan-India period action drama. The promotional material released so far, along with Ravi Basrur’s music, has helped build curiosity around the film.  Nikhil has spent close to three-and-a-half years working on the project and the latest video gives audiences a closer look at that journey. The film is currently in the VFX and post-production stage, with the makers expected to announce the release date soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  మరికొన్ని నిమిషాల్లో 'పెద్ది'(Peddi)ప్రీ రిలీజ్ ఈవెంట్  విజయవాడ(Vijayawada)లోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. దీంతో విజయవాడలో మెగా జాతర షురూ కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహస్తున్న ఈ ఈవెంట్ కి సంబంధించి రామ్  చరణ్(Ram Charan)తో పాటు చిత్ర యూనిట్ విజయవాడ కి చేరుకుంది.  ఈ భారీ ప్రమోషన్ల పర్వంలో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మరో ఆసక్తికర అంశం ఆయన కొత్త ఇంటర్నేషనల్ బాడీగార్డ్ కెవిన్ కుంటా(kevin kunta). విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో చరణ్ అడుగుపెట్టిన క్షణం నుండి అందరి దృష్టి ఈ బాడీగార్డ్‌పైనే పడింది. చరణ్ కంటే ముందే  కెవిన్  విజయవాడ చేరుకున్నాడు. గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే అభిమానులు  కెవిన్  తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. దీంతో విమానాశ్రయ సిబ్బంది కెవిన్ కి సెక్యూరిటీ గార్డులుగా మారి కెవిన్ ని అక్కడ్నుంచి వాహనం ఎక్కించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. Also read: Raaka: రాకాలో ఛాన్స్ కొట్టేసిన అల్లు అర్జున్ వీరాభిమాని ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్, కేవలం సాధారణ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు. ఇటలీలో నివసిస్తూ, 2021లో ఇటలీ జాతీయ ఎంఎంఏ (Mixed Martial Arts) జట్టుకి  ప్రాతినిధ్యం వహించిన ఒక ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ ఫైటర్. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ ఎంఎంఏ ఛాంపియన్‌గా రికార్డులు సృష్టించిన కెవిన్ భారీ శారీరక దారుఢ్యం, సిక్స్‌ప్యాక్ బాడీ, హాలీవుడ్ యాక్షన్ హీరో రేంజ్ కటౌట్‌తో చరణ్‌కి షాడోలా నిలిచాడు. ఇంటర్నేషనల్ విఐపిలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ భద్రత అందించే కెవిన్ కుంటాకు రామ్ చరణ్ భారీగా పారితోషికం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసం  ప్రతిరోజూ దాదాపు 2 లక్షల నుండి . 4 లక్షల వరకు భద్రతా ఫీజుగా ఇస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఒక సెలబ్రిటీ బాడీగార్డ్‌కి ఈ రేంజ్ పారితోషికం ఇవ్వడం ఇండియన్ సినిమాలో ఇదే అత్యధికం అని అంటున్నారు టాక్ .  
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee)కాంబోలో తెరకెక్కుతున్న 'రాకా' శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటూ ఉంది.  హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సమాంతర ప్రపంచం, పునర్జన్మల కాన్సెప్ట్‌తో  తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు నిత్యం 'రాకా' ఎలా ఉండబోతోందని మాట్లాడుకుంటూ ఉన్నారు  ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి మలయాళ బ్యూటీ 'మిన్నల్ మురళి' ఫేమ్ ఫెమినా జార్జ్(Femina George)ఎంటర్ అయ్యింది. ఈ విషయాన్నీ తన ప్రస్తుత మూవీ 'కరక్కం' ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫెమినా స్వయంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు ' 'రాకా' లాంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నేను  భాగమవుతానని అసలు ఊహించలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటికంటే ఇది అత్యంత భారీ చిత్రం. నా లేటెస్ట్మూవీ 'డిస్కో' షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే 'రాకా' సినిమా ఆడిషన్ టీమ్ నుండి మెసేజ్ రావడం, ఆ తర్వాత ఈ అద్భుతమైన ఛాన్స్ దక్కడం అంతా ఒక కలలా జరిగిపోయింది. Also read: lokesh kanagaraj: ఇంకెప్పుడు  లోకేష్.. వైరల్ గా మారిన లైనప్  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతుండటం  నా  జీవితంలో మర్చిపోలేని గొప్ప క్షణమని ఫెమినా ఆనందం వ్యక్తం చేసింది. తాను చిన్నతనంలో చూసిన మొదటి మూవీ  2006లో విడుదలైన 'హ్యాపీ'. ఆ సినిమా చూసినప్పటి నుంచే  అల్లు అర్జున్‌కి  వీరాభిమానిగా మారిపోయాను. నా క్యారక్టర్ నిడివి కాస్త చిన్నదైనప్పటికీ, కథా పరంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న క్యారక్టర్ అని తెలిపింది.       
Mahesh and Venkatesh, the SVSC brothers are back in action. Hyderabad movie lovers are set to witness the return of IMAX as Mahesh Babu’s AMB Cinemas joined hands with Victory Venkatesh announced the launch of AMB Classic (Victory) at Sudarshan 70. With the announcement, IMAX is making a comeback to the city after years.  For many moviegoers, IMAX in Hyderabad has long been associated with the iconic Prasads multiplex, which introduced audiences to large-format theatrical viewing and became a popular destination for big-ticket releases. Now, AMB with Suresh Babu, Venkatesh is bringing that experience back in a new location. Sharing the announcement, the team highlighted Hyderabad’s strong movie culture and positioned the launch as a return of premium large-format cinema to a city known for celebrating releases like festivals. The development has already generated excitement among film audiences, especially those who have been waiting to experience major releases in IMAX format once again. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు సినీ ప్రేక్షకులకు థియేటర్ అనుభూతిని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ మరో భారీ సంచలనానికి తెరతీశారు. దశాబ్దాలుగా సినిమాను ఒక పండగలా జరుపుకునే భాగ్యనగర వాసుల కోసం సరికొత్త దృశ్య విందు సిద్ధమవుతోంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మల్టీప్లెక్స్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఏఎంబీ సినిమాస్, ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున సరికొత్త అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. నగరంలో రాబోతున్న వారి సరికొత్త ప్రాజెక్ట్ "ఏఎంబీ క్లాసిక్ విక్టరీ" (AMB Classic Victory) లో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక సరికొత్త ఐమాక్స్ (IMAX) స్క్రీన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ స్థాయి సినిమా సాంకేతికతను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో ఏఎంబీ సినిమాస్ ఎప్పుడూ ముందే ఉంటుంది. గతంలోనే దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి డాల్బీ సినిమా టెక్నాలజీని తీసుకువచ్చి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాకుండా హైదరాబాద్ లోనే అత్యంత అద్భుతమైన హెచ్‌డీఆర్ బై బార్కో స్క్రీన్‌లను కూడా ప్రవేశపెట్టి ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది.  ఈ అద్భుతమైన ప్రస్థానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఇప్పుడు మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం వారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, దగ్గుబాటి రానా లతో చేతులు కలిపారు. ఈ అగ్ర తారల కలయికతో రూపొందుతున్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒకే ఒక్క ఐమాక్స్ థియేటర్‌గా రికార్డు సృష్టించబోతోంది. ఈ మల్టీప్లెక్స్ వెనుక ఒక గొప్ప చారిత్రాత్మక నేపథ్యం కూడా దాగి ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒకప్పుడు ఎన్నో సంచలన రికార్డులకు, అద్భుతమైన సినిమా వేడుకలకు వేదికగా నిలిచిన చారిత్రాత్మక సుదర్శన్ 70ఎంఎం (Sudarshan 70mm) థియేటర్ స్థానంలోనే ఈ సరికొత్త ఏఎంబీ క్లాసిక్ విక్టరీ రూపుదిద్దుకుంటోంది. ఎంతోమంది అగ్ర హీరోల బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులు ఎమోషనల్ బాండింగ్ కలిగి ఉన్నారు. ఇప్పుడు అదే నేలపై సరికొత్త సినిమా సాంకేతిక విప్లవం రాబోతోంది. పాత జ్ఞాపకాలను అలాగే ఉంచుతూనే, సరికొత్త తరానికి సరిపడే అత్యాధునిక సాంకేతికతతో ఈ థియేటర్ నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ అద్భుతమైన మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. త్వరలోనే ఏఎంబీ క్లాసిక్ విక్టరీ అందుబాటులోకి రానుండటంతో సినిమా ప్రియులు ఇక్కడ ఐమాక్స్ అనుభూతిని పొందడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ మరియు మైండ్ బ్లోయింగ్ సౌండ్ సిస్టమ్‌తో హైదరాబాద్ లో సినిమా చూసే విధానమే మారిపోనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ బిగ్ షాట్స్ మరియు ఏషియన్ గ్రూప్ కలిసి అందిస్తున్న ఈ లగ్జరీ సినిమా ఎక్స్‌పీరియన్స్ సిటీ సినీ ప్రియులకు ఒక అద్భుతమైన కానుకగా నిలవనుంది.  
  లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj)ప్రీవియస్ మూవీ  'కూలీ'తో యావరేజ్ హిట్ ని అందుకున్నాడు. తన తదుపరి ప్రాజెక్ట్స్  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్  ఖాన్ తో   ప్లాన్ చేస్తన్న విషయం తెలిసిందే. ముందుగా  అల్లు అర్జున్ మూవీ స్టార్ట్ కానుంది. అదే టైంలో  జయం రవి, రాఘవ లారెన్స్ హీరోలుగా తెరకెక్కుతున్న 'బెంజ్ ' కి కథని అందిస్తున్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నా  ఖైదీ సీక్వెల్ ఉంటుందని ఎప్పట్నుంచో ఊరిస్తున్నాడు. కానీ దాని ఊసే లేదు.  విక్రమ్ 2 కూడా తెరకెక్కించాల్సి ఉన్నా అదే పరిస్థితి. ఎక్కడ విక్రమ్ 2 గురించి మాట్లాడటం లేదు.  లియో 2 ఉంటుందని చెప్పినా విజయ్ సినిమాలకి స్వస్తి చెప్పడంతో లియో 2 ఉండదు. విక్రమ్ లో సూర్య చేసిన రోలెక్స్ క్యారక్టర్ తో సినిమా ఉంటుందని చెప్పాడు. ఆ చిత్రం ఊసు కూడా లేదు. వీటిన్నిటిని పక్కన పెట్టి అల్లు అర్జున్ సినిమా,అమీర్ ఖాన్ మూవీ అనౌన్స్ చేసాడు కదా మరి అవి ఉండవా అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. also read: CM కి తమ పవర్ ఏంటో చూపించిన SPG కమాండోస్ సంక్రాంతి కానుకగా మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన 'AA 23' ప్రాజెక్ట్ సినీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా  1871 కోట్ల భారీ వసూళ్లు సాధించిన అల్లు అర్జున్  ఈ సారి లోకేష్ కి జత కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగస్టు  లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.    
Shalini Kondepudi playing antagonist in Singeetham Srinivasa Rao's Sing Geetham opened up about her role and shared details about the film’s unusual musical-comedy world and her experience working on it. Talking about joining the project, she revealed that she auditioned after learning that it is being directed by the legend.  She shared that she is doing a strong character with negative shades. Further she revealed that Sing Geetham is set in a fictional village called Kuberapuram and revolves around a world where conversations flow like songs.  She added that audiences will understand the reason behind people communicating musically only after watching the film. She also described the preparation process as one of the biggest challenges. Shalini revealed that the team attended multiple workshops as actors had to learn to deliver dialogues in musical rhythm rather than perform traditional songs.  She thanked Devi Sri Prasad for helping them understand the rhythm. She further revealed that they completed depended on Singeetham and Nag Ashwin's directions to perform their roles. She concluded by calling the movie as completely disctinctive and captivating experience. Ayaan, Ahilya are playing leading roles in the film releasing on 11th June.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం,  విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు  అవేంటో తెలుసుకుంటే.. విడిపోవడం.. చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే  కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా  చూసుకోవచ్చు.  కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. అసలు సమస్య.. విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు  సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ  ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం. ప్రేమ.. ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే...  ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే.. పరిస్థితి.. విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి.  అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని  ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా  తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా,  భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం. మనసే కాదు.. ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది. స్పష్టత.. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే,  చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి  సరిగ్గా తెలియజేశారా? తమ  అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.
  మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం, సూదుల నొప్పిని భరించడం ఎంత నరకంలా ఉంటుందో ఆ బాధను అనుభవించే వారికే తెలుస్తుంది. మీరు లేదా మీ ప్రియమైన వారు ఈ పరిస్థితుల్లో ఉన్నారా? కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గమని డాక్టర్లు చెప్పారా? అయితే ఆందోళన చెందకండి. ప్రకృతి ప్రసాదించిన ఔషధాలతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో మీ కిడ్నీలను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. పూర్తి వివరాల కోసం Dr. Srinivas Gupta గారు ఈ VIDEO లో వివరించారు. కిడ్నీల ఆరోగ్యం కోసం ప్రకృతి చిట్కాలు మన ఇంటి పరిసరాల్లో దొరికే మొక్కలే మనకు గొప్ప డాక్టర్లు. వందల ఏళ్లుగా ఆయుర్వేదంలో వాడబడుతున్న చిట్కాలు కిడ్నీ సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను చూపుతున్నాయి. వేపాకు మరియు రావి ఆకు కషాయం: ఐదు వేపాకులు మరియు మూడు రావి ఆకులను తీసుకుని, 100 ml నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు 50 ml అయ్యే వరకు మరిగించి, ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల క్రియాటినిన్ (Creatinine) మరియు యూరియా స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని వేల మంది పేషెంట్లలో గమనించడం జరిగింది.   మొక్కజొన్న పొత్తు జుట్టు (Corn Silk): మనం సాధారణంగా పడేసే మొక్కజొన్న పొత్తు జుట్టు కిడ్నీలకు ఒక వరం. దీనిని నీటిలో మరిగించి టీ లాగా తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు తగ్గడమే కాకుండా క్రియాటినిన్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి పసుపు టీ: పచ్చి పసుపు, అల్లం మరియు కరివేపాకులను నలిపి నీటిలో మరిగించి ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది మరియు ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఆహారమే అతిపెద్ద మందు కిడ్నీ పేషెంట్లు రైస్ లేదా గోధుమ రొట్టెలకు బదులుగా బార్లీ (Barley) ని వాడటం శ్రేయస్కరం. బార్లీ ఒక నేచురల్ డయూరెటిక్ (diuretic) లాగా పనిచేసి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. కూరగాయల ఎంపిక: మీ మధ్యాహ్న భోజనంలో పొట్లకాయ (సొరకాయ) మరియు రాత్రి భోజనంలో బీరకాయను ఎక్కువగా చేర్చుకోవాలి. ఉప్పు వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించడం చాలా ముఖ్యం. గ్రీన్ జ్యూసెస్: కొత్తిమీర, పుదీనా, కరివేపాకు మరియు గ్రీన్ ఆపిల్‌తో చేసిన జ్యూస్ శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి (Detox) సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్: రక్తపోటును (BP) నియంత్రించడంలో మరియు కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక అమృతంలా పనిచేస్తుంది. ఆధునిక చికిత్స మరియు జీవనశైలి మార్పులు కేవలం ఆహారం మాత్రమే కాకుండా, ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లలో అందించే కిడ్నీ ప్యాక్, కిడ్నీ మసాజ్ మరియు కిడ్నీ ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ వంటి బాహ్య చికిత్సలు కిడ్నీలను మళ్ళీ ఉత్తేజితం చేస్తాయి. అలాగే, చెప్పులు లేకుండా నేల మీద నడవడం (Earthing) వల్ల శరీరం ఉత్తేజితమై ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందస్తు హెచ్చరికలు: యూరిన్ వెళ్ళినప్పుడు బాగా నురుగు వస్తుంటే, అది ప్రోటీన్ లీక్ అవుతున్నట్లు ప్రాథమిక సూచన. దీనిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్రశ్న 1: క్రియాటినిన్ స్థాయిలను సహజంగా తగ్గించవచ్చా?  సమాధానం: అవును, వేపాకు మరియు రావి ఆకు కషాయం తీసుకోవడం, బార్లీ ఆహారంలో చేర్చుకోవడం మరియు కిడ్నీలకు సంబంధించిన ప్రత్యేక వ్యాయామాలు చేయడం ద్వారా క్రియాటినిన్ స్థాయిలను తగ్గించవచ్చు. ప్రశ్న 2: డయాలసిస్ స్టేజ్ లో ఉన్నవారు కూడా ఈ చికిత్సలు ఫాలో అవ్వచ్చా?   సమాధానం: తప్పకుండా. ఫోర్త్ లేదా ఫిఫ్త్ స్టేజ్ లో ఉన్నవారు కూడా సరైన డైట్ మరియు నాచురల్ ట్రీట్మెంట్స్ ద్వారా తమ క్రియాటినిన్ స్థాయిలను తగ్గించుకుని సాధారణ స్థితికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్న 3: కిడ్నీ పేషెంట్లు ఎలాంటి కూరగాయలు తినాలి?  సమాధానం: సొరకాయ మరియు బీరకాయ కిడ్నీలకు చాలా మంచివి. కూరగాయలను వాడే ముందు వాటిని బాయిల్ చేసి ఆ నీటిని పారబోయడం వల్ల పొటాషియం స్థాయిలు తగ్గుతాయి, ఇది కిడ్నీ పేషెంట్లకు ముఖ్యం.  కిడ్నీ సమస్య అనగానే భయపడిపోయి డయాలసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్ళే ముందు, ఒకసారి మన ప్రకృతి అందించే చికిత్సలను నమ్మండి. క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు సరైన వ్యాయామంతో కిడ్నీలను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చుకోవడం అసాధ్యమేమీ కాదు.   మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్స్ : INDIA : + 917070999313  USA : +1(732)947-4166   మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు కిడ్నీ వ్యాధులపై పూర్తి అవగాహన కోసం మా యూట్యూబ్ ఛానెల్‌ TeluguOne Health ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!  మీ ఆరోగ్యం - మీ చేతుల్లోనే!
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు (Bad Gums) నిర్లక్ష్యం చేస్తే అవి మన శరీరంలోని ఇతర భాగాలపై కూడా తీవ్ర प्रभावం చూపుతాయి. ఈ ముఖ్యమైన విషయంపై ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ సుధీర్ చౌదరి (Dentist, MDS) గారు అందించిన పూర్తి సమాచారం సరళమైన తెలుగులో ఈ వీడియో మీ కోసం... చిగుళ్ల సమస్యలకు ప్రధాన కారణాలు (Causes of Gum Diseases): ప్లేక్ మరియు టార్టార్ (Plaque & Tartar): మనం తినే ఆహార అవశేషాలు, నోటిలోని బ్యాక్టీరియా కలిసి పంటిపై ఒక జిగట పొరలా (Plaque) ఏర్పడతాయి. దీనిని సకాలంలో బ్రషింగ్ ద్వారా శుభ్రం చేయకపోతే అది గట్టిపడి టార్టార్‌గా మారుతుంది. ఇది చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు ప్రధాన కారణం. తప్పుడు బ్రషింగ్ విధానం: రోజుకు రెండు సార్లు బ్రష్ చేయకపోవడం లేదా చాలా గట్టిగా పళ్ళను తోమడం వల్ల చిగుళ్లు దెబ్బతింటాయి. పోషకాహార లోపం: శరీరంలో ముఖ్యంగా విటమిన్ సి (Vitamin C) మరియు కాల్షియం లోపం వల్ల చిగుళ్లు బలహీనపడతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు: మధుమేహం (Diabetes) ఉన్నవారిలో, ధూమపానం (Smoking) అలవాటు ఉన్నవారిలో మరియు గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల చిగుళ్ల ఇన్ఫెక్షన్లు త్వరగా వస్తాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాలు (Symptoms of Gum Infection): బ్రష్ చేస్తున్నప్పుడు లేదా గట్టి పదార్థాలు (ఆపిల్ వంటివి) తింటున్నప్పుడు చిగుళ్ల నుండి రక్తం కారడం (Bleeding Gums). చిగుళ్లు ఎర్రగా మారడం, వాపు రావడం మరియు ముట్టుకుంటే నొప్పిగా ఉండటం. నోటి నుండి విపరీతమైన దుర్వాసన రావడం (Bad Breath). పళ్ళు కదలడం లేదా పళ్ళ మధ్య ఖాళీలు (Gaps) ఏర్పడటం. చిగుళ్లు పంటి పైభాగం నుండి కిందికి జారిపోవడం (Gum Recession). చిగుళ్ల సమస్యలు ఇతర ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? (Impact on Overall Health): చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను నిర్లక్ష్యం చేస్తే, ఆ బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. ఇది గుండె జబ్బులు (Heart Diseases), డయాబెటిస్ నియంత్రణ తప్పడం మరియు గర్భిణీ స్త్రీలలో ముందస్తు ప్రసవాల (Premature Delivery) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నివారణ మరియు చికిత్స మార్గాలు (Prevention & Treatment): డెంటల్ స్కేలింగ్ (Scaling): ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటిస్ట్‌ను సంప్రదించి పళ్ళను, చిగుళ్లను ప్రొఫెషనల్‌గా క్లీన్ (Scaling) చేయించుకోవాలి. దీనివల్ల పంటిపై పేరుకుపోయిన గట్టి టార్టార్ తొలగిపోతుంది. సరైన బ్రషింగ్ మరియు ఫ్లాసింగ్: మృదువైన (Soft) బ్రష్ ఉపయోగించి, రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారాన్ని తొలగించడానికి డెంటల్ ఫ్లాస్ (Floss) ఉపయోగించాలి. ఆరోగ్యకరమైన ఆహారం: విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, జామ వంటి పండ్లు మరియు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. గమనిక : చిగుళ్ల నుండి రక్తం రావడం అనేది సాధారణ సమస్య కాదు, అది ఒక హెచ్చరిక. కాబట్టి పంటి సమస్యలు రాకముందే జాగ్రత్త పడటం ఎంతో మేలు.    మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health  సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!