LATEST NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలనకు తానే   రేటింగ్ ఇచ్చుకుని  సంచలనానికి తెరలేపారు ఒక జాతీయ మీడియా సదస్సులో  ఆయన తన పాలనకు  65 శాతం మార్కులు ఇవ్వొచ్చని ప్రకటించారు.   ఇంకా చేయాల్సిన అంశాలు మిగిలి ఉన్నాయని, రాబోయే రెండేళ్లలో వాటిని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు రేవంత్ చెప్పారు.  సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు. అలా అతి విశ్వాసంతో తమ పాలన బ్రహ్మాండంగా ఉందంటూ గొప్పలు చెప్పుకున్న చాలా మంది ముఖ్యమంత్రులకు ఎన్నికలలో ప్రజలు తన ఓటు ద్వారా వాస్తవ పరిస్థితిని తెలియజెప్పిన సంఘటనలు దేశంలో చాలా ఉన్నాయి.  అయితే..  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజలకు తాను ఏమి చేశాను? ఇంకా చేయాల్సింది ఏమిటి? ఎంత వరకూ చేయగలను? అన్న అంశాలపై స్పష్టత ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే ఇప్పటి వరకూ తన పాలన ఎలా ఉందో అన్న విషయంలో ఆయన చాలా చాలా వాస్తవంగా, నిజాయితీగా చెప్పారు.    జాతీయ మీడియా సదస్సులో, ఇప్పటివరకు మీ  పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారన్న ప్రశ్న ఎదురైనప్పుడు రేవంత్ రెడ్డి ఏ మాత్రం తడుముకోకుండా, తడబడకుండా నూటికి 65 మార్కులు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తనకు తానే తక్కువ మార్కులు ఇచ్చుకోవడం ద్వారా వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తానని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పినట్లైంది. ఇంకా రెండేళ్ల పదవీ కాలం ఉందనీ, చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయనీ చెప్పిన రేవంత్ వాటిని కచ్చితంగా పూర్తి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.  సాధారణంగా ముఖ్యమంత్రులు తాము చేయగలిగినదంతా చేశామని, ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెబుతూ, తమకు తామే వంద శాతం రేటింగ్ ఇచ్చుకుంటూ స్వోత్కర్షకు ప్రాధాన్యత ఇస్తుంటారు.  రేవంత్ రెడ్డి మాత్రం తాను చేయాల్సినది ఇంకా ఉందనీ, మూడేళ్ల పాలనా కాలంలో కేవలం 65శాతం మాత్రమే తాను అనుకున్నది చేయగలిగాననీ నిస్సంకోచంగా అంగీకరించి పరిశీలకులను సైతం విస్మయపరిచారు.  ఇది కూడా చదవండి:   బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.! తాను ఇంకా కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉందని చెప్పడం, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా తనకు నూటికి 64 మార్కులే పడ్డాయని ధైర్యంగా చెప్పగలగడం  ద్వారా తాను వాస్తవాలను వాస్తవాలుగా అంగీకరించడానికి భయపడనని చాటినట్లైంది.  అదే సమయంలో మిగిలిన రెండేళ్ల పాలనా కాలంలో ప్రజల అంచనాలను చేరుకుని మిగిలిన 35 మార్కులూ కూడా సాధిస్తానని అంతే ధైర్మంగా చెప్పడం ద్వారా.. తాను వందశాతం ప్రజామోదాన్ని పొందడానికి కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పినట్లైంది. మొత్తం మీద తనకు తాను రేటింగ్ ఇచ్చుకుని రేవంత్ రెడ్డి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని రాజకీయవర్గాలలో  చర్చ జరుగుతోంది. మీకు నచ్చవచ్చు:  మహిళా శక్తే నా శక్తి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా: సీఎం రేవంత్ రెడ్డి డీ లిమిటేషన్ దక్షిణాదికి గొడ్డలి పెట్టు: అమిత్ షా దమ్ముంటే ఒవైసీపై పోటీకి దిగు.!  [TelanganaCM, Revanth Reddy, Selfrating, Governence,  TeluguOne]
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఆధిక్యత ప్రస్ఫుటమైంది.   రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  మరోవైపు   వైసీపీ కేవలం అల్లూరి సీతారామరాజు జిల్లాకే పరిమితమైంది. స్థానిక సంస్థల అత్యున్నత వేదికలైన జిల్లా పరిషత్‌లపై కూటమి సాధించిన ఈ విజయంపై కూటమి పార్టీల్లో ఆనందోత్సాహలు వ్యక్తమతౌతున్నాయి. సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.  ఇక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే.. అత్యధిక స్థానాలలో  తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. మొత్తం 22 జడ్పీ చైర్‌పర్సన్ పదవులతో పాటు 20 వైస్ చైర్‌పర్సన్ పదవులను తెలుగుదేశం కైవసం చేసుకుంది. ఇక జనసేన జనసేన నాలుగు జడ్పీ చైర్‌పర్సన్ పదవులు, ఐదు వైస్ చైర్‌పర్సన్ పదవులను తన ఖాతాలో వేసుకుంది. బీజేపీ ఒక జడ్పీ చైర్‌పర్సన్ పదవితో పాటు రెండు వైస్ చైర్‌పర్సన్ స్థానాలను గెలుచుకుంది. ఇక   అల్లూరి సీతారామరాజు జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ దక్కించుకుంది.   పొత్తులో భాగంగా కొన్ని జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించడంతో సమీకరణాలు మారిపోయాయి. తొలి నుంచి ఆయా పదవులను ఆశించిన నాయకుల్లో కొంత అసంతృప్తి తలెత్తింది. ముఖ్యంగా కాకినాడ,   కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూటమి శ్రేణుల్లోని అసమ్మతి బయటపడింది. పదవుల కేటాయింపు విషయంలో నెలకొన్న మార్పులు కొన్ని చోట్ల చర్చనీయాంశంగా మారాయి. కాకినాడ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవిని ఆశించిన కాకినాడ రూరల్ టీడీపీ ఇన్‌ఛార్జి పిల్లి అనంతలక్ష్మికి  పొత్తు కారణంగా ఆ అవకాశం దక్కలేదు. ఆ పదవి జనసేనకు వెళ్లడంతో ఆమెకు వైస్ చైర్‌పర్సన్ అవకాశం కల్పించేందుకు ప్రయత్నించారు. అయితే అసంతృప్తికి గురైన ఆమె ఎన్నిక ప్రక్రియకు హాజరుకావడానికి తొలుత నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ఎంపీ సానా సతీశ్ తదితరులు ఆమెతో మాట్లాడి బుజ్జగించినప్పటికీ, సమావేశ మందిరానికి వచ్చిన అనంతరం ఆమె ప్రమాణస్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా టీడీపీ జడ్పీటీసీ సభ్యురాలు పంపన రాజేశ్వరి ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అభ్యర్థుల ప్రకటనలో తెలుగుదేశం జోరు: స్థానిక సమరం.. క్యాండేట్ల రెండో జాబితా విడుదల.! పార్వతీపురం మన్యం జిల్లాలోనూ పదవుల కేటాయింపుపై నిరసనలు వ్యక్తమయ్యాయి. వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్‌పర్సన్ పదవి వస్తుందని తొలుత అంచనాలు ఉన్నప్పటికీ, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. దీనిని నిరసిస్తూ కురుపాంలో బంద్ నిర్వహించారు. అనంతరం వీరేశ్ చంద్రదేవ్‌కు వైస్ చైర్మన్ పదవి దక్కగా, ఆయన ఎన్నికై ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల స్థాయిలో పట్టు పెంచుకునే దిశగా జరిగిన ఈ ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిత్రపక్షాల మధ్య సమన్వయంతో   మెజారిటీ జడ్పీలను చేజిక్కించుకోవడం కూటమికి సానుకూలాంశంగా మారింది.   జిల్లా పరిషత్‌ల పాలకమండళ్లు పూర్తిస్థాయిలో కొలువుదీరిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశం ఉంది. తాగునీరు, రహదారులు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనలో జడ్పీల పాత్ర కీలకంగా ఉంటుంది. మున్ముందు జడ్పీ సమావేశాల నిర్వహణ, నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల అమలులో కూటమి నేతల మధ్య సమన్వయం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల సమయంలో తలెత్తిన అసంతృప్తులను సమర్థవంతంగా సర్దుబాటు చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య ఐక్యతను కాపాడుకోవడం కూటమి నాయకత్వానికి కీలకంగా మారనుంది. ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్తగా ఎన్నికైన జడ్పీ పాలకవర్గాలు ఏ మేరకు వేగంగా పనిచేస్తాయో వేచి చూడాలి. మీకు నచ్చవచ్చు: చీరాల మునిసిపోల్ ఫలితాలు: సోదిలో కూడా కనిపించని వైసీపీ.! ఏపీలో వైసీపీ కంటే బీజేపీయే బెటర్: స్థానిక సమరంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న జగన్ పార్టీ.! [Andhra Pradesh Zilla Parishad Elections,  Alliancevictory, ZP chairpersons, YCP,  Alluri Sitarama Raju Zilla Parishad]
కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్థి: కేటీఆర్ ను లైట్ తీసుకుంటా.. సదరన్ రైజింగ్ సమ్మిట్ లో రేవంత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నిజంగా ఆత్మవిశ్వాసం ఉంటే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై విజయం సాధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సవాల్ చేశారు.  హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2026  కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జాతీయ, ప్రాంతీయ రాజకీయాలకు సంబంధించి  కీలక వ్యాఖ్యలు చేశారు.  మతపరమైన ఓట్ల చుట్టూనే బీజేపీ, ఎంఐఎం రాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్  మాత్రం అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగుతోందన్నారు. ఈ వేదికపై జరిగిన సంభాషణలో లోక్‌సభ సీట్ల పునర్విభజన, కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యర్థులపై ఆయన తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లుగా వెల్లడించారు.  నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)   ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంగా కాకుండా, యావత్ దక్షిణ భారతదేశ భవిష్యత్తుకు సంబంధించిన పెద్ద సవాలుగా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. లోక్‌సభ స్థానాలను యాభై శాతం పెంచితే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని, కేవలం ఉత్తరాది సీట్ల ఆధారంగానే అధికారాన్ని చేజిక్కించుకునే పరిస్థితి ఏర్పడుతుందని  హెచ్చరించారు. పునర్విభజన తర్వాత మొత్తం 850 లోక్‌సభ స్థానాలు ఏర్పడితే.. వాటిలో ఉత్తరాదికి దాదాపు  650 సీట్లు, దక్షిణాదికి దాదాపు 195 సీట్లు దక్కే అవకాశం ఉందని గణాంకాలతో సహా వివరించారు. కేరళలో 20, ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో 60 సీట్ల తేడా ఉండగా, యాభై శాతం పెంపు జరిగితే కేరళలో 30, యూపీలో 120 సీట్లతో ఆ వ్యత్యాసం 90 సీట్లకు పెరుగుతుందని ఉదాహరించారు. ప్రజాస్వామ్యంలో సంఖ్యాబలం కీలకమని గుర్తు చేస్తూ, గతంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో పడిపోయిన సందర్భం ఉన్నప్పటికీ, దక్షిణాది ప్రాధాన్యతను దెబ్బతీసేలా సీట్ల సంఖ్యలో భారీ అసమతుల్యత రావడం దేశానికి  ఏ మాత్రం శ్రేయస్కరం కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 175 సీట్లు ఆంధ్ర ప్రాంతానికి, 119 సీట్లు తెలంగాణకు ఉన్న సమీకరణంలో మెజారిటీ బలంతో తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఆ కారణంగానే పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, రాష్ట్రాలు, జనాభా, జీడీపీ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని యాభై శాతం ఫార్ములాను అనుసరించాలని గట్టిగా డిమాండ్ చేశారు.  మహిళా రిజర్వేషన్ల అమలుకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే కొత్త చట్టాలు లేదా రాజ్యాంగ సవరణల అవసరం లేకుండానే, ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లో 181 స్థానాలను మహిళలకు కేటాయించవచ్చన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడానికి కాంగ్రెస్ సహకరించినప్పటికీ, సంఖ్యాబలంతో ముందుకెళ్తూ భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా దక్షిణాదికి నష్టం కలిగించేలా వ్యవహరించడం తగదన్నారు.  ప్రధానమంత్రి నరేంద్ర మోదీని  విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ గా అభివర్ణిస్తూ, ఆయన తరచూ విదేశీ పర్యటనల్లో ఉంటున్నారన్న రేవంత్ రెడ్డి,  కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఐటీలను రాజకీయ అవసరాల కోసం ఉపయోగిస్తున్నారని, జాతి, మతం, భాష పేరిట విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధుల కృషితో సామాన్యులకు లభించిన ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ, రాహుల్ గాంధీ చేపట్టిన 'ఓట్ చోర్ - గద్దీ చోర్' నినాదానికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోందన్నారు. ఇక విదేశాల్లో మోదీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడంపై,  పేదల హక్కుల కోసం వివిధ దేశాల్లో పోరాడిన చేగువేరా స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై తాము నిలబడతామని సమర్ధించారు.   ఇది కూడా చదవండి: బాబుతో బంధాన్ని ఎప్పుడో తెంచుకున్నా: తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యం.. సీఎం రేవంత్.!   అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.  ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలపై మాట్లాడుతూ,  కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న రేవంత్ రెడ్డి  బీజేపీ ముఖ్యమంత్రుల పేర్లు గుర్తుకురాక నీతి ఆయోగ్ సమావేశాల్లో నేమ్ బోర్డులు చూడాల్సి వస్తోందని చమత్కరించారు.  కేసీఆర్‌ను తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తానని, అయితే కేటీఆర్‌ను సీరియస్‌గా తీసుకోనని రేవంత్ చెప్పారు.  తాను పదిహేడేళ్ల వ్యవధిలో జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి స్వయంశక్తితో ముఖ్యమంత్రి పదవిని చేరుకున్నానని, కేటీఆర్ మాత్రం తండ్రి అండతో  మేనేజ్‌మెంట్ కోటా లో నాయకుడయ్యారని ఎద్దేవా చేశారు.  తన రాజకీయ కథలో కేసీఆర్‌ను  రావణాసురుడిగా అభివర్ణించారు.   ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్‌ను కొనసాగిస్తున్నామని, లేదంటే ఎప్పుడో ఖాళీ చేసేవారమని స్పష్టం చేశారు. మీకు నచ్చవచ్చు: రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్, హరీష్.​ కేటీఆర్ ఆస్తులివీ: సిరిసిల్ల వేదకగా బయటపెట్టిన సీఎం రేవంత్.!  [Southern Rising Summit, Revanth Reddy,   Delimitation,   Amit Shah, Oyaisi, KCR,  KTR, TeluguOne] 
జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే  కడప  ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైఎస్ అవినాష్ రెడ్డికి పెలీసులు నోటీసులు అందజేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నివాసం నుంచి  బయటకు రావద్దని పోలీసులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే , ఆ ఆంక్షలను ఖాతరు చేయకుండా  ఆయన భారీ వాహనశ్రేణితో పర్యటనకు బయలుదేరారు.  వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో వైఎస్ అవినాష్ రెడ్డి సింహాద్రిపురం మండలంలోని అంకాలమ్మ గూడూరుకు శుక్రవారం (నవంబర్ 20) చేరుకున్నారు. పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది.  ఈ పరిణామాలకు ముందురోజు అంటే గురువారం (నవంబర్ 19)  టీడీపీ నేత బీటెక్ రవి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ, ఆయన వ్యవహార శైలిని తక్షణమే కట్టడి చేయాలని  డిమాండ్ చేశారు. ఇది జరిగిన  మరుసటే అవినాష్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి కాన్వాయ్‌తో పర్యటనకు వెళ్లడాన్ని టీడీపీ శ్రేణులు, స్థానికులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తూ   ఖండించారు. అదలా ఉండగా,  అంకాలమ్మ గూడూరు వద్ద తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘటనలో ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై పెట్రోల్ బాంబులతో దాడి జరిగిందంటూ వైసీసీయులు పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టారు. అయితే ఎంపీ కాన్వాయ్ పై పెట్రోల్ బాంబు దాడి వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు ఖండించారు.  ఆలా ఉండగా అంకాలమ్మ గూడురులో జరిగిన ఘర్షణలో తెలుగుదేశం కార్యకర్త ఒకరు గాయపడ్డారు.  ఇది కూడా చదవండి:  అవినాష్ రెడ్డి కాన్వాయ్ పై బాంబుదాడి: సింహాద్రిపురంలో ఉద్రిక్తత.! ప్రస్తుతం అంకాలమ్మ గూడూరులో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణ నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఘర్ణణకు దిగిన వారిని స్వల్పంగా లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. పులివెందులలోనూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆంక్షలు విధించి భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిబంధనలను, ఆంక్షలను ఉల్లంఘిస్తూ కఠిన చర్యలు తప్పవని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పంచాయతీ ఎన్నికలలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిందని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు. మీకు నచ్చవచ్చు:   పులివెందులలోనూ వైసీపీ కుదేలు: రాజకీయం పతనానికి సంకేతమేనా? పులివెందులలో జగన్ కు మరో షాక్: జడ్పీటీసీ తెలుగుదేశం కైవసం.! [Kadapa MP YS Avinash Reddy, Violate, estrictions, HugeCanvoy, Ankalamma Guduru, Pulivendula, TeluguOne]
తెలుగుదేశం పార్టీతోనూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనూ ఉన్న సన్నిహిత సంబంధాన్ని తాను ఎప్పుడో తెంచుకున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్దిపేటలో నిర్వహించిన  ప్రజా పాలన  ప్రగతి బాట బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ప్రయోజనాలే తనకు  ముఖ్యమని కుండబద్దలు కొట్టారు.     ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి   తిప్పికొట్టారు. తెలుగుదేశం పార్టీతో తాను ఏనాడో తెగదెంపులు చేసుకున్నానని, బాబుతో సన్నిహిత సంబంధాన్ని ఎప్పుడో విచ్ఛిన్నం చేసుకున్నానని  పునరుద్ఘాటించారు. తాను తెలంగాణ బిడ్డనని, తనను ముఖ్యమంత్రిని చేసిన ఈ గడ్డకు నీటి విషయంలో   అన్యాయం ఎలా చేస్తానని, ఎందుకు చేస్తానని  ప్రశ్నించారు. కృష్ణా జలాల వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని గతంలో సంతకం చేసింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు కాదా అని నిలదీశారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డిని ప్రగతిభవన్‌కు ఆహ్వానించి విందు ఇచ్చి, రాయలసీమ ప్రాజెక్టులకు సహకరించింది కేసీఆరేనని  ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావుల రాజకీయ ప్రస్థానం, కుటుంబ ఆస్తులు, ప్రాజెక్టుల వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.  చింతమడకలో ఉన్న కేసీఆర్‌కు తొలిసారి రాజకీయ అవకాశం కల్పించింది దివంగత కాంగ్రెస్ నేత ఆనంతుల మదన్ మోహన్ అనీ,   అలాంటి వ్యక్తిపైనే కేసీఆర్ పోటీ చేశారని విమర్శించారు. ఆయన జ్ఞాపకార్థం సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెడతామని ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాలుగా మామ, అల్లుడు, బావమరిది అంటూ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయన్న రేవంత్ రెడ్డి.. 2004లో వార్డు మెంబర్ కూడా కాని హరీశ్ రావు, నాడు కాంగ్రెస్ దయతో  రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారని గుర్తుచేశారు. రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, జన్వాడ ప్రాంతాల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్‌లు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సమకూరాయని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపైనా రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ముందుండి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని విమర్శించారు. ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనే కారణంతోనే, 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆమె అడగకపోయినా పిలిచి పదవి ఇచ్చి గౌరవించామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ రాజకీయ భవిష్యత్తుపై మాట్లాడుతూ, ఇకపై సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డాగా మారబోతోందని రేవంత్  ధీమా వ్యక్తం చేశారు.  ఇది కూడా చదవండి: తెలంగాణలో పాలసీ పెరాలసీ లేదు..పెట్టుబడులకు సంపూర్ణ భద్రత: సీఎం రేవంత్ రాబోయే ఎన్నికల్లో సిద్దిపేట కార్యకర్తలు, నాయకులు చర్చించి సూచించిన అభ్యర్థికే కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తామని, ఇక్కడ గెలిచే ఎమ్మెల్యేకు కీలకమైన మంత్రి పదవి అందిస్తామని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనూ తెలంగాణలో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తాము రద్దు చేయలేదని, పైగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా  5 లక్షల రూపాయల బీమా కవరేజీతో  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంచామన్నారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంపై సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు.. సిద్దిపేట సభలో ప్రగల్భాలు, వ్యక్తిగత విమర్శలు తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశం ఒక్కటీ లేదని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన  దేవుళ్లపై ఒట్లు వేసి రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి..  ఇప్పుడు ఒట్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హరీశ్ రావు కౌంటర్‌తో సిద్దిపేటలో జరిగిన ఈ బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.    మీకు నచ్చవచ్చు:   మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ భేటీ: ఏం చర్చించారో తెలుసా.?​ తెలంగాణ విద్యావిధానంలో సమూల మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం.! [Revanth Reddy, Siddipetpublicmeeting, Chandrababu, Harish Rao, IndirammaFamily LifeInsurance]
ALSO ON TELUGUONE N E W S
Natural Star Nani is confident that his presentation, Nithiin-starrer Alias Rukmini, will mark a memorable comeback for the actor. At the film's musical jam party, Nani went a step ahead and called it a pre-release success celebration, reflecting his strong belief in the romantic drama. They both danced at the event making it a special moment.  Nani revealed that his association with Nithiin goes back to the beginning of his own journey, when he worked as a clap assistant on one of Nithiin's films. “Alias Rukmini journey will script the successful return of Nithiin,” he said, adding that the actor had mesmerised him with his performance. The film, directed by Murali Kanth Devasoth, is being praised by Nani for its simplicity and heartfelt storytelling. He compared its emotional appeal to the kind of romantic films he grew up watching, and said Murali has the potential to create a world of his own through an uncomplicated story. Also Read: Are King100 and Dada being postponed? Nithiin, meanwhile, described Alias Rukmini as his career-best film. The actor said he was proud to be part of the project and confident that audiences would connect with the purity of its story. He has chosen to let the film speak for itself, promising to share more at the pre-release event. Nani also praised debutante Aafiya Sayed, calling her one of the best finds and predicting that she would become a star. The film's music, composed by Vijai Bulganin, has already gained popularity, with its melodious songs adding to the anticipation. Produced by Deepthi Ganta and presented by Nani, Alias Rukmini is set to release on December 4. With Nani calling it an “extremely special film” and Nithiin backing it as his career best, the romantic drama is arriving with strong confidence from its team. Check Out:  Jan 12 Vidudala: Diviki celebrates sister-in-law bond                       ENE Repeat holds strong on second day       Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఫూలే’ .  సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించే కథాంశంతో రూపొందింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఫూలే దంపతుల సామాజిక సేవ, వారి జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చారిత్రాత్మక కథనం. నేటి యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.  
The much-awaited Christmas box-office clash between Nagarjuna's King100 and Nandamuri Balakrishna's Dada is once again facing uncertainty, with fresh postponement rumours surrounding the two big-ticket Telugu films. Both projects had locked December 24 for their theatrical arrival, setting up one of the season's biggest face-offs. Nagarjuna's milestone 100th film has been generating considerable interest, with the actor and makers previously expressing confidence in the Christmas release plan. However, fresh reports suggest that the team may be considering a change in schedule, reportedly due to pending work. Balakrishna's Dada, directed by Gopichand Malineni, has also been caught up in release-date speculation. The film's schedule was earlier questioned following Balakrishna's injury, with reports suggesting that the makers could explore Sankranthi or Maha Shivaratri 2027. However, the Dada team had dismissed the earlier postponement reports and reaffirmed December 24 as its release date. The makers also announced that the film's first single would be released soon, indicating that promotional activity was gearing up. Also Read: Jan 12 Vidudala: Diviki celebrates sister-in-law bond If either film moves out of the Christmas slot, it could significantly alter the year-end box-office picture. The simultaneous release of Nagarjuna's landmark film and Balakrishna's action entertainer had been expected to create a major festive clash. For now, fresh rumours have reignited the debate, but there is no confirmed release-date change for either film. An official announcement from the respective makers will be needed to establish whether the December 24 clash remains intact. Check Out:   ENE Repeat holds strong on second day                        Hanu-Man franchise splits into two Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పి.ఎస్.జె. ఫిలిమ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత ప్రదీప్‌ మాట్లాడుతూ.. "మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఆలోచన మూవీకి 2 ఇయర్స్‌ నుంచి స్క్రిప్ట్ పైన వర్క్‌ చేశాము. 27కి రిలీజ్‌ అవుతుంది. అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా" అన్నారు.  హీరో బెన్నీ మాట్లాడుతూ.. "నేను మంచి యాక్టర్స్‌తో కలిసి నటించాను. నా అదృష్టం ఇంత మంచి సీనియర్స్‌తో కలిసి నటించడం. నాకు ఇంత మంచి అవాశం ఇచ్చినందుకు దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. మూవీ టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌." అన్నారు. హీరోయిన్‌ జెస్సీ మాట్లాడుతూ.. "నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు చాలా థ్యాంక్స్‌. ఆడియన్స్‌ అందరూ మా సినిమాని సపోర్ట్‌ చేసి హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఇంత మంది సీనియర్‌ యాక్టర్స్‌తో కలిసి నటించడం నా అదృష్టం." అన్నారు. డైరెక్టర్‌ చాచా సురేందర్‌ మాట్లాడుతూ.. "టీమ్‌లో ఉన్న పెద్దలు. పూజ్యులుగా మిగిలిన నారాయణరావుగారికి అందరికీ కృతజ్ఞతలు. మా డీఓపీ సురేందర్రెడ్డి నాకు గురువుగారిలాంటి వారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ గిరీష్‌ వీరందరూ కూడా నాకు ఫ్రెండ్స్‌. మ్యూజిక్ డైరెక్టర్ వియాన్ నాకు తమ్ముడు లాంటి వాడు. నేను ప్లాన్‌ చేసుకున్న ప్రకారం చేయడానికి సహకరించిన నా నిర్మాతలకు కృతజ్ఞతలు" అన్నారు.  సీనియర్‌ జర్నలిస్ట్‌ భరద్వాజ మాట్లాడుతూ.. "ఈ చిత్రం పిల్లలకు మాత్రమే లాంటి సినిమా. కచ్చితంగా పిల్లలు చూడాల్సిన సినిమా. పిల్లలు తల్లిదండ్రులను నగరాల్లో వదిలేసి విదేశాలకు వెళ్ళడం అనే అంశాన్ని తీయడం మంచిది. ఏది ఏమైనా మంచి సినిమా. మంచు పల్లకి సినిమాకి దీనికి పోలిక కనిపిస్తుంది. ఐదుగురు కుర్రాళ్ల సినిమాగా ఉంటుంది. నెగిటివ్‌, పాజిటివ్‌ అంశాన్ని చూపించారు. అందుకు దర్శకుడ్ని అభినందించాలి. మారిన సామాజిక స్థితిగతుల గురించి కూడా చూపించి ఉంటే బావుండేది. ఏది ఏమైనా చాలా మంచి సినిమా తీశారు. ఇంత మంచి సినిమా తీసినందుకు దర్శక నిర్మాతలను అభినందిస్తున్నాను." అన్నారు.  కెమెరామెన్‌ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. "ఈ సినిమా ఆలోచన సురేందర్‌ చాచా ముందుగ ప్రపోజల్‌ తీసుకువచ్చారు. నేను ఆ నలుగురు చేసినప్పుడు ఆ సినిమా ఆడుద్దా లేదా అనే డౌట్‌ ఉండేది. కానీ ఈ నిర్మాతలకు అసలు డౌట్‌ లేదు. చాచా ఈ సినిమా పెయింటింగ్‌ లాగా చేద్దాం అన్నారు. అప్పుడు నాకు టఫ్‌గా అనిపించింది. ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా సపోర్ట్‌ చేశారు. ఈ కథని అందరూ ఎంతో బాగా నమ్మారు. యాక్టర్స్‌ ఎంత బాగా ఇన్‌వాల్వ్‌ అయి చేశారు. అన్నది మూవీ చూస్తే మీకు అర్ధమవుతుంది. ఆడియో అనేది సినిమాకి ఎంత అవసరమో ఈ సినిమా చూస్తే అర్ధమవుతుంది. చాచా ఈ సినిమా తరువాత అంతా అద్భుతాలే చేస్తారు అని చెప్పవచ్చు. మా చాచా ఆలోచనలు అవి చాలా డిఫరెంట్‌. మేము కలిసి మరో సినిమా చేయాలనుకుంటున్నాను. సురేష్‌కొండేటి ఎవరికీ అందని అంత ఎత్తుకి ఎదిగిపోయారు. చాలా థ్యాంక్స్‌ . మా సినిమాని ఇంతలా ప్రోత్సహిస్తున్నందుకు. ఆయన తీసుకునే డెసిషన్స్‌ చాలా గొప్పగా ఉంటాయి. ఆయన ఆలోచన విధానం చాలా బావుంటుంది. అందుకే ఎవ్వరికీ అందని అంత ఎత్తుకి ఎదిగిపోయారు." అన్నారు, సురేష్‌కొండేటి మాట్లాడుతూ... "నేను ఇలాంటి సినిమాలు మన ఎస్‌కె పిక్చర్స్‌ ద్వారా  రిలీజ్‌ చేశాం. ఈసినిమా చాలా  అద్భుతమైన సినిమా.అందరూ థియేటర్‌కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నా. ఇక సినిమా టికెట్‌ రేట్‌ కేవలం 100 రూపాయలకి మాత్రమే పెట్డడం జరిగింది. 60ఏళ్ళు వచ్చిన సీనియర్స్‌ ఎవరైనా థియేటర్స్‌ వద్దకి వచ్చి ఆధార్‌ కార్డు చూపిస్తే సినిమా ఫ్రీగా చూడవచ్చు. చాలా అద్భుతంగా ఈ సినిమా సీనియర్ సిటిజన్స్‌ అందరూ వచ్చి చూడొచ్చు. పెద్దవాళ్ళు ఏదో ఒక సన్నివేశంలో కనెక్ట్‌ అవుతారు. ప్రతీ యువత కూడా చూడాలి వారు వయసు మళ్ళిన తరువాత వారి  లైఫ్‌ కూడా ఇంతే అని తెలుసుకుంటారు." అన్నారు. నటుడు హరి మాట్లాడుతూ... నేను రాజమండ్రి నుంచి వచ్చాను. లేటు అయింది అందరికీ క్షమాపణలు. ముఖ్యంగా నా ప్రయత్నం లేకుండా ఏదైనా ఒక పాత్ర వస్తే ఆ పాత్ర నాకు మంచి గుర్తింపు తీసుకువస్తుంది. ఇంత గొప్ప నటులతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత సీనియర్స్‌తో కలిసి చేయడం తో నేను క్రమశిక్షణ అనేది నేర్చుకున్నాను. ఈ సినిమాలో చాలా మంచి లెంగ్త్‌ ఉన్న క్యారెక్టర్‌. ఇంత లెంగ్త్‌ ఉన్న క్యారెక్టర్‌ ఎప్పుడూ రాలేదు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ముఖ్యంగా క్లైమాక్స్‌ చిత్రీకరణ చాలా అద్భుతంగా వచ్చింది. ఎమోషనల్‌ సీన్స్‌ సూపర్బ్‌.  సినియర్‌ నటి జయలలిత మాట్లాడుతూ... "మా సినిమా మాకు ముద్దుగా ఉంటుంది. మన బిడ్డలు మనకి ముద్దుగా అన్నట్లు ఉంటుంది. చాచా గారు ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారంటే చార్లిచాప్లిన్‌కి ఆయన అభిమాని అందుకే ఆయన పేరు పెట్టుకున్నారు. నేను ఏ పాత్ర చేసినా చాలా ఎక్స్‌పెక్టెడ్‌గా చేస్తాను. కానీ ఈ సినిమా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఈ సినిమా చేశాను.  కానీ సినిమా చాలా బాగా వచ్చింది. సహకరిస్తున్న కాట్రగడ్డ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. సురేష్‌ కొండేటి ఈ సినిమాని ఇంత ముందుకు తీసుకువెళుతున్నందుకు ఆయనకు పాదాభివందనాలు" అన్నారు.  నటుడు ప్రసాద్‌బాబు మాట్లాడుతూ... "మాకు వయసులు అయిపోయినా కూడా ఇప్పటి యువతరంతో కలిసి నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమాలో మేము ఎక్కడా కనిపించం మా పాత్రలే కనిపిస్తాయి. మా సినిమాటోగ్రాఫర్‌ చాలా బాగా తీశారు. గిరి ఆర్ట్‌డైరెక్టర్‌ ఎంతో అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా కాలేజీల్లో. స్కూళ్లలో చూపించమనడం చాలా థ్యాంక్స్‌ 27 దయచేసి థియేటర్లలో సినిమాని చూడండి." అన్నారు. నటుడు నర్సింహరాజు మాట్లాడుతూ.. "ఈ సినిమాలో నేను నటించడానికి జీ.వి. నారాయణరావు కారణము. ఆయన నాకు స్నేహితుడు. ఆయనకు ఈ కథ చాలా ఇష్టం. ఆయన లేకుండా ఈ సినిమా రిలీజ్‌ అవ్వడం చాలా బాధగా ఉంది. ఎన్నో సినిమాలు చేసినా కొన్ని విడుదల కూడా అవ్వవు. అయితే డైలాగులు, టేకింగ్‌, ఆర్టిస్టులు, సురేందర్, సురేందర్‌ రెడ్డి వీరందరినీ చూసిన తరువాత నా ఆలోచన తప్పు వీరి ఆలోచనే కరెక్ట్‌  అనుకున్నా. చాలా బాగా అద్భుతంగా తీశారు.   ఈ సినిమాకి సురేష్‌కొండేటి చేయడంతో దీనికి ఎంతో కళ వచ్చింది." అన్నారు.  
ఒక మూవీలో కామెడీ కింగ్ బ్రహ్మానందం ఒక డైలాగ్ చెప్తాడు. ఇలాంటి దారుణాలు చూసే కంటే వెంకీ ని వెతకడమే బెస్ట్ అని. ఇప్పుడు ఈ డైలాగ్ ని తెలుగు సినిమా ప్రేమికులు తమకి నచ్చిన, ప్రేక్షకులకి నచ్చిన సినిమాలకి అన్వహించుకోవాల్సిన పరిస్థితి. పూర్తి మ్యాటర్ ఏంటో చూసేద్దాం.   ఒకప్పుడు ఏ సినిమాకైనా పాజిటివ్ టాక్ వస్తే చాలు, థియేటర్ల ముందు ప్రేక్షకుల రద్దీ కనిపించేది, టికెట్ల కోసం పోటీ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా బాగుంది, కథ బాగుంది, నటీనటుల నటన ఆకట్టుకుంది అనే పదాలు ఒక రేంజ్ లో వినపడుతున్నాయి. కానీ  బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదనే మాట గట్టిగా వినిపిస్తోంది.  ఈ మార్పు వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే ప్రేక్షకుల అలవాట్లలో వచ్చిన పెనుమార్పు స్పష్టంగా కనిపిస్తోంది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే ప్రేక్షకులు ఇప్పుడు ఎన్నో లెక్కలు వేసుకుంటున్నారు. టికెట్ ధరలు, పార్కింగ్, తినుబండారాల ఖర్చులు అన్నీ కలిపి కుటుంబంతో వెళ్తే పెద్ద మొత్తంలో ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో, సాధారణ పాజిటివ్ టాక్ ఉంటే సరిపోదని, తమ సమయానికి, పెట్టే ఖర్చుకు పూర్తి విలువ ఇచ్చే ప్రత్యేకమైన అనుభూతి ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. మిగిలిన సినిమాల కోసం కొద్దివారాలు ఓపిక పట్టి ఓటీటీలో చూడటానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.   మరోవైపు, బాక్సాఫీస్ గణాంకాలు ఈ రంగంలో నెలకొన్న భిన్నమైన ధోరణులను బయటపెడుతున్నాయి. ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాల విషయంలో కూడా కలెక్షన్ల ఊగిసలాట కనిపిస్తోంది. ఉదాహరణకు, సుమారు 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన 'రామాయణ' తొలి భాగం నవంబర్ 5న విడుదలై 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,435.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినా, 2,500 కోట్ల రూపాయల బ్రేక్‌ఈవెన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది, పైగా సోమవారం నాడు వసూళ్లలో 57 శాతం పతనమయ్యాయి. ఇది కూడా చదవండి:నితిన్‌పై నాని ప్రశంసల వర్షం..'అలియాస్ రుక్మిణి'తో ఈ సారి!   అదే సమయంలో, ఇండియన్ బాక్సాఫీస్ తొలి రోజు రికార్డుల పరంగా చూస్తే 'పుష్ప 2: ది రూల్' మొదటి రోజు 32,140 షోల ద్వారా 164.25 కోట్ల రూపాయల నెట్, 275.01 కోట్ల రూపాయల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది, ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్' 223 కోట్ల రూపాయల గ్రాస్, 'బాహుబలి 2' 217 కోట్ల రూపాయల గ్రాస్‌తో నిలిచాయి. ఇదే క్రమంలో మిడ్-బడ్జెట్ సినిమాల విజయాలు కూడా మరో కోణాన్ని చూపిస్తున్నాయి. 25 కోట్ల రూపాయల బడ్జెట్‌తో వచ్చిన 'డీసీ' 14 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువ కావడం, అలాగే సూర్య–వెంకీ అట్లూరి కాంబినేషన్‌లోని 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఆగస్టు 14న విడుదలై కేవలం 5 రోజుల్లోనే 150 కోట్ల రూపాయల గ్రాస్ సాధించి 200 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోవడం గమనార్హం. ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే, కేవలం పైపై పాజిటివ్ టాక్ మాత్రమే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద నోట్ల వర్షం కురిపించడం లేదు. ప్రేక్షకుల అంచనాలను అందుకునే బలమైన కంటెంట్, సోషల్ మీడియా హైప్, సరైన రిలీజ్ టైమింగ్, బలమైన మౌత్ పబ్లిసిటీ ఉంటేనే కలెక్షన్లు నిలబడుతున్నాయి. టాలీవుడ్ మేకర్స్ ఇప్పుడు టాక్‌తో పాటు థియేటర్‌కు ప్రేక్షకుడిని రప్పించే అసలు ఫార్ములాపై కొత్తగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఒక్క నిజం ఏంటంటే 'హిట్ టాక్ వచ్చినా థియేటర్లలో రష్ లేకపోవడం, కలెక్షన్లు తక్కువగా ఉండటం అభిమానులని, సినీ ప్రేమికులని ఇండస్ట్రీ వర్గాలని కలవరపెడుతోంది.   మీకు నచ్చవచ్చు: బిజిఎంకి అర్ధం తెలిసిందోచ్!   మీకు నచ్చవచ్చు: సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా పెళ్లి..ఆ హీరో ఎవరనుకుంటున్నారు!   [Tollywood, Positive Talk, Box Office Collections, Public Talk]  
టాలీవుడ్‌ను పైరసీ భూతం మరోసారి వెంటాడుతోంది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన కొద్ది గంటల్లోనే వాటి పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవుతుండటం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా నాలుగు తెలుగు సినిమాలు ఒకే పైరసీ వెబ్‌సైట్‌లో కనిపించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా విడుదలైన రోజే పైరసీకి గురికావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇటీవల ఒక సైట్ లో ‘రణబాలి’, ‘కల్ట్’, ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ వంటి సినిమాల పైరసీ కాపీలు దర్శమిచ్చాయి. ఈ మూడు సినిమాలను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సిటీ స్క్వేర్ మాల్‌లో ఉన్న థియేటర్‌లో రహస్యంగా కెమెరాతో రికార్డ్ చేసినట్లు గుర్తించారు. క్యూబ్ సినిమా టెక్నాలజీస్ నిర్వహించిన ఫోరెన్సిక్ పరిశీలనలో ఈ విషయం బయటపడినట్లు సమాచారం. ఒకవైపు ఆ దర్యాప్తు కొనసాగుతుండగానే.. తాజాగా నవంబర్ 20న థియేటర్లలో విడుదలైన దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా కూడా అదే వెబ్‌సైట్‌లో కనిపించింది. సినిమా విడుదలైన రోజే పైరసీ కాపీ అప్‌లోడ్ కావడంతో చిత్ర బృందంతో పాటు ఫిల్మ్ ఛాంబర్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ సినిమా పైరసీ కాపీని గుర్తించిన సమయంలో మరో వెబ్‌సైట్‌లో కనిపించలేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ఈ వ్యవహారాన్ని గుర్తించింది. సెల్ ప్రాజెక్ట్ హెడ్ మనీంద్ర బాబు యర్రా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు. కర్నూలు థియేటర్‌లో సినిమాలను రహస్యంగా రికార్డ్ చేసిన వ్యక్తులను గుర్తించాలని, అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌, సినిమా ప్రదర్శించిన షోల వివరాలు, టికెట్ బుకింగ్ రికార్డులను పరిశీలించాలని కోరారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో ఒక తార మూవీ రివ్యూ ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసింది. ప్రస్తుతం పైరసీ కాపీలను థియేటర్‌లో రికార్డ్ చేసింది ఎవరు? వాటిని వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేసింది ఎవరు? ఆ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నది ఎక్కడి నుంచి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ‘ఆకాశంలో ఒక తార’ పైరసీ కాపీ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపైనా విచారణ జరపాలని ఫిల్మ్ ఛాంబర్ కోరింది. సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అలాంటిది సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కాపీలు ఆన్‌లైన్‌లోకి వస్తే బాక్సాఫీస్‌పై ప్రభావం పడే ప్రమాదం ఉంది. పైరసీని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం టాలీవుడ్‌కు ఆందోళన కలిగిస్తోంది. మరి ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటపడతాయో చూడాలి. మీకు నచ్చవచ్చు:  ‘ఈ నగరానికి ఏమైంది 2’ బాక్సాఫీస్‌ రచ్చ.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే.? ఒసేయ్ రాములమ్మ సాంగ్.. రష్మిక రౌద్రరూపం.. విజయశాంతి మ్యాజిక్‌ను రిపీట్ చేసిందా.? [Telugu Movie Piracy, Aakasamlo Oka Tara, Ranabaali, Cult Movie, Aadarsha Kutumbam]  
సినిమా అనేది ఎంత గొప్పదో తెలియడానికి నాచురల్ స్టార్ నాని హీరో కట్ అవుట్ గా తన సత్తా చాటుతూనే ఇప్పడు మరో బిగ్ హీరో కట్ అవుట్ నితిన్ తో అలియాస్ రుక్మిణి నిర్మిస్తున్నాడు. నితిన్ ని ఇప్పుడు వరుస డిజాస్టర్స్ దోస్త్ మేర దోస్త్ తూహే మేరీ జాన్ అంటున్నాయి. అలాంటిది నితిన్ తో నాని మూవీ చేస్తున్నాడంటే అలియాస్ రుక్మిణి కథకి నితిన్ సెట్ అవుతాడని.. అందుకే స్టార్టింగ్ లో తెలుగు సినిమా గొప్పదని చెప్పింది.    ఇటీవల జరిగిన మ్యూజికల్ జామ్ పార్టీలో నాని చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచేశాయి.  నితిన్ తన క్యారక్టర్ లో జీవించాడని, ముఖ్యంగా 'కృష్ణ' పాత్రలో ఆయన నటన అద్భుతంగా ఉందని నాని  ప్రశంసించాడు. 2026 తనకు చాలా ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచిపోతుందని, చిన్నతనంలో భారతీరాజా సినిమాలు చూసినప్పుడు కలిగిన భావోద్వేగాన్ని ఈ కథ తనకి  గుర్తు చేసిందని నాని పంచుకున్నారు. నితిన్ మాట్లాడుతు  'అలియాస్ రుక్మిణి' తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కథలోని స్వచ్ఛతను, భావోద్వేగాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆయన నమ్మకం ఉంచారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మరిన్ని విశేషాలు మాట్లాడతానని చెబుతూనే, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని నితిన్ స్పష్టం చేశారు. నాని, నితిన్ మధ్య ఉన్న పాత అనుబంధం కూడా ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. తన కెరీర్ ప్రారంభంలో ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రోజులను నాని గుర్తు చేసుకున్నారు. తన తొలి రోజుల్లో నితిన్‌తో ఉన్న అనుబంధం ఇప్పుడు నితిన్ కమ్‌బ్యాక్ ప్రయాణంలో తాను భాగస్వామిగా మారేలా చేసిందని నాని చెప్పడం విశేషం. ఇది కూడా చదవండి: అసలు BGM అంటే ఏంటి? తెలుగు సినిమాలకి ఇదే అసలైన బలమా!  దీపావళికి ముందు విడుదలైన యంగ్ కృష్ణ లుక్ గ్లిమ్ప్స్‌కు, అలాగే 'రుకు రుకు రుక్మిణి' పాటకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'రుకు రుకు రుక్మిణి' లిరికల్ వీడియో ఇప్పటికే 5.7 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.మురళి కాంత్ దేవసోత్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నాని సోదరి దీప్తి గంట యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుంది. కథానాయికగా ఆఫియా సయ్యద్ నటిస్తుండగా, ఆమెకు తప్పకుండా మంచి స్టార్‌డమ్ వస్తుందని నాని జోస్యం చెప్పారు. సాయి కుమార్, హర్షవర్ధన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జోమోన్ టి జాన్ సినిమాటోగ్రఫీ, విజయ్ బుల్గానిన్ సంగీతం, సృజన అడుసుమిల్లి ఎడిటింగ్  ప్రధాన బలంగా నిలవనున్నాయి. డిసెంబర్ 4 వరల్డ్ వైడ్ రిలీజ్.     మీకు నచ్చవచ్చు:అల్లు అర్జున్  రాకాకి ధనుష్ ఓం షాక్ ఇచ్చిందా! మీకు నచ్చవచ్చు:ప్రముఖ నిర్మాతని 14 కోట్లకి ముంచేశారు!   [Nithiin, Nani, Alias Rujmini,  Aafiya Sayed, Tollywood]  
దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (DPIFF) 2026 అవార్డుల విజేతల జాబితా విడుదలైంది. భారతీయ సినిమా, హాలీవుడ్‌, సంగీతం, ఓటీటీ, టెలివిజన్‌ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఈ అవార్డులు ప్రకటించారు. ఈ జాబితాలో విశ్వనటుడు కమల్ హాసన్‌, హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌, పాప్‌ సింగర్‌ టేలర్ స్విఫ్ట్‌ పేర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నవంబర్‌ 20న నిర్వాహకులు ఈ విజేతల వివరాలను ప్రకటించారు. భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గానూ కమల్ హాసన్‌కు అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పురస్కారం లభించింది. అలాగే సంగీత దర్శకుడు ఇళయరాజాకు సంగీత రంగంలో విశేష కృషికి గుర్తింపుగా అవార్డు ప్రకటించారు. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్ కామెరాన్‌కు గ్లోబల్ సినిమాకు చేసిన సేవలకు గానూ అవుట్‌స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఇన్ గ్లోబల్ సినిమా పురస్కారం దక్కింది. ఇక పాప్‌ సింగర్‌ టేలర్ స్విఫ్ట్‌ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. భారతీయ స్టాండప్‌ కమెడియన్‌ సమయ్ రైనాకు కమెడియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇది కూడా చదండి: రాకాకి ఓం మూవీ గండం: ఇదేం లాజిక్ అనుకోవద్దు: మ్యాటర్ మొత్తం ఫ్యాన్స్‌కి తెలుసు! ఇక సినిమాల విషయానికి వస్తే.. రణ్‌వీర్ సింగ్‌ నటించిన ‘ధురంధర్‌’ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాలో నటనకు రణ్‌వీర్ సింగ్‌ ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా, దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఉత్తమ దర్శకుడి పురస్కారం లభించింది. ‘సైయారా’ చిత్రంలో నటనకు అనీత్ పడ్డా ఉత్తమ నటిగా ఎంపికైంది. అదే సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. ‘కాంతార: చాప్టర్‌ 1’ విమర్శకుల ఉత్తమ చిత్రంగా నిలవగా, ఆ సినిమాలో నటనకు రిషబ్ శెట్టికి క్రిటిక్స్ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. ‘అవతార్‌: ఫైర్ అండ్ యాష్‌’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపికైంది. ‘సిన్నర్స్‌’ సినిమాలో నటనకు మైఖేల్ బి. జోర్డాన్ అంతర్జాతీయ ఉత్తమ నటుడిగా గుర్తింపు పొందాడు. అలాగే ‘ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌’ వెబ్‌ సిరీస్‌కు పలు విభాగాల్లో గుర్తింపు లభించింది. ఈ సిరీస్‌కు ఆర్యన్ ఖాన్ ఉత్తమ వెబ్‌ సిరీస్ దర్శకుడిగా ఎంపికయ్యాడు. ‘పాతాళ్ లోక్‌’ సీజన్‌ 2లో నటనకు జైదీప్ అహ్లావత్‌కు ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఇక ఈ అవార్డుల పేరులో దాదాసాహెబ్ ఫాల్కే ఉన్నప్పటికీ, ఇవి భారత ప్రభుత్వం అందించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు కావు. ప్రైవేట్ సంస్థ నిర్వహించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు మాత్రమే. ఈ రెండింటి మధ్య తేడాను ప్రేక్షకులు గమనించాలి. మీకు నచ్చవచ్చు: పెళ్లి సందర్భంగా ఉద్యోగులకు కావ్య మారన్ సర్‌ప్రైజ్ గిఫ్ట్ బాక్స్.. అందులో ఏముందంటే.?  నమ్మించి అడ్డంగా 14 కోట్ల రూపాయలకి ముంచేశారు: GOAT నిర్మాత చంద్రశేఖర్రెడ్డి!       [DadasahebPhalkeInternationalAwards, KamalHaasan, JamesCameron, TaylorSwift, GlobalAward] 
టెంపుల్,కాఫీ షాప్, పార్క్, పబ్, బడి..ఆఖరికి సైలెన్స్ గా ఉండాల్సిన లైబ్రరీ..ఇలా ఎక్కడ చూసిన ఒకటే కామన్ డైలాగ్.  నిన్నే పలానా సినిమాకి వెళ్ళాను. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది.. మెంటలెక్కపోయిందనుకో అంటూ ఇప్పుడే ఇండిపెండెన్స్ వచ్చిన వాళ్ళల్లా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని నోటితో హమ్ చేస్తూ పడేస్తాడు కూడా. మరి అంతటి ఘనతని అందుకున్న  బిజిఎం కి దశాబ్దాల చరిత్రనే ఉంది. మరి ఆ బిజిఎం హిస్టరీ వెనక దాగి ఉన్న గమ్మత్తుని చూద్దాం.  సినిమా అనేది కేవలం కళ్లకు కనిపించే దృశ్యం మాత్రమే కాదు, మనసును కదిలించే ఒక అద్భుతమైన అనుభూతి. ఆ అనుభూతిని ప్రేక్షకుల గుండెల్లోకి లోతుగా తీసుకెళ్లే అసలైన శక్తి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అంటే మనం ముద్దుగా పిలుచుకునే BGM. అసలు BGM అంటే ఏమిటి? సినిమాలో పాటలు లేని సమయంలో, సన్నివేశం వెనుక వినిపించే సంగీతమే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. డైలాగులు చెప్పలేని భావాలను, నటుల కళ్లలో కనిపించని లోతైన ఎమోషన్స్‌ను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేసే అదృశ్య నటుడే ఈ BGM. ఒక సాధారణ సన్నివేశాన్ని కూడా అసాధారణ స్థాయికి తీసుకెళ్లే సత్తా కేవలం నేపథ్య సంగీతానికి మాత్రమే ఉంది. ఒక సన్నివేశం ప్రేక్షకుల మనసులోకి బలంగా ఎక్కాలంటే BGM చేసే మాయాజాలం అంతా ఇంతా కాదు. ఉదాహరణకు, తెరపై హీరో ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా నడుచుకుంటూ వస్తున్నాడనుకోండి. ఆ సమయంలో వెనుక వినిపించే ఒక పవర్‌ఫుల్ వయొలిన్ ట్యూన్ లేదా గూస్‌బంప్స్ తెప్పించే డ్రమ్ బీట్ ఆ సన్నివేశానికి ప్రాణం పోస్తుంది. ప్రేక్షకుల గుండె వేగాన్ని పెంచి, తెరపై జరుగుతున్న కథలో వారిని లీనం చేస్తుంది. భయంకరమైన హారర్ సన్నివేశంలో ఆకస్మికంగా వచ్చే శబ్దం గుండెను ఝల్లుమనిపిస్తే, ఒక ఎమోషనల్ సీన్‌లో వినిపించే మృదువైన పియానో లేదా వేణువు నాదం కళ్లలో నీళ్లు తిప్పిస్తుంది.   అనాదిగా తెలుగు సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తూ వస్తోంది ఈ నేపథ్య సంగీతమే. బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి పౌరాణిక చిత్రాల నుండి నేటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ల వరకు తెలుగు సినిమా ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నాడు ఘంటసాల, పెండ్యాల, సాలూరు రాజేశ్వరరావు వంటి దిగ్గజాలు తమ ఆర్కెస్ట్రాతో సన్నివేశాలకు జీవం పోశారు. ఆ తర్వాత ఇళయరాజా, కీరవాణి, మణిశర్మ వంటి సంగీత దర్శకులు తెలుగు సినిమా BGM స్థాయిని మరో శిఖరానికి చేర్చారు. మణిశర్మ అందించిన రీ-రికార్డింగ్ లేకపోతే ఎన్నో మాస్ సినిమాలు అంతటి విజయాన్ని సాధించేవి కావన్నది సినీ విశ్లేషకుల మాట. ఇది కూడా చదవండి: రాకాకి ఓం మూవీ గండం: ఇదేం లాజిక్ అనుకోవద్దు: మ్యాటర్ మొత్తం ఫ్యాన్స్ కి తెలుసు!   నేటి ఆధునిక తెలుగు సినిమాల్లో BGM ప్రాధాన్యత మరింత పెరిగింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయంటే అందులో కథతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పాత్ర ఎంతో కీలకం. కీరవాణి, తమన్, దేవిశ్రీ ప్రసాద్, అనిరుధ్ వంటి సంగీత దర్శకులు ఒక్కో హీరోకు, ఒక్కో సన్నివేశానికి ప్రత్యేకమైన థీమ్ మ్యూజిక్‌ను సిద్ధం చేస్తున్నారు. థియేటర్లలో హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు లేదా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చినప్పుడు ప్రేక్షకులు సీట్లలో నుండి లేచి విజిల్స్ వేస్తున్నారంటే దానికి కారణం ఆ సన్నివేశం వెనుక మోగే BGM ఇచ్చే కిక్ మాత్రమే. సాంకేతిక పరంగా చూసినా, తెలుగు దర్శకులు ఎప్పుడూ సంగీతానికి పెద్దపీట వేస్తారు. కథ రాసుకునే సమయంలోనే ఆ సన్నివేశానికి ఎలాంటి సంగీతం ఉండాలో ఊహించుకుంటారు. సాధారణంగా ఒక సినిమా విజయంలో దాదాపు యాభై శాతానికి పైగా ప్రభావం కేవలం రీ-రికార్డింగ్ పైనే ఆధారపడి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. డైలాగ్స్ లేని చోట కూడా కథని ముందుకు నడిపిస్తూ, ప్రేక్షకుడిని సినిమా ప్రపంచంలో బంధించే ఈ BGM నిజంగానే తెలుగు సినిమాకు అతిపెద్ద అస్త్రం. వెండితెరపై దృశ్యం కనుమరుగైనా, ఆ సన్నివేశం తాలూకు BGM మాత్రం ఏళ్ల తరబడి ప్రేక్షకుల చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. చివరాఖరిగా సింపుల్ గా బిజిఎం గురించి  చెప్పుకోవాలంటే 'మనం కళ్ళతో చూసిన ఒక సంఘటన పై మన మెదడుకి తెలియకుండానే  మనసు ఎలా అయితే స్పందిస్తుందో అదే బిజిఎం.   మీకు నచ్చవచ్చు :పలు రికార్డుల దిశగా ఆకాశంలో ఒక తార! మీకు నచ్చవచ్చు: ఓం రికార్డు కలెక్షన్స్!   [Bgm, Importance In Telugu Cinema, Telugu Cinema BGM, Tollywood]
1997లో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా తెలుగు ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఆ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ముఖ్యంగా టైటిల్ సాంగ్‌లోని విప్లవ భావాలు, తెలంగాణ జానపద శైలి ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అలాంటి ఐకానిక్ పాటను ఇప్పుడు రష్మిక మందన్న నటిస్తున్న ‘మైసా’ కోసం రీక్రియేట్ చేశారు. ఈ పాటలో మొదటగా ఆకట్టుకునేది రష్మిక కనిపించిన తీరు. ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన ఆమె.. ఇందులో మాత్రం పూర్తి భిన్నమైన రౌద్రరూపంలో కనిపిస్తున్నారు. చేతిలో ఆయుధాలు, చుట్టూ అడవి వాతావరణం, యాక్షన్ విజువల్స్‌తో ఆమె పాత్రలోని తెగువను చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రష్మిక లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ పాటకు మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి. మరోవైపు ఒరిజినల్ పాటలో ఉన్న విప్లవ స్ఫూర్తిని కొత్త వెర్షన్‌లోనూ కొనసాగించే ప్రయత్నం కనిపిస్తోంది. విజయశాంతి పోషించిన రాములమ్మ పాత్ర అప్పట్లో అణచివేతకు ఎదురొడ్డి నిలిచే మహిళగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. ‘మైసా’లోనూ రష్మిక గిరిజన మహిళ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ రెండు పాటల మధ్య ఓ భావోద్వేగపరమైన అనుసంధానం ఏర్పడింది. అందుకే ఇది సాధారణ రీమిక్స్‌లా కాకుండా ఓ ప్రత్యేకమైన నివాళిగా నిలవాలని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. సంగీతం విషయానికి వస్తే.. ఒరిజినల్ పాటకు సంగీతం అందించిన వందేమాతరం శ్రీనివాస్ మరోసారి తన గొంతుతో ఈ పాటను ఆలపించడం ప్రత్యేక ఆకర్షణ. సుద్దాల అశోక్ తేజ కొత్త సాహిత్యాన్ని అందించగా, జేక్స్ బిజోయ్ తనదైన సంగీతంతో పాటకు కొత్త రూపం ఇచ్చారు. పాత పాటను యథాతథంగా అనుకరించకుండా, ‘మైసా’ కథానాయిక స్వభావానికి తగ్గట్టుగా కొత్త బీట్, కొత్త ఎనర్జీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది కూడా చదవండి: పండగ పాట వచ్చేసింది.. హీరోయిన్లు ఒక ఊపు ఊపేశారు.! అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం ఉంది. ఒరిజినల్ ‘ఒసేయ్ రాములమ్మ’ పాటతో ప్రేక్షకులకు ఉన్న అనుబంధం చాలా బలమైనది. అలాంటి పాటను మళ్లీ రూపొందించడం అంటే సహజంగానే పోలికలు వస్తాయి. విజయశాంతి సృష్టించిన ప్రభావాన్ని రష్మిక అందుకోగలదా? అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఈ విషయంపై రష్మిక స్వయంగా స్పందిస్తూ, అంతటి ఐకానిక్ పాటను మళ్లీ చేయాలంటే మొదట భయమేసిందని, ఒరిజినల్‌ను మ్యాచ్ చేయలేమని, అయితే దానికి న్యాయం చేసే ప్రయత్నం చేశామని చెప్పింది. విజయశాంతికి ఇది తమ చిన్న నివాళి అని కూడా పేర్కొంది. మొత్తానికి ‘ఒసేయ్ రాములమ్మ’ పాట ‘మైసా’పై అంచనాలను పెంచేలా ఉంది. ఒకవైపు పాత పాటను గుర్తు చేసే నాస్టాల్జియా.. మరోవైపు రష్మిక కొత్త అవతార్.. ఈ రెండింటినీ కలిపి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  మీకు నచ్చవచ్చు:  టాలీవుడ్‌కి ఏమైంది.. ఒకేసారి మూడు భారీ సినిమాలు వాయిదా! సమంత కొడుకు పేరు వెనుక ఇంత అర్థం ఉందా.?       [Mysaa Movie, Osey Ramulamma Song, Rashmika Mandanna, Vijayashanthi, Vandemataram Srinivas]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సాధారణంగా ఇంట్లో పొట్లకాయ కూర అనగానే చాలామంది ముఖం చిట్లిస్తారు. కానీ అదే పొట్లకాయకు పచ్చిశనగపప్పు తోడైతే ఆ రుచి ఎక్కడికో వెళ్లిపోతుంది. ఒకసారి ఈ పద్ధతిలో పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర వండితే మాంసం కూరలను కూడా మర్చిపోవాల్సిందేనన్నంత అద్భుతమైన రుచి సొంతమవుతుంది. వేడివేడి అన్నం, చపాతీ, లేదా రోటి దేనిలోకి తిన్నా ఈ కూర అమోఘంగా ఉంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇదే కూర కావాలనిపించేలా చేసే ఈ వంటకం మన వంటింట్లో ఉండే సాధారణ దినుసులతోనే సులభంగా సిద్ధమవుతుంది. కేవలం 5 దశల్లో ఈ వంట విధానాన్ని పూర్తి చేయవచ్చు. ఈ కూర రుచికి అసలు పునాది పచ్చిశనగపప్పును సరిగ్గా ఉడికించడంలోనే ఉంది. ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును తీసుకుని, తగినన్ని నీళ్లు మరియు కొద్దిగా పసుపు వేసి ఉడికించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పప్పును మరీ మెత్తని పేస్ట్‌లా కాకుండా ఒక మాదిరిగా గింజ చెదరకుండా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యస్థంగా ఉడికిన పప్పు పొట్లకాయ ముక్కలతో కలిసినప్పుడు కూరకు ప్రత్యేకమైన పోకడ, రుచి వస్తాయి. తాలింపు వేసే విధానం కూర ఘుమఘుమలకు ప్రాణం పోస్తుంది. పాన్‌లో నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, మరియు శనగపప్పు వేసి దోరగా వేయించాలి. ఈ తాలింపు గింజలు చక్కగా వేగిన వెంటనే పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు లేత బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేపుకుంటే కూరకు సహజమైన తీపి, కమ్మదనం చేరుతాయి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి బాగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమాటాలు గుజ్జులా మగ్గాక, అందులో నాలుగు పొట్లకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు కారం వేసి బాగా కలపాలి. మసాలాలు, ఉప్పు, కారం పొట్లకాయ ముక్కలకు చక్కగా పట్టేలా కలిపితే ప్రతి ముక్కా రుచిగా మారుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఉదయం, ఇలా పసుపు నీళ్లు తాగితే. చర్మం మెరిసిపోవడంతో పాటు బోలెడు లాభాలు! ఇప్పుడు మూత పెట్టి సన్నని మంటపై పొట్లకాయ ముక్కలు మెత్తబడే వరకు బాగా ఉడికించాలి. పొట్లకాయ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిశనగపప్పును ఇందులో కలపాలి. పప్పు వేసిన తర్వాత కూరను మరో 4 నిమిషాలు సిమ్‌లో ఉంచి దించేయాలి. ఆ 4 నిమిషాల సమయం పప్పు, కూర కలిసిపోవడానికి ఎంతో కీలకం. చివరగా తాజా కొత్తిమీర చల్లి దింపేస్తే ఘుమఘుమలాడే పొట్లకాయ పచ్చిశనగపప్పు కూర సిద్ధం. తక్కువ శ్రమతో, తక్కువ సమయంలోనే ఇంటిల్లిపాదికీ నచ్చే ఈ కూరను తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఆంధ్ర రుచుల ఇష్టపడేవారికి ఇది ఖచ్చితంగా ఫేవరెట్ డిష్‌గా నిలిచిపోతుంది. మీకు నచ్చవచ్చు:ఆముదం ఆకుల, రహస్యాలు తెలిస్తే షాక్ అవుతారు! ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు!                                    రోజ్ వాటర్ తో, మీ చర్మం మెరిసిపోవాలంటే, ఇలా ట్రై చేయండి!       Potlakaya Senagapappu Kura, Snake Gourd Chana Dal Curry, Andhra Veg Curries, Traditional Telugu Recipes, Vegetarian Meat Alternative, Healthy Lunch Curry, Cooking Recipes In Telugu.  
చలికాలం రాగానే వాతావరణంలో చలిగాలులు పెరిగి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరినీ జలుబు, దగ్గు, కఫం సమస్యలు తీవ్రంగా వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో వచ్చే సాధారణ దగ్గు కూడా కొన్నిసార్లు త్వరగా తగ్గకుండా రోజుల తరబడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా గొంతు గరగర, ముక్కు కారడం, ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు మందులపైనే కాకుండా మన ఇంట్లో సులభంగా దొరికే సహజ పదార్థాలతో కూడిన సాంప్రదాయ ఇంటి చిట్కాలపై కూడా దృష్టి పెట్టడం ఎంతో మేలు చేస్తుంది. మన పెద్దలు తరతరాలుగా పాటిస్తున్న ఇంటి వైద్యంలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. దగ్గులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి; అవి పొడి దగ్గు మరియు కఫంతో కూడిన దగ్గు. ఈ రెండు రకాల దగ్గులను అదుపులోకి తీసుకురావడానికి మన వంటగదిలో ఉండే పదార్థాలే చక్కగా పనిచేస్తాయి. కఫంతో కూడిన దగ్గుతో బాధపడేవారికి తమలపాకు, తేనె కలయిక ఒక అద్భుతమైన పరిష్కారంగా నిలుస్తుంది. ఒక తాజా తమలపాకు తీసుకుని దాని తొడిమను తీసేసి, ఆకుపై ఒక స్పూన్ తేనె బాగా రాసి మడత పెట్టుకుని నెమ్మదిగా నమిలి రసాన్ని మింగాలి. ఇలా వరుసగా 2 రోజుల పాటు చేస్తే ఛాతీలో పేరుకుపోయిన కఫం కరిగి, దగ్గు నుంచి వేగంగా ఉపశమనం లభిస్తుంది. పొడి దగ్గు వేధిస్తున్నప్పుడు కరక్కాయ మరియు లవంగాలు ఎంతో చక్కగా ఉపయోగపడతాయి. కరక్కాయను చిన్నగా దంచి, అందులో ఒక చిన్న ముక్కను పంటి కింద పెట్టుకుని మెల్లిగా నములుతూ రసాన్ని మింగడం వల్ల గొంతులోని చికాకు తగ్గుతుంది. ఇలా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో తీసుకుంటే పొడి దగ్గు నుంచి మంచి ఊరట కలుగుతుంది. అలాగే పొడి దగ్గు ఉన్నప్పుడు 2 లవంగాలను పంటి కింద ఉంచుకుని నెమ్మదిగా నములుతూ రసం మింగడం కూడా గొంతుకు హాయిని ఇస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్ లేదా మంట అనిపించినప్పుడు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. కఫం త్వరగా బయటకు రావడానికి తేనె, లవంగాల పొడి చిట్కా కూడా ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. అర టేబుల్ స్పూన్ తేనెలో తాజాగా దంచి పెట్టుకున్న లవంగాల పొడిని కలిపి తీసుకుంటే కఫం కరిగి దగ్గు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ చిట్కాను వరుసగా 2 నుంచి 3 రోజుల పాటు పాటిస్తే దగ్గు, జలుబు తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల కలిగే గొంతు నొప్పి, శ్వాసకోశ అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఈ సహజ పద్ధతులు సులభంగా ఆచరించదగినవిగా ఉంటాయి. ఇది కూడా చదవండి:ఆంధ్రుల ప్రత్యేక సాత్విక రుచి: అల్లం పచ్చి కారంతో, వంకాయ కూర! చిన్నపిల్లల విషయంలో దగ్గు, జలుబు కనిపించినప్పుడు మరింత జాగ్రత్తగా సహజ నివారణలను ఎంచుకోవాలి. ఒక స్పూన్ తులసి ఆకు రసంలో 2 నుంచి 3 చుక్కల తేనె కలిపి ఉదయాన్నే పిల్లలకు తాగిస్తే జలుబు, దగ్గు నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. అయితే ఏడాది లోపు శిశువులకు తేనె ఇవ్వకూడదనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. అలాగే చిన్నపిల్లలకు లేదా ఎవరికైనా దగ్గు, జలుబు ఎక్కువ రోజులు కొనసాగినా, జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తినా ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం అత్యంత అవసరం. మొత్తంగా చూస్తే, చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు సమస్యలను ఎదుర్కోవడానికి తమలపాకు, తేనె, లవంగాలు, కరక్కాయ, తులసి మరియు గోరువెచ్చని ఉప్పు నీరు వంటి సాంప్రదాయ ఇంటి చిట్కాలు మన పెద్దలు అందించిన విలువైన ఆయుర్వేద జ్ఞానం. సరైన మోతాదులో, క్రమం తప్పకుండా వీటిని పాటించడం ద్వారా సహజంగానే ఉపశమనం పొందవచ్చు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ ఈ చలికాలంలో దగ్గు, జలుబు బారి నుంచి మన కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. మీకు నచ్చవచ్చు:ముఖంపై, మచ్చలు పోవాలంటే పచ్చి ,పాలను ఇలా రాయండి!                               ఫీవర్ తగ్గాక కూడా గుండె దడ, కాళ్ల వాపులు ఉంటున్నాయా? ఇవి ప్రమాదకర గుండె ముప్పుకు సంకేతాలు!         Betel Leaf For Cough And Cold, Tamalapaku Home Remedies, Winter Cold Remedies, Elders Health Tips, Natural Cough Relief, Traditional Home Remedies, Health Tips In Telugu.
చలికాలం రాగానే భుజాలపై తెల్లని పొట్టు రాలడం, తలలో తీవ్రమైన దురద, పదేపదే గోకాలనిపించడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ఉష్ణోగ్రతలు పడిపోగానే చుండ్రు అకస్మాత్తుగా మొదలవ్వడం లేదా మరింత తీవ్రంగా మారడం మనం తరచూ చూస్తుంటాం. చలి గాలి వల్ల తల చర్మం పొడిబారిపోతోంది కాబోలు అని చాలా మంది సులభంగా ఊహించేసుకుంటారు. కానీ తలలో పొట్టు రాలడానికి ప్రతిసారీ ఒకే కారణం ఉండదు. కొన్ని సందర్భాల్లో సాధారణ చుండ్రులా కనిపించేది నిజానికి సెబోర్రెయిక్ డెర్మటైటిస్ (Seborrhoeic Dermatitis) అనే వాపు సంబంధిత చర్మ సమస్య కావచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ రెండు సమస్యలకు చికిత్స విధానాలు వేర్వేరుగా ఉంటాయి. గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్ డెర్మటాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రూబెన్ భాసిన్ పాసి వివరాల ప్రకారం, తల చర్మంలో తేమ స్థాయి బాగా తగ్గిపోయినప్పుడు సాధారణంగా డ్రై స్కాల్ప్ లేదా పొడి తల చర్మం ఏర్పడుతుంది. చల్లని వాతావరణం, గాలిలో తక్కువ తేమ, ఘాటైన షాంపూలతో తరచూ తలస్నానం చేయడం, ఎక్కువసేపు వేడి నీటిని వాడటం వంటివి ఈ పొడిబారడానికి దారితీస్తాయి. ఇలాంటప్పుడు వచ్చే పొట్టు చాలా చిన్నదిగా, తెల్లగా, పౌడర్‌లా ఉంటుంది మరియు తల చర్మం బిగుతుగా లేదా స్వల్ప దురదతో అనిపిస్తుంది. డ్రై స్కాల్ప్ ఉన్నవారికి శరీరంలోని ఇతర భాగాల చర్మంపై కూడా పొడిబారడం కనిపించవచ్చు. మరోవైపు, సాధారణ చుండ్రు అనేది చర్మంపై సహజంగా ఉండే మలాసెజియా (Malassezia) అనే ఈస్ట్ అధికంగా పెరగడం లేదా దాని పనితీరు మారడంతో ముడిపడి ఉంటుంది. ఈ ఈస్ట్ చర్మంలోని నూనెలో ఉండే పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. కొందరిలో ఈ ఈస్ట్, చర్మపు నూనెలు మరియు శరీరంలోని వాపు ప్రతిస్పందన కలిసినప్పుడు చర్మ కణాలు వేగంగా రాలిపోయి స్పష్టమైన పొట్టు, దురద ఏర్పడతాయి. ఈ సమస్య మరింత వాపుతో, దీర్ఘకాలం పాటు కొనసాగితే దానిని సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌గా నిర్ధారిస్తారు. సాధారణ పొడి తల చర్మానికి భిన్నంగా, సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌లో ఎరుపు రంగు, చికాకు మరియు కొంచెం జిడ్డుగా ఉండే తెలుపు లేదా లేత పసుపు రంగు పొట్టు కనిపించవచ్చు. ఇది తల చర్మం దాటి కనుబొమలు, ముక్కు పక్క భాగాలు, చెవుల వెనుక మరియు కొన్నిసార్లు ఛాతీపై కూడా ప్రభావం చూపవచ్చు. చలికాలంలో తక్కువ తేమ మరియు చల్లని ఉష్ణోగ్రతలు పొడిబారడాన్ని పెంచుతాయి, అలాగే హెయిర్ కేర్ అలవాట్లలో మార్పులు, ఒత్తిడి, అనారోగ్యం మరియు హార్మోన్ల ప్రభావాలు సెబోర్రెయిక్ డెర్మటైటిస్‌ను మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇది కూడా చదవండి:వింటర్ డైట్: చలికాలంలో బరువు తగ్గడానికి, పాటించాల్సిన సులువైన మార్గాలు! చాలా మంది చేసే సాధారణ తప్పులలో ఒకటి ప్రతి రకమైన పొట్టుకు మందపాటి హెయిర్ ఆయిల్స్ రాయడం. నూనె రాయడం వల్ల పొడి జుట్టు కొంత మృదువుగా అనిపించవచ్చు కానీ, సెబోర్రెయిక్ డెర్మటైటిస్ ఉన్న తల చర్మంపై ఎక్కువ నూనె నేరుగా రాస్తే కొందరిలో లక్షణాలు మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్ పాసి స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ సమస్యకు తల చర్మంలోని నూనె మరియు మలాసెజియా ఈస్ట్‌తో దగ్గరి సంబంధం ఉంటుంది. అందువల్ల పొట్టు స్వభావాన్ని, దురద తీవ్రతను మరియు వాపు లక్షణాలను గమనించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణ డ్రై స్కాల్ప్ కోసం మైల్డ్ షాంపూ వాడటం, మరీ వేడి నీటిని నివారించడం, ఘాటైన ఉత్పత్తులను తగ్గించడం మరియు తల చర్మ అవసరానికి తగ్గట్టుగా తలస్నానాల వ్యవధిని సర్దుబాటు చేయడం మేలు చేస్తుంది. చుండ్రు మరియు సెబోర్రెయిక్ డెర్మటైటిస్ కోసం కెటోకొనజోల్ (Ketoconazole), సెలీనియం సల్ఫైడ్ (Selenium Sulphide) లేదా జింక్ పైరిథియోన్ (Zinc Pyrithione) వంటి యాంటీ ఫంగల్ మరియు మెడికేటెడ్ షాంపూలను సూచించవచ్చు. వీటిని తలకు పట్టించిన వెంటనే కడిగేయకుండా నిర్దేశించిన సమయం పాటు ఉంచి కడగాలి, లేదంటే వాటి ప్రభావం తగ్గుతుంది. దురద భరించలేనంతగా ఉన్నా తలను పదేపదే గట్టిగా గోకడం వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది, అలాగే తీవ్రమైన ఎరుపు, వాపు, మందపాటి ప్యాచెస్, నొప్పి లేదా జుట్టు రాలడం గమనిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం అత్యవసరం. మీకు నచ్చవచ్చు:మాయిశ్చరైజర్‌లో, SPF ఉంటే సరిపోతుందా? అసలు నిజాలు ఇవే!                                   ఉడికించిన అలసందలు తింటే, శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే!       Winter Dandruff, Hair Oil And Dandruff, Winter Hair Care Mistakes, Scalp Flakes Treatment, Dermatologist Hair Advice, Dandruff Tips In Winter, Health Tips In Telugu.
రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా? మిమ్మల్ని మీరు ఎంత మోసం చేసుకుంటున్నారో తెలుసా? ఆఫీస్ డెస్క్ ముందు గంటల తరబడి కూర్చుని పని చేసేవాళ్లకు ఆరోగ్యం గురించి, వాకింగ్ గురించి చెప్పగానే మొదట గుర్తొచ్చే మాట  సమయం లేదని చెప్పడం. రోజు ఒక గంట వ్యాయామం చేయండి, కడుపునిండా నిద్ర పోండి, సమయానికి ఆహారం తినండి అని చెప్పడం సులువే కానీ, పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పని ఒత్తిడిలో ఉన్న మనిషికి అది ఎంతవరకు సాధ్యం?  చాలామంది  ఇదే విషయంలో గందరగోళానికి గురవుతూ ఉంటారు. వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఒక గంట ఎక్సర్సైజ్ చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు. కానీ సమయం లేకపోవడం లేదా చేయలేకపోతున్నామని సాకులు చెప్పుకోవడం మాని,  చేతులు ముడుచుకుని కూర్చోకుండా, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టవచ్చు. వ్యాయామం అంటే రోజుకు ఒక గంట తప్పనిసరిగా కేటాయిస్తేనే లాభం అని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా రోజుకు పది నిమిషాల నడకతో మొదలుపెట్టినా చాలు. వీలు కుదిరినప్పుడల్లా చిన్న చిన్న విడతలుగా నడవడం, నెమ్మదిగా వారానికి కనీసం నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం లాంటి వ్యాయామం అందేలా చూసుకోవాలి. పని మధ్యలో కాసేపు లేచి కదలడం, తినే ఆహారం గురించి ముందే చిన్న ప్లానింగ్ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. ముఖ్యంగా వ్యాయామం కోసం ఉన్న కొద్దిపాటి నిద్రను మాత్రం తగ్గించుకోకూడదు.                                                                                                                                                 *రూపశ్రీ.
మన శరీర ఆరోగ్యానికి జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయడం ఎంతైనా అవసరం. పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరిగి శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ఫైబర్ లేదా పీచు పదార్థం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో సరైన పీచు పదార్థాలు తీసుకుంటే మలబద్ధకం వంటి సమస్యలు దూరమవడంతోపాటు పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా డవలప్ అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి  వివరంగా తెలుసుకుంటే.. జామ.. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జామకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే జామకాయ ద్వారా సుమారు ఐదు నుంచి ఆరు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కరిగే మరియు కరగని.. రెండు  రకాల పీచు పదార్థాలు  సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియ సజావుగా సాగేలా సహాయపడటంతోపాటు కడుపు నిండుగా ఉండే భావనను కలిగిస్తుంది. రాస్స్ బెర్రీస్.. రాస్స్ బెర్రీస్ పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక కప్పు రాస్స్ బెర్రీస్ లో దాదాపు ఎనిమిది గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఉండే కరగని పీచు పదార్థం పేగుల్లోని మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందడానికి ఎంతగానో తోడ్పడుతుంది. అయితే ఇవి కొంచెం ఖరీదైనవి అయినప్పటికీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. ఇది కూడా చదవండి   కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!​ చియా గింజలు.. చియా గింజలలో పీచు పదార్థం చాలా మెరుగ్గా ఉంటుంది. కేవలం రెండు టీస్పూన్ల చియా గింజల ద్వారా సుమారు పది గ్రాముల పీచు లభిస్తుంది. ఇవి కడుపులోకి వెళ్లిన తర్వాత ఒక జెల్ లాంటి రూపంలో తయారవుతాయి. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. నల్ల మినప్పప్పు.. మన దేశంలో సులభంగా లభించే పొట్టుతో కూడిన మినుములు లేదా నల్ల మినపప్పు జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఉడికించిన ఒక కప్పు మినపప్పులో దాదాపు పదహారు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో కూడా కరిగే , కరగని పీచు పదార్థాలు సమృద్ధిగా ఉండటం వల్ల పేగుల కదలికలు సజావుగా సాగి జీర్ణశక్తి మెరుగవుతుంది. వేయించిన శనగలు.. వేయించిన శనగలు పీచు పదార్థాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. ప్రతి వంద గ్రాముల వేయించిన శనగలలో సుమారు పదిహేడు గ్రాముల పీచు పదార్థం లభిస్తుంది. ఇందులో పీచుతో పాటు ప్రొటీన్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.                                                                                                                                            *రూపశ్రీ మీకు నచ్చవచ్చు   ఈ ఐదు ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు.. జీవితం మారిపోతుంది..                                  విటమిన్-డి లోపం ఉంటే పిల్లలు పుట్టడం కష్టమా..ఈ నిజాలు తెలుసుకోండి..!
బూడిద గుమ్మడి మనకు సులభంగా లభించే కూరగాయల్లో ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా బూడిద గుమ్మడి రసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి ఆసక్తి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటంలో తగినంత నీరు తాగడం ఎంత ముఖ్యమైనది? బూడిద గుమ్మడి రసం కిడ్నీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది? మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని తీసుకోవచ్చా? బూడిద గుమ్మడిలోని పోషకాలు గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎలా తోడ్పడతాయి? అంతేకాకుండా ఎసిడిటీ సమస్య, శరీర బరువు నియంత్రణ విషయంలో బూడిద గుమ్మడి ఎలాంటి ప్రయోజనాలను అందించగలదు? బూడిద గుమ్మడి, సాధారణ గుమ్మడి కాయ రెండూ ఒకటేనా? వీటి మధ్య ఉన్న తేడాలు ఏమిటి? వాటిలో లభించే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఎలా భిన్నంగా ఉంటాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను సీనియర్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ శిరీష ఈ వీడియోలో వివరించారు. బూడిద గుమ్మడి రసాన్ని ఎలా తీసుకోవాలి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా బూడిద గుమ్మడిని ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. బూడిద గుమ్మడి రసం కిడ్నీలో రాళ్లను కరిగిస్తుందని లేదా వాటిని నివారిస్తుందని శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు వైద్య నిపుణుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొందాలి. వైద్యులు సూచించిన చికిత్సను ఆపి, దానికి బదులుగా ఇంటి చిట్కాలపై ఆధారపడకూడదు.